rachamallu sivaprasad reddy
-
ప్రజల దృష్టిని మళ్లించేందుకే బాబు కుట్రలు
నెల్లూరు(బారకాసు)/ఒంగోలు సిటీ/ప్రొద్దుటూరు: ‘దుష్ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు రెండు కళ్లు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారు. అందువల్లే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదచల్లుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయమ్మ కారుకు ప్రమాదం.. అంటూ కొత్త నాటకానికి తెరతీశారు.రెండేళ్ల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే, టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ ప్రాంతాల్లో వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కుట్రలను ఎండగట్టారు. మేం మాట్లాడితే తట్టుకోలేరు: కాకాణి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉంటే వాటిలో 50లక్షల మందికి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ‘మా పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబ వ్యవహారాలపై కొందరు పిచి్చపిచ్చి విమర్శలు చేస్తున్నారు. మేం కూడా అదేవిధంగా మాట్లాడితే తట్టుకోలేరు. ఎనీ్టఆర్ ఎవరి వల్ల చనిపోయారు? ఆయన స్థాపించిన పారీ్టని ఎలా చేజిక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. ‘ఇసుక, మద్యం మాఫియాలో మీ ఎమ్మెల్యేలు ఏయే ఘోరాలు చేస్తున్నారో తెలుసుకుని వారిని తొక్కిపెట్టి నార తీయండి. హామీలు అమలుచేయని చంద్రబాబు, లోకేశ్‌ను తొక్కి పెట్టి నార తీయాలి.’ అని పవన్‌కళ్యాణ్‌కు కాకాణి సూచించారు. హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే: టీజేఆర్ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించిన చంద్రబాబు ఎప్పటిలాగే మళ్లీ వమ్ము చేశారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, హామీల అమలుపై ప్రజలు ఇక ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. అందువల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారాలను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘దేశంలో అనేక రాజకీయ కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయి. చంద్రబాబుకు గతంలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరితో విబేధాలు లేవా? తమ్ముడు రామ్మూర్తినాయుడుతోపాటు అనేక మంది కుటుంబ సభ్యులతో గొడవలు లేవా? హెరిటేజ్‌లో చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లకు వాటాలు పంచారా?’ అని ఆయన నిలదీశారు. ‘కూటమి అధికారంలోకి వచి్చన నాలుగు నెలల్లోనే 77మంది మహిళలు మాయమైపోయారని వారి రక్షణ సంగతి చూడండి..’ అని పవన్‌కళ్యాణ్‌కు హితవుపలికారు. తన కుటుంబంలో జరిగిన ఘటనలను కూడా పవన్ గుర్తుచేసుకోవాలని సూచించారు. అవన్నీ కుట్రలేనా బాబూ?: రాచమల్లు వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై తప్పుడు ప్రచారాలు, కథనాలను ఆపాలని టీడీపీ శ్రేణులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి హెచ్చరించారు. ‘హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, జూనియర్ ఎనీ్టఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కుట్రలేనా’ అని రాచమల్లు సూటిగా ప్రశ్నించారు. వాటన్నింటికి తాము లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. -
ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేయను
ప్రొద్దుటూరు క్రైం : 2029లో బ్యాలెట్ పేపర్‌తో కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పోటీ చేసినా ఫలితం ఉండదని, 2024లో మోసం చేసినట్టుగానే 2029 ఫలితాల్లోనూ మోసం జరుగుతుందని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే స్వచ్ఛమైన ప్రజా తీర్పు తెలుస్తుందని చెప్పారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.నాలుగు నెలల కిందట జరిగిన ఏపీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది ప్రజలు కాదని, ఈవీఎం మిషన్లే శాసనం చేశాయని కౌంటింగ్ అయిన అరగంటకే ప్రజలు ముక్తకంఠంతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఆ ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి’ అంటూ రాష్ట్ర ప్రజలంతా అయోమయంగా ప్రశ్నించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పటికీ వైఎస్సార్సీపీ అధిష్టానంగానీ, అభ్యర్థులుగానీ ఫలితాలపై నోరు మెదపలేదన్నారు.దీనిపై ఎందరు అనుమానం వ్యక్త చేసినా కేంద్ర ఎన్నికల సంఘంలో ఉలుకూ పలుకూ లేదన్నారు. తమ అనుమానాలను నివృత్తి చేయాలని పోటీ చేసిన అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలను సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివృత్తి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల తీర్పు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, టెక్నాలజీని ఉపయోగించుకుని అప్రజాస్వామిక వి«ధానంలో నాయకులు ఎన్నికవుతుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. -
చంద్రబాబుపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం
-
ఆటో డ్రైవర్ కుమార్తె వైద్యానికి ఎమ్మెల్యే ఆర్థికసాయం
ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా) : స్థానిక 21వ వార్డు పరిధిలోని ఆటో డ్రైవర్ షేక్ హుసేన్ బాషా, షేకున్నీసాల కుమార్తె ముక్సాన్ వైద్యం కోసం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆదివారం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ముక్సాన్ ఇటీవల మిద్దెపై నుంచి జారిపడి మోకాలు లోని నరాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై స్థానిక ఆర్థోపెడిక్ డాక్టర్ నిరంజన్‌రెడ్డిని ఆటో డ్రైవర్ కుంబీకులు సంప్రదించగా ముక్సాన్ రెండు మోకాళ్లకు సంబంధించిన నరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుడిని పిలిపించి చికిత్స చేయించేందుకు రూ.లక్షన్నర అవసరం అవుతుందని తెలపడంతో వారు ఎమ్మెల్యేను సంప్రదించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు బాలిక భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని తన వంతు సాయంగా రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని డాక్టర్ నిరంజన్‌రెడ్డికి అందించారు. వెంటనే బాలికలకు వైద్యం అందించాలని కోరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ద్వారా ఎమ్మెల్యే ఈ సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కమాల్ బాషా పాల్గొన్నారు. -
సీఎం జగన్ పాదాలకు నమస్కరిస్తున్నా.. 12 గంటల్లోనే రూ.10లక్షలు
సాక్షి, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యువకుడు ఆళ్లగడ్డ మౌలాలి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తాను ప్రతిపాదన పంపిన వెంటనే రూ.10లక్షలు మంజూరు చేస్తూ (ఎల్ఓసీ) ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదాలకు నమస్కరిస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక పుట్టపర్తి సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం ఎల్ఓసీని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులు, తమ పార్టీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు హనీఫ్, షా హుసేన్తోపాటు నూరి, కౌన్సిలర్లు జిలాని బాషా, కమాల్, యెల్లాల మహ్మద్ గౌస్, వడ్ల ఖలీల్, ఇర్ఫాన్ బాషా తదితరులు సమస్యను తన దృష్టికి తేవడంతో తన కార్యాలయం నుంచి గురువారం సీఎం కార్యాలయానికి లేఖను పంపి ఫోన్ చేసినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేవలం 12 గంటల్లోనే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారని, బాధితుడు మౌలాలి హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడన్నారు. మౌలాలికి అతని భార్య లివర్ ఇస్తోందని చెప్పారు. ఆపరేషన్‌కు అవసరమయ్యే మిగతా రూ.10లక్షల్లో తన వంతుగా సొంత డబ్బు రూ.3 లక్షలు ఇస్తున్నానని, మిగతా రూ.7లక్షలను పార్టీ నాయకులు అందిస్తున్నారని తెలిపారు. పెద్దమనసుతో స్పందించి 12 గంటల్లోనే రూ.10 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి మానవత్వాన్ని ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం పట్టణానికి చెందిన కరీముల్లా లివర్ ప్లాంటేషన్ కోసం సీఎం రూ.25 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులతోపాటు షాపీర్ ఆలి పాల్గొన్నారు. -
జగన్ సీఎం కంటే నాకేదీ ముఖ్యం కాదు: ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు: పార్టీ కన్నతల్లిలాంటిదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తల్లి బాగుంటే ఆమె నీడలో పిల్లలందరూ బాగుంటారన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన జిల్లా నుంచి సహోదరుడు అంజద్‌బాషా రెండోసారి మంత్రి వర్గంలో స్థానం పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. మంత్రి పదవులు ఆశించిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేల్లో కొంత నిరాశ, నిస్పృహలు ఉండటం సహజమేనన్నారు. 151 మంది ఎమ్మెల్యేల్లో 26 మందికి మాత్రమే మంత్రి పదవులు వస్తాయన్నారు. అంత మాత్రాన మిగిలిన వారిలో అసంతృప్తి ఉన్నట్లు కాదని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండటమే తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమన్నారు. జగన్ సీఎంగా ఉండటం కంటే తనకు మరే మంత్రి పదవి ముఖ్యం కాదని అన్నారు. తాను జీవించినంత కాలం వైఎస్ జగనే సీఎంగా ఉండాలన్నదే తన కోరిక అని తెలిపారు. చదవండి: (Balineni Srinivas Reddy: జగనన్న మాటే.. వాసన్న బాట) ప్రస్తుత మంత్రివర్గంలో అనుభవం, మేథస్సు ఆధారంగా సీనియర్లకు తిరిగి మంత్రి పదవులు దక్కాయన్నారు. కేబినెట్ విస్తరణ సందర్భంగా అలకలు అనేవి సాధారణమేనని, అవన్నీ క్రమంగా సర్దుకుపోతాయన్నారు. మంత్రి వర్గంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత లభించినట్లు ఆయన తెలిపారు. -
చంద్రబాబు గద్దె దిగేదాకా నల్ల కండువా ధరిస్తా
-
మోదీ,బాబు కలిసి కడపకు అన్యాయం చేశారు
-
స్టీల్ ప్లాంట్ కోసం 48గంటలపాటు దీక్ష
-
కలెక్టర్ గారూ నేను బతికే ఉన్నా..
ప్రొద్దుటూరు టౌన్ : ‘కలెక్టర్ గారూ... నేను ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాదరెడ్డిని, నేను మరణించలేదు.. బతికే ఉన్నా’’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తుంటే ఆహ్వానించరా అని ప్రశ్నించారు. ఉదయం 11గంటల నుంచి 3 గంటల వరకు ఆరు శిలాఫలకాలు ఆవిష్కరించి, చెన్నమరాజుపల్లె, నాగాయపల్లెల్లో ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారన్నారు. ఈ నియోజకవర్గ ప్రథమపౌరున్ని, 2 లక్షలమంది ఓటర్ల సేవకునిగా ఉన్నా తనను విస్మరించారని తెలిపారు. ఆహ్వాన పత్రిక కానీ, ఫోన్ ద్వారా సమాచారం కానీ ఇవ్వలేదన్నారు. తనతో పోటీపడి ప్రజలు తిరస్కరించడంతో ఓడిపోయిన వరదరాజులరెడ్డికి ఏ సంబంధం లేకపోయినా అన్నీతానై వ్యవహరించేలా ప్రభుత్వం, ఉన్నతాధికారులు అవకాశం కల్పిస్తారా? అని ప్రశ్నించారు. ఇది న్యాయమా, హక్కులేని వాన్ని, అధికారంలేని వాన్ని అందలం ఎక్కిస్తారా.. ఇదేనా మీరు చదువుకున్న చదువు మీకు నేర్పిన సంస్కారం అని నిలదీశారు. తనను అగౌరవపరచడం అంటే 2లక్షలమంది ఓటర్లను అవమానించినట్లేనన్నారు. ప్రజా సమస్యలపైన ఏ జిల్లా అధికారిని అన్నా ఒక్కమాట అంటే నల్లబ్యాడ్జీలు పెట్టుకొని అధికారులు నిరసన వ్యక్తం చేస్తారన్నారు. మరి ఇంత గొప్పగా అవమానపరిస్తే నల్లరిబ్బను కాదు, నల దుప్పటి కప్పుకోవాలని తెలిపారు. నాలుగురోజుల కిందట జరిగిన జెడ్పీ సమావేశంలో ప్రోటోకాల్ విషయంలో ఎవ్వరినీ అగౌ రవపరచ వద్దని చెప్పిన కలెక్టర్ మరి ఇప్పుడు సమాధానం చెప్పాలని కోరారు. వరద ఓడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాల్లో వేదికపైకి ఎక్కించి దించుతున్నారే ఇది న్యాయమా అని అన్నారు. తనను పిలవనందుకు ఒకవైపు సంతోషిస్తున్నానన్నారు. సీఎం రెండు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి చేస్తామంటూ ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చరని, అబద్ధపు హామీలు ఇచ్చారని తెలిపారు. తాను వారి తోపాటు మోసగాన్ని అయ్యేవాడనని అన్నారు. ఉన్నతాధికారులకు చీము, నెత్తురు, పౌరుషం ఉంటే ఆ రెం డు గ్రామాలకు ఇచ్చిన హామీలను, డిసెంబర్‌లోపు పూర్తిచేయాలని చెప్పారు. అది కూడా చేయకపోతే ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్ వివరణ ఇవ్వాలని లేదంటే ఈ సమస్య కలెక్టర్ చాంబర్‌కు బదిలీ అవుతుందని హెచ్చరించారు. వారి ఆహ్వానం కోసం, మర్యాదల కోసం పాకులాడే మనసు తనకు లేదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదనే తాను ప్రశ్నిస్తున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, పోసా భాస్కర్ పాల్గొన్నారు. -
‘చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగింది’
-
‘చంద్రబాబు కనుసన్నల్లోనే ప్రజాస్వామ్యం ఖూనీ’
వైఎస్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని పోలీసులు చూస్తు ఉండిపోయారని ఎమ్మెల్యే రాచమల్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కౌన్సిలర్‌ను రూ.50 లక్షలకు కొనేందుకు జిల్లా మంత్రి సిద్ధపడ్డారని ఆరోపించారు. అయితే ఆ ప్రలోభాలకు కౌన్సిలర్లు లొంగకపోవడంతో ఎన్నికను వాయిదా వేయించారన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో టీడీపీ నేతలు రౌడీయిజం చేశారని, తమపై దాడికి యత్నించారన్నారు. ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోయిందని రాచమల్ల అన్నారు. టీడీపీ నేతల పన్నాగాలు తీవ్రంగా బాధించాయని, ప్రజాస్వామ్యం ఏమవుతుందో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. కాగా అధికార టీడీపీ నేతలు తీవ్ర దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంతో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వరుసగా రెండోరోజూ (ఆదివారం) కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు కావాల్సిన బలం తమకు లేకపోవడంతో అధికార టీడీపీ మరోసారి హైడ్రామాకు తెరతీసింది. చైర్మన్ పదవిని సొంతం చేసుకునేందుకు కావాల్సినంత కౌన్సిలర్ల బలమున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి రౌడీయిజానికి, దౌర్జన్యానికి దిగింది. ఎన్నికను అడ్డుకోవడమే లక్ష్యంగా వరుసగా నిన్న కూడా టీడీపీ కౌన్సిలర్లు విధ్వంసాలకు దిగారు. -
తాగునీటికీ అధికార రంగు
తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కూడా టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారు... ప్రొద్దుటూరులో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రజల తరఫున పోరుబాట పట్టారు... ఇక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు... ఇందుకు స్పందించిన కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వచ్చి పరిశీస్తానని చెప్పారు... సమస్య పరిష్కారమైతే ఎమ్మెల్యేకు పేరు వస్తుందని టీడీపీ నేతలు భావించారు... ఇందులో భాగంగానే కలెక్టర్ ప్రొద్దుటూరు రాకుండా వారు కుయుక్తులు పన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు... అంతేకాకుండా సమస్య పరిష్కారమైతే పేరు, ప్రతిష్టను అధికార పార్టీ ఖాతాలో వేసే దిశగా అడుగులు వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వందేళ్ల చరిత్ర ఉంది. అయితేనేం ఇప్పుడు ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులు ఉండగా సుమారు 2 లక్షలకు పైగా జనాభా నివాసం ఉంటున్నారు. వేసవి వచ్చిందంటే పట్టణ వాసులకు నీటి తిప్పలు తప్పడం లేదు. ఏటా పరిస్థితి ఇలాగే ఉండగా.. ఈ ఏడాది చలికాలంలోనే నీటి సమస్య తలెత్తింది. ఏటా వేసవిలో కలెక్టర్ అనుమతితో మైలవరం జలాశయం నుంచి నీరు కొద్దో గొప్పో తెచ్చుకొని సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పిస్తున్నారు. శాశ్వతంగా నీరు విడుదల చేసేందుకు జీఓ లేకపోవడంతో కలెక్టర్ దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సి వస్తోంది. ఈ ఏడాది సమస్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో మైలవరం నుంచి నీరు విడుదల చేసినా ఫలితం లేకుండా పోయింది. కారణం అధికారులు కొత్త మార్గం నుంచి నీరు తీసుకురావడమే. ఎక్కువ దూరం పెన్నానదిలో తీసుకురావడంతో మధ్యలోనే అధిక భాగం నీరు ఇంకిపోయాయి. మున్సిపాలిటీలో అవసరమైన నిధులు ఉన్నా సమస్య పరిష్కారంలో పాలక వర్గంతోపాటు అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యపై దృష్టి సారించిన ఎమ్మెల్యే: పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో నేతలపై ఒత్తిడి పెరిగింది. వార్డు కౌన్సిలర్ల నుంచి ఎమ్మెల్యే వరకూ అందరికీ సమస్యను ప్రజలు విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముందుగా అధికారులు, పాలక వర్గం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈనెల 13న మున్సిపల్ కార్యాలయం వద్ద 24 గంటలపాటు జల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు అధికార యంత్రాంగం ద్వారా ఒత్తిడి తెచ్చారు. కేసులకు బెదరకుండా ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు తమ నిరసన తెలిపారు. చివరికి పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించారు. ఈ కేసులకు తాము భయపడబోమని, సమస్యను పరిష్కరించని పక్షంలో ప్రొద్దుటూరు నుంచి కలెక్టరేట్‌కు పాదయాత్ర చేసి ముట్టడిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభిస్తానని ప్రకటించారు. నీటి సమస్యను పాలకపక్షంతోపాటు అధికారుల కళ్లకు కట్టినట్లు చెప్పాలనే ఆలోచనతో.. గత సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నీటి ఎద్దడి తీవ్రతను వారికి వివరించా,రు. వాస్తవానికి ఎమ్మెల్యే చాలా కాలం తర్వాత కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. తర్వాత జిల్లాలోని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన గురువారం కలెక్టర్ కె.వి.సత్యనారాయణను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. సమస్యను పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కలెక్టర్ పర్యటన వాయిదా వెనుక కారణాలేంటో...: కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తారని, ఆయన రాకతోనైనా నీటి సమస్య పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాదరెడ్డితోపాటు పట్టణ ప్రజలు ఎంతగానో ఆశించారు. అయితే 24 గంటలు కాకముందే కలెక్టర్ పర్యటన వాయిదా పడింది. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డితోపాటు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి తదితరులు శుక్రవారం కడపలో కలెక్టర్‌ను కలిసి నీటి సమస్యపై విన్నవించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి త్వరలో ప్రొద్దుటూరుకు నీరు వస్తుందని తెలిపారు. అధికార పార్టీ నేతల ప్రభావంతోనే కలెక్టర్ పర్యటన వాయిదా పడిందని వైఎస్సార్సీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తే ఎమ్మెల్యే రాచమల్లుకు పేరు వస్తుందని టీడీపీ నేతలు భావించి, ఇలా చేశారని వారు ఆరోపిస్తున్నారు. వీరి వైఖరి వల్ల సమస్య పరిష్కారంలో మరింత జాప్యం జరుగుతోందని విమర్శిస్తున్నారు. ఇంత కాలం నీటి సమస్య గురించి పట్టించుకోకుండా.. తీరా కలెక్టర్ వస్తున్న నేపథ్యంలో ఇలా చేయడం ఏమిటిని ప్రశ్నిస్తున్నారు. -
'లంచాలు అడగకుండా సేవ చేయండి'
ప్రొద్దుటూరు: ‘మీ పాదాలకు మొక్కుతా..ఒత్తిడులకు లొంగకుండా, లంచాలు తీసుకోకుండా ప్రజలకు సేవ చేయండి..’అంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అధికారులను కోరారు. శనివారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అధికారులును పై విధంగా ఆర్థించారు. సమావేశంలో అధికారుల వద్దకు వెళ్లిన ఆయన నేలపై కూర్చుని వినూత్న రీతిలో అధికారులను అభ్యర్థించారు. దీంతో ఒకింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న అధికారులు లంచాలు అడక్కుండా విధులు నిర్వర్తిస్తామని ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. మున్సిపల్ ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, కౌన్సిలర్లు కమిషనర్‌ను ఇటీవల కోరారు. స్పందించిన ఆయన...పట్టణంలో ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి.. ఆదేశాల అమలును అడ్డుకున్నారు. పెపైచ్చు ఈ విషయంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఒకరు టౌన్ ప్లానింగ్ అధికారిపై దాడికి పాల్పడ్డారంటూ అక్రమ కేసు పెట్టించారు.ఈ చర్యల నేపథ్యంలోనే అధికారులు ఒత్తిడులకు, లంచాలకు లొంగకుండా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే కోరారు.