poor family
-
మంచి కాదు ముంచే ప్రభుత్వం.. గుర్తు పెట్టుకోండి మేము ఓట్లు వేస్తే గెలిచారు
-
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్‌కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
Hassan Nasrallah: అరబ్బుల హీరో
హెజ్బొల్లా గ్రూప్‌నకు సుదీర్ఘకాలం సారథ్యం వహించిన షేక్ హసన్ నస్రల్లా ప్రస్థానం ముగిసిపోయింది. నిరుపేద కుటుంబంలో జని్మంచి, ఉన్నత స్థాయికి చేరుకొని, లక్షల మందిని అభిమానులుగా మార్చుకున్న నస్రల్లా మరణం హెజ్బొల్లాకు తీరని నష్టమే అని చెప్పొచ్చు. ఆయన 1960 ఆగస్టు 31న ఉత్తర లెబనాన్‌లో షియా ముస్లిం కుటుంబంలో జని్మంచారు. కూరగాయలు విక్రయించే నస్రల్లా తండ్రికి మొత్తం 9 మంది సంతానం. అందరిలో పెద్దవాడు నస్రల్లా. ఆయన బాల్యం తూర్పు బీరూట్‌లో గడిచింది. మత విద్య అభ్యసించారు. చిన్నప్పటి నుంచే మత గ్రంథాలు విపరీతంగా చదివేవారు. తనకు కావాల్సిన పుస్తకాల కోసం సెకండ్–హ్యాండ్ బుక్ షాపుల్లో గాలించేవారు. షియా పండితుడు మూసా అల్–సదర్‌ను ఆరాధించేవారు. రాజకీయాలపై, షియా వర్గం సంక్షేమంపై నస్రల్లాకు చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. తమవాళ్ల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. 32 ఏళ్లకే నాయకత్వ బాధ్యతలు 1975లో అంతర్యుద్ధ సమయంలో నస్రల్లా కుటుంబం దక్షిణ లెబనాన్‌కు తరలివచి్చంది. ఆయన 1989లో ఇరాన్‌లోని నజఫ్ సిటీలో కొంతకాలం మత సిద్ధాంతాలు అభ్యసించారు. లెబనాన్‌కు తిరిగివచ్చి 16 ఏళ్ల వయసులో షియా రాజకీయ, పారామిలటరీ గ్రూప్ అయిన అమల్ మూవ్మెంట్లో చేరారు. ఆ సంస్థలో చురుగ్గా పనిచేశారు. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ)ను అంతం చేయడానికి 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో పీఎల్ఓకు భారీ నష్టం వాటిల్లింది. ప్రతీకారమే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ కార్యాలయంపై షియా ఇస్లామిక్‌వాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో చాలామంది ఇజ్రాయెల్ అధికారులు మరణించారు. అనంతరం షియా ఇస్లామిక్వాదులతో హెజ్బొల్లా గ్రూప్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటు వెనుక సయ్యద్ అబ్బాస్ ముసావీతోపాటు నస్రల్లా కీలక పాత్ర పోషించారు. 1992లో ఇజ్రాయెల్ దాడిలో ముసావీ మరణించారు. దీంతో 32 ఏళ్ల వయసులో హెజ్బొల్లా నాయకత్వ బాధ్యతలను నస్రల్లా స్వీకరించారు. హెజ్బొల్లా శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. లెబనాన్ సైన్యం కంటే హెజ్బొల్లా పవర్ఫుల్ అనడంలో అతిశయోక్తి లేదు. మధ్యప్రాచ్యంలోని అరబ్ దేశాల్లో నస్రల్లా పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. హెజ్బొల్లాకు ఇరాన్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచింది. ఆయుధాలు, డబ్బు అందజేసింది. హమాస్‌తోపాటు మధ్యప్రాచర్యంలోని పలు ఉగ్రవాద సంస్థలకు హెజ్బొల్లా శిక్షణ ఇచి్చంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువు ఇజ్రాయెల్‌పై నస్రల్లా అలుపెరగని పోరాటం సాగించారు. పూర్తి అంకితభావంతో పనిచేశారు. 2000 సంవత్సరం నాటికల్లా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలను తరిమికొట్టారు. అరబ్ ప్రపంచానికి ఒక ఐకాన్‌గా మారారు. 1997లో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో నస్రల్లా కుమారుడు హదీ మరణించాడు. 1997లో హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. 2006లో ఇజ్రాయెల్‌పై హెచ్‌బొల్లా సాగించిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లెబనాన్‌లో 34 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయింది. నస్రల్లాను పలు దేశాలు హీరో అంటూ కీర్తించాయి. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నస్రల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. గత 20 ఏళ్లలో ఆయన చాలా అరుదుగానే బహిరంగంగా కనిపించారు. టీవీ, రేడియో ద్వారా తన అనుచరులకు సందేశం చేరవేసేవారు. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడిచేసే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో నస్రల్లా ఎక్కువగా అండర్ గ్రౌండ్ బంకర్లలోనే ఉండేవారు. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాను నస్రల్లా తమ బద్ధ శత్రువుగా ప్రకటించారు. క్యాన్సర్ లాంటి ఇజ్రాయెల్‌ను సమూలంగా నాశనం చేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. నస్రల్లా వేషధారణ షియా మత బోధకుడిలాగే ఉండేది. వేలాది మంది హెజ్బొల్లా సాయుధులను ముందుకు నడిపించే నాయకుడంటే నమ్మడం కష్టం. ఉర్రూతలూగించే ప్రసంగాలకు ఆయన పెట్టిందిపేరు. హెజ్బొల్లాను రాజకీయ శక్తిగా కూడా మార్చారు. 2005లో లెబనాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో హెజ్బొల్లా పోటీ చేసింది. రెండు సీట్లు గెలుచుకుంది. అంతేకాదు మంత్రివర్గంలో సైతం హెజ్బొల్లా చేరిందంటే నస్రల్లా చాతుర్యం అర్థం చేసుకోవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
దయాగుణ సంపన్నుడు
పేదింటి భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలు ఆకలితో ఉన్నారు. ‘పిల్లలు ఆకలితో ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవు. సహాయం చేయండి’ అని ఆశిష్ అనే యువకుడిని అడిగారు ఆ దంపతులు. పదో పరకో వారి చేతిలో పెట్టి తన దారిని తాను వెళ్లిపోలేదు ఆశిష్. దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కు తీసుకువెళ్లి వారు కోరిన పదార్థాలు తినిపించాడు. ఆ తరువాత వారిని ఆటో ఎక్కించి డ్రైవర్‌కు తానే డబ్బులు ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియా యూజర్ల నుంచి భారీ స్పందన లభించింది. పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే పదిలక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే వారి ఆకలి తీర్చడం మాత్రమే కాదు మీ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు అని ధైర్యం చెప్పడం కూడా’ అని రాశాడు ఆశిష్. ‘దయాగుణానికి ఉన్న గొప్పదనం ఏమిటంటే వినికిడి శక్తి లేని వారు కూడా వినగలరు. కంటిచూపు లేని వారు కూడా చూడగలరు. దయాగుణాన్ని మించిన సంపద లేదు’ అని ఒక యూజర్ రాశాడు. -
ఇస్రో చైర్మన్ ఆత్మకథ
తిరువనంతపురం: ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆత్మకథ రాశారు. ‘నిలవు కుడిచ సింహగల్ (వెన్నెల గ్రోలిన సింహాలు)’ పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుంది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్లు ఆయన వెల్లడించారు. అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఆయన ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఆయన ఇందులో హృద్యంగా వివరించారు. చంద్రయాన్ మిషన్ విజయం తనను ఆత్మకథ రచనకు పురిగొల్పిందని చెప్పారాయన. ఇంజనీరింగ్ కాలేజీకి పాత డొక్కు సైకిల్ మీద వెళ్లిన వైనం తదితరాలను పుస్తకంలో పొందుపరిచారు. -
రేపు పేదల గృహ నిర్మాణాలకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ
-
పేద కుటుంబాల ఇళ్ల స్థలాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
మరోసారి వాత్సల్యం చూపిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
-
ఆపత్కాలంలో ఆదుకున్న ఆత్మ బంధువు
-
కష్టాలు చుట్టుముట్టినా.. చెదరని బాలుడి సంకల్పం.. చెల్లిని భుజాన ఎత్తుకొని!
సాక్షి, మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఏ పిల్లలైనా ఆడిపాడడం తప్పా మరో లోకం తెలీదు. కానీ, చిన్నతనంలోనే తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా బావించి బాధ్యతలను తన భుజంపై మోస్తూ.. చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ.. చదువు కోసం పోరాటం చేస్తున్న 11ఏళ్ల బాలుడే వినయ్. ఏ చీకూచింతా లేని ఆ బాలుడి కుటుంబంలో భవన కూలీగా పనిచేసే తండ్రి ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుంచి కింద పడి నడుము విరిగిపోవడంతో కష్టాలు చుట్టుముట్టాయి. తండ్రికి తల్లిలా మారి.. బాలుడి తండ్రి మల్లయ్య భవన నిర్మాణ కూలీగా పనిచేసేవాడు. అయితే, పని చేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడడంతో మల్లయ్య వెన్నుముక విరిగిపోయింది. నాటి నుంచి మంచంపై నుండి కదల్లేని పరిస్థితి. దీంతో ఇళ్లు గడిచేందుకు ఆదాయం లేకపోవడంతో తల్లి లక్ష్మీ చేసే కష్టం మాత్రమే వీరికి ప్రధాన ఆదాయమైంది. తల్లి ఉదయం కూలి పనికి వెళ్తే తండ్రిని, ఏడాదిన్నర వయస్సున చెల్లిని ఇంటి వద్దే ఉండి చూసుకునే బాధ్యత వినయ్ మీదనే పడింది. ఈ విషయాన్ని కొద్దిగా ఆలస్యంగా ఉపాధ్యాయులు గుర్తించారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి అన్నం తినలేని పరిస్థితి, చిన్న వయస్సు ఉన్న చెల్లి అన్నం తినలేని పరిస్థితి. వారి ఇద్దరికి వినయ్ క్రమం తప్పకుండా అన్నం తినిపించి, సాయంత్రం తల్లివచ్చే వరకు వారి ఆలనా పాలన చూసుకునే వాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్న కానీ చదువుకోవాలని ఉత్సాహం ఉన్న వినయ్ వీరిద్దరినీ చూసుకుటూ చదువుపై ఉన్న మక్కువతో బడికి వస్తున్నాడని గ్రహించారు. దీంతో తన చెల్లిని తనతో పాటు స్కూల్‌కు తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు అనుమతించారు. అంతేగాక తండ్రి ఇబ్బందులు తీర్చేందుకు వినయ్ పాఠశాల మధ్యలో వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. ఆదుకునేవారు లేక.. అప్పులు చేసి వైద్యం తండ్రి మలయ్యకు ప్రమాదం జరిగిన తర్వాత కార్మిక శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుండి సహాయం అందలేదు. ప్రమాదం జరిగిన ఇంటి యజమాని కొంత డబ్బుమాత్రమే ఇచ్చారు. దీంతో వైద్యానికి కొంత మేర డబ్బు సరిపోయిన మిగిలిన డబ్బును అప్పు రూపంలో సమకూర్చారు. దీంతో కుటుంబం అప్పుల పాలైంది. ఇప్పటికి గాయాలు మానకపోవడంతో వారానికి ఓ సారి రూ.2వేల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ పింఛన్ కోసం దరఖాస్తులు చేశారు. ఇప్పటికి పింఛన్ రాలేదు. ఇళ్లు గడవలేని పరిస్థితి ఇబ్బందులు, భార్యా పిల్లలను పోషించేందుకు మల్లయ్య దిక్కుతోచక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ జాగాను అమ్మేశారు. తన కన్న కొడుకును అందరికంటే బాగా ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలన్న తన కోరిక నెరవేరకపోగా, పిల్లలు తనమూలంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయాడు. తల్లీ లక్ష్మీ, కొడుకు నవీన్ చెల్లిని భుజాన ఎత్తుకొని స్కూలుకి.. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మణికొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు వినయ్. మల్లయ్య, లక్ష్మి దంపతులకు వినయ్‌తోపాటు ఏడాదిన్నర కూతురు ఉంది. అయితే, మొదటి నుంచి బాలుడికి చదువుకోవాలని ఉత్సాహం ఎక్కువ. పాఠశాలకు విద్యార్థులందరూ ఒక్కరే వెళ్తే వినయ్ మాత్రం తనతో పాటు తన ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్న తన చెల్లి గౌతమిని కూడా తనతో పాటు తరగతి గదిలోకి తీసుకెళ్లే వారు. మధ్యాహ్న భోజనం తనకు పెట్టిన భోజనంలో చెల్లికి కూడా తినిపించే వాడు వినయ్. ఈ విషయంపై పాఠశాల ఉపాధ్యాయులు ఓ సారి మందలించారు. అంత చిన్న వయస్సు ఉన్న పాపను పాఠశాలకు తీసుకురావద్దని వాదించారు. కానీ వినయ్ నుంచి ఎటువంటి సమాధానం వచ్చేది కాదు. చివరకు విషయం ఏంటని తెలుసుకునే ఆరా తీసిన ఉపాధ్యాయులకు గుండె తరుక్కు పోయే విషయాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. బడి మానిపిస్తారేమోనని.. అమ్మ కూలి పనికి వెళ్లడంతో ఇంటి వద్ద నాన్నకు ఏవైనా ఇబ్బందులు వచ్చినా నేనే చూసుకోవాలి. చెల్లి చిన్నది కావడంతో ఆమెను పాఠశాలకు తీసుకెళ్లి అన్నం పెట్టాలి. ఏవైనా ఇబ్బందులు వస్తే చూసుకోవాలి. కొన్ని రోజులు ఇంటి వద్దే ఉన్నా. దీంతో బడి పూర్తిగా మానిపిస్తారేమో అనుకుని, బడికి వెళ్తూ చెల్లిని, నాన్నను చూసుకుంటున్నారు. – వినయ్, విద్యార్థి సహాయం చేసి ఆదుకోండి వెన్నెన్నుముక విరిగాక రెండు కాళ్లు పనిచేయడం లేదు. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం. అయినా ఇప్పటికి గాయాలు మానలేదు. సమస్య తీరలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా. దీంతో కూలిపనికి వెళ్లి ఒక్కదాన్నే కుటుబాన్ని పోషిస్తున్నా. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దమనసుతో ప్రభుత్వం, సంస్థలు, వ్యక్తులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాం. – లక్ష్మీ, వినయ్ తల్లి -
పేదింట్లో వైద్య కాంతులు.. ఆ కల వాళ్లని ఇంత వరకు నడిపించింది!
సాక్షి,మల్యాల(చొప్పదండి): నిరుపేద కుటుంబాల విద్యార్థులు చదువులో సత్తాచాటి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సీటు సాధించి తమ కలలను సాకారం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా లక్ష్యసాధనకు నిరంతరం తపించారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన వైద్య విద్య వారి దరికి చేరింది. కష్టసుఖాలు.. తాము అనుభవించిన పేదరికాన్ని పిల్లలు అనుభవించకూడదనే తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా.. సమాజానికి సేవ చేసే ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనే తమ కలలను నెరవేర్చుకున్నారు. పేదరికాన్ని రుచి చూస్తూ పెరిగిన పిల్లలు వైద్య వృత్తి బాటలో పయనిస్తూ నిరుపేదలకు చేయూతనందిస్తామంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బింగి నర్సయ్య– మంజుల కూతురు మనీషా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వైద్య విద్యవైపు అడుగులు వేసింది. తండ్రి బట్టల వ్యాపారి, తల్లి బీడీ కార్మికురాలు. నూకపల్లి మోడల్స్కూల్లో పదో తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్లో 985 మార్కులు సాధించింది. తండ్రి గ్రామాల్లో తిరుగుతూ బట్టల వ్యాపారం, మరోవైపు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కూతురు మనీషా ఈ ఏడాది నీట్లో 543 మార్కులు సాధించి వైద్యురాలిగా తన కల నెరవేర్చుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. చిన్న కూతురు అనూషను సైతం నీట్ కోసం సిద్ధం చేస్తున్నారు. విరిసిన దళిత కుసుమం.. మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబం పద్మ–గంగయ్యల ఒక్కగానొక్క కూతురు నిఖిత. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టాడు. ఆది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. పదో తరగతిలో 9.3 జీపీఏ, ఇంటర్లో 953 మార్కులు సాధించింది. గతేడాది వైద్య విద్యలో సీటు సాధించి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకుంది. వైద్య విద్య అడ్మిషన్‌కు కూడా డబ్బులు కట్టలేని స్థితిలో నిఖితకు “సాక్షి’ తోడుగా నిలవగా.. డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకుంది. తనలాంటి పేద విద్యార్థులకు చేయూతనందిస్తానని, నిరుపేదలకు ఉచితంగా సేవలందిస్తానని నిఖిత చెబుతోంది. తండ్రి కల నెరవేర్చిన తనయ మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి మల్లేశం కూతురు అలేఖ్య. గ్రామంలో రెండు దశాబ్దాలుగా మల్లేశం ఆర్ఎంపీగా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య గీత బీడీ కార్మికురాలు. తన కూతురును డాక్టర్ చేయాలనే తండ్రి ఆశయానికి తోడు తనయ కష్టపడి చదివి ఉస్మానియాలో ఉచితంగా సీటు సాధించింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్లో 988 సాధించింది. మూడేళ్లక్రితం ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు సాధించి, తండ్రి ఆశయాన్ని, తన కలను నెరవేర్చుకుంది. ఆది నుంచి ముందువరుసలో.. మల్యాల మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ రెండు దశాబ్దాలుగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. డాక్టర్ కావాలంటూ చిన్నప్పటి నుంచి తన కుమారుడు గాయత్రినందన్కు బీజాలు నాటాడు. తండ్రి మాటలకు అనుగుణంగా గాయత్రినందన్ డాక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆదినుంచి ప్రణాళికతో చదివి పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 988 మార్కులు సాధించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే నీట్లో 583 మార్కులు సాధించి ఇటీవలే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచితంగా సీటు సాధించాడు. మట్టి పరిమళం కల్పన మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన మిర్యాల మల్లారెడ్డి– వనిత దంపతులది వ్యవసాయ కుటుంబం. డాక్టర్ కావాలనే కూతురు కల్పన కలకు బాసటగా నిలిచారు. చదువుకోసం వ్యవసాయ భూమి అమ్మేందుకుసైతం వెనకాడబోమని భరోసానిచ్చారు. తల్లిదండ్రుల భరోసాతో కల్పన మరింత కష్టపడి చదివింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్ మొదటి సంవత్సరంలో 436/440 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకులో నిలిచింది. అదే ఉత్సాహంతో ఇంటర్లో 986 మార్కులు సాధించింది. కష్టపడి చదివి ఉచితంగా వైద్య కళాశాలో సీటు సాధించి ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతోంది. గ్రామంలో నెట్వర్క్ లేకపోతే చదువుకు ఆటంకం కలుగవద్దని నేరుగా శ్మశానంలో కూర్చుండి కూడా ఆన్లైన్ తరగతులు వింటూ చదువును కొనసాగించి, డాక్టర్ కావాలనే తనలోని దృఢ సంకల్పాన్ని చాటి చెప్పింది. -
మానవత్వం చాటుకున్న మంత్రి హరీశ్
సాక్షి, సిద్దిపేట : పదేళ్ల క్రితం ఆ ఇంటి పెద్ద గుండె ఆగిపోయింది. ప్రకృతి పగబట్టినట్టు వర్షాల కారణంగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న ఇల్లు కాస్తా కూలిపోయింది. మగదిక్కులేకుండా వయసులో ఉన్న కూతురుతో తల్లి దొంతరబోయిన బాలవ్వ సర్కారు బడి లో తలదాచుకుంది. సిద్దిపేట జిల్లా చిన్నకో డూరు మండలం రామంచకి చెందిన వీరి దీనస్థి తిని సెప్టెంబర్ 23న ‘సారూ.. సాయం చేయరూ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. నిరుపేదల గోడు విని సొంత ఖర్చుతో ఇల్లు కట్టించారు. శనివారం దగ్గరుండి తల్లీకూతుళ్లకు కొత్త బట్టలు పెట్టి గృహ ప్రవేశం చేయించారు. నాడు కూలిన ఇల్లు.. నేడు కొత్తగా నిర్మించిన ఇల్లు -
శభాష్.. పోలీస్
ప్రొద్దుటూరు క్రైం : నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో నివాసం ఉంటున్న తిరుమల దుర్గాప్రసాద్‌కు మానసిక దివ్యాంగులైన ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్డౌన్ కారణంగా అతను పనికి వెళ్లలేకపోయాడు. దీంతో కొన్ని రోజుల నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పలువురి సూచన మేరకు అతను శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫోన్ చేసి.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి విన్నవించుకున్నాడు. ఎస్పీ సూచన మేరకు డీఎస్పీ లోసారి సుధాకర్, రూరల్ సీఐ విశ్వనాథ్‌రెడ్డి, ఎస్ఐ సునీల్‌రెడ్డి శుక్రవారం రాత్రి దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లారు. రూ. 5 వేల నగదుతోపాటు రెండు బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్‌తో మాట్లాడి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా కృషి చేస్తామని దుర్గాప్రసాద్‌తో అన్నారు. అలాగే బ్యాంకు అధికారులతో మాట్లాడి సొంత ఆటో కోసం రుణం ఇచ్చేలా మాట్లాడుతామని చెప్పారు. మానవత్వంతో తమ కుటుంబాన్ని ఆదుకున్న ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
మంత్రి కేటీఆర్ చొరవతో పేద దంపతులకు చేయూత
నేరేడ్మెట్ (హైదరాబాద్): లాక్డౌన్ నేపథ్యంలో బిజీగా ఉన్నప్పటికీ ట్విట్టర్లో వివిధ సమస్యలు, ప్రజల ఇబ్బందులపై వస్తున్న మేసేజ్‌లకు వెంటనే స్పందిస్తూ పరిష్కారానికి చొరవ చూపుతున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమ కొడుకుకు మందులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నామని..ఆదుకోవాలని ఓ పేద దంపతులు ట్విట్టర్లో పంపిన మేసేజ్‌కు కేటీఆర్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న శ్రావణి, ప్రవీణ్‌లకు ముగ్గురు సంతానం. ప్రవీణ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమె కూలి పనులు చేస్తుంది. ముగ్గురు సంతానంలో పెద్ద కొడుకు ప్రణీత్(8) కొంతకాలం క్రితం నీటిసంపులో పడి బ్రెయిన్, ఊపిరితిత్తులు దెబ్బతిని, అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు సూచించిన ప్రకారం తల్లిదండ్రులు మందులు వాడుతూ వస్తున్నారు. ఇటీవల మందులు అయిపోయాయి. ఈ క్రమంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇంటికే పరిమితమయ్యారు. పని లేకపోవడంతో కొడుకుకు మందులు, నిత్యావసర సరుకులు కొనడానికి చేతిలో డబ్బులు లేని దయనీయ పరిస్థితి. దాంతో తమ సమస్యను తెలిసిన వారి ద్వారా వారం రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌కు పేద దంపతులు ట్వీట్ చేయించారు. ఈ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ మల్కాజిగిరి తహసీల్దార్ బి.గీతకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ గీత ఆ పేద దంపతులను శనివారం నేరేడ్మెట్లోని తన కార్యాలయానికి పిలిపించారు. కావాల్సిన నిత్యావసర సరుకులను తహసీల్దార్, ప్రణీత్‌కు అవసరమైన మందులను నేరేడ్మెట్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన గోపు రమణారెడ్డి అందజేశారు. తమ సమస్యపై స్పందించిన కేటీఆర్‌తోపాటు కలెక్టర్, తహసీల్దార్, రమణారెడ్డిలకు పేద దంపతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
కబడ్డీ అంటే ప్రాణం.. కాసులు లేక దైన్యం
అసలే నిరుపేద కుటుంబం. ఆపై పెద్ద దిక్కు కోల్పోవడం, అన్ని తానై తండ్రిలేని లోటును కనిపించకుండా తన కుమారుడిని ఉన్నతుడిని చేయాలనే సంకల్పంతో కూలి పనులు చేస్తూ చదివిస్తోంది ఓ తల్లి.. అదే ఉన్నత ఆశయంతో, తల్లి సంకల్పాన్ని సాకారం చేసేందుకు చదువుతోపాటు కబడ్డీలో రాణిస్తూ జాతీయ స్థాయిలోనూ అవార్డులు సాధిస్తున్నారు కొందుర్గుకు చెందిన విద్యార్థి శ్రీకాంత్. అయితే ఈ నెల 22న మధ్యప్రదేశ్‌లో జరిగే పోటీలలో పాల్గొనేందుకు దాతల సహకారాన్ని అర్థిస్తున్నాడు. రంగారెడ్డి :కొందుర్గు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కృష్ణయ్య దంపతులకు పావని, శ్రీకాంత్ అను ఇద్దరు సంతానం. పావని పెళ్లైంది. అయితే రెండేళ్ల క్రితం తండ్రి కృష్ణయ్య మృతిచెందాడు. ఇక ఈ కుటుంబంలో మిగిలింది తల్లి పార్వతమ్మ, కూమారుడు శ్రీకాంత్. తన కూమారుడిని ఎలాగైనా మంచి చదువులు చదివించి ఉన్నతమైన భవిష్యత్ అందించాలన్నదే పార్వతమ్మ కోరిక. తల్లి ఆశయాన్ని నెరవేర్చేందుకు శ్రీకాంత్ చదువులోనూ, అటు క్రీడలోనూ రాణిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో కొందుర్గు బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి సైతం శ్రీకాంత్‌ను క్రీడలో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఉన్నత పాఠశాలలో పీఈటీలు అనితారాణి, రామచంద్రుడు సూచనలు, సలహాలు పాటిస్తూ ఎన్నో జాతీయ పతకాలు సాధించారు. శ్రీకాంత్ సాధించిన విజయాలు ప్రస్తుతం కొందుర్గు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీకాంత్ 2017 డిసెంబర్లో నిర్వహించిన కబడ్డీ అండర్–17 విభాగంలో చెన్నైలో జరిగిన జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని ప్రథమ బహుమతి అందుకున్నారు. అదేవిధంగా 2018 నవంబర్‌లో రాజస్థాన్‌లో నిర్వహించిన జాతీయ కబడ్డీ పోటీల్లోనూ ఢిల్లీ జట్టుతో పోటీపడి ప్రథమ స్థానం పొందారు. ఇక 2019 సెప్టెంబర్‌లో పాండిచ్చేరి జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం ఈ నెల 22న మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల కోసం ఎన్నికయ్యారు. దాతల సహకారంతోనే .. కాగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు శ్రీకాంత్‌కు ఆర్థిక పరిస్థితులు అంతగా లేకపోవడం వల్ల దాతల సహకారంతోనే అన్ని పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 22న మధ్యప్రదేశ్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక వనరుల కోసం దాతల కోసం ఎదురు చూస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాలన్నదే నా కోరిక. చిన్నతనంలో లక్ష్మీదేవి టీచర్, పెద్దయ్యాక పీఈటీలు అనితారాణి, రామచంద్రుడు ఇద్దరు టీచర్లు సూచించిన సలహాలు నాకు స్ఫూర్తిని నింపాయి. ఇక నాయకుల ఆర్థిక సహాయంతోపాటు మా పాఠశాల ఉపాధ్యాయులు రూ. 500 చొప్పున అందించి నన్ను జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు పంపించడం నాలో మరింత పట్టుదలను నింపింది.– కబడ్డీలో రాణిస్తున్న శ్రీకాంత్ నా కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవాలి నా కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే నా కోరిక. కుటుంబాన్ని పోషించే నా భర్త మృతిచెందాడు. ఇక ఉన్న ఒక్కగానొక్క కొడుకును ఉన్నతమైన భవిష్యత్ అందించాలని ఉంది. నా కొడుకు జాతీయ కబడ్డీ పోటీల్లో బహుమతి అందుకున్నాడని తెలియగానే చెప్పరాని సంతోషం వచ్చింది. మరిన్ని ఉత్తమ బహుమతులు అందుకొని మంచి భవిష్యత్ పొందాలని నా కోరిక. ఇందుకు దాతలు సహకరించాలి. – పార్వతమ్మ, శ్రీకాంత్ తల్లి -
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం
సాక్షి, జడ్చర్ల: నిరుపేద కుటుంబం.. ఆర్థిక ఇబ్బందులు.. అంతా ఆడ సంతానం.. దీనికి తోడు కుటుంబ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆ ఆడపిల్లలు ఏమనుకున్నారో.. ఎంతగా మానసిక క్షోభకు గురయ్యారో.. తండ్రి పట్టించుకోవడం లేదనో.. తమకు పెళ్లిళ్లు కావడం లేదనో.. తెలియదు గాని వారు ఒక్కసారిగా ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.. ఈ సంఘటన మండలంలోని చర్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెమోని వెంకటయ్య (65), సాయమ్మ (60) దంపతులకు ఆరుగురు కూతుళ్లు. వెంకటమ్మ అలియాస్ మానస (36), అనిత (34), కృష్ణవేణి (30), యాదమ్మ (27), మౌనిక అలియాస్ ప్రవళిక (25), స్వాతి (20) ఉన్నారు. వీరిలో మౌనిక బీఫార్మసీ పూర్తి చేయగా.. స్వాతి ఇంటర్ పూర్తి చేసింది. మిగతా వారు కూడా పదో తరగతిలోపు చదువుకున్నారు. అయితే గురువారం మానస, అనిత, కృష్ణవేణి, యాదమ్మలు ఇంట్లో ఉన్న పురుగు మందును తాగారు. అస్వస్థతకు గురవడంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఆటోలో, ద్విచక్రవాహనంపై వారిని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో 108లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిరుపేద కుటుంబం గ్రామానికి చెందిన వెంకటయ్యది నిరుపేద కుటుంబం. ఈయనకు భార్య సాయమ్మతో పాటు తల్లి శాంతమ్మ, ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. తన స్థోమతకు తగ్గట్టుగా కూతుళ్లను చదివించాడు. వీరికి గ్రామ శివారులో ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో పండే పంటలతోపాటు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వెంకటయ్యతోపాటు మరో ఇద్దరు సోదరులకు కలిపి మూడు గదుల ఇళ్లు ఉంది. ఇందులో వెంకటయ్య పాలికి వచ్చిన చిన్నపాటి గదిలోనే వీరంతా జీవనం సాగిస్తున్నారు. ఆ గది కూడా చిన్నగా ఉండటం, శిథిలావస్థకు చేరుకుంది. అంతా పెళ్లీడు వారే.. ఆరుగురు ఆడపిల్లలు. అంతా పెళ్లీడు దాటిన వారే. దీంతో ఆ ఆడకూతుళ్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ తండ్రి వెంకటయ్య తమను పట్టించుకోవడం లేదని, తమకు పెళ్లిళ్లు చేయడం లేదన్న మానసిక వ్యథ ఒక వైపు కుంగదీస్తుండగా.. మరోవైపు పేదరికం అడుగడుగునా వెక్కిరించింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు పురుగు మందు తాగి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా బుధవారం తమ చెల్లెలు కృష్ణవేణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈమె ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటుందని వీరి అనుమానం. దీంతో తండ్రి వెంకటయ్య తన కూతురు కృష్ణవేణి కోసం యాదగిరిగుట్ట, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో వెతికేందుకు వెళ్లాడు. తమ చెల్లెలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తమ పరువు తీసిందని భావించారో.. మరో కారణంగానో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం సర్పంచ్ వెంకటయ్య దాదాపు 25 సంవత్సరాల క్రితం చర్లపల్లికి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం బాదేపల్లి పట్టణం తదితర ప్రాంతాల్లో చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేపట్టి నష్టపోయినట్లు తెలిసింది. దీంతో ఒకవైపు ఆడపిల్లలు, మరోవైపు పేదరికంతో వెంకటయ్య మానసికంగా కుంగిపోయి మౌనస్థితికి చేరినట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే పోలీసుల దృష్టికి.. తమను తమ తండ్రి వెంకటయ్య పట్టించుకోవడం లేదని, తమకు పెళ్లిళ్లు చేయడం లేదని, పెద్దదిక్కుగా ఉన్నా తండ్రి పట్టించుకోకపోవడంతో తమకు సంబంధాలు రావడం లేదని ఆవేదన చెందిన కూతుళ్లు తమకు న్యాయం చేయాలని కొద్దిరోజుల క్రితం జడ్చర్ల పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీఐ బాలరాజుయాదవ్ వారికి, తండ్రి వెంకటయ్యకు కౌన్సిలింగ్ నిర్వహించి ధైర్యంగా ఉండాలని చెప్పి పంపించారు. పెళ్లికి సహాయంగా తమవంతుగా సహకరిస్తామని కూడా సీఐ వారికి భరోసా ఇచ్చారు. కేను నమోదు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. ఆరుగురు ఆడపిల్లలు, పెళ్లిళ్లు కాకపోవడం, వీరిలో ఒక చెల్లెలు ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోవడం కారణంగా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిలో మానస, అనితల పరిస్థితి విషమంగా ఉండడంతో ఏనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరు కృష్ణవేణి, యాదమ్మలకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. -
సిటీలో సాహసి పర్వతాలు ఎక్కేసి..
దుండిగల్: ఎముకలు కొరికే చలి.. కడుపులో ఆకలి మంట.. అడుగు తీసి వేయలేని పరిస్థితి. మరోపక్క తీవ్రంగా వీచే గాలులు.. విరిగి పడుతున్న మంచు కొండ చరియలు. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేధించే దిశగా అడుగులు వేశాడు ఓ యువకుడు. సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్న అతడు ప్రపంచంలోనే అతి ఎత్తయిన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలని జీవితాశయంగా ఎంచుకున్నాడు. అతడే కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన బాదా రమేష్. సాహసమే ఊపిరిగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట గ్రామానికి చెందిన రాజు, బాలామణి దంపతులు 18 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి సూరారంలోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు రమేష్ (21) డిగ్రీ పూర్తి చేసిన ఇతడు చిన్ననాటి నుంచే సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. రమేష్ తండ్రి ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డు కాగా, తల్లి ప్రైవేట్ పరిశ్రమలో దినసరి కూలీ. డిగ్రీలో ఉండగా రమేష్ సికింద్రాబాద్‌లోని ఎస్డీఎస్ కళాశాలలో 2టీ బెటాలియన్ సికింద్రాబాద్ గ్రూప్ నేషనల్ క్యాడెట్ క్రావ్స్ గ్రూప్‌లో మూడేళ్ల పాటు శిక్షణ పొందాడు. అనంతరం పర్వతారోహణలో బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు (బీఎంసీ) పూర్తిచేశాడు. ఈ కోర్సులో నెలరోజుల పాటు మంచు కొండల్లో అన్ని కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన వారినే పర్వతారోహణకు అర్హులుగా ప్రకటిస్తారు. అనంతరం ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ (ఐఎంఎఫ్) కోర్స్లోసైతం శిక్షణ పూర్తి చేశాడు. రెండు పర్వతాల అధిరోహణ ఎన్ఐఎంఏఎస్లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన రమేష్ 2018లో మొదటి సారి అరుణాచల్ ప్రదేశ్‌లోని 16,414 అడుగుల మీర్తంగ్ పర్వతాన్ని అధిరోహించాడు. అదే ఏడాది జమ్ము–కశ్మీర్‌లోని మచాయ్ (17,901 అడుగులు) పర్వతాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న పర్వతాలను ఎక్కాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అన్ని అంశాల్లో తర్ఫీదు.. పర్వతల అధిరోహణ శిక్షణతో పాటు వివిధ విభాగాల్లో రమేష్ తర్ఫీదు పొందాడు. ఎత్తయిన కొండల నుంచి పారే జలపాతాలపై నుంచి కిందకు దిగే రాక్ క్లైంబింగ్, గాలిలో బెలూన్ల సహాయంతో ఎగిరే పారా సైలిన్, కొండలపై నుంచి తాడు సహాయంతోనే కిందకు దిగే ర్యాప్లింగ్, జుమారింగ్, నదుల్లోని నీటిపై చేసే రాప్టింగ్, ట్రెక్కింగ్‌లో భాగంగా స్పైడర్ వెబ్‌తో పాటు రివర్స్ క్రాసింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్లో సైతం రాటుదేలాడు. అడ్వైంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్‌లో ప్రవేశం పొంది పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. అనంతరం 330 ఫీట్ల ఎత్తున్న ఆదిలాబాద్‌లోని గాయత్రి జలపాతంలో 120 మంది సభ్యులు పాల్గొనగా అందులో రమేష్ రివర్స్ ట్రెక్కింగ్, కళ్లకు గంతలు కట్టుకుని కిందకు దిగడం వంటి విన్యాసాలు చేసి బంగారు పతకం, వెండి పతకాలు సాధించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ క్లైంబింగ్ స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొని సెలెక్టయ్యాడు. అటు నుంచి బెంగళూరులో జరిగిన సౌత్ జోన్ పోటీల్లో అర్హత సాధించడంతో అతనికి జేఐఎంలో నెలరోజుల పాటు శిక్షణ పొంది, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ ఎలైడ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎంఏఎస్)లోను కఠోర శిక్షణ పూర్తిచేశాడు. ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ డే సందర్భంగా నిర్వహించిన 12 గంటల పాటు నాన్‌స్టాప్ క్లైంబింగ్ పోటీల్లో రమేష్ ఏకంగా 13 సార్లు రికార్డు నెలకొల్పాడు రమేష్. చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే ప్రాణం. వాటి ద్వారానే స్ఫూర్తి పొందాను. ఇప్పటి వరకు రెండు పర్వతాలను అధిరోహించాను. ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరేయాలన్నది నా చిరకాల కోరిక. పర్వతం ఎక్కేటప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితులుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థైర్యం ఉంది. కానీ ఆర్థిక పరిస్థితే బాగాలేదు. ఎవరన్నా సాయం చేసేవారుంటే ఎన్నో విజయాలు సాధిస్తానన్న నమ్మకముంది’’. – రమేష్ వెంటాడుతున్న పేదరికం తల్లిదండ్రులు రాజు, బాలామణి ప్రతిరోజు కష్టపడితేనేగాని పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం కేటాయించిన రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమ కొడుకు కలను నెరవేర్చేందుకు తమకు స్తోమత లేదని వారు కన్నీటి పర్యంత మవుతున్నారు. రమేష్ సైతం ప్రస్తుతం చేసేదేమీ లేక ఓ రిసార్ట్‌లో ఆటవిడుపుగా వచ్చే పిల్లలకు సాహస క్రీడలపై అవగాహన కల్పిస్తూ ఉపాధి పొందుతున్నాడు. రమేష్‌కు సాయం చేయాలనుకునేవారు 8099079372, 9182117796 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఆశే బతికిస్తోంది..!
పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులు లేవు..పెద్ద కుటుంబమేమీ కాదు..కూలి పని చేస్తే రోజు గడుస్తుంది..లేదంటే పస్తులతో కాలం వెళ్లదీయాల్సిందే..ఉన్నదాంట్లో సర్దుకుపోతున్న తరుణంలో కుటుంబ పెద్దకు పెద్ద కష్టమొచ్చింది. మతిస్థిమితం కోల్పోవడంతోపాటు కాళ్లు విరిగి మంచానికే పరిమితమయ్యాడు. సహచరి ధైర్యాన్ని కోల్పోకుండా భర్త కోసం రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయనే ఆశతో ఆమె పోరాటం చేస్తోంది. ఇటీవల చిన్న కుమారుడు కూడా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆమె దుఃఖాన్ని దిగమింగి.. గుండె దిటువు చేసుకుంది. ఏ దేవుడైనా రాకపోతాడా.. తమను ఆశీర్వదించకపోతాడా అనే ఆశతో ఆమె బతుకుతోంది. పత్తికొండలోని మడ్డిగేరికి చెందిన లక్ష్మీ దేవి కుటుంబం దీనగాథ ఇది.. కర్నూలు, పత్తికొండ రూరల్: పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీలో కాంట్రాక్టు పారిశుద్ధ్ద్య కార్మికుడుగా పాపన్న పనిచేస్తుండే వాడు. పూరిగుడిసెలో నివాసం ఉంటున్న పాపన్న, లక్ష్మీ దంపతులకు కుమార్, కుమారి, పుల్లన్న సంతానం. పెద్దకుమారుడైన కుమార్ ఆరేళ్ల కిందటే వివాహం చేసుకుని వేరుగా కాపురం ఉంటున్నాడు. పంచాయతీ కార్మికుడుగా ఉన్న పాపన్న 2011లో పక్షవాతానికి గురయ్యాడు. ఆదోని, కర్నూలు ఆసుపత్రుల్లో సుమారు రూ.2లక్షల వరకు ఖర్చుచేసి వైద్యం చేయించినా వ్యాధి నయం కాలేదు. మెదడులో సమస్య ఉందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యులు ధ్రువీకరించారు. మతిస్థిమితం కూడా కోల్పోయి వీధిలో వెళ్తున్న పాపన్నను పరిగెత్తుకుంటూ వెళ్తున్న గుర్రాలు తగిలాయి. దీంతో ఆయన కాళ్లు విరిగి ఏడేళ్లుగా లేవలేని స్థితిలో మంచం పట్టాడు. ఎప్పుడూ పడుకునే ఉండడం వల్ల చర్మం కూడా దెబ్బతిని కుళ్లిపోతోంది. పాపన్నకు మెదడు చికిత్సతో పాటు కుళ్లిపోయిన చర్మవ్యాధికి ఆధునిక వైద్యంకోసం సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. అంతభారం భరించలేమని కుటుంబ సభ్యులు నిట్టూర్చారు. సంసారాన్ని అతికష్టంపై నెట్టుకొస్తున్న పాపన్న భార్య లక్ష్మి...నాలుగేళ్ల క్రితం రూ.లక్ష వరకు అప్పుచేసి కుమార్తె కుమారి వివాహం చేసింది. ప్రస్తుతం కనీసం నడవలేని స్థితిలో పాపన్న మంచానికే పరిమితమయ్యాడు. వైద్యం చేయించడం చేతకాక దేవుడిపై భారం వేసి దయగల మారాజుల వైద్యసాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. చిన్నకుమారుడు పుల్లన్నకు కిడ్నీలో రాళ్లు పాపన్న చిన్నకుమారుడైన పుల్లన్న బేల్దారి పనిచేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అయితే పుల్లన్నకు కిడ్నీలో రాళ్లు అని వైద్యులు తేల్చడంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. బరువుపని చేస్తే ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని వైద్యులు సూచించారు. దీంతో ఆభారం కూడా ఆ తల్లిపైనే పడింది. దాతల్లారా దీవించండి నా భర్త లేవలేడు..కూర్చోలేడు.. నడవడం కూడా చేతకాదు.. మంచానికి పరిమితమైపోవడంతో అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తోంది. కూలి పనులు చేసుకుని బతకడమే కష్టంగా ఉన్న మాకు వైద్యం చేయించుకునే స్థోమత లేదు. మానవత్వం ఉన్న మారాజులు స్పందించి చేయూతనందిస్తే నా భర్త ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. – దుడ్డు లక్ష్మి పాపన్న భార్య దుడ్డు లక్ష్మి, ఎస్బీఐ అకౌంటు నంబరు : 37881191962 ,ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్0000981 సంప్రదించాల్సిన సెల్ : 9666332260 -
ఒకరు పాడెపై.. మరొకరు స్ట్రెచర్‌పై..
సాక్షి, ఏటూరునాగారం: డెంగీ మహమ్మారి ఆ కుటుంబంతో ఆడుకుంటోంది. చేతిలో చిల్లిగవ్వలేక.. ఆపదలో ఆదుకునే ఆరోగ్యశ్రీ కూడా వర్తించకపోవడంతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మెరుగైన వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఒక కొడుకు పాడెపై పడుకుంటే.. మరో కుమారుడు వెంటిలెటర్‌పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హృదయవిదారక సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు పంచాయతీ పరిధిలోని సింగారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వావిలాల పోతరాజు, జయమ్మకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు వావిలాల వినయ్ (9) డెంగీ జ్వరంతో బాధపడుతూ శనివారం ఉదయం ఎంజీఎంలో మృతి చెందాడు. వినయ్‌కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో ఏటూరునాగారంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ నయం కాలేదు. కాలేయానికి ఇన్ఫెక్షన్ వచ్చిందని, రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయాయని వైద్యులు చెప్పడంతో ఆర్థిక స్థోమత లేని ఆ తల్లిదండ్రులు కుమారుడిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ నాలుగు రోజులుగా చికిత్స అందిస్తుండగా శనివారం మృతిచెందాడు. వెంటిలెటర్‌పై రెండో కుమారుడు పెద్ద కుమారుడు చనిపోవడంతో తల్లి జయమ్మ ఆయన మృత దేహాన్ని పట్టుకుని సింగారం గ్రామంలోని తన ఇంటికి చేరింది. రెండో కుమారుడు వావిలాల వినోద్‌కు కూడా జ్వరం రావడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సేవలు చేస్తున్నాడు. వినోద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై పెట్టి చికిత్సలు అందిస్తున్నారు. ఇటు మృతిచెందిన పెద్ద కుమారుడికి దహన సంస్కారాలు నిర్వహించలేక.. చిన్న కుమారుడిని ఎలా బతికించుకోవాలో తెలియక గుండెలవిసేలా రోదిస్తున్నాడు. బిడ్డా.. కానరాని లోకానికి పోతివా... పండుగొచ్చిందని కొత్త బట్టలు కూడా కుట్టిస్తిని బిడ్డా.. అవి మాసిపోకుండానే మట్టిలో కలిసిపోతివా.. నీ దగ్గర నేను ఉన్నా... తమ్ముడి దగ్గర అయ్య ఉన్నాడు. ఏం చేయాలి బిడ్డా.. దేవుడా మమ్మల్లి ఇంత కష్టంలో ఎందుకు నెట్టావు. ఆలన పాలన తెలియని బిడ్డలను ఆగం చేస్తివి. నా కొడుకును పొట్టనపెట్టుకుంటివి అంటూ వినయ్, వినోద్ తల్లి జయమ్మ విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అయ్యా.. నా బిడ్డను కాపాడండి... మాకు ఆరోగ్య శ్రీ కూడా లేదు. నా పెద్ద కొడుకును డబ్బులేకనే పోగొట్టుకున్నా. నా చిన్న కొడుకు వినోద్‌కు కూడా జ్వరం రావడంతో హన్మకొండలో చికిత్స చేయిస్తున్నా. చేతిలో చిల్లిగవ్వలేదు. ఆడ ఈడ అప్పులు చేసి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి. డబ్బులుంటనే నా కొడుకు బతుకుతాడు. తెలిసిన వారికల్లా ఫోన్ చేసి అడుగుతున్నా. నా కొడుకును కాపాడాలని. – పోతరాజు, వినోద్ తండ్రి -
ఈ బంధం.. ఎందరికో ఆదర్శం
పేదరికంతో తాను చదువుకోలేక పోయాననే బాధను దిగమింగుకుని.. ఓ శిష్యున్ని తన కష్టార్జితంతో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఓ గురువు జీవత గాథ ఇది. నా శిష్యుడిని గొప్ప శాస్త్రవేత్తను చేయాలనే ఆ గురువు తపన.. గురువు లక్ష్యానికి అనుగుణంగా శిష్యుడి కష్టం.. వెరసి ఈ అనుబంధం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ గురు శిష్యుల బంధంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.... కష్టాల కడలిని జయించి.. జనగామ : వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి చెందిన నాసం రాజయ్య, సరోజని దంపతుల కుమారుడు నాసం రమేష్ 7వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. పేదరికంలో పుట్టిన ఆ బిడ్డకు మంచి విద్యను అందించాలనే తపనతో తల్లిదండ్రులు గీతాంజలి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించారు. కూలీ పని చేస్తూ కొడుకును చదివించుకున్నారు. చదువుకోవాలనే తపన ఉన్నా... ఆర్థికంగా వెనకబడి.. తల్లిదండ్రులతో కలిసి పనికి వెళ్లేవాడు. పని చేస్తూనే పదో తరగతి పూర్తి చేశాడు. ఈ సమయంలోనే కొంతమంది స్నేహితులు, గురువులు కొంతం రవీందర్, బొల్లెబోయిన. కిషోర్, బండి. శ్రీనివాస్, వంగ రవీందర్.. రమేష్‌ను వెన్నుతట్టి ముందుకు నడిపించారు. గీతాంజలి స్కూల్లోనే పీఈటీగా(ప్రైవేటు) పోస్టింగ్ ఇప్పించారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తూనే... రమేష్ పోలీసు జాబ్ కోసం అహోరాత్రులు కష్టపడి చదివాడు. రెండున్నరేళ్ల పాటు స్కూల్లోనే పని చేస్తూ... 2004లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. శిష్యుడికి చేయూత.. గీతాంజలి స్కూల్లో నాసం రమేష్ పని చేస్తున్న సమయంలో సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన బుట్టి రమేష్ చదువుకునే వాడు. బుట్టి రమేష్‌కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడే తన తండ్రి గుండె పోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి మల్లికాంబ కూలీ పని చేస్తూ.. కొడుకును చదివించింది. కుటుంబ పోషణ భారమవడంతో.. కుమారుడిని ఏడో తరగతిలోనే చదువు మాన్పించే ప్రయత్నం చేసింది. దీంతో అదే పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న గురువు నాసం రమేష్‌ను శిష్యుడు బి.రమేష్ (విద్యార్థి) కలిసి.. తన బాధను చెప్పకున్నాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థిని నాసం రమేష్ తన సొంతఖర్చులతో బాగా చదివించాడు. తాను చేరలేని లక్ష్యాన్ని శిష్యుడైనా చేరుకోవాలనే లక్ష్యంతో ప్రోత్సహించాడు. బుట్టి రమేష్ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఏపీలోని కర్నూల్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్‌లో జీవరసాయన శాస్త్రంలో ఉస్మానియా రీజియన్‌లోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఆ తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో అడ్మిషన్ లభించింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. శిష్యుడు రమేష్ పూణేలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్’ గేట్లో 129 ఆల్ ఇండియా ర్యాంక్‌తో పాటు ఐసీఎంఆర్, జేఆర్ఎఫ్ సాధించి.. తనపై గురువు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇందులోనే రమేష్‌కు క్యాన్సర్‌పై రీసెర్చ్ చేయడానికి అవకాశం రావడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సైనికుడిగా నేను, శాస్త్ర వేత్తగా నా శిష్యుడు.. భారతమాత రుణం తీర్చుకోవాలి. మా మనసులు వేరైనా.. ఆలోచన, లక్ష్యం, కష్టం, బాధ్యత మాత్రం ఒక్కటిగా పంచుకున్నాం. నేను నెరవేర్చలేకపోయిన ఆశయాన్ని మా శిష్యుడు సాధిస్తున్నాడు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత.. శిష్యుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మా పదహారేళ్ల ప్రయాణంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. వాటిని ఇష్టంగా స్వీకరిస్తూ.. ముందుకు వెళ్లాం. నా శిష్యుడిని గొప్ప శాస్త్ర వేత్తగా తయారుచేసి, జీవశాస్త్రంలో నోబెట్ బహుమతి సాధించేలా చేయాలన్నదే నా లక్ష్యం. – నాసం రమేష్, గురువు, సీఆర్పీఎఫ్ జవాన్ రమేష్సార్ మార్గదర్శకత్వమే నాకు బలంతల్లి బడికి వద్దురా బిడ్డా అన్న సమయంలో రమేష్ సార్ కనిపించి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ రోజును నేను మరచిపోలేను. రమేష్ సర్ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు. ఒక వ్యక్తి జీవితంలో పైకి రావడానికి కావాల్సినవి పట్టుదల, మార్గదర్శకత్వం. నాకు పట్టుదల ఉంది, రమేష్ సార్ నాకు మార్గదర్శనం చేశారు. అదే నా బలమైంది. సాధారణ విద్యార్థిని అయినా.. నా గురువు గొప్పమనిషిగా నన్ను తీర్చి దిద్దడానికి ప్రయత్నాలు కొనసాగించారు. జీవితంలో వైఫలాలు ఉన్నా.. తనకు మాత్రం ఏ లోటు చేయలేదు. కుటంబ సభ్యుడిగా ఆరాధించారు. నా బంధువులు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పటికీ ఎవరూ కూడా అండగా నిలబడలేదు. తన ప్రతి విజయం వెనక సార్ ప్రోత్సాహం కనిపిస్తుంది. గురువు అనే వ్యక్తి తనకు ఉన్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోయినా.. ఆ లక్ష్యాలను చేరుకునేలా గొప్ప విద్యార్థులను తయారు చేయగలరని నిరూపించాడు మా రమేష్ సార్. – బుట్టి రమేష్, శిష్యుడు -
వయసు చిన్న.. బాధ్యత మిన్న
మల్కన్‌గిరి : పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసుఆ బాలికది. తోటి పిల్లలతో చెంగు చెంగున గెంతుతూ ఆటలాడుకోవాల్సిన పసిప్రాయం ఆమెది. అయితే ఎవ్వరూ దిక్కు లేని ఇంటికి తానే అన్నీ అయి బాధ్యతలు మోస్తూ కుటుంబాన్ని నడిపిస్తోంది.జిల్లాలోని మల్కన్‌గిరి సమితి బోయిళపరి గ్రామానికి చెందిన బాలిక జానకీ దురువ(12) ఇంటి పెద్దై బరువు బాధ్యతలు మోస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. అదే గ్రామానికి చెందిన సోంబారీ దురువ(83) సామారీ దురువ అనే స్వాతంత్య్ర సమరయోధుడి భార్య. 1940వ సంవత్సరంలో స్వాతంత్య్ర సమరయోధుడు సహిద్ లక్ష్మణ్‌నాయక్‌తో పాటు సామారీ దురువ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు. 1942లో మల్కన్‌గిరి జిల్లా మత్తిలి బ్రిటిష్ పోలీస్‌స్టేషన్‌పై చేసిన దాడిలో సామారీ దురువ తీవ్ర గాయాలపాలయ్యాడు. 1942 నుంచి 1944 వరకు సహద్ లక్ష్మణ్‌నాయక్‌తో పాటు బరంపురం జైల్లో ఉండి వచ్చాడు. అనంతరం గిరిజన పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజుతో పాటు ఎన్నో ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్నాడు. చివరికి స్వాతంత్య్రం వచ్చిన 1947 తర్వాత కొంత కాలానికి ప్రభుత్వం స్వాతంత్య్ర సమరమోధులకు పింఛన్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సామారీ దురువకు కూడా పింఛన్ వచ్చేది. దీంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. సామారీ దురువకు ఇద్దరు సంతానం. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు. కొడుకు పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. కానీ కూతురికి పెళ్లి చేశాడు. ఆమెకు పుట్టిన బిడ్డ జానకీ దురువ. సామారీ దురువకు 2010వ సంవత్సరానికి రూ.3 వేలు పింఛన్ వచ్చేది. అనారోగ్య కారణాలతో సామారీ దురువ 2010లో చనిపోయాడు. ఢిల్లీ వరకు వెళ్లినా.. తర్వాత సంవత్సరానికే కూతురు, అల్లుడు కూడా చనిపోయారు. వారి బిడ్డయైన జానకీ దురువను అమ్మమ్మ సాంబారీ దురువ పెంచి, పెద్ద చేసింది. ఇప్పుడు ఆమె వృద్ధాప్య దశకు చేరుకోవడంతో ఏ పనీ చేయలేకపోతుండడంతో ఇంటికే పరిమితమయింది. ఇప్పుడు సాంబారీ దురువకు వృద్ధాప్య పింఛన్ రూ.300 మాత్రమే వస్తోంది. తన భర్తకు వచ్చే స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ తనకు ఇప్పించాలని కోరుతూ ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి ఢిల్లీ వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో మనుమరాలు జానకీ దురువ కూలీ నాలీ చేస్తూ అమ్మమ్మ, మేనమామను పోషిస్తోంది. ఈ కుటుంబ పరిస్థితులను చూస్తున్న గ్రామస్తులు దిక్కు లేని ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
పేదింట డాక్టర్..!
కొణిజర్ల : ఆ విద్యార్థి పేరు సాదిక్. తండ్రి ఓ సామాన్య ఆర్ఎంపీ వైద్యుడు. అష్టకష్టాలు పడి పిల్లలను చదివించాడు. తండ్రిలానే తానూ వైద్యుడినై నిరుపేదలకు సేవ చేయాలని చిన్నతనంలోనే అనుకున్నాడు. దానిని నిజం చేసుకోబోతున్నాడు. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టు ఎక్కేశాడు. నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు సాధించాడు. కొణిజర్లకు చెందిన షేక్ సలీమ్, ఫాతిమా దంపతుల కుమారుడు షేక్ సాదిక్. ఈ ఏడాది నీట్ ఫలితాలలో ఆలిండియా స్థాయిలో 11,889వ ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్‌లోని దక్కన్ మెడికల్ కళాశాలలో సీటు పొందాడు. ఇతడు చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. 5వ తరగతి వరకు గోర్కి పబ్లిక్ స్కూల్లో, ఖమ్మంలోని మరో ప్రయివేట్ స్కూల్లో పదోతరగతి వరకు చదివాడు. పదోతరగతిలో 10 జీపిఏ సాధించాడు. ఖమ్మంలోని ప్రయివేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. 979 మార్కులు సాధించాడు. టీఎస్ ఎంసెట్‌లో 1089వ, ఏపీ ఎంసెట్‌లో 3850వ ర్యాంక్ పొందాడు. నీట్లో ఆలిండియా కేటగిరీలో 11,889వ ర్యాంక్, లోకల్లో 1363వ ర్యాంక్ సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే హైదరాబాద్‌లోని దక్కన్ మెడికల్ కళాశాలలో సీటు లభించింది. నీట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోలేదు. తమ బిడ్డడి విజయంతో ఆ తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోతున్నారు. న్యూరాలజిస్ట్ కావాలనుంది ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత న్యూరాలజీ స్పెషలైజేషన్‌తో పీజీ చేస్తానని అంటున్నాడు సాదిక్. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని అన్నాడు. -
మమ్మల్ని ఆదుకోరూ..
సుజాతనగర్: కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు... ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేశాడు.. కాని విధి వక్రీకరించి ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడ్డాడు. కుటుంబ బాధ్యత నెత్తికెత్తుకున్న మరో కూతురు విద్యుదాఘాతంతో మృతి చెందింది. కూతురిని కాపాడబోయి తల్లి కూడా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఒక చేయి పనిచేయడం లేదు. కుటుంబ పోషణే భారమైన తరుణంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారీ నిరుపేద దంపతులు సుజాతనగర్ మండలం సింగభూపాలేనికి చెందిన ఉగ్గం వెంకటేశ్వర్లు, భార్య సత్యవతికి ముగ్గురు కూతుళ్లు. కూలీనాలి చేసుకోవడంతోపాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది క్రితం అనారోగ్యం పాలయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు అప్పోసప్పో చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఒక కిడ్నీ పాడైందని వైద్యులు చెప్పడంతో ఆర్థికస్థోమత అంతంతమాత్రంగా ఉన్న వెంకటేశ్వర్లు మెరుగైన వైద్యం చేయించుకోలేకపోయాడు. దీంతో రెండో కిడ్నీసైతం చెడిపోయింది. ప్రస్తుతం వెంకటేశ్వర్లు మంచానికే పరిమితమై తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకరి ఊతం లేనిదే మంచం పైనుంచి లెగిసే పరిస్థితి లేదు. తల్లిదండ్రుల బాధ చూడలేని పెద్దకూతురు అరుణ ఇంటి బాధ్యతను స్వీకరించి తాను కూడా కూలీకి వెళ్తూ, కాయగూరలు అమ్ముతూ బతుకుబండిని నెట్టుకొస్తుండేది. విధి వక్రించి ఇంటి పనులు చేసుకుంటున్న తరుణంలో అరుణ ఇంట్లోనే విద్యుదాఘాతానికి గురైంది. కూతురిని రక్షించే క్రమంలో తల్లి సత్యవతి కూడా విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో అరుణ అక్కడికక్కడే మరణించగా, సత్యవతికి కుడిచేయి సరిగ్గా పనిచేయని స్థితికి చేరుకోవడంతోపాటు కాలి వేళ్లు కూడా తెగిపోయాయి. సంవత్సర కాలం నుంచి జీవనం సాగించడానికి ఆ దంపతులిద్దరూ పడే వేదన వర్ణణాతీతం. పూట గడవడమే కష్టంగా ఉన్న దంపతులకు అనారోగ్యం మరింత కుంగదీస్తోంది. కూలీపనులు సైతం చేసుకునే పరిస్థితిలో లేని సత్యవతి చుట్టుపక్కలవారి సాయంతో రోజులు నెట్టుకొస్తోంది. మెరుగైన వైద్యానికి డబ్బులు లేకపోవడంతో భర్త ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండటంతో కన్నీటిపర్యంతమవుతోంది. ఉండటానికి కనీసం సరైన ఇళ్లు కూడా లేక పూరిగుడిసెలోనే జీవనం సాగిస్తున్నారు. తన భర్తకు మెరుగైన వైద్యం అందితే కుటుంబ పోషణ బాగుంటుందని భార్య సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాతలు ఉంటే సాయం చేయాలంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. -
సార్లు...సీఎంను కలువాలే..
హూజూరాబాద్ : సార్లు.. నా భర్త పులి రాములుకు 90 ఏళ్లు ఉంటాయి. పదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సాకడం కష్టమైతంది. సీఎం సారు వస్తున్నాడని మా చుట్టు పక్కన వారు చెప్పిండ్రు. తోపుడు బండి మీద మా భర్తను జమ్మికుంట నుంచి తీసుకువచ్చిన. సారును కలువాలే అంటూ రాములు భార్య లచ్చమ్మ అధికారులను వేడుకోవడం పలువురిని కలిచివేచింది. నడవలేని స్థితిలో ఉన్న అతను భార్య సాయంతో తోప్పుడు బండి మీద ఎక్కించుకొని నాలుగు కిలోమీటర్ల దూరం తోసుకువచ్చింది. భర్త పరిస్థితి సీఎంకు చెప్పుకుంటానని అధికారుల కాళ్ల ఏళ్ల పడింది. మరోక్క ప్రక్క ఎండ విపరీతంగా ఉండటంతో రాములు తట్టుకోలేకపోయాడు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో మళ్లీ ఎండలో తోప్పుడు బండి మీద భర్త తీసుకోని జమ్మికుంట వరకు తోసుకెళ్లింది. సభకు వచ్చిన జనం భార్య, భర్తల మలి దశ అనుబంధంపై చర్చించుకోవడం గమనార్హం. -
గుడిసె నీడన బతుకు..గుండె నిండ బాధ
ఆ కుటుంబం రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. కూలీ చేసి జీవనం సాగిస్తోంది. ఉన్ననాడు తింటూ.. కూలీ దొరక్కన్నాడు పస్తులున్నారు. అయినా వారెప్పుడూ ఆధైర్యపడలేదు. ఎప్పుడో ఒకప్పుడు మనకూ మంచిరోజులు వస్తాయనే ఆశతో ఆనందంగా జీవనం సాగించారు. గుడిసె తప్ప ఇంకేమీ ఆస్తుల్లేని ఆఇంట్లోకి అనారోగ్యం చొరబడింది. రెండు కిడ్నీలు పాడై పోవడంతో కుటుంబ పెద్ద మంచానికే పరిమితమయ్యాడు. కనీసం ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం పొందుదామన్నా ఇప్పటికీ వారికి రేషన్ కార్డే లేదు. ఇలా కష్టాలన్నీ ఒక దాని వెంట ఒకటి తరుముకొస్తుంటే చికిత్స కోసం రూ. 8 లక్షలు అప్పు చేశారు. చెన్నూర్, మంచి ర్యాల, వరంగల్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆ ఇంటి దీపం కూలీ పనులకెళ్లి కుటుంబాన్ని సాకుతోంది. మనసున్న మా రాజులు చేయూతనందిస్తారని ఆ కుటుంబం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. చెన్నూర్‌రూరల్: భార్య, కుమారుడితో సరదాగా గడిపే ఆ ఇంటి పెద్దను కిడ్నీల వ్యాధి కుంగదీసింది. ఆ ఇంటి పెద్ద కూలీ పనులు చేసి భార్య పిల్లలను పోషించుకునేవాడు. కానీ ప్రస్తుతం ఏ పని చేయలేక భార్య కూలీకి వెళ్తేగాని పూట గడవని పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని దుగ్నెపల్లి పంచాయతీ పరిధిలోని వెంకంపేట గ్రామానికి చెందిన జాడి పోశయ్యది నిరుపేద కుటుంబం. ఉండేందుకు సరైన ఇళ్లు కూడా లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్ధితి. పోశయ్య తండ్రి మల్లయ్య చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి వీరక్క కూలీ పనులు చేసి పెంచి పెద్ద చేసింది. పోశయ్యకు భార్య ఎల్లక్క, మూడేళ్ల బాబు మల్లిఖార్జున్ ఉన్నాడు. కుటుంబాన్ని కుదిపేసిన కిడ్నీ వ్యాధి.. రెండేళ్ల క్రితం పోశయ్య శరీరం వాపు రావడంతో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు కరీంనగర్‌కు వెళ్లమని సూచించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి రెండు కిడ్నీలు చెడిపోయాయని నిర్ధారించి చెప్పారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో అప్పటి నుంచి నెలకు ఒక్కసారి హైదరాబాద్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుని డయాలసిస్ చేయించుకుంటున్నాడు. భార్య ఎల్లక్క కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇప్పటి వరకు అందిన చోటల్లా సుమారు రూ.8 లక్షల వరకు అప్పులు చేసి మరీ వైద్యానికి ఖర్చు చేశారు. ఒక కిడ్నీ మారిస్తే సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో గుడిసె తప్ప వేరే ఆస్తి లేని తాము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు రావాలని పోశయ్య భార్య ఎల్లక్క కన్నీరుమున్నీరవుతోంది. ప్రతి నెలా హైదరాబాద్‌కు డయాలసిస్‌కు వెళ్లిన ప్పుడల్లా సుమారు రూ.6వేల వరకు ఖర్చు అవుతోందని పోశయ్య ఆందోళన చెందుతున్నాడు. కనీసం తమకు రేషన్ కార్డు కూడా లేదని, ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు.. వైద్యానికి ఇప్పటికే అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేశామని ఇప్పుడు కిడ్నీ అమర్చేందుకు రూ.30 లక్షలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చేదని భార్య ఎల్లక్క కన్నీరు మున్నీరవుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని, దాతలు తన భర్త వైద్యానికి ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు. నా భర్తను కాపాడండి.. నాభర్త ఆరోగ్యం బాగా లేదు. కుటుంబం నడుసుడు కష్టమైతాంది. నేను కూలీ పనికి పోతాన. వచ్చిన డబ్బులతో ప్రతినెలా ఆస్పత్రికి తీసుకపోతాన. మాకు ఆస్తి కూడా లేదు. నా భర్త ఆరోగ్యం మంచిగ కావాలని తిరగని హాస్పటల్ లేదు. ఎన్నో చోట్ల అప్పుజేసినం. పెద్దసార్లు, గవర్న మెంటు ఆదుకోవాలి. నా భర్తకు వైద్యం అందించేందుకుసాయం అందించాలి.– జాడి ఎల్లక్క, వెంకంపేట