బాబూమోహన్ ఆకస్మిక తనిఖీలు | hostel students in Wormrice ..? | Sakshi
Sakshi News home page

బాబూమోహన్ ఆకస్మిక తనిఖీలు

Published Wed, Dec 16 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

బాబూమోహన్ ఆకస్మిక తనిఖీలు

బాబూమోహన్ ఆకస్మిక తనిఖీలు

- ప్రిన్సిపాల్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
-  సస్పెండ్ చేయాలంటూ అధికారులకు ఆదేశం
పుల్‌కల్ : 
  పిల్లలకు పురుగుల అన్నం పెట్టి చంపుతారా..మీకు జీతాలు ఇవ్వడంలేదా.. మీ పిల్లలను ఇలాగే చూసుకుంటారా.. అంటూ అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ సింగూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు.మిషన్ కలాం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ స్పీకర్‌తో పాటు  పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని హాస్టళ్లలో రాత్రి బస చేశారు. అందులో భాగంగానే అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ సింగూర్ గురుకుల పాఠశాలలో బసచేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ నిర్వహణపై మండిపడ్డారు. అసలు హాస్టల్‌లో పిల్లలు ఇలాగే ఉంటారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాలల కన్వీనర్ కొండల్‌రావును హాస్టల్ వద్దకు పిలిపించి వాస్తవ పరిస్థితిని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement