శభాష్‌.. పోలీస్‌ | DSP Sudhakar Helps Poor Family in Proddatur | Sakshi
Sakshi News home page

శభాష్‌.. పోలీస్‌

Published Sat, Jun 13 2020 1:17 PM | Last Updated on Sat, Jun 13 2020 1:17 PM

DSP Sudhakar Helps Poor Family in Proddatur - Sakshi

దుర్గాప్రసాద్‌ దంపతులకు నగదు ఇస్తున్న డీఎస్పీ సుధాకర్‌

ప్రొద్దుటూరు క్రైం : నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసి పోలీసులు శభాష్‌ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో నివాసం ఉంటున్న తిరుమల దుర్గాప్రసాద్‌కు మానసిక దివ్యాంగులైన ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అతను పనికి వెళ్లలేకపోయాడు. దీంతో కొన్ని రోజుల నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పలువురి సూచన మేరకు అతను శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫోన్‌ చేసి..

తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి విన్నవించుకున్నాడు. ఎస్పీ సూచన మేరకు డీఎస్పీ లోసారి సుధాకర్, రూరల్‌ సీఐ విశ్వనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ సునీల్‌రెడ్డి శుక్రవారం రాత్రి దుర్గాప్రసాద్‌ ఇంటికి వెళ్లారు. రూ. 5 వేల నగదుతోపాటు రెండు బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్‌తో మాట్లాడి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా కృషి చేస్తామని దుర్గాప్రసాద్‌తో అన్నారు. అలాగే బ్యాంకు అధికారులతో మాట్లాడి సొంత ఆటో కోసం రుణం ఇచ్చేలా మాట్లాడుతామని చెప్పారు. మానవత్వంతో తమ కుటుంబాన్ని ఆదుకున్న ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement