hostel students
-
హాస్టల్ విద్యార్థులకూ ఫేస్ రికగ్నిషన్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్ఎస్) పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీన్లో భాగంగా తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు రెండు హాస్టళ్లను ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,100 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉంటే వాటిలో 52 హాస్టళ్లలో ఎఫ్ఆర్ఎస్ అమలుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనుంది వాటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను కూడా పూర్తిచేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.ప్రభుత్వం వారం రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని సర్వీస్ ప్రొవైడర్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఎఫ్ఆర్ఎస్ అమలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను ఆయా వసతి గృహాలకు చెందిన హాస్టల్ సంక్షేమ అధికారి (హెచ్‌డబ్ల్యూఓ)కి అప్పగించనున్నారు. ఎంపిక చేసిన ప్రతి హాస్టల్‌కు చెందిన విద్యార్థుల ఫొటోలు తీసి, ఆథార్, ఫోన్ నంబర్, చిరునామా, తరగతి తదితర వివరాలను ఆయా యాప్‌ల్లో అప్లోడ్ చేస్తారు.తద్వారా యాప్ ఉన్న మొబైల్ ఫోన్, పరికరాల్లోనూ విద్యార్థి ముఖం చూపిస్తే హాజరు పడుతుంది. ఇలా ఉదయం ప్రార్థన, సాయంత్రం స్కూల్ సమయం తర్వాత ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు సేకరిస్తారు. తద్వారా ఏఏ వసతి గృహాల్లో ఏ రోజు ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? మిగిలిన వాళ్లు ఎందుకు రాలేదు? తదితర హాజరు సంబంధ సమాచారంతోపాటు, హాస్టల్ సంక్షేమ అధికారుల అలసత్వాన్ని, నిర్వహణ లోపాలపై తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. -
దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థినుల ఆత్మహత్యపై ఆలస్యంగానైనా.. తమ డిమాండ్‌కు స్పందించి దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.... ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను… pic.twitter.com/eGOl6Y7va4 — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024 హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం సాయంత్రం ఆ ఇద్దరు విద్యార్థినిలు వారు ఉండే హాస్టల్ గదిలో ఫ్యాన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
జీతాల కోసం హైడ్రామా..
తెయూ(డిచ్పల్లి): జీతాలు ఇచ్చే వరకు విధులు నిర్వహించేది లేదని పేర్కొంటూ తెలంగాణ వర్సిటీ ఔట్సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన బుధ వారం మూడో రోజూ కొనసాగింది. ఉదయాన్నే పరిపాలనా భవనం వద్ద సిబ్బంది బైఠాయించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరవధిక ధర్నా వల్ల మంగళవారం మధ్యాహ్నం నుంచి క్యాంపస్ హాస్టల్స్ విద్యార్థులకు భోజనం వండకపోవడంతో పస్తులున్నారు. హాస్టల్స్ చీఫ్ వార్డెన్ రాత్రికి బయట నుంచి భోజనాలు తెప్పించారు. తిరిగి బుధవారం ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. ఉదయం హాస్టల్స్‌లో అల్పాహారం చేయలేదు. చీఫ్ వార్డెన్ సెలవులో ఉండడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యార్థులు పీఆర్వో జమీల్‌కు చెప్పడంతో ఆయన వీసీతో మాట్లాడారు. వీసీ ఆదేశాలతో బయట నుంచి అల్పాహారం తెప్పించారు. ఉద యం 11 గంటలకు వీసీ క్యాంపస్‌కు చేరుకున్నారు. అప్పటికే ధర్నా నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వీసీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నా రు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతోనే ఈ దు స్థితి తలెత్తిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. జీతాలు ఇచ్చేవరకు తాము విధులు నిర్వహించేది లేదని సిబ్బంది వీసీకి స్పష్టం చేశారు. దీంతో వీసీ బ్యాంకు మేనేజర్‌ను పిలిపించి మాట్లాడారు. హైకోర్టులో కేసు ఉందని అందుకే జీతాల చెక్కును ఆమోదించలేకపోతున్నట్లు మేనేజర్ వివరించారు. ఈ విషయాన్ని మంగళవారం రాత్రే వీసీ రవీందర్, ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్యకు ఫోన్లో చెప్పానని పేర్కొన్నారు. వీసీతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వాగ్వాదానికి దిగడంతో చివరకు మేనేజర్‌తో మాట్లాడి జీతాలు ఇచ్చేలా చూస్తానని చెప్పి వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్లు బ్యాంకులోకి వెళ్లారు. అదేసమయంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ క్యాంపస్‌కు వచ్చారు. జీతాల చెల్లింపునకు వీసీ నియమించిన ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్య సంతకం ఆమోదించాలంటే ఈసీ నుంచి ఎన్వోసీ తేవాలని, ఈసీ నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి సంతకం ఆమోదించాలంటే వీసీ ఎన్వో సీ ఇవ్వాలని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు కాదంటే హైకోర్టులో కేసు ఉండడంతో జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని మధ్యంతర ఉత్తర్వు లు తేవాలని సూచించారు. దీంతో వీసీ సూచన మేరకు కనకయ్య కొందరు ఈసీ మెంబర్లకు ఫోన్‌చేసి పరిపాలనా భవనానికి రావాలని కోరారు. దీంతో ఈసీ మెంబర్ ఎన్ఎల్శాస్త్రి మాత్ర మే వచ్చారు. బ్యాంకు అధికారుల సూచనలు విన్న ఆయన వీసీ తో మాట్లాడారు. ఫోన్లలో మాట్లాడితే ఈసీ మెంబ ర్లు స్పందించకపోవచ్చని, ఈనెల 17న ఈసీ సమా వేశానికి హాజరైతే సమస్యపై చర్చించవచ్చన్నారు. సమావేశానికి హాజరైతే వీసీ, ఈసీ మధ్య అంతరం తొలిగే అవకాశం ఉంటుందని సూచించారు. ఒక సారి ఈసీ మెంబర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వీసీ పేర్కొన్నారు. అంతకు ముందు వీసీ తన చాంబర్‌కు వెళ్ల డానికి యత్నించగా విద్యార్థులు మెట్లపై ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. చాంబర్ తాళం తీయకపోవడంతో చేసేది లేక వీసీ బయటకు వచ్చారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఆర్డర్ ఇవ్వగా.. సాయంత్రం 6 గంటలకు రావడంతో ఆకలితో ఉన్న విద్యార్థులు అప్పుడు భోజనాలు చేసి హాస్టల్స్‌కు వెళ్లారు. తమకు కనీసం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అయినా జీతాలు ఇప్పించాలని ఉద్యోగులు వీసీని కోరారు. దీంతో వీసీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వారితో ఫోన్లో మాట్లా డి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని సూచించారు. -
AP: మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా విద్యార్థుల డైట్ చార్జీల పెంపు!
అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు మంచి ఆహారం అందించే లక్ష్యంగా డైట్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్పీ, ఎస్టీ హాస్టల్ గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డైట్ చార్జీల పెంపు ఉత్తర్వులను సీఎస్ జవహర్‌రెడ్డి జారీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలు వివరాలు ఇలా ఉన్నాయి.. 3,4 తరగతుల విద్యార్థుల డైట్ చార్జీలు 1150 కి పెంపు 5 నుండి 10 వ తరగతి విద్యార్థుల డైట్ చార్జీలు 1400 కి పెంపు ఇంటర్ ఆపై విద్యార్థులకు డైట్ చార్జీలు 1600 కి పెంపు డైట్ ఛార్జీలతో పాటు విద్యార్థులకు నెల నెలా ఇచ్చే కాస్మొటిక్ ఛార్జీ లు పెంపు -
మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలి
కవాడిగూడ: నాణ్యమైన భోజ నం లేక హాస్టల్ విద్యార్థులు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఐదేళ్ల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగానే మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద ఆదివారం నిర్వహించిన మహాధర్నాలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 లక్షలమంది హాస్టల్ విద్యార్థులకు తక్షణమే మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాలేజీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు రూ.1500 నుంచి 3000 వరకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా దామాషా ప్రకారం మరో 240 గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, రాజ్‌కుమార్, సతీష్, అనంతయ్య, నిఖిల్, భాస్కర్, ప్రజాపతి మల్లేష్, సందీప్, వంశీ, వందలాదిమంది గురుకుల హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో విద్యార్థులను చితక బాదేశాడు
సాక్షి, బెంగళూరు(తుమకూరు): మద్యం మత్తులో పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడు విద్యార్థులను చితకబాదిన ఘటన తుమకూరు తాలూకా మల్లసంద్ర విశ్వభారతి వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడైన భరత్ నాలుగు రోజుల క్రితం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగి వసతి భవనానికి వచ్చాడు. పడుకుని ఉన్న 40 మంది విద్యార్థులను నిద్ర లేపి ఇంత త్వరగా పడుకుంటారా అంటూ కట్టెతో, బెల్టుతో చితకబాదాడు. దీంతో ఓ విద్యార్థి చేయి విరిగింది. ఇద్దరు విద్యార్థుల మర్మాంగాలకు గాయం కాగా, పలువురి వీపులపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి భరత్ కనిపించకుండా పోయాడు. జరిగిన ఘటనను బాధిత విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడంతో వారు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: (అప్పులే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.. వీడిన టెక్కీ రాహుల్ అదృశ్యం మిస్టరీ) -
హాస్టల్లో విద్యార్థుల బీర్ల విందు! వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు వైరల్
దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బీర్లు, చికెన్‌తో విందు చేసుకున్నారు. బీర్లు తాగుతూ దిగిన సెల్ఫీ ఫొటోలు వైరల్ కావడంతో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బుధవారం విచారణకు ఆదేశించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. బీసీ బాలుర వసతి గృహాంలో ఈ నెల 17న ఆదివారం విద్యార్థులకు చికెన్ వండారు. దీంతో కొందరు విద్యార్థులు రాత్రి భోజనాన్ని గదిలోకి తీసుకెళ్లారు. స్థానిక విద్యార్థుల సాయంతో బీరు బాటిళ్లు తెప్పించుకుని గదిలో వాటిని తాగుతూ సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారులకు వాట్సా ప్తోపాటు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించగా.. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ అధికారి భాగ్యవతి హాస్టల్‌ను సందర్శించి వార్డెన్ మల్లేశ్‌తోపాటు సిబ్బందిని విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. (చదవండి: ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..) ఇళ్ల మధ్యలో ఉండటంతోనే..? వసతిగృహానికి పక్కా భవనం లేకపోవడంతో గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని అందులో నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఉండటంతో స్థానికంగా ఉండే తోటి విద్యార్థులు వీరికి బీరుబాటిళ్లు తెచ్చి ఇవ్వడంతోపాటు సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే చర్చ జరుగుతోంది. కాగా, వాచ్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. వార్డెన్ లక్సెట్టిపేట నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువైంది. ఆ రోజు సాయంత్రం వార్డెన్ త్వరగానే వెళ్లిపోయినట్లు తెలిసింది. (చదవండి: పీసీసీలో ‘పీకే’ ఫీవర్! అలా అయితే ఎలా?) -
ఒకే హాస్టల్లో 229 మందికి కరోనా
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉధృతరూపం దాల్చుతోంది. వాషీం జిల్లా రిసోడ్ తాలూకా దేగావ్‌లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 229 మంది విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ శణ్ముగరాజన్ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను సీల్ చేసి, కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా సోకిన విద్యార్థులంతా పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో ఉంటున్నారు. మహారాష్ట్రలో బుధవారం 8,807 మందికి కరోనా సోకగా, 80 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా రోగుల సంఖ్య వెయ్యి దాటింది. రాష్ట్రంలో మంగళవారం కరోనా రోగుల సంఖ్య 6,218 నమోదు కాగా బుధవారం ఏకంగా 8,807 నమోదైంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 2,95,578 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. అలసత్వం వద్దు.. సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కఠినచర్యలను అమలు చేసే విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో బయటపడిన కొత్త రకం వైరస్ కారణంగా పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందన్న నిజాన్ని గుర్తించాలని సూచించింది. కరోనా నివారణలో భాగంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు ముగ్గురు చొప్పున సభ్యులుండే బృందాలను రంగంలోకి దించింది. వీరికి కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న అధికారి నేతృత్వం వహిస్తున్నారు. వివరణ ఇవ్వండి.. రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండడం, ఆర్టీ–పీసీఆర్ టెస్టుల సంఖ్య తగ్గడంపై వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలను ఆదేశిస్తూ కేంద్రం లేఖలు రాసింది. నెగెటివ్‌గా తేలితేనే ఢిల్లీలోకి సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చేవారు ఇకపై కరోనా నెగటివ్ ధ్రువపత్రం చూపించాల్సిందే. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా వచ్చేవారు కరోనా నెగెటివ్‌గా తేలితేనే ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఈ కొత్త నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 15 మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని సమాచారం. ఐదు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఆర్టీ–పీసీఆర్ టెస్టు చేయించుకున్నట్లు, కరోనా నెగెటివ్‌గా తేలినట్లు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది. -
ఫుడ్ పాయిజన్‌తో 67మందికి అస్వస్థత
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లోని గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి ఈ హాస్టల్లో సంబరాలు నిర్వహించారు. కేక్ కూడా కట్ చేశారు. అనంతరం విద్యార్థులు రాత్రి భోజనంతోపాటు పాయసం, పకోడీ తిన్నారు. అయితే, ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు కడుపునొప్పి బాధపడ్డారు. కొందరు వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకొని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. -
వర్ష'మా'.. క్షమించు..!
సాక్షి, ఒంగోలు: మారుతున్న నవీన ప్రపంచంలో రోజురోజుకూ మనావ సంబంధాలు మంటగలుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. స్థానిక భాగ్యనగర్ 4వ లైనులో ఉన్న 11వ అడ్డరోడ్డులో ఏసీబీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఎనభైఏళ్ల వృద్ధురాలిని ఓ ఆటోవాలా రోడ్డుపక్కన నెట్టివేసి అదృశ్యమయ్యారు. ఈ హృదయవిదారక సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సమయంలో జోరున వర్షం కురుస్తుండడంతో వెంటనే ఎవరూ గుర్తించలేకపోయారు. ఔదార్యం చూపి.. ఈ రోడ్డుకు సమీపంలోనే దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీ, సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం ఉంది. ఈ నేపథ్యంలో వర్షం తగ్గిన తరువాత హాస్టల్ వార్డెన్ సి.హెచ్.సరితాదేవి ఈ విషయాన్ని గమనించింది. వెంటనే హాస్టల్ విద్యార్థినులు రత్నదీపిక, భారతితో కలిసి వృద్ధురాలి వద్దకు వచ్చి ఆమె దయనీయ పరిస్థితికి చలించిపోయారు. ఒక నైటీని ఆమెకు వేశారు. అయినా ఆమె చలికి తట్టుకోలేకపోవడంతో ఒక చలికోటును కప్పారు. అప్పటికీ ఆమె గడగడలాడిపోతుండడంతో దుప్పటి తీసుకువచ్చి కప్పారు. 80 ఏళ్ల వయస్సులో ఆమెను ఎలా నిర్దయగా వదిలేశారంటూ ఆవేదన చెంది.. సామాజిక కార్యకర్త, పారాలీగల్ వలంటీర్, హెల్ప్ సంస్థ ప్రతినిధి బి.వి సాగర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. దీంతో అతను వెంటనే అక్కడకు వెళ్లి విచారించాగా.. ఏదో మూట పడేస్తున్నారనుకున్నామని, ముసలామెని గుర్తించలేకపోయామంటూ ఓ పశువుల కాపరి తెలిపాడు. ముందుగా విద్యార్థినుల సాయంతో వృద్ధురాలికి అల్పాహారం తినిపించి అక్కడ నుంచి పలు వృద్ధాశ్రమాల్లో చేర్పించేందుకు యత్నించగా తన పని తాను చేసుకోలేదంటూ ఆమెను చేర్చుకొనేందుకు నిర్వాహకులు వెనుకాడారు. చివరకు కరణం బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న కసుకుర్తి కోటమ్మ మాత్రం ఆమెను అక్కున చేర్చుకునేందుకు ముందుకు వచ్చింది. వృద్ధురాలి వివరాలను రాబట్టేందుకు చేసిన యత్నం ఫలించలేదు. మగ పిల్లలు ఎంతమంది అని ప్రశ్నిస్తే ఇద్దరు అని, ఆడపిల్లలు ఎంతమంది అంటే ఒక్కరు అంటూ వేళ్లు చూపింది. రాత్రికి కోలుకున్నా మాట్లాడలేకపోతోంది. జోరువానలో ఆమెను నిర్దయగా కుటుంబ సభ్యులు ఆటోవాలా సాయంతో గెంటేశారా లేక ఆటో ఎక్కిన ఆమెను ఆటోవాలా దారి మళ్లించి ఆమె వద్ద ఉన్న వస్తువులు కాజేసి నిర్మానుష్యంగా ఉన్న రహదారిలో వదిలేసి పారిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. -
విద్యార్థి ప్రగతికి ‘హాయ్’
సాక్షి, నెహ్రూనగర్(గుంటూరు) : వసతి గృహ విద్యార్థులకు పూర్తి వివరాలతో కూడిన హెల్త్, అకడమిక్ అండ్ ఐటెంటిటీ (హాయ్) కార్డుల అమలుకు బీసీ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ విధానం గతంలో ఉండేది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మరుగున పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెనకబడిన తరగతుల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లాలో ముందుగా బీసీ సంక్షేమ శాఖ అడుగు లేసింది. విద్యార్థి పూర్తి సమాచారం హాయ్కార్డు చూడగానే విద్యార్థి విద్య, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత వివరాలు ఉంటాయి. విద్యార్థి 3వ తరగతిలో హాస్టల్లో చేరగానే ఈ కార్డులో వివరాలు పొందుపరచాలి. మొదటి పేజీలోనే విద్యార్థి వ్యక్తిగత సమాచారం పూరించాలి. పేరు, బాలుడు/బాలిక, స్వస్థలం, చిరునామా, కాంటాక్ట్ నంబర్, కులం, ఆధార్ నంబర్, సంక్షేమ శాఖలో విద్యార్థి యూనిక్ నంబర్, గుర్తింపు చిహ్నాలు ఎంటర్ చేసి తండ్రి/సంరక్షకుడు సంతకం చేయాల్సి ఉంటుంది. మరో వైపు వసతి గృహ సంక్షేమ అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో విద్యార్థి, ఎత్తు, బరువు, రక్తం గ్రూపు, ఇతర వివరాలు నమోదు చేస్తారు. విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వెళ్లే దాకా కార్డులో అన్ని వివరాలు పొందుపరుస్తూ వస్తారు. హాయ్ కార్డులను వార్డెన్లే నిర్వహించాల్సి ఉంటుంది. వారిదే పూర్తి బాధ్యత ఇప్పటికే ముద్రణ జరుగుతుడంటతో...మరి కొద్ది రోజుల్లోనే కార్డులు సరఫరా చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యా సంబంధిత వివరాలు... విద్యార్థి త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక పరీక్షల్లో సాధించే మార్కుల వివరాలను ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు. ఇందుకోసం కార్డులో ప్రత్యేక పట్టిక రూపొందించారు. సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులూ నమోదు చేస్తారు. సాధించిన మార్కులు, గరిష్టం, శాతం నమోదు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య వివరాలు... మరోవైపు ప్రతినెలా హాస్టళ్లలను వైద్యాధికారులు సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన ఉన్నా ఇప్పటికి దాకా అమలైన దాఖాలాలు లేవు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కచ్చితంగా వైద్యాధికారులు ప్రతినెలా వెళ్లాల్సిందే. వారు వెళ్లి విద్యార్థికి పరీక్షలు నిర్వహించి ఏవైనా ఆరోగ్య ఇబ్బందులను గుర్తిస్తే హాయ్కార్డులో పొందుపరచాలి. తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి... ప్రతి నెలా జరిగే తల్లిదండ్రుల సమావేశంలో పిల్లల హాయ్కార్డులను వార్డెన్ తల్లిదండ్రులకు చూపిస్తారు. వీటిని చూసి తమ పిల్లలకు పరీక్షల్లో వస్తున్న మార్కులు, ఏయే సబ్జెక్టులో వెనుక బడ్డారో తెలుసుకుని అవగాహన కల్పించే వీలుంటుంది. ఇది ట్యూటర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ ఇచ్చే వీలుంటుంది. అలాగే ఎవరైనా అధికారులు ఆకస్మిక తనిఖీ చేసిన సంధర్బంలో కార్డులను పరిశీలించి పిల్లల ప్రగతిని అంచనా వేసే వీలుంటుంది. పక్కగా అమలు చేస్తాం హాయ్ కార్డుల విధానాన్ని పక్కగా అమలు చేస్తాం. విద్యార్థుల చదువుతో పాటు, ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇందులో నమోదు చేస్తాం. వీటి నిర్వహణ బాధ్యత హెచ్‌డబ్ల్యూఓలు తీసుకోవాలి. కార్డుల ముద్రణ జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ కార్డులను విద్యార్థులకు సరఫరా చేస్తాం. – డి.కల్పన, బీసీ సంక్షేమ శాఖ అధికారి -
ఇక్కడ అన్నం తింటే ఆస్పత్రి పాలే!
సాక్షి, నూజివీడు : శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులకు అందించే భోజనం నాసిరకంగా ఉండటం, పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వారిలో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. నాసిరకం భోజనం పెడుతుండటంతో విద్యార్థులందరం అనారోగ్యానికి గురవుతున్నామని, భోజనంలో పురుగులు, ఈగలు వస్తున్నా పట్టించుకోవడం లేదంటూ శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం అల్పాహారం కూడా తినకుండా మెస్ వద్దనే 8 గంటల నుంచి ఆందోళన చేశారు. నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అనూష కేటరర్స్ నిర్వహించే డైనింగ్‌హాల్–7లో భోజనం చేస్తున్నారు. అయితే వారం రోజులుగా భోజనంతో పాటు, ఉదయం పూట అల్పాహారం కూడా అధ్వానంగా ఉండటమే కాకుండా ఈగలు, పురుగులు ఉంటున్నాయి. దీనిపై విద్యార్థులు ఆఫీస్ సిబ్బందికి పలుమార్లు తెలిపినప్పటికీ ఎవరి నుంచి స్పందన లేకపోవడమే కాకుండా భోజనం విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో చివరకు చేసేదేమీ లేక విద్యార్థులందరూ కలిసి అల్పాహారం కూడా చేయకుండా ధర్నాకు దిగారు. వందల మంది బాధితులు.. కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రబుల్లో సమస్యలతో ఈనెల 25న 120మంది విద్యార్థులు క్యాంపస్‌లోనే ఉన్న ఆస్పత్రిలో వైద్యచికిత్స చేయించుకున్నారు. వీరిలో 21 మందికి సెలైన్లను కూడా పెట్టారు. అలాగే 26న మరో 108 మందికి వైద్యచికిత్స చేసి 22 మందికి సెలైన్లను పెట్టారు. ఇంత జరుగుతున్నా డైరెక్టర్‌గాని, వైస్‌చాన్సలర్ గాని పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈనెల 18వ నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకు 60 నుంచి 90 మంది వరకు ఆస్పత్రికి వెళ్లి వైద్యచికిత్స పొందుతున్నారు. ఆ సంఖ్య 25, 26 తేదీలలో పెరిగింది. నాసిరకంగా అల్పాహారం.. అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, చపాతి, పులిహోర పెడతారని, ఇడ్లీ ఏమీ బాగోదని, చపాతి పిండి పిండిగా ఉంటుందని, రాత్రిపూట అన్నం మిగిలిపోతే దానిని తరువాత రోజు ఉదయం పులిహోరగా చేసి పెడుతున్నారని ఆరోపించారు. అపరిశుభ్రంగా ఉండడంతో పురుగులు, ఈగలు ఉంటున్నాయని విద్యార్థులు వాపోయారు. మెస్‌లపై ఏమాత్రం పర్యవేక్షణ లేని, మెస్ కమిటీలను నియమించినా కమిటీ సభ్యులు పరిశీలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మంచినీరు కూడా సరిగా లేకపోవడంతో పాటు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవని చెబుతున్నారు. ఆహారాన్ని పరిశీలించిన వీసీ విద్యార్థుల ఆందోళనతో ఆర్జీయూకేటీ వైస్‌ఛాన్సలర్ వేగేశ్న రామచంద్రరాజు మధ్యాహ్నం 12గంటలకు శ్రీకాకుళం ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెస్‌లను, పరిసరాలను, తయారు చేస్తున్న ఆహార పదార్థాలను, భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెస్‌ల నిర్వహణను మెరుగుపరుస్తామని, వీటిని పర్యవేక్షించడానికి కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను కూడా భాగస్వాములం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
పిల్లలూ.. దుస్తులు ఇలా శుభ్రం చేసుకోవాలి
కర్ణాటక, రాయచూరు రూరల్: ఇంటిలో ఉన్న కన్నపిల్లల దుస్తులు శుభ్రం చేయాలంటే తలనొప్పిగా మారుతున్న నేటి రోజుల్లో జెడ్పీ సీఈఓ కవితా మన్నికేరి స్వయంగా రంగంలోకి దిగి పిల్లలకు దుస్తులు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించిన ఘటన యాదగిరి జిల్లా లింగేరి మొరార్జి దేశాయి వసతి పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. ఆమె పాఠశాలను సందర్శించిన సమయంలో చిన్న పిల్లలు బట్టలు శుభ్రం చేసుకోవడానికి పడుతు న్న కష్టాలను చూడలేక ఆమే స్వతహాగా పిల్లలకు దుస్తులను ఎలా పిండుకోవాలో చూపించారు. అనంతరం విద్యార్థులు హాస్టల్లో ఏవిధంగా చదువుకుంటున్నారనే విషయంపై కూడా ఆరా తీశారు. -
చలికి గజగజ...
ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల సంక్షేమం కోసం కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఉంటాయి. వాస్తవానికి ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లిపోతున్నాయో ఆ పై వాడికే ఎరుక. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ హాస్టళ్లలోఉండే విద్యార్థులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. సాక్షి, గుంటూరు: ప్రభుత్వ వసతి గృహాలు ఎక్కడ చూసినా విరిగిన తలుపులు, రెక్కలు లేని కిటికీలు వెక్కిరిస్తుంటాయి. శీతాకాలంలో విద్యార్థులు చలికి గజగజ వణుకుతూ ముడుచుకు పడుకోవాల్సిందే. ఓ పక్క తుపాను వచ్చి ఎన్నడూ లేని విధంగా భయంకరంగా చలిగాలులు వేస్తుంటే ప్రభుత్వం ఇంతవరకు వసతిగృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. కొన్నిచోట్ల సరఫరా చేసినా నాణ్యత లేని వైనం, మరికొన్ని చోట్లా విద్యార్థులందరికీ సరిపడా దుప్పట్లు సరఫరా చేయని పరిస్థితి. జిల్లాలో 76 ఎస్సీ, 88 బీసీ, 33 ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకూ వసతి గృహాలకు సరైన భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా పాలకులు, అ«ధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని వేమూరు, వినుకొండ, గుంటూరు ఈస్ట్, వెస్ట్, తెనాలి, రేపల్లె సహా వివిధ నియోజకవర్గాల్లోని వసతి గృహాలు పశువులు ఉండే బందులదొడ్లను తలపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుమార్లు అధికారులు, అమాత్యుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి మార్పు లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. చలికి వణకాల్సిందే... వాతావరణంలో వస్తున్న మార్పులతో రోజురోజుకు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీనికి తోడు గత రెండు రోజులుగా పెథాయ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి దైన్యంగా మారింది. వసతి గృహాల్లో గదులకు సరిగా తలుపులు, కిటికీలు లేకపోవడంతో చలికి గజగజ వణుకుతూ కిటికీలకు దుస్తులను అడ్డం పెట్టుకుని గడపాల్సివస్తోంది. డిసెంబర్ నెల సగం దాటినా నేటికి జిల్లా వ్యాప్తంగా వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో దుప్పట్లు పంపిణీ కాలేదని తెలుస్తోంది. మరుగుదొడ్లు అంతంత మాత్రమే... జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో 100–150 వరకు విద్యార్థులు ఉన్న వసతి గృహాల్లో ఒకటి రెండు మరుగుదొడ్లు ఉంటే, మరికొన్ని చోట్ల మరుగుదొడ్ల ఉన్నా సరైన నిర్వహణకు నోచుకోని దుస్థితి. దీంతో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బాలికల వసతి గృహాల్లో సైతం ఇదే పరిస్థితులు నెలకొనడంతో ఆరుబయటకు కాలకృత్యాలకు వెళ్లడానికి విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాధారణ రోజుల్లో ఎలాగోలా ఉన్నా వర్షాలు పడిన రోజు మాత్రం మరుగుదొడ్లు లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జిల్లాలోని పలు బాలికల వసతి గృహాల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలావరకు ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వద్ద నైట్ డ్యూటీవాచ్మెన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ తనిఖీలు చేసినా అంతే... జిల్లాలోని వసతి గృహాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినా వసతి గృహాల నిర్వహణలో మాత్రం మార్పు రావడం లేదు. గతంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి గురుకులాల్లో సిబ్బంది కొరత ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెప్పారు. కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపారు. అయినా నేటికీ ప్రభుత్వ హాస్టళ్లలో మాత్రం మార్పు రాకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్ఞానభేరి సభలు అంటూ కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్న ప్రభుత్వ పెద్దలు విద్యార్థులకు సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. జిల్లాలో వసతి గృహాల దుస్థితి, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై పలుమార్లు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతులు ఇచ్చాం అయినా ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికైనా నేతలు, అధికారులు స్పందించి సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస అవసరాలు కల్పించాలి.–భగవాన్‌దాస్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
నిధులు కరువు.. లేదు అరువు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలు సంకటంలో పడ్డాయి. నిధుల లేమితో సతమతమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 776 పాఠశాల వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు లక్ష మంది చిన్నారులు వసతి పొందుతున్నారు. ఈ హాస్టళ్లలో ఉదయం స్నాక్స్, సాయంత్రం భోజనాన్ని అందిస్తారు. మధ్యాహ్న భోజనం మాత్రం పాఠశాలల్లో తీసుకుంటారు. ఈ క్రమంలో ఉదయం స్నాక్స్, సాయంత్రం భోజనంతోపాటు పాలు, చిరుతిళ్లకు సంబంధించిన బిల్లులను సదరు హాస్టల్ వార్డెన్‌కు ప్రతినెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. 82కోట్లు బకాయిలు బీసీ సంక్షేమ హాస్టళ్లలో బకాయిలు భారీగా పేరుకు పోయాయి. 2018–19 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పెద్దగా నిధులివ్వలేదు. ప్రాధాన్యత క్రమంలో కొన్ని హాస్టళ్లకు నిధులిచ్చినప్ప టికీ వాటిని గతేడాది బకాయిల తాలూకు బిల్లులుగా చెల్లించినట్లు వసతిగృహ సంక్షేమాధికారులు చెబుతు న్నారు. ప్రస్తుతం బీసీ హాస్టళ్లకు సంబంధించి రూ.82 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా మెస్ చార్జీలకు సం బంధించినవే ఉన్నాయి. ఇవిగాకుండా వసతిగృహ నిర్వ హణ కేటగిరీలోనూ బకాయిలు భారీగానే ఉన్నాయి. విద్యుత్ బిల్లులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలతోపాటు హాస్టల్ మరమ్మతులు, నిర్వహణకు సంబంధించిన బిల్లులు సైతం ఆర్నెల్లుగా అందలేదు. మెస్ చార్జీలతో పాటు ఇతర బిల్లులేవీ రాకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులకు ఇబ్బం దులు తీవ్రమయ్యాయి. వరుసగా 5నెలల బిల్లులు రాకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ భారమవుతోంది. విద్యార్థులకు క్రమం తప్పకుండా స్నాక్స్, భోజనం ఇచ్చేందుకు కిరాణా షాపుల్లో అరువు పద్ధతిలో సరుకులు తీసుకొసు ్తన్నారు. 5 నెలలుగా సరుకులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా దుకాణదారులు సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు కూరగాయల కొనుగోలుపైనా ఇదే ప్రభావం పడింది. కూరగాయల వ్యాపారులు సైతం సరుకులు ఇవ్వక పోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తోందని రం గారెడ్డి జిల్లాకు చెందిన ఓ వసతి గృహ సంక్షేమాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు గత పది నెలలుగా కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. కేసీఆర్ కిట్ల పేరుతో ప్రత్యేకంగా కాస్మెటిక్ కిట్లు ఇస్తామని అధి కారులు ప్రకటిం చినప్పటికీ, అవి కేవలం గురుకులాలకు మాత్రమే పరిమితమయ్యాయని, హాస్టల్ విద్యార్థులకు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వసతిగృహ నిర్వహణ నిధులు ఇవ్వాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఇటీవల ప్రభుత్వ కార్యదర్శులను కలిసి వినతులు సమర్పిం చినప్పటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు. -
కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజి వద్ద ఉద్రిక్తత
-
ముగ్గురు హాస్టల్ విద్యార్థుల ఆచూకీ లభ్యం
చోడవరం: మూడు రోజు ల కిందట గోవాడ హాస్టల్ నుంచి అదృశ్యమైన ము గ్గురు విద్యార్థులు తిరుప తి రైల్వేస్టేషన్లో దొరికిన ట్టు గురువారం సమాచా రం రావడంతో వారి తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చోడవరం మండలం గోవాడ బాలుర బీసీ హాస్టల్లో చీడికాడ మండలం కోనాం పరిసర గ్రా మాలకు చెందిన నంబారు గోవింద, గంటా కొండలరావు, విస్సారపు గణేష్ చదువుతున్నారు. వీరు ముగ్గురు ఈనెల 10న హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారు. దీనిపై బాధిత విద్యార్ధుల తల్లిదండ్రులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అదృశ్యమైన విద్యార్థుల ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృత ప్ర చారం కూడా చేశారు. వీరి కోసం బంధువులు, పోలీసులు గాలిస్తుండగా చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి ఒక యువకుడు ఫోన్ చేయడంతో వారి కో సం తమ బంధువులను పంపినట్టు, పిల్లలు క్షేమంగా దొరికినట్టు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. విద్యార్థులు దొరికిన విషయాన్ని ఆ యువకుడు తనతో ఉన్న ఆ ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను వాట్సాప్ లో పెట్టడంతో తల్లిదండ్రులు, హాస్టల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆపదలో బాల్యంపై విజి‘లెన్స్’!
శ్రీకాకుళం, కవిటి: విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం తీరు అందుకు భిన్నంగా ఉంది. సర్కార్ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆ ప్రక్రియ జరగడం లేదు. దీంతో చాలామంది పిల్లలు రోగాలబారిన పడుతున్నారు. ఈ పరిస్థితులను వివరిస్తూ ఈ నెల 7వ తేదీన ఆపదలో బాల్యం శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై తనిఖీలు చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగాన్ని ఆదేశించారు. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన ఎస్పీ టి.హరికృష్ణ ఆదేశాలతో ఐదు బృందాలు కవిటి మండలం మాణిక్యపురం, కుసుంపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సోంపేట మండలం మామిడిపల్లి కేజీబీవీ, కంచిలి మండలం జాడుపుడిలోని కేజీబీవీ పాఠశాలల్లో సోమవారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పాఠశాలల్లో రాష్ట్రీయ బాలస్వాస్ధ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) (గతంలో దీనినే జవహర్‌బాల ఆరోగ్యరక్ష కార్యక్రమంగా పిలిచేవారు) అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఇంతవరకు వైద్యులు ఎన్నిసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు, అందుకు సంబంధించిన రికార్డుల నిర్వహణ ఎలా ఉంది అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే పథకం నిర్వహణలో పలు లోపాలు వెలుగు చూసినట్టు తెలిసింది. 8 మంది విద్యార్థులు వివిధ వ్యాధులతో బాధపడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో వెలుగుచూసింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో మెనూ అమలు తీరుపై తనిఖీ బృందాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నాయి. ‘సాక్షి’ కథనంలో ప్రస్తావించిన మృతి చెందిన విద్యార్థుల గురించి వారి కుటుంబసభ్యులు, పాఠశాలల సిబ్బందితో విచారణ సిబ్బంది మాట్లాడారు. విద్యార్థుల మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో కూడిన పోషకాహారం అందిస్తున్నారా? ఆహారం వండేటప్పుడు పరిశుభ్రతకు ఏమేరకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మరుగుదొడ్ల నిర్వహణ ఉందా లేదా చూశారు. వాస్తవ గణాంకా లతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. దీన్ని విజిలెన్స్ ఎస్పీ టి.హరికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్టు అధికారులు తెలి పారు. విచారణలో విజిలెన్స్ ఎస్పీ హరికృష్ణ డీఎస్పీ ప్రసాదరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సీహెచ్ సూర్యత్రినాథరావు, డీసీటీవో తారకరామారావు, ఆర్. విద్యాసాగర్, టి.సామ్యూల్‌రాజు, కె కృష్ణారావు, రవికాంత్ ఉన్నారు. -
హాస్టల్ ట్యూటర్లకు జీతాలేవి?
కందుకూరు రూరల్: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని వసతులతోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు నీటి మూటలుగా మారుతున్నాయి. నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవడంలో అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే.. ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. పదో తరగతి విద్యార్థులకు ట్యూటర్లను నియమించి ఉదయం, సాయంత్రం వేళ తరగతులు నిర్వహిస్తున్నామని గొప్పగా చెబుతున్న పాలకులు.. ఆ ట్యూటర్లకు సక్రమంగా వేతనం ఇవ్వాలన్న విషయాన్ని గాలికొదిలేశారు. సాంఘిక సంక్షేమశాఖ బాలుర, బాలికల వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, గణితం, సైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ప్రత్యేకంగా ట్యూటర్లను నియమించారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 67 వసతి గృహాల్లో ఉండగా.. వీరి కోసం 268 మంది ట్యూటర్లు పని చేస్తున్నారు. వీరు ఉదయం, సాయంత్రం వేళల్లో వసతి గృహాలకు వెళ్లి విద్యాబోధన చేస్తుంటారు. దీంతోపాటు స్టడీ అవర్లు కూడా నిర్వహిస్తారు. ఇందుకుగాను వీరికి నెలకు రూ.1,500 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. గత 24 నెలలుగా 268 మందికి జీతాలు మంజూరు చేయలేదు. సుమారు రూ.96.48 లక్షల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉండగా సాంఘిక సంక్షేమశాఖాధికారులు కేవలం రూ.22 లక్షలేనని చెబుతుండటం గమనార్హం. నెలల తరబడి ట్యూటర్లు వేతనం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అదిగో.. ఇదిగో.. అంటూ ఆశ చూపుతూ కాలం గడిపేస్తున్నారు. ♦ రెండేళ్లుగా వేతనం రాకపోవడంతో జిల్లాలో కొందరు ట్యూటర్లు మానేస్తున్నారు. కందుకూరు ఎస్సీ బాలుర వసతి గృహం–2లో ట్యూటర్లకు జీతం ఇవ్వకపోవడం వల్ల మానేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. మరికొన్ని హాస్టళ్లలో ట్యూటర్లు కూడా వసతి గృహాలకు వెళ్లడం మానేస్తుండగా.. ఇంకొందరు మాత్రం జీతం రాలేదన్న ఆవేదనతో తరగతులు చెప్పడం లేదు. పదో తరగతి పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ట్యూటర్లు సక్రమంగా వసతి గృహాలకు రాక.. స్టడీ అవర్లు నిర్వహించకపోవడంతో విద్యార్థులు, వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గితే చర్యలు తప్పవని వార్డెన్లను హెచ్చరిస్తుండటంతో వార్డెన్లకు భయం పట్టుకుంది. ట్యూట ర్లకు నచ్చజెప్పి పిలిచినా.. జీతం లేకుండా ఏం పని చేస్తామని ప్రశ్నిస్తున్నారని వార్డెన్లు చెబుతున్నారు. ♦ ‘‘అసలే నిరుద్యోగులం.. చాలీచాలని వేతనం అయినా ఉదయం, సాయంత్రం వచ్చి విద్యాబోధన చేస్తున్నాం. అయినా సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వకపోతే ఎలా పని చేయాలి. ఇల్లు గడవాలి కదా’’ అని ట్యూటర్లు ప్రశ్నిస్తున్నారు. వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ట్యూటర్లకు సకాలంలో జీతం ఇచ్చి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 24 నెలలుగా జీతం ఇవ్వలేదు కందుకూరు బాలికల వసతి గృహం–1లో హిందీ ట్యూటర్‌గా పని చేస్తున్నా. 24 నెలలుగా జీతం అందలేదు. నాలుగు చోట్ల ట్యూషన్లు చెప్పుకుని జీవనం సాగిస్తున్నాం. రెండు సంవత్సరాలుగా జీతం రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. త్వరగా వేతన బకాయిలు అందించాలని కోరుతున్నాం. – ఎస్డీ రఫీ, హిందీ ట్యూటర్ పేద విద్యార్థులపై ప్రభుత్వ చిన్నచూపు వసతి గృహాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థుల విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పదో తరగతి ట్యూటర్లకు 24 నెలలుగా వేతన బకాయిలు విడుదల చేయకపోవడం దారుణం. దీని కారణంగా కొన్ని వసతి గృహాల్లో ట్యూటర్లు మానేశారు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ట్యూటర్లు లేకపోతే విద్యార్థుల చదువు దెబ్బతింటుంది. ప్రభుత్వం స్పందించి జీతం వెంటనే విడుదల చేయాలి. – ఎస్.ఓబుల్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి -
హాస్టల్ విద్యార్థులకూ కేసీఆర్ కిట్లు
ఇల్లెందు: ఇప్పటి వరకు బాలింతలు, పసి పిల్లలకే కేసీఆర్ కిట్లు అందజేశారు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా, గురుకుల విద్యాలయాల విద్యార్థులకు కూడా కిట్లు అందజేస్తున్నారు. అయితే ఈ రెండు కిట్లకు ఏమాత్రం పొంతన లేదు. విద్యార్థులకు కాస్మొటిక్స్‌ను కేసీఆర్ కిట్ రూపంలో అందజేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒక కిట్ చొప్పున అందజేస్తారు. బాలికలకు అందజేసే కిట్లలో సబ్బులు, షాంపూలు, పౌడర్, క్రీమ్, కొబ్బరినూనె, రబ్బర్ బ్యాండ్లు, మస్కిటో కాయిల్స్, టూత్‌పేస్టు, బొట్టుబిల్లలు, లిక్విడ్, దువ్వెన ఉంటాయి. బాలురకు ఇచ్చే కిట్లలో సబ్బులు, దువ్వెన, కొబ్బరి నూనె ఉన్నాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 20, 600 మంది విద్యార్థులుండగా ఇందులో 12, 200 మంది బాలికలు, 8, 400 మంది బాలురు ఉన్నారు. చెన్నెంగులగడ్డ, రొంపేడులో పంపిణీ... ఇల్లెందు మండలంలోని చెన్నెంగులగడ్డ, రొంపేడు పాఠశాలల్లో శనివారం ఐటీడీఏ డీడీ సీహెచ్ రామ్మూర్తి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని అన్ని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ఈ నెలాఖరు నాటికి ప్రతి విద్యార్థికి అందజేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉంటూ చదువుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో చెన్నెంగులగడ్డ, రొంపేడు, ఇల్లెందు బాలికల ఆశ్రమ పాఠశాలల హెచ్ఎం, వార్డెన్లు సోమశేఖర్.హరాజ్య, సునిత, వెంకన్న, రూపాదేవి, రాకం శ్యామ్‌బాబు, అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు దుప్పట్ల ‘వసతి’
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: దుప్పట్లు లేక సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు పడుతున్న అవస్థలపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. చలికాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా హాస్టళ్లల్లోని విద్యార్థులకు ఇవ్వాల్సిన దుప్పట్లు, బెడ్షీట్లు, కాస్మోటిక్ చార్జీలు అందని వైనాన్ని ‘సాక్షి’వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘వణుకుతున్న వసతి’శీర్షికతో ఈనెల 17న సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకుని హాస్టల్ విద్యార్థులకు ముందస్తుగా రగ్గులు, కార్పెట్ల (జంపఖానా)లను పంపిణీ చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపక్రమించింది. దుప్పట్ల పంపిణీకి చర్యల్ని మరింత వేగిరం చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 686 సంక్షేమ వసతి గృహాలుండగా.. వీటిలో 58 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. చలికాలాన్ని తట్టుకునే విధంగా నాణ్యమైన రగ్గులు, కార్పెట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎస్సీ అభివృద్ధి శాఖ.. టెస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.750 విలువైన రగ్గు, కార్పెట్‌ను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో విద్యార్థులకు అవసరమైన స్టాకును రెండు రోజుల క్రితం టెస్కో ప్రతినిధులు ఎస్సీ అభివృద్ధి శాఖకు అందజేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పంపిణీ నిమిత్తం అధికారులు జిల్లాలకు తరలించారు. స్టాక్‌ను వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా సంక్షేమాధికారులను ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ఆదేశించారు. శుక్రవారం నాటికి జిల్లా కేంద్రాలకు దుప్పట్లు చేరుకోగా.. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట పరిధిలో శుక్రవారం రాత్రే పంపిణీ చేశారు. -
జిల్లాపై జ్వరాల పంజా
♦ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ♦ ఏజెన్సీ పరిధిలోని వారికి సోకుతున్న మలేరియా ♦ పలు చోట్ల నమోదవుతున్న డయేరియా కేసులు ♦ జ్వరాలతో సతమతమవుతున్న హాస్టల్ విద్యార్థులు సాలూరు/కురుపాం: జిల్లాపై జ్వరాల పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తుండగా... మైదాన ప్రాంతాల్లో డయేరి యా సైతం విస్తరిస్తోంది. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా జ్వరాలతో బాధపడుతున్నవారే దర్శనమిస్తున్నారు. ఇక వివిధ గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు సైతం జ్వరాలతో సతమతమవుతూ రోజూ ఆస్పత్రి బాట పడుతున్నా రు. సాలూరు ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఒక్కో మంచానికి ఇద్దరు, ముగ్గురు వంతున సర్దుకుపోవాల్సి వస్తోంది. అయినా సరిపడకపోవడంతో ఆస్పత్రి వార్డుల్లోనున్న బల్లలపైనా కూడా వైద్యసేవలందిస్తున్నారు. ఇక్కడ ఒక్క బుధవారమే ఆస్పత్రికి వచ్చినవారు 64మంది కాగా, వారిలో 25మంది జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో 10మందికి మలేరియా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. హాస్టళ్లలో విస్తరిస్తున్న జ్వరాలు ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు రోజూ అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుతుండడం గమనార్హం. సాలూరు మండలంలోని కొత్తవలస హాస్టల్ విద్యార్థి మువ్వల మనీష, పాచిపెంట మండలంలోని పి.కోనవలస హాస్టల్‌కు చెందిన కట్టెల సింహాచలంతోపాటు సాలూరు మండలం డి వెలగవలసకు చెందిన కూనేటి కీర్తన, బట్టివలసకు చెందిన గమ్మెల సింహాద్రి, వి.సంతు, రామభద్రపురం మండలం కొండగుడ్డివలసకు చెందిన నల్లజొన్న చిన్నమ్మ బుధవారం ఆస్పత్రిలో చేరారు. పెరుగుతున్న మలేరియా బాధితులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజు రోజుకూ మలేరియా జ్వరపీడితుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలసకు చెందిన గిరిజనులే జ్వరాలతో బారులు తీరుతున్నారు. బుధవారం ఒక్క రోజే పదుల సంఖ్యలో మలేరియా జ్వర పీడితులు ఆస్పత్రిలో చేరడం ఇక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం కురుపాం సీహెచ్‌సీలో ఏజెన్సీ గ్రామాలకు చెందిన తోయక కృష్ణారావు, చంటి, తోయక నీలయ్య, పువ్వల రోజా, గిరిజన సంక్షేమ వసతిగృహానికి చెందిన మండంగి హరీష్, వాటక రోహిత్ తోపాటు మరో పది మంది వరకు చేరారు. గతేడాది కంటే ఎక్కువే... కురుపాం సీహెచ్‌సీలో 2016 జనవరి నుంచి జూన్ వరకు 210 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 606 మలేరియా పాజటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మార్చి నెలలో 158 కేసులు, మేలో 123, జూన్‌లో 151 కేసులు నమోదవ్వడం చూస్తుంటే రోజురోజుకూ మలేరియా విస్తరిస్తోందనే చెప్పాలి. ఒకే ల్యాబ్ టెక్నీషియన్‌తో రోగుల అవస్థలు కురుపాం సీహెచ్‌సీలో ఒకే ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉండటంవల్ల నాలుగు గిరిజన మండలాల నుంచి వస్తున్న జ్వరపీడితులు రక్తపరీక్షకోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ముగ్గురు వైద్యాధికారుల్లో రోజుకొకరు చొప్పున షిఫ్ట్ డ్యూటీలు నిర్వహిస్తుండటతో వైద్య సేవలు కూడా అరకొరగానే అందుతున్నాయని గిరిజన వాపోతున్నారు. కానరాని నివారణ చర్యలు మలేరియా నివారణే లక్ష్యంగా ఏజన్సీలోని గ్రామాల్లో మలాథియన్ పిచికారి కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ చెబుతున్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చట్లేదని ప్రస్తుతం నమోదవుతున్న కేసులే చెబుతున్నాయి. -
రోడ్డున పడ్డ బీసీ హాస్టల్ విద్యార్థులు
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో వెనుకబడిన తరగతుల వసతిగృహం విద్యార్థులు రోడ్డును పడ్డారు. విషయంలోకి వెళ్తే జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్ ఓప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల అగ్రిమెంట్ సమయం ముగియడంతో ఖాళీచేయమని భవనం యజమాని పలు సార్లు విజ్ఙప్తి చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో భవనం యజమాని మంగళవారం ఉదయం భవనంలోని విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులను బయట పడేశారు. భవన యజమాని ఆదేశాలమేరకు హాస్టల్ వాచ్‌మన్, వంటమనిషి హాస్టల్లోని వస్తువులను బయట పడేయ విద్యార్థులు రోడ్డున పడ్డారు. విద్యార్థులు విషయాన్ని సాంఘిక సంక్షేమశాఖ అధికారులకు తెలియజేశారు. అయితే హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. -
జైల్లో ఖైదీలకంటే హీనమా?: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: జైల్లో ఖైదీలకు నెలకు 3 వేల రూపాయలు భోజనం కోసం మంజూరు చేస్తుండగా, మెడిసిన్, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు నెలకు 1050 రూపాయలు మెస్‌ఛార్జీలుగా ఇస్తున్నారు. జైల్లో ఖైదీలకిచ్చే ప్రాధాన్యత విధ్యార్థులకు ఇవ్వరా?.. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు రోజుకు రూ.35 వంతున పూటకు 10.67 రూపాయలతో భోజనం సాధ్యమేనా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విధ్యార్థుల స్కాలర్షిప్లు, మెస్‌ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు, మెస్‌ఛార్జీలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కానుకగా ఉద్యోగ, కార్మిక వర్గాలకు, ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన విద్యార్థుల స్కాలర్షిప్లు, మెస్‌ఛార్జీలు పెంచక పోవడం శోచనీయమన్నారు. బీసీ సంఘం నాయకులు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, రాంకోటి, కుల్కచర్ల శ్రీనివాస్, రామలింగం, నర్సింహ్మగౌడ్, వేముల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఓను ఘెరావ్ చేసిన హాస్టల్ విద్యార్థినులు
అమలాపురం: స్థానిక వడ్డి గూడెంలో సరైన వసతులు లేని ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్ భవనంలోకి నాలుగు హాస్టళ్లకు చెందిన దాదాపు 600 మంది విద్యార్ధినులను తరలించడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు, కోనసీమ దళిత నాయకులు స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. సుమారు నాలుగు గంటల పాటు కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది దాదాపు హౌస్ అరెస్ట్ అయ్యారు. జిల్లా ఎస్సీ కార్పొరేష¯ŒS ఈడీ, ఇ¯ŒSఛార్జి ఆర్డీఓ అనూరాధను హాస్టల్ విద్యార్థినులు ఘెరావ్ చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఆర్డీఓ కార్యాలయ ముట్టడి కొనసాగింది. సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాక జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి ఇక్కడ వచ్చి ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడే ప్రకటించాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. దాంతో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో డీడీ శోభారాణి కాకినాడ నుంచి అమలాపురానికి వచ్చారు. ఆమెను కూడా విద్యార్ధినులు, దళిత నాయకులు ఘెరావ్ చేశారు. ఆమె ఫో¯ŒSలో జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. ఈ విద్యాసంవత్సరానికి పాత హాస్టళ్లలోనే విద్యార్థినులను ఉంచుతామని కలెక్టర్ అనుమతితో ఆమె ప్రకటించటంతో ఆందోళనకు తెరపడింది. ఇప్పటికే కొత్త హాస్టల్‌కు పాత హాస్టళ్లనుంచి తరలించిన బియ్యం తదితర సామగ్రిని తిరిగి పాత హాస్టళ్లకు తరలించేలా తక్షణ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈ సమస్యకు తెరపడింది. కోనసీమ దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్‌బాబు, పెయ్యల శ్రీనివాసరావు, జంగా బాబూరావు, దేవరపల్లి శాంతికుమార్, మెండు రమేష్‌బాబు, ఉండ్రు వెంకటేష్, కాట్రు చంద్రమోహన్, బొంతు బాలరాజు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, స్త్రీ శక్తి రాష్ట్ర కో ఆర్డినేటర్ కొంకి రాజామణి పాల్గొన్నారు.