proddaturu
-
ఆటో డ్రైవర్ కుమార్తె వైద్యానికి ఎమ్మెల్యే ఆర్థికసాయం
ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా) : స్థానిక 21వ వార్డు పరిధిలోని ఆటో డ్రైవర్ షేక్ హుసేన్ బాషా, షేకున్నీసాల కుమార్తె ముక్సాన్ వైద్యం కోసం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆదివారం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ముక్సాన్ ఇటీవల మిద్దెపై నుంచి జారిపడి మోకాలు లోని నరాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై స్థానిక ఆర్థోపెడిక్ డాక్టర్ నిరంజన్‌రెడ్డిని ఆటో డ్రైవర్ కుంబీకులు సంప్రదించగా ముక్సాన్ రెండు మోకాళ్లకు సంబంధించిన నరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుడిని పిలిపించి చికిత్స చేయించేందుకు రూ.లక్షన్నర అవసరం అవుతుందని తెలపడంతో వారు ఎమ్మెల్యేను సంప్రదించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు బాలిక భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని తన వంతు సాయంగా రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని డాక్టర్ నిరంజన్‌రెడ్డికి అందించారు. వెంటనే బాలికలకు వైద్యం అందించాలని కోరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ద్వారా ఎమ్మెల్యే ఈ సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కమాల్ బాషా పాల్గొన్నారు. -
నిరుపేద.. ఆపై పెద్ద బాధ.. నేనున్నానంటూ ఎమ్మెల్యే రాచమల్లు భరోసా
సాక్షి, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని మీనాపురం గ్రామానికి చెందిన బత్తల మల్లికార్జున, మునిలక్ష్మి దంపతులు నిరుపేదలు. మల్లికార్జున కూలీ పనికి వెళ్తుంటాడు. వారికి ముగ్గురు కుమార్తెలు. కీర్తన చివరి సంతానం. స్థానికంగా ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 10 ఏళ్ల కీర్తనకు పెద్ద కష్టం వచ్చింది. కొన్ని నెలల క్రితం ముఖంలో గడ్డలు ఏర్పడి వాపు వచ్చింది. తగ్గుతుందిలే అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆ వాపు కాస్త ముఖమంతా ఎక్కువగా వ్యాపించింది. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ వచ్చారు. చాలా ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఆదుకున్న ఎమ్మెల్యే ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాలిక తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం నెల్లూరులోని మెడికోవర్ ఆస్పత్రికి పంపించారు. అన్ని రకాల పరీక్షలు చేసి దవడ ఎముక లోపలి భాగంలో క్యాన్సర్ సోకినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆపరేషన్ చేయిస్తే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు రూ.10 లక్షలు మేర ఖర్చు అవుతుందని తెలపడంతో.. వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అంత డబ్బు భరాయించే స్థోమత తమకు లేదని రోదించసాగారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. రెండు రోజుల్లో ఆపరేషన్ చిన్నారి కీర్తన ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మీడియాకు వెల్లడించారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణానికి ప్రమాదమని వైద్యులు చెప్పారన్నారు. ముగ్గురు వైద్యులు కలిసి ఆపరేషన్ చేయనున్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం చేయాలని తాను కోరిన మేరకు వైద్యులు రూ.6 లక్షలకు అంగీకరించారన్నారు. కొంత డబ్బు కుటుంబ సభ్యులు పెట్టుకుంటామని చెప్పారని, మిగతా రూ.5 లక్షలు లేదా అంతకు ఎక్కువైనా తానే భరాయిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ నిమిత్తం బుధవారం కీర్తనను ఎమ్మెల్యే నెల్లూరుకు పంపించారు. అడ్మిట్ అయిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఆపరేషన్ చేస్తారన్నారు. పేదరికంలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రాచమల్లుకు కీర్తన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు) -
ప్రొద్దుటూరులో టీడీపీ మహిళా నేత చేతివాటం..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో టీడీపీ మహిళా నేత చేతి వాటం ప్రదర్శించింది. డ్వాక్రా డబ్బులను టీడీపీ నాయకురాలు లక్ష్మీనారాయణమ్మ గోల్మాల్ చేసినట్లు తెలిసింది. దాదాపు 28 సంఘాలకు చెందిన డ్వాక్రా మహిళల నుంచి సుమారు రూ.40 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే మహిళా నేతను టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్‌కుమార్ వెనకేసుకురావడంతో బాధితులు ఆయన ఇంటిని ముట్టడించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చదవండి: బెడ్రూంలో యువకుడితో ఏకాంతంగా భార్య.. బిగ్ షాక్ ఇచ్చిన భర్త -
బాలికపై అఘాయిత్యం కేసులో నలుగురి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం/కడప అర్బన్/సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారానికి సంబంధించిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు.. పఠాన్ సాధక్, షేక్ అబ్దుల్ రసూల్, బత్తల సిమోన్, బి.సిపాయి చిన్నయ్య ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో ఉండగా అదుపులోకి తీసుకున్నట్టు ఏఎస్పీ నీలం పూజిత తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు ఆమె వివరాలను వెల్లడించారు. విచారణలో భాగంగా తనపై నలుగురు అత్యాచారం చేసినట్లు బాలిక వెల్లడించిందన్నారు. చదవండి: కాకినాడ: సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా, నిందితులపై కేసు నమోదు చేశాక మీడియాలో స్క్రోలింగ్ వచ్చిందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశాక అసత్యాలు ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కడపలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4న ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ నాగరాజుకు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఆ ప్రాంత అంగన్వాడీ టీచర్ ద్వారా సమాచారం అందుకున్న మహిళా పోలీసు మల్లేశ్వరి ఒక మైనర్ బాలిక గర్భంతో ఉండి వీధుల్లో తిరుగుతోందని సీఐకి సమాచారం ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన సీఐ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకురమ్మని మహిళా పోలీసుకు సూచించారన్నారు. అయితే బాలిక మానసికస్థితి సరిగా లేకపోవడంతో తన వివరాలను పోలీసులకు వెల్లడించలేకపోయిందన్నారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఎవరో తేలకపోవడంతో సంరక్షణ నిమిత్తం బాలికను మైలవరంలోని డాడీహోంకు తరలించామన్నారు. తండ్రి మానసిక స్థితి కూడా సరిగా లేదు.. ఈ నెల 9న త్రీటౌన్ పరిధిలో ఉన్న బాలిక తండ్రిని గుర్తించి సమాచారం ఇచ్చామని ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. అయితే అతడి మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో ఫిర్యాదు ఇవ్వలేకపోయాడన్నారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీవో హైమావతి ఫిర్యాదు మేరకు ఈ నెల 11న ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ క్రమంలో బయటి వ్యక్తులకు వెళ్లిన పలు వీడియోలను పరిశీలించి కేసులో సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాలిక తల్లి ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించిందని చెప్పారు. బాలికకు ఆరు నెలలుగా ఒక వ్యక్తితో పరిచయం ఉందని.. అతడు అనుభవించి మోసం చేశాడన్నారు. అంతేకాకుండా అతడి ఇద్దరు బంధువులు కూడా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు. నాలుగు నెలల క్రితం ఇంకో వ్యక్తి 20 రోజుల పాటు బాలికను పనిమనిషిగా పెట్టుకొని మోసం చేశాడన్నారు. దర్యాప్తును వేగవంతం చేయండి: వాసిరెడ్డి పద్మ కాగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ఎస్పీ అన్బురాజన్‌తో గురువారం ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని కోరారు. బాలిక ఆరోగ్యం కుదుటపడేవరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్షి్మని హుటాహుటిన బాధిత బాలిక వద్దకు పంపారు. ఈ కేసును కమిషన్ సుమోటోగా స్వీకరిస్తుందని.. బాధితురాలికి అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. -
నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి..
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): వేరేవారి బ్యాంకు ఖాతాలనుంచి ఆధునిక టెక్నాలజీ సాయంతో డబ్బును దోచేస్తున్న ఓ సైబర్ నేరగాడిని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి..అతని వద్ద నుంచి రూ. 3 లక్షలు రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని సుందరయ్య నగర్‌కు చెందిన మల్లెపోగు ప్రసాద్ (31) ప్రొద్దుటూరు టౌన్ హోమస్‌పేటలో తమ బంధువులకు చెందిన ధనలక్ష్మి వెబ్ సెంటర్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. చదవండి: అన్నా.. అని వేడినా కనికరించలేదు.. ఆ మాటలు విని వారి గుండెలు బద్దలైపోయాయి ఆరు నెలల క్రితం అరుణ అనే మహిళ నెట్ సెంటర్లో తన వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయి డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకుని లాగౌట్ చేయకుండా వెళ్లిపోయింది. దీంతో నిందితుడు వాట్సాప్‌ను చెక్‌చేయగా ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఎవరికో డబ్బులను పంపిన విషయం గమనించాడు. వెంటనే అరుణ కుమార్తె నంబరుకు ఫోన్ చేసి మీ తల్లి ఆధార్, పాన్‌తో లింక్ కాలేదని, తాను చెప్పినట్లు మెసేజ్ పెట్టమని కోరాడు. తరువాత ఆమె సెల్‌కు వచ్చిన మెసేజ్, వెరిఫికేషన్ కోడ్లను స్క్రీన్‌షాట్‌గా తెప్పించుకున్నాడు. అనంతరం అరుణ వాడుతున్న నంబరును ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసి హైదరాబాద్‌లో సిమ్‌కార్డును తీసుకుని యాక్టివేట్ చేసుకున్నాడు. దీని కోసం నిందితుడు తన ఫేస్‌కట్‌తోనే పోలి ఉన్న రాయచోటికి చెందిన మగ్దూం బాషా అనే అతని ఆధార్‌కార్డును ఉపయోగించాడు. ఈ నంబరు సిమ్‌ను తన సెల్లో వేసుకుని ఫోన్‌పే, నెట్ బ్యాంకింగ్ ఇన్స్టాల్ చేసుకుని అరుణకు చెందిన కెనరాబ్యాంక్ ఖాతానుంచి మొత్తం రూ. 4.31 లక్షలను కాజేశాడు. తన బ్యాంకు ఖాతానుంచి రూ.4 లక్షలకుపైగా డబ్బు మాయం కావడంతో.. ఆందోళనకు గురైన మహిళ ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు, కడప సైబర్ సెల్ పోలీసు బృందం అధునాతన టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు తాను దొంగిలించిన మొత్తంలో రూ. 3.10 లక్షలు తన తల్లి ఆరోగ్య సమస్య తీరడానికి హోమం చేయాలంటూ కర్నూలు జిల్లా కొలిమికుంట్లకు చెందిన ఓ పూజారికి ఇచ్చినట్లు తెలిపాడు. నిందితుడిని అక్కడికి తీసుకుపోయిన పోలీసులు పూజారి నుంచి ఆ రూ.3 లక్షలు రికవరీ చేశారు. -
వీడు మామూలోడు కాదు .. బీటెక్ మానేసి.. వందలాది మందితో..
కడప అర్బన్: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇతగాడి పేరు చెన్నుపల్లి ప్రసన్నకుమార్ (23). ప్రశాంత్‌రెడ్డి, రాజారెడ్డి, టోనీ అనే పేర్లతోనూ చలామణి అయిన ఇతడు బీటెక్ ఫస్టియర్‌లో చదువు మానేశాడు. ఆ తర్వాత జల్సాల కోసం దొంగగా మారాడు. చైన్ స్నాచింగ్‌లు చేయడం.. ఇళ్లకు కన్నంవేసి సొత్తు కొట్టేయడం అతడి స్టైల్. చోరీలు చేసి దొరికిపోయిన అతగాడికి బోర్ కొట్టిందో ఏమో.. సోషల్ మీడియాలో రోమియో అవతారమెత్తాడు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో రోమియో అవతారమెత్తి.. యువతులు, మహిళల్ని టార్గెట్ చేశాడు. ఆ తర్వాత వారిని తెలివిగా ముగ్గులోకి దించి నగ్న వీడియోకాల్స్, అసభ్య చాటింగ్ చేయడం.. ఆనక వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది యువతులు, మహిళలపై వలపు వల విసిరి మోసగించడమే కాకుండా భారీగా సొమ్ములు కొల్లగొట్టాడు. ఈ ఏడాది ఆగస్టు 1న పోలీసులకు చిక్కి కటకటాల పాలైన ప్రసన్నకుమార్‌పై కడప ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సిఫారసు మేరకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు శనివారం పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీడు మామూలోడు కాదు ప్రసన్నకుమార్‌పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 26 కేసులున్నాయి. చిన్న వయసులోనే దుర్వ్యసనాలకు బానిసైన ప్రసన్నకుమార్ 2017లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్, చాపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇతనిపై ప్రొద్దుటూరు త్రీటౌన్‌లో సస్పెక్ట్ షీట్ నమోదైంది. ఆ తరువాత ప్రసన్నకుమార్ కడప, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో షేర్‌చాట్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలను టార్గెట్ చేసి వారితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పేవాడు. అసభ్యకర రీతిలో చాటింగ్ చేసేవాడు. వారికి తెలియకుండా వారి ఫొటోలు, వీడియోలను రికార్డు చేసి, బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి తన గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా డబ్బులు గుంజేవాడు. కొందర్ని శారీరకంగా లోబర్చుకునేవాడు. వందల సంఖ్యలో మహిళలను మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పరువుకు సంబంధించిన విషయం కావడంతో బాధితులెవరూ ఫిర్యాదు చేసేందుకు రాలేదు. ఘరానా మోసగాడు ప్రసన్నకుమార్ చాపాడు, ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో చైన్‌స్నాచింగ్ కేసులో, 2019లో ప్రొద్దుటూరు వన్‌టౌన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కేసులో, 2020లో విజయవాడు కమిషనరేట్ పరిధిలోని పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వివాహితను లైంగికంగా వేధించి, డబ్బుల కోసం బెదిరించిన కేసులో, 2020 నవంబర్‌లో శంషాబాద్ పరిధిలోని చౌదరిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో పెనమలూరు తరహాలో నేరం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. వైఎస్సార్ జిల్లాలోని కడప, ఎర్రగుంట్ల, వల్లూరు మండలాల్లోని పలు ఇళ్లలో దొంగతనాలు చేసిన కేసులో ఇతను ప్రధాన∙నిందితుడు. కడప తాలూకా, వన్‌టౌన్, ప్రొద్దుటూరు టూటౌన్ స్టేషన్ల పరిధిలో 2021లో పలు మోటార్ సైకిల్ దొంగతనాల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగా మహిళల్ని మోసగిస్తున్న ప్రసన్నకుమార్‌పై రాష్ట్రంలోనే తొలిసారిగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. -
మాజీ ఎమ్మెల్యే వరద స్వగ్రామంలో ఉద్రిక్తత
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సొంత పంచాయతీ కామనూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరద సోదరులు నంద్యాల రాఘవరెడ్డి, భార్గవరెడ్డి, హనుమంతరెడ్డితోపాటు మరికొంతమంది కలిసి వైఎస్సార్సీపీ నాయకుడు నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపైకెళ్లి దౌర్జన్యం చేశారు. సెల్‌ఫోన్ లాక్కుని మహిళలను దూషించి భయాందోళనకు గురిచేశారు. ఓటింగ్ ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. గత 40 ఏళ్లుగా కామనూరు గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకుండా వరదరాజులరెడ్డి వర్గీయులు అడ్డుపడుతూ వచ్చారు. 1,700 ఓట్లు గల పంచాయతీలో కామనూరు, రాధానగర్, నక్కలదిన్నె గ్రామాలున్నాయి. ప్రస్తుతం సర్పంచ్ పదవిని బీసీ కేటగిరీకి కేటాయించడంతో వైఎస్సార్ అభిమాని షేక్ కరీమూన్ నామినేషన్ వేశారు. సర్పంచ్‌తోపాటు మొత్తం 8 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ పంచాయతీలోనే ఎన్నికలు జరిపేలా చేస్తారా అని వరద వర్గీయులు గుంపులుగా వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
ఇంట్లో నుంచి పరార్, టీసీకి దొరికిన పిల్లలు
ప్రొద్దుటూరు క్రైం : ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన పిల్లలు సురక్షితంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని అమృతానగర్‌కు చెందిన మహబూబ్‌బాషా, షేక్ జావిద్, విశ్వాసరాజు, వంశీకృష్ణ అనే 13–14 ఏళ్ల పిల్లలు స్నేహితులు. వారు చెప్పకుండా మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. వీళ్లంతా ఒకే వీధికి చెందిన వారు. ఎర్రగుంట్లకు వెళ్లిన నలుగురు ముంబై రైలు ఎక్కారు. మార్గంమధ్యలోని తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం సమీపంలో రైల్లోని టీసీ వారి వద్దకు వచ్చి టికెట్ అడిగాడు. లేదని చెప్పడంతో వారి వాలకాన్ని బట్టి పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు టీసీ గ్రహించాడు. దీంతో టీసీ అరక్కోణం రైల్వేపోలీసులకు వారిని అప్పగించాడు. అక్కడి పోలీసులు అమృతానగర్‌లోని పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సినీహబ్ అధినేత బసిరెడ్డి వీరకుమార్‌రెడ్డి సొంత ఖర్చులతో శుక్రవారం నలుగురు పిల్లలను ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చారు. -
పేగు బంధాన్ని కలిపిన ఫేస్బుక్
రాజమహేంద్రవరం క్రైమ్/ప్రొద్దుటూరు క్రైమ్: ఫేస్బుక్ ద్వారా 32 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడా తనయుడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వుట్టి నాగశయనం తల్లి పద్మావతి తన భర్త ఆంజనేయులతో గొడవపడి 32 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాజమహేంద్రవరం చేరుకున్న ఆమె లాలాచెరువులో ఉంటూ షాపుల వద్ద పనిచేస్తూ జీవిస్తోంది. నాటి నుంచి నాగశయనం తన తల్లి ఆచూకీ కోసం చేయని ప్రయత్నం లేదు. పలు ప్రాంతాల్లో వెతికించినా ఫలితం దక్కలేదు. కాగా, రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ కానిస్టేబుల్ జి.సూర్యనారాయణ ఒక కేసు దర్యాప్తు నిమిత్తం లాలాచెరువులో విచారణ చేస్తుండగా 70 ఏళ్ల పద్మావతి కనిపించింది. ఆమె దీనస్థితి చూసి వివరాలు అడగ్గా తనకు ఎవరూ లేరని.. భర్తతో గొడవ పడి ఇక్కడకు వచ్చినట్టు తెలిపింది. దీంతో ఆయన పద్మావతి వివరాలను ఫేస్బుక్లో పోస్టు చేశారు. అయితే దానిపై ఎవరూ స్పందించలేదు. పోస్టు చేసి ఏడాది గడవడంతో దాని రిమైండర్ ఫేస్బుక్లో రావడంతో ఈ నెల 21న సూర్యనారాయణ మళ్లీ పోస్టు చేశారు. కడపకు చెందిన రమేశ్ దాన్ని చూసి లోకల్ గ్రూప్‌లో అప్లోడ్ చేశారు. ఆ పోస్టును పద్మావతి కుమారుడు నాగశయనం చూసి సోమవారం భార్య శారదతో రాజమహేంద్రవరం వచ్చి తన తల్లిని కలిశాడు. 32 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీతనయుడు ఒకరినొకరు చూసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్.. పద్మావతిని ఆమె కుమారుడు నాగశయనంకు అప్పగించారు. కాగా.. పద్మావతి ఇల్లు వదిలి వచ్చేసరికి నాగశయనం వయసు 15 ఏళ్లు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నాగశయనం సాక్షితో మాట్లాడుతూ.. తన తల్లి రాజమండ్రిలో ఉంటుందని ఊహించలేదని చెప్పారు. ఇంతకాలం తర్వాత కనిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. -
ఆంధ్రజ్యోతి రాధాకృష్టకు ఎమ్మెల్యే సవాల్..
సాక్షి, ప్రొద్దుటూరు: సీఎంఆర్‌ఎఫ్‌ల చెక్కుల స్కాం కేసులో తన పాత్ర ఉందని పోలీసులు, సీఐడీ అధికారులు రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ స్కాంలో తన పాత్ర లేదని తేలితే ఆంధ్రజ్యోతి పత్రికను మూసివేస్తావా అంటూ ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణకు ఆయన సవాల్ విసిరారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ, ఆంధ్రజ్యోతి పత్రిక సీబీఐ దర్యాప్తు కోరితే తాను మొదటి సంతకం చేస్తానని కోర్టులో పిటిషన్ కూడా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. (చదవండి: ‘అందుకే ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారు’) -
నకిలీ చెక్కుల కేసులో వ్యక్తి లొంగుబాటు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కులు సృష్టించిన భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రొద్దుటూరు పోలీసుల ముందు గురువారం లొంగిపోయారు. 25 వేల విలువ గల మూడు పాత చెక్కులను మార్ఫింగ్ చేసి 9 లక్షల 95 వేలతో నిందితుడు దొంగ చెక్కులను తయారు చేశాడు. కర్ణాటకలోని హోసూర్‌లో ఉండే సుబ్బిరామిరెడ్డి ద్వారా చెక్కులను మార్పింగ్ చేశారు. నకిలీ చెక్కులను గుర్తించిన బ్యాంకుల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం గుట్టురట్టయిం ఈ కేసును ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్ లోతుగా విచారణ చేపట్టారు. -
శభాష్.. పోలీస్
ప్రొద్దుటూరు క్రైం : నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో నివాసం ఉంటున్న తిరుమల దుర్గాప్రసాద్‌కు మానసిక దివ్యాంగులైన ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్డౌన్ కారణంగా అతను పనికి వెళ్లలేకపోయాడు. దీంతో కొన్ని రోజుల నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పలువురి సూచన మేరకు అతను శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫోన్ చేసి.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి విన్నవించుకున్నాడు. ఎస్పీ సూచన మేరకు డీఎస్పీ లోసారి సుధాకర్, రూరల్ సీఐ విశ్వనాథ్‌రెడ్డి, ఎస్ఐ సునీల్‌రెడ్డి శుక్రవారం రాత్రి దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లారు. రూ. 5 వేల నగదుతోపాటు రెండు బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్‌తో మాట్లాడి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా కృషి చేస్తామని దుర్గాప్రసాద్‌తో అన్నారు. అలాగే బ్యాంకు అధికారులతో మాట్లాడి సొంత ఆటో కోసం రుణం ఇచ్చేలా మాట్లాడుతామని చెప్పారు. మానవత్వంతో తమ కుటుంబాన్ని ఆదుకున్న ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎవరా నలుగురు..?
పసిడిపురి..పుత్తడిపురం ఈ రెండు పేర్లు వినగానే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. బంగారు వ్యాపారంలో రాష్ట్రంలోనే గాక దేశ వ్యాప్తంగా ప్రొద్దుటూరుకు మంచి పేరుంది. బంగారు వ్యాపారులే గాక ఇతర రంగాల్లో బాగా స్థిరపడిన వారు అనేక మంది సంపన్నులు ఇక్కడ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఇక్కడి నుంచే అప్పుగా డబ్బు తీసుకుంటాయి. విడుదలయ్యే ప్రతి చిత్రంలోనూ ప్రొద్దుటూరు ఫైనాన్సియర్ల పెట్టుబడులు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నేతలు సైతం రుణం ఇక్కడి వారి నుంచే తీసుకుంటుంటారు. అలాంటి పసిడిపురిపై ఇటీవల దొంగల కన్ను పడినట్లు కనిపిస్తోంది. వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : బంగారు వ్యాపారస్తులను టార్గెట్ చేసుకొని గతంలో ఈ పట్టణంలో పలు దొంగ తనాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు దుండగులు ఒక బంగారు వ్యాపారి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో పట్టపగలు వచ్చిన దుండగులు వీధిలోనూ, ఇంటి చుట్టూ సుమారు 15 నిమిషాల పాటు రెక్కీ నిర్వహించారు. ఈ వార్త పట్టణమంతా వ్యాపించడంతో బంగారు వ్యాపారులు, ఇతరులు ఆందోళన చెందుతున్నారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు షావలి స్కూల్ కాలనీలో ఒక బంగారు వ్యాపారి నివసిస్తున్నాడు. అతను దర్గాబజార్లో బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7న నలుగురు వ్యక్తులు కారులో అతను ఉన్న కాలనీకి వచ్చారు. వారి కారును కాలనీ ప్రధాన గేటు వద్ద నిలిపారు. ఒక వ్యక్తి అక్కడే నిలబడగా ఇద్దరు వ్యక్తులు కాలనీ లోపలికి వచ్చారు. ఒక వ్యక్తి ఇంటి వెనుక వైపు వెళ్లాడు. ఇద్దరు వ్యక్తులు వ్యాపారి కాంపౌండ్‌లోకి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కారు. ఆ ఇంటికి ప్రధాన తలుపునకు ముందు భాగాన గ్రిల్స్ అమర్చిన తలుపులు కూడా ఉన్నాయి. ఎంతసేపైనా తలుపు తీయకపోవడంతో యజమాని పేరు పెట్టి దుండగులు పిలిచారు. ఆయన భార్య ప్రధాన ద్వారం తెరచి చూడగా ఎప్పుడూ చూడని ఇద్దరు వ్యక్తులు బయట ఉన్నారు. ‘ఎవరు మీరు.. ఎందుకు వచ్చారు’ అని అడుగగా పలకలేదు వారు. ముందు తలుపు తీయమని దబాయించారు. అనుమానం వచ్చిన ఆమె గ్రిల్స్ తలుపులు తీయలేదు. సుమారు 10 నిమిషాల సేపు అక్కడే ఉన్న నలుగురు దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నలుగురు కాలనీ కాంపౌండ్‌లో ఉన్నంత సేపు ఫోన్లలో మాట్లాడుకుంటూ కనిపించారు. బంగారు వ్యాపారి ఎంతో కష్టపడి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పుటేజీలను సేకరించారు. అందులో దుండగులు సెల్ఫోన్లో మాట్లాడిన సన్నివేశాలు టైమింగ్‌తో సహా రికార్డు అయ్యాయి. సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా ఆ నలుగురు ఎవరు..? వారు ఎవరితో మాట్లాడారనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. వారిలో ఇద్దరు జాకెట్ వేసుకొని వచ్చారు. వేసవి కాలంలో జాకెట్ వేసుకొని రావడం చూస్తే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రింగ్ రోడ్డు గుండా వచ్చారు.. జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులోని రింగురోడ్డు గుండా నలుగురు దుండగులు పట్టణంలోకి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. పెన్నానగర్ నుంచి నేరుగా వ్యాపారి ఉంటున్న కాలనీ వద్దకు వచ్చారు. అతని ఇంటి వద్ద నుంచి వెళ్లి ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కొంత సేపు కారు పార్కింగ్ చేశారు. తర్వాత వన్‌టౌన్ స్టేషన్ మీదుగా వెళ్లిపోయారు. వారు మాట్లాడిన భాష.. యాస ఆధారంగా వారు ఉత్తరప్రదేశ్ లేదా బీహార్‌కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. నలుగురు ఎందుకొచ్చినట్లు.. వ్యాపారి ఉంటున్న కాలనీలో సంపన్నులు చాలా మంది ఉన్నారు. నేరుగా అతని ఇంటికే వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ చోరీ చేయడానికే వచ్చారను కుంటే.. అదే వీధిలో సుమారు 15 రోజుల నుంచి ఒక ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఉన్న ఇంటినే ఎందుకు టార్గెట్ చేశారనేది తెలియడం లేదు. పట్టపగలు భయపెట్టి దోచుకొని వెళ్లడానికా.. లేక కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నలుగురు దుండగులకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన రహదారిలో కాకుండా చిన్న పాటి ఇరుకు వీధి నుంచి నేరుగా వ్యాపారి ఇంటికి వచ్చిన విధానం చూస్తే స్థానికులు ఎవరైనా వారికి సహకరించి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయం బంగారు మార్కెట్లో తెలియడంతో వ్యాపారులు భయాందోనలు చెందుతున్నారు. పట్టణంలోని ప్రతి ప్రాంతంలోనూ సీసీ కెమెరాలను అమర్చారు. ఇంత పెద్ద ఎత్తున నిఘా వ్యవస్థ ఉన్నా దుండగులు ఎలా వచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. కారు నెంబర్ ప్లేట్‌ను పరిశీలించగా ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. ఫేక్ నెంబర్ వేసుకొని దుండగులు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై వ్యాపారి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇటీవల వైఎంఆర్ కాలనీలో రెండు భారీ చోరీలు జరిగాయి. ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేసే ఉద్యోగి ఇంట్లో, మరొకటి గనుల వ్యాపారి ఇంట్లో దొంగలు పడ్డారు. వీటిలో ఒక చోరీ ఘటనలో పురోగతి కనిపించగా ఇంకోటి ఇంత వరకు తేలలేదు. -
బాల్యంలో కథలు రాయడం గొప్ప అనుభూతి
ప్రొద్దుటూరు : బాల్యంలో విద్యార్థులు కథలు రాయడం గొప్ప అనుభూతినిస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డీకే చదువుల బాబు సంపాదకత్వంలో 20 మంది విద్యార్థులు రాసిన ‘‘కొత్తపేట కలాలు’’పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి వయసులోనే పుస్తకాలను రాయాలనే ఆలోచన రావడం అరుదైన విషయమన్నారు. విద్యార్థులను ఈ వైపుగా ప్రోత్సహించిన చదువుల బాబును అభినందించారు. గురువులేని విద్య ప్రకాశించదని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే రచనలు చేయాలని పేర్కొన్నారు. కథలు రాయడం వల్ల విద్యార్థుల్లో పరిశీలన, సృజనాత్మక శక్తి అభివృద్ధి చెందుతుందని అన్నారు. కథల్లో స్నేహం, సహకార గుణం, సేవాతత్వం, తల్లిదండ్రుల ప్రేమ, పరోపకారం తదితర అంశాలు కనిపించాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శతావధాని నరాల రామారెడ్డి మాట్లాడుతూ రాచమల్లు శివప్రసాదరెడ్డిలా మాట్లాడే శాసనసభ్యులు రాష్ట్రంలోనే అరుదుగా ఉన్నారని చెప్పారు. రాచమల్లు రామచంద్రారెడ్డి, భైరవ కొండారెడ్డి గొప్ప కవులు అని తెలిపారు. ఆయన వంశంలో కవులు ఉన్న కారణంగానే ఆయనకు వాక్చాతుర్యం అలవడిందన్నారు. ఆయన భాష, భావం చక్కగా ఉంటాయని పేర్కొన్నారు. సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పాఠశాల వయసులోనే సమాజంపై అవగాహన పెంచుకుని కథలు రాసిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు రాయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ సావిత్రమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయభారతి, ఉపాధ్యాయులు గజ్జల వెంకటేశ్వరరెడ్డి, చదువులబాబు, హిమజాత, దేవదత్తు, పద్మావతి, రమాదేవి, కృష్ణ మాధవీలత, రామానాయుడు పాల్గొన్నారు. -
అప్పులోల్ల నెత్తిన బండ్ల.. 66 చెక్‌బౌన్స్ కేసులు
సిరిపురిపై సినిమా వాళ్లు కన్నుపడింది..సినీ అవకాశాలు, అధిక వడ్డీల ఆశ కల్పించారు. ఫైనాన్సియర్ల నుంచి రూ. కోట్లలో అప్పులు తీసుకొని తీర్చకుండా ‘సినిమా’ చూపిస్తున్నారు. ఓ బడా నిర్మాత ఏకంగా 66 చెక్‌బౌన్స్ కేసులలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అప్పులోల్ల నెత్తిన బండ మోపి తాపీగా సినీ షూటింగ్‌కు వచ్చినట్లు కోర్టుకు వచ్చి వెళుతున్నాడని బాధితులు వాపోతున్నారు. ప్రొద్దుటూరు క్రైం : సిరిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు సినీ ఫైనాన్షియర్లకు కూడా ప్రసిద్ధి. ఇక్కడున్న పలువురు చాలా కాలం నుంచి సినీ నిర్మాతలకు పెట్టుబడికి గాను అప్పు ఇస్తున్నారు. మార్కెట్లో కంటే ఎక్కువ వడ్డీ వస్తుండటంతో ఎక్కువ మంది సినీ ఫైనాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. సినీ ఫైనాన్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు. సినీ రంగంలోని వ్యక్తులకు గతంలో అప్పు ఇచ్చేవారు కొందరు మాత్రమే ఉండేవారు. అయితే లాభాలు బాగా వస్తుండటంతో ఇటీవల అప్పు ఇచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో హైదరాబాద్‌లోని పలువురు నిర్మాతలు ప్రొద్దుటూరుకు వచ్చి రూ. కోట్లలో అప్పు తీసుకొని వెళ్తున్నారు. స్థానికంగా ఉన్న కొందరు మధ్య వర్తుల ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఫైనాన్స్ ఇచ్చే వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అధికంగా ఉండటం విశేషం. సుమారు 7 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఒక నిర్మాతకు ఇక్కడి ఫైనాన్షియర్లు రూ. కోట్లలో అప్పు ఇచ్చారు. అయితే అతను ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో రుణదాతలు కోర్టులో కేసు వేశారు. అతను డబ్బు ఇవ్వకపోవడంతో చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ సంఘటన మరచిపోక ముందే మరో సినీ నిర్మాత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సినీ నిర్మాత బండ్ల గణేష్‌బాబుకు ప్రొద్దుటూరుకు చెందిన అనేక మంది రూ. లక్షల్లో అప్పు ఇచ్చారు. అతను ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. చెక్‌బౌన్స్ కేసుకు బండ్లగణేష్ ప్రతి నెలా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరు అవుతున్నారు. 66 చెక్‌బౌన్స్ కేసులు బండ్లగణేష్‌పై ప్రొద్దుటూరు కోర్టుల్లో సుమారు 66 కేసులు ఉన్నాయి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 21, ఫస్ట్ ఏడీఎం కోర్టులో 66 చెక్ బౌన్స్‌లు నమోదు అవుతున్నాయి. ఫైనాన్షియర్లు ఇచ్చిన డబ్బుకు గాను ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లక పోవడంతో వారందరూ 2017లో కోర్టును ఆశ్రయించారు. నిర్మాత బండ్ల గణేష్‌బాబు పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పేరుపై ప్రొద్దుటూరులో అప్పు తీసుకున్నాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి అతను రూ. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. 66 మందికి సంబంధించి బౌన్స్ అయిన చెక్కుల విలువ సుమారు రూ.8 కోట్ల వరకు ఉంటుందని కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ ఐదు సార్లు నిర్మాత బండ్ల గణేష్ వాయిదా నిమిత్తం ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చారు. అయితే ఈ నెల 18న 35 కేసులకు సంబంధించిన చెక్‌బౌన్స్ కేసులో బండ్లగణేష్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అతను రాలేదు. తిరిగి ఈ కేసును నవంబర్ నెలకు కోర్టు వాయిదా వేసింది. అదో రంగుల ప్రపంచం.. సినిమా హీరోలు, హీరోయిన్లు ఎప్పుడైనా మన ప్రాంతానికి వస్తే వారిని చూడటానికి ఎగబడి పోతారు. ఎంత కష్టమైనా సరే వాళ్లను ఒక్కసారైనా కళ్లారా చూడాలని పరితపిస్తారు. అలాంటిది హీరోలు, హీరోయిన్లను దగ్గరగా చూసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్లకు ఫైనాన్షియర్లకు ఆహ్వానాలను పంపిస్తారు. వీరికి హీరోలు, హీరోయిన్లతో కలసి ఫొటోలు తీసుకోవడం, భోజనం చేసే అవకాశాలు కూడా లభిస్తుంటాయి. బాగా పేరున్న ఫైనాన్షియర్లకు కొత్త సినిమా ప్రీమియర్ షోకు వెళ్లే ఆఫర్లు కూడా వస్తుంటాయి. ఎక్కువ వడ్డీతో పాటు చిత్ర పరిశ్రమలోని అనేక మంది సెలెబ్రెటీలు పరిచయం అయ్యే అవకాశాలు ఉండటంతో కొంత మంది ఈ కారణంతో పెట్టుబడులు పెడుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా నిర్మాత బండ్ల గణేష్ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు రావాల్సి ఉండటంతో వస్తుందో రాదో అని బాధితులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు. -
సాధారణ జ్వరానికీ డెంగీ పరీక్షలు
జ్వరం వస్తే మందు బిళ్ల వేసుకునేవాళ్లం.. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంజక్షన్ వేసుకుంటే రెండు, మూడు రోజుల్లో నయం అయ్యేది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం కూడా ఖరీదైన వ్యాధిగా మారింది. కొందరు ప్రైవేట్ వైద్యులు, ల్యాబ్‌ల నిర్వాహకుల పుణ్యమా అని జ్వరం పేరు చెబితే భయపడే రోజులు వచ్చాయి. కొన్ని రోజుల నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా గ్రామాలు, పట్టణాల్లో పిల్లలు మొదలు కొని వృద్ధుల వరకు జ్వరాలతో బాధ పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే అదునుగా భావించి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు దోచుకునే పనిలో పడ్డాయి. ప్రొద్దుటూరు క్రైం : టైఫాయిడ్, మలేరియా, సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఎవరికైనా నీరసంగా ఉంటుంది. ఈ కారణంగా ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతాయి. అయితే జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన ప్రతి కేసుకు ప్రైవేట్ ఆస్పత్రులు, అనుబంధ ల్యాబ్ నిర్వాహకులు డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తకణాలు తగ్గాయని వారిని భయపెడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుంటున్నారు. రోజుకు రెండు సార్లు రక్తపరీక్షలు చేస్తూ రోగిని పిప్పి చేస్తున్నారు. ల్యాబ్ పరీక్షలు నిర్వహించే క్రమంలో రోగులకు డెంగీ పాజిటివ్ వచ్చినట్లు చూపుతుండటంతో రోగి, కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా నాలుగైదు రోజులకే సుమారు రూ. 40–50 వేలు దాకా ఆస్పత్రి బిల్లు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా ల్యాబ్‌లు జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని ల్యాబ్‌లు వందల్లో ఉన్నాయి. జిల్లాలో సుమారు 550కి పైగా క్లినికల్ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో జంకుతున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా కోర్సు పూర్తి చేసి ల్యాబ్‌టెక్నీషియన్‌లచే క్లినికల్ ల్యాబ్‌లను నిర్వహించాలి. అయితే చాలా చోట్ల అర్హత, అనుభవం లేని వారితో పరీక్షలు చేయిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భయాందోళనలు చెందుతున్నారు. లేబొరేటరీలను తనిఖీ చేసే అధికారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకుంది. ప్రతి ల్యాబ్‌ను అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. నిబంధనల మేరకు ల్యాబ్‌లను ఏర్పాటు చేశారా, రిజిష్టర్ చేయించారా, అర్హులైన టెక్నీషియన్లు ఉన్నారా అనే వివరాలను పరిశీలించాలి. ప్రైవేట్ వైద్యులకు భారీగా కమీషన్లు జిల్లాలోని అనేక ఆస్పత్రులకు ల్యాబ్ సౌకర్యం లేదు. దీంతో వారు బయటికి రాసి పంపుతుంటారు. రెఫర్ చేసినందుకు ప్రైవేట్ ల్యాబ్‌లు వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్ డబ్బులే కొందరు డాక్టర్లకు నెలకు రూ. లక్షలు వస్తున్నాయి. వైద్యులు రాసే పరీక్షల్లో వైద్యుడిని బట్టి రక్తపరీక్షలు, స్కానింగ్‌లకు 30 నుంచి 50 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది వైద్యులు ఆస్పత్రిలోనే ల్యాబ్‌లను సొంతంగా నిర్వహించుకుంటున్నారు. ఫీజులు తగ్గిస్తున్నారా అంటే బయట ల్యాబ్‌ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా అనుమతి లేని ల్యాబ్‌లు ప్రొద్దుటూరులో అనుమతి లేకుండా విచ్చలవిడిగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 50కి పైగా క్లినికల్ ల్యాబ్‌లు ఉండగా వాటిలో కేవలం 14 వాటికే వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ ఆస్పత్రులకు అనుబంధంగా ఎక్కువగా ల్యాబ్‌లు వెలిశాయి. వీటిల్లో ఇచ్చే రిపోర్టుల్లో కూడా తేడాలున్నట్లు తెలుస్తోంది. ఒక ల్యాబ్‌లో ఒక వ్యక్తి రక్తపరీక్ష చేయించుకొని, అతను మరో ల్యాబ్‌కు వెళ్తే వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏ పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారనే వివరాలు ల్యాబ్‌ల్లో కనిపించవు. నిబంధనల ప్రకారం అన్ని ల్యాబ్‌లు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషెంట్లకు కనిపించేలా ధరల పట్టిక పెట్టాలి. ధరల పట్టిక లేకపోవడంతో ఆస్పత్రి డిమాండ్‌ను బట్టి ల్యాబ్ టెస్ట్‌లకు డబ్బు వసూలు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం.. అనుమతి లేకుండా ల్యాబ్‌లను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. అలాగే ల్యాబ్‌ల్లో నిబంధనల మేరకు టెక్నీషియన్లతోనే పని చేయించాలి. ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ పనిలో ఉన్నాం. రిక్రూట్మెంట్ పూర్తవ్వగానే క్లినికల్ ల్యాబ్‌లను పరిశీలిస్తాం. – ఉమాసుందరి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, కడప. -
టీడీపీ నేతలందరూ కలసి వచ్చినా..
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా రెండో మారు ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హవాతోపాటు రాచమల్లు సొంత ఇమేజ్ కూడా ఆయన విజయానికి కారణమైంది. టీడీపీ తరఫున నియోజకవర్గంలో నేతలు ఎక్కువగా ఉన్నారు. వారందరూ కలసి వచ్చినా వైఎస్ఆర్సీపీ తరఫున రాచమల్లు అవిశ్రాంత పోరాటం చేశారు. ఆయనను ఓడించడానికి టీడీపీ నేతలు పన్నిన వ్యూహాలు ఫలించలేదు. ఈ కారణంగా రాచమల్లు మరో మారు పట్టు నిలుపుకొన్నారు. దీంతో ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. 2014 ఎన్నికల్లో తొలిమారు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాచమల్లు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. అనతి కాలంలోనే సొంత ఇమేజ్ను తెచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేసిన ఎమ్మెల్యే రాచమల్లుపై.. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఆయన మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ వచ్చారు. పార్టీ మారాలని కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పలు సందర్భాల్లో రాచమల్లు ప్రకటించారు. ఈ కారణంగా ఆయన ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రాచమల్లు విజయం ఎన్నికల కంటే ముందే ఖరారైనట్లు భావించవచ్చు. స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థులతో చర్చించిన సందర్భంలో.. ప్రజల మద్దతు రాచమల్లుకే ఉందని, ఆయన ఓటమి కోసం మనమంతా కష్టపడాలని సూచించారు. తెరపైకి వచ్చిన పలువురి పేర్లు ప్రజల మద్దతు కూడగట్టుకున్న రాచమల్లును ఓడించడానికి.. టీడీపీ అధిష్టానం చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలకు పట్టు లేదని, కొత్తగా పలువురి పేర్లను తెరపైకి తెచ్చింది. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్‌ను తొలుత ప్రొద్దుటూరులో పోటీ చేయించాలని ప్రతిపాదించారు. మరో మారు మంత్రి ఆదినారాయణరెడ్డి కుమారుడిని పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. మరో వైపు ఆప్కో చైర్మన్ బండి హనుమంతు, సినీ హబ్ రాజేశ్వరరెడ్డి, డాక్టర్ వైవీ స్వరూప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, వీరశివారెడ్డి ఇలా అనేక మందిని తెరపైకి తెచ్చారు. చివరగా మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ విజయం సాధించే దిశలో భాగంగా వరదరాజులరెడ్డి, లింగారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇందులో భాగంగానే వరదరాజులరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ విజయం కోసం ఓ వైపు లింగారెడ్డి, మరో వైపు వరదరాజులరెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ప్రొద్దుటూరులో అనుచర గణం కలిగి ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి రాచమల్లును ఎలాగైనా ఓడించాలని పట్టుబట్టారు. బహిరంగ వేదికల్లో ఆయనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అయినా రాచమల్లు విజయాన్ని నిలువరించలేకపోయారంటే ఆయనకు ఉన్న ప్రజల మద్దతు ఏ పాటిదో అర్థమవుతోంది. కలిసొచ్చిన పార్టీ కార్యక్రమాలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా అదనంగా కలిసి వచ్చాయి. ఆయన ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయగా.. పార్టీ కార్యక్రమాలను కూడా వాడవాడలా తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లారు. గడపగడపకు వైఎస్సార్, కావాలి జగన్– రావాలి జగన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన నియోజకవర్గంలోని ప్రతి గడప తొక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో ప్రజలకు వివరించడంతోపాటు ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వ తీరును ఎండగట్టారు. టీడీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి రాచమల్లు శివప్రసాదరెడ్డి విజయం సాధించారు. సింహం సింగిల్‌గా వస్తుందని రాచమల్లు నిరూపించారు. -
కలకలం రేపిన ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : పోలీస్‌స్టేషన్ ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ప్రొద్దుటూరులో కలకలం రేపింది. నంద్యాలకు చెందిన గౌస్‌ఖాన్ (50) మంగళవారం వేకువజామున పట్టణంలోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉరివేసుకున్నాడు. స్లాబ్‌కు అమర్చిన కొక్కికి తాడు కట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బైపాస్‌రోడ్డులోని హోసింగ్‌బోర్డు ఖాళీ స్థలంలో కారు పార్కింగ్ చేసి ఉంది. కారు డోర్లన్నీ తెరచి ఉండటంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదే దారిన వెళ్తున్న బ్లూకోల్ట్స్ పోలీసులు కారును చూశారు. అందులో ఎవరూ లేరు. చుట్టుపక్కల చూడగా ఒక వ్యక్తి మద్యం మత్తులో కూర్చొని ఉన్నాడు. పోలీసులు పశ్నించినా సరైన సమాధానం లేదు. కారు రికార్డులు చూపించలేదు. మాట తీరులో స్పష్టత లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారుతో పాటు గౌస్‌ఖాన్‌ను టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. సీఐ మల్లికార్జున గుప్త విచారించగా తన పేరు గౌస్‌ఖాన్ అని, డ్రైవర్‌గా పని చేస్తున్నానని, స్థానికంగా పెళ్లికి వచ్చినట్లు చెప్పాడు. కారు ఒరిజనల్ రికార్డులతో పాటు ఓనర్‌ను పిలుచుకొని ఉదయం రమ్మని పంపించారు. ఉరికి వేలాడుతున్న గౌస్‌ఖాన్ :మంగళవారం ఉదయాన్నే టూ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న దుకాణం ముందు గౌస్‌ఖాన్ ఉరేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ మల్లికార్జునగుప్త సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గౌస్‌ఖాన్ నాలుగేళ్లుగా డ్రైవర్‌గా వస్తున్నాడని కారు యజమాని చెప్పాడు. బైపాస్‌రోడ్డులోని శ్రీదేవి ఫంక్షన్హాల్లో బంధువుల పెళ్లి ఉండటంతో కారులో వచ్చామని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతుని కుమారులను సీఐ విచారించారు. కుటుంబ కలహాలు లేవని వారు చెప్పారు. సీసీ కెమెరాల్లో పరిశీలించగా స్టేషన్ ఎదురుగా ఉన్న దుకాణం ముందు ఉదయం 2.45 గంటల వరకు పడుకొని ఉన్నట్లు దృశ్యాలు కనిపించాయి. తర్వాత అదే దుకాణం ముందు ఉరి వేసుకున్నాడు. సీసీ కెమెరాకు మెట్లు అడ్డంగా ఉండటంతో అతను ఉరి వేసుకుంటున్న దృశ్యాలు కనిపించలేదు. మా తండ్రికి ఎలాంటి సమస్యలు లేవు :నంద్యాలోని చాంద్‌వాడలో ఉంటున్నామని, తండ్రి డ్రైవర్‌గా పని చేసేవాడని గౌస్‌ఖాన్ కుమారులు తెలిపారు. 8 ఏళ్ల క్రితం సౌదీకి వెళ్లివచ్చాడని పేర్కొన్నారు. మృతునికి నలుగురు కుమారులున్నారు. మద్యం తాగే అలవాటు ఉందని, తాగొద్దని చెప్పినా వినిపించుకునేవాడు కాదని తెలిసింది. చనిపోయేంత సమస్యలు లేవని, సంపాదన కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదని, తామే అప్పుడప్పుడు డబ్బు ఇస్తుంటామని కుమారులు తెలిపారు. -
చంద్రబాబు చెయ్యేస్తే.. ఎట్లా ఉంటాదో.. తెలుసా..
సాక్షి, ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు చెయ్యేస్తే.. ఎట్లా ఉంటాదో.. తెలుసా.. కళకళలాడుతున్న పరిశ్రమలు మూతపడిపోతాయి. సంతోషంగా సాగుతున్న జీవితం రోడ్డు పాలవుతుంది. ఇందుకు నిదర్శనం ప్రొద్దుటూరు పాల పదార్థాల కర్మాగారం.. అందులో పని చేసిన కార్మికులు. ఆ పరిశ్రమ మూతపడటంతో.. వారు దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. ప్రొద్దుటూరులోని పాల ఉత్పత్తుల కర్మాగారం(ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీ) ఒకప్పుడు దేశ స్థాయిలో ఖ్యాతి గాంచింది. పాలకుల నిర్లక్ష్యం మూలంగా మూతపడింది. దీంతో వేలాది మంది కార్మికులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రొద్దుటూరు ప్రాంత అవసరాలను గుర్తించి ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీ (పీఎంఎఫ్) ఏర్పాటు చేశారు. 1974లో పరిశ్రమ ఏర్పాటుకు పనులు ప్రారంభం అయ్యాయి. 1980 మార్చి 16న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఈ కర్మాగారాన్ని ప్రారంభించారు. పెన్నానది ఒడ్డున 42 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పారు. కర్మాగారం ప్రాంగణంలో ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మించారు. అనతికాలంలోనే విశేష ఖ్యాతి సంపాదించింది. ఓ రకంగా సిరినగరికే వన్నెతెచ్చింది. కార్మికుల కృషితో ఎనలేని కీర్తి గడించడమే కాకుండా.. వందలాది గ్రామాల్లోని రైతులకు ఉపాధి కల్పించింది. గ్రామాల్లో నేటికీ పీఎంఎఫ్ భవనాలు సాక్షాలుగా ఉన్నాయి. మిలిటరీలో పని చేస్తున్న రక్షణ సిబ్బందికి ఇక్కడ తయారు చేసిన పాల ఉత్పత్తులను సరఫరా చేసే వారు. ప్రతి నెలా మిలిటరీ అధికారులు పాల కేంద్రంలోని గెస్ట్‌హౌస్ (అతిథి గృహం)లో విడిది చేసి.. తమకు అవసరమైన సరుకును తీసుకెళ్లే వారు. స్వచ్ఛమైన పాలు లభించడంతోపాటు పెన్నానది తీరాన పరిశ్రమ ఉండటంతో.. ఇక్కడి ఉత్పత్తులు చాలా నాణ్యతగా ఉండేవని పేరు వచ్చింది. కార్మికుల పరిస్థితి దయనీయం ఈ పరిశ్రమలో 350 మంది పర్మినెంట్ ఉద్యోగులతోపాటు మరో 100 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేసే వారు. రోజూ జిల్లాతోపాటు పక్క జిల్లాల నుంచి రైతులు కర్మాగారానికి పాలు సరఫరా చేసే వారు. రోజు వారీగా లక్షా 50 వేల లీటర్లు సరఫరా కాగా.. వీటి ద్వారా పాల ఉత్పత్తులు తయారు చేసేవారు. స్కీం మిల్క్, హోల్ మిల్క్, నెయ్యి, బేబి ఫుడ్ లాంటి వాటిని తయారు చేసి విక్రయించే వారు. బేబి ఫుడ్ ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అయ్యేదని ఉద్యోగులు నేటికీ చెబుతుంటారు. ఎంతో మంది లారీ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా జీవనం సాగించే వారు. ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ప్రస్తుతం రోడ్ల పాలయ్యారు. ఆర్థికంగా ఉన్న కొంత మంది జీవితాలు మెరుగుపడినా.. ఉద్యోగంపైనే ఆధారపడి జీవించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చూసి తట్టుకోలేక చాలా మంది తనువు చాలించారు. ఇప్పటికే 60–70 మంది చనిపోయి ఉంటారని, కర్మాగారంలో పని చేసిన ఓ సెక్యూరిటీ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది జిరాక్స్ సెంటర్లు పెట్టుకోవడం, కూల్ డ్రింక్స్, టీ షాపులు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవితాలను నెట్టుకొస్తున్నారు. చివరికి వీఆర్ఎస్ కూడా సక్రమంగా చెల్లించలేదనే విమర్శలు ఉన్నాయి. వీఆర్ఎస్ చెల్లింపుపై నేటికీ ఉద్యోగులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. చివరికి వీఆర్ఎస్ చెల్లింపులో కూడా చిత్తూరు జిల్లాతో పోల్చితే తమకు అన్యాయం చేశారని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు హయాంలో మూసివేత ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ద్వారా నడుస్తున్న పరిశ్రమను తర్వాతి కాలంలో సహకార సంఘం పరిధిలోకి బదలాయించారు. ప్రభుత్వ అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతోపాటు పర్యవేక్షణ లేమితో 1995 తర్వాత పరిశ్రమను మూసివేశారు. 1997 నాటికి పరిశ్రమను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత చిత్తూరు జిల్లాలోని పరిశ్రమను కూడా మూసివేయడం జరిగింది. నెరవేరని మంత్రి హామీ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రొద్దుటూరుకు పశువైద్య కళాశాల మంజూరైంది. రూ.115 కోట్లతో నిర్మించిన కళాశాల శాశ్వత భవనాలను ప్రారంభించేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 2015 ఏప్రిల్ 7న ప్రొద్దుటూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పీఎంఎఫ్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు. ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై అ«ధ్యయనం చేస్తామని చెప్పారు. అదే నెల 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ బీవీ రమణమూర్తి పరిశ్రమను పరిశీలించి వెళ్లారు. ఆ నివేదిక ఏమైందో నేటికీ తేలలేదు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది. వైఎస్ హయాంలో పాలశీతలీకరణ కేంద్రం చంద్రబాబు నాయుడు హయాంలో మూతపడిన పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని చూసి చలించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 ఆగస్టు 3న ఇదే ప్రాంగణంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 2006 జనవరి 1 నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ పరిశ్రమను సైతం ప్రభుత్వం ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంబశివ డెయిరీకి అప్పగించింది. 2008 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన పశువైద్య కళాశాలను.. ఈ పరిశ్రమలోని భవనాల్లో తాత్కాలికంగా నడిపారు. 2015 వరకు ఇందులోనే కళాశాలను నిర్వహించి తర్వాత గోపవరం వద్దకు మార్చు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంలేకపోవడం వల్లే.. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్లే 1995లో పీఎంఎఫ్ మూతపడింది. స్థానిక రాజకీయాల ప్రభావం ఉన్నా.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు సహకార రంగాలపై సరైన అభిప్రాయం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారుల పరిశ్రమలతోపాటు చక్కె పరిశ్రమలను మూసివేశారు. అప్పటి వరకు జిల్లాలో ప్రైవేటు పాడి పరిశ్రమలు లేవు. తర్వాతే హెరిటేజ్ డెయిరీ వెలుగులోకి వచ్చింది. పీఎంఎఫ్ ఉన్న సమయంలో జిల్లా వ్యాప్తంగా 380 సొసైటీలు ఉండేవి. వాటి ద్వారా రైతులతోపాటు నిరుద్యోగులకు ఉపాధి లభించేది. పరిశ్రమలో పని చేసే కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ.. అప్పట్లో నేను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా 12వ రోజు రాత్రి పోలీసులు ఎత్తివేశారు. మళ్లీ రెండు రోజులు కలెక్టరేట్‌ను నిర్బంధించాం. రూ.4.92 కోట్ల బకాయిలను ఇప్పించాం. – జి.ఓబులేసు, సీపీఐ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు. ఒకప్పుడు వెలుగు వెలిగింది పీఎంఎఫ్ రాష్ట్రంలోనే ఒకప్పుడు వెలిగిపోయింది. తర్వాత కాలంలో మూతపడింది. ఉద్యోగులు రోడ్ల పాలయ్యారు. ఇంతటి దయనీయ పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. – ఎం.మాబువల్లి, రిటైర్డు సెక్యూరిటీ గార్డు, పీఎంఎఫ్ ఉత్పత్తులు నాణ్యతగా ఉండేవి పరిశ్రమలో తయారు చేసిన ఉత్పత్తులు చాలా నాణ్యతగా ఉండేవి. దూర ప్రాంతాల నుంచి వచ్చి వీటిని తీసుకెళ్లేవారు. ఇక్కడి వాతావరణం కూడా ఇందుకు కారణం. – ఎన్.లింగయ్య, ల్యాబ్ అసిస్టెంట్, పీఎంఎఫ్ సీఎంను కలిసినా ఫలితం లేదు 1997 నుంచి 1999 వరకు పని చేసినందుకు గాను 22 నెలల పూర్తి వేతనాన్ని ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారులు పలుకక పోవడంతో స్వయంగా తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి సమస్యను విన్నవించాం. తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు జిల్లాలోని ముఖ్య నాయకులను కలిశాం. ఎవరూ పట్టించుకోలేదు. పైగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వలేమని కోర్టు ద్వారా తెలిపింది. దీనిపై కండెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్లాం. – జి.సూర్యనారాయణ, పీఎంఎఫ్ ప్లాంట్ ఆపరేటర్, ప్రొద్దుటూరు. ఎన్నో కుటుంబాలు దీన స్థితిలో ఉన్నాయి పీఎంఎఫ్లో పని చేసిన ఎన్నో కుటుంబాలు నేడు దీనస్థితిలో ఉన్నాయి. ఎవరూ కనికరించే పరిస్థితిలో లేరు. 300 మందికి సుమారు రూ.3 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాం. – కె.శ్రీనివాసులు, పీఎంఎఫ్ ఉద్యోగి, ప్రొద్దుటూరు. -
టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, వైఎస్సార్: జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి అనుచరులు బాహాబాహీకి దిగారు. రాజుపాలెం మండలం చిన్నశెట్టిపాలెంలో సాగునీటి మళ్లింపు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి 50 లక్షల రూపాయల వ్యయంతో చిన్నశెట్టి పాలెంలో సాగునీటి కోసం పైపు లైన్ పనులు చేపట్టారు. అయితే అదే గ్రామానికి చెందిన వరదరాజులరెడ్డి అనుచరుడు నరసింహారెడ్డి తన పొలానికి నీటి మళ్లింపు కోసం పైపులు అమర్చడం గొడవకు దారితీసింది. ఘటన స్థలానికి చేరుకున్న పరిస్థితిని అదుపులో తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తరలించి సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే తెలుగు తమ్ముళ్లు పోలీసు స్టేషన్ బయట గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో లాఠీ చార్జీ చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇరువర్గాలకు చెందిన నేతలు పలుమార్లు ఘర్షణకు దిగారు. -
త్రీడీ సినిమా చూస్తుండగా గుండెపోటు
ప్రొద్దుటూరు క్రైం : త్రీడీ సినిమా చూస్తూ ఒక వ్యక్తి గుండె పోటుతో మృతి చెందిన సంఘటన ప్రొద్దుటూరులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు శ్రీనివాసనగర్‌కు చెందిన పెద్దపసుపల బాషా (43) బేల్దారి పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అతను సోమవారం సాయంత్రం సినీహబ్ థియేటర్లో అవేంజర్ త్రీడీ సినిమాకు వెళ్లాడు. సినిమా వదిలాక అందరూ లేచి బయటికి వెళ్తున్న సమయంలో అతను లేవకుండా సీట్లోనే ఉండిపోయాడు. పక్కనున్న వారు ఎంత పిలిచినా లేవలేదు. వెంటనే థియేటర్ నిర్వాహకులు అక్కడికి చేరుకొని అతన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలియడంతో భార్య ఖాదర్‌బీ, పిల్లలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన భర్తకు నాలుగేళ్ల నుంచి గ్యాస్ట్రబుల్ మాత్రమే ఉందని, ఇతర సమస్యలు ఏవీ లేవని భార్య పోలీసులకు తెలిపింది. త్రీడీ సినిమాను అందరూ కళ్ల జోడు పెట్టుకొని చూస్తారు. అందులోని కొన్ని దృశ్యాలు మీదికి వచ్చి పడేలా ఉంటాయి. కొత్తగా త్రీడీ సినిమా చూసే వారికి కొన్ని దృశ్యాలు భయాన్ని కలిగిస్తాయి. ఈ దృశ్యాలు చూస్తూ అతను భయపడి గుండె పోటుతో చనిపోయాడా లేక సాధారణంగానే గుండె పోటు వచ్చి చనిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నారాయణ తెలిపారు. -
పసిడి పురి...ఊపిరి పీల్చుకో
గ్యాంగ్‌స్టర్ సునీల్ పేరు చెబితే.. ప్రొద్దుటూరు వాసులు గడగడలాడే వారు... ఇక ఆయన నుంచి ఫోన్ వచ్చిందంటే వణికిపోయే వారు... ఎందుకంటే అతడి అరాచకాలు అలా ఉండేవి... డబ్బు కోసం శ్రీమంతుల్ని బెదిరించేవాడు... ఇవ్వకపోతే వారి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసే వాడు... అప్పటికీ ఇవ్వని పక్షంలో చంపేసే వాడు... దీంతో చాలా మందికి కంటి మీద కునుకు ఉండేది కాదు... ఈ క్రమంలో సునీల్ చనిపోవడంతో వారంతా ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రొద్దుటూరు క్రైం : రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సునీల్.. పేరు మోసిన నేరస్తుడు. అతను ఇంటర్మీడియట్‌ను మధ్యలో వదిలేశాడు. జులాయిగా తిరిగే యువకులతో బ్యాచ్ ఏర్పాటు చేసుకుని.. పెద్ద నెట్వర్క్ నడిపాడు. మారుమూల గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రతి చోట తన అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యలో చదువు మానేసిన వారే ఎక్కువగా ఉండే వారు. మందు, బిరియాని, ఖరీదైన వస్తువులను కొనిస్తూ వారిని ఆకర్షించాడు. ముఖ్య అనుచరులైన వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి సినీ రంగుల ప్రంపంచాన్ని కూడా చూపించాడు. ఇలా యువకులను ఆయుధంగా చేసుకొని సునీల్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. యువకులే ఆయుధంగా.. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన మండ్ల వెంకట సునీల్‌కుమార్ తల్లి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తండ్రి, చెల్లెలు ఉన్నారు. సునీల్ కొన్ని నెలలు ఆటో డ్రైవర్‌గా పని చేశాడు. ఆటో నడుపుకునే సమయంలోనే ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయం ఏర్పడింది. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కొన్ని సార్లు పోలీసులకు దొరికాడు. స్టేషన్‌కు వెళ్లడం.. బయటికి రావడం షరామామూలే అయింది. కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి లంచాలు ఇచ్చి.. వారి నుంచి సహకారం పొందే వాడు. క్రమేణ కిడ్నాప్‌లకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న, మానేసిన యువకులను చేరదీశాడు. వీరి ద్వారా కిడ్నాప్‌లు చేయడం ప్రారంభించాడు. ప్రొద్దుటూరులోనే 50 మంది దాకా అనుచరులను ఏర్పరుచుకున్నాడు. సీమ వ్యాప్తంగా స్థానికంగా ఉన్న బ్యాచ్‌లతో పరిచయాలు పెంచుకుని.. వారిని తన గ్యాంగ్‌లో కలుపుకొన్నాడు. ఇలా దాదాపు 400 మందితో తన గ్యాంగ్‌ను విస్తరింప చేశాడు. శ్రీమంతులపై కన్ను సునీల్ టార్గెట్ అంతా డబ్బున్న వారే. వారిని బెదిరించి, వేధింపులకు గురి చేసే వాడు. సీమ వ్యాప్తంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాడు. అతడిది ప్రొద్దుటూరే కావడం.. ఈ ప్రాంతంలో శ్రీమంతులు అధికంగా ఉండటంతో ఎక్కువగా దృష్టి సారించాడు. సునీల్ దందాలను కర్నూలు జిల్లా జలదుర్గానికి చెందిన అప్పటి ఎస్ఐ జయన్న బయట పెట్టగలిగారు. ఆయన విచారణలోనే ప్రొద్దుటూరులోని పలువురు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలను కిడ్నాప్ చేయాలని సునీల్ వ్యూహ రచన చేసినట్లు తెలిసింది. ఆ ఎస్ఐ ఇచ్చిన సమాచారంతో ప్రొద్దుటూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రొద్దుటూరులోని ప్రముఖ బంగారు వ్యాపారితోపాటు ఆయన కుమారుడ్ని కిడ్నాప్ చేయడానికి స్కెచ్ వేశాడు. హైదరాబాద్‌తోపాటు ప్రొద్దుటూరులోని ఆయన ఇంటి వద్ద పలుమార్లు ప్రయత్నించి, విఫలమయ్యాడు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలింది. ప్రొద్దుటూరుతోపాటు జిల్లాలో సునీల్ బాధితులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణ భయంతో వీరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సునీల్ ఆత్మహత్య వార్త తెలియడంతో వీరంతా ఊపిరి పీ ల్చుకున్నారు. ప్రొద్దుటూరులోని వన్‌టౌన్‌లో మూడు కేసులు, త్రీటౌన్‌లో మూడు, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు సునీల్‌పై నమోదయ్యాయి. సీమ వ్యాప్తంగా 19 కేసులు నమోదయ్యాయి. సునీల్ దందాలు బయట పడిందిలా.. ప్రొద్దుటూరుకు చెందిన వాసురాంప్రసాద్ తాడిపత్రిలోని వంశీ మెడికల్ స్టోర్ నిర్వహిస్తుండే వాడు. వాసురాంప్రసాద్ తండ్రికి సునీల్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆయన పట్టించుకోక పోవడంతో 2013 ఫిబ్రవరిలో జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో వాసురాంప్రసాద్‌ను హత్య చేశారు. ఈ కేసును ఎస్ఐ జయన్న చాలెంజ్‌గా తీసుకున్నారు. అప్పటికే ప్రొద్దుటూరులో డాబాపై దాడి చేసిన కేసు సునీల్‌పై నమోదైంది. వాటి ఆధారంగా ఎస్ఐ జయన్న.. సునీల్ ముఠా సభ్యులపై ఆరా తీశారు. డాబా కేసులో ఇద్దరు యువకులు ప్రొద్దుటూరు సబ్జైల్లో ఉంటూ బెయిల్‌పై బయటికి రావడంతో ఎస్ఐ వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాసూరాం ప్రసాద్‌ను హత్య చేసినట్లు వారు అంగీకరించారు. ఈ కేసులో మరో 10 మంది ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. వారంతా హైదరాబాద్‌లో ఉన్నట్లు టవర్ లొకేషన్న్ద్వారా తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ సునీల్‌తోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని కర్నూలుకు తరలించారు. 10 కిడ్నాప్‌లు చేసినట్లు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చేలోపే సునీల్ ఎస్ఐకి వివరించాడు. జలదుర్గం ఎస్ఐ దర్యాప్తు ఫలితంగా గ్యాంగ్‌లీడర్, కిడ్నాపర్ సునీల్ దందాలు బయట పడ్డాయి. వాసురాంప్రసాద్‌ను హత్య చేసిన కేసులో సునీల్‌కు జీవిత ఖైదు పడింది. ఈ శిక్షను కడప సెంట్రల్ జైలులో అనుభవిస్తున్న సునీల్ శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రొద్దుటూరులోని శ్రీమంతుల్లో భయం వీడింది. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు రాయచోటి అర్బన్: కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ సునీల్‌కుమార్‌ను అధికారులే పథకం ప్రకారం అంతమొందించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఈశ్వర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. నేరాలకు పాల్పడుతున్న సునీల్‌కు.. చాలా మంది పోలీస్ అధికారులు సహకరించి అతడి ద్వారా లబ్ధి పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే తమ పాత్ర వెలుగులోకి వస్తుందని భావించి.. వారే తుదముట్టించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. -
ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
-
ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాగునీటి సమస్యలపై సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జలదీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించిన రాచమల్లు ప్రాసాద్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ.. వైఎస్ఆర్ సీపీ నేతలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. సమస్యలపై గొంతెత్తకుండా అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.