నేడు వైఎస్సార్ నాలుగో వర్ధంతి | today,the fourth anniversary of ys raja sekhar reddy | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్ నాలుగో వర్ధంతి

Published Mon, Sep 2 2013 4:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

today,the fourth anniversary of ys raja sekhar reddy

 సాక్షి, నల్లగొండ: నిరుపేదల పెన్నిధిగా, రైతు బాంధవుడిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కీర్తిగడించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దూరమై సోమవారంతో నాలుగేళ్లు గడిచాయి. ప్రజల్లో భౌతికంగా లేకున్నా.. అంతర్లీనంగా ఆయన గుర్తులు జ్వలిస్తూనే ఉన్నాయి. ఆయన అమలుచేసిన ఎన్నో పథకాలతో బడుగు, బలహీన వర్గాలు ఎనలేని లబ్ధిపొందాయి. కర్షకుడు, కార్మికుడు, విద్యార్థి, వికలాంగుడు, మహిళ, నేతన్న, వృద్ధాప్య.. ఇలా అన్ని వర్గాలకు ఆయన చేసిన సేవలు అజరామరం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో పునర్జన్మ నిచ్చారు. మహామనిషి శ్రీకారం చుట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి ఆయనను నిత్యం స్మరించుకుంటున్నారు. సోమవారం వైఎస్సార్ నాలుగో వర్ధంతిని ఘనంగా జరుపుకునేందుకు అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం, అన్నదానం, దుప్పట్లు, పండ్లు పంపిణీ తదితర కార్యక్రమాలు చేసేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. పల్లెపల్లెలో మహానేతను గుర్తుచేసుకునేందుకు సిద్ధమయ్యారు. మహానేత వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద తరలిరావాలని కోరారు.  
 
 
 3కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ ద్రోహులే
 ^èlండూరు, న్యూస్‌లైన్
 జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ ద్రోహులేనని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం చండూరు రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దగ్గరగా ఉంటూ కోట్లాది రూపాయాల కాంట్రాక్టులు దక్కించు కున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ నుంచి కూడ *3 వేల కోట్ల విలువ గల పనులను దక్కించుకున్నారన్నారు. ప్రభుత్వం నుంచి 10 శాతం డబ్బులను అడ్వాన్స్‌గా పొంది ఇందులో 5 శాతం ముఖ్యమంత్రి తమ్ముడికి అందిచారని పేర్కొన్నారు. ఈ నెల 7 తేదీన జరిగే క్యాబినేట్ సమావేశంలో తెలంగాణ బిల్లుపై తీర్మానం చేస్తారన్నారు. ఈ తీర్మానాన్ని అధిష్టానానికి పంపించనున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణలో ఉండి దాగుడు మూతలు ఆడుతున్న ద్రోహులను ఆంధ్రాకు తరిమి కొట్టాలన్నారు. సమావేశంలో జిల్లా నాయకుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement