ఆస్పత్రిలో వేణుతో తల్లిదండ్రులు
జగిత్యాలజోన్: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేకాని డొక్క నిండని దుస్థితి. అయినా విధి వారిని చిన్నచూపు చూసింది. ‘జీబీసీ సిండ్రోమ్’ అనే వ్యాధి రోడ్డుపాలు చేసింది. కూలీచేసిన పోగు చేసిన డబ్బులను కొడుకుకు సోకిన వ్యాధి నిర్దారించుకోవడానికే ఖర్చయ్యాయి. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక వ్యాధిని నయం చేసుకోడానికి ఆ కుటుంబం దయార్థహృదయుల వైపు చూస్తోంది. తన కొడుకుకు సోకిన వ్యాధిని గురించి తల్లిదండ్రులు నలువాల జనార్దన్, లక్ష్మి కన్నీళ్లతో వివరించారు.
జగిత్యాల మండలం లక్ష్మిపూర్‌కు చెందిన దంప తులు కూలీపని చేస్తుంటారు. వీరికి కొడుకు వేణు(20) ఉన్నాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివాడు. తరువాత చదివి ంచే స్థోమత లేకపోయినా, చదువుకుంటే ఉద్యో గం వస్తుందన్న కొడుకు మాటలకు అతడిని హైదరాబాద్‌లోని ఐటీఐ కళాశాలలో చేర్పిం చారు. రోజూవారిగా కళాశాలకు వెళ్లి వస్తుండగా ఓ రోజు కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి జీబీసీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకిందని తెలిపారు. దీంతో కొన్నిరోజులకు నరాలు పనిచేయకుండా అయ్యాయి. నడిచే ఓపికలేక మంచానికే పరిమితం అయ్యాడు. ఎదిగొచ్చిన కొడుకును బాగు చేయించుకోవాలని తల్లిదండ్రులు అప్పుచేసి వైద్యం చేయించడం మొదలు పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. కొంతకాలం వైద్యం అందిస్తే వ్యాధినయం అవుతుందని చెప్పడంతో జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యం ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్నహస్తాలకోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment