GBC
-
ఆపన్నహస్తం అందించరూ
జగిత్యాలజోన్: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేకాని డొక్క నిండని దుస్థితి. అయినా విధి వారిని చిన్నచూపు చూసింది. ‘జీబీసీ సిండ్రోమ్’ అనే వ్యాధి రోడ్డుపాలు చేసింది. కూలీచేసిన పోగు చేసిన డబ్బులను కొడుకుకు సోకిన వ్యాధి నిర్దారించుకోవడానికే ఖర్చయ్యాయి. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక వ్యాధిని నయం చేసుకోడానికి ఆ కుటుంబం దయార్థహృదయుల వైపు చూస్తోంది. తన కొడుకుకు సోకిన వ్యాధిని గురించి తల్లిదండ్రులు నలువాల జనార్దన్, లక్ష్మి కన్నీళ్లతో వివరించారు. జగిత్యాల మండలం లక్ష్మిపూర్కు చెందిన దంప తులు కూలీపని చేస్తుంటారు. వీరికి కొడుకు వేణు(20) ఉన్నాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివాడు. తరువాత చదివి ంచే స్థోమత లేకపోయినా, చదువుకుంటే ఉద్యో గం వస్తుందన్న కొడుకు మాటలకు అతడిని హైదరాబాద్లోని ఐటీఐ కళాశాలలో చేర్పిం చారు. రోజూవారిగా కళాశాలకు వెళ్లి వస్తుండగా ఓ రోజు కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి జీబీసీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకిందని తెలిపారు. దీంతో కొన్నిరోజులకు నరాలు పనిచేయకుండా అయ్యాయి. నడిచే ఓపికలేక మంచానికే పరిమితం అయ్యాడు. ఎదిగొచ్చిన కొడుకును బాగు చేయించుకోవాలని తల్లిదండ్రులు అప్పుచేసి వైద్యం చేయించడం మొదలు పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. కొంతకాలం వైద్యం అందిస్తే వ్యాధినయం అవుతుందని చెప్పడంతో జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యం ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్నహస్తాలకోసం ఎదురుచూస్తున్నారు. -
జీబీసీ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉద్రిక్తత
ఉరవకొండ : జీబీసీ హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. హంద్రీ-నీవా నీటిని తమ పొలాలకూ మళ్లించి ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు హెచ్చెల్సీ 9, 10వ డిస్ట్రిబ్యూటరీల కింద విడపనకల్లు మండలం పాల్తూరు, రాయంపల్లి, నెరిమెట్ల రైతులు కొందరు జీబీసీకు మళ్లించిన నీటిని గుర్తు తెలియని రైతులు గంటికొట్టారు. విషయం తెలుసుకున్న జీబీసీ ఆయకట్టు రైతులు వందలాది మంది జీబీసీ హెడ్ వద్దకు తరలివచ్చారు. జీబీసీకు ప్రభుత్వం హంద్రీ-నీవా నీటిని మళ్లించిందని, నీటిని మీరేలా తీసుకెళ్తారంటూ హెచ్చెల్సీ ఆయకట్టు రైతులను ప్రశ్నించారు. ‘మా పంటలు ఎండి పోతున్నాయ్...మాకు నీరివ్వండంటూ’ హెచ్చెల్సీ రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ చాలా సేపు ఘర్షణ వాతవరణం నెలకొంది. పోలీసుల రంగప్రవేశం విషయం తెలుసుకున్న వెంటనే పాల్తూరు, వజ్రకరూరు ఎస్ఐలు ఖాన్, జనార్దన్, ఉరవకొండ ఏఎస్ఐ మహేంద్ర తమ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జీబీసీ అధికారులు సైతం వచ్చారు. రైతులను నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే వారు ఎవరిమాటా వినలేదు. హంద్రీ-నీవా నీరు కేవలం జీబీసీ ఆయకట్టుకు మాత్రమే అందుతున్నాయని, తమ పంటలకూ నీరు ఇవ్వాల్సిందేనంటూ హెచ్చెల్సీ రైతులు పట్టుబట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.