
తోపుడు బండి మీద వచ్చిన రాములు కుటుంబం
హూజూరాబాద్ : సార్లు.. నా భర్త పులి రాములుకు 90 ఏళ్లు ఉంటాయి. పదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సాకడం కష్టమైతంది. సీఎం సారు వస్తున్నాడని మా చుట్టు పక్కన వారు చెప్పిండ్రు. తోపుడు బండి మీద మా భర్తను జమ్మికుంట నుంచి తీసుకువచ్చిన. సారును కలువాలే అంటూ రాములు భార్య లచ్చమ్మ అధికారులను వేడుకోవడం పలువురిని కలిచివేచింది. నడవలేని స్థితిలో ఉన్న అతను భార్య సాయంతో తోప్పుడు బండి మీద ఎక్కించుకొని నాలుగు కిలోమీటర్ల దూరం తోసుకువచ్చింది. భర్త పరిస్థితి సీఎంకు చెప్పుకుంటానని అధికారుల కాళ్ల ఏళ్ల పడింది.
మరోక్క ప్రక్క ఎండ విపరీతంగా ఉండటంతో రాములు తట్టుకోలేకపోయాడు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో మళ్లీ ఎండలో తోప్పుడు బండి మీద భర్త తీసుకోని జమ్మికుంట వరకు తోసుకెళ్లింది. సభకు వచ్చిన జనం భార్య, భర్తల మలి దశ అనుబంధంపై చర్చించుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment