ముగ్గురు హాస్టల్‌ విద్యార్థుల ఆచూకీ లభ్యం    | whereabouts of 3 ​hostel students available | Sakshi
Sakshi News home page

ముగ్గురు హాస్టల్‌ విద్యార్థుల ఆచూకీ లభ్యం   

Published Fri, Apr 13 2018 10:17 AM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

whereabouts of 3 ​hostel students available - Sakshi

అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు 

చోడవరం: మూడు రోజు ల కిందట గోవాడ హాస్టల్‌ నుంచి అదృశ్యమైన ము గ్గురు విద్యార్థులు తిరుప తి రైల్వేస్టేషన్‌లో దొరికిన ట్టు గురువారం  సమాచా రం రావడంతో వారి తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చోడవరం మండలం గోవాడ బాలుర బీసీ హాస్టల్‌లో చీడికాడ మండలం కోనాం పరిసర గ్రా మాలకు చెందిన నంబారు గోవింద, గంటా కొండలరావు, విస్సారపు గణేష్‌ చదువుతున్నారు.

వీరు ముగ్గురు ఈనెల 10న హాస్టల్‌ నుంచి అదృశ్యమయ్యారు. దీనిపై బాధిత విద్యార్ధుల తల్లిదండ్రులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అదృశ్యమైన విద్యార్థుల ఫొటోలు సోషల్‌ మీడియాలో విస్తృత ప్ర చారం కూడా చేశారు.

వీరి కోసం బంధువులు, పోలీసులు గాలిస్తుండగా చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి ఒక యువకుడు ఫోన్‌ చేయడంతో వారి కో సం తమ బంధువులను పంపినట్టు, పిల్లలు క్షేమంగా దొరికినట్టు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.

విద్యార్థులు దొరికిన విషయాన్ని ఆ యువకుడు తనతో ఉన్న ఆ ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను  వాట్సాప్‌ లో పెట్టడంతో తల్లిదండ్రులు, హాస్టల్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement