'లంచాలు అడగకుండా సేవ చేయండి' | municipal council meeting in proddatur | Sakshi
Sakshi News home page

'లంచాలు అడగకుండా సేవ చేయండి'

Published Sat, Jan 30 2016 1:35 PM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM

municipal council meeting in proddatur

ప్రొద్దుటూరు: ‘మీ పాదాలకు మొక్కుతా..ఒత్తిడులకు లొంగకుండా, లంచాలు తీసుకోకుండా ప్రజలకు సేవ చేయండి..’అంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అధికారులను కోరారు. శనివారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అధికారులును పై విధంగా ఆర్థించారు. సమావేశంలో అధికారుల వద్దకు వెళ్లిన ఆయన నేలపై కూర్చుని వినూత్న రీతిలో అధికారులను అభ్యర్థించారు. దీంతో ఒకింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న అధికారులు లంచాలు అడక్కుండా విధులు నిర్వర్తిస్తామని ముక్తకంఠంతో సమాధానమిచ్చారు.

మున్సిపల్ ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, కౌన్సిలర్లు కమిషనర్‌ను ఇటీవల కోరారు. స్పందించిన ఆయన...పట్టణంలో ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి.. ఆదేశాల అమలును అడ్డుకున్నారు. పెపైచ్చు ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ ఒకరు టౌన్ ప్లానింగ్ అధికారిపై దాడికి పాల్పడ్డారంటూ అక్రమ కేసు పెట్టించారు.ఈ చర్యల నేపథ్యంలోనే అధికారులు ఒత్తిడులకు, లంచాలకు లొంగకుండా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement