![MLA Rachamallu Finances Auto Drivers Daughters Treatment - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/28/MLA-Rachamallu.jpg.webp?itok=ynU7DHTN)
ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా) : స్థానిక 21వ వార్డు పరిధిలోని ఆటో డ్రైవర్ షేక్ హుసేన్ బాషా, షేకున్నీసాల కుమార్తె ముక్సాన్ వైద్యం కోసం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆదివారం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ముక్సాన్ ఇటీవల మిద్దెపై నుంచి జారిపడి మోకాలు లోని నరాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై స్థానిక ఆర్థోపెడిక్ డాక్టర్ నిరంజన్‌రెడ్డిని ఆటో డ్రైవర్ కుంబీకులు సంప్రదించగా ముక్సాన్ రెండు మోకాళ్లకు సంబంధించిన నరాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ప్రత్యేక వైద్య నిపుణుడిని పిలిపించి చికిత్స చేయించేందుకు రూ.లక్షన్నర అవసరం అవుతుందని తెలపడంతో వారు ఎమ్మెల్యేను సంప్రదించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు బాలిక భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని తన వంతు సాయంగా రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని డాక్టర్ నిరంజన్‌రెడ్డికి అందించారు. వెంటనే బాలికలకు వైద్యం అందించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ద్వారా ఎమ్మెల్యే ఈ సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కమాల్ బాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment