
పేదింటి భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలు ఆకలితో ఉన్నారు. ‘పిల్లలు ఆకలితో ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవు. సహాయం చేయండి’ అని ఆశిష్ అనే యువకుడిని అడిగారు ఆ దంపతులు. పదో పరకో వారి చేతిలో పెట్టి తన దారిని తాను వెళ్లిపోలేదు ఆశిష్. దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కు తీసుకువెళ్లి వారు కోరిన పదార్థాలు తినిపించాడు. ఆ తరువాత వారిని ఆటో ఎక్కించి డ్రైవర్‌కు తానే డబ్బులు ఇచ్చాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియా యూజర్‌ల నుంచి భారీ స్పందన లభించింది. పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే పదిలక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
‘ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే వారి ఆకలి తీర్చడం మాత్రమే కాదు మీ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు అని ధైర్యం చెప్పడం కూడా’ అని రాశాడు ఆశిష్. ‘దయాగుణానికి ఉన్న గొప్పదనం ఏమిటంటే వినికిడి శక్తి లేని వారు కూడా వినగలరు. కంటిచూపు లేని వారు కూడా చూడగలరు. దయాగుణాన్ని మించిన సంపద లేదు’ అని ఒక యూజర్ రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment