principal
-
హోలీ పేరుతో విద్యార్థినులతో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన
-
హోలీ పేరుతో విద్యార్థినులతో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన
కదిరి(శ్రీసత్యసాయి జిల్లా): జిల్లాలోని కదిరిలో ఓ మహిళా ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్ అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.కదిరి అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా చేస్తున్న వెంకటపతి.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హోలీ సందర్భంగా అమ్మాయిలను ఎత్తుకుని బురదలో పడేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.హోలీ పండుగ పేరుతో అమ్మాయిలతో ఇలా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. ఎంత హోలీ అయితే మాత్రం విద్యార్థినులతో ఆ రకంగా ప్రవర్తించడం కచ్చితంగా మంచి ఆలోచన ధోరణి కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మాయిలను తాకుతూ ఇలా బురదలో పడేయడం కలకలంగా మారింది. ప్రిన్సిపాల్ ప్రవర్తనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దుబాయ్‌లో భర్త .. స్కూల్ ప్రిన్సిపాల్‌కి కాల్ చేస్తున్న యువకుడు
ఫిలింనగర్ (హైదరాబాద్): ‘ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్ చేస్తా’ అంటూ వివాహితను బెదిరిస్తున్న యువకుడిపై ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకి సమతాకాలనీలో నివసించే వివాహిత (32) స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కాగా, 2016 నుంచి భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. గత ఏడాది తన స్కూల్లో అడ్మిషన్లకు సంబంధించి ఇన్‌స్ట్రాగాంలో ప్రకటన పోస్ట్ చేసింది. షేక్ వసీం అనే యువకుడు ఆమె ఇన్‌స్ట్రాగాం అకౌంట్‌ను ఫాలో అవుతూ ఆమె ఫోన్ నెంబర్‌ను అడ్మిషన్ కావాలంటూ అడిగి తెలుసుకున్నాడు. తరచూ ఫోన్ చేస్తుండడంతో ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో స్కూల్లో సిబ్బంది నుంచి ఆమె పర్సనల్ నెంబర్‌ను కూడా సేకరించాడు. అప్పటి నుంచి స్కూల్‌కు, ఆమె ఇంటికి తిరుగుతూ 24 గంటలూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో ఆమె పర్సనల్ నెంబర్‌ను కూడా లిఫ్ట్ చేయడం ఆపేసింది. ఈ నేపథ్యంలోనే షేక్ వసీం ర్యాపిడో డ్రైవర్‌ను బుక్ చేసుకుని ఆమె ఇంటికి పంపించి పార్శిల్ ఇస్తారు.. తీసుకురా అని చెప్పసాగాడు. ఆమె ఇంటికి వెళ్లిన ర్యాపిడో డ్రైవర్‌ను ఫోన్ ఆమెకు ఇవ్వు మాట్లాడతానంటూ వేధించడం మొదలుపెట్టాడు. గత ఏడు నెలల నుంచి నిందితుడి వేధింపులు రోజురోజుకు పెరిగాయి. ఇంటి చుట్టూ, స్కూల్ చుట్టూ తిరుగుతూ ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మరింత రెచ్చిపోయిన నిందితుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్ చేస్తానంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 78(2), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడని..
రామన్నపేట: నగరంలోని ములుగు రోడ్డు సమీపంలోని లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ అదే కళాశాలలోని మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ శుక్రవారం కళాశాల భవనం ఎదుట నిరసన తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కళాశాలలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి హర్షవర్ధన్‌రెడ్డిని టీచర్ల సమస్యలపై ప్రశ్నించినందుకు కళాశాల యాజమాన్యం తనను వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల సమస్యలు తీర్చాలని అడిగినందుకు తనకు కళాశాల యాజమాన్యం నోటీసులు ఇవ్వగా తీసుకోకపోవడంతో, కళాశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ హుకుం జారీ చేశారని తెలిపారు. ఏడు సంవత్సరాలుగా కళాశాలలో ఫిలాసఫీ సబ్జెక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ కింద నడుస్తున్న కళాశాలలో ప్రిన్సిపాల్ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రిన్సిపాల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, కళాశాలలో అధ్యాపకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రిన్సిపాల్‌కి భయపడి ఎవరూ బయటికి చెప్పుకోవడంలేదని వివరించారు. కళాశాలలో జరుగుతున్న అన్యాయాలపై ఉస్మానియా గ్యాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. -
ప్రిన్సిపాల్ కే స్టూడెంట్ వార్నింగ్
-
విద్యార్థినులపై ప్రిన్సిపాల్ కర్కశత్వం
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఐనపల్లి మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపాల్ అక్కడి విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఔటింగ్‌కు వెళ్లి అరగంట ఆలస్యంగా వచ్చారన్న కారణంతో రెండు గంటలపాటు బయట చలిలోనే నిల్చోబెట్టారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులకు ఆదివారం తల్లిదండ్రులను కలిసేందుకు ఔటింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో వారు తమ తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లారు.సాయంత్రం 4 గంటలలోపు వారు తిరిగి పాఠశాలలోకి వెళ్లాల్సి ఉండగా, అరగంట ఆలస్యంగా రావటంతో ప్రిన్సిపాల్ వారిని లోనికి అనుమతివ్వలేదు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదురుగానే చలిలో సుమారు రెండు గంటలపాటు వేచి ఉన్నారు. అటువైపుగా వెళ్లిన పోలీస్ సిబ్బంది గమనించి ఆరా తీసి పిల్లలను లోపలికి పంపాలని కోరినా ప్రిన్సిపాల్ వినిపించుకోలేదు. ఈ విషయాన్ని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వివరాలు తెలుసుకోవాలని డీటీడీఓకు కలెక్టర్ సూచించారు. దీంతో రంగంలోకి దిగిన డీటీడీఓ సదరు ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే విద్యార్థినులను హాస్టల్లోకి అనుమతివ్వాలని ఆదేశించడంతో ప్రిన్సిపాల్ దిగొచ్చారు. కాగా ప్రిన్సిపాల్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతోనూ నిత్యం అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, తమ పిల్లలతో మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. -
కొట్టుకున్న ప్రిన్సిపాల్ టీచర్
-
మీసాలు, గెడ్డాలు పెంచొద్దు.. కేఎంసీలో రాగ్యింగ్ కలకలం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఇటీవల కళాశాలలో చేరిన జూనియర్ (ఫ్రెషర్స్)ను సీనియర్లు వేధించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు కొందరు తమ తల్లిదండ్రుల ద్వారా కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనిపై అధికారులు అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఈ నెల 14వ తేదీ నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. తరగతి గదుల్లోకి కొందరు సీనియర్ విద్యార్థులు గుంపులుగా వచ్చి ర్యాగింగ్ చేస్తున్నట్లు సమాచారం. ‘జూనియర్ విద్యార్థులు బూట్లు వేసుకురాకూడదు. మీసాలు, గెడ్డాలు పెంచుకోవద్దు. మేం చెప్పిన యాప్‌లనే స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. మేము చెప్పినట్లు నడుచుకోవాలి...’ అని వివిధ రకాలుగా బెదిరించినట్లు తెలిసింది. కళాశాలలోని హాస్టల్లో సైతం మెస్‌కు వెళ్లి తమకు భోజనం తీసుకురావాలని, ప్లేట్లు కడగాలని హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. కొందరు సీనియర్ వైద్య విద్యార్థులు హాస్టల్లోనే సిగరెట్లు, మద్యం తాగుతున్నారని తెలిసింది. ఈ విషయాలపై విచారణ చేసేందుకు అధికారులు హాస్టల్ గేటు వద్దకు వెళ్లగానే వారికి సమాచారం అందుతుందని, అప్రమత్తం అవుతున్నారని తెలుస్తోంది. -
కోల్‌కతా కేసు: ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌కు సీబీఐ కోర్టు షాకిచ్చింది. మహిళా డాక్టర్ హత్యాచారానికి సంబంధించి సాక్ష్యాలు నాశనం చేసిన కేసులో ఘోష్ సీబీఐ కస్టడీని సెప్టెంబర్ 25దాకా కోర్టు పొడిగించింది. ఘోష్‌తో పాటు ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన కోల్‌కతా తాలా పోలీస్‌స్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా కోర్టు సెప్టెంబర్ 25 దాకా సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మహిళా డాక్టర్ హత్యాచారం వెనుక ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌తో కలిసి ఘోష్, మండల్ ఏదైనా కుట్ర చేశారా అని సీబీఐ అనుమానిస్తోంది. దీంతో వీరిద్దరి కస్టడీని పొడిగించాలని కోరగా కోర్టు అనుమతిచ్చింది. కుట్ర కోణంలో సీబీఐ వీరిని విచారించనుంది. కాగా, మెడికల్ కాలేజీలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘోష్ మెడికల్ లైసెన్స్‌ను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఇదీ చదవండి.. మాపైనే నిందలా..? సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. 44 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి,అల్లూరి సీతారామరాజు జిల్లా : రంపచోడవరం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాల కర్కశత్వానికి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి పాలయ్యారు. వివిధ కారణాలతో విద్యార్థినులకు పనిష్మెంట్ ఇచ్చారు ఆ ప్రిన్సిపల్.రెండు రోజుల పాటు కళాశాల విద్యార్థినులతో ఒక్కసారిగా 200 గుంజీలు తీయడం, వారితో పరుగులు తీయించడం చేయించారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థునులను నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థుల్ని అత్యవసర చికిత్స కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు కళాశాల సిబ్బంది.ప్రిన్సిపల్ కఠిన శిక్షకు నడవలేని విద్యార్థునులు నడవలేని స్థితిలో రంపచోడవం ఆస్పత్రికి వెళ్లారు. కొంతమంది విద్యార్థునులను ఆస్పత్రి లోపలికి ఎత్తుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యార్థులు. కళాశాల ప్రినిపల్ తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, నిర్దాక్షణ్యంగా శిక్షలు విధిస్తున్నారని, అన్నం తిన్న వెంటనే పరుగులు పెట్టిస్తున్నారని విద్యార్థునులు వాపోతున్నారు. -
సాక్ష్యాలను నాశనం చేశారు
కోల్‌కతా: దేశవ్యాప్త ఆగ్రహావేశాలకు, ఆందోళనలకు కారణమైన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఉదంతం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆర్.జి.కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ దారుణం జరిగిన సమయంలో ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నాశనం చేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆస్పత్రి నిధుల దురి్వనియోగం కేసులో ఆయన ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలను నాశనం చేయడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంతో పాటు కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయతి్నంచారని ఘోష్‌పై అభియోగాలు మోపింది. ఇవే అభియోగాలపై స్థానిక తలా పోలీసుస్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా అరెస్టు చేసింది. ఆర్.జి.కర్ ఆసుపత్రి తలా పోలీసుస్టేషన్ పరిధిలోకే వస్తుంది. అభిజిత్ మండల్‌ను శనివారం సీబీఐ తమ కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో మండల్‌ను అరెస్టు చేసింది. అతన్ని ప్రశ్నించడం ఇది ఎనిమిదోసారి అని. ప్రతిసారీ మండల్ భిన్నమైన కథనం చెబుతున్నాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. సందీప్ ఘోష్‌ను కస్టడీ కోరుతూ సీబీఐ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. సీబీఐ కస్టడీ నిమిత్తం ఘోష్‌ను హాజరుపర్చాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించిందని సీబీఐ అధికారి ఒకరు శనివారం తెలిపారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లో శవమై కని్పంచడం తెలిసిందే. ఆమెపై పాశవికంగా అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఒక రోజు అనంతరం ఆస్పత్రిలో పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణంపై వైద్యలోకం భగ్గుమంది. దీనివెనుక చాలామంది ఉన్నారని, ఆ వాస్తవాలను తొక్కిపెట్టేందుకు మమత సర్కారు ప్రయతి్నస్తోందని డాక్టర్లు ఆరోపించారు. వైద్యశాఖ కీలక డైరెక్టర్లు, కోల్‌కతా పోలీసు కమిషనర్ తదితరుల రాజీనామా కోరుతూ పశి్చమ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలతో వైద్యులు హోరెత్తిస్తున్నారు. అనంతర పరిణామాల్లో కేసు దర్యాప్తును సీబీఐకి కలకత్తా హైకోర్టు అప్పగించింది. దర్యాప్తు పురోగతిపై మూడు వారాల్లోగా నివేదిక సమరి్పంచాల్సిందిగా ఆదేశించింది. ఆ మేరకు సెపె్టంబర్ 17లోగా దర్యాప్తు సంస్థ నివేదిక సమరి్పంచనుందని సమాచారం. ఘోష్‌కు నేరగాళ్లతో లింకులు వైద్యురాలిపై దారుణం జరిగిన మర్నాడే సందీప్ ఘోష్ హడావుడిగా ఆస్పత్రిలో మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఘోష్ ఆదేశాలిచి్చ న లేఖను కూడా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ కేసు నిందితులతో ఘోష్‌కు నేరపూరిత బంధం ఉందని, వారితో కలిసి పలు తప్పుడు పనులకు కూడా పాల్పడ్డారని సీబీఐ గత వారమే అభియోగాలు మోపింది. -
‘చవితి’ సందేశాలు తొలగించిన ప్రిన్సిపాల్ అరెస్ట్
కోటా: రాజస్థాన్‌లోని కోటాలో గల ఒక పాఠశాలలో వాట్సాప్ గ్రూప్‌లోని వినాయక చవితి సందేశాలను తొలగించిన పాఠశాల ప్రిన్సిపాల్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు చుక్కలు చూపించారు. మత సామరస్యానికి ప్రిన్సిపాల్ విఘాతం కలిగిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.వివరాల్లోకి వెళితే కోటా జిల్లాలోని లాటూరి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వాట్సాప్‌లో ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ గ్రూప్‌లో వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు సందేశాలను పంపుతున్నారు. అయితే ప్రిన్సిపాల్ ఆ మెసేజ్‌లను డిలీట్ చేస్తూ వచ్చాడు. దీనికి ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను ఎందుకిలా చేస్తున్నారంటూ నిలదీశారు.విషయం పోలీసుల వరకూ చేరడంతో వారు వివాదం జరుగుతున్న పాఠశాలకు వచ్చారు. ఆందోళన చేస్తున్నవారిని శాంతింపజేశారు. తరువాత ప్రిన్సిపాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేశారు. ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సోషల్ మీడియాలో గ్రూప్ ఏర్పాటు చేసినట్లు బాపవార్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఉత్తమ్‌సింగ్ తెలిపారు. భరత్ అనే వ్యక్తి ఈ వాట్సాప్ గ్రూప్‌లో గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపాడు. పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపాల్ దానిని తొలగించారు. ఇలాంటి సందేశాలను అతను తొలగిస్తూ వచ్చాడు. కాగా పోలీసులు ప్రిన్సిపాల్‌పై బీఎన్ఎస్సెక్షన్ 196 (మత సామరస్యానికి భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేసుకుని, అరెస్ట్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
స్కూల్ ప్రిన్సిపాల్ ఓవరాక్షన్ .. నాన్‌వెజ్ తీసుకొచ్చాడని విద్యార్ధి సస్పెండ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ స్కూల్లో ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించాడు. అయిదేళ్ల విద్యార్ధిని క్లాస్‌లోకి మాంసాహారం తెచ్చాడని అతడిని సస్పెండ్ చేవారు. ఈ ఘటన అమ్రోహాలోని ఓ ప్రవేటు పాఠశాలలో వెలుగుచూసింది. గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం రోజు హిల్టన్ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న నర్సరీ విద్యార్ధి తన లంచ్ బాక్స్‌లో మాంసాహారాన్ని పాఠశాలకు తీసుకొచ్చాడు. ఇది గమనించిన ప్రిన్సిపల్ బాలుడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లి పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌ను నిలదీసింది. పాఠశాలలకు మాంసాహారం తీసుకొచ్చే పిల్లలకు మంచి బుద్దులు చెప్పడం తమకు ఇష్టం లేదని ఆమెతో ప్రిన్సిపల్ వాగ్వాదానికి దిగారు. అంతేగాక విద్యార్థి తరుచుగా మాంసాహారాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పాడు. మాంసాహారం తినేలా చేయడం వల్ల అందరినీ ఇస్లాంలోకి మార్చాలనుకుంటున్నాననని, తాను హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలనుకుంటున్నట్లు తనతో విద్యార్ధి చెబుతున్నాడని ఆరోపించారు. ప్రిన్సిపల్ మాటలపై స్పందించిన విద్యార్ధి తల్లి తన క్లాస్‌లోని విద్యార్థులు కేవలం హిందూ-ముస్లిం’ అంటూ వేరు చేసి మట్లాడుతున్నారని చేస్తున్నారంటూ తన కొడుకు గత మూడు నెలలుగా ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పింది. తన బిడ్డను అతని తరగతిలో కూర్చోనివ్వడం లేదని మహిళ ఆరోపించింది. అయితే దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్.. సదరు విద్యార్థికి చదువు నేర్పడం ఇష్టం లేదని, అతన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.విద్యార్ధి తల్లి, ప్రిన్సిపల్ మధ్య సంభాషణను వీడియో రికార్డు చేయడంతో.. వైరల్‌గా మారింది. దీంతో ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని, పాఠశాలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అమ్రోహి ముస్లిం కమిటీ.. జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాసింది. అమ్రోహా ప్రాథమిక విద్యాశాఖాధికారి మూడు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈ అంశంపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. -
బాలికపై ప్రిన్సిపాల్ భర్త లైంగిక దాడికి యత్నం
లక్కిరెడ్డిపల్లి: ఐదో తరగతి చదువుతున్న బాలికపై 55 ఏళ్ల ఓ కామాంధుడు అఘాయిత్యానికి యతి్నంచాడు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పరిమళ భర్తగా చెప్పుకొనే బాలసుబ్బయ్య ఆదివారం సాయంకాలం లడ్డూ ఆశ చూపి చిన్నారిని ప్రిన్సిపాల్ రూమ్‌లోకి పిలిచి లైగింక దాడికి యతి్నంచాడు. బాలిక ఎదురు తిరగడంతో దాడి చేశాడు. దీంతో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని హాస్టల్ భవనంలోకి వెళ్లిపోయింది. తోటి విద్యార్థులకు విషయం చెప్పడంతో వారు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ విషయం ఎవరికీ చెప్పొద్దొని ప్రిన్సిపాల్ విద్యార్థులను హెచ్చరించింది. సోమవారం మధ్యాహ్నం ఈ విషయం బయటకు పొక్కడంతో లక్కిరెడ్డిపల్లె పోలీసులు పాఠశాలకు చేరుకుని బాలసుబ్బయ్యను అదుపులోకి తీసుకున్నారు. రోజూ సాయంత్రం ప్రిన్సిపాల్ భర్త మరో ఇద్దరిని వెంటబెట్టుకుని పాఠశాల ఆవరణలోకి చొరబడతారని, తాము దుస్తులు మార్చుకుంటుంటే సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తారంటూ విద్యార్థులు విలపించారు. అనంతరం ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు.. అంటూ విద్యార్థులు పాఠశాల గేటు ఎదుట నినాదాలు చేశారు. అంతలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఆర్డీవో రంగస్వామి, తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్న పాఠశాల వద్దకు చేరుకుని తల్లిదండ్రులను సముదాయించారు. తమ పిల్లలను పంపించాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాగా, బాలిక బంధువులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల అదుపులో ఉన్న బాలసుబ్బయ్యకు దేహశుద్ధి చేశారు. బాలసుబ్బయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీంద్రబాబు చెప్పారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ పరిమళ, హెల్త్‌సూపర్‌వైజర్ లక్ష్మీదేవి, సెక్యూరిటీ గార్డు నాగలక్ష్మీలను సస్పెండ్ చేశారు. -
‘అంతం ఆరంభమైంది’: బెంగాల్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: మహిళా డాక్టర్ హత్యాచారం జరిగిన కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్ అరెస్టుపై బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. ‘ఇది అంతానికి ఆరంభం’అని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఘోష్ అరెస్టుపై బోస్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.తృణమూల్ కాంగ్రెస్‌ను ఉద్దేశించే బోస్ ఈ వ్యాఖ్యలు చేసుంటారన్న ప్రచారం జరుగుతోంది. బోస్ కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాతే ఘోష్ అరెస్టు జరగడం గమనార్హం. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన అక్రమాలపై ప్రిన్సిపల్ ఘోష్‌పై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే ఘోష్‌ను సోమవారం(సెప్టెంబర్2) సీబీఐ అరెస్టు చేసింది. -
సీబీఐకి ఆర్జీకర్ కాలేజి ప్రిన్సిపల్ అవినీతి కేసు
కలకత్తా: మహిళా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన కలకత్తా ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు షాక్ తగిలింది. ఆయనపై అవినీతి ఆరోపణల కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం(ఆగస్టు23) సిట్‌ను ఆదేశించింది.ప్రస్తుతం ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. సీసీటీవీ ఫుటేజీలు, కేసు డైరీతో సహా అన్ని వివరాలను శనివారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అందించాలని సిట్‌కు హైకోర్టు సూచించింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అనంతరం ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.అనాథ శవాల దందా, వాడేసిన సిరంజులు, ఇతర సామాగ్రిని రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకొనేవారని ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో సందీప్ ఘోష్‌ను ఇప్పటికే సీబీఐ విచారిస్తోంది. ఈ విచారణ సమయంలో ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో నలుగురికి సీబీఐ పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనుంది. -
Sadhna Saxena: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా తొలి మహిళ
భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగానూ ఆమె వార్తల్లో నిలిచారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మొదటి మహిళగా కూడా. సాధనా సక్సేనా పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్యా రికార్డుతో డిగ్రీ పొందింది. ఫ్యామిలీ మెడిసి¯Œ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, తల్లి–పిల్లల ఆరోగ్యంలో డిప్లొమాలతో సహా వివిధ విద్యా అర్హతలు సాధించిన సా«ధన సక్సేనా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరిన సాధనా స్విట్జర్లాండ్‌లోని స్పీజ్‌లో ఇజ్రాయెల్ డిఫె¯Œ ్స ఫోర్సెస్, మిలిటరీ మెడికల్ ఎథిక్స్‌తో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వార్ఫేర్లో శిక్షణ పొందింది. లెఫ్టినెంట్ జనరల్ నాయర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఇపి) 2019లోని మెడికల్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్లో కొంత భాగాన్ని రూపొందించడానికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీకి నిపుణులైన సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. మెరిటోరియస్ సర్వీస్ కోసం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ బాధ్యతలు నిర్వహించింది. భారత రాష్ట్రపతిచే విశిష్ట సేవా పతకం పొందింది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారూ గత ఏడు దశాబ్దాలుగా సాయుధ దళాలలో పని చేశారు. -
ప్రిన్సిపాల్ గదిలో బీరు సీసాలు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో మద్యం సీసాలు దర్శనమివ్వడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తరచూ మద్యం తాగుతూ ప్రిన్సిపాల్ శైలజ తమను వేధింపులకు గురిచేసు్తన్నారని వారు ఆరోపించారు. ప్రిన్సిపాల్ అర్థరాత్రి వేళ సహాయ కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి మద్యం తాగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రిన్సిపాల్ రూమ్ కు తాళం వేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీవో వేణుమాధవ్‌రావు, కళాశాలలో ఆర్సీవో అరుణకుమారి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి, డీఎస్పీ రవికుమార్ కశాశాలకు చేరుకున్నారు. వాస్తవాలను విచారించి ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థినులు శాంతించలేదు. ఈ ఘటనపై మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్ బీఎస్ లతను నియమిస్తూ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రాథమిక విచారణ ఆధారంగా కళాశాల ప్రిన్సిపాల్‌ను బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు. -
Video: కుర్చీ నుంచి స్కూల్ ప్రిన్సిపాల్‌ను బలవంతంగా తొలగించి
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలి కుర్చీపై తీవ్ర దుమారం రేగింది. పాత హెడ్ మాస్టర్‌ను కుర్చీ నుంచి బలవంతంగా తొలగించి, కొత్త ప్రధానోపాధ్యాయురాలిని కూర్చోబెట్టారు మిగతా ఉపాధ్యాయురాలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇందులో పాఠశాల సిబ్బంది బృందం ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి ప్రవేశించి ఆమెను వెంటనే తన కుర్చీని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రిన్సిపాల్ పరుల్ సోలమన్ నిరాకరించడంతో బలవంతంగా ఆమెను కుర్చీ నుంచి బయటకు తీసేశారు. ప్రిన్సిపల్ ఫోన్ కూడా లాక్కున్నారు.అనంతరం కొత్తగా నియమితులైన ప్రిన్సిపాల్‌ను ఆమె స్థానంలో కూర్చున్నారు, అక్కడ ఉన్న వారు చప్పట్లతో ఆమెకు స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని బిషప్ జాన్సన్ బాలికల పాఠశాలలో ఈ నాటకీయ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ప్రిన్సిపాల్ సీటును బలవంతంగా ఖాళీ చేయించడంపై పరుల్ సోలమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని ఆ స్కూల్ యాజమాన్యం పేర్కొంది. అయితే గతంలో పాఠశాలలో జరిగిన యూపీపీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆమె స్థానంలో మరొకరిని కూర్చొబెట్టారు. పేపర్ లీక్ ముఠా సభ్యుడు కమలేష్ కుమార్ పాల్ అలియాస్ కేకేకు ప్రిన్సిపల్ పరుల్ సోలోమన్‌కు సంబంధం ఉన్నట్లు బయటపడింది. దాంతో ఆమెను తొలగించారు. అయితే ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపాల్ షిర్లీ మాస్సీని నియమించిన తర్వాత కూడా సోలమన్ ఆమె సీటును ఖాళీ చేయడానికి నిరాకరించడంతో ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఈ గందరగోళం నెలకొంది.Video: UP Principal Forcibly Removed From Office, Her Replacement WatchesFacts apart, y shld no action b taken agast d lawyer who with his band on acts extra judicially.Assuming he is for clg, yet,his role wud be limited to court @myogioffice https://t.co/CesaPaMbzl— Nawaz Haindaday مھمد نواز ہئنرارے (@nawazhaindaday) July 6, 2024 -
Viral Video: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్ దాడి
విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్మిస్ట్రెస్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్‌పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్‌పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ గొడవకు దిగింది. అంతేగాక టీచర్‌పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్‌తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024 -
చదువు శక్తినిస్తుంది
‘ఈ రోజులను చూస్తుంటే మా రోజుల్లోనే అమ్మాయిలకు తగినంత స్వేచ్చ,అనుకున్నవి సాధించే ధైర్యం, సమాజాన్ని అర్ధం చేసుకునే పరిణతిని పొందారు’ అనిపిస్తుంటుంది అన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కమలా మీనన్. తిరుపతి పద్మావతి మహిళా కళాశాల మూడవ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన కమలా మీనన్ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్నారు. భర్త డగ్లస్ ఎమ్ కాక్రన్ జ్ఞాపకాలతో పాటు, 86 ఏళ్ల జీవితంలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు తనను ఎలా నిలబెట్టాయో వివరించారు. ‘‘చదువు అమ్మాయిలను శక్తిమంతులను చేస్తుంది. ఈ విషయాన్ని ఆ రోజుల్లోనే మా అమ్మ గుర్తించారు..’ అంటూ గతకాలపు విషయాలను మన ముందుంచారు. చదువు వేసిన మార్గం.. ‘‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవారు.అమ్మానాన్నలకు ఎనిమిది మంది సంతానం. అక్కతోపాటు ఆరుగురు అన్నలు నాకు. ఆడ, మగ అనే వివక్ష ఏ మాత్రం లేదు. అందరికీ మంచి చదువులు చదువుకునే అవకాశం ఇచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఆనర్స్ పూర్తయ్యాక బెంగుళూరు మౌంట్ కార్మెల్ కాలేజీలో లెక్చరర్‌గా ఐదేళ్లు పని చేశాను. ఆ ఎక్స్‌పీరియెన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. అప్పుడు చదువుకునే అమ్మాయిల శాతం కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మార్పు కోసం తిరిగి మద్రాస్‌కు వచ్చేశాను. తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో పొలిటికల్ విభాగంలో టెంపరరీ జాబ్ గురించి పేపర్లో ప్రకటన చూసి, అప్లై చేసి, సెలక్ట్ అయ్యాను. ఆరు నెలల తర్వాత పర్మినెంట్ అయ్యింది. సవాళ్లను తట్టుకుని ఎదుగుతూ.. జీవితంలో సవాళ్లు, బాధలు ఎక్కడి నుంచైనా ఎదురు కావచ్చు. నన్ను విపరీతంగా బాధపెట్టే సంఘటన నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది. మా అక్క ఢిల్లీలో ఉండేవారు. జబ్బు పడి అక్క, నాన్న ఇద్దరూ ఒకే రోజు చనిపోయారు. ఈ సంఘటన నన్ను బాగా కదిలించాయి. ఆ టైమ్‌లో డా.రాజేశ్వరి మూర్తి కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉండేవారు. ఆవిడ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినప్పుడు సెలక్షన్ కమిటీ నన్ను ఇన్ఛార్జిగా ఎంపిక చేసింది. నా మైండ్ కూడా ఛేంజ్ కావాలనుకొని, 1975లో ఆ బాధ్యత తీసుకున్నాను. ఇంటర్వ్యూ ద్వారా టెంపరరీ జాబ్ వచ్చింది. తర్వాత పర్మినెంట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా అవకాశం వచ్చింది. నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో విదేశాలకు వెళ్లిన మరో సీనియర్ మహిళా లెక్చరర్ తిరిగి వచ్చారు. అప్పుడు మేనేజ్మెంట్ సీనియర్ కాబట్టి ఆవిడను నా ప్లేస్‌లో రీ ప్లేస్ చేశారు. అప్పటికే నన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది, ఆ తర్వాత మరొకరికి ఇచ్చింది. దీంతో నా పొజిషన్ కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను గెలిచాను. అలా యూనివర్శిటీకి 3వ మహిళా ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఆ తర్వాత 1993లో రిటైర్ అయ్యేవరకు ప్రిన్సిపల్‌గా చేశాను. 1997 వరకు దేవస్థానం ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా వర్క్ చేశాను. లెక్చరర్‌గా ఎంతో మంది విద్యార్థులను చూశాను. ఎంతోమంది విద్యార్థులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటికీ కలిసేవారు, ఫోన్లు చేసి మాట్లాడేవారున్నారు. ఆత్మీయులుగా మారినవారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, మొదటి తరం అమ్మాయిలే అక్కడంతా. వారిలో భవిష్యత్తుని చక్కగా మార్చుకోవాలనే పరిణతి బాగా కనిపించేది. వారి భవిష్యత్తుకు ప్రత్యేక క్లాసులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేర్చాం. లెక్చరర్లు ఎంతో సపోర్ట్‌గా నిలిచేవారు. నాటి ఆ విద్యార్థుల్లో నేడు ఎంతోమంది పెద్ద పెద్ద పొజిషన్లలో, దేశ విదేశాల్లో ఉన్నారు. జీవితంలో ముఖ్యమైన మలుపు 1979–80లో నాటి మద్రాస్‌లో సౌత్ ఇండియా అమెరికా రాయబార కార్యాలయానికి డగ్లస్ ఎమ్ కాక్రన్ కాన్సులేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలేజీ సెమినార్ సందర్భంగా మద్రాస్ నుంచి తిరుపతికి సెమినార్‌కు వచ్చారు. అక్కడ డిస్కషన్స్ అన్నీ పూర్తయి, వెళ్లిపోయారు. ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. చెన్నైలోని అమెరికన్ ఎంబసీ ఎదుట నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్‌గా ఉండమని రాసిన నోట్ తిరిగి మమ్మల్ని కలిపింది. ఆ తర్వాత జరిగిన డిస్కషన్స్ మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చాయి. 1985లో మేం పెళ్లి చేసుకున్నాం. ఆ విధంగా శ్రీమతి డగ్లస్ ఎమ్ కాక్రన్ అయ్యాను. జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసాను అనిపించేది. మా అమ్మను ఆమె సొంత కొడుకుల కన్నా డగ్లస్ గొప్పగా చూసుకున్నారు. ఇన్నేళ్ల మా జీవనంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇటీవల డగ్లస్ అనారోగ్యంతో భౌతికంగా దూరమయ్యారు. అయితేనేం.... ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయి. అవే నన్ను శక్తిమంతురాలిని చేస్తున్నాయి. విశ్రాంత జీవనంలో.. రిటైర్ అయినా కొన్ని విదేశీ కంపెనీలు, సూపర్మార్కెట్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేవారు డగ్లస్. నేను రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలో ఇద్దరమూ ఆలోచించుకున్నాం. అందుకు, సికింద్రాబాద్‌లోని బోయినపల్లి మాకు అనువైనదిగా అనిపించింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసే వారి పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశ్యంతో వారిని ఒక చోట చేర్చి చదువులు చెప్పేవాళ్లం. కాలనీలోని చదువుకున్న మహిళల చేత ట్యూషన్స్ చెప్పించేవాళ్లం. వారి పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చేర్పించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునేవాళ్లం. అలా, ఆ పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అమ్మానాన్నల పెంపకంలోనూ, చదువులోనూ, సమాజంలో మనకు లభించే స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ స్వేచ్ఛను మనకు అనుకూలంగా మలచుకోవాలి. అదే మనల్ని శక్తిమంతులుగా నిలుపుతుంది అది ఏ దేశమైనా అని నేనూ కాక్రన్ అనుకునేవాళ్లం’’ అంటూ నేటి తరంలో వస్తున్న మార్పులను అన్వయించుకుంటూ తెలియజేశారు’’ కమలా మీనన్. – నిర్మలారెడ్డి -
అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం
అనంతపురం: వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేసిన ఘటన అనంతపురం పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మేనల్లుడి చేతిలో హతమైన మూర్తిరావు (58) గురించి తెలిసేలోపే భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె. కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు. భార్య కళ్లెదుటే దారుణం.. మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. వీటిని అద్దెకు ఇచ్చేసి ఆయన నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబసభ్యులతో ఉంటున్నారు. ఇంట్లో అద్దెకున్న మణికంఠ అనే వ్యక్తి ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఫోన్ చేశారు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో తన భార్య శోభతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా... నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు. హతుడి పక్కనే కూర్చొని.. మూర్తిరావును హతమార్చిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. వివాదరహితుడు మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. -
మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఏడుకొండలు
ఒంగోలు అర్బన్: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఏడుకొండలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పూర్తి అదనపు బాధ్యతలతో ప్రిన్సిపాల్‌గా ఉన్న డాక్టర్ సుధాకర్‌బాబు స్థానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఆంధ్రమెడికల్ కాలేజీలో రేడియోథెరపీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఏడుకొండలు ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. దీంతో ఆయన మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపాల్‌ను ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జీజీహెచ్ అధికారులు అభినందనలు తెలిపారు. -
నేడు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచే కొత్తగా తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. శుక్ర వారం సీఎం కేసీఆర్ ఈ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఇందులో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్ర సొంత నిధులతో ఇలా పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశంలో ఇదే ప్రథమమని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా.. సీఎం కేసీఆర్ గత తొమ్మిదేళ్లలోనే కొత్త 21 కాలేజీలను ఏర్పాటు చేశారని అంటున్నాయి. వచ్చే ఏడాది మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారని.. వాటితో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యం పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. -
అన్నం పెడ్తలేరు.. ఆరోగ్యం పట్టించుకోరు
ఆసిఫాబాద్‌రూరల్: ‘మెనూ ప్రకారం భోజనం పెడ్తలేరు.. అన్నంలో పురుగులు వచ్చినా పట్టించుకుంటలేరు.. నైట్ వాచ్మెన్ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు’ అంటూ గిరిజన విద్యార్థినులు కన్నీమున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల బాలికలు సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు. సుమారు ఆరు గంటలపాటు వివిధ చోట్ల నిరసన తెలిపారు. గిరిజన గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 600 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి పట్టించుకోకుండా వేధిస్తున్నా రని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. బుధవారం ఉదయం పాఠశాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ఎండలోనే బైఠాయించారు. విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో భోజనం సక్రమంగా పెట్టడం లేదని, నైట్ వాచ్మెన్ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. డార్మెంటరీలు శుభ్రంగా లేవని, రెండు రోజులుగా నీళ్లు రావడం లేదని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్ ఇష్టారీతిన తమను తిడుతూ భయపెడుతుందని వి లపించారు. ఈ విషయం ఆర్సీవో దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న తమ బా ధను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రి న్సిపాల్‌ను తొలగించే వరకూ గురుకులానికి వెళ్లమ ని భీష్మించుకు కూర్చున్నారు. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఓ విద్యార్థిని తండ్రి అరటి పండ్లు, వాటర్ప్యాకెట్లు తీసుకొచ్చి వారి ఆక లి తీర్చడం గమనార్హం. పోలీసులు, పాఠశాల టీచ ర్లు ఎంత బతిబాలినా విద్యార్థినులు మొండికేయడం.. ఎండలో విద్యార్థినుల అవస్థలు గమనించిన టీచర్లు సైతం కన్నీరుపెట్టుకున్నారు. టీచర్లను చూసి విద్యార్థినులూ కన్నీటిపర్యంతమయ్యారు. కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా విద్యార్థినులు వెనక్కి తగ్గకుండా ఆమెకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వివిధ విద్యా సంఘాల నాయకులు విద్యార్థులకు మద్దతు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సురేశ్ ఘటన స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వారు వినలేదు. అయితే విద్యార్థినులను సముదాయించి తీసుకురావాలని అధ్యాపకులు, ఉపాధ్యాయులపై ప్రిన్సిపాల్ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో కొంత మంది అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థినులతో మాట్లాడి గురుకులానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా విద్యార్థినులు ‘భోజనం చేయమని.. ప్రిన్సిపా ల్ తొలగించే వరకు ఇక్కడే కూర్చుంటాం’ అని గేటు ఎదుట బైఠాయించారు. అనంతరం పోలీసులు వారిని సముదాయించి లోపలికి పంపించారు. కొద్దిసేపు చెట్ల కింద కూర్చున్న విద్యార్థులు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పాఠశాలలోకి వెళ్లారు. విద్యార్థినుల ఆరోపణలపై ప్రిన్సిపాల్ జ్యోతిలక్షి్మని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు. ఆస్పత్రికి తీసుకెళ్తలేరు.. ప్రిన్సిపాల్‌కు చెప్పినా సమస్యలను పట్టించుకోవడం లేదు. జ్వరం వచ్చినా ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదు. ప్రస్తుతం ఓ విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. – స్వాతి, ఇంటర్ అన్నంలో పురుగులు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. అన్నంలో పురుగులు వస్తున్నాయి. ప్రిన్సిపాల్‌కు చెప్పినా అదే తినాలి అని చెబుతున్నారు. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. – ఆర్తి, తొమ్మిదో తరగతి వేరే కళాశాలలో చేర్పిస్తా మా పాప నిఖిత గిరిజన గురుకులంలో ఇంటర్ చదువుతోంది. కళాశాలలో కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నానని ఏడుస్తోంది. టీసీ తీసుకుని వెళ్లి వేరే కళాశాలలో చేర్పిస్తా. – రమేశ్, విద్యార్థిని తండ్రి -
ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు
సాక్షి, ఆసిఫాబాద్: ప్రిన్సిపాల్ తీరును నిరసిస్తూ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బుధవారం రోడ్డెక్కారు. రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ సముదాయం వద్ద ధర్నాకు దిగారు. తమ సమ స్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఉదయం అల్పాహారం తినకుండానే పాఠశాల నుంచి బయటకొచ్చారు. ఉదయం 7.30 గంటలకు అంబేడ్కర్ చౌక్ వద్ద రహదారిపై ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి తమను వేధిస్తోందని, సమయానికి భోజనం, వైద్యం అందించడం లేదని, నరకయాతన అనుభవిస్తున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు కాపలాదారులు మద్యం సేవించి విధులకు వచ్చి తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వాపోయా రు. సమస్యలు పరిష్కరించాలని ప్రిన్సిపాల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కినట్లు విద్యార్థినులు వెల్లడించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు పలువురు కలెక్టరేట్ వద్దకు వచ్చి వారికి మద్దతుగా నిలిచారు. ఆరు గంటలపైగా ఎండలోనే బైఠాయించడంతో కొందరు విద్యార్థినులు సొమ్మసిల్లిపడిపోయా రు. టీచర్ల విజ్ఞప్తికి స్పందించి పాఠశాలకు వెళ్లి అక్కడే చెట్ల కింద నిరసన కొనసాగించారు. చివరికి పోలీసులు సర్దిచెప్పడంతో విద్యార్థినులు భోజనాలకు వెళ్లడంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విద్యార్థినులు రక్తంతో లేఖ..
లక్నో: ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లో బాలికలను లైంగికంగా వేధింపులకు గురి చేసినందుకు స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానోపాధ్యాయుడు రాజీవ్ పాండే తమను ఆఫీస్‌కు పిలిచి అసభ్యంగా తాకేవాడని విద్యార్థినులు పోలీసులకు తెలిపారు. తమ తల్లిదండ్రులకు ఈ విషయాలు తెలపడానికి భయపడేవారమని చెప్పారు. ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విద్యార్థినులు రక్తంతో లేఖ రాశారని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు వేధింపుల గురించి చెప్పగా.. ప్రిన్సిపల్‌కు, తమ కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగిందని విద్యార్థినులు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చి దాడి చేశారని తమపైనే ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. ఈ క్రమంలో రెండు వర్గాల తరపు నుంచి కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందుకు పోలీసులు తమను బెదిరింపులకు గురిచేసి నాలుగు గంటలు స్టేషన్లో ఉంచారని పేర్కొన్నారు. ఇకపై తరగతులకు హాజరకావద్దని పోలీసులు హెచ్చరించినట్లు లేఖలో రాశారు. ప్రిన్సిపల్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినందున పోలీసులు చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు లేఖలో తెలిపారు. తామంతా మీ కూతుళ్లమని పేర్కొంటూ.. తమకు న్యాయం చేయాలని సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అనంతరం స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని గాజియాబాద్ సీనియర్ పోలీసు ఆఫీసర్ సలోని అగర్వాల్ తెలిపారు. ఇదీ చదవండి: 'నాకే సలాం కొట్టవా..?' బాలునిపై కాంగ్రెస్ నేత కొడుకు దాడి -
కీచక ప్రిన్సిపాల్.. అబార్షన్ అయిన యువతి ధైర్యం చేయడంతో..
(విజయవాడపశ్చిమ): విద్యార్థిని బెదిరించి ఆమైపె పలు మార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా గర్భస్రావం చేయించిన నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ అజిత పేజెండ్ల పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అరెస్టుపై గురువారం కొత్తపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో డీసీపీ అజిత పేజెండ్ల మాట్లాడుతూ 2017 నుంచి 2020 వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన యువతి ఫణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో జీఎం నర్సింగ్ కోర్సును అభ్యసించిందన్నారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి ఆ యువతిని భయపెట్టి, బెదిరించి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. నెలసరి రాకపోవడంతో మూడు సార్లు బలవంతంగా గర్భస్రావం చేయించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. దీంతో నర్సింగ్ చేయలేక, ఆ యువతి స్వగ్రామం వెళ్లిపోయిందని చెప్పారు. ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి మరోమారు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విషయం తెలుసుకున్న ఆ యువతి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు ఎన్టీఆర్జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె. ఆదేశాల మేరకు నిందితుడు రవీంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ కె. హనుమంతరావు, కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు
-
Video: విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు
ఇద్దరు మహిళలు గొడవ పడటానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న విషయాలతో మొదలైన వాటిని కూడా ఎంత దూరమైనా తీసుకువెళ్లగలరు. కుళాయి వద్ద, మెట్రో, రైలు, బస్సు వంటి చోట్ల సీట్ల విషయంలో ఆడవాళ్లు గొడవ పడటం సాధారణంగా చూస్తూనే ఉంటాం.. కానీ ఓ పాఠశాలలో ముగ్గురు మహిళా టీచర్లు ఓ రేంజ్లో కొట్టుకున్నారు. ఒకరినొకరు జుట్టు పట్టుకొని, చెప్పులతో వాయించుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిహార్‌లోని పాట్నా జిల్లాల్లో ఈ ఉదంతం వెలుగు చూసింది. బిహ్తాలోని పాఠశాలలోని క్లాస్‌రూమ్‌లోని ఏదో విషయంలో మహిళా ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఒకరిని మరొకొరు కొట్టుకునేదాకా వెళ్లింది. ప్రధానోపాధ్యాయురాలిని కాంతి కుమారిగా గుర్తించగా.. మరో టీచర్ పేరు అనితా కుమారి. వీరిద్దరికి ముందుగా తరగది గది లోపల గొడవ ప్రారంభమైంది. ఈ ఘర్షణలో మరో ఉపాధ్యాయురాలు కూడా చేరింది. చదవండి: రేపు సీఎం కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ.. విషయమిదే.. ఇద్దరు టీచర్లు కలిసి క్లాస్ రూమ్‌లో విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తరువాత బయటకు వచ్చి చేతిలో చెప్పులు పట్టుకుని ప్రిన్సిపాల్ వెంట పరుగెత్తీ మరి దాడి చేశారు. ముగ్గురూ పక్కనే ఉన్న పోలాల్లో పడిపోయినా.. గొడవ ఆపకుండా కొట్టుకున్నారు. కర్రలు, చెప్పులతో ఒకరినొకరు తన్నుకున్నారు. ఈ గొడవను ఆపేందుకు పలువురు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీనిని క్లాస్ రూమ్‌లోని విద్యార్థులు ఫోన్లో రికార్డ్ చేశారు. దీనికి పాఠశాల అధికారి నవేష్ కుమార్ స్పందించారు. ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ మధ్య వ్యక్తిగత వివాదం కారణంగా గొడవకు దారితీసిందని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలిందన్నారు. ఘర్షణలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులను వివరణ కోరినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని.. తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చదవండి: ఆరుసార్లు అమ్మాయి.. మళ్లీ అదే పరిస్థితి.. కన్నీరు పెట్టిస్తున్న ‘అమ్మ’ ఉత్తరం -
ఆ పోస్టులకు ఏజ్ భారమైంది!
వైద్య విద్య విభాగంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించిన వయో పరిమితిని 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచే బిల్లును గవర్నర్ తిరస్కరించడమే ఇందుకు కారణం. దీనివల్ల డీఎంఈ సహా ఆయా పోస్టుల వయో పరిమితి 61 ఏళ్లకే పరిమితం కానుండగా.. మరోవైపు మెడికల్ కాలేజీల ప్రొఫెసర్ల వయో పరిమితి 65 ఏళ్లుగా కొనసాగనుంది. ఇలా ఒకే విభాగంలో రెండు రకాల వయో పరిమితి కొనసాగనుండటంతో గందరగోళం ఏర్పడుతోంది. వాస్తవానికి మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్ల సీనియారిటీ ఆధారంగానే.. వారిలో కొందరిని డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లుగా పోస్టింగ్ ఇస్తారు. అయితే ఈ పోస్టింగులు పొందిన తర్వాత వయో పరిమితి తగ్గిపోనుండటం సంక్షోభానికి దారితీస్తోంది. డీఎంఈల వయో పరిమితి పెంచకపోవడంతో.. ప్రస్తుతం వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ)గా డాక్టర్ రమేష్‌రెడ్డి ఉన్నారు. డీఎంఈ కార్యాలయంలో ముగ్గురు అదనపు డీఎంఈలుగా పని చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, అనుబంధ ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లు పనిచేస్తున్నారు. అయితే నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వం ప్రొఫెసర్ల వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచింది. కానీ అప్పట్లో డీఎంఈ తదితర పోస్టుల వయో పరిమితి పెంపు మాత్రం జరగలేదు. ఆ పోస్టులకు ముందుకొచ్చేదెవరు? గవర్నర్ తాజా నిర్ణయంతో ఆయా పోస్టుల్లో పనిచేసే 61 ఏళ్లు పైబడినవారు అనర్హులవుతారు. ప్రస్తుతం డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి సహా ఎనిమిది మంది ఇప్పటికిప్పుడు రిటైర్ కావలసి వస్తుంది. అంతేకాదు వచ్చే ఏడాదిలోగా మరో ఏడెనిమిది మంది కూడా పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. గవర్నర్ నిర్ణయం ఇకముందు కూడా అమలైతే ప్రస్తుతం పనిచేసే ప్రొఫెసర్లలో ఎంతమంది.. అడిషనల్ డీఎంఈలు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా పని చేసేందుకు ముందుకు వస్తారు?, ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు కొనసాగే అవకాశాన్ని వదులుకుని 61 ఏళ్ల వయో పరిమితి ఉన్న పోస్టులకు ఎందుకు వెళతారు? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ అక్కడ 61 ఏళ్ల వరకు ఉండి, తిరిగి ప్రొఫెసర్‌గా కాలేజీల్లో 65 ఏళ్ల వరకు కొనసా గే అవకాశం ఉన్నా బాగుండేదని, కానీ ఆ చాన్స్ లేదని అంటున్నారు. పైగా జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్‌గా వెళ్లడం కంటే హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు పనిచేసుకోవడమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తక్షణ కర్తవ్యం ఏమిటి? వయో పరిమితి పెంపు బిల్లును గవర్నర్ తిరస్కరించడంతో, భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గవర్నర్ నిర్ణయాన్ని అమలు చేయడమా? లేక బిల్లును మరోసారి అసెంబ్లీలో పాస్ చేసి తిరిగి పంపడమా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై ఏదో ఒకటి తేలేవరకు...ఆయా పోస్టుల్లో 61 ఏళ్లు దాటిన వారు దిగిపోవాలా? లేదా కొనసాగాలా? అన్నది కూడా తేల్చాల్సి ఉంది. ఒకవేళ వారిని తొలగిస్తే ఆయా పోస్టుల్లో ఉన్నవారు కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రొఫెసర్ పోస్టుకు 65 ఏళ్లుండగా, ప్రొఫెసర్ పోస్టులు వదులుకుని వచ్చే అడిషనల్ డీఎంఈలు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల వయో పరిమితిని 61 ఏళ్లకే పరిమితం చేయడం ఏమేరకు కరెక్ట్ అనే వాదనతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది కొత్త మెడికల్ కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు కలిపి మొత్తం 52 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 18 మంది ప్రిన్సిపాళ్లుగా, సూపరింటెండెంట్లుగా ఉన్నారు. కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చినా చేరలేదు. దీంతో అక్కడ సీనియర్లను ఇన్చార్జిలుగా కొనసాగిస్తున్నారు. చదవండి: నిరుపేదల ఉపాధిపై రాబందులు వాలిపోయే..'దళితబంధు విందాయే'! -
ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ బలవన్మరణం
విశాఖపట్నం: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలివీ.. మువ్వల అలేఖ్య(29), ఆమె భర్త నరేష్, వారి ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి ఎంవీపీకాలనీలో నివాసముండేవారు. ఏఆర్‌లో కానిస్టేబుల్ అయిన నరేష్ ప్రస్తుతం సీబీఐ విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల కిందట అలేఖ్య తన ఇద్దరు పిల్లలతో కలసి ఆరిలోవ ప్రాంతం మయూరినగర్ వచ్చేశారు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోనే ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు. 11 ఏళ్ల వయసు గల కుమారుడిని విజయవాడలో ఓ హాస్టల్లో చేర్చించారు. తొమ్మిదేళ్ల కుమార్తెతో కలసి ఆమె ప్రస్తుతం ఆరిలోవలో ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమె గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొంతసేపటికి తల్లి ఫ్యాన్‌కు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన ఆమె కుమార్తె ఏడుస్తూ సెల్లో ఉన్న నంబర్లకు ఫోన్ చేసింది. దీంతో వెంటనే ఎంవీపీకాలనీలోని బంధువులు, గాజువాకలో ఉన్న అలేఖ్య తల్లి, బంధువులు ఆరిలోవ చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి.. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా.. భర్త వేధింపులు తాళలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అలేఖ్య తల్లి భవాని ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లలను తనకు అప్పగించాలని వేడుకున్నారు. సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి.. లైంగిక దాడికి పాల్పడి హత్య?
సాక్షి, బెంగళూరు: పీయూసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన లింగసూగురులో చోటు చేసుకుంది. అయితే తన కుమార్తెపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింగసూగూరు తాలూకా గోనవాట్ల తండాకు చెందిన యువతి లింగసూగూరులోని ప్రైవేటు పీయూసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. ఏం జరిగిందో ఏమో కాని తన గదిలో శుక్రవారం ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా తన కుమార్తెను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధించేవాడని, ఈక్రమంలోనే శుక్రవారం లైంగిక దాడికి పాల్పడి ఓణితోనే ఉరివేసి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మంజునాథ తెలిపారు. చదవండి: ‘హాయ్ అమ్మా, నాన్న.. ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను.. క్షమించండి!’ -
చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, హనుమకొండ: సెల్‌ఫోన్ చోరీ చేశావంటూ ఓ విద్యార్థిపై నిందమోసి చితకబాదాడొక ప్రిన్సిపాల్. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిభాపూలే బాలుర గురుకుల పాఠశాలలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై బాధిత విద్యార్థి, తల్లిదండ్రుల కథనమిది. కమలాపూర్ మండలం అంబాలకు చెందిన మాట్ల విష్ణు కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఏడాది దసరా సెలవులకు ముందు పాఠశాలలోని ఓ వంట మనిషి సెల్‌ఫోన్ చోరీకి గురైంది. అది ఎవరు దొంగిలించారో తెలియకపోయినా.. నేరాన్ని విద్యార్థులు యాకూబ్, విష్ణుపై ప్రిన్సిపాల్ పింగిలి వెంకటరమణారెడ్డి మోపారు. క్రిస్మస్ సెలవులకు ముందు ఇద్దరిని సుమారు పదిరోజుల పాటు సస్పెండ్ చేశారు. క్రిస్మస్ సెలవుల ఆనంతరం గురువారం విష్ణుతోపాటు మరో విద్యార్థి పాఠశాలకు రాగా.. పాఠశాలకు ఎందుకు వచ్చారంటూ ప్రిన్సిపాల్ మండిపడ్డారు. అదే పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న విష్ణు తల్లి కవితను పిలిపించి.. ‘మీ అబ్బాయి సెల్‌ఫోన్ దొంగతనం చేశాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని, టీసీ తీసుకొని వెళ్లిపోండని’.. ఆదేశించారు. చదవండి: (భర్త నిర్వాకం.. రెండో వివాహం చేసుకొని.. మొదటి భార్యను..) తన కొడుకు అలాంటి వాడు కాదని, దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినిపించుకోని ప్రిన్సిపాల్.. ఆమె ఎదుటే విష్ణును గొడ్డును బాదినట్టు బాదారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ డబ్బు ఇస్తామని తమతో ప్రిన్సిపాల్ ఒప్పంద పత్రం రాయించుకున్నారని, విష్ణును కొట్టిన విషయం బయటకు చెబితే స్వీపర్ పనినుంచి తీయించేస్తానని బెదిరించారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేయని నేరానికి దెబ్బలు తినాల్సి వచ్చిందని మనస్తాపానికి గురైన విష్ణు చనిపోతాననడంతో ఆందోళన చెందిన కవిత ఇంటి వద్ద బిడ్డకు కాపలా కాస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ విద్యార్థి విష్ణును పాఠశాలకు పిలిపించుకుని ‘తనకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని.. దొంగతనం చేసింది నువ్వు కాదని తెలిసిందని.. నిన్ను కొట్టినందుకు సారీ’.. అని క్షమాపణ చెప్పారు. విషయం తెలిసిన ఎన్ఎస్యూఐ, దళిత సంఘాల నేతలు శుక్రవారం విష్ణు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలో విచారణకు వచ్చిన జిల్లా కన్వీనర్ మనోహర్‌రెడ్డిని నిలదీశారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేశారు. ఈ సంఘటనపై ఆర్సీవో ఆదేశాల మేరకు విచారణ జరిపానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని మనోహర్‌రెడ్డి తెలిపారు. -
మహిళా ఉద్యోగితో ప్రిన్సిపాల్ రాసలీలలు.. వీడియో బహిర్గతం కావడంతో..
మచిలీపట్నం(కృష్ణా జిల్లా): మైనార్జీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.ఆనంద్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ పీఆర్‌ఈఐ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.నర్సింహరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగితో ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ పాఠశాలలోనే రాసలీలలు సాగిస్తున్న దృశ్యాలు బహిర్గతం కావటంతో, ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సున్నితమైన అంశమైనందున విషయం తెలిసన వెంటనే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సంస్థ గుంటూరు సెక్రటరీ, జిల్లా కన్వీనర్ అదేవిధంగా మచిలీపట్నం డెప్యూటీ డీఈవో సుబ్బారావుతో కూడిన త్రీమెన్ కమిటీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్ పాఠశాలలోని తన చాంబర్లో ఓ మహిళా ఉద్యోగినితో రాసలీలలుసాగిస్తున్నట్లు విషయం వాస్తవమే అని తేలింది. దీంతో దీన్ని తీవ్రంగా పరిగణించి, అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు జిల్లాలోని ముసునూరు బాలుర మైనార్టీ పాఠశాలలో పీజీటీ సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న పి.సాంబశివరావును మచిలీపట్నం గురుకుల పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నియమించారు. కాగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని విధుల నుంచి పూర్తిగా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు అనుగుణంగా నేడో, రేపో ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయి నివేదిక మేరకు రాష్ట్ర మైనార్టీ గురుకుల సంస్థ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన విషయం వాస్తవమేనని త్రీమెన్ కమిటీ సభ్యుడు, మచిలీపట్నం డెప్యూటీ డీఈవో యూవీ సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రిన్సిపాల్ ఆనంద్ కుమార్ రిమాండ్‌కు తరలింపు... కోనేరుసెంటర్: మైనారిటీ గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌తో రాసలీలలు సాగిస్తూ దొరికిపోయిన ప్రిన్సిపాల్ ఆనందకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్‌తో కామకలాపాలు సాగిస్తూ విద్యార్థులకు సెల్‌ఫోన్ లో అడ్డంగా దొరికిపోయిన ఆనందకుమార్ ఆ వీడియో తీసిన విద్యార్థులను చితకబాదిన విషయం పాఠకులకు విధితమే. ప్రిన్సిపాల్ చేతిలో ఘోరంగా దెబ్బలు తిన్న విద్యార్థి చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి ఆనంద్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా అదే పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న షకీలా ప్రిన్సిపాల్ ఆనంద్ కుమార్ తనను ఆయన కార్యాలయంలోకి పిలిచి బలవంతంగా లోబరచుకునేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. అటు విద్యార్థి ఇటు కంప్యూటర్ ఆపరేటర్ షకీలా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి ఆనంద్ కుమార్‌ను రిమాండ్ కు తరలించినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. చదవండి: ఇద్దరు భార్యలు.. మరొకరితో వివాహేతర సంబంధం.. మొదటి భార్య షాకింగ్ ట్విస్ట్ -
‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు..’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు...’’ ఓ సినిమాలో డైలాగు. అదే మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ పనితనం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహార శైలిపై ఇటు విద్యార్థులు.. అటు ఉద్యోగులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పట్లో స్థానిక మంత్రిని గాని, కలెక్టర్‌ను గాని, ఎంపీని కానీ ఆహా్వనించలేదు. ఇదేంటని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తే ‘‘మీకు సర్టిఫికెట్లు కావాలా... అతిథులు కావాలా’’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీకి సంబంధించిన మెస్ విషయంలోనూ ఈయన వ్యవహరించిన తీరుపై పెద్ద వివాదం జరిగింది. చివరకు కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగింది. వీడియో కాన్ఫరెన్స్‌లకు గైర్హాజరు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా స్థాయిలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రిన్సిపల్ తరచూ గైర్హాజరు అవుతుంటారు. కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారుల వీడియో సమావేశాలైనా...వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జరిగితే ప్రిన్సిపల్ హాజరైన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియను చేపడితే దానిలో సైతం అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కానీ, ఇటు జీజీహెచ్ అధికారులకు కానీ సహకరించకుండా జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎనీమియా వ్యాధికి సంబంధించి సర్వే చేయాల్సి ఉండగా దానిపై ప్రొఫార్మా తయారు చేసే విషయంలోను ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులే తయారు చేసి కలెక్టర్‌కు సమర్పించారు. మహిళా ఉద్యోగి రాజీనామా... ప్రిన్సిపల్‌తో పాటు ఈయన అనుచరుల వేధింపుల దెబ్బకు ఒక మహిళా ఉద్యోగి తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ప్రిన్సిపల్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్న మెడికల్ కాలేజీలో ఎల్రక్టీషియన్ కూడారి ఆంజనేయులు మహిళా ఉద్యోగిపై లైంగికంగా వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె 2022 అక్టోబర్ 20న రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంజనేయులుపై ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ విషయమై ప్రిన్సిపల్‌కు కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతని అనుచరుడు కావటంతో చర్యలు తీసుకోలేదు. దీనిపై మనస్థాపం చెందిన మహిళా ఉద్యోగి రాజీనామా చేసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన అటెండర్లు ఆయనకు కనీసం ఆహారం కూడా అందించకూడదనే మౌఖిక ఆదేశాలు జారీ చేశాడంటే ఆ సామాజిక వర్గాల ఉద్యోగులంటే ఎంత చిన్న చూపో ఉందో అర్థమవుతోంది. చదవండి: ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం బయోమెట్రిక్ నుంచి మినహాయింపు రూల్ ఈజ్ రూల్...రూల్ ఫర్ ఆల్...కానీ ఈ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్‌కు మాత్రం కొన్ని మినహాయింపులు. విధి నిర్వహణకు వచ్చిన సమయంలో ఉద్యోగులందరూ బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయాలి. కానీ ఈయనకు బయో మెట్రిక్ విధానం మినహాయింపు. ఆయన ఎప్పుడైనా రావచ్చు...వెళ్లిపోవచ్చు...అసలు రాకుండా కూడా ఉండవచ్చు. ఇదీ ఆయన తీరు. ఆరోపణలన్నీ అవాస్తవమే.. నాపై వచ్చినవన్నీ నిరాధారమైన ఆరోపణలే. మహిళా ఉద్యోగి విషయంలో లేనిపోని రాజకీయాలు చేస్తున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే నేను పని చేస్తున్నాను. సెలవులు ఎవరైనా పెట్టుకోవచ్చు. గైర్హాజరైతేనే ఒప్పుకోను. – డాక్టర్ పీవీ సుధాకర్, జీఎంసీ ప్రిన్సిపాల్ -
బూట్లు వేసుకోలేదని విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, వరంగల్: బూట్లు ఎందుకు వేసుకురాలేదు అంటూ విద్యార్థులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపాన్ని చూపాడు. ఏకంగా కంక కట్టెతో విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్ మోడల్ స్కూల్లో బుధవారం చోటు చేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం...మోడల్ స్కూల్లో పదవ తరగతి వరకు మొత్తం 490 మంది విద్యార్థులున్నారు. బుధవారం పాఠశాలలో ప్రార్థన అనంతరం విద్యార్థులు తమ క్లాస్‌లోకి వెళ్తన్న క్రమంలో 10వ తరగతికి చెందిన హర్షిత్, చరణ్, శ్రావణ్, రాంచరణ్, అక్షయ్‌కుమార్, హనీఫ్, ఫరూక్ అబ్దుల్‌తోపాటు 12మంది విద్యార్థులు బూట్లు వేసుకురాలేదు. గమనించిన ప్రిన్సిపాల్ ప్రణయ్‌కుమార్ వారందరిని పక్కకు నిలబెట్టి బూట్లు ఎందుకు వేసుకురాలేదని అడుగుతూ కొట్టడం ప్రారంభించాడు. ‘రేపు వేసుకువస్తాం కొట్టకండి సార్’అంటూ కన్నీరు పెట్టుకున్నప్పటికి వినకుండా విచక్షణా రహితంగా చితకబాదాబడు. దీంతో విద్యార్థుల పిరుదల కిందబాగంలో కమిలిపోయి కొంతమంది విద్యార్థులు నడవలేని పరిస్థితికి చేరుకోవడంతో కొందరు ఉపాధ్యాయులు వారిని సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స నిర్వహించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాలకు చేరుకొని తమ పిల్లల్ని ఈ విధంగా కొట్టడం తగదు అంటూ ప్రిన్సిపాల్‌ని నిలదీశారు. షూస్ వేసుకురాకుంటే క్రమశిక్షణలో భాగంగా కొట్టానని, కొట్టకుంటే వారు వినరు అని ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్ వివరణ ఇచ్చాడు. -
ప్రధాని చిన్ననాటి గురువు మృతి...సంతాపం వ్యక్తం చేసిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ చిన్ననాటి పాఠశాల టీచర్ రాస్విహారి మణియార్(94) కన్నుమూశారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లోని బీఎన్ విద్యాలయంలో రాస్విహారి ప్రిన్స్‌పాల్‌గా చేసి పదవీ విరమణ చేశారు. ఈ పాఠశాలలోనే ప్రధాని మోదీ చదువుకున్నారు. మోదీ ఆయన మరణం గురించి తెలుసుకుని చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు మోదీ మాట్లాడుతూ...నా గురువు మణియార్ మరణం గురించి విని చాలా బాధపడ్డాను. నాజీవితంలో ఆయన చేసిన అమూల్యమైన సహకారం ఎప్పటికీ మరిచిపోను. ‘నా జీవితంలో ఈ దశ వరకు కూడా ఆయనతో కనక్ట్ అవుతూనే ఉన్నాను. విద్యార్థిగా నా జీవితాంతం ఆయన మార్గదర్శకత్వం పొందడం పట్ల నేను సంతృప్తి చెందాను’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మోదీ తన చిన్ననాటి గురువుని సత్కరిస్తున్న వీడియోతో పాటుగా ఆయనతో కలిసి దిగిన ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నారు. మోదీ అవకాశం వచ్చినప్పుడల్లా తన గురువు గురించి తన ప్రసంగంలో ప్రస్తావిస్తుంటారు. ముఖ్యంగా గుజరాత్ పర్యటనలో ఉన్నప్పుడల్లా తన గురువులను కలిసేందుకు ప్రయత్నించేవారు. అంతేగాదు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడూ అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన ఉపాధ్యాయులను సత్కరించారు కూడా. મારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત છું. મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું. pic.twitter.com/QmlJE9o07E — Narendra Modi (@narendramodi) November 27, 2022 (చదవండి: జోడో యాత్రలో రాహుల్ బైక్ రైడ్) -
Deepmala Pandey: స్పెషల్ టీచర్
స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. కానీ, అందరు పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే 600 మంది స్పెషల్ చిల్డ్రన్ని చేర్చించి ప్రత్యేక శిక్షణ ఇస్తూ, సాధారణ పౌరులుగా తీర్చడానికి కృషి చేస్తోంది దీప్‌మాలా పాండే. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బరేలీలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా ఉన్న దీప్‌మాలా కృషి గురించి తెలుసుకుంటే ఈమెను ‘స్పెషల్ టీచర్’ అనకుండా ఉండలేం. ఇలాంటి టీచర్లు మన దగ్గరా ఉండాలని కోరుకోకుండా ఉండలేం. బరేలీ మధ్యప్రదేశ్‌లోని ఒక సిటీ. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తోంది దీప్‌మాలా. సాధారణ పిల్లలతోపాటు ప్రత్యేకమైన పిల్లలను కూడా కూర్చోబెట్టి, వారికి పాఠాలను బోధించడమే కాదు రాయడంలోనూ మిగతావారిలాగే సమర్థులుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘దీనిని నేను ఒంటరిగానే ప్రారంభించాను. కానీ, ఇప్పుడదే ప్రత్యేకంగా మారింది’ అని వివరిస్తారామె. చదువులో ముందంజ దీప్‌మాలా సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలనేది ఆమె తండ్రి కోరిక. ఎందుకంటే, తన ముగ్గురు సంతానంలో దీప్‌మాలా చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. అలాగని తన ఆలోచనను ఆమె మీద ఎప్పుడూ రుద్దలేదు. కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, ఆ తర్వాత బీఈడీ చేసిన దీప్‌మాలా కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ టీచర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత బరేలీకి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్ఖుడా బ్లాక్ లోని స్కూల్లో టీచర్‌గా పోస్టింగ్ వచ్చింది. ‘అంత దూరంలో పోస్టింగ్, నా పిల్లల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతున్నా నా పనిని నిజాయితీగా చేయాలనుకున్నాను. అలాగే చేశాను కూడా. 2015లో బరేలీలోని దభౌరా గంగాపూర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటినుంచి ఇక్కడే ప్రిన్సిపాల్‌గా సేవలు అందిస్తున్నాను’ అని టీచర్‌గా తన ప్రయాణం గురించి తెలియజేస్తారు. సృజనాత్మక ఆలోచనలు ‘ఒకసారి గురుకుల పిఎల్సి కార్యక్రమం పేరుతో వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేశారు. టీచర్ల గ్రూప్‌లో వారు పనిచేసిన సృజనాత్మక ప్రాజెక్ట్‌ల ఫొటోలు, వీడియోలు, చేయబోయే పనులకు సంబంధించిన ఆలోచనలు పంచుకున్నారు. అందులో భాగంగానే అయిదేళ్ల క్రితం రాష్ట్రంలోని 400 మందికి పైగా టీచర్లతో కలిసి నేను కూడా ఎన్‌సిఇఆర్‌టి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సమయంలో వికలాంగ పిల్లలను సాధారణ పాఠశాలకు తీసుకువచ్చి, వారికి ఎలా నేర్పించాలో ప్లానింగ్ సిద్ధం చేశాం. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోని స్పెషల్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎక్కడ చేర్చాలో తెలియదు. ఈ పిల్లలకు సాధారణ స్కూల్స్ వారు అడ్మిషన్ ఇవ్వరు. కొంతమంది తల్లిదండ్రులు స్పెషల్ చిల్డ్రన్ కోసం కేటాయించిన స్కూళ్లలో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లలు తమలాంటి మరికొంత మంది పిల్లలతో కలిసి బాగానే ఉంటారు. కానీ, వారు ఏదైనా నలుగురిలో కలిసే కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఈ సమస్య తలెత్తకుండా సాధారణ పిల్లలతో కలిపి ఈ ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాను’ అని స్పెషల్ పిల్లల ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటారామె. ఓ అబ్బాయితో మొదలు... మొదటి అడుగు పడిన నాటి సంఘటనను ఒకటి వివరిస్తూ ‘ఓ రోజున పిల్లలకు క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతున్నాను. అప్పుడు క్లాస్రూమ్ బయటినుంచి లోపలికి ఆత్రంగా చూస్తున్న ఓ అబ్బాయి మీదకు నా దృష్టి వెళ్లింది. ఆ పిల్లవాడిని లోపలికి పిలిచి, ఒక సీటులో కూర్చోబెట్టాను. అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాట్లాడలేడు. వినలేడు, దృష్టి నిలకడగా లేదు. సైగలు చేస్తున్నాడు. ఆ అబ్బాయికి క్లాసులో కూర్చోవడం ఇష్టం అనేది అర్థమైంది. అలా మా స్కూల్‌కి వచ్చిన ఆ మొదటి స్పెషల్ చైల్డ్ పేరు అన్మోల్. అక్కణ్ణుంచి ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో చేర్చాలి అనుకున్నాను. ఎక్కడైనా స్పెషల్ చిల్డ్రన్ ఉంటే మా స్కూల్లో చేర్చాలని మా పిఎల్సి గ్రూపులో మిగతా టీచర్లకు విజ్ఞప్తి చేశాను. మా గ్రూప్‌లో ఉన్న టీచర్లు దివ్యాంగ పిల్లల బాధ్యత తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు. ఇదే లక్ష్యంగా నా ప్రయత్నం కొనసాగింది. ఈ ఆలోచన తర్వాత మిగతా టీచర్లకు కూడా మా ఫ్యాకల్టీ సహకారంతో ప్రొఫెషనల్ లెర్నింగ్ కోర్సులతో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాను. దీనివల్ల స్పెషల్ చిల్డ్రన్ని వారు బాగా అర్థం చేసుకోవచ్చు, బోధించవచ్చు’ అనే ఆలోచనను తెలియజేస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తరణ ఒక మంచి ఆలోచనను ఇంకొంతమందికి పంచితే సమాజంలో మార్పు రావడం సహజం. అందుకు వేదికైనా సోషల్‌మీడియాను ఎంచుకున్నారు దీప్‌మాలా. కరోనా కాలంలో సాధారణ పిల్లలతోపాటు దివ్యాంగ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే విషయంలో చాలా మందికి తెలియలేదు. అయితే, దీప్‌మాలా మాత్రం ‘వన్ టీచర్ వన్ కాల్’ పేరుతో ఫేస్బుక్ పేజీని సృష్టించారు. దీని ద్వారా టీచర్లు స్పెషల్ చిల్డ్రన్‌కి బోధిస్తారనే ప్రచారం బాగా జరిగింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆ ఫేస్బుక్ పేజీలో చేరారు. వారంతా తమ ప్రాంతాలలోని దివ్యాంగ పిల్లలను స్కూల్ ద్వారా అడ్మిషన్లు తీసుకొని, బోధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని సాధారణ పాఠశాలలో 600 మందికి పైగా స్పెషల్ చిల్డ్రన్ని చేర్పించడంతో పాటు టీచర్లు కూడా ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది తీసుకుంటున్నారు. స్త్రీల అక్షరాస్యత స్పెషల్ చిల్డ్రన్ కోసమే కాదు కరోనా కాలంలో తను పని చేస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సర్వే నిర్వహించారు దీప్‌మాలా. అందులో 90 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులు అని తేలడంతో ఆ తర్వాత వారికి దశలవారీగా చదువు చెప్పే పనిని చేపట్టారు. వారిలో చాలా మంది వేలి ముద్ర నుంచి సంతకం చేసేంతగా చదువు నేర్చుకున్నారు. మొదట ఏ మంచి పని తలపెట్టినా అది ఆచరణ యోగ్యమేనా, సాధించగలమా.. అనే సందేహం తలెత్తకమానదు. కానీ, నలుగురికి ఉపయోగపడే ఏ చిన్న ప్రయత్నమైనా గమ్యానికి చేరువ అవుతుందని దీప్‌మాలా టీచర్ ప్రయాణం రుజువు చేస్తోంది. ప్రధాని ప్రశంసలు ఇటీవల ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో దీప్‌మాలా చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఆ రోజు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలాంటి పిల్లల కోసం ఇంకా ఎక్కువ పని చేయాలనే ప్రేరణ కలుగుతుంది. ఆ రోజు నేను మా అమ్మవాళ్లింటికి వెళ్లాను. నాపేరు ప్రకటించినప్పుడు నా భర్త ఆ కార్యక్రమాన్ని వింటున్నాడు. అతను నాకు ఫోన్ చేసి చెప్పడంతో, నమ్మలేకపోయాను. కానీ, మీడియా వారి నుంచి కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. దీంతో నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయని నాకు అనిపించింది’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారామె. స్కూల్లో విద్యార్థులతో దీప్‌మాలా పాండే -
చిన్నారిని వేధిస్తున్న కారు డ్రైవర్ ను చితకబాదిన పేరెంట్స్
-
ఫీజు కట్టకపోతే నీ సీటు రద్దవుతుంది.. స్వయంగా ప్రిన్సిపాలే రాసి ఇచ్చి..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత తరగతుల విద్యార్థులకు సైతం ఫీజుల వేధింపులు తప్పడం లేదు. ఏకంగా ఫీజులు చెల్లించక పోతే అడ్మిషన్‌తోపాటు సీటు రద్దు చేస్తామని ఒత్తిళ్లు చేస్తున్న వైనం వెలుగు చూసింది. ఏపీలో అనుమతులు పొంది, తెలంగాణలో యుజీసీ ప్రత్యేక ఆర్డర్‌తో నగర శివార్లలోని కొండాపూర్, అజీజ్ నగర్, మియాపూర్‌లో వివిధ కోర్సుల తరగతులు నిర్వహిస్తొంది ఒక డీమ్డ్ యూనివర్సిటీ. నగరానికి చెందిన ఒక విద్యార్థి ఆ యూనివర్సిటీలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో చేరారు. కోర్సుకు రూ. 1,85,000 ఫీజు పేర్కొనడంతో ఈ ఏడాది ఏప్రిల్ 24న మొదటి విడతగా రూ. 50 వేలు చెల్లించి అడ్మిషన్ తీసుకొని తరగతులకు హాజరు అవుతున్నారు కాగా తాజాగా పూర్తి ఫీజు చెల్లించాలని విద్యార్థిపై ఒత్తిళ్లు ప్రారంభయ్యాయి. కాగా, గురువారం ఏకంగా ప్రిన్సిపాల్ తక్షణమే ఫీజు చెల్లించకుంటే సీటు రద్దు అవుతుందని లిఖిత పూర్వకంగా రాసి సంతకం చేసి విద్యార్థికి ఇవ్వడం విస్మయానికి గురిచేసింది. ఫీజు కట్టకుంటే సీటు రద్దేంటి..? పూర్తి స్థాయి ఫీజు చెల్లించకుంటే సీటు రద్దు చేస్తామని ప్రిన్సిపాల్ లిఖిత పూర్వకంగా రాయడాన్ని టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ తప్పుబట్టారు. కనీసం గడువు ఇవ్వకుండా ఈ రోజు ఫీజు కట్టకపోతే సీటు రద్దు అవుతుందని పేర్కొనడం సమంజసంకాదన్నారు. విద్యార్థుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడం సరైంది కాదుని వెంటనే వారిని పిలిపించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. -
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్
చార్మినార్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాత్కాలికంగా రద్దయిన ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ కార్యక్రమం ఈ నెల 21 (నేటి) నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్‌పై సండే ఫన్ డే ప్రారంభమైంది. ఈ ఆదివారంతో ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని కులీకుతుబ్‌షా నగరాభివృద్ది సంస్థ కార్యదర్శి తెలిపారు. స్టాల్స్‌తో పాటు ఇతర వ్యాపార సంస్థల స్టాల్స్ కొనసాగిస్తామని.. వినోదాత్మక కార్యక్రమాలు ప్రస్తుతానికి ఉండవని ఆయన తెలిపారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. శనివారం పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా మారాయి. చార్మినార్ కట్టడంతో పాటు హెచ్‌ఈహెచ్ నిజాం మ్యూజియం, సాలార్ జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లాడ్‌బజార్ తదితర ప్రాంతాలలో సందర్శకుల సందడి కనిపించింది. (చదవండి: ప్రీలాంచ్ మాయ ) -
విద్యార్థినితో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన
హయత్‌నగర్: విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ ప్రిన్సిపల్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి అధ్యాపక వృత్తికే కలంకం తెచ్చిన ఉదంతం శుక్రవారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఐఎస్ సదన్‌కు చెందిన సత్యనారాయణ కొంత కాలంగా హయత్‌నగర్‌లో గౌతమి గరల్స్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్, కరెస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. ఆ కళాశాలలోనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి సినిమాకు తీసుకెళ్ళిన సత్యనారాయణ కొన్ని రోజులగా అమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ నెల 16న కూడా బాలికకు ఫోన్ చేసి ప్రత్యేక క్లాసు చెబుతానంటూ కళాశాలకు పిలిపించుకుని అ సభ్యంగా ప్రవర్తించాడు. అతని వేధింపులు తట్టకోలేక బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడు సత్యనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రిన్సిపల్‌ను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో విద్యార్థులు పోలీస్టేషన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. (చదవండి: తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య!) -
బాధ్యతలు తీసుకున్న తొలిరోజే షాకైన ప్రిన్సిపల్.. ఆమె కుర్చీ కింద..
చిక్కబళ్లాపురం(బెంగళూరు): సాధారణంగా ఎవరైనా కొత్తగా పదవి చేపడితే వారికి అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు మర్యాదపూర్వకంగా ఆహ్వానం తెలుపుతారు. ఈ తతంగం ఎక్కడైన జరిగేది. కానీ కళాశాలకు ప్రిన్సిపల్‌గా వచ్చిన ఓ మహిళకు తన మొదటి రోజే చేదు అనుభవం ఎదురైంది. ఈ వింత ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా వచ్చిన శకుంతల తన గదిలో ఓ విచిత్రమైన బొమ్మను చూసి షాకయ్యారు. గురు వారం ఉదయం ఆమె ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది ఆమె సీటు కింద శుభ్రం చేస్తుండగా ఒక బొమ్మకు పసుపు, కుంకుమ పూసి ఉంచారు. దీంతో చేతబడి చేసి నట్లు అనుమానిస్తున్నారు. కళాశాలలో ఇటువంటి చర్యలు జరగడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కొత్త ప్రిన్సిపాల్ అంటే గిట్టని వారు ఎవరైనా ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: కాలేజ్ స్టూడెంట్స్ కిస్సింగ్ కాంపిటీషన్ వీడియో.. పోలీసుల అదుపులో ఒకరు -
హైదరాబాద్ సంతోష్ నగర్ లో దారుణం
-
స్టూడెంట్స్‌కి డిప్ప కటింగ్ కొట్టించిన ప్రిన్సిపల్
-
కొడుకు ముందే క్రికెట్ బ్యాట్‌తో ప్రిన్సిపల్‌పై భార్య దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
గృహహింస.. ఈ పేరు వినగానే వేధింపులకు గురవుతున్న మహిళలే గుర్తుకు వస్తారు. భర్తలు, అత్త మామలు, ఆడపడచుల చిత్ర హింసలకు ఎంతోమంది వివాహితలు బలవుతున్నారు. కానీ భార్య చేతిలో గృహహింసకు గురవుతున్న భర్తల గురించి ఎప్పుడైనా విన్నారా.. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. అజిత్‌సింగ్ యాదవ్ అనే వ్యక్తి హర్యానాకు చెందిన సుమన్‌ను ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట అల్వార్ జిల్లాలో నివాసముంటున్నారు. కాగా అజిత్ సింగ్ ఓ విద్యాసంస్థలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదట్లో వీరి సంసార జీవితం ప్రశాంతంగానే కొనసాగినప్పటికీ కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్య సుమన్ తరుచూ అజిత్‌సింగ్‌పై చేయి చేసుకోవడం ప్రారంభించింది. అనేకసార్లు భర్తను ఇష్టంవచ్చినట్లు కొట్టేది. దీంతో భార్య చేతిలో గాయాలపాలైన అజిత్ సింగ్ ప్రస్తుతం వైద్యుల వద్ద చికిత్స కూడా పొందుతున్నాడు. అయితే భార్య హింసతో విసిగిపోయిన భర్త కోర్టును ఆశ్రయించాడు. తన భార్య మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని, ఆమె నుంచి రక్షణ కావాలంటూ కోర్టును కోరాడు. చేతికి ఏది దొరికితే అది క్రికెట్ బ్యాట్, పాన్, కర్రలతో దాడి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కోర్టుకు సమర్పించాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో భార్య భర్తను క్రికెట్ బ్యాట్‌తో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. అలాగే తల్లి దెబ్బలకు బెదిరిపోయిన కొడుకు ఇంట్లో అటు ఇటు తిరుగుతుండటం కూడా చూడవచ్చు. ఈ కేసును విచారించిన కోర్టు సదరు బాధితుడికి భద్రత కల్పించాలని ఆదేశించింది. చదవండి: అలా రాసిస్తేనే పెళ్లిళ్లకు వస్తానని చెప్పా: సీఎం అయితే గౌరవప్రదమైన టీచర్ వృత్తిలో ఉన్నందున భార్య వేధింపులపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని బాధితుడు అజిత్ సింగ్ తెలిపాడు. కానీ ఇప్పుడామే హద్దులు దాటి ప్రవర్తిస్తుండటంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపాడు. తన బావ భార్యను హింసకు ప్రేరేపించాడని ఆరోపించాడు. అంతేగాక భార్యపై తనెప్పుడూ చేయి ఎత్తలేదని పేర్కొన్నాడు. తనొక ఉపాధ్యాయుడని..ఉపాధ్యాయుడు ఒక మహిళపై చేయి ఎత్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ఇష్టం లేదని అన్నాడు. In a strange case of domestic violence, a school principal in #Alwar district of #Rajasthan has move the court seeking protection from the physical and mental harassment of his wife. According to the man, his wife has been beating him black and blue leaving him weak mentally. pic.twitter.com/J1UOmRhyHw — IANS (@ians_india) May 25, 2022 -
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. ప్రిన్సిపల్ సంతకం లేకున్నా..
సాక్షి, నిజామాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డీఐఈవో ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో 35,522 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్ ఇస్తామంటున్న కళాశాలలపై కఠిన చర్యలు ఉంటాయని, విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్షకు హాజరుకావచ్చని ఇంటర్ విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కోవిడ్ నిబంధనలతో పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిబంధన అమల్లో ఉంది. ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, విద్యాశాఖ, పోస్టల్, ఇతరశాఖల కో–ఆర్డినేషన్‌తో పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మే 6 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఐఈవో రఘురాజ్ ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. సాక్షి: ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీఐఈవో: ఇంటర్ బోర్డు ఆదేశాలు, జిల్లా ఉన్నతాధికారుల సలహాల, సూచనలతో పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. మొత్తం 35,522 మంది పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ►నిమిషం ఆలస్యం నిబంధన అమలులో ఉందా గతంలో మాదిరిగానే నిమిషం నిబంధన అమ ల్లో ఉంటుంది. విద్యార్థులు నిర్ణీత సమయంలోగా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8 గంటల నుంచే పరిశీలించి కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉద యం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు రావాలి. టీఎస్‌బీఐఈ ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ అనే మొబైల్ యాప్ ద్వారా పరీక్షాకేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ►మాస్‌కాపీయింగ్‌పై పర్యవేక్షణ ఎలా ఉండనుంది పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నీడలో పరీక్ష పత్రాలను తెరవాలి. మాస్‌కాపీయింగ్, అవకతవకలు జరగకుండా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి అందుబాటులో ఉంటారు. వీరితో పాటు జిల్లాలో డిపార్ట్మెంట్ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ హోదాలోని రెవెన్యూ అధికారి, ఏఎస్సై హోదా కలిగిన ఒక పోలీసు అధికారితో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలు గు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటుచేశాం. రాష్ట్ర స్థాయి తనిఖీ బృందాలూ తనిఖీలు చేపడతాయి. ►ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకుంటున్న చర్యలు పరీక్ష ముగిసేసరికి మధ్యాహ్నం అవుతుంది. ప్రతి కేంద్రం వద్ద టెంట్ వేయాలని చెప్పాం. తాగునీరు, మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయా లు అందుబాటులో ఉంటాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో ఏఎన్ఎం అందుబాటులో ఉంటుంది. ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. ►విద్యార్థులు మానసిక ఒత్తిడి అధిగమించాలంటే.. పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వారి కోసం ఇంటర్ బోర్డు కమిషనర్ సైక్రియార్టిస్ట్ను నియమించారు. 18005999333 నంబర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలంటే భయం ఉన్న విద్యార్థులు ఈ నంబర్‌కు ఫోన్‌చేసి ఒత్తిడిని జయించవచ్చు. ►హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు హాల్‌టికెట్లు ఇవ్వని కళాశాలల యాజమా న్యాలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు ఉంటాయి. నోటీసులు కూడా జారీ చేస్తాం. కళాశాలలో హాల్‌టికెట్లు ఇవ్వకుంటే ఇంటర్‌బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరుకావచ్చు. ఈవిషయంలో విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దు. ►పరీక్షలు సజావుగా సాగేందుకు చర్యలు పరీక్షలు సజావుగా జరిగేలా కలెక్టర్ సూచనల మేరకు అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాం. పరీక్ష సమయానికి బస్సులు నడిచేలా చూడాలని ఆర్టీసీకి, విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఎస్ఈని, పోలీస్, డీఎంహెచ్‌వో, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించాం. -
అధ్యాపకుడి అరుదైన చదివింపు
అన్నవరం: చదువుల్లో రాణించాలని, లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు బోధించే అధ్యాపకులు చాలా కళాశాలల్లో కనిపిస్తారు. కాని కళాశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తే వారు మరింత బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని భావించి అందుకోసం సొంత సొమ్మును ఖర్చు చేసే అధ్యాపకులు చాలా అరుదు. అటువంటి కోవలోకే వస్తారు సత్యదేవ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ భీమలింగం సూర్యనారాయణమూర్తి. ఆయన తన భార్య పద్మావతితో కలిసి సోమవారం శ్రీ సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి సత్యదేవ డిగ్రీ కళాశాల విద్యార్థుల పేరుతో రూ.ఐదు లక్షలు విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావుకు అందజేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో... విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో తన వంతు సాయంగా ఈ విరాళాన్ని అందచేసినట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. స్థానిక సత్యదేవ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా 2015–17 మధ్య సేవలందించిన సూర్యనారాయణమూర్తి ప్రస్తుతం తమ స్వగ్రామమైన పెద్దాపురం మండలంలోని సిరివాడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన సమయంలో దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని అప్పటి దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రామ్‌కుమార్, ఈఓ కాకర్ల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా 2016లో అక్టోబర్ నుంచి 2017 ఏప్రిల్ వరకు డిగ్రీ కళాశాల విద్యార్థులకు అన్నదానం పథకం నుంచి మధ్యాహ్న భోజనం పంపించారు. అన్నదానం పథకానికి దాతలు ఇచ్చిన విరాళాలు భక్తులకు భోజనానికి ఉపయోగించాలి తప్ప విద్యార్థుల భోజనానికి కాదని ఆడిట్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో దేవస్థానం ఆ భోజనాన్ని పంపించడం నిలిపివేసింది. 2018లో సూర్యనారాయణమూర్తి పదవీ విరమణ చేశారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో తన వంతు విరాళంగా ఆయన రూ.ఐదు లక్షలు అందజేశారు. మధ్యాహ్న భోజన సౌకర్యం పునరుద్ధరించాలని కోరాను కళాశాలలో చదివే విద్యార్థులు 600 మందిలో 400 మంది పేద, మధ్యతరగతి వారు. వీరికి భోజన సౌకర్యం పునరుద్ధరించాలని ఆలయ పెద్దలను కోరాను. నేను ఇచ్చిన విరాళంపై వడ్డీతో రోజుకు కనీసం పది మంది విద్యార్థులకు అన్నదాన పథకంలో (కళాశాల పనిదినాలు 180 రోజుల్లో) భోజనం పెట్టమని కోరాను. – సూర్యనారాయణమూర్తి, విశ్రాంత ప్రిన్సిపాల్ కమిషనర్‌తో చర్చిస్తాం డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై గతంలో ఆడిట్ అభ్యంతరాలు రావడంతో నిలిపివేయాల్సి వచ్చింది. మళ్లీ భోజనం పెట్టాలంటే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలివ్వాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. – చైర్మన్ రోహిత్, ఈఓ త్రినాథరావు -
హైస్కూల్ టీచర్ నిర్వాకం... చర్యలు తీసుకోని పోలీసులు
అనంతపురం విద్య: జిల్లాలో మరో కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బొమ్మనహాళ్ మండలం శ్రీధర్ఘట్ట ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చల్లా ఓబులేసు ఓ విద్యార్థినిని వేధించిన కేసులో కటకటాలపాలయ్యాడు. ఈ ఉదంతం మరువకముందే గుత్తికోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థినులను లైంగికంగా వేధించిన విషయం వెలుగు చూసింది. అతనిపై ఓ విద్యార్థిని తల్లిదండ్రులు డయల్ 100కు సమాచారమిచ్చారు. పైగా అతను ఓ ఉపాధ్యాయ సంఘంలో కీలక హోదాలో ఉండడం గమనార్హం. ఈ అంశంపై పోలీసుస్టేషన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఎవరైనా స్టేషన్‌కు ఎందుకొచ్చారని అడిగితే... ‘మొన్న విజయవాడ ర్యాలీకి వెళ్లాం కదా! అందుకే వచ్చి మాట్లాడుతున్నా’నంటూ కప్పిపుచ్చుకుంటున్నట్లు తెలిసింది. వేధింపులు..బెదిరింపులు సదరు స్కూల్ అసిస్టెంట్ విద్యార్థినులను లైంగికంగా వేధించడమే కాకుండా ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరింపులకు సైతం పాల్పడినట్లు సమాచారం. బాధిత విద్యార్థినులు ఒకానొక దశలో అతని ఆగడాలు భరించలేమని, పాఠశాలకు వెళ్లలేమని తల్లిదండ్రులతో మొరపెట్టుకున్నారు. దీంతో ఓ విద్యార్థిని తల్లిదండ్రులు ఈ నెల నాల్గో తేదీన డయల్ 100కు సమాచారమిచ్చారు. పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. అయినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదు. గతంలో దేహశుద్ధి సదరు ఉపాధ్యాయుడు పుట్లూరు మండలం కడవకల్లు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సమయంలోనూ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. అప్పట్లో పోలీసు కేసు నమోదు కావడంతో సస్పెండ్ అయ్యారు. తర్వాత రాజీ కుదుర్చుకుని కేసు లేకుండా చేసుకున్నారు. -
ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..
Professor thrashes Principal inside his office: కొంతమంది పది మందికి బోధించే వృత్తిలో ఉండి కూడా అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అమానుషంగా దాడులు చేస్తారు. పైగా కనీసం తమ ఉనికిని కూడా మరిచిపోయి వొళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అతను ఒక ప్రొఫెసర్ అయ్యి ఉండి ప్రిన్స్‌పాల్‌పై అమానుషంగా దాడి చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకెళ్తే.. ఉజ్జయినిలోని ఘట్టియాలోని దివంగత నాగులాల్ మాలవ్య ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రహ్మదీప్ అలునె. అయితే ఏంజరిగిందో తెలియదు గాని ప్రొఫెసర్ బ్రహ్మదీప్ ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మేడంవార్ పై ఆగ్రహంతో దాడి చేశాడు. అంతేగాదు ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ వీడియోలో ప్రోఫెసర్ బ్రహ్మదీప్ కోపంతో ప్రిన్స్‌పాల్‌పై ఒక వస్తువును విసిరాడు. పైగా ఆగ్రహంతో ఊగిపోతూ అతని వద్దకు వచ్చి చేతులతో దాడి చేసినట్లు కనిపించింది. అంతేకాదు ఆ వీడియోలో బయటి నుంచి కొంతమంది వచ్చి ఆ ప్రొఫెసర్ని వెనక్కి లాగి కొద్దిసేపు సద్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఆ ప్రొఫెసర్ని వెళ్లిపోమని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా కోపంతో అక్కడే కుర్చిలాక్కుని మరీ కుర్చున్నాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్వచ్ఛందంగా ఆ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు ప్రిన్స్‌పాల్ శేఖర్ మాట్లాడుతూ..."ఆ ప్రొఫెసర్ బదిలిపై భోపాల్ నుంచి ఉజ్జయిని కాలేజికి వచ్చారని తెలిపారు. అంతేగాక అతను రోజు 5 కి.మీ దూరం నడిచి మరి కాలేజీకి వస్తాడన్నారు. అయితే మాకు సిబ్బంది తక్కువుగా ఉన్నారని, పైగా కాలేజీని కూడా వ్యాక్సిన్ కేంద్రగా మారుస్తున్నారనే విషయం గురించి మాట్లాడేందుకు పిలిచాను. అయతే అతను మాత్రం ఆగ్రహానికిలోనై దుర్భాషలాడుతూ కొట్టడం మొదలు పెట్టాడని చెప్పారు. (చదవండి: ఆడమ్ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు!) An assistant professor was booked for allegedly beating up principal of a Government College in Ujjain @ndtv @ndtvindia pic.twitter.com/egom5OIVjA— Anurag Dwary (@Anurag_Dwary) January 19, 2022 -
Hyderabad: విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రిన్సిపాల్ యత్నం
సాక్షి, హైదరాబాద్: ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నించిన ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తూంకుంట మున్సిపాలిటీకి చెందిన బాలిక(13), శామీర్‌పేటలోని శ్రీనివాస మెమోరియల్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. గత రెండు రోజులుగా ఆమె స్కూల్‌కు వెళ్లడం లేదు. దీనిపై కుటుంబసభ్యులు నిలదీయగా ఈ నెల 22న స్కూల్ ప్రిన్సిపాల్ నరేందర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే వెళ్లడం లేదని తెలిపింది. దీంతో వారు బుధవారం శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట సీఐ సుధీర్‌కుమార్ తెలిపారు. చదవండి: (Hyderabad New Year Events: సిటీ పోలీసులు కీలక ఆదేశాలు) -
నిబంధనలకు విరుద్ధం!..జుట్టు కత్తిరించిన ప్రిన్స్‌పాల్
Principal Cuts Students Hair: ఇంతవరకు మనం పిల్లలు మాట వినకపోతే అత్యంత దారుణంగా పిల్లలను కొట్టడం వంటి వాటి గురించి విన్నాం. అంతెందుకు కొంతమంది టీచర్లు పిల్లలను సరిగా చదవడం లేదంటూ వేరే విద్యార్థులతో పోలుస్తూ తిట్టడం వంటి ఘటనలు చూశాం. కానీ ఇక్కడొక ప్రిన్స్‌పాల్ నిబంధనలకు విరుద్ధం అంటూ ఎంత పని చేశాడో చూడండి. (చదవండి: వృక్షాన్ని వివాహం చేసుకున్న మహిళ!...ఎందుకో తెలుసా!!) మహారాష్ట్రలోని పాల్ఘర్లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ చాలా మంది విద్యార్థులకు జుట్టు పెంచవద్దు అని పదేపదే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో వారికి హెయిర్ కట్ చేయించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు పొడవాటి జుట్టుతో తరగతులకు వస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని మీడియాకి తెలిపారు. అయితే ఈ ఘటన పై పలువురుతల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్స్‌పాల్ చర్యను ఖండించారు. (చదవండి: ప్రధాని ఫోటో తొలగించాలంటూ పిటిషన్.. లక్ష జరిమానా వేసిన హైకోర్టు!) -
ప్రాక్టికల్స్ పేరుతో.. 17 మంది బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం
లక్నో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన గురువు బాధ్యతను మరిచి పైశాచికంగా ప్రవర్తించాడు. పరీక్షల పేరుతో పాఠశాలకు పిలిచి విద్యార్థినులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కీచకుడు. గౌరవప్రదమైన ప్రధానోపాధ్యాయ వృత్తిలో ఉండి ఆ పదవికే మాయని మచ్చగా తయారయ్యాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో నవంబర్ 17న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. చదవండి: పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా.. ముజఫర్‌నగర్‌లోని పుర్కాజి ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ పరీక్షల సాకుతో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలను పాఠశాలకు పిలిపించాడు. మరునాడు సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని రాత్రంతా అక్కడే ఉండాలని సూచించాడు. విద్యార్థుల కోసం భోజనం తయారు చేసి.. అందులో మత్తు మందు కలిపిన ఆహారాన్ని విద్యార్థినులకు అందించాడు. తరువాత విద్యార్థులు స్పృహ కోల్పోవడంతో ప్రధానోపాద్యాయుడితోపాటు అతని సహచరుడు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని, చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బాలికలను బెదిరించారు. చదవండి: Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం బాలికలు మరుసటి రోజు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే బాధిత బాలికలు పేద కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు బాధితులు మాత్రం ధైర్యం చేసి జరిగిన దారుణం గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలని అనేకసార్లు కోరినప్పటికీ.. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తల్లిదండ్రులు పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వాల్‌ను ఆశ్రయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే.. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఎస్పీ అభిషేక్ యాదవ్‌ను ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తలు ప్రధానోపాధ్యాయుడితోపాటు అతని సహచరుడిపై ఎఫ్ఐఆర్ నమోదవ్వగా ఒకరిని అరెస్టు చేశారు. అంతేగాక ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. -
వామ్మో.. తరగతి గదిలో ప్రవేశించిన చిరుత..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఒక తరగతి గదిలో చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో ఉదయాన్నే కళాశాలకు వెళ్లిన విద్యార్థిపై దాడిచేసింది. అతను భయంతో కేకలు వేస్తూ.. బయటకు పరుగులు తీశాడు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అలీఘడ్‌లోని చౌదరి నిహాల్ సింగ్ అనే పాఠశాలలో చిరుతపులి ప్రవేశించింది. తరగతి గదిలో బెంచీల చాటున దాక్కుంది. గదిలోకి ప్రవేశించిన..లక్కీరాజ్ సింగ్ అనే బాలుడిపై వెనక నుంచి దాడిచేసి.. గాయపర్చింది. వెంటనే పులి వేరే చోటుకి పారిపోయింది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత.. బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడని పాఠశాల ప్రిన్సిపాల్ యోగేశ్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం చిరుత ఒక తరగతి గదిలో దాక్కుందని పాఠశాల సిబ్బంది అటవీ అధికారులకు తెలిపారు. చిరుత పులి కదలికలు పాఠశాలలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈక్రమంలో.. అటవీ సిబ్బంది చిరుత పులిని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో తెలియడంతో పెద్ద ఎత్తును ప్రజలు పాఠశాల వద్దకు చేరుకున్నారు. -
విద్యార్థినులకు మాయమాటలు.. మార్కులు ఎక్కువగా వేయిస్తానని చెప్పి..
సాక్షి, రాయచూరు(కర్ణాటక): విద్యార్థులను తండ్రి మాదిరిగా చూసుకోవాల్సిన ప్రిన్సిపాల్ కీచకుని అవతారమెత్తి కటకటాల పాలయ్యాడు. వర్కులు ఎక్కువ వేస్తానని నమ్మించి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్ హయ్యాళప్పను అరెస్ట్ చేశారు. నిందితుడు యాదగిరి తాలక ముండరిగి కిత్తరు రాణి చెన్నమ్మ గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. పదవ తరగతి పరీక్షలలో అధిక మార్కులు వేసి ఉత్తీర్ణులు చేస్తానని మభ్యపెట్టి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ రాగప్రియ హాస్టల్‌ను పరిశీలనకు వచ్చారు. ఆ సమయంలో విద్యార్థినులు ఆమె ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆమె ఆదేశాలతో ఎస్పీ వేదమూర్తి వెంటనే ప్రిన్సిపాల్ హయ్యాళప్పపై కేసు నవెదు చేయించి అరెస్ట్ చేశారు. -
ప్రిన్సిపల్ పోస్ట్ కోసం పిడిగుద్దులు.. ముష్టిఘాతాలు
పాట్నా: ఏ జాబ్‌లోనైనా ప్రమోషన్ రావాలంటే అందుకు తగ్గ అర్హత ఉండాలి. మరి ఇద్దరికి అర్హత ఉండి ఒక్కడ్నే ఆ పోస్ట్‌లో కూర్చోబెట్టాలంటే అది కత్తి మీద సామే. ఇక్కడ ఎవరు బెస్ట్ అని ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసే ఆ పదవిలో ఒకర్ని కూర్చోబెడతారు. మరి పిడిగుద్దులు కురిపించుకుంటే అనుకున్న పదవి కట్టబెడతారానుకున్నారో.. ఏమో.. తలపడిపోయారు.. కిందా పడిపోయారు.. స్కూల్ ప్రిన్సిపల్ పోస్ట్ కోసం తన్నుకుని రచ్చ చేసుకున్న ఘటన బిహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.,. పాట్నాకు 150 కి.మీ దూరంలో ఉన్న మోతిహరిలోని స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో శివశంకర్ గౌరి-రింకీ కుమారీలు ఇద్దరూ స్కూల్ ప్రిన్సిపల్ పోస్ట్ కోసం పోటీ పడ్డారు. దీనిలో భాగంగా ఉద్యోగానికి ఎవరు ఎక్కువ సీనియర్, తగిన అర్హత ఉన్నారనే విషయంపై అర్హతల పత్రాలను అందజేయాలని జిల్లా విద్యా శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రింకీ కుమార్ భర్త కూడా ఎంటర్ అయిపోయాడు. ఇది మరింత కాక రాజేసింది. స్టేట్ డిపార్ట్మెంట్లో పత్రాలను సమర్పించే క్రమంలో శివ శంకర్‌తో తీవ్రంగా ఘర్షణ పడ్డాడె రింకీ కుమారీ భర్త.. ఈ గొడవలో శివ శంకర్ గౌరీని రింకీ కుమార్ భర్త కిందపడేశాడు. శివ శంకర్‌ను ఎటు కదలనీయకుండా చేసిన రింకీ భర్త.. చివరకు కింద పడేవరకు వదల్లేదు. అక్కడున్న వారు వారిద్దర్నీ విడదీయడానికి ఎంతగా యత్నించినా వారు మాత్రం రెచ్చిపోయి మరీ ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. , , -
Sister Lissy Chakkalakkal: ఈ స్కూల్లో పిల్లలకు ఇళ్లులేకపోతే టీచర్లే ఇళ్లు కట్టిస్తారంట!!
కొందరు టీచర్లు స్టూడెంట్స్ పట్ల దయతో బుక్స్ కొనిస్తారు. బూట్లు కొనిస్తారు. ఫీజులు కడతారు. బట్టలు కుట్టిస్తారు. కాని కేరళలో ఈ టీచర్ కథ వేరు. ఆమె ఏకంగా ఇల్లే కట్టించి ఇస్తుంది. ఇది నిజం. గత 7 సంవత్సరాలలో 150 ఇళ్లు స్టూడెంట్స్‌కు కట్టి ఇచ్చింది. టీచర్ల విశాలమైన మనసుకు గిన్నెస్ రికార్డు ఉంటే అది ఈమెకే దక్కుతుంది. ఒక టీచర్‌గా పని చేస్తే ఆ టీచర్‌కు ఒక సైన్యం తయారవుతుందని ‘సిస్టర్ లిజీ చక్కలకల్’ను చూస్తే అర్థమవుతుంది. కొచ్చిలో ‘అవర్ లేడీస్ గర్ల్స్ స్కూల్’ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఈ 53 ఏళ్ల నన్ తన విద్యార్థినులపై కురిపిస్తున్న దయ అసామాన్యమైనది. 2012 నుంచి నేటి వరకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె తన విద్యార్థినుల కోసం మొత్తం 150 ఇళ్లు కట్టించింది. ప్రభుత్వమో, వ్యవస్థో, సంస్థో చేయాల్సిన పని కేవలం ఒక టీచర్‌గా ఆమె సాధించింది. ఎలా? ఎందుకు? ఇంటికి వెళ్లి చూడాలి త్రిశూర్‌లో ఎనిమిది మంది సంతానంలో ఒకదానిగా జన్మించిన లిజీ మిగిలిన తోబుట్టువులందరూ పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవగా తాను మాత్రం దైవ మార్గంలో మానవ సేవ చేయడానికి అంకితమైంది. కేరళలోని ‘ఫ్రాన్సిస్కన్ మిషనరీస్’లో సభ్యురాలయ్యి తమ మిషనరీ నడిపే స్కూలు ఉపాధ్యాయనిగా పని చేయడం మొదలెట్టింది. కాని టీచర్ పని కేవలం పాఠాలు చెప్పడం కాదు. విదార్థికి సంబంధించిన బాగోగులు కూడా గమనించడం. అందుకే లిజీ స్కూల్ అయ్యాక ‘విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలించే’ కార్యక్రమాన్ని స్వీకరించింది. కాని ఆ పరిశీలనలు ఆమెను విపరీతంగా డిస్టర్బ్ చేశాయి. ‘చాలామంది విద్యార్థినులకు అసలు ఇళ్లే లేవు. చాలామంది ఒక్క గది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వయసొచ్చిన అమ్మాయిలకు చాటు లేదు. భద్రత లేదు. వీరికోసం ఏదైనా చేయాలి అనిపించింది’ అంటుంది లిజీ. 2012లో ఒక విద్యార్థిని ఇంటికెళితే ఆ విద్యార్థిని కుటుంబం ఒక పాలిథిన్ షీట్ కప్పుతో ఉన్న గుడిసెలో జీవిస్తున్నట్టు ఆమె గమనించింది. తాగుడు వల్ల తండ్రి చనిపోగా తల్లి పిల్లలను సాకుతోంది. ఆ స్థలం వారిదే అని తెలుసుకుని అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వడానికి ఆమె సంకల్పం తీసుకుంది. 2014 నుంచి హౌస్ ఛాలెంజ్ అందరూ మొక్కలు నాటే ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ లాంటివి చేస్తుంటే లిజీ ‘హౌస్ ఛాలెంజ్’ తీసుకుంది. అవును. ఇల్లు లేని తన విద్యార్థినులకు ఇల్లు కట్టించే ఛాలెంజ్ అది. కాని అందుకు డబ్బు? ఇక్కడే ఆమెకు తన ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఒక సైన్యంగా పనికొచ్చారు. ‘మా స్కూల్లో చదువుకునే విద్యార్థినులు వారానికి ఒకసారి ఒక రూపాయి డొనేట్ చేయాలి. అలాగే పుట్టినరోజులు జరుపుకోకుండా అందుకు అయ్యే ఖర్చును డొనేట్ చేయాలి. ఆ డబ్బును ఇల్లు కట్టేందుకు ఉపయోగిస్తాను. అంతే కాదు... మా పూర్వ విద్యార్థులను సహాయం అడుగుతాను. ఊళ్లోని దాతలను సంప్రదిస్తాను. నా ఉద్దేశంలోని నిజాయితీని అర్థం చేసుకుని అందరూ సాయం చేస్తారు. అంతెందుకు.. నేను ఇల్లు కట్టివ్వమంటే మేస్త్రీలు కూడా తక్కువ కూలి తీసుకుని పని చేస్తారు. అలా ఒక్కో ఇల్లు కట్టుకుంటూ వస్తున్నాను’ అంటుంది లిజీ. అయితే ఆ ఇళ్లు హల్కాడల్కా ఇళ్లు కాదు. కచ్చితమైన మంచి రూపం, నాణ్యత ఉంటాయి. ఒక సెంట్ లేదా రెండు సెంట్ల స్థలంలో 500 చ.అడుగుల నుంచి 600, 700 చదరపు అడుగుల ఇళ్లను ఆమె కట్టి ఇస్తుంది. 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ ఒక్కో ఇంటికి వెచ్చిస్తుంది. ఎలా ఎంపిక? సరే. ఒక స్కూల్లో ఎంతో మంది విద్యార్థినులకు సొంత ఇల్లు ఉండదు. మరి సిస్టర్ లిజీ ఎవరికి ప్రాధాన్యం ఇస్తుంది అనంటే దానికి ఆమె ఒక పద్ధతి పెట్టుకుంది. ‘నేను కట్టిచ్చే ఇళ్లు చాలామటుకు వితంతు స్త్రీలకు అయి ఉంటాయి. లేదా భర్త మంచం పట్టి పిల్లలు దివ్యాంగులు అయితే వారికి ప్రాధాన్యం ఇస్తాను. దారుణమైన పేదరికంలో ఉంటే వారికి కట్టి ఇస్తాను. వారి పరిస్థితులు చూడగానే మనకు తెలిసిపోతుంది ఇళ్లు కట్టించి ఇవ్వాలా వద్దా అని’ అంటుందామె. లిజీ కట్టించి ఇచ్చే ఇళ్లలో హాల్, కిచెన్, షాపు పెట్టుకుని బతకాలంటే ఆ ఇంటిలోనే వీధిలోకి ఒక గది ఇలా ప్లాన్ చేసి కట్టి ఇస్తుంది. ‘ఈ దేశంలో ఇల్లు లేని వారే ఉండకూడదు అని నా కోరిక’ అంటుంది సిస్టర్ లిజీ. స్థలాలు కూడా ఇస్తున్నారు సిస్టర్ లిజీ ఇంత వరకూ స్థలాలు ఉండి అక్కడ ఇళ్లు కట్టుకోలేని వారికి ఇల్లు కట్టి ఇచ్చేది. ఇప్పుడు ఆమె ప్రయత్నం చూసి స్థలదాతలు కూడా ముందుకు వస్తున్నారు. ‘మేము భూమి ఇస్తాం. మీరు పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వండి’ అని ఇస్తున్నారు. తాజాగా రంజన్ వర్గీస్ అనే దాత 70 సెంట్ల స్థలం దానం చేస్తే సిస్టర్ లిజీ ఆ స్థలంలో 12 ఇళ్లు కట్టించి తన పేద విద్యార్థినులకు ఇచ్చింది. సొంత ఇంటిలో అడుగుపెట్టేటప్పుడు ఆ కుటుంబాల కళ్లల్లో కనిపించే ఆనందం వర్ణనకు అతీతం. ఆ విద్యార్థినులు సిస్టర్ లిజీని సాక్షాత్తు దైవదూతలా చూస్తారు. ఇంతకాలం గురుదక్షిణ గురించి విన్నాం. కాని సిస్టర్ లిజీ సేవ చూస్తే గురుదక్షిణ అనేది చిన్నమాట అనిపిస్తుంది. ఇలాంటి గురువులకు ఎటువంటి దక్షిణ ఇవ్వలేం. కాని ఈ స్ఫూర్తిని కొనసాగించి చేయగలిగిన శక్తి వచ్చినప్పుడు ఇలా లేని వారికి గూడు ఏర్పాటు చేయడమే అసలైన గురుదక్షిణగా భావిస్తే లిజీ ఆశించినట్టు ఇళ్లు లేనివారే ఉండని రోజు తప్పక వస్తుంది. చదవండి: Zinc Rich Diet: వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే! -
గిరిజన విద్యార్థినిపై లైంగిక వేధింపులు
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ప్రాక్టికల్, పరీక్ష రాయడానికి వచ్చిన గిరిజన విద్యార్థినీని ఓ కాలేజీ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె శనివారం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివి.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం దరి మారుమూల గిరిజన తండాకు చెందిన నర్సింగ్ విద్యార్థిని కాకినాడలో మూడో సంవత్సరం చదువుతోంది. ప్రాక్టికల్స్, పరీక్షల కోసం గాజువాక షీలా నగర్‌లోని మదర్ థెరిస్సా నర్సింగ్ కళాశాలకు వెళ్లాలని యాజమాన్యం సూచించింది. ఇటీవల పరీక్షలు రాయడానికి వచ్చిన ఆ విద్యార్థినీని కళాశాల ప్రిన్సిపాల్ ఎం. వెంకటరావు లైంగిక వేధింపులకు గురి చేశాడు. తను చెప్పినట్లు నడుచుకోకపోతే.. పాస్ అవ్వకుండా చేస్తానని బెది రించాడు. ఒకే రోజు మూడుసార్లు ఒళ్లం తా మసాజ్ చేయించుకున్నాడని, కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడని విద్యార్థిని వాపోయింది. ఆమె తన సోదరుడి సాయంతో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రిన్సిపాల్ వెంకటరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’
సాక్షి, నల్గొండ( నకిరేకల్ ) : ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు డాడీ... మా డాడీకి ఏమైంది అంకుల్..’ అంటూ పదేళ్ల చిన్నారి అవంతిక తన తండ్రి మృతదేహాన్ని చూపిస్తూ రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. కరోనా మహమ్మారి కాటుకు ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ మరణించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. తాటికల్ గ్రామానికి చెందిన చెనగాని రమేశ్ (43) చండూరులోని కృష్ణవేణి స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. కరోనాతో ఏడాదిగా స్కూల్ బంద్ కావడంతో స్వగ్రామమైన తాటికల్‌లోనే కుటుంబీకులతో ఉంటున్నారు. నెల రోజుల క్రితం రమేశ్ కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స కోసం కుటుంబీకులు రూ.11 లక్షలు ఖర్చు చేశారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున రమేశ్ మృతిచెందారు. మృతదేహాన్ని అంబులెన్‌లో తాటికల్‌కు తీసుకొచ్చారు. బంధువులెవరూ రాలేని పరిస్థితి ఉండటంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతోపాటు మరికొందరు స్నేహితులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు జరిపారు. లండన్‌లో ఉంటున్న రమేశ్ తమ్ముడు భారత్‌కు విమానాల రాకపోకలు లేకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అన్న అంత్యక్రియలను ఆయన వీడియో కాల్ ద్వారా చూస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: కీసరలో విషాదం: అవమానం భరించలేక కుటుంబం ఆత్మహత్య -
ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి
సాక్షి, బంజారాహిల్స్: స్కూల్ ఫీజు కట్టడానికి మరుసటి రోజు రమ్మని చెప్పిన ప్రిన్సిపాల్‌పై ఓ విద్యార్థి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 సయ్యద్ నగర్‌లోని ది ఆక్స్ఫర్డ్ మిషన్ హైసూ్కల్లో స్థానికంగా నివసించే ఇలియాస్(19)అనే విద్యార్థి సోమవారం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు వచ్చాడు. అయితే ఫీజు చెల్లించేందుకు రేపు రావాలని స్కూల్ ప్రిన్సిపల్ ఫిర్దోస్ అంజుమ్ సూచించారు. ఇప్పడే కట్టుకోవాలంటూ వాగ్వాదానికి దిగిన ఇలియాస్ కోపంతో ఊగిపోతూ ప్రిన్సిపల్‌ను కొట్టాడు. అప్పుడే వచ్చిన అతడి తల్లి జాఫరున్నీసాబేగం కూడా చెప్పు తీసుకొని ప్రిన్సిపల్ ముఖంపై బాదింది. బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇలియాస్‌తో పాటు అతడి తల్లి జాఫరున్నీసాబేగంపై ఐపీసీ సెక్షన్ 354, 324, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నాకు రిటైర్మెంట్ వయసు పెంపు వద్దు’
కొడిమ్యాల: ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటుండగా.. ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తనకు పెంపు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఏనుగు మల్లారెడ్డి తనకు రిటైర్మెంట్ వయస్సు పెంపు వద్దని మంగళవారం ప్రకటించారు. ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష
పట్నా: 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి జీవిత ఖైదీగా అమలు చేస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 11 సంవత్సరాల బాలిక 5వ తరగతి చదువుతోంది. ఆ పాఠశాలలో అరవింద్ కుమార్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా.. అభిషేక్ కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2018 సెప్టెంబర్‌లో ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్ తన స్కూళ్లో చదువుతున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి స్కూల్ టీచర్ అభిషేక్ కుమార్ కూడా సహకరించాడు. కొన్ని రోజుల తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా.. బాలిక గర్భవతి అని తేలింది. దాంతో బాలిక తల్లి ఏం జరిగిందో చెప్పాలని తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి నేడు పాట్నా కోర్టు ప్రిన్సిపాల్‌కు మరణశిక్షను విధిస్తూ.. లక్ష రూపాయల జరిమానా కట్టాలని తీర్పు వెల్లడించింది. అదేవిధంగా ఆయనకు సహకరించిన ఉపాధ్యాయుడికి రూ. 50,000 జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది. చదవండి: యువకుడి మోసం.. మైనర్ బాలిక ప్రసవం -
ఆ ప్రిన్సిపల్ ఇలా చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదు!
భోపాల్: ఫుడ్‌సేఫ్టీ అధికారులు, పోలీసులు కలిసి నిర్వహించిన దాడులలో కల్తీ పాలు పట్టుబడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాదిహర్‌లో చోటు చేసుకుంది. 65 ఏళ్ల రిటైర్డ్ ప్రిన్సిపల్ దీన్‌దయాల్ శర్మ నివాసంలో గురువారం 200 లీటర్ల కల్తీ(సింథటిక్ మిల్క్) పాలను, పామాయిల్, ఇతర రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఆహార భద్రతా అధికారి అవినాష్ గుప్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 272(అమ్మడానికి పెట్టిన ఆహార పదార్ధాలను కల్తీ చేయడం), సెక్షన్ 273(విషపూరితమైన ఆహారాన్ని అమ్మడం), 420(చీటింగ్) పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. (చదవండి: భయపెడుతున్న బురేవి) ఎఫ్ఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. పోలీసులు దాడి చేయటానికి వెళ్లినప్పుడు ప్రిన్సిపల్ వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని, 250 నుంచి 300 లీటర్ల వరకూ పాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్ అతని వద్ద లేదని తెలిపారు. ఈ దాడులలో పాలతో పాటు 10 కిలోల మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్, పామాయిల్ స్వాధీనం చేసుకున్నామని వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. దీనదయాల్ శర్మ సింథటిక్ పాలను తయారు చేసి ప్రజలకు హానికలింగే పదార్థాలను విక్రయిస్తున్నారని ఎఫ్ఐర్లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ టీమ్ వెళ్లిందన్నారు. అయితే ఈలోపే అతను పరారయినట్లు, త్వరలోనే నిందితుడిని పట్టకుంటామని సిహోనియా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఇలా చేస్తారనుకోలేదు.. పదిహేనేళ్ల క్రితం ఖదియాహర్‌లోని గర్ల్స్ ఇంటర్ కాలేజీలో ప్రిన్సిపల్‌గా చేరారని అప్పుడు ఉత్తీర్ణత 17శాతం మాత్రమే ఉండేదని దీనదయాల్ చేరిన తరువాత 70 శాతం అయ్యిందని విద్యానాణ్యత మెరుగుపరచడానికి కృషి చేసిన ఆయన ఇలా చేశారంటే నమ్మబుద్ది కావడం లేదని మాజీ విద్యార్థి, ప్రస్తుత స్థానిక సామాజిక కార్యకర్త జయంత్ అంటున్నారు. (చదవండి: 8న భారత్ బంద్) -
నీటి కొరత ఉంటే తలస్నానం చేస్తారా?
సాక్షి, రఘునాథపల్లి : హోలీ సందర్భంగా సోమవారం రంగులు చల్లుకున్న విద్యార్థినులు తలస్నానాలు చేశారు. నీటి కొరత ఉన్నప్పుడు తలస్నానాలు చేసి నీటిని వృథా చేశారంటూ ఆగ్రహంతో విద్యార్థినులను కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి చితకబాదింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ప్రత్యేకాధికారి సుమలత పాఠశాలకు వచ్చేసరికి సంపులోని నీరు ఖాళీ అయింది. దీంతో తలస్నానాలు చేసిన బాలికలందరినీ పిలిచి చేతి వేళ్లపై కర్రతో కొట్టింది.ఘటనపై సుమలతను వివరణ కోరగా.. ‘పాఠశాలలో నీటి సమస్య ఉంది.. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున రంగులు చల్లుకోవద్దని చెప్పినా వినలేదు’ అని చెప్పారు. -
ప్రిన్సిపల్ సంతకం ఫోర్జరీ
పశ్చిమగోదావరి,చింతలపూడి: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పాఠశాల నిధుల నుంచి రూ. 7.40 లక్షల నగదును కాజేసిన ఘటన చింతలపూడి మండలం, నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.దుర్గాభవాని సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో దినసరి భత్యంపై పని చేస్తున్న కె.హరీష్‌బాబు, రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ జీవీఆర్ మోహన్‌రావు కలిసి ఈ సొమ్మును కాజేశారని, వారిపై చర్యలు తీసుకుని గురుకుల పాఠశాల సొమ్మును రికవరీ చేయాలని ప్రిన్సిపల్ ఫిర్యాదులో కోరారు. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో స్కూల్ ఖాతా నుంచి సొమ్మును డ్రా చేశారని తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్లో వివిధ దఫాలుగా సొమ్ములు డ్రా చేసినట్లు ఉందని, డ్రా అయిన సొమ్ముల వివరాలు తమ క్యాష్ బుక్‌లో లేక పోవడంతో బ్యాంకుకు వెళ్లి విచారించగా గత ఏడాది జూలై 6వ తేదీన రూ.1.40 లక్షలు, అదే నెల 15వ తేదీన రూ.2.50 లక్షలు, ఆగస్టు 9న రూ.3.50 లక్షలు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డ్రా చేసినట్లు ఉందని వెల్లడించారు. గురుకుల పాఠశాల నిధులను ఫోర్జరీ చేసి స్వాహా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ దుర్గా భవాని కోరారు. -
విద్యార్థినులు లోదుస్తులు తొలగించాలంటూ..
గాంధీనగర్: గుజరాత్‌లోని ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థినుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది. విద్యార్థినుల్లో ఎవరెవరు నెలసరితో ఉన్నారో తెలుసుకునేందుకు లో దుస్తులు తొలగించాల్సిందిగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆదేశించారు. పిరియడ్స్ సమయంలో కొన్నింటిని విద్యార్థినులు తాకకుండా దూరంగా ఉంచేందుకు హాస్టల్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలేజీ ప్రిన్సిపాల్ ఈ చర్యకు పూనుకున్నారు. గుజరాత్‌లోని బుజ్ ప్రాంతంలో శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. (క్లాస్‌మేట్‌ను ఫేస్బుక్ ద్వారా..) నెలసరి సమయంలో విద్యార్థినులు కాలేజీ ప్రాంగణంలోని ఆలయంలోకి వెళ్తున్నారని, కిచెన్ లోపలికి కూడా వెళ్తూ..ఎక్కడపడితే అక్కడ,, ఎవరిని పడితే వారిని తాకుతున్నారంటూ గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ తరగతి గదిలో ఉన్న 68 మంది విద్యార్థులను బయటకు పిలిపించింది. అక్కడ నుంచి వారందరినీ వాష్ రూమ్‌కి తీసుకెళ్లి వరుసలో నిలబెట్టి ఒక్కొక్కరినీ లో దుస్తులు తొలగించి నెలసరిలో ఉన్నారో లేదో చూపించాలని ప్రిన్సిపాల్ ఆదేశించింది. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థులు నెలసరిలో ఉన్నామంటూ పక్కకు తప్పుకోగా ప్రిన్సిపాల్ వారిని దుర్భాషలాడింది. (యువతిపై సాముహిక అత్యాచారం.. అరెస్ట్) కాగా స్వామి నారాయణ్ ద్విశతాబ్ది మెడికల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌లో దాదాపు 1500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. భారతీయ సాంప్రదాయాలు అనే పునాదులపై ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆచారాలు, నియమాలు, సాంప్రదాయ విలువలకు ఇక్కడ పెద్ద పీట వేస్తారు. నియమాల ప్రకారం.. నెలసరి సమయంలో విద్యార్థినులు ఆలయంలోకి, కిచెన్‌లోకి వెళ్లరాదు. అదే సమయంలో ఇతర విద్యార్థులను తాకరాదు. అయితే కిచెన్‌లో వాడేసిన శానిటరీ న్యాప్కీన్స్ ఉన్నాయంటూ.. హాస్టల్ వార్డెన్ విద్యార్థినులపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు విద్యార్థినులు మాత్రం కాలేజీ యాజమాన్యం తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన తమకు కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటోంది. అదే సమయంలో ఈ ఘటనపై ట్రస్ట్ సభ్యులు హిరానీ .. విద్యార్థులకు జరిగిన అవమానాన్ని తప్పుబట్టారు. -
ఎనిమిదేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి
పహాడీషరీఫ్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల ప్రిన్సిపాలే గాడి తప్పాడు. 2వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఎర్రకుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జోసెఫ్ (50) ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. ఇదే పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలిక 2వ తరగతి చదువుతుంది. గత నెల 28న బాలికను ప్రిన్సిపాల్ తన గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై ఆ బాలిక ఆలస్యంగా తల్లికి తెలిపింది. దీంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
గురుకుల ప్రిన్సిపాల్‌ను తొలగించాలి
సాక్షి, మద్నూర్: గురుకుల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వివాదాస్పదంగా ఉంటూ మహిళా ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడేవాడని, అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని యువకులు, పెద్దలు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు నిరసనగా మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బైఠాయించారు. ప్రిన్స్‌పాల్ డౌన్ డౌన్ అంటూ వారు నినదించారు. ప్రిన్స్‌పాల్‌ను జాబ్ నుంచి తొలగించకుండా హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. బహిరంగ శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాస్తారోకో, ధర్నాతో జాతీయ రహదారిపై రెండు వైపుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎస్సై సురేశ్ రాస్తారోకో చేస్తున్న వారికి సముదాయించి ధర్నా విరమింపజేశారు. మద్నూర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. ప్రిన్స్‌పాల్ శ్రీనివాస్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నామని ఎస్సై సురేశ్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రిన్సిపాల్‌తో పా టు మరో ముగ్గురు పాఠశాల సిబ్బంది ఎందుకు ఉన్నారని యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి పోలీస్ స్టేషన్లో సెల్‌ఫోన్ మాట్లాడడం ఎలా అనుమతించారని యువకులు పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఎస్సై ముగ్గురి ఉపాధ్యాయుల ను వెళ్లిపోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు సహకరిస్తున్నారంటూ ముగ్గురు సి బ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు. పోలీస్ వాహనంలో ముగ్గురి సిబ్బందిని పాఠశాలకు తరలిస్తుండ గా యువకులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసు లు యువకులను చెదరగొట్టారు. సెక్షన్ 354ఏ, 509, 506 ప్రకారం కేసు నమోదు చేసి శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించామని ఎస్సై వెల్లడించారు. హైదరాబాద్ కార్యాలయానికి సరెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన గురుకుల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌పై వేటు పడింది. ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తప్పిస్తూ మరో ఉపాధ్యాయిని సునీతకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పాఠశాలకు మెయిల్ వచ్చింది. ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని గురుకుల సొసైటీ కార్యదర్శికి అటాచ్ చేశారు. ప్రిన్సిపాల్ తన ప్రాబల్యంతో పోస్టింగ్ తెచ్చుకుంటాడని యువకులు మండిపడుతున్నారు. -
గురుకుల ప్రిన్సిపాల్‌పై వేధింపుల కేసు
మద్నూర్(జుక్కల్): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ అదే పాఠశాల స్టాఫ్‌నర్స్ సునీత సోమవారం మద్నూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతేడాది నుంచి తనను వేధిస్తూ లొంగదీసుకోవడానికి ప్రయత్నాలు చేశాడని, ప్రతిఘటించడంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ తన భర్త శంకర్‌తో వచ్చి బోరున విలపించింది. గతంలో తనను హైదరాబాద్ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో తీసుకెళ్లి అసభ్యకరం గా ప్రవర్తించాడని పేర్కొంది. తనతో పాటు అక్కడి మహిళా సిబ్బందికి ఇబ్బందులు పెడుతున్నా భయంతో బయటకు చెప్పుకోలేకపోతున్నారని వివరించింది. చెప్పినట్టు చేయకపోతే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. -
పాఠశాలలో ప్రిన్సిపాల్ రాసలీలలు.. దేహశుద్ది
భువనేశ్వర్: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే తప్పటడుగులు వేస్తున్నారు. సరస్వతి నిలయంలాంటి పాఠశాలలను బూతు కార్యక్రమాలకు అడ్డాగా మారుస్తున్నారు. స్కూల్లో పనిచేస్తున్న సహచర ఉద్యోగినితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఓ ప్రిన్సిపాల్‌కి విద్యార్థులు దేహశుద్ది చేశారు. వివరాలు.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా హసన్పూర్ గ్రామంలోని రెసిడెన్సియల్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజీవ్ లోచన్.. సహ ఉద్యోగి సబితా బిస్వాల్‌తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం నేరుపుతున్నాడు. అంతటితో ఆగకుండా పాఠశాల ఆవరణలోనే ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాలలో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఒకసారి హెచ్చరించి వెళ్లారు. అయినప్పటికీ వారు బుద్ధి మార్చుకోకపోవడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పాఠశాల వాతావరణాన్ని చెడగొడుతున్న వారిద్దరినీ సస్పెండ్ చేయాలంటూ తొలుత విద్యార్థులు ఆందోళకు దిగారు. ఈ సమయంలోనే గ్రామస్థులంతా అక్కడికి చేరుకోవడంతో రాజీవ్‌పైకి దాడికి దిగారు. అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి వ్యవహారంపై విచారణ జరపుతున్నారు. -
బాలికపై లైంగికదాడికి ప్రిన్సిపాల్ యత్నం
బహదూర్‌పురా: ఓ బాలికపై సాక్షాత్తు పాఠశాల ప్రిన్సిపాల్ లైంగికదాడికి యత్నించిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్ అసద్‌బాబానగర్‌లో ఇంతిజార్ అలీ అనే వ్యక్తి మోషియన్ పేరుతో ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక (11) సదరు స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో సదరు బాలిక తల్లిదండ్రులు స్కూల్ ఫీజు చెల్లించలేకపోయారు. బాలికను పరీక్షకు అనుమతించాలని తల్లిదండ్రులు కోరడంతో ఆధార్ కార్డు, ఇతర పత్రాలు తీసుకొస్తే పరీక్ష రాయిస్తానంటూ ప్రిన్సిపాల్ ఇంతిజార్ అలీ చెప్పాడు. దీంతో బుధవారం తల్లిదండ్రులు బాలికను తీసుకొని పాఠశాలకు వచ్చారు. స్కూల్లో కంప్యూటర్ పని చేయడం లేదని బాలిక తల్లిదండ్రులను ఇంటికి పంపిన ప్రిన్సిపాల్ బాలికను స్కూల్లోనే ఉంచుకున్నాడు. సాయంత్రం ఆధార్‌కార్డును పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు గురువారం బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రిన్సిపాల్ ఇంతిజార్ అలీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్సై నర్సింహ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. మండల డిప్యూటీ ఈవో విచారణ దీనిపై సమాచారం అందడంతో బహదూర్‌పురా మండల డిప్యూటీ ఈవో వేణుగోపాల చారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులను విచారించారు. స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసులు నమోదు చేశారని, అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన పాఠశాల ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతారావు డిమాండ్ చేశారు. -
ప్రిన్సిపాల్ సహా 10 మందిపై కేసు
కర్ణాటక,బనశంకరి: నగర శివార్లలో సర్జాపుర రోడ్డులో కసవనహళ్లి అమృత ఇంజనీరింగ్ కాలేజీ 7వ అంతస్తు పై నుంచి దూకి సోమవారం ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్ది శ్రీ హర్ష కేసులో కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు 10 మందిపై పరప్పన అగ్రహార పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన శ్రీహర్ష (20)ను కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురిచేసిందని ఆయన తండ్రి విజయ్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అమృత ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ధనరాజ్‌స్వామి, అధ్యాపకులైన ఎస్జీ.రాజేశ్, బీఎల్.భాస్కర్, రవికుమార్, కేటీ.రమేశ్, నిపుణ్ కుమార్, అముద, బీ.వెంకటేశ్, ఎస్ఆర్.నాగరాజ, ఎన్ఎస్.మూర్తిపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, సాక్ష్యాలు నాశనం చేశారని అభియోగాలు నమోదు చేశారు. కాలేజీ హాస్టల్లో సౌకర్యాల కొరతపై ప్రశ్నించినందుకు తమను వేధిస్తున్నారని, అది తట్టుకోలేక శ్రీ హర్ష ప్రాణాలు తీసుకున్నాడని సహచర విద్యార్థులు ఆరోపించారు. ఈ కేసులో విద్యార్థుల, సిబ్బంది నుంచి సమాచారం సేకరిస్తున్నామని, సాక్ష్యాధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆగ్నేయవిభాగం డీసీపీ ఇషా పంత్ తెలిపారు. -
అక్రమాల ‘ప్రిన్స్’పాల్‌పై వేటు
వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చుంటే ఏముందన్నట్టుగా ఈ ప్రిన్సిపాల్ వ్యవహారం తయారైంది. విద్యా సంస్థకు అధినేతగా ఉండి కూడా పలు అక్రమాలకు పాల్పడుతూ అప్పటి టీడీపీ నేతల అండతో చెలరేగిపోయాడు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతోనే ఈయన అరాచకాలకు చెక్ పడింది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్కపెను తుపాన్‌కు నేలకూలిపోతుంద’నే సామెత రాజమహేంద్రవరం ప్రభుత్వజూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విషయంలో నిజమైంది. చంద్రబాబు ప్రభుత్వంలోరెండున్నరేళ్లు అవినీతి అక్రమాలతో చెలరేగిపోయిన ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయం ముందస్తుగానే ఊహించిన నిందితుడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడంతో సస్పెన్షన్ ఉత్తర్వులను ప్రిన్సిపాల్ ఇంటి గోడకు అతికించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...అక్రమాలకు పాల్పడినా అధికార పార్టీ అండదండలుంటే తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కానీ, నిరంతరం వ్యవస్థలను మేనేజ్ చేయడం అన్ని సమయాల్లో కలిసి రాదు. జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు మహిళా అధ్యాపకులపై వేధింపులు, విద్యార్థుల ఫీజులలో మోసాలు, యూనిఫారాల విక్రయాల్లో లొసుగులు, లక్షలు విలువైన రంగూన్ టేకు కలపను గుట్టుచప్పుడు కాకుండా విక్రయం...తదితర అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినా అప్పటి టీడీపీ నేతల అండదండలతో వాటిని తొక్కిపెట్టేయడంతో బాధితులు కూడా మౌనం వహించారు. టీడీపీ హయాంలో మహిళా అధ్యాపకులు పోరాడుతున్నా ‘పచ్చ’ నేతల ప్రోద్బలంతో ప్రిన్సిపాల్ బయటపడుతూ వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, లోపాయికారీ వ్యవహారాలపై ‘సాక్షి’ దృష్టిపెట్టి గత నెలలో ‘వేధింపుల్లో ప్రిన్సిపాల్’, ‘ఈయనో ప్రిన్సిఫ్రాడ్’, ‘ప్రిన్సిపాల్‌పై సీరియస్’, ‘యథానేత...తథామేత’, ‘ఉచ్చు బిగుస్తోంది’ తదితర శీర్షికలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో సంబంధితాధికారుల్లో కదలిక వచ్చింది. స్త్రీ,శిశు సంక్షేమ, విద్యాశాఖా మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌లు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రిన్సిపాల్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా నియమితులైన ఇంటర్మీడియట్ బోర్డు రాజమహేంద్రవరం రీజనల్ జాయింట్ డైరక్టర్ నగేష్‌కుమార్ ప్రిన్సిపాల్ వీర్రాజుపై కాలేజీలోని సెమినార్ హాలులో నాలుగు గోడల మధ్య 14 అంశాలతో కూడిన ప్రశ్నావళిని అందజేసి చాలా గోప్యంగా విచారణ జరిపారు. దళిత సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకురాలు ఉదయశాంతిపై ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడ్డ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారని కక్షకట్టి ఆమెకు మద్దతుగా నిలిచిన మహిళా అధ్యాపకులను వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అధ్యాపకులంతా ఆర్జేడీ విచారణలో ప్రిన్సిపాల్ బాగోతాలను ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్టు చెప్పుకున్నారు. ఓ వైపు వేధింపు ఫిర్యాదులపై విచారిస్తునే కాలేజీలో ఎస్సీ, బీసీ విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఫీజులు, రూ.500లుండే యూనిఫారాన్ని తన బినామీల ద్వారా కాలేజీ ఆవరణలోనే రూ.800 నుంచి రూ.900లకు అధిక ధరలకు విక్రయించడం, కాలేజీలో బ్రిటిష్ హయాంలో నిర్మించిన పాత అతిథి గృహానికి సంబంధించిన రూ.50 లక్షలు విలువైన రంగూన్ కలప అక్రమంగా అమ్మకాలు...వీటిలో ఏ ఒక్కదానికీ రికార్డులు లేకపోవడంపై విచారణ జరిపిన నగేష్ కుమార్ 10, 12 పేజీల సమగ్ర నివేదికలో ‘అవన్నీ వాస్తవాలే’నని తేల్చి ఆ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ డైరక్టర్ అప్పలనాయుడుకు నివేదించారు. నివేదికను కొత్తగా వచ్చిన కమిషనర్ రామకృష్ణకు వెళ్లడంతో ప్రభుత్వం నుంచి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తం మీద మహిళా అధ్యాపకుల రెండున్నరేళ్ల పోరాటం ఎట్టకేలకు ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌తో సుఖాంతమైంది. -
అవమానించిందని ప్రిన్సిపల్‌ను చంపేశాడు..!
ముంబై : తోటి విద్యార్థుల ముందు తనను అవమానించిందని ఓ మైనర్ విద్యార్థి స్కూల్ ప్రిన్సిపల్‌ను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గోవండి జిల్లాలోని శివాజీ నగర్లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆయేషా అస్లాం హసూయి (30) ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోంది. దాంతోపాటు గత ఐదేళ్లుగా తన ఇంటివద్ద ట్యూషన్ చెప్తోంది. ఈ క్రమంలో తన వద్ద చదువుకునే ఓ పన్నెండేళ్ల విద్యార్థి.. గత సోమవారం ఆమెను రూ.2 వేలు ఇవ్వుమన్నాడు. దాంతో సదరు ప్రిన్సిపల్ అతన్ని తరగతి గదిలోనే కొట్టింది. దీన్ని అవమానంగా భావించిన ఆ మైనర్ విద్యార్థి ఆమెపై పగపెంచుకున్నాడు. ఎప్పటిలాగానే అదేరోజు సాయంత్రం ఆమె ఇంటికి ట్యూషన్‌కు వెళ్లాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు. హసూయి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హసూయి మరణించిందని పోలీసులు వెల్లడించారు. మైనర్ విద్యార్థిని రిమాండ్‌కు తరలించామని.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ప్రిన్సిపల్ వద్ద తన తల్లి రూ.2 వేలు అప్పుగా తీసుకురమ్మందని.. ఆ విషయమే ప్రిన్సిపల్‌కు చెబితే అందరి ముందు కొట్టిందని విద్యార్థి పోలీసుల విచారణలో చెప్పాడు. అవమాన భారంతోనే ఈ హత్య చేసినట్టు పేర్కొన్నాడు. ఇదిలాఉండగా.. మృతురాలి బంధువులు ఈ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హసూయి హత్య వెనుక కుట్ర దాగుందని ఆరోపించారు. 2010లో ఆమె తండ్రి కూడా ఆర్థిక లావాదేవీల కారణంగా హత్యకు గురయ్యాడని తెలిపారు. భర్తతో విభేదాల నేపథ్యంలో ప్రిన్సిపల్ హసూయి ఒంటరిగా జీవిస్తోందని వెల్లడించారు. -
దైవదూషణ: హిందువుల ఇళ్లు, ఆలయాలపై దాడి
కరాచీ: పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి పట్టణంలో హిందువుల ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఓ స్కూలుకు చెందిన హిందూ ప్రిన్సిపాల్ దైవదూషణ చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఘోట్కి పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, మూకదాడులపై పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ చోటుచేసుకున్న మూక దాడుల్లో హిందువుల ఇళ్లు, దుకాణాలు, ఆలయాలు ధ్వంసమైనట్టు మానవ హక్కుల సంస్థ ట్విటర్లో పేర్కొంది. వరల్డ్ సింధీ కాంగ్రెస్ అనే సంస్థ కూడా ఘోట్కి పట్టణంలో చోటుచేసుకున్న మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లోని మతమైనారిటీలకు రక్షణ కల్పించేవిధంగా ఇతర దేశాలు ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని అభ్యర్థించింది. ‘ఘోట్కి పట్టణంలోని హిందూ కమ్యూనిటీపై దాడులు జరుగుతున్నాయి. హిందూ స్కూల్ ప్రిన్సిపాల్ దైవదూషణ చేశాడని ఓ విద్యార్థి ఆరోపించడంతో ప్రిన్సిపాల్ స్కూలుతోపాటు హిందువుల ఆలయాలు, దుకాణాలు, ఇళ్లను ధ్వంసం చేశారు’ అని వరల్డ్ సింధీ కాంగ్రెస్ ట్విటర్లో పేర్కొంది. ఘోట్కి పట్టణంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు పేర్కొన్నట్టు పాక్ మీడియా పేర్కొంది. దైవదూషణ చేసిన హిందు ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపింది. అధికారులు మాత్రం దాడులకు కారణమైన గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఘోట్కితోపాటు మీర్పూర్ మథెలో, అదిల్‌పూర్ ప్రాంతాల్లో కూడా హింస చోటుచేసుకున్నట్టు డాన్ పత్రిక పేర్కొంది. భారత్‌లో మత మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, వారికి రక్షణ లేకుండాపోయిందని ఒకవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్న సమయంలోనే పాక్‌లోని హిందు మైనారిటీలపై దాడులు జరగడం గమనార్హం. -
విద్యార్థిని చావబాదిన ప్రిన్సిపల్
-
మూడో తరగతి విద్యార్థిపై ప్రిన్సిపాల్ ప్రతాపం
సాక్షి, కర్నూలు: మూడో తరగతి విద్యార్థిపై ప్రతాపం చూపించాడు ప్రిన్సిపాల్. రెండు రోజులు స్కూల్‌కి రాలేదన్న కోపంతో విచక్షణా రహితంగా కొట్టాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరులోని విస్డమ్ స్కూల్లో ఈ సంఘటన జరిగింది. థర్డ్ క్లాస్ విద్యార్థి రెహాన్.. చెప్పకుండా స్కూల్ మానేశాడన్న కోపంతో ప్రిన్సిపల్ ఆ బాబును చావగొట్టాడు. చెంపలు వాయించి.. వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో విద్యార్థి ఒంటి నిండా వాతలు తేలాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు.. స్కూల్‌కి వచ్చి నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఎమ్మెల్యే ఆర్ధర్ అక్కడికి చేరుకుని... ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
టీ విత్ ప్రిన్సిపాల్
సాక్షి, హైదరాబాద్: పిల్లల సమస్యల పరిష్కారం, బోధన, అభ్యసన కార్యక్రమాల్లో కొత్త ఆలోచనలకు అవకాశం కలి్పంచేందుకు బీసీ గురుకుల సొసైటీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల తల్లిదండ్రులతో ‘టీ విత్ ప్రిన్సిపాల్’ కార్యక్రమాన్ని తీసుకొచి్చంది. ప్రతి శనివారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొంటారు. వారితో చర్చించి పాఠశాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తారు. సాధారణంగా పాఠశాలలో విద్యార్థికి ఎదురయ్యే పరిస్థితులను టీచర్ల వద్ద కంటే తల్లిదండ్రుల వద్ద ప్రస్తావిస్తారు. అలాంటి అంశాలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకే బీసీ గురుకుల సొసైటీ ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసింది. ఇందులో విద్యార్థుల సమస్యలతోపాటు బోధన, అభ్యసన కార్య క్రమాల అమలుపై సలహాలు సూచనలు సైతం తీసుకుంటారు. అలా నమో దు చేసిన సూచనలతో సరికొత్తగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంతో పాటు గురుకుల సొసైటీకి సమావేశ పురోగతిని సమరి్పంచాల్సి ఉంటుంది. మరింత దగ్గరయ్యేలా... తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 23 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017–18 విద్యా సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒకేసారి 119 గురుకుల పాఠశాలలను తెరిచారు. క్షేత్రస్థాయిలో డిమాండ్ అధికంగా ఉండడంతో 2019–20 విద్యా సంవత్సరంలో అదనంగా మరో 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని అతి పెద్ద గురుకుల సొసైటీగా మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆవిర్భవించింది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారం, తల్లిదండ్రులతో గురుకుల బృందం దగ్గరయ్యేందుకు సొసైటీ ఈకార్యక్రమాన్ని తీసుకొచి్చంది. ప్రతి శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో కనీసం 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తారు. ఈ అంశాలపై చర్చ... టీ విత్ ప్రిన్సిపాల్ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌తో పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇందులో విద్యార్థి తాలూకు పురోగతి, బోధన అభ్యసన కార్యక్రమాలపై చర్చిస్తారు. పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కోసం దాతల సహకారం, వసతుల కల్పనపైనా మాట్లాడతారు. పాఠశాల ప్రగతి నివేదికలు సైతం ఇందులో వివరిస్తారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం, స్థానిక యువత సహకారంపై సలహాలు, సూచనలు తీసుకుంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల వ్యక్తిగత నైపుణ్యాన్ని తెలుసుకుని పాఠశాల కార్యక్రమాల్లో వారి సహకారాన్ని తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తారు. -
కీచక ప్రిన్సిపాల్: రెండున్నరేళ్లుగా వేధింపులు
ప్రిన్సిపాల్... కళాశాలలో విద్యార్థుల నుంచి అధ్యాపకులకు, సిబ్బందికి దిశా,నిర్దేశం చేస్తూ క్రమశిక్షణతో, ఏకతాటిపై ముందుకు తీసుకువెళ్లాల్సిన వ్యక్తి. ఇందులో ఏ ఒక్కరు తప్పు చేసినా మందలించి, అవసరమైతే చర్యలు తీసుకొని కళాశాలను అభివృద్ధి పథంలో నడిపించాలి. మంచి ఉత్తీర్ణతా ఫలితాలతో వందలాది మంది విద్యార్థులను తన కళాశాల వైపు అడుగులు వేయించి ఇతర కళాశాలలకు ఆదర్శంగా నిలపాలి. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఆయన ‘పచ్చ’ రంగు పులుముకొని...ఆ అండతో మహిళలపై వేధింపులకు దిగితే...అదే రాజమహేంద్రవంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో జరిగింది ... సాక్షి, తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు సమీపాన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాలే కీచకుడుగా మారి మహిళా అధ్యాపకులపై గత రెండున్నరేళ్లుగా వేధింపులకు దిగుతున్న ఘటన ఇది. వందల మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈ కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది 60 మంది పని చేస్తున్నారు. రెండువేల మంది పైచిలుకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి పవిత్రమైన విద్యాలయంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రిన్సిపాల్ నీచ చర్యలకు దిగడమేమిటని మహిళా సంఘాల ప్రతినిధులు విద్యావేత్తలు మండిపడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనేందుకు ఇదో ఉదాహరణ. ఎదురైన అవమానాలపై మహిళా అధ్యాపకులు రెండున్నరేళ్లుగా పోరాడినా న్యాయం దక్కకపోగా అప్పటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అండదండలు ప్రిన్సిపాల్‌కు తోడవడంతో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించారు. మొదట రాజమహేంద్రవరం పోలీసులకు, రెండోసారి ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు..ఇలా ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసినా న్యాయం దక్కకపోగా తిరిగి రివర్స్‌లో ఫిర్యాదు చేసిన 17 మందిపై వేధింపులు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం కుప్పకూలి వైఎస్సార్సీపీ సర్కారు రావడంతో బాధితుల్లో ఆత్మస్థైర్యం పెరిగి నేరుగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత, విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌లకు బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది. వివరాలు ఇలా ఉన్నాయి...రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు. 14 ఏళ్లుగా ఇక్కడ అధ్యాపకునిగా పనిచేస్తున్న ఈయన మధ్యలో రెండేళ్లు కొత్తపేట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెళ్లారు. ఆ తరువాత తిరిగి 2016లో ఇక్కడికే ప్రిన్సిపాల్‌గా వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ టీడీపీకి వీరాభిమానిగా సహాయ, సహకారాలు అందిస్తూ వచ్చాడు. దీంతో ఇంటర్మీడియట్ బోర్డులో కూడా ఇతని హవానే కొనసాగింది. తన కార్యకలాపాలకు అడ్డుపడే మహిళా అధ్యాపకులను తన ఆఫీసు రూమ్‌కి పిలిపించి ఏకవచనంతో, వెకిలి చేష్టలతో అవమానించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తరగతి గదిలో, విద్యార్థుల ఎదుటే ఏకవచనంతో అవమానిస్తుండడంతో గత ఫిబ్రవరిలో జనరల్ ఫౌండేషన్ కోర్సుకు కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేసే ఉదయశాంతి రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలేజీలో పనిచేస్తున్న వారిలో సుమారు 40 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆమెకు అండగా నిలిచారు. అధికార పార్టీ అండదండలు, ఎమ్మెల్యేకు సానుభూతిపరుడిగా ఉండటంతో పోలీసులు ఆ కేసును నీరుగార్చేశారు. ఆ తరువాత గత మార్చి 3న అమరావతి వెళ్లి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ప్రిన్సిపాల్‌పై చర్యలు లేకపోగా, తిరిగి కాలేజీకి వచ్చాక ప్రిన్సిపాల్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని మహిళా అధ్యాపకులు కన్నీరుపెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తిపై చర్యలు లేకపోగా ఇంటర్‌బోర్డుకు పిలిపించి ప్రిన్సిపాల్‌కు జోన్–3, జోన్–4లకు ఇన్చార్జి హోదా ఇవ్వడం విశేషం. ఈ పరిణామంతో ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదనే అభిప్రాయానికి వచ్చిన మహిళా అధ్యాపకులు మరోసారి ఫిర్యాదు చేయడానికి ధైర్యం కూడా చేయలేకపోయారు. కనీసం ఇంటర్‌బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి మహిళ అయి ఉండి కూడా సహచర మహిళా అధ్యాపకులకు భరోసా నివ్వకపోవడమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో కొరవడిన ప్రశాంతత.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది మధ్య తరుచూ కీచులాట, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, కమిషనర్‌కు ఫిర్యాదులతో కళాశాలలో ప్రశాంత వాతావరణం కొరవడిందనే చెప్పవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ వీర్రాజును ‘సాక్షి’ వివరణ కోరగా కాలేజీలో అటువంటి వాతావరణం ఏమీ లేదన్నారు. సక్రమంగా పనిచేయమన్నందుకే పనిగట్టుకుని కొందరు కేసులు పెడుతున్నారని చెప్పారు. -
ఈ మాస్టారు అలా వచ్చి.. ఇలా వెళ్తాడు
సాక్షి, పెనగలూరు(కడప) : రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లతో నడుస్తుందన్న సామెతను పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నిజం చేస్తున్నారు. కళాశాలను నడిపించే వ్యక్తిగా ఉంటూ ప్రతి రోజూ 12గంటలకు రావడం 3 గంటలకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ప్రిన్సిపల్ నిర్వాహకం వల్ల కళాశాలలో క్రమశిక్షణారాహిత్యం లోపిం చే అవకాశాలు కూడా ఉన్నాయి.ఆలస్యంగా వస్తున్న ప్రిన్సిపల్‌ను సోమవారం ప్రపంచ మానవహక్కుల సంఘం పెనగలూరు మండల అధ్యక్షుడు ఎం. విశ్వనాథరెడ్డి ప్రశ్నిం చారు. రైలుకు వస్తాను... రైలుకే వెళ్తాను. నేనొచ్చేది అంతే... అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన సమాధానం చూస్తే కళాశాలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రిజిష్టర్‌లో సంతకం చేసేందుకు మాత్రమే ఏదో ఒక సమయంలో వస్తున్నట్లు అర్థమైపోతోంది. ప్రిన్సిపల్ వ్యవహారశైలిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు విశ్వనాథరెడ్డి తెలిపారు. -
బడిలో టీచర్ల పంచాయితీ
సాక్షి, రాజేంద్రనగర్ : అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల ఎదుటే నోటికి వచ్చిన బూతులు తిట్టుకున్నారు. పరస్పరం ఒకరిపైఒకరు సెల్ఫోన్లతో దాడులు చేసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకోని ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల జోక్యంతో కథ సాయంత్రానికి రాజీకి వచ్చింది.రంగారెడ్డి జిల్లా గండిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రాధానోపాధ్యాయుడిగా రాములు, ఉపాధ్యాయురాలిగా కె.మనోరమ విధులు నిర్వహిస్తున్నారు. సో మవారం ఉదయం మనోరమ 8.55 నిమిషాలకు బడికి చేరుకున్నారు. అప్పటికే ప్రధానోపాధ్యాయుడు రాములు ప్రార్థన నిర్వహించి విద్యార్థులను తరగతి గదుల్లోకి పంపించారు. అయితే, నిత్యం 9.15 నిమిషాలకు ప్రార్థన ముగించాల్సి ఉండగా ముందే ఎందుకు నిర్వహించారని మనోరమ హెచ్ఎంను ప్రశ్నించారు. ఈ విషయమై ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది. మనోరమ తన చేతులో ఉన్న సెల్‌ఫోన్‌ను విసిరికొట్టారు. అది రాములు వద్ద పడడంతో ఆయన తనపై ఎందుకు విసురుతున్నావు.. అంటూ అదే సెల్‌ఫోన్‌ను మనోరమ వద్దకు విసిరాడు. విద్యార్ధుల ఎదుటే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఇతర సిబ్బంది వారిని సముదాయించారు. ఈ విషయమై టీచర్ మనోరమ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని విచారించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓతో పాటు ఇతర ఉపాధ్యాయులు వారిని సముదాయించి రాజీ కుదిర్చారు. -
ప్రిన్సిపాల్‌కు పూరీ సినిమా ఛాన్స్!
మునగపాక (యలమంచిలి): ఇష్టపడి కష్టపడి పనిచేస్తే ఏరంగంలో అయినా రాణించగలమని నిరూపిస్తున్నారు.. మునగపాకకు చెందిన డాక్టర్ కోరుకొండ గోపి. దర్శకుడు పూరీ జగన్నాథ్ తదుపరి చిత్రం మిస్‌యూ డార్లింగ్‌లో రెండు పాటలు రాసే అవకాశాన్ని దక్కించుకున్నారు. గతంలో గోపి సినిమా పాటల రచయితగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పరిశీలించిన పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సినిమాకు సంబందించిన కథ చెబుతూ పాటలు రాయమన్నారు. దీంతో గోపీ అవకాశం వచ్చిందే తడవుగా పరీక్షల్లో తప్పిన హీరో తమ్ముడు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడే సందర్భంలో ‘తమ్ముడూ పరీక్షల్లో తప్పడం నీ తప్పు కాదురా..’ అనే పాటతో పాటు హీరోయిన్ అందాలను వర్ణిస్తూ మరోపాటను రాసారు. దీంతో రెండు పాటలను పూరీ జగన్నాథ్ ఎంపిక చేశారు. ప్రస్తుతం గోపీకృష్ణ సింహాద్రి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. రెండుసార్లు జాతీయ స్థాయిలోనూ, మరో రెండుసార్లు రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ఉపాధ్యాయునిగానూ అవార్డులు అందుకున్నారు. అలాగే స్వీయ రచనలో మానవ కంప్యూటర్ సంబంధాలు, కల్చరల్ రూరల్ టెక్నాలజీ పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అంతేకాకుండా పలు టెలీ ఫిల్మ్‌లు కూడా షూట్ చేశారు. వర్ధమాన సంఘటనలను ఇతివృత్తంగా తీసుకొని టెలిఫిల్మ్‌లు షూట్ చేయడం అలవాటుగా మారింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన గోపీకి పాటలు రాసే అవకాశం రావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బుడ్డోడు.. ఓ బడి
చిన్న పిల్లలు బడికి పొమ్మంటేనే తెగ మారాం చేస్తారు. కానీ ఈ ఫొటోలోని 12 ఏళ్ల అబ్బాయికి మాత్రం చదువు అంటే మహా ప్రాణం. తాను చదువుకోవడమే కాదు.. చదువుకు దూరం అవుతున్న పిల్లలు కూడా చదువుకోవాలని ఎప్పుడూ అనుకుంటుండేవాడు. దీనికోసం ఏకంగా ఓ స్కూల్‌నే స్థాపించాడు.. ఈ అబ్బాయి పేరు లియోనార్డో నికనార్. అర్జెంటీనా దేశంలోని పీడ్రిటాస్ అనే చిన్న నగరానికి చెందినవాడు. చదువును పట్టించుకోకుండా ఎక్కువ సమయం ఆటలాడుతూ కాలక్షేపం చేసేవారి కోసం బడిని ప్రారంభించాడు. గతేడాది ఈ విషయాన్ని తన బామ్మకు చెప్పగా ఆమె.. స్కూల్ప్రారంభించేందుకు సాయం చేసింది. ఇప్పటివరకు ఈ స్కూల్లో దాదాపు 40 మంది పిల్లలు చేరారు. లియోనార్డో ఈ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు.. ప్రిన్సిపాల్‌గా కూడా బాధ్యతలు చూసుకుంటున్నాడు. పాఠాలు నేర్చుకునేందుకు చిన్న పిల్లలతో పాటు చదువు రాని పెద్దలు కూడా హాజరవుతున్నారు. వారందరికీ ఎంతో ఓపికగా పాఠాలు చెబుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఉదయం మొత్తం తాను స్కూల్లో చదువుకుని సాయంత్రం పూట సైకిల్‌పై వచ్చి మరీ పిల్లలకు పాఠాలు చెబుతాడట. ఎంత వాన పడ్డా.. మంచు కురిసినా లెక్క చేయకుండా కచ్చితంగా తన సొంత స్కూల్‌కు వెళతాడట. సాధారణ వేళల్లో పిల్లలు స్కూల్‌కు హాజరు కాకపోతే రాత్రి వేళల్లో ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటాడట. గ్రామర్, గణితం సబ్జెక్టులను పిల్లలకు బోధిస్తాడట మనోడు. -
విద్యార్థుల కళ్ల ముందే ప్రిన్సిపాల్ హత్య
బెంగళూరు : విద్యార్థుల కళ్ల ముందే ఆ ప్రధానోపాధ్యాయున్ని కాల్చి చంపారు దుండగులు. పట్టపగలే ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ దారుణహత్యకు గురైన సంఘటన మాగడిరోడ్డు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.... మాగడిరోడ్డు అగ్రహార దాసరహళ్లిలోని హవనూరు పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్‌గా రంగనాథ్ నాయక్ (63) పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో రంగనాథ్ తన కార్యాలయంలో ఉండగా ఐదారుగురు దుండగులు ప్రిన్సిపల్ కార్యాలయంలోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేసి ఇష్టానుసారం పొడిచి సిబ్బంది వచ్చేలోపు పరారయ్యారు. సమాచారం అందుకున్న మాగడి పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఉత్తర విభాగ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. స్థల వివాదమే కారణమా ? పాఠశాల వెనుకభాగంలో యాజమాన్యానికి, అక్కడే నివాసం ఉంటున్న గంగమ్మ అనే మహిళకు స్థల విషయంలో వివాదం ఉంది. ఈ వివాదానికి సంబంధించి రంగనాథ్ కోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ చేపట్టిన కోర్టు 10 అడుగుల స్ధలం పాఠశాలకు వదిలిపెట్టాలని బీడీఏ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం గంగమ్మకు చెందిన 10 అడుగుల స్ధలాన్ని స్వాధీనం చేసుకుని గొడను తొలగించారు. దీంతో గంగమ్మ కుమారుడు మహేశ్ ఆగ్రహంతో హత్య చోటుచేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగనాథ్ నాయక్ హత్య విషయం తెలియగానే కుటుంబసభ్యుల్లో అక్రందనలు మిన్నంటాయి. -
11 ఏళ్ల విద్యార్థినిపై దారుణం
పాట్నా : ఐదో తరగతి విద్యార్థినిపై అరాచకానికి పాల్పడిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని, అతనికి సహకరించిన గుమస్తాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. పాట్నాకు చెందిన పదకొండేళ్ల చిన్నారి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోక ఆ దృశ్యాలను వీడియో తీసి ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఆ వీడియోలను బయటపెడతాను.. చంపేస్తాను అని బెదిరించాడు. ఇలా నెల రోజుల పాటు ఈ దారుణం కొనసాగింది. ఈ క్రమంలో సదరు బాలిక కొన్ని రోజులుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండటంతో బాలిక తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు చిన్నారిని గర్భవతిగా నిర్ధారించారు. విస్తుపోయిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారించగా సదరు ప్రిన్సిపాల్ హోం వర్క్ చెక్ చేసే నేపంతో బాలికను తన గదికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఇందుకు పాఠశాలలో పనిచేస్తోన్న కర్ల్క్ సాయం చేసేవాడని తేలింది. అంతేకాక ప్రిన్సిపాల్ ఫోన్లో బాలికకు సంబధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో పోలీసులు ప్రధానోపాధ్యాయున్ని, క్లర్క్‌ని అదుపులోకి తీసుకుని, స్కూల్‌ని సీజ్ చేశారు. కేవలం 1 - 5 వరకే ఉన్న ఈ పాఠశాలలో 90 మంది విద్యార్ధులు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
చిన్నారికి అశ్లీల వీడియో చూపి..
పూణే : పాఠశాల విద్యార్థికి అశ్లీల వీడియోను చూపిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసినట్టు పూణే పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలిసినప్పటికీ మౌనంగా ఉండాలని బాధితుడికి సూచించిన స్కూల్ మహిళా కౌన్సెలర్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 14 సంవత్సరాల పాఠశాల విద్యార్థికి ప్రిన్సిపల్ అశ్లీల వీడియోను చూపుతూ లైంగికంగా వేధించాడని, దీనిపై స్కూల్‌కు చెందిన మహిళా కౌన్సెలర్‌కు బాలుడు ఫిర్యాదు చేశాడని అధికారులు తెలిపారు. అయితే ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తన ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె బాధిత బాలుడిని ఈ ఘటనపై ఎక్కడా నోరువిప్పరాదని కోరారని తెలిసిందన్నారు. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు సైతం తమ కుమారుడి చదువు దెబ్బతింటుందనే భయంతో మౌనంగా ఉన్నారని, ఘటనపై తమకు సమచారం అందడంతో తాము కలుగచేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.స్కూల్ ప్రిన్సిపాల్, కౌన్సెలర్లపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
నెల్లూరు గురుకులంలో అమానుషం
నెల్లూరు రూరల్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రిన్సిపాల్ విచక్షణ మరచి విద్యార్థులపై వివిధ రూపాల్లో దాడులకు పాల్పడుతున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు వైఖరి మార్చుకోవాలని సూచించినా పట్టించుకోలేదు. చివరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపాల్ కటకటాల పాలైన ఘటన నెల్లూరులోని ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. సర్వేపల్లికి కేటాయించిన ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో వసతులు లేకపోవడంతో 2016లో నెల్లూరు పొదలకూరు రోడ్డులోని జెడ్పీ హైస్కూల్ భవనంలో ఏర్పాటు చేశారు. ఇందులో 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను బట్టలు విప్పించి కొట్టడం, తలను గొడకేసి బాధడం, కాళ్లతో తన్నడం, కర్రలతో చేతులు, కాళ్లపై కొట్టడం, దుర్భాషలాడుతున్నారని వారు పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్లోకి మద్యం తీసుకొచ్చి తాగడం, విద్యార్థుల చేత సపర్యలు, ఇంటి పనులు చేయించుకోవడం, ఎదురు తిరిగిన వారిపై దాడి చేసి గాయపరిచేవారని ఆరోపించారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు ఏపీ యానాది సమాఖ్య సహకారంతో ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. వేదాయపాళెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సీఐ నరసింహారావు, సిబ్బంది మంగళవారం గురుకులంలో విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ వెంకటరమణను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
తాగుబోతు అధ్యాపకులు మాకొద్దు
శ్రీకాకుళం, సంతబొమ్మాళి: విద్యాబుద్ధులు, విజ్ఞానాన్ని అందించాల్సిన అధ్యాపకులే పూటుగా మద్యం సేవించి కళాశాల పరువు తీయడంపై ఆ గ్రామస్తులు కన్నెర్ర చేశారు. తాగుబోతు అధ్యాపకులను తొలగించాలంటూ నౌపడ గ్రామస్తులు, ప్రజావేదిక సభ్యులు సోమవారం రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకుని అధ్యాపకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ శ్యామ్సుందర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్యామ్‌సుందర్, అధ్యాపకులతో మాజీ సర్పంచ్ పి.రవికుమార్‌రెడ్డి, ప్రజావేదిక సభ్యులు, గ్రామస్తులు సమావేశమయ్యారు. మద్యం సేవించి విద్యార్థులతో డ్యాన్స్‌లు చేయడమే కాకుండా విలేకరి సంతోష్‌పై బండ బూతులు తిట్టడం అధ్యాపకులకు తగునా అని ప్రశ్నించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అధ్యాపకులు వాడిన భాష ఉండడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రేపు మా పిల్లలకు రక్షణ ఏమిటని, ప్రస్తుతం జరిగిన దానిపై ఏమి చర్యలు తీసుకున్నారని ప్రిన్సిపాల్ శ్యామ్‌సుందర్‌ను గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ ఒక్క దానిని క్షమించాలని వీలైతే అధ్యాపకులకు మెమో ఇస్తామని ప్రిన్సిపాల్ శ్యామ్‌సుందర్ అనడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోరమైన తప్పిదం చేసిన అధ్యాపకులు ఎస్.షణ్ముఖరావు, ఎల్.ఎల్.స్వామి, కె.శ్యామలను విధుల నుంచి తొలగించడానికి మీ పై అధికారులకు నివేదికలు పంపాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పేరు ప్రఖ్యాతలు గాంచిన నౌపడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తాగుబోతు అధ్యాపకుల అసభ్యకర ప్రవర్తనతో మాయని మచ్చ ఏర్పడిందన్నారు. ఉద్యోగులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్లిపోతారు, మా కళాశాల పరిస్థితి, మా పిల్లల భవిష్యత్ ఏమిటంటూ గ్రామస్తులు నిలదీశారు. దీనిపై స్పందించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్యామ్‌సుందర్ జిల్లా వృత్తి విద్యాధికారి, ఆర్జేడీకి ఫిర్యాదు చేస్తానని, తాగి అసభ్యకరంగా ప్రవర్తించిన అధ్యాపకులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని, తాత్సారం చేస్తే గ్రామస్తులందరం కళాశాల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రామస్తులంతా కలిసి టెక్కలి సీఐ టి.శ్రీనివాసరావు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో మాట్లాడా రు. కళాశాలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని, క్రమశిక్షణా రాహిత్యంపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. దీంతో శాంతించిన గ్రామస్తులు వెనుదిరి గారు. కార్యక్రమంలో ప్రజావేదిక సభ్యులు, గ్రామస్తులు జె.అప్పలరాజు, ఎం.రాజు, కె.నాగిరెడ్డి, పి.రాజేష్, ఎల్.లింగరాజు, ఎస్.నవీన్‌కుమా ర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిపై ‘నారాయణ’ ప్రిన్సిపాల్ దాష్టీకం
సాక్షి, అమరావతిబ్యూరో : నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఓ ప్రిన్సిపాల్ దాష్టీకానికి విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. అల్లరి చేస్తున్నాడంటూ ప్రిన్సిపాల్ కర్రతో ముఖంపై మోదడంతో విద్యార్థి కింద పడి రెండు పళ్లు విరిగిపోయి తీవ్ర రక్తస్రా వమైంది. ఓ వైపు విద్యార్థి తీవ్ర గాయాలపాలయినా ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంచారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ స్కూల్ రాష్ట్ర మంత్రి నారాయణకు సంబంధించిన విద్యా సంస్థ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులను బెదిరించి మీడియా దృష్టికి రాకుండా తీవ్ర ఒత్తిడి పెంచారు. ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రమేష్ బాబు కుమారుడు రోహిత్‌సాయి నూజివీడు నారాయణ ఈ టెక్నో బ్రాంచ్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం క్లాస్ రూంలో విద్యార్థులు అల్లరి చేస్తున్నారని టీచర్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదుచేశాడు. ఆగ్రహించిన ప్రిన్సిపల్ క్లాస్‌రూంలోకి వెళ్లి కర్రతో రోహిత్ మొహంపై బలంగా మోదడంతో విద్యార్థి కిందపడ్డాడు. ఈఘటనలో విద్యార్థి రోహిత్‌కు రెండు పళ్లు విరిగి రక్రస్రావం అయింది. విద్యార్థికి వైద్యచికిత్స చేయించకపోగా సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంచారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు వెంటనే వైద్య చికిత్స కోసం నూజివీడుకు తరలించారు. తమ బిడ్డపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను తండ్రి నిలదీయడంతో స్కూల్ యాజమాన్యం రంగంలోకి దిగి ఈ విషయాన్ని మీడియాకు చెప్పవద్దంటూ వారిపై బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సృందన ఉండదని బెదిరింపులకు దిగడంతో ఒత్తిళ్లకు తలొగ్గిన తల్లిదండ్రులు మౌనం దాల్చారు. చిన్న దెబ్బే తిగిలింది విద్యార్థికి చిన్న దెబ్బే తగిలింది. ఎలాంటి ప్రమాదం లేదు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడాం. ఏ సమస్యా లేదు. – మహేష్, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ -
రక్షాబంధన్ వేళ.. ఎందుకీ శిక్ష
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా నిర్వహించేది రక్షాబంధన్. అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇచ్చే ఈ పండుగ జరపుకొనేందుకు, తాము ఎక్కడున్నా ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటామని మళ్లీమళ్లీ సోదరిలకు భరోసా కల్పించేందుకు అన్నదమ్ములు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తారు. అయితే ఓ ప్రిన్సిపాల్ వారికి ఆ ఆనందం లేకుండా అడ్డుకున్నారు. కనీసం తమ చెలెళ్లు, అక్కలను చూడడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో పలువురు యువకులు, వారి తల్లిదండ్రులు పండగ వేళ తీవ్ర క్షోభకు గురయ్యారు. విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలో యండపల్లివలస గురుకుల పాఠశాల(ఏపీఆర్) ప్రిన్సిపాల్ నిర్వాకంతో రక్షాబంధన్ పండుగ వేళ గిరిజన విద్యార్థినులు, వారి అన్నదమ్ములు తీవ్ర క్షోభకు గురయ్యారు. మాకెందుకీ శిక్ష అంటూ ఆవేదన చెందారు. చివరకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఆదేశాల మేరకు రాఖీ కట్టేందుకు ప్రిన్సిపాల్ అంగీకరించడంతో కొంతమందికి మాత్రమే ఆ ఆనందం దక్కింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాలలో చదువుతున్న తమ అక్క,చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకునేందుకు చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి,ముంచంగిపుటు,పెదబయలు,హుకుంపేట,జి.మాగుడుల, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాల నుంచి సుమారు 150 మంది గిరిజన యువకులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఉదయం యండపల్లివలస గురుకుల పాఠశాల(ఏపీఆర్)కు వచ్చారు. అక్కడి ప్రిన్సిపాల్ అరుణజ్యోతి విద్యార్థినులను బయటకు పంపేందుకు నిరాకరించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను చూసేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశగా వస్తే ఇలా అడ్డుకోవడమేమిటని గొడవకు దిగారు. అయినా ప్రిన్సిపాల్ ససేమిరా అనడంతో వారు గిరిజన సంక్షేశాఖ డిప్యూటీడైరెక్టర్ విజయ్‌కుమార్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సాయంత్రం నాలుగు గంటలకు కొంత మంది విద్యార్థినుల తల్లిదండ్రులను పాఠశాల లోపలికి వెళ్లేందుకు ప్రిన్సిపాల్ అనుమతించారు. వర్షం పడుతుండడంతో తడుస్తూ ఉండలేక చాలా మంది యువకులు, వారి తల్లిదండ్రులు అప్పటికే నిరాశతో వెళ్లిపోయారు. దీంతో తమ అన్నదమ్ములకు రాఖీ కట్టలేకపోయామని పలువురు విద్యార్థినులు తీవ్ర వేదనకు గురయ్యారు. ప్రిన్సిపాల్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పడిగాపులు కాశాం... దూరం ప్రాంతం నుంచి కుమార్తెను చూసేందుకు, తమ్ముడితో రాఖీ కట్టించేందు ఉదయం 10 గంట లకు పాఠశాలకు వచ్చాం. అయితే ప్రిన్సిపాల్ అనుమతించలేదు. ఎంతో వేడుకున్నాం. మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశాం. అయినా ప్రిన్సిపాల్ కనికరించలేదు. తమ పిల్లలను కలుసుకునే అవకాశం ఇవ్వని ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలి. – కొండబాబు,విద్యార్థిని తండ్రి, జి.మాడుగుల మండలం -
ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే మా అబ్బాయి ప్రాణం తీసింది
తూర్పుగోదావరి,రాయవరం (మండపేట): తమ కుమారుడు ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడని భావిస్తే.. తమకు మృతదేహాన్ని అప్పగించారని విజయనగరం జేఎన్టీయూ విద్యార్థి సాయివికాస్ తల్లి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. రాయవరం మండలం లొల్ల గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. తమ కుమారుడు సాయివికాస్ మృతికి విజయనగరం జేఎన్టీయూ కళాశాల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడి మృతికి దారితీసిన పరిస్థితులను ఆమె విలపిస్తూ తెలిపారు. జూన్ 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడు మృతి చెందినట్టు కళాశాల విద్యార్థి సమాచారం అందించారన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో మిస్టరీగా ఉందన్నారు. ఇందులో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కన్పిస్తోందని ఆమె ఆరోపించారు. జిల్లాలోని ఎటపాక జవహర్ నవోదయ స్కూల్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఫొతేదార్ భాస్కరాచారి, రమాదేవిల కుమారుడు సాయి వికాస్ 2015లో విజయనగరం జేఎన్టీయూ కళాశాలలో బీటెక్(ఐటీ)లో చేరాడు. కళాశాలలోనే ఉంటూ ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులే తీసుకుని వెళ్లారు... జూన్ 29న రాత్రి కళాశాలలోని ఇద్దరు స్నేహితులు రాత్రి 10.30 గంటల సమయంలో బైక్‌పై బయటకు తీసుకుని వెళ్లారని రమాదేవి తెలిపారు. బైక్ ప్రమాదంలో సాయివికాస్ మృతి చెందినట్టుగా కళాశాలలోని సహచర విద్యార్థులు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రిన్సిపాల్ రాములు కనీసం తమకు సమాచారం అందించలేదని ఆమె ఆరోపించారు. కళాశాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. తమ కుమారుడి మృతితో డిప్రెషన్‌కు లోనైన తాము దానుంచి కోలుకున్న అనంతరం కుమారుడి మృతి విషయమై తెలుసుకునేందుకు ఈ నెల 6, 20న రెండు పర్యాయాలు కళాశాలకు వెళ్లగా ప్రిన్సిపాల్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నెల 20న ప్రిన్సిపాల్‌ను కలుసుకునేందుకు వెళ్లగా అందుబాటులో లేరని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించ లేదన్నారు. ఈ ప్రశ్నలకు బదులేది? ప్రమాదానికి గురైన సాయివికాస్ ఆ రోజు రాత్రి 10.30 గంటలకు స్నేహితులు బయటకు తీసుకువెళ్లినట్టు చెబుతుంటే, సెక్యూరిటీ గార్డు బుక్‌లో రాత్రి 9.30 గంటలకు వెళ్లినట్టు రాసి ఉందన్నారు. కళాశాల నుంచి బయటకు వెళ్లినట్టు పేజీ చివర ఇరికించి ఎందుకు రాశారన్న ప్రశ్నకు సమాధానం లేదని వాపోయారు. ఆగస్టు 6న వెళ్లేసరికి రిజిస్టర్లో లేని పేరు 20న ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ‘రాత్రి 12 గంటల సమయంలో ప్రమాదం జరిగితే ఉదయం వరకు తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు కళాశాలకు వెళ్తే ప్రిన్సిపాల్ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారన్నారు? రాత్రి 10.30 గంటలకు విద్యార్థులు బయటకు వెళ్తుంటే సెంట్రీ ఎందుకు అడ్డుకోలేదు? గేట్లు ఎందుకు మూసి ఉంచలేదు? అసలు ప్రిన్సిపాల్, వార్డెన్ల పర్యవేక్షణ ఉంటే వారు రాత్రి సమయంలో ఎలా బయటకు వెళ్తారు? తన గదిలో చదువుకుంటున్న సాయివికాస్‌ను బలవంతంగా ఆ విద్యార్థులు ఎందుకు తీసుకుని వెళ్లినట్టు?’ ఈ ప్రశ్నలకు తమకు ఎక్కడా సమాధానం దొరకడం లేదని ఆమె వాపోయారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్టు రమాదేవి తెలిపారు. -
పాఠశాలలో రూ.74 లక్షలు చేతివాటం
టీ.నగర్: చెన్నై పుళిదివాక్కం పాఠశాలలో రూ.74 లక్షలు మేరకు చేతివాటాన్ని ప్రదర్శించిన మహిళా ప్రిన్సిపాల్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. పుళిదివాక్కంలో తిరుజ్ఞాన సంబంధం (ప్రభుత్వ గుర్తింపు పొందిన) కాన్వెంట్, ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలను నడుపుతున్నారు. ఈ పాఠశాల ప్రిన్సిపాల్‌గా పుళిదివాక్కం నార్త్ రాంనగర్‌కు చెందిన క్రిష్టినా 2017లో విధుల్లో చేరారు. ఆమె పాఠశాలలో చేరినప్పటి నుంచి ఆమె చర్యలు యాజమాన్యానికి సంతృప్తి కలిగించలేదు. ఇలా ఉండగా ప్రైవేటు సంస్థ ద్వారా పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల కోసం ప్రకటనలు విడుదల చేశారు. దీనిని గమనించి పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో క్రిష్టినా వారిని వేరొక పాఠశాలకు పంపడమే కాకుండా కమిషన్లు అందుకున్నట్లు తెలిసింది. విద్యార్థుల అడ్మిషన్లు తగ్గడంతో యాజమాన్యం విచారణ చేపట్టింది. దీనికి కారణం క్రిష్టినాగా తెలిసింది. అంతేకాకుండా పాఠశాల ఖర్చుల కోసం క్రిష్టినాకు లక్షా 90వేల రూపాయలను యాజమాన్యం అందజేసింది. ఈ నగదు గురించి ఆమెను ప్రశ్నించగా అందుకు తగిన సమాధానం చెప్పలేదు. పాఠశాల విద్యార్థుల విద్యా ఫీజుల్లోనూ చేతివాటం ప్రదర్శించినట్టు తెలిసింది. ఈ మేరకు రూ.74 లక్షలు మోసగించినట్లు కనుగొన్నారు. దీని గురించి తిరుజ్ఞాన సంబంధం మడిపాక్కం పోలీసులకు క్రిష్టినా, మరో పాఠశాల యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి క్రిష్టినాను ఆదివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో పాఠశాల నిర్వాహకుడి కోసం గాలిస్తున్నారు. -
విద్యార్థిని చితకబాదిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్
జూపాడుబంగ్లా: స్థానిక మోడల్ స్కూల్ ఓ విద్యార్థి్థని ప్రిన్సిపాల్ చితకబాదారు. విద్యార్థి తండ్రి వివరాల మేరకు..నాగపుల్లయ్య కుమారుడు దేవేంద్ర మోడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం ఎవరో విద్యార్థి తరగతి గదిలోని డెస్కులపై బురదకాళ్లతో తొక్కారు. ఈ విషయం ప్రిన్సిపాల్ హుసేన్‌వలికి తెలియటంతో ఎలాంటి విచారణ చేయకుండా దేవేంద్రను కర్రతో వీపు, చెయ్యి, కాళ్లపై చితకబాదారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి పాఠశాల వద్దకు వెళ్లి కుమారుడిని తీసుకుని గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరైన నోడల్ అధికారి వెంకటరమణయ్య, ఎంపీడీఓ సుబ్బారెడ్డి, తహసీల్దార్ శివరాముడుకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయకపోయినా విద్యార్థుల మాట విని ప్రిన్సిపాల్ తనను చితకబాదాడని విద్యార్థి కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రిన్సిపాల్‌ను పిలిపించి మందలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థి తండ్రి శాంతించాడు. విద్యార్థి అల్లరి చేయటంతో కాస్త మందలించినట్లు ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. -
కాస్తయినా సిగ్గుండాలి!
అనంతపురం ఎడ్యుకేషన్: ‘65 శాతం ఉత్తీర్ణతా?. కాస్తయినా సిగ్గుండాలి. చెప్పుకోవడానికి మీకెలాగుందో తెలీదుగానీ నాకైతే సిగ్గుగా ఉంది’ అంటూ ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి యల్లనూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సైన్స్ సెంటర్లో శుక్రవారం ఆయన మోడల్‌స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా మార్చిలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలపై సమీక్షించారు. 10/10 పాయింట్లు సాధించిన స్కూళ్ల ప్రిన్సిపాళ్లను అభినందించారు. యల్లనూరు మోడల్ స్కూల్ కేవలం 65 శాతం ఉత్తీర్ణత సాధించడాన్ని ఆర్జేడీ తీవ్రంగా పరిగణించారు. ప్రిన్సిపల్ ప్రసాద్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పిల్లలకు పాఠాలు చెబుతున్నారా, లేదా? అని మండిపడ్డారు. 10/10 పాయింట్లు వద్దులే కనీసం గట్టెక్కించలేకపోతే ఎలా?. స్కూల్లో టీచర్లు ఉన్నారా లేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌ను మార్చాలంటూ మోడల్‌స్కూల్ ఏడీ పుష్పరాజును ఆదేశించారు. పాఠశాలకు వెళ్లి టీచర్ల మధ్య సమన్వయం ఉందా.. లేదా? ప్రిన్సిపాల్ పట్టించుకుంటున్నారా.. లేదా? లెసన్ ప్లాన్ చేశారా.. లేదా? విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆదర్శంగా ఉండాల్సిన స్కూళ్లు ఇంత అధ్వానంగా ఉంటే ఎలా? అని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో 98 శాతం పేద విద్యార్థులే చదువుతుంటారని, వారికి కనీస చదువు చెప్పే బాధ్యత మనపై ఉందని అన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఐదేళ్లు చదువు చెబుతూ పదో తరగతి పాస్ చేయించలేకపోతే మనం ఏం సాధించినట్లు అని ప్రశ్నించారు. పిల్లల తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయొద్దని మందలించారు. ప్రారంభం నుంచి ప్రత్యేక ప్రణాళిక రచించుకుని అమలు చేస్తూ పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ జనార్దనాచార్యులు, డెప్యూటీ డీఈఓలు దేవరాజు, మల్లికార్జున, అనంతపురం ఎంఈఓ వెంకటస్వామి పాల్గొన్నారు. -
ఆనంతపురం: హిందూపురంలో కిడ్నాప్ కలకలం
-
ఎందుకిలా..?
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురంలో నూతనంగా ఫార్మసీ కళాశాలకు ప్రిన్సిపాల్‌ను నియమించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరగడంతో వివాదస్పదమవుతోంది. పాలక మండలి అనుమతి లేకుండానే ఏకంగా ప్రిన్సిపాల్‌ను నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిర్ణయాత్మకమైన పదవి కావడంతో నిబంధనలు అనుసరించకుండా భర్తీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. పొంతన లేని పీహెచ్డీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌కు తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ ఉండాలి. కానీ తాజాగా ఎంపిక చేసిన ప్రిన్సిపాల్‌కు బయోటెక్‌లో పీహెచ్డీ చేశారు. సాధారణంగా ఇంజినీరింగ్ , ఫార్మసీ అధ్యాపకులకే ఎంటెక్, ఎంఫార్మసీ కచ్చితంగా ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణులైనవారిని ఎంపిక చేస్తారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియామించే వ్యక్తికి కచ్చితంగా ఎంఫార్మసీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, పీహెచ్డీ ఫార్మసీ సబ్జెక్టు మీదే పూర్తీ చేసి ఉండాలి. కానీ ఎంఫార్మసీ రెండో శ్రేణిలో ఉత్తీర్ణులై, బయోటెక్‌లో పీహెచ్డీ పూర్తీ చేసిన వారిని ప్రిన్సిపాల్‌గా ఎంపిక చేశారు. ఏదైనా కీలక నియాయం చేసేటపుడు తప్పనిసరిగా పాలక మండలి అనుమతితోనే నియామక పత్రాన్ని అందచేయాలి. కనీసం పాలక మండలికి సమాచారం ఇవ్వకుండానే నేరుగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు. గడువు ముగియకుండానే పీహెచ్‌డీలు జేఎన్టీయూ (ఏ)లో నిబంధనలకు విరుద్ధంగా, అర్హత లేని వారిని ప్రిన్సిపాల్‌గా నియమించారు. మరోవైపు పీహెచ్డీ కోర్సు అంశంలోనూ అక్రమాలకు తెరలేపారు. సాధారణంగా ప్రీపీహెచ్‌డీ సెమినార్ మూడేళ్ల కనీస కాలవ్యవధి పూర్తయిన తరువాత నిర్వహించాలి. కానీ గడువుకు ముందే సెమినార్లు నిర్వహించుకోవడానికి అనుమతి మంజూరు చేశారు. కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించి ముగ్గురు పీహెచ్డీ అభ్యర్థులకు మూడేళ్ల కోర్సు కాల వ్యవధి పూర్తీ కాకుండానే అవకాశం కల్పించారు. కోర్సు మార్గదర్శకాలు, నియమ నిబంధనల ప్రకారం కచ్చితంగా నిర్ధేశించిన విధివిధానాలు పాటించాలి. నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపుకు గీటురాయి. ఈ క్రమంలో పీహెచ్డీ కోర్సు అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. గడువు ముగియకుండానే పీహెచ్డీ థీసీస్ సమర్పించడానికి అవకాశం కల్పించడంపై పరిశోధన విద్యార్థులు అందరూ తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు నివ్వెరపోతున్నారు. పరిశీలిస్తాం గడువుకు ముందే ప్రీపీహెచ్‌డీ సెమినార్, సబ్మిషన్కు అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అలా జరిగి ఉంటే వాటిని పరిశీలిస్తాము. గతంలో జరిగిన అంశాలు కాబట్టి సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తాం. –ఏ. ఆనందరావు, నూతన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ -
భోజనం బాగాలేదంటావా.?
డెహ్రాడున్: స్కూల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనం బాగాలేదని ఫిర్యాదు చేసిన విద్యార్థిని ఇనుప రాడ్డుతో కొట్టాడు ఓ ప్రిన్సిపాల్. ఈ ఘటన డెహ్రాడూన్‌లోని ఓల్డ్ దలన్వాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. రాహుల్ కుమార్(11) అనే పిల్లాడు ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో.. రాహుల్ ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ బానో దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందేలా చూడాల్సిన ప్రిన్సిపాలే ఫిర్యాదు చేసిన రాహుల్‌ను ఇనుప రాడ్‌తో కొట్టారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాహుల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రాహుల్ తండ్రి ధర్మేంద్ర పాశ్వాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశామని ఓ విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. -
ప్రేమ పేరుతో ప్రధానోపాధ్యాయుడి మోసం
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ముచ్చింతల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న అక్బర్ స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నా డు. బాధితురాలు మూడు రోజుల కిందట శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
గురుకులంలో దారుణం
సాక్షి, హైదరాబాద్ : గౌలిదొడ్డి గురుకుల పాఠశాల.. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోని గురుకులం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన గురుకుల పాఠశాలల విద్యార్థులను బృందంగా ఏర్పాటు చేసి ఐఐటీ, నీట్, ఎంసెట్‌లకు శిక్షణ ఇస్తుంటారు. పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే ప్రముఖులు, విద్యావేత్తలు, ఉన్నతాధికారులందరూ విజిట్‌లో భాగంగా గురుకులాన్ని సందర్శిస్తుంటారు. అలాంటి గురుకులంలో ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ భర్త లైంగిక వేధింపులకు దిగాడు. గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రిన్సిపాల్æ ప్రమోదని భర్త దామోదర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు వివరించడంతో వారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని షీటీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్లతో పాటు పోక్సో (పిల్లలపై లైంగిక వేధింపుల చట్టం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐఐటీ ఫౌండేషన్ తరగతులంటూ.. దామోదర్ గతంలో నారాయణ విద్యాసంస్థల్లో లెక్చరర్‌గా పని చేశాడు. పాఠశాలలోని క్వార్టర్స్‌లో కొడుకు, భార్యతో ఉంటున్న దామోదర్.. 2012 నుంచి గురుకులంలో స్వచ్ఛందంగా ఐఐటీ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నాడు. తాజా ఘటనతో ప్రిన్సిపాల్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలిసింది. దామోదర్ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోందని గచ్చిబౌలి సీఐ గంగాధర్ తెలిపారు. కాగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలడంతో ప్రిన్సిపాల్ ప్రమోదను సస్పెండ్ చేస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దామోదర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. నిందితుడు తమపై పలురకాలుగా ఒత్తిడి చేయిస్తున్నాడని.. రాజకీయ నాయకులు, కుల సంఘాలతో ఫోన్లు చేయిస్తూ కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నాడని చెప్పారు. -
మాస్టారు కడుపు చల్లగా.
మెదక్‌రూరల్: సేవ చేయాలనే తపన ఉంటే ఎదో ఒక రూపంలో చేయవచ్చని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు నిరూపిస్తున్నాడు. ఆరేళ్లుగా వేసవిలో విద్యార్థులకు సొంత ఖర్చుతో అంబలి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనే మెదక్ మండలం మక్తాభూపతిపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తారక సత్యనారాయణ. 2011 నుంచి.. 2011లో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ మండుటెండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న విద్యార్థులను చూసి చలించారు. ఏదో రకంగా సేవచేయాలని ఆలోచించి 2012–13 నుంచి ప్రతి ఏడాది వేసవిలో ఒంటిపూట బడులు ప్రారంభం అయిన నాటి నుంచి విద్యార్థులకు ఉచితంగా అంబలిని అందిస్తున్నాడు. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 150 మంది విద్యార్థులకు ఉదయం 10 నుండి 11 గంటల సమయంలో అంబలిని ఇస్తున్నారు. రాగులతో తయారుచేసిన అంబలిలో పోషక పదార్థాలు, కాల్షియం ఉంటాయని, అవి ఇస్తే విద్యార్థులు ఆదర్శంగా ఉంటారని హెచ్ఎం సత్యనారాయణ చెబుతున్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకుప్రోత్సాహం.. సేవాకార్యక్రమాలు చేయడంతో పాటు ప్రతిభ గల విద్యార్థులకు సత్యనారాయణ ప్రోత్సాహం అందిస్తున్నాడు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులలో ప్రతీ ఏడు చివరి పరీక్షలలో మొదటి స్థానంలో నిలిచే ఒక్కో విద్యార్థి«కి రూ. 200 చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందిస్తున్నాడు. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలలో మూడు స్థానాల్లో నిలిచిన ముగ్గురు విద్యార్థులకు ఏటా రూ. 500 చొప్పున బహుమతిగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని.. ఎండాకాలంలో రాగులతో తయారు చేసిన అంబలి విద్యార్థులకు ఆరోగ్యకరం. అంబలిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అంబలి సేవించడంతో రక్తం శుద్ధి కావడంతో పాటు ఎముకలు గట్టిపడుతాయి. నేను పనిచేస్తున్న పాఠశాలలో చదవుకునే విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్ధేశ్యంతో నా వంతు సహాకారం అందిస్తున్నాను. విద్యార్థులకు వేసవిలో ఉపశమనం కలిగేలా అండలి అందించడం ఆనందంగా ఉంది. –సత్యనారాయణ, హెచ్ఎం, మక్తాభూపతిపూర్ -
పరీక్షల్లో పాస్ చేయిస్తానంటూ..
చండీగఢ్: హరియాణాలో దారుణం జరిగింది. పాఠాలు బోధించాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదోతరగతి పరీక్షల్లో పాస్ చేయిస్తానని మభ్యపెట్టి 16 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని పసిగట్టిన బాధితురాలి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గోహానా పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ తన స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలికను సమీపంలోని బంధువుల ఇంటికి పిలిపించాడు. పరీక్షలు చాలా కఠినంగా ఉండబోతున్నాయని విద్యార్థిని భయపెట్టి.. పాస్ అయ్యేందుకు తాను సాయం చేస్తానని నమ్మబలికాడు. తాను చెప్పినట్టు వింటే.. వేరొక బాలికతో పరీక్షలు రాయిస్తానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత విద్యార్థిని తండ్రిని పిలిచి రూ.10వేలు ఇస్తే వేరొక అమ్మాయితో పరీక్షలు రాయిస్తానని ప్రిన్సిపాల్ నమ్మబలికారు. పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక తండ్రితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆయన బాధితురాలితో కలిసి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, మరో ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు
పాడేరు: పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సలోమి తీరుపై విద్యార్థినులు నిరసన గళమెత్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులు కళాశాల నుంచి ప్రదర్శనగా ఐటీడీఏకు వెళ్లారు. కార్యాలయం ముందు ప్లకార్డులతో బైటాయించారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినులను నిత్యం మానసికంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల సమయంలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు స్పందించిన గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయకుమార్ ఐటీడీఏకు చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులందరినీ కళాశాలకు తరలించారు. దీని గురించి తెలుసుకున్న రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు స్పందించి, ఈ వ్యవహారంపై ఆరాతీశారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు డీడీ విజయకుమార్ కళాశాల ఆవరణలో విద్యార్థినులు, కళాశాల సిబ్బందితో విడివిడిగా మాట్లాడారు. ప్రిన్సిపాల్ సలోమి ప్రస్తుతం పరీక్షల సమయంలోనూ మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, విద్యార్థినులను కొట్టడం, తిట్టడం, వేధింపులకు గురి చేస్తున్నారని, మానసికంగా హింసిస్తున్నారని విద్యార్థినులు డీడీకి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ సరెండర్.. విద్యార్థినుల ఆందోళనకు సంబంధించి ప్రిన్సిపాల్ సలోమిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆమెను గిరిజనసంక్షేమ గురుకుల సొసైటీకి సరెండర్ చేసినట్టు డీడీ విజయకుమార్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రానికి ఆమె డీవోగా విధులు నిర్వర్తిస్తున్నారని, దీంతో ఇంటర్ బోర్డ్ ఆర్ఐవోకు కూడా ఈమెను సరెండర్ చేసినట్లు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈమె స్థానంలో అరకు గురుకుల కళాశాల జేఎల్ భవానిని ఇన్చార్జిగా నియమించినట్లు తెలిపారు. -
హౌస్‌కీపర్ ఆత్మహత్యాయత్నం
హుజూర్నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో హౌస్ కీపర్‌గా పని చేస్తున్న ఎండీ.ఆయేషా ఆదివారం ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఆయేషా పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. ఇటీవల పాఠశాల ప్రిన్సిపాల్ సలీం అక్తర్ ఆమెపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె స్థానికంగా నివాసం ఉంటున్న అద్దె గదిలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డ్యూటీకి రాకపోవడంతో తోటి సిబ్బం ది ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. వెంటనే ఆ మె గదికి వెళ్లి చూడడంతో అపస్మారక స్థితిలో పడిఉంది. మంచం పక్కనే గల నిద్రమాత్రలను గుర్తిం చిన సిబ్బంది వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రిన్సిపాల్ పాఠశాలలో సిబ్బందిపై ప్రవర్తిస్తున్న తీరు వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె రోధిస్తూ తెలిపింది. ప్రిన్సిపాల్ వివరణ .. ఈ విషయమై ప్రిన్సిపాల్ సలీం అక్తర్ మాట్లాడుతూ విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో ఆయేషాను మందలించామే తప్ప దురుసుగా ప్రవర్తించామని ఆరోపించడం సరికాదన్నారు. ఆయేషా తరుచూ నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు ఉందని అదే క్రమంలో ఏదైనా జరిగి ఉంటుందే తప్ప తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. -
స్వీపర్‌పై చెయ్యి చేసుకున్న ప్రిన్సిపాల్
కర్నూలు : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వీపర్‌పై ప్రిన్సిపాల్ పీవీ హరిబాబు చేయి చేసుకున్నారు. ఈ మేరకు బాధితురాలు టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళాశాలలో 1994 నుంచి స్వీపర్‌గా మాదం శెట్టి చిన్న వెంకమ్మ విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి కళాశాలలో వేసిన లైట్లు ఎందుకు ఆర్పలేదని ప్రిన్సిపాల్ చేయిచేసుకున్నట్లు ఆమె తెలిపారు. కళాశాల నుంచి వెళ్లిపోకపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరించినట్లు ఆమె వాపోయారు. అయితే వెంకమ్మ తమకు మౌఖికంగా ఫిర్యాదు చేశారని, లిఖిత పూర్వకంగా చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ ఓబులేసు తెలిపారు. ఇదిలా ఉండగా కేసు పెట్టకుండా కొందను వ్యక్తులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. -
ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన.. వెకిలిచేష్టలు !
సాక్షి, విడపనకల్లు: మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రంగబాబు తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లులో చోటుచేసుకుంది. ఎనిమిది, తొమ్మిది, ఇంటర్ విద్యార్థినులు ఉంటున్న వసతిగృహానికి ప్రిన్సిపాల్ రాత్రిపూట వచ్చి తాకరాని చోట తాకుతూ, బూతు మాటలు మాట్లాడుతూ వెకిలిచేష్టలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వేధింపులు తాళలేక చదువు ఆపేయాలనుకుంటున్నామని విలపించారు. అమ్మాయిల గదిలోకి ప్రిన్సిపాల్ వెళ్లి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తన ప్రవర్తన గురించి ఎవరికీ చెప్పకూడదని విద్యార్థినులను బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగాలేదని పలువురు ఉపాధ్యాయులు కూడా ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ రంగబాబును ‘సాక్షి’ వివరణ కోరగా కావాలనే కొంతమంది సిబ్బంది తనను టార్గెట్ చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పుకొచ్చాడు. -
హైదరాబాద్ నెహ్రూ స్కూల్లో దారుణం
-
‘‘దేవస్థానానికి అప్రతిష్ట తీసుకురాకండి’’
ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆగ్రహం వేద పాఠశాల నిర్మాణ పనుల జాప్యంపై అసంతృప్తి సహజ ఆసుపత్రి నిర్వహణపైనా అదే రీతిలో స్పందన పారిశుద్ధ్యం బాగోలేదని కాంట్రాక్టర్‌కు రూ.పదివేలు జరిమానా యాగశాల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ అన్నదానం భవనం నిర్మాణస్థలం మార్పుపై పరిశీలన అన్నవరం(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో అధికారుల పనితీరుపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు నత్తనడకన సాగడం, సహజ ఆసుపత్రి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవించడంపై ‘ఇది దేవస్థానానికి అప్రతిష్ట’ అని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆయన అన్నవరం దేవస్థానంలో పర్యటించారు. వివిధ నిర్మాణపథకాల పనితీరును పరిశీలించారు. సత్యగిరిపై రూ.2.82 కోట్ల వ్యయంతో చేపట్టిన స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులు నత్తనడకన సాగుతుండడంపై జేఎస్వీ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానంలో పారిశుద్ధ్యం నిర్వహణ, సహజ ఆసుపత్రి పనితీరుపైనా తీవ్ర అసంతృపి వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అధికారులను నిలదీశారు. డిసెంబర్ నాటికి పూర్తి కావాలి.. సత్యగిరిపై నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులను ఆయన పరిశీలించారు. పనుల జాప్యంపై ఆరాతీశారు. ఈ నిర్మాణాలు చేసే నిపుణులైన పనివారి కొరత ఉండడంతో ఆలస్యమవుతోందని కాంట్రాక్టర్ నాయుడు తెలిపారు. అవసరమైనంత మందిని తీసుకువచ్చి ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పనులు పూర్తయ్యేలోపు వేదపాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటాలని, స్థలం చుట్టూ పాతపద్ధతిలో మెస్తో ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. సహజ ఆసుపత్రి పనితీరుపై అసంతృప్తి.. దేవస్థానం నిర్వహిస్తున్న సహజ ప్రకృతి ఆసుపత్రి పనితీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పది మంది సిబ్బంది, నలుగురు పేషెంట్లు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉండడాన్ని చూసి మండిపడ్డారు. ఇది ఆలయానికి అప్రతిష్ట అని ఈఓను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేవస్థానంలో పారిశుద్ధ్య పనులు చూస్తున్న పద్మావతి సంస్థ అన్నవరం మేనేజర్ కుళాయప్పకు రూ.పదివేలు జురిమానా విధించారు. ఆర్జేసీ అజాద్‌కు ‘సహజ’ బాధ్యతలు.. సహజ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ సంస్థకు అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ అన్నారు. ఇందుకుగాను 20 పాయింట్లు రూపొందించామన్నారు. ఆసుపత్రి ముందు ఔషద మొక్కలను పెంచుతామన్నారు. ఆ పనులను దేవాదాయశాఖ కాకినాడ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్‌కు అప్పగిస్తున్నట్టు తెలిపారు. పనులు పూర్తయ్యాక దీనిపై ఒక బ్రోచర్ ముద్రించి ప్రచారం చేస్తామన్నారు. చెందుర్తిలో సోలార్ పవర్‌ప్రాజెక్ట్ చెందుర్తిలో ఉన్న 135 ఎకరాల దేవస్థానం స్థలంలో 1.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ సూచించారు. ఈ ప్రాజెక్ట్ ను సత్యగిరిపై ఏర్పాటు చేయాలని గతంలోనే దేవస్థానం చైర్మన్, ఈఓ లతో కూడిన పాలకమండలి తీర్మానించింది. అయితే సత్యగిరిపై కాకుండా చెందుర్తి భూమిలో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఎట్టకేలకు యాగశాల నిర్మాణానికి మోక్షం: దేవస్థానంలో యాగశాల ఏర్పాటు పనులు 18 నెలలుగా నిలిచిపోయిన విషయం విదితమే. అయితే గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఈ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తన ఆదేశాలను దేవాదాయశాఖ కమిషనర్‌కు తెలియజేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన ఈఓను ఆదేశించారు. అన్నదానం భవన నిర్మాణస్థలం మార్పుపైనా సానుకూలత.. అన్నదాన భవన నిర్మాణాన్ని పాత టీటీడీ సత్రం భవనస్థలంలో నిర్మించే విషయమై పరిశీలనకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్, ఈఓలతో కలసి ఆయన టీటీడీ సత్రం స్థలాన్ని పరిశీలించారు. సత్యగిరిపై నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదు సత్యగిరిపై 138 గదుల సత్రంతో సహ ఈ విధమైన నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అయితే సౌండ్ అంట్ లైట్ షో, అర్బన్ గ్రీనరీ పనులు కొనసాగుతాయని వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ వెంట దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు, దేవాదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈలు రామకృష్ణ, రాజు, ఏఈలు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయినిని వేధిస్తున్న ప్రిన్సిపాల్
హైదరాబాద్: ఓ పాఠశాలలో ఉపాధ్యాయినిని ప్రిన్సిపాల్ వేధిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. కాప్రాలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయినిని పాఠశాల ప్రిన్సిపాల్ అంజిరెడ్డి వేధింపులకు గురిచేస్తున్నాడు. కొంతకాలంగా సాగుతున్న ఈ అమానుషంపై ఆమె కుషాయిగూడ పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో ఆ ప్రిన్సిపాల్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రిన్సిపల్ సహా 8 మందిపై సస్పెన్షన్ వేటు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా కలెక్టర్ మురళి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థుల హాజరు, కళాశాల పరిసరాలను పరిశీలించారు. తనిఖీ సమయంలో కళాశాలల్లో సిబ్బంది, కనిపించక పోవడంతో ప్రిన్సిపాల్‌తో పాటు 8 మంది సిబ్బందిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. -
స్కూల్లో ప్రిన్సిపాల్, టీచర్ల లైంగికదాడి
జెహనాబాద్: బిహార్‌లో దారుణం జరిగింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే మృగాళ్లా ప్రవర్తించారు. జెహనాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్, ముగ్గురు టీచర్లు కలసి 12 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి చేశారు. కకో ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపాల్ అజు అహ్మద్, టీచర్లు అతుల్ రెహ్మాన్, అబ్దుల్ బరీ, మహ్మద్ షౌకత్.. సోమవారం బాధిత బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో పాఠశాల భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధిత బాలిక చింపిరి జట్టుతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండటాన్ని ఆమె తల్లి, ఓ ఉపాధ్యాయుడు గమనించారు. బాధితురాలి తల్లి ఆరా తీయగా, ఆ అమ్మాయి జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
పన్నెండేళ్ల బాలికపై ఉపాధ్యాయుల అత్యాచారం
-
బాలికపై ఉపాధ్యాయుల అత్యాచారం
జెహానాబాద్: ఓ పన్నెండేళ్ల బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని జెహానాబాద్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పాఠశాల భవనంలో ఒంటరిగా ఉన్న బాలికపై కాకోసెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ అజూ అహ్మద్‌తోపాటు అతుల్ రహ్మాన్, అబ్దుల్ బరీ, ఎం.డి.శాకౌత్‌లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్ అధికారి పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఒంటరిగా ఉన్న బాలికను భవనంపైకి తీసికెళ్లి అక్కడ లైంగికదాడిచేశారని చెప్పారు. అక్కడ అచేతన స్థితిలో పడిఉన్న బాలికను అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధితురాలి తల్లి గమనించింది. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని శ్రీవాస్తవ చెప్పారు. -
చేయని నేరానికి బలి
దొంగతనం అంటగట్టి చితకబాదిన ప్రిన్సిపల్ అవమానభారంతో విద్యార్థిని ఆత్మహత్య సిద్దిపేట అర్బన్: ఓ కాలేజీ ప్రిన్సిపల్ బాధ్యతా రాహిత్యంతో ఓ విద్యార్థినిపై చేయని దొంగతనం మోపటం, తోటి విద్యార్థుల ముందే చితకబాదటంతో ఆ విద్యార్థిని అదే కాలేజీ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సాయి చైతన్య జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది. ఇంత జరిగినా జిల్లా ఇంటర్ విద్యాధికారి ఘటనా స్థలానికి రాకపోవటం గమనార్హం. దొంగతనం చేశావంటూ:సిద్దిపేట మండలం పుల్లూరుకు చెందిన భవాని సిద్దిపేట పట్టణంలోని సాయి చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండోసంవత్సరం చదువుతోంది. ఆమె చెల్లి శివాని కూడా ఇదే కాలేజీలో చదువు తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రతి రోజూ బస్సులో కాలేజీకి వచ్చి చదువుకుంటున్నారు. బుధవారం కళాశాలలో ఓ అమ్మాయి తన రూ.100 నోటు పోయిందని, భవానే తీసి ఉండొచ్చని ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన భవానిని తన చాంబర్‌కు పిలిచి తీవ్రంగా కొట్టారు. తోటి విద్యార్థుల ముందు దొంగగా చిత్రీకరించి రూ.100 ఆమెతో ఇప్పిం చారు. ఆ డబ్బులు తనవే అని, బస్ పాస్ కోసం తెచ్చుకున్నానని భవాని ఎంతగా చెప్పినా ప్రిన్సిపల్ వినలేదు. భవాని ఇంటికి వెళ్లాక జరిగిన విషయం తన తల్లిదండ్రులతో చెప్పి ప్రిన్సిపల్‌ను నిలదీయా లని కోరింది. తండ్రి వెంకటి కూతురికి సర్దిచెప్పి బస్‌పాస్ కోసం మరో రూ.100 ఇచ్చి గురువారం కాలేజీకి పంపించాడు. ప్రిన్సిపల్ మరోసారి తన చాంబర్లోకి పిలిపించుకొని భవానిని మందలించడంతో అదే కాలేజీ భవనం నాలుగో అంతస్థుకు ఎక్కి దూకింది. ఆమెను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. భవాని మృతదేహా న్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రిన్సిపల్ మాత్రం భవాని బిల్డింగ్‌పై నుంచి జారిపడిందని తండ్రికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకు నేటప్పటికే భవాని మరణించడంతో వారి రోదనలు మిన్నంటాయి. బాలికకు ‘లవ్ ఎఫైర్’ అంటగట్టేం దుకు ప్రిన్సిపల్ ఒడిగట్టారు. విద్యార్థులు తిరగబ డటంతో రాజీ ప్రయత్నాలు మొదలెట్టారు. బాలిక ప్రాణానికి యాజమాన్యం రూ.7 ల క్షల నష్టపరిహారమిచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం, ప్రిన్సిపల్ వేధింపులే భవాని మృతికి కారణమంటూ విద్యార్థి సంఘాలు డీఐఈ వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాయి. నందూ సార్ కొట్టడం వల్లే.. ‘‘దొంగతనం నేరం మోపి నందూసార్ (ప్రిన్సిపల్) అక్కను కొట్టిండు. అక్క ఎలాంటి తప్పు చేయలేదు. నందూ సార్ కొట్టడంతోనే కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకింది’’ అని మృతు రాలి సోదరి శివాని కన్నీళ్లు పెట్టుకుంది. -
విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపులు
జువైనల్ కోర్టులో గ్రామ్య సంస్థ ఫిర్యాదు నల్లగొండ క్రైం : విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ.. ఉపాధ్యాయుల బోధన తీరును పర్యవేక్షించాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు అదే హైస్కూల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన చందంపేట మండలంలో చోటుచేసుకుంది. ప్రధానోపాధ్యాయుడిపై బాధిత విద్యార్థినితోపాటు చందంపేట మండలంలోని గ్రామ్య స్వచ్ఛంద సంస్థ నల్లగొండలోని జువైనల్ జస్టిస్ బోర్డు చైర్మన్ నిమ్మయ్యకు ఫిర్యాదు చేసింది. గ్రామ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో విద్యార్థిని స్కూల్‌కు వెళ్లకపోవడంతో తండ్రి శంకర్ బాలికను స్కూల్‌కు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా ప్రధానోపాధ్యాయుడు అసభ్య పదజాలంతో వేధింపులకు గురిచేస్తున్నాడని అందుకే వెళ్లడం లేదని తండ్రికి తెలిపింది. ఈ విషయమై తండ్రి చైల్డ్ లైన్ 1098 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ సంస్థ తండ్రి, బాలికల వివరాలు సేకరించడంతో పాటు వారి దగ్గర నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంది. ఈ విషయమై గత నెల 7న జేసీ, డీఈఓ, చందంపేట ఎంఈఓకు ఫిర్యాదు చేసింది. వారు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకపోవడంతో జువైనల్ జస్టిస్ ఆశ్రయించినట్లు సంస్థ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ హైస్కూల్లో చదివేందుకు బాలిక అంగీకరించకపోవడంతో గ్రామ్య సంస్థ నుంచే బాలికకు విద్యాభ్యాసం చేస్తున్నామని తెలిపారు. గ్రామ్య సంస్థ ఫిర్యాదు మేరకు సంబంధిత హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేశామని స్పందించకపోతే ఎస్పీ ద్వారా నోటీసులు అందజేస్తామని జువైనల్ జస్టిస్ బోర్డు చైర్మన్ నిమ్మయ్య ‘సాక్షి’కి తెలిపారు. -
ఆర్ట్స్ కళాశాల సెమిష్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి) సెమిష్టర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో నవంబర్‌లో నిర్వహించిన ప్రథమ, తృతీయ, 5వ సెమిష్టర్ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. సుబ్బనరసయ్య విడుదల చేశారు. బీఏలో 80 శాతం, బీఎస్సీలో 71 శాతం, బీకాంలో 76 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల పరీక్షల విభాగం నియంత్రణాధికారి డాక్టర్ ఎం. రవికుమార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ డాక్టర్ పి. హరిప్రసాద్, డా. ఎల్ఎండీ భ„Šరత్ తదితరులు పాల్గొన్నారు. -
బోధన వద్దు.. జీతం ముద్దు
► విధులు నిర్వర్తించకుండానే వేతనం ► ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో చోద్యం ► రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేక గాడి తప్పిన నిర్వహణ ►విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు ఆదిలాబాద్ టౌన్ : సమాజంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉన్న గౌరవం మరొకరికి లేదు. విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన కొందరు లెక్చరర్లు ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. వేలాది రూపాయలు వేతంగా పొందుతూ ఆ వృత్తికి న్యాయం చేయకపోతున్నారు. సర్కారు కళాశాలల్లో చేరేది పేద విద్యార్థులు. వారికి నాణ్యమైన విద్యనందించి ఉన్నత స్థితిలో నిలపాల్సిన లెక్చరర్లు కొందరు కళాశాలకు రాకుండా డుమ్మా లెక్చరర్లుగా మారారు. జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతోంది. కళాశాలలో కొన్నేళ్లుగా పాఠాలు చెప్పని లెక్చరర్లు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. సైన్స గ్రూప్ విద్యార్థులకు బోధించే ఓ పార్ట్‌టైం లెక్చరర్ 1995 సంవత్సరం నుంచి కళాశాలలో పని చేస్తున్నాడు. కానీ ఏనాడూ విద్యార్థులకు పాఠాలు చెప్పిన దాఖలాలు లేవు. సదరు అధ్యాపకుడు తనకు నచ్చినప్పుడు వచ్చి హాజరు పట్టికలో దర్జాగా సంతకం చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. సైన్స విద్యార్థులు సైతం లెక్చరర్‌ను గుర్తుపట్టకపోవడం ఆయన పనితీరుకు నిదర్శనం. ఆయనతోపాటు కళాశాలలో పని చేసే మరో ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్లు కూడా సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ప్రైవేటు సంఘాల్లో తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. కానీ వేతనం మాత్రం పొందుతున్నారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్ లెక్చరర్లతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు కళాశాలలోనే ఉండాలి. కానీ మధ్యాహ్నం దాటితే సగం మంది లెక్చరర్లు కళాశాలలో కనిపించరు. లెక్చరర్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు చేసేదేమీ లేక ఇంటిముఖం పడుతున్నారు. గాడితప్పిన నిర్వహణ.. కొన్నేళ్లుగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కొందరు లెక్చరర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కళాశాలకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలూ ఉన్నారుు. జిల్లాలోనే పెద్ద డిగ్రీ కళాశాల. ఇందులో దాదాపు 1500 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 32 మంది రెగ్యులర్ లెక్చరర్లు, ఏడుగురు కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. సైన్స గ్రూప్ తరగతులు ఓ మాదిరిగా జరుగుతుండగా.. ఆర్ట్స గ్రూప్ తరగతులు నామమాత్రంగా సాగుతున్నారుు. కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఆవరణలోని చెట్ల కింద కాలక్షేపం చేస్తున్నారు. కళాశాలలో కొంతమంది లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌కు మధ్య విబేధాలున్నాయని సమాచారం. లెక్చరర్ల బాహాబాహీ..! విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఇద్దరు లెక్చరర్లు కళాశాలలో బాహాబాహీకి దిగినట్లు తెలిసింది. సైన్స విభాగానికి చెందిన ఇద్దరు లెక్చరర్లు మూడు రోజుల క్రితం విద్యార్థుల సమక్షంలోనే గొడవ పడ్డట్లు తెలిసింది. వీరి పంచారుుతీ పోలీసుస్టేషన్ వరకు వెళ్లి ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నట్లు సమాచారం. విధులకు సరిగా హాజరు కానీ లెక్చరర్లలపై, కళాశాలలో నిర్వహణ తీరుపై ఉన్నత విద్యాశాఖ కమిషనర్ రాజీవ్ ఆచార్యకు కళాశాల విద్యార్థులు, కొంతమంది లెక్చరర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ విచారణ చేపట్టాలని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్‌కు ఆదేశాలు జారీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కాకుండా వేరే వారిని విచారణ అధికారిగా నియమించాలని కొందరు లెక్చరర్లు కోరుతున్నారు. విచారణ చేపడుతున్నాం.. కళాశాలకు ఒక పార్ట్ టైం లెక్చరర్ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదు వెళ్లడంతో విచారణ చేపట్టాలని ఆదేశాలు వచ్చారుు. కళాశాలలో విచారణ జరిపి నివేదికను కమిషనర్‌కు సమర్పిస్తాం. కళాశాలలో ఇద్దరు లెక్చరర్ల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. - అశోక్, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా రాధ
హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధకు మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతి లభించిం ది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేష¯ŒS ఉత్తర్వు లు జారీ చేసినట్లు తెలిసింది. రాధ ప్రస్తుతం జీఎంహెచ్ ఎఫ్ఏసీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాకు బదిలీ చేస్తూ పదోన్నతి క ల్పించినట్లు సమాచారం. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ రాధ మాట్లాడుతూ పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేయడం వాస్తవమే అన్నారు. పదోన్నతిని స్వీకరించాలా ఇక్కడే కొనసాగాలా అనే అంశంపై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు ‘12 బి’ గుర్తింపు
బాన్సువాడ టౌన్ : బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు బుధవారం యూజీసీ 12 బి గుర్తింపు లభించిందని ప్రిన్సిపాల్ రామాసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాలకు ఈ గుర్తింపు లభించడంతో కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ద్వారా కళాశాలలో అభివృద్ధి పనుల కోసం యూజీసీ నిధులు కేటాయిస్తారని పేర్కొన్నారు. యూజీసీ గ్రాంట్స్ మంజూరు కావాలంటే 12బి గుర్తింపు అవసరముంటుందని, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. కళాశాల అభివృద్ధికి, వేతనాలకు కేంద్రం నుంచి 80 శాతం నిధులు సమకూరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులను కేటాయిస్తుందన్నారు. కళాశాలలో 29న ఏలాన్–2016 కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రానున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, అధ్యాపకులు రవిరాజ్, ఉపేంద్ర, శంకర్రావు, విఠల్, గోపాల్, అంబర్‌సింగ్, వెంకటరమణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
కింగ్ ఆఫ్ స్టీల్!
మన దిగ్గజాలు కష్టం అనుకుంటే... ఆ కష్టానికి పది కష్టాలు తోడై... విజయం ఎప్పుడూ కనిపించదు. ‘సాధించగలను’ అనే పట్టుదల ఉంటే కష్టం అనేది ఒంటరిదైపోతుంది. పోతూ పోతూ విజయాన్ని మన చేతిలో పెట్టి పోతుంది. ఇది సామాన్యుల విషయంలోనే కాదు అసామాన్యులని లోకం కీర్తించేవారి విషయంలోనూ జరిగింది. ‘ది కింగ్ ఆఫ్ స్టీల్’గా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ మిట్టల్ స్కూల్ చదువంతా హిందీ మీడియంలో సాగింది. కాలేజీ చదువు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో హిందీ మీడియం నుంచి వచ్చిన విద్యార్థి, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడలేని విద్యార్థి ఈ కాలేజీలో చదవడం కష్టం అంటూ మొదట్లో ప్రిన్సిపల్ సీటు నిరాకరించాడు. అయితే ప్రిన్సిపాల్ ఆలోచనా విధానం తప్పని తన ప్రతిభతో నిరూపించాడు మిట్టల్... కలకత్తా సెయింట్ జేవియర్ కాలేజీలో సీటు సంపాదించడమే కాదు చదువులో ఎప్పడికప్పుడు భేష్ అనిపించుకున్నాడు. ఇంగ్లిష్ మీడియంలో చదవడం మొదట కష్టంగానే అనిపించింది. అంతమాత్రాన మిట్టల్ వెనక్కు తగ్గలేదు. కష్టపడి చదివాడు. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. ‘ప్రతి ఒక్కరికీ తనను తాను నిరూపించుకునే సమయం వస్తుంది. ఆ సమయంలో చేస్తున్న పనిపట్ల శ్రద్ధ, అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే... ఎంత పెద్ద సవాలైనా ఎదుర్కోవచ్చు’ అంటారు మిట్టల్. కాలేజీ రోజుల్లో తెలుసుకున్న ఈ విజయసూత్రం ఆ తరువాత వ్యాపారంలో కూడా ఆయన వెంటే నడిచింది. ఒక స్టీల్మిల్ను స్థాపించడానికి లక్ష్మీ మిట్టల్ తండ్రి మోహన్‌లాల్ మిట్టల్ ఇండోనేషియాలో కొంత భూమి తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సాధ్యపడేలా లేదనుకొని భూమిని అమ్మాలనుకున్నారు. సెలవుల్లో భాగంగా ఇండోనేషియా వెళ్లిన లక్ష్మీ మిట్టల్ భూమిని అమ్మడం మీద కంటే సమస్య మూలం మీదే దృష్టి కేంద్రీకరించాడు. ‘ఈ ప్రాజెక్ట్‌లో మనం ముందుకు వెళ్లవచ్చు. వెనక్కి తగ్గాల్సిన పనిలేదు’ అని చెప్పి సమస్య పరిష్కారం అయ్యేలా చేసి ప్రాజెక్ట్‌ను పట్టాలకెక్కించాడు. అక్కడ ‘స్టీల్ మిల్’ను మొదలుపెట్టిన తరువాత మిట్టల్‌కు వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. మెక్సికన్ గవర్నమెంట్ స్టీల్ పరిశ్రమను ప్రైవేటీకరించడానికి నిర్ణయం తీసుకుంది. తమ ప్రైవేటీకరణ ప్రక్రియలో ఆసక్తి చూపే ప్రపంచంలోని వివిధ స్టీల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. జపాన్ పారిశ్రామికవేత్తలతో మాట్లాడినప్పుడు మిట్టల్ కంపెనీ పేరు సూచించడాన్ని బట్టి మిట్టల్ అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న విషయం అర్థమవుతుంది. ట్రినిడాడ్ అండ్ టుబాగోలో ఒక ఉక్కు కంపెనీ నష్టాల బారిన పడింది. దానిని నష్టాల నుంచి బయటపడేయడానికి ఏవో ప్రయత్నాలు జరిగాయిగానీ అవేమీ ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో ఆ కంపెనీని కొనుగోలు చేసి కొద్దికాలంలోనే లాభాల బాటలోకి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మిట్టల్. ఇది మాత్రమే కాదు... ప్రపంచంలో ఏ మూల నష్టాల్లో ఉన్న ఉక్కు కంపెనీ కనిపించినా దాన్ని కొనుగోలు చేసి లాభాలబాటలో పయనింపచేసేవారు. సరికొత్త వ్యూహాలతో నష్టజాతక కంపెనీలను లాభాలబాట పట్టించడంతో ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేవారు. తన తెలివితేటలతో ఎన్నో దేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు మిట్టల్. ‘ఆర్సెలర్’ కొనుగోలుతో మరో సంచలనాత్మక ముందడుగు వేశారు మిట్టల్. ఉక్కు తయారీలో అగ్రగామి అయిన ‘ఆర్సెలర్’ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ‘ఇదొక దుస్సాహసం’ అని అన్నవారు లేకపోలేదు. ఉక్కుతయారీతో పాటు మైనింగ్, షిప్పింగ్, ఆటోమోటివ్, ప్యాకేజింగ్, నిర్మాణ రంగాలలో పని చేస్తుంది ‘అర్సెలర్ మిట్టల్’ సంస్థ. ‘‘చాలా గట్టి పోటీని తట్టుకుంటూ ఇన్ని విజయాలు ఎలా సాధించారు?’’ అనే ప్రశ్నకు- ‘‘పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ సమయంలో ఎదుటివారి గురించి ఆలోచించడం కంటే మన శక్తిసామర్థ్యాల గురించే ఎక్కువగా ఆలోచించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఈ విషయంలో టీమ్‌వర్క్ ముఖ్యం. అప్పుడు ఎంత పెద్ద విజయాన్ని అయినా సాధించవచ్చు’’ అంటారు. దశాబ్దాలుగా ఉక్కుపరిశ్రమలో కొనసాగుతున్న లక్ష్మీ మిట్టల్ వర్తమానానికి అవసరమైన పాఠాలను తన గత అనుభవాల నుంచి నేర్చుకుంటారు. మిట్టల్‌కు విజయం తెలుసు. సంక్షోభం తెలుసు. ఆ సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కోవడం తెలుసు. అందుకే లక్ష్మీ నారాయణ్ మిట్టల్ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. -
లక్ష్యం లేని జీవితం వ్యర్థం
జగిత్యాల అగ్రికల్చర్: విద్యార్థి దశలోనే లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. దాని కోసం ఆహోరాత్రులు కష్టపడితేనే జీవితానికి సార్థకత లభిస్తుందని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల మండలంలోని పొలాస వ్యవసాయ పాలిటెక్నిక్‌లో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల సలహాలు, సూచలను తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్లో ర్యాగింగ్ జరగకుండా ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో కమిటీ ఏర్పాటుచేసినట్లు వివరించారు. సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ర్యాగింగ్ జరిగినట్లు తేలితే సదరు విద్యార్థులను కళాశాల నుంచి బహిష్కరిస్తామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా నేరుగా తనను కలవాలని సూచించారు. తల్లితండ్రులు సైతం పిల్లలను కళాశాలలో చేర్పించి తమ పని అయిపోయిందని భావిస్తుంటారు. కానీ నెలకోసారి వచ్చి ప్రొఫెసర్లు, వార్డెన్లతో సంప్రదింపులు చేయాలని కోరారు. కార్యక్రమంలో స్టూడెంట్ ఆఫైర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్‌బాబు, సీనియర్ ప్రొఫెసర్లు నిర్మల, రాజేశ్వరి, పరిపాలనాధికారి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బదిలీ
కాజీపేట రూరల్ : హన్మకొండ మండలం కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయం(కేవీ) ప్రిన్సిపాల్ హనుముల సిద్ధరాములు మెదక్ జిల్లాలోని ఎద్దు మైలారం కేవీ ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. కాగా, ఆయన ఇక్కడి విధుల నుంచి సోమవారం రిలీవ్ అవుతారు. రాములు గత 5 సంవత్సరాలుగా కేవీ ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన వారందరికీ సిద్ధరాములు ధన్యవాదాలు తెలిపారు. రాములు ఆధ్వర్యంలో కడిపికొండలోని నూతన కేవీ భవన నిర్మాణం జరిగింది. ఏటా 10వతరగతి, 10 ప్లస్ 2లలో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. విద్యాసంస్థ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలను కైవ సం చేసుకున్నారు. -
గురుకులంలో కీచకపర్వం
ఆత్మకూరు రూరల్ : తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(14)తో రెండేళ్లుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. ఈ సంఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు,నానమ్మ, తాతయ్యలు సీపీఎం కార్యాలయంలో బుధవారం విలేకరులతో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. చిట్టమూరు మండలం మల్లాం గ్రామానికి చెందిన జువ్వలపాటి వెంకటకృష్ణయ్య కుమార్తె ఆత్మకూరు గురుకుల పాఠశాలలో నాలుగేళ్ల క్రితం ఆరో తరగతిలో చేరింది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక ఆదివారం రాత్రి తండ్రికి ఫోన్ చేసింది. ప్రిన్సిపాల్ జి.మురళీధర్ రెండేళ్లుగా తనను వేధిస్తున్న విషయం ఏడుస్తూ తెలిపింది. సోమవారం తాను వస్తానని, భయపడవద్దని వెంకటకృష్ణయ్య ధైర్యం చెప్పాడు. ఈ నేపథ్యంలో గురుకులానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులు అర్ధరాత్రి ప్రాంతంలో కారులో మల్లాం గ్రామానికి చేరుకుని మీ కుమార్తె అన్నం తిననని మారాం చేస్తోందని, వచ్చి సముదాయించాలని చెప్పారు. దీంతో వెంకటకృష్ణయ్య తన భార్యతో కలిసి హుటాహుటిన అదే కారులో సోమవారం ఉదయానికి పాఠశాలకు చేరుకున్నారు. వారిని చూడగానే బాలిక కుమార్తె ఏడుస్తూ రెండేళ్లుగా పాఠశాల ప్రిన్సిపాల్ తనను అసభ్యకరంగా వేధిస్తున్నాడని, ఇపుడు మరీ మితిమీరి పోయాడని వివరించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన తల్లిదండ్రులు శాంతమ్మ, పోలేరయ్యలను పాఠశాలకు పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లేందుకు అందరూ ఉద్యుక్తులయ్యామని వెంకటకృష్ణయ్య తెలిపారు. ఇంతలో నలుగురు ఉపాధ్యాయులు వచ్చి జ్వరం కారణంగా సెలవు కావాలంటూ బాలికతో బలవంతంగా చీటీ రాయించుకుని, తమవెంట పంపారని పేర్కొన్నారు. రెండు రోజులు ఆత్మకూరులోనే ఉన్న తాము చివరకు సీపీఎం నాయకుల సహకారంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజకసంఘం అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య విలేకరులతో మాట్లాడుతూ బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలన్నారు. ప్రిన్సిపాల్ మురళీధర్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోని పక్షంలో తీవ్రస్థాయిలో పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై ఆత్మకూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్ వివరణ కోసం ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైవీయూలో గంభీర వాతావరణం
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశం వెలుగు చూడటంతో విశ్వవిద్యాలయంలో గంభీర వాతావరణం నెలకొంది. ఎవరిని పలుకరిస్తే ఏమో అన్న చందంలో విద్యార్థులు, అధ్యాపకులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. వైవీయూలో ర్యాగింగ్ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించారు. యాంటీ ర్యాగింగ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించి ప్రతిరోజు తరగతిలో పాఠం కన్నా ముందుగా 5 నిమిషాల పాటు ర్యాగింగ్ గురించి తెలియజేయాలని సూచించారు. ఈనెల 31వ తేదీలోపు అన్ని విభాగాల్లో ఫ్రెషర్స్‌డే వేడుకలు నిర్వహించాలని, దీనికి ఆయా విభాగాల సమన్వయకర్తలు, విభాగాధిపతులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించాలని, సెక్యూరిటీని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా సాయంత్రం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కాగా మంగళవారం రాత్రి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, చీఫ్ వార్డెన్ ఆచార్య జి. గులాంతారీఖ్, వార్డెన్లు వసతి గృహాలను తనిఖీ చేశారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా ర్యాగింగ్ అంశంపై ఇప్పటికే విచారణ పూర్తయిందని, బుధవారం రెక్టార్ వచ్చిన తర్వాత ఈ నివేదికను యూజీసీ వారికి పంపనున్నట్లు తెలిపారు. -
హెచ్ఎం భర్తకు ప్రభుత్వ ఉద్యోగం
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ పూడూరు: స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం ఉమ్మెంతాల్ లో ప్రభావతి కుటుం బాన్ని ఆయ న పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభావతి భర్త రాజీవ్‌రెడ్డికి నెలరోజుల్లోగా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆమె కూతుళ్లు ఉన్నత చదువులు చదివేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభావతిలాంటి ఉత్తమ టీచర్ల వల్లే విద్యావ్యవస్థ బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్స్‌గ్రేషియాను అందించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. గాయాలపాలైన విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. స్కూళ్లలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించండి: విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల పరిసరాల్లో ప్రమాదకర పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న లెక్కలు తేల్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలను ఆనుకొని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బావులు, విద్యుత్ తీగలు వంటి వాటి వివరాలను సేకరించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల కింద రంగారెడ్డి జిల్లా మేడికొండ ప్రభుత్వ పాఠశాలలో జెండా రాడ్‌కు విద్యుత్ తీగ తగిలి ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో విద్యాశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. -
నలుగురు విద్యార్థులను కాపాడి.. ప్రధానోపాధ్యాయురాలు మృతి
స్వాతంత్య్ర దిన వేడుకల ఏర్పాట్లలో ప్రమాదం * జెండాగా అమర్చే ఇనుప పైపును సిద్ధం చేసిన ప్రధానోపాధ్యాయురాలు * గద్దెపై అమర్చి, తీస్తుండగా విద్యుత్ తీగలకు తగిలిన పైపు * నలుగురు విద్యార్థులకు విద్యుత్ షాక్.. * ప్రాణాలకు తెగించి వారిని తోసేసిన హెచ్ఎం * విద్యుత్ షాక్ తగలడంతో కన్నుమూత పూడూరు: అదో ప్రాథమిక పాఠశాల.. తెల్లవారితే స్వాతంత్య్ర దినోత్సవం.. ముందుగా ఏర్పాట్లు చేసుకునేందుకు ఆదివారమే ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు వచ్చారు.. కొందరు విద్యార్థుల సహాయంతో జెండా గద్దెను శుభ్రం చేశారు. జెండాగా అమర్చే ఇనుపపైపును సిద్ధం చేశారు.. ఓసారి పరిశీలిద్దామని జెండా గద్దెలో పైపును అమర్చారు.. తిరిగి తీస్తుండగా పాఠశాల పైనుంచి వెళుతున్న విద్యుత్ తీగలకు తాకింది.. దీంతో పైపును పట్టుకున్న విద్యార్థులంతా విద్యుత్ షాక్ తగిలి అల్లాడిపోయారు.. అది చూసిన హెచ్ఎం ప్రాణాలకు తెగించి విద్యార్థులను పక్కకు తోసేశారు.. కానీ దురదృష్టవశాత్తు ఆమె విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్‌కు చెందిన ప్రభావతి (40) మేడికొండ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల కోసం ఏర్పాట్లు చేసేందుకు ఆమె ఆదివారం పాఠశాలకు వచ్చారు. విద్యార్థుల సాయంతో జెండా గద్దెను సిద్ధం చేశా రు. దానిపై ఇనుప పైపును అమర్చి జెండా ఎగుర వేసేందుకు రిహార్సల్ నిర్వహించారు. పైపును తొలగిస్తుండగా పాఠశాల పైనుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఆ పైపును పట్టుకున్న మూడో తరగతి విద్యార్థులు కీర్తన (8), గణేశ్ (8), మధుమతి (8), ఒకటో తరగతి విద్యార్థి శివతేజ (6)లు విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే ప్రభావతి విద్యార్థులను పక్కకు తోసేసింది. కానీ ఆమెకు పైపు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. విద్యార్థులకు గాయాలయ్యా యి. స్థానికులు వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రభావతి మార్గమధ్యలోనే మరణించారు. విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. కాగా ప్రభావతికి భర్త రాజీవ్‌రెడ్డి, కుమార్తెలు సుభిక్ష (14), నాగహర్షిత (13) ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, ఎంఈవో కిషన్ తదితరులు ఆస్పత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. కాగా ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభావతి కుటుంబానికి ట్రాన్స్‌కో నుంచి రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి. -
ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మెదక్ ప్రిన్సిపాల్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడి మెదక్: పదిమందికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపాల్ ఓ లెక్చరర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించింది. బాధిత లెక్చరర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... శ్రీనివాస్ అనే వ్యక్తి మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. 2008 నుంచి రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నాడు. కానీ వేతనం మాత్రం మెదక్ జూనియర్ కళాశాలలోనే పొందాల్సి ఉంది. గతనెలకు సంబంధించి రూ.38,268ల వేతనం రావాల్సి ఉండగా ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామి తనకు రూ.4 వేలు లంచం ఇస్తేనే ఫైల్‌పై సంతకం చేస్తానని మొండికేశాడు. చేసేది లేక లెక్చరర్ శ్రీనివాస్ ఈనెల 6న ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణను ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు సోమవారం శ్రీనివాస్ రూ.4 వేలు లంచంగా ఇవ్వగా ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామి తీసుకుని ఫైల్‌పై సంతకం చేశాడు. అప్పటికే మాటువేసిన ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నవీన్‌కుమార్‌లు ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామిని హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలిస్తామన్నారు. లంచం ఇవ్వొద్దు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎవరు లంచం అడిగినా ఇవ్వకూడదని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. సోమవారం మెదక్ పట్టణ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఓ కాంట్రాక్టు లెక్చరర్ వద్ద రూ.4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ... లంచం ఎవరు అడిగినా వెంటనే 9440446149 నంబర్లో తమను సంప్రదించాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో 16మంది అవినీతి అధికారులను అరెస్ట్ చేశామన్నారు. ఈ యేడు జిల్లాలో మూడు కేసులు మాత్రమే నమోదైనట్టు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మెదక్ కోర్టులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించే వ్యక్తి రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సిద్దిపేట మండలం తడ్కపల్లిలో ఓ పంచాయతీ అధికారి లంచం తీసుకుంటూ చిక్కాడు. తాజాగా మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాఘవేంద్రస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలా ఈ యేడు మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. -
మా స్కూల్లో జాతీయ గీతాన్ని పాడనివ్వం!
అలహాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి ఊరు, వాడ, ప్రతి బడిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అదేవిధంగా తమ బడిలోనూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన టీచర్లు, ప్రిన్సిపాల్‌కు యాజమాన్యం నుంచి చుక్కెదురైంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తమ స్కూల్లో జాతీయ గీతాన్ని ఆలపించడానికి అనుమతివ్వబోనంటూ యజమాని తేల్చిచెప్పాడు. దీనికి నిరసనగా ప్రిన్సిపాల్, సహా ఎనిమిది మంది టీచర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ ఘటన గుజరాత్ అహ్మదాబాద్‌లోని సైదాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగింది. పంద్రాగస్టునాడు స్కూలులో జెండా ఎగురవేసిన తర్వాత జాతీయగీతాన్ని ఆలపించాలని, ఆ తర్వాత వందేమాతరం, సరస్వతి వందన ఆలాపన చేయాలని స్కూల్ ప్రిన్సిపాల్ రితూ శుక్లా మేనేజ్మెంట్కు నివేదించారు. అయితే, జాతీయగీతం ఆలపించడం, ఇతర దేశభక్తి గీతాలను పాడటం వల్ల ఓ మతం వారి మనోభావాలు దెబ్బతింటాయని, కాబట్టి దీనిని అంగీకరించబోనని మేనేజర్ చెప్పారు. దీంతో మరో వర్గానికి చెందిన ఎనిమిది టీచర్లు సహా ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు విద్యాశాఖ తెలిపింది. అయితే, తమ స్కూల్ ప్రాంగణంలో జాతీయ గీతాన్ని ఆలపించొద్దన్న నిర్ణయాన్ని పాఠశాల యజమాని జియా వుల్ హక్ సమర్థించుకున్నారు. మతం, దైవం కన్నా దేశమే మిన్న అని జాతీయ గీతం ప్రబోధిస్తుందని, ఇది తమ మతాన్ని ప్రగాఢంగా విశ్వసించేవారికి ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళుతామని ఆయన చెప్పినట్టు సమాచారం. -
విద్యార్థులపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలి
సూర్యాపేట : విద్యార్థులపై దాడి చేసిన హుజూర్‌నగర్‌లోని ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధిక ఫీజుల నియంత్రణ కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్ నిర్వహించారని, ఇందులో భాగంగానే హుజూర్‌నగర్‌లోని ప్రియదర్శిని కళాశాలకు వెళ్లారని, ఇంతలోనే కళాశాలలో ఉన్న ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి వచ్చి విద్యార్థి సంఘం నాయకులపై దుర్భాషలాడి దాడి చేయడం హేయమైన చర్యన్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. -
ప్రిన్సిపల్ మందలించాడని..
స్కూలు ప్రిన్సిపల్ మందలించాడని ఓ విద్యార్థి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పరిధిలో చోటుచేసుకుంది. క్రాంతి పబ్లిక్ స్కూల్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థి అమరేష్ హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేశాడని స్కూల్ ప్రిన్సిపల్ తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుడు కనపడకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ రాక
భువనగిరి అర్బన్ : భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించే హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరి ప్రదీప్‌చంద్ర రానున్నరాని ఎం.వి భూపాల్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మండలంలోని బండసోమారం గ్రామంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హజరౌతునట్లు సర్పంచ్ ఎస్.మాధవీ ఐలయ్య తెలిపారు. -
‘మోడల్’ ఉపాధ్యాయుల డుమ్మా
ప్రిన్సిపాల్‌తో సహా 8 మంది విధులకు గైర్హాజరు ఈనెల 16 నుంచి బడికి రాని పంతుళ్లు ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ ఈవో ఆకస్మిక తనిఖీ గీసుకొండ : మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవితో పాటు, మరో ఏడుగురు ఉపాధ్యాయులు ఈ నెల 16 నుంచి ఎలాంటి అనుమతి లేకుండా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న వైనం బయటపడింది. రాష్రీ్టయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) డిప్యూటీ ఈవో తోట రవీందర్ మంగళవారం ఉదయం 11.30 గంటలకు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో డుమ్మా వ్యవహారం వెలుగుచూపింది. ప్రిన్సిపాల్‌తో పాటు సీహెచ్. స్వప్న, జి.మనోహర్, కె.స్రవంతి, పి. దయాకర్‌రెడ్డి, ఎండీ. షరీఫ్, వై.శ్రీకాంత్ లీవులో ఉన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు డిప్యూటీ ఈవో తన తనిఖీలో గుర్తించారు. పాఠశాలలో మొత్తం 18 మంది టీచర్లు ఉండగా వారిలో 8 మంది మూడు రోజులుగా విధులకు రావడం లేదు. రిజిస్టర్లో లీవు పెట్టినట్లు, హాజరు వేసుకున్నట్లు లేకుండా టీచర్ల పేర్ల ఎదురుగా ఆయా తేదీల్లో ఖాళీగా ఉందని గమనించారు. వీరితో పాటు ఎ.లావణ్యరెడ్డి పేరుతో హాజరు రిజిస్టర్లో రెండు పూటలా సంతకం చేసి ఉంది. ఆమె విధుల్లో లేకపోడంతో గమనించిన ఆయన విస్తుపోయారు. ప్రిన్సిపాల్‌గా విధులకు డుమ్మా కొట్టడమే కాకుండా ఇన్చార్జిగా బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. అలాగే పాఠశాలలోని మ«ధ్యాహ్న భోజనం, అడ్మిషన్ రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించిన డిప్యూటీ ఈవో అవికూడా సరిగా లేవని గుర్తించారు. ‘ఇది పాఠశాలా..గొడ్ల కొట్టమా, అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, టీచర్ల డుమ్మా వ్యవహారంపై ఆర్‌ఎంఎస్‌ఏ జాయింట్ డైరెక్టర్‌తో పాటు జిల్లాలోని విద్యాశాఖ ఉన్నతాధికారులకు క్రమశిక్షణ చర్య నిమిత్తం నివేదిక సమర్పిస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఈవో సుజన్‌తేజ, సీఆర్పీ టి.వెంకటేశ్వర్లు ఉన్నారు. -
పిల్లలపై పెద్దల దాడి!
♦ గురుకుల పాఠశాల వ్యవహారంలో తలదూర్చిన తల్లిదండ్రులు ♦ కేసు నమోదు చేసిన పోలీసులు అర్ధవీడు: స్థానిక గురుకుల పాఠశాలలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు.. జూనియర్లను చితకబాదిన నేపథ్యంలో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం విద్యాలయూనికి చేరుకొని సీనియర్లను కొట్టారు. ప్రిన్సిపాల్ రూతురమాలతో కొందరు మాట్లాడుతుండగా.. ఆవేశంతో ఊగిపోరుున మరికొంతమంది తరగతి గది, స్టాఫ్ రూంలో ఉన్న సీనియర్స్‌ను తీవ్రంగా కొట్టారు. కళాశాల సిబ్బంది.. ప్రిన్సిపాల్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేశారు. సోమవారం రాత్రి జరిగిన సంఘటనలో బాధ్యులైన విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రిన్సిపాల్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. గొడవకు కారణం ఏమిటి? గురుకుల కళాశాలలో ప్రిన్సిపాల్‌కు.. సిబ్బంది మధ్య భేదాభిప్రాయూలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో ఒక వర్గం వారు సీనియర్ విద్యార్థులను మరొక వర్గం వారు జూనియర్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. సీనియర్లు ఒంగోలు, కందుకూరు, టంగుటూరు, తాళ్లూరు కావడంతో స్థానికంగా ఉన్న విద్యార్థులు వారిపై ఆధిపత్యం చెలారుుంచేలా సిబ్బంది ప్రోత్సహించినట్లు సమాచారం. తల్లిదండ్రులు కూడా దాడి చేస్తున్నా 30 మంది వరకు ఉన్న కళాశాల సిబ్బంది వారించకపోవడం విశేషం. కొంతమంది విద్యార్థులు రాత్రి సమయూల్లో కూడా వీధుల వెంట తిరగడం.. సిబ్బంది అరుుతే మద్యం తెప్పించుకోవడం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సొమ్మసిల్లి పడిపోయిన విద్యార్థి తండ్రి విద్యార్థులపై దాడి చేసి తల్లిదండ్రులను ఎస్సై రాములునాయక్ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తుండగా ఓ విద్యార్థి తండ్రి శ్యామ్ సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసులు ప్రథమ చికిత్స చేరుుంచారు. అనంతరం అర్ధవీడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన కథనానికి స్పందించిన ఎస్పీ , జిల్లా న్యాయాధికారి ఆదేశాల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. -
పరారైన ప్రిన్సిపాల్.. 2 రోజులుగా తెరుచుకోని స్కూల్
- ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు దౌల్తాబాద్ (మెదక్) : ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎవరికీ చెప్పా పెట్టకుండా గదులకు తాళాలు వేసుకుని పరారయ్యాడు. విద్యార్థులను తీసుకెళ్లేందుకు నిత్యం వెళ్లే బస్సులు కదల్లేదు. బడికి వెళ్దామని వచ్చిన విద్యార్థులు గేటు తాళం తెరుచుకోకపోవడంతో వెనుతిరిగిపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురౌతున్నారు. దౌల్తాబాద్ మండలంలో ఓ ప్రైవేటు పాఠశాల మూతపడడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని శేరిపల్లిబందారం శివారులోని మొండిచింత ప్రాంతంలో గత ఐదేళ్లుగా టెక్నో గురుకుల్ ఇంగ్లీషు మీడియం ప్రైవేటు పాఠశాల కొనసాగుతుంది. గత రెండేళ్లుగా కేరళకు చెందిన సురేందర్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా కొనసాగుతూ పాఠశాలను నిర్వహిస్తున్నారు. గతేడాది పాఠశాలలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు 348 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా తరగతులు ప్రారంభించారు. ఈ యేడు దాదాపు 250కి పైగా విద్యార్థులున్నారు. యూనిఫామ్‌లు, పుస్తకాలు కూడా విక్రయించారు. కాగా జూన్ మాసాంతం వరకు పాఠశాలను నిర్వహించిన సదరు ప్రిన్సిపల్ జూలై 1న (శుక్రవారం) పాఠశాలకు సెలవు ప్రకటించారు. రంజాన్ మాసం సందర్భంగా సెలవు ఇచ్చారని అందరూ భావించారు. కానీ శనివారం కూడా పాఠశాల తెరుచుకోలేదు. విద్యార్థులను గ్రామాల నుంచే తెచ్చేబస్సులు కూడా కదల్లేదు. స్వతహాగా పాఠశాలకు వచ్చే విద్యార్థులు గేటు తాళాలు తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఆరా తీస్తే.. ఆర్థిక ఇబ్బందులతో పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ పరారయ్యారని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై దౌల్తాబాద్ మండల విద్యాధికారి నర్సమ్మను వివరణ కోరగా.. మొండిచింతలోని టెక్నో గురుకుల్ పాఠశాల రెండు రోజులుగా తెరుచుకోని విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు తమను సంప్రదించారని, విషయాన్ని ఉన్నతాధికారుల సమాచారం అందించినట్లు ఆమె వివరించారు. -
విద్యార్థినిపై ప్రిన్సిపల్ వేధింపులు.. అరెస్ట్!
సారంగపూర్(ఆదిలాబాద్): విద్యాబుద్ధులు నేర్పాంచాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉండి ఓ విద్యార్థినిని వేధించాడో ప్రిన్సిపల్. ఈ ఘటన మంగళవారం సారంగపూర్ మండలం జామ్ రెసిడెన్సియల్లో జరిగింది. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ప్రిన్సిపల్‌పై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్‌పై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రిన్సిపల్‌ను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కొరియర్ లో టీసీలు
♦ ఫీజు చెల్లించలేదని 22 మంది విద్యార్థులకు ఉద్వాసన ♦ అమృతా విద్యాలయం నిర్వాకం హైదరాబాద్ : ఫీజు చెల్లించలేదన్న కారణంగా నగరంలోని ఓ స్కూల్ 22 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చింది. నేరుగా ఇస్తే తీసుకోరన్న ఉద్దేశంతో కొరియర్ ద్వారా నేరుగా విద్యార్థుల ఇళ్లకు పంపడం గమనార్హం. మహేంద్రహిల్స్‌లోని అమృత విద్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న ధర్నాకు అమృత స్కూల్లో గెంటివేతకు గురైన విద్యార్థులను తీసుకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు పాఠశాలలో గత నాలుగేళ్లుగా ఏటా ఫీజులు పెంచుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఫీజులను తగ్గించాలని పట్టుబట్టినా యాజమాన్యం తిరస్కరించిందన్నారు. వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల కాగానే.. ఫీజులు చెల్లించని విద్యార్థులకు కొరియర్లో టీసీలు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీఈఓ, పాఠశాల విద్య కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అవును.. టీసీలు ఇచ్చాం: ప్రిన్సిపాల్ గతేడాది ఫీజులు చెల్లించని 22 మంది విద్యార్దులకు టీసీలను పోస్టు ద్వారా పంపించినట్లు అమృత విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీకుమారి అగీకరించారు. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ముగిసిన తరువాత వారికి ఫలితాలు వెల్లడించి టీసీలు ఇచ్చామన్నారు. నగరంలో అన్ని సీబీఎస్ఈ స్కూళ్లలోకెల్లా తామే తక్కువ ఫీజు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణలు సరికాదని, తమ స్కూల్‌కు సంబంధించిన ప్రతి రికార్డు డీఈఓ కార్యాలయంలో ఉందన్నారు. -
వృద్ధ ప్రిన్సిపాల్‌తో విద్యార్థిని ప్రేమ పెళ్లి
బెంగళూరు : ఓ ఇంటీరియర్ డిజైనింగ్ విద్యార్థిని.. వృద్ధుడైన తన కళాశాల ప్రిన్సిపాల్‌ను వివాహం చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ వివాహానికి విద్యార్థిని తల్లిదండ్రులు అంగీకరించలేదు. కుమార్తెను పెళ్లి చేసుకున్న ప్రిన్సిపాల్‌పై భౌతిక దాడికి యత్నించారు. ఈ సంఘటన బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...బెంగళూరుకు చెందిన హసన్ముఖ హెచ్.ప్రజాపతి కుమార్తె కృపా హెచ్.ప్రజాపతి(27) హెణ్ణూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ సెంటర్(ఎన్ఐసీసీ)లో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్ఐసీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకాష్ కుమార్(64)ను ప్రేమించింది. కృపా తల్లిదండ్రులు ఈ ప్రేమను వ్యతిరేకించారు. అయితే వారు నెల క్రితం నగరంలోని రాజరాజేశ్వరి నగర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రులతో మాట్లాడటం మానేసిన కృపా.. తన భర్త డాక్టర్ ఆకాష్ కుమార్‌తోనే నివసిస్తోంది. తమ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడానికి వారిద్దరూ శుక్రవారం ఉదయం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కృపా తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకొని ఆకాష్ కుమార్‌పై దాడికి యత్నించారు. అమాయకులైన ఆడపిల్లలకు డబ్బు ఆశ చూపించి వారిని లోబరుచుకొని పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు ఇవ్వడం ఆకాష్‌కు అలవాటేనంటూ మండిపడ్డారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ అంశంపై కృపా హెచ్.ప్రజాపతి స్పందిస్తూ.. చిన్ననాటి నుంచి ఇంట్లో తనపై వివక్ష చూపుతూనే ఉన్నారన్నారు. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు వేధింపులకు పాల్పడ్డారని, ప్రేమ విషయం చెప్పినప్పటికీ అంగీకరించలేదన్నారు. అందుకే ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. కృపా ఆరోపణలను ఆమె తల్లిదండ్రులు ఖండించారు. తామేనాడూ పిల్లలపఐ వివక్ష చూపలేదన్నారు. -
బతికుండగానే ప్రిన్సిపాల్‌కు సమాధి కట్టారు
గత మార్చి 31న కేరళలోని పలక్కాడ్‌లో గవర్నమెంట్ విక్టోరియా కాలేజీకి ప్రిన్సిపాల్ డాక్టర్ సరసు (56) వచ్చారు. ప్రిన్సిపాల్‌గా ఆమెకది చివరి రోజు. కాలేజీ ఆవరణంలోకి రాగానే అక్కడి దృశ్యాన్ని చూసి సరసు షాక్ తిన్నారు. కాలేజీ ముందు అంతకుముందే తీసిన ఓ సమాధి కనిపించింది. ఇది ఎవరి సమాధి అని అక్కడున్న ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్ అడిగారు. మీదే అంటూ ఆ విద్యార్థి సమాధానం ఇవ్వడంతో సరసు నిర్ఘాంతపోయారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ విచారించగా.. హాస్టల్ విద్యార్థులు ఆ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సమాధి తీసినట్టు తెలిసింది. సరసు మాట్లాడుతూ.. 'తరగతులను బహిష్కరించేందుకు, నిరసన తెలిపేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు నేను అనుమతి ఇవ్వలేదు. కాలేజీలు ఈవెంట్లు, నిరసనల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను, నిబంధనలను కచ్చితంగా అమలు చేశాను. కాబట్టి వారు నాకు వీడ్కోలు బహుమతిగా ఇది (సమాధి) ఇచ్చారు. ఈ ఘటనలో విద్యార్థులకు మాత్రమే కాదు లెఫ్ట్ పార్టీలతో అనుబంధమున్న కొందరు టీచర్ల ప్రమేయం కూడా ఉంది' అని చెప్పారు. సరసు ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థులపై పరువు నష్టం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 27 ఏళ్ల పాటు లెక్చరర్‌గా పాఠాలు చెప్పిన సరసు 8 నెలల పాటు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఈ కాలేజీలో పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు. -
ఇప్పటికైనా అరెస్టు చేస్తారా లేదా..?
-
బాబూమోహన్ ఆకస్మిక తనిఖీలు
- ప్రిన్సిపాల్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం - సస్పెండ్ చేయాలంటూ అధికారులకు ఆదేశం పుల్కల్ : పిల్లలకు పురుగుల అన్నం పెట్టి చంపుతారా..మీకు జీతాలు ఇవ్వడంలేదా.. మీ పిల్లలను ఇలాగే చూసుకుంటారా.. అంటూ అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ సింగూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు.మిషన్ కలాం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ స్పీకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని హాస్టళ్లలో రాత్రి బస చేశారు. అందులో భాగంగానే అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ సింగూర్ గురుకుల పాఠశాలలో బసచేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ నిర్వహణపై మండిపడ్డారు. అసలు హాస్టల్లో పిల్లలు ఇలాగే ఉంటారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాలల కన్వీనర్ కొండల్‌రావును హాస్టల్ వద్దకు పిలిపించి వాస్తవ పరిస్థితిని వివరించారు. -
ప్రిన్సిపాల్‌ను తొలగించాలంటూ రాస్తారోకో
నేలకొండపల్లి (ఖమ్మం) : విద్యార్థుల బాగోగులను పట్టించుకోని ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రాస్తారోకో జరిగింది. స్థానిక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ప్రమాదవశాత్తు ఒక విద్యార్థిని కరెంట్ షాక్‌కు గురైంది. ఈ ఘటన అనంతరం ప్రిన్సిపాల్ వెంకట లక్ష్మి సరిగ్గా స్పందించలేదని ఆరోపిస్తూ సోమవారం ఉదయం మాలమహానాడు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కొందరు పాఠశాల ఎదురుగా రహదారిపై బైఠాయించారు. దాదాపు రెండు గంటలపాటు ఆందోళన కొనసాగింది. సీఐ కిరణ్‌కుమార్ అక్కడికి చేరుకుని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు. -
మరి ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారు?
-
రిషితేశ్వరి కేసులో షాకింగ్ నిజాలు
-
ప్రిన్సిపల్ పై దాడి,ఫర్నిచర్ ధ్వంసం
-
కాకులతో సహపంక్తి భోజనం..సమస్యలతో సహవాసం
- ఇదీ వెలుగు పాఠశాల - విద్యార్థినుల పరి(దు)స్థితి - అపరిశుభ్రంగా వంటశాల, మరుగుదొడ్లు - రెండు రోజులుగా విద్యార్థినులు అస్వస్థత - గోప్యంగా ఉంచుతున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు లక్కిరెడ్డిపల్లె: స్థానిక వెలుగు పాఠశాలలో విద్యార్థినులు సమస్యలతో సతమతమవుతున్నారు. రెండు రోజుల నుంచి కొందరు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురి కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం ‘సాక్షి’కి తెలియడంతో పరిస్థితిని తెలుసుకునేందుకు గురువారం పాఠశాలకు వెళ్లగా.. అక్కడ అపరిశుభ్ర వాతావర ణం కనిపించింది. తరగతి గదులు, భోజనశా ల, వంటశాల, పాఠశాల ఆవరణం చెత్తా చెదారంతో పేరుకుపోయాయి. విద్యార్థినులు నివసిస్తున్న డార్మెటరీ నుంచి సిక్‌రూం, మరుగుదొడ్లు వరకు భరించలేని కంపు కొడుతున్నాయి. ప్రిన్సిపాల్‌తో కలిసి పాఠశాలను పరిశీలించిన ‘సాక్షి’: ప్రిన్సిపాల్ పరమేశ్వరీతో కలిసి పరిశీలించి అపరిశుభ్రతపై ఆమెను అడగ్గా.. ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది సక్రమంగా అందుబాటులో వుండక పోవడంతో ఐదు, ఆరు రోజులకొక్కసారి శుభ్రం చేస్తుంటారని చెప్పుకొచ్చారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను కలుద్దామని ‘సాక్షి’.. ప్రిన్సిపాల్‌ను అడగ్గా మా పాఠశాలలో అలాంటిది ఏమీ లేదని, మీకు ఎవ్వరో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె పేర్కొంది. అయినా ‘సాక్షి’ సిక్ రూం, హౌస్రూంలకు వెళ్లి చూడగా అప్పటికే అక్కడి నుంచి విద్యార్థులను ఉపాధ్యాయులతో కలిసి బయటకు పంపివేశారు. అయితే ఆరుగురు వాంతులు, విరేచనాలతో, ఇద్దరు కామెర్లతో, మరో ముగ్గురు జ్వరంతో బాధ పడుతున్నట్లు కొందరు విద్యార్థుల ద్వారా తెలిసింది. వీరికి స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. భోజనశాలలో ఈగల మోత: ఇదిలా ఉండగా.. మధ్యాహ్న భోజనం సమయం కావడంతో ఆమెతోపాటు భోజనశాలకు వెళ్లి చూడగా.. అక్కడ పరిస్థితి మరీ దారుణంగా దాపురించింది. ఎక్కడైనా మనుషులతో కలిసి భోజనం చేస్తారు. కానీ అక్కడ మాత్రం విద్యార్థులు కాకులతో కలిసి భోజనం చేయాల్సి రావడం బాధకరం. విపరీతమైన ఈగలు, దోమలు, కాకులు, కొందరు విద్యార్థులు చేసుకున్న వాంతులతో భరించలేని దుర్వాసనలో భోజనం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందనే చెప్పాలి. ఒక్కొక్క ప్లేట్లో ఇద్దరేసి అది కూడా సగం పగిలిపోయిన ప్లేట్లలో విద్యార్థులు భోజనం చేస్తుండగా.. వారిని ప్లేట్లు ఇవ్వలేదా అని అడగ్గా గతంలో వున్న వారికి మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు వచ్చిన వారికి ఇంకా ఇవ్వలేదని తెలిపారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం: రెండు సిన్టెక్స్ ట్యాంకర్లను బయట ఎండలో వుంచారు. అవి మరుగు దొడ్లకు సమీపంలో నేలపై ఉంచడంతో కుళాయిలు మురుగు నీటిలో కలిసిపోయి దర్శనమిస్తున్నాయి. విద్యార్థులు ఆ మురుగు నీటిలోని కుళాయి ద్వారానే తాగునీటిని పట్టుకుని తాగుతున్నారు. పాఠశాల ఆవరణమంతా చెత్తా చెదారంతో నిండిపోయి కనిపిస్తున్నా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సోషల్ వెల్ఫేర్ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వీరు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే మరింత మంది విద్యార్థినులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. -
రాష్ట్రపతి మెడల్ కోసం వెళుతుంటే దొంగతనం
న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి బయలు దేరిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్... రైల్లో చోరీ బారిన పడ్డారు. గ్వాలియర్ నగరానికి చెందిన సురేఖా సక్సేనా.. ఓ కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆమె రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు ఎంపిక కావడంతో ఆ అవార్డు తీసుకునేందుకు తన సోదరుడు సురేందర్ సక్సేనాతో కలసి సమతా ఎక్స్ ప్రెస్ ఏసీ టూ టైర్ రైలులో బయలుదేరారు. రైలు మధుర స్టేషన్లో ఆగగానే చాయ్ అంటూ వచ్చిన ఓ వ్యక్తి వారికి చాయ్ పోసినట్లుగా పోసి సడెన్‌గా ఓ స్ప్రే బాటిల్ తీసి వారిపై ప్రయోగించారు. వారు అతడిని అడ్డుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈలోపే అతడు పారిపోయాడు. అనంతరం చూసుకున్న వారికి ఆమె పర్సు, సోదరుడి గోల్డ్ వాచ్ పోయినట్లు తెలిసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'బాబూరావుపై కేసు పెట్టాలని కమిటీ చెప్పలేదు'
-
దర్జాగా తిరుగుతున్న ప్రిన్సిపాల్బాబురావు
-
ప్రిన్సిపల్ పాత్రపై ఆధారాల్లేవట!
- రిషితేశ్వరి మృతి కేసులో అరెస్టులు లేనట్లే? సాక్షి, గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి రాసిన రెండో డైరీ వెలుగులోకి రావడంతో ఈ కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అరెస్టయిన ముగ్గురు విద్యార్థులతోపాటు మరో ఇద్దరు విద్యార్థుల పేర్లు ఇందులో స్పష్టంగా రాసి ఉన్నాయి. దీంతో వారి పాత్రపై కూడా విచారణ ప్రారంభించాల్సి ఉండగా పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మిగతా ఇద్దరు విద్యార్థులు కేవలం ప్రేమిస్తున్నట్లు మాత్రమే చెప్పారని, ఆమె మృతికి కారణమయ్యేంత వేధింపులకు వారు పాల్పడలేదని భావిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు దాదాపు పూర్తయిందని, మిగతా విద్యార్థులు, ప్రిన్సిపాల్ పాత్రపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదనే అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇకపై ఎలాంటి అరెస్టులు ఉండబోవనే వాదన పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ మేరకు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపిన నాగార్జున వర్సిటీ నిజ నిర్ధారణ కమిటి, ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ.. రిషితేశ్వరిపై ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియర్ విద్యార్థులకు ప్రిన్సిపాల్ బాబూరావు అండ ఉందని తేల్చాయి. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. వర్సిటీని సందర్శించిన వైఎస్సార్సీపీ నిజ నిర్ధారణ కమిటీ ఎదుట అప్పటి ఇన్చార్జి వీసీ సాంబశివరావు, రిజిస్ట్రార్ రాజశేఖర్‌లు ప్రిన్సిపాల్‌పై లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
’ప్రిన్సిపాల్‌కు శిక్ష పడాల్సిందే’