విజయమ్మ కారుకు రెండేళ్ల కిందట పంక్చర్ అయితే ఇప్పుడు దుష్ప్రచారం సిగ్గుచేటు
చంద్రబాబు మీ కుటుంబ విభేదాలను రాజకీయాల్లోకి లాగితే భరించలేవు
వైఎస్సార్‌సీపీ నేతలు కాకాణి, సుధాకర్‌బాబు, రాచమల్లు ధ్వజం
నెల్లూరు(బారకాసు)/ఒంగోలు సిటీ/ప్రొద్దుటూరు: ‘దుష్ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు రెండు కళ్లు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారు. అందువల్లే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిత్యం బురదచల్లుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయమ్మ కారుకు ప్రమాదం.. అంటూ కొత్త నాటకానికి తెరతీశారు.
రెండేళ్ల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే, టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ ప్రాంతాల్లో వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కుట్రలను ఎండగట్టారు.
మేం మాట్లాడితే తట్టుకోలేరు: కాకాణి
రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉంటే వాటిలో 50లక్షల మందికి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ‘మా పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబ వ్యవహారాలపై కొందరు పిచి్చపిచ్చి విమర్శలు చేస్తున్నారు.
మేం కూడా అదేవిధంగా మాట్లాడితే తట్టుకోలేరు. ఎనీ్టఆర్ ఎవరి వల్ల చనిపోయారు? ఆయన స్థాపించిన పారీ్టని ఎలా చేజిక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. ‘ఇసుక, మద్యం మాఫియాలో మీ ఎమ్మెల్యేలు ఏయే ఘోరాలు చేస్తున్నారో తెలుసుకుని వారిని తొక్కిపెట్టి నార తీయండి. హామీలు అమలుచేయని చంద్రబాబు, లోకేశ్‌ను తొక్కి పెట్టి నార తీయాలి.’ అని పవన్‌కళ్యాణ్‌కు కాకాణి సూచించారు.
హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే: టీజేఆర్
ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించిన చంద్రబాబు ఎప్పటిలాగే మళ్లీ వమ్ము చేశారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, హామీల అమలుపై ప్రజలు ఇక ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. అందువల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారాలను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘దేశంలో అనేక రాజకీయ కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయి. చంద్రబాబుకు గతంలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరితో విబేధాలు లేవా? తమ్ముడు రామ్మూర్తినాయుడుతోపాటు అనేక మంది కుటుంబ సభ్యులతో గొడవలు లేవా? హెరిటేజ్‌లో చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లకు వాటాలు పంచారా?’ అని ఆయన నిలదీశారు. ‘కూటమి అధికారంలోకి వచి్చన నాలుగు నెలల్లోనే 77మంది మహిళలు మాయమైపోయారని వారి రక్షణ సంగతి చూడండి..’ అని పవన్‌కళ్యాణ్‌కు హితవుపలికారు. తన కుటుంబంలో జరిగిన ఘటనలను కూడా పవన్ గుర్తుచేసుకోవాలని సూచించారు.
అవన్నీ కుట్రలేనా బాబూ?: రాచమల్లు
వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై తప్పుడు ప్రచారాలు, కథనాలను ఆపాలని టీడీపీ శ్రేణులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి హెచ్చరించారు. ‘హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, జూనియర్ ఎనీ్టఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కుట్రలేనా’ అని రాచమల్లు సూటిగా ప్రశ్నించారు. వాటన్నింటికి తాము లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment