
ప్రిన్సిపల్ సహా 8 మందిపై సస్పెన్షన్ వేటు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా కలెక్టర్ మురళి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థుల హాజరు, కళాశాల పరిసరాలను పరిశీలించారు. తనిఖీ సమయంలో కళాశాలల్లో సిబ్బంది, కనిపించక పోవడంతో ప్రిన్సిపాల్‌తో పాటు 8 మంది సిబ్బందిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.