iti college
-
విశాఖ ఓల్డ్ ఐటీఐ కాలేజీలో మాస్ కాపీయింగ్ కలకలం
-
ఐటీఐలో అగ్నిప్రమాదం
అసలే శిథిలావస్థలో ఉన్న భవనం. అగ్నిమాపక అనుమతులు లేకుండానే ఏళ్ల తరబడిగా ఆ ఐటీఐను అక్కడ నిర్వహిస్తున్నారు. శనివారం విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా భారీ పేలుడు. అగ్ని ప్రమాదం సంభవించడంతో భయాందోళనతో విద్యార్థులు బయటకు పరుగులు తీసిన ఘటన.. పెద్దాపురం రాజరాజేశ్వరి ఐటీఐ కళాశాలలో చోటు చేసుకుంది. సాక్షి, పెద్దాపురం(తూర్పుగోదావరి) : పట్టణ శివారు పాండవుల మెట్ట సమీపంలో రాజరాజేశ్వరి ఐటీఐ కళాశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. కళాశాల గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీ పేలుడుతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఫస్ట్ ఫ్లోర్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఉలిక్కిపడి పరీక్ష హాలు నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపకాధికారి బంగారు ఏసుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఫైర్ సేఫ్టీ అనుమతి తీసుకోకపోవడంతో కళాశాల యాజమాన్యంపై అగ్నిమాపక అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పిన అనుమతులు తీసుకోలేదన్నారు. పెను ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయిందని, లేకుంటే సుమారు 200 మంది విద్యార్థుల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు వాపోయారు. కళాశాల నిర్వహణ తీరుపై అధికారులు దృష్టి సారించకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. కళాశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అగ్నిమాపకాధికారి ఏసుబాబు మాట్లాడుతూ సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఫైర్ సేఫ్టీకి ఏర్పాట్లు చేసుకోవాలని కళాశాల యాజమాన్యానికి వివరించామని తెలిపారు. -
పాస్ కావాలంటే.. పైసలిస్తే చాలు
మోర్తాడ్ : పారిశ్రామిక రంగానికి సంబంధించి వివిధ కోర్సుల్లో శిక్షణనిచ్చేందుకు కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌లో నెలకొల్పిన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. వివిధ కోర్సుల్లో శిక్షణ కోసం అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు హాజరు శాతం తక్కువగా ఉంటే పరీక్షలు రాయనివ్వమనే నెపంతో కొందరు ఫ్యాకల్టీ(శిక్షకులు) అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షల్లో అభ్యర్థులు పాస్ కావాలంటే తాము వేసే మార్కులకు ఎంతో కొంత ఇచ్చుకోవాల్సిందే అని దబాయించి మరీ వసూళ్లకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీఐ కోర్సులలో శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్లు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకా శం కలుగడంతో పాటు స్వయం ఉపాధికి బ్యాం కుల నుంచి రుణం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు ఐటీఐ సర్టిఫికెట్లు ఉంటే వేతనాలు ఎక్కువ లభించే అవకాశం ఉంది. పైన పేర్కొన్న అంశాల ను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభ్యర్థులు బషీరాబాద్ ఐటీఐలో అడ్మిషన్లు తీసుకున్నారు. మూడు జిల్లాలకు చెందినవారు.. ఇక్కడ కోబా, డ్రెస్ మేకింగ్, ఫిట్టర్, డీజిల్ మెకానిజం, ఎలక్ట్రిషియన్, సివిల్, వెల్డర్ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 300ల మంది ఈ కోర్సులలో ప్రవేశం పొంది శిక్షణ పొం దుతున్నారు. ఇటీవల సెమిస్టర్ పరీక్షలు ప్రారం భం కాగా మరి కొన్ని రోజుల వరకు సాగనున్నా యి. విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు కీలకం కావ డం అక్రమార్కులకు వరంగా మారింది. శిక్షణ సమయంలో తరగతులకు హాజరుకాని విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అవకాశం లేదు. అయితే కొంత మంది అభ్యర్థులు అడ్మిషన్లు తీసుకున్నా తమ కుటుంబాల ఆర్థిక స్థితి బాగా లేక ఏదో ఒక పని చేసుకుంటూ పరీక్షలకు మాత్ర మే హాజరవుతున్నారు. మరి కొందరు మాత్రం తాము అడ్మిషన్ పొందిన కోర్సులకు సంబంధించి తమ గ్రామాల్లోనే పని చేసుకుంటూ పరీక్షలకు హాజరు కావాలని భావిస్తున్నారు. కోబా, డ్రెస్ మేకింగ్, సివిల్ రంగాల్లో శిక్షణ కోసం అడ్మిషన్లు తీసుకున్న వారు మాత్రం రెగ్యులర్‌గా వస్తుంటా రు. ఇది ఇలా ఉండగా కొన్ని కోర్సులకు సంబంధించి థియరీ మాత్రమే చెబుతుండగా ప్రాక్టికల్స్ కు సంబంధించి పరికరాలు లేక పోవడంతో అభ్యర్థులు తరగతులకు హాజరుకాకుండా ఉన్నారు. హాజరుశాతం వంక చూపుతూ.. అభ్యర్థుల అవసరాన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు హాజరుశాతం వంక చూపుతూ పరీక్షలు రాసేందుకు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో కొంత మంది అభ్యర్థులు హాజరు శాతం కోసం రూ.వెయ్యి నుంచి రూ.1,500ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. అలాగే సెమిస్టర్ పరీక్షల్లో పాస్ కావడానికి అవసరమైన మార్కులు వేయాలన్నా, మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వడానికి ఒక్కో అభ్యర్థి నుంచి అక్రమార్కులు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలకే కాకుండా ప్రాక్టికల్స్ పరీక్షల్లోను ఉత్తీర్ణత చేసేందుకు కూడా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో విద్యార్థి నుంచి రూ.3వేల వరకు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏటా అక్రమార్కులు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో దండుకుంటూనే ఉన్నారు. తాము అడిగినంత ఇచ్చుకోనివారిని ఇబ్బందులకు గురి చేసినట్లు పలువురు ఆరోపించారు. అక్రమార్కులను ప్రశ్నించే ధైర్యం చేస్తే తమను టార్గెట్ చేస్తారని అభ్యర్థులు వాపోతున్నారు. బషీరాబాద్ ఐటీఐలో కొన్నేళ్ల నుంచి అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసినవారు లేరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బషీరాబాద్ ఐటీఐలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని పలువురు కోరుతున్నారు. -
ఆపన్నహస్తం అందించరూ
జగిత్యాలజోన్: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేకాని డొక్క నిండని దుస్థితి. అయినా విధి వారిని చిన్నచూపు చూసింది. ‘జీబీసీ సిండ్రోమ్’ అనే వ్యాధి రోడ్డుపాలు చేసింది. కూలీచేసిన పోగు చేసిన డబ్బులను కొడుకుకు సోకిన వ్యాధి నిర్దారించుకోవడానికే ఖర్చయ్యాయి. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక వ్యాధిని నయం చేసుకోడానికి ఆ కుటుంబం దయార్థహృదయుల వైపు చూస్తోంది. తన కొడుకుకు సోకిన వ్యాధిని గురించి తల్లిదండ్రులు నలువాల జనార్దన్, లక్ష్మి కన్నీళ్లతో వివరించారు. జగిత్యాల మండలం లక్ష్మిపూర్‌కు చెందిన దంప తులు కూలీపని చేస్తుంటారు. వీరికి కొడుకు వేణు(20) ఉన్నాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివాడు. తరువాత చదివి ంచే స్థోమత లేకపోయినా, చదువుకుంటే ఉద్యో గం వస్తుందన్న కొడుకు మాటలకు అతడిని హైదరాబాద్‌లోని ఐటీఐ కళాశాలలో చేర్పిం చారు. రోజూవారిగా కళాశాలకు వెళ్లి వస్తుండగా ఓ రోజు కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి జీబీసీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకిందని తెలిపారు. దీంతో కొన్నిరోజులకు నరాలు పనిచేయకుండా అయ్యాయి. నడిచే ఓపికలేక మంచానికే పరిమితం అయ్యాడు. ఎదిగొచ్చిన కొడుకును బాగు చేయించుకోవాలని తల్లిదండ్రులు అప్పుచేసి వైద్యం చేయించడం మొదలు పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. కొంతకాలం వైద్యం అందిస్తే వ్యాధినయం అవుతుందని చెప్పడంతో జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యం ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్నహస్తాలకోసం ఎదురుచూస్తున్నారు. -
ప్రిన్సిపల్ సహా 8 మందిపై సస్పెన్షన్ వేటు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా కలెక్టర్ మురళి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థుల హాజరు, కళాశాల పరిసరాలను పరిశీలించారు. తనిఖీ సమయంలో కళాశాలల్లో సిబ్బంది, కనిపించక పోవడంతో ప్రిన్సిపాల్‌తో పాటు 8 మంది సిబ్బందిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. -
ఐటీఐలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కన్వీనర్ కె.వేమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మూడో విడత ప్రవేశం కోసం అభ్యర్థులు ఏ కాలేజీలో అయితే ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ కాలేజీలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో ఈనెల 22న, ప్రైవేటు ఐటీఐలలో ఈనెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు. -
ఐటీఐ నిర్మాణం చేపట్టాలని ధర్నా
సంగం : మండల కేంద్రమైన సంగం తిరుమనకొండ కాశీ విశేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరిదేవి ఆలయ సమీపంలో ఐటీఐ నిర్మాణపనులను ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలకు స్థలం కేటాయించి నాలుగేళ్లయినా ఇంకా నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు. పలుమార్లు దీనిపై అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందన్నారు. ధర్నాతో నెల్లూరు – ముంబై రోడ్డుపై ఇరువైపులా రాకపోకలు స్థంభించాయి. పోలీసుల చొరవతో ధర్నా విరమించారు. నాయకులు వెంకటరమణ, హరి, వెంకటేష్ పాల్గొన్నారు. -
ఐటీఐ కౌన్సెలింగ్ ప్రశాంతం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్ మొదటిరోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఐటీఐల జిల్లా కన్వీనర్ కృష్ణయ్య పర్యవేక్షణలో డీఎల్టీసీ, బాలికల ఐటీఐలలో కౌన్సెలింగ్ నిర్వహించారు. 7 ప్రభుత్వ, 29 ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశానికి కౌన్సెలింగ్ జరిగింది. 9.7 గ్రేడ్ నుంచి 7.8 గ్రేడ్ పాయింట్ల వరకు సాధించిన 1 నుంచి 527 వరకు గల విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవగా.. మొత్తం 269 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారికి కోరుకున్న కళాశాలల్లో సీట్లు కేటాయించారు. బుధవారం జరిగే కౌన్సెలింగ్‌కు 7.7 నుంచి 7.3గ్రేడ్ పాయింట్ల వరకు సాధించిన 528 నుంచి 1018 వరకు సంఖ్య గల విద్యార్థులు హాజరు కావాలని కన్వీనర్ కృష్ణయ్య కోరారు.