సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సొంత పంచాయతీ కామనూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరద సోదరులు నంద్యాల రాఘవరెడ్డి, భార్గవరెడ్డి, హనుమంతరెడ్డితోపాటు మరికొంతమంది కలిసి వైఎస్సార్‌సీపీ నాయకుడు నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపైకెళ్లి దౌర్జన్యం చేశారు. సెల్‌ఫోన్ లాక్కుని మహిళలను దూషించి భయాందోళనకు గురిచేశారు. ఓటింగ్ ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
గత 40 ఏళ్లుగా కామనూరు గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకుండా వరదరాజులరెడ్డి వర్గీయులు అడ్డుపడుతూ వచ్చారు. 1,700 ఓట్లు గల పంచాయతీలో కామనూరు, రాధానగర్, నక్కలదిన్నె గ్రామాలున్నాయి. ప్రస్తుతం సర్పంచ్ పదవిని బీసీ కేటగిరీకి కేటాయించడంతో వైఎస్సార్ అభిమాని షేక్ కరీమూన్ నామినేషన్ వేశారు. సర్పంచ్‌తోపాటు మొత్తం 8 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ పంచాయతీలోనే ఎన్నికలు జరిపేలా చేస్తారా అని వరద వర్గీయులు గుంపులుగా వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment