Whereabouts
-
సోరెన్ కోసం ఈడీ వెదుకులాట
న్యూఢిల్లీ/రాంచీ: భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇంట్లో లేరని, ఎక్కడున్నారో జాడ తెలియడం లేదని, సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని అధికారులు చెప్పారు. జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన సోరెన్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని నివాసంలో అందుబాటులో ఉంటానని ఆయన నుంచి మెయిల్ అందినట్లు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి దాకా ఢిల్లీ నివాసంలోనే పడిగాపులు కాశారు. సోరెన్ ఆచూకీ దొరికే దాకా అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన గురించి ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ అభివర్ణించారు. -
నావికా దళాధికారి ఆచూకీ లభ్యం
పారిస్/కోచి: తీవ్రంగా గాయపడి హిందూమహా సముద్రంలో గల్లంతైన భారతీయ అధికారి ఆచూకీ దొరికిందని ఫ్రాన్స్‌కు చెందిన గోల్డెన్‌గ్లోబ్ రేస్ సంస్థ ప్రకటించింది. భారత నావికాదళ కమాండర్ అభిలాష్ టామీ(39) తురయా అనే తన పడవలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’లో భారత్ నుంచి పాల్గొన్న ఏకైక నావికుడు. ఫ్రాన్స్ తీరం నుంచి జూలై 1వ తేదీన 18 మంది పోటీదారులతో ప్రారంభమైన ఈ రేసులో ఇప్పటివరకు 10,500 నాటికల్ మైళ్లు ప్రయాణించారు. ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న అభిలాష్ హిందూమహా సముద్రంలో ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా తీవ్ర తుపానులో చిక్కుకున్నారు. అలల తాకిడికి ఆయన పడవ తీవ్రంగా దెబ్బతింది. తీవ్రంగా గాయపడి, నిస్సహాయ స్థితిలో ఉన్న అభిలాష్ శనివారం రేస్ నిర్వాహకులకు మెసేజ్ పంపారు. రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు నావికాదళానికి చెందిన ఆధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పురాను ఆ ప్రాంతానికి పంపించినట్లు భారత నావికా దళం తెలిపింది. -
బాలుడి ఆచూకీ లభ్యం
ద్వారకాతిరుమల : ఇంటి నుంచి తప్పిపోయి ద్వారకాతిరుమలకు చేరిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులకు ఆ బాలుడిని పోలీసులు సోమవారం అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడు తప్పిపోయి ఆర్టీసీ బస్సెక్కి ఆదివారం ద్వారకాతిరుమలకు చేరుకుని, అక్కడి నుంచి పోలీసుల సంరక్షణలోకి వెళ్లిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి సోమవారం పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా ఆ బాలుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. బాలుడి పేరు ఏసు అని, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడని అతడి పిన్ని బత్తుల బుజ్జి పోలీసులకు తెలిపింది. తన సంరక్షణలోనే పెరుగుతున్నాడని చెప్పింది. తమది కర్ణాటక రాష్ట్రంలోని గంగసముద్రమని, బతుకుదెరువు కోసం ఏలూరుకు వచ్చి స్థిరపడినట్టు వివరించింది. దెందులూరు మండలం చల్లచింతలపూడిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లిన ఏసు ఆడుకుంటూ బస్సెక్కి ద్వారకాతిరుమలకు వెళ్లిపోయాడని, ఆ విషయం తెలియక తాము కంగారుగా చుట్టుపక్కల వెతికినట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్ రైటర్ రామకృష్ణ బాలుడు ఏసుని అతడి పిన్ని బుజ్జికి అప్పగించారు. -
ముగ్గురు హాస్టల్ విద్యార్థుల ఆచూకీ లభ్యం
చోడవరం: మూడు రోజు ల కిందట గోవాడ హాస్టల్ నుంచి అదృశ్యమైన ము గ్గురు విద్యార్థులు తిరుప తి రైల్వేస్టేషన్లో దొరికిన ట్టు గురువారం సమాచా రం రావడంతో వారి తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చోడవరం మండలం గోవాడ బాలుర బీసీ హాస్టల్లో చీడికాడ మండలం కోనాం పరిసర గ్రా మాలకు చెందిన నంబారు గోవింద, గంటా కొండలరావు, విస్సారపు గణేష్ చదువుతున్నారు. వీరు ముగ్గురు ఈనెల 10న హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారు. దీనిపై బాధిత విద్యార్ధుల తల్లిదండ్రులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అదృశ్యమైన విద్యార్థుల ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృత ప్ర చారం కూడా చేశారు. వీరి కోసం బంధువులు, పోలీసులు గాలిస్తుండగా చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి ఒక యువకుడు ఫోన్ చేయడంతో వారి కో సం తమ బంధువులను పంపినట్టు, పిల్లలు క్షేమంగా దొరికినట్టు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. విద్యార్థులు దొరికిన విషయాన్ని ఆ యువకుడు తనతో ఉన్న ఆ ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను వాట్సాప్ లో పెట్టడంతో తల్లిదండ్రులు, హాస్టల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
వీడని మిస్టరీ!!
∙ రెండేళ్లుగా కనిపించని పార్వతమ్మ ∙ ఆచూకీ లేక వేదనతో తనువు చాలించిన భర్త...తండ్రి ∙ పోలీసులకు పలుమార్లు విన్నవించినా ఫలితం శూన్యం ∙ అసలు ఉందా...లేక మృతి చెందిందా అన్నది తెలియని వైనం ∙ కలెక్టర్, ఎస్పీ స్పందిస్తేనే... పార్వతమ్మ జాడ తెలిసే అవకాశం కడప: కుటుంబ కష్టాలు తీరుస్తానని.. ఇంటికి ఆసరాగా నిలుస్తానని చెప్పి కువైట్‌కు వెళ్లిన పార్వతమ్మ ఆచూకీ లభించక రెండేళ్లు గడిచింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. తిరగని చోటు లేదు. అసలు పార్వతమ్మ ఉందా? లేక సేట్లు ఏమైనా చేశారా అంటూ ఆమె కుటుంబ సభ్యులు మనోవేదనతో తల్లడిల్లిపోతున్నారు. ఇటీవల పార్వతమ్మ పిల్లలు నలుగురితోపాటు వారి నానమ్మ రామసుబ్బమ్మ కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. పార్వతమ్మ....ఎక్కడున్నావమ్మా....! గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మ రెండేళ్ల క్రితం కుటుంబ పోషణ నిమిత్తం కువైట్‌కు వెళ్లింది. అప్పటినుంచి ఇప్పటివరకు జాడ లేకపోవడంతో ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. పార్వతమ్మకు నలుగురు పిల్లలు. అందులో వనజ (10), రెడ్డి నాగశంకర్‌నాయుడు (9), శైలజ (6), సునీల్‌కుమార్‌నాయుడు (3)లు అందరూ చిన్న పిల్లలే. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరి ఆలన, పాలన నానమ్మ రామసుబ్బమ్మ చూస్తోంది. పార్వతమ్మ కనిపించలేదని వేదనతో ఇద్దరు మృతి పార్వతమ్మ ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఆచూకీ లేదు. ఆమె ఏమైందో తెలియక తీవ్ర వేదనకు గురైన పార్వతమ్మ భర్త నాగేంద్ర రెండునెలల క్రితం మృత్యువాతపడ్డాడు. 15 రోజుల క్రితం రాయచోటి మండలం మాధవరం పంచాయతీలోని పాలెవారిపల్లెకు చెందిన పార్వతమ్మ తండ్రి తాతినాయుడు కూడా మృతి చెందారు. సరైన సమాచారం ఇవ్వని ఏజెంట్ పార్వతమ్మ ఆచూకీ కోసం కుటుంబం తల్లడిల్లిపోతున్నా ఆమెను కువైట్‌కు పంపిన ఏజెంటు మాత్రం నోరు విప్ప డం లేదు. రామసుబ్బమ్మ పలుమార్లు వెళ్లి ఏజెంటును కలిసి ప్రశ్నించినా ఏమో తెలియదు.. పంపించాము మా పని అయిపోయిందన్నట్లు చెబుతున్నారని వారు వాపోతున్నారు. కలెక్టర్, ఎస్పీ స్పందిస్తేనే... పార్వతమ్మ ఇంటి నుంచి వెళ్లి రెండేళ్లు దాటుతున్న నేపథ్యంలో ఒక కుటుంబం పడుతున్న వేదనను గుర్తించి కలెక్టర్ బాబూరావునాయుడు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణలు స్పందిస్తేనే ఏదైనా సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రామసుబ్బమ్మతోపాటు పిల్లలు వచ్చి కలెక్టర్‌ను కలిసి వెళ్లారు. స్థానికంగా ఉన్న పోలీసుస్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందిస్తేనే న్యాయం జరగుతుందని రామసుబ్బమ్మ కుటుంబం ఆశతో ఎదురు చూస్తోంది. -
కరణం రామకృష్ణ ఆచూకీ లభ్యం
పుట్టపర్తి టౌన్ : కొంత కాలంగా పుట్టపర్తిలో వివాదాస్పదంగా తయారైన కరణం రాజగోపాలరావు కుమారుడు కరణం రామకృష్ణ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఇటీవల పట్టణ పరిధిలో ఆయనకు చెందిన రూ.కోట్లాది విలువైన ఆస్తులపై కన్నేసిన స్థానిక టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి రచ్చరచ్చ చేశారు. ఈ వ్యవహారం వివాదాలకు, ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ విషయం తెరపైకి వచ్చింది. కానీ ఆయన ఎక్కడున్నారో తెలియలేదు. ఎట్టకేలకు బెంగళూరులో తన కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలుసుకున్నారు. స్థానికుల కథనం మేరకు... దాదాపు 30 సంవత్సరాల క్రితం రామకృష్ణ పుట్టపర్తిని వదిలి వెళ్లిపోయారు. 2000 సంవత్సరంలో ఆయన తండ్రి గోపాలరావు హత్యకు గురయ్యారు. అప్పుడు కూడా ఆయన రాలేదు. తర్వాత గోపాలరావు ఆస్తిని వారసులు లోక్‌అదాలత్ ద్వారా పంచుకున్నారు. రామకృష్ణ వాటాగా వచ్చిన 18 ఎకరాలను అలాగే ఉంచారు. అయినప్పటికీ ఆయన పుట్టపర్తికి రాలేదు. దీంతో కోట్ల రూపాయల విలువ చేసే ఆ ఆస్తిని కుటుంబ సభ్యులతోపాటు, పలువురు స్థానికులు కూడా ఇష్టారాజ్యంగా అమ్మేసి అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్లు కూడా చేయించేశారు. ఇటీవల ఆ డాక్యుమెంట్లు వెలుగులోకి రావడంతో కొనుగోలు చేసిన ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీనికితోడు పుట్టపర్తిలోని రామకృష్ణ కుటుంబ సభ్యులు కొందరు ఆయన ఆచూకీ, ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని, విచారించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల పాటు పట్టణంలో దీక్షలు సైతం చేపట్టారు. రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును, ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులు ఆస్తుల వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేసి రామకృష్ణ ఆచూకీ కోసం విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రామకృష్ణ అత్తను విచారించి ఆయన భార్య కృష్ణకుమారి, కుమారుల అచూకీ కనుగొన్నారు. కృష్ణకుమారి గుంతకల్లులోని రైల్వే క్వార్టర్స్‌లో నివశిస్తున్నట్లు తెలుసుకుని ఆమెను విచారించారు. కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలతో మానసికంగా కృంగిపోయిన రామకృష్ణ కొంతకాలంగా బెంగళూరులో సాఫ్్టవేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఆయనను పుట్టపర్తికి రప్పించేందుకు సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తన బృందంతో మంగళవారం బెంగళూరు వెళ్తున్నారు. కొసమెరుపు : ఈ ఏడాది నవంబర్‌లో రామకృష్ణ భార్య, కుమారుడు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి పుట్టపర్తిలో విలువైన తమ ఆస్తులను కొందరు అన్యాక్రాంతం చేస్తున్నారని, రామకృష్ణ చనిపోయాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే సత్యసాయి జయంతి వేడుకలలో బిజీగా ఉన్న అధికారులు ఆ ఫిర్యాదుపై దృష్టి సారించలేకపోయినట్లు సమాచారం. -
జాడ లేని దీప్తి
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ గన్నవరం: మండలంలోని కేసరపల్లి వద్ద భర్తతో గొడవ పడుతూ ఏలూరు కాలువలో గల్లంతైన చౌటపల్లి దీప్తి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. దీప్తి కాలువలో పడి మూడు రోజులైంది. గురువారం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎయిర్బోట్లతో కాలువలో ముమ్మరంగా జల్లెడ పడుతున్నారు. సిఐ అహ్మద్అలీ, ఎస్ఐ శ్రీనివాస్‌ల సిబ్బంది కేసరపల్లి నుండి అజ్జంపూడి వరకు కాలువ వెంట ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది. అయితే అజ్జంపూడి వద్ద కాలువలో అడ్డుగా ఉన్న గుర్రపుడెక్క గాలింపుకు ఆటంకంగా మారింది. దీప్తి ఆచూకీపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
మా అబ్బాయి ఆచూకీ తెలుస్తుందా?
నిరీక్షణ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గొల్లవీధి. తిరువీధుల నారాయణరావు, సరస్వతి దంపతులు. నారాయణ రావుకు ఏడు పదుల వయసు. భార్య సరస్వతికి ఆరుపదుల వయసు దాటింది. ‘మా అబ్బాయి గోపీకృష్ణ ఆచూకీ ఏమైనా తెలుస్తుందంటారా..!’ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆశగా అడుగుతుంటారు. ఏడాది క్రితం కిడ్నాపైన తమ బిడ్డ ఏమైపోయాడో తెలియడం లేదని, ఉగ్రవాదుల చెర నుంచి తమ కుమారుడిని విడిపించాలని ప్రభుత్వాలకు వీళ్లు మొరపెట్టుకుంటున్నారు. ఇంతకీ ఏమైందంటే... లిబియా దేశం నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న నలుగురు భారతీయులను కిందటేడాది జూలై 29న ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరిని విడిచి పెట్టగా, హైదరాబాద్‌కు చెందిన బలరాం కిష న్‌తో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కంప్యూటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరువీధుల గోపికృష్ణ ఉన్నారు. దీంతో అప్పట్లో ఆంధ్ర, తెలంగాణాకు చెందిన ప్రభుత్వాలు హడావుడి చేసి ఆ తరువాత వారి గురించి మరచిపోయాయి. కుమారుడి ఆచూకీ కోసం వృద్ధులైన గోపికృష్ణ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతూ ఎదురు చూస్తున్నారు. ‘‘మాకు వచ్చిన కష్టం పగవారికి కూడా రాకూడదు’’ అంటూ కనపడని దేవుళ్లకి మొక్కుతూ.. తన ఆవేదనను పంచుకున్నారు నారాయణరావు. కళ్ల ముందు ఉండాలని... ‘‘మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్దవాడు మురళీ కృష్ణ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. రెండవవాడు గోపీకృష్ణ వయసు 39 ఏళ్లు. లిబియా దేశంలో ఉద్యోగం. ఎనిమిదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. వాడికి భార్య కళ్యాణి, 5 ఏళ్ల కొడుకు కృష్ణసాయీశ్వర్, పదేళ్ల కూతురు జాహ్నవి... ఉన్నారు. పిల్లల చదువుల కోసం కళ్యాణి మూడేళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటోంది. అప్పటి వరకు అంతా లిబియాలోనే ఉండేవారు. గోపీకృష ఏడాదికి ఒకసారి ఇండియాకు వచ్చి వెళ్లేవాడు. ‘ఎందుకురా అంతంత దూరాలు మమ్మల్ని అంతా వదిలి వెళ్లి! నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇక్కడ రాదా..!’ అని అంటుండేవాడిని. ‘ఈ ఏడాది వరకు బాండ్ ఉంది నాన్నా! అది పూర్తవగానే వచ్చేస్తాను..’ అనేవాడు. నాకు ఆరేళ్ల క్రితం గుండెపోటు వచ్చి బైపాస్ సర్జరీ అయ్యింది. పిల్లలు కళ్లముందు ఉండాలని నా మనసు ఆరాటపడుతోంది. నాన్నెప్పుడు వస్తాడు? నా మనమడు, మనవరాలు.. ‘అమ్మా, తాతయ్యా.. నాన్న ఎప్పుడొస్తారు?’ అని అడుగుతున్నారు. ‘ఇప్పుడు నాన్నకు సెలవుల్లేవు రా.. అయిపోగానే వచ్చేస్తాడు’ అని అబద్ధం చెబుతుంటాం. సరైన ఆదాయం లేక పిల్లల పోషణకు, చదువులకు కావల్సిన సర్దుబాట్లు చేయలేక మా కోడలు కళ్యాణి ఎన్నో ఇబ్బందులు పడుతోంది. నేను కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగిగా రిటైర్ అయ్యి పదేళ్లు అయ్యింది. నాకు పెన్షన్ రాదు. నిలకడగా వచ్చే ఆదాయమూ లేదు. నా మందుల ఖర్చులు, కుటుంబ పోషణ వాడే చూసుకునేవాడు. ఎప్పుడు ఫోన్ చేసినా ‘ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా! సమయానికి మందులు వేసుకుంటున్నారా!’ అని అడిగేవాడు. ఇప్పుడు వాడెలా ఉన్నాడో.. ఎక్కడ ఉన్నాడో తలుచుకుంటేనే దుఃఖం పొంగి వస్తోంది. ఈ వయసులో కొడుకు ఆసరాతో జీవితాన్ని గట్టెక్కించేద్దాం అనుకున్నవాడిని. ఇప్పుడు వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో! వాడిని తీసుకెళ్లినవాళ్లు ఒక్క ఫోన్ అయినా నా కొడుకుచేత చేయిస్తే బాగుండేది. ఏం ఫర్వాలేదు అని... ధీమాగా ఉండేవాడిని. (నారాయణరావు మాట్లాడుతున్నంతసేపూ కన్నీరే తప్ప సరస్వతి ఏమీ మాట్లాడలేకపోయారు). మా కోడలు, పెద్ద కొడుకు మురళీ కృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోడిని కలిసి విషయాన్ని చెప్పి, మా అబ్బాయిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించమని కోరారు. వారు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకూ ఎలాంటి ధీమా రాలేదు. ఎం.పీలను కలుస్తున్నాం... ఎవరైనా హామీ ఇస్తున్నారే తప్ప ఎప్పటికి మా అబ్బాయి విషయం తెలుస్తుందో చెప్పడం లేదు. మా రోదన అరణ్యరోదనే అవుతోంది. మీరంతా పూనుకొని మా కష్టం ప్రభుత్వాలకు తెలియజేస్తే.. వారు త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తే మా అబ్బాయి మాకు దక్కుతాడు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయగలిగితే మాలాగా ఏ కుటుంబానికీ ఇంత కష్టం రాదు’’ అంటూ చేతులెత్తి దణ్ణం పెడుతున్నారు నారాయణరావు. - ఎల్.వి.రమణ, సాక్షి, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా -
గుర్తుతెలియని శవం ఆచూకీ లభ్యం
జఫర్‌గఢ్ : అనుమానాస్పదస్థితిలో జఫర్‌గఢ్ శివారు నల్లబండ వద్ద లభ్యమైన గుర్తు తెలియని యువకుడి శవం ఆచూకీ లభ్యమైనట్లు ఎస్సై బండారి సంపత్ తెలిపారు. స్థానికుల ద్వారా సోమవారం వెలుగులోకి రావడం జరిగింది. మృతుడు ఎవరన్నది తెలియకపోవడంతో పోలీసులు ఎంజీఎం మార్చురిలో భద్రపర్చారు. పత్రికలో వచ్చిన ఫొటో, కథనాల ఆధారంగా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామానికి చెందిన కుల్లా సంపత్, నిర్మల దంపతులు మంగళవారం మార్చురికి వచ్చి తమ కుమారుడు మహేశ్ (24)గా గుర్తిం చారు. కాగా వీరిది స్వగ్రామం జఫర్‌గఢ్ శివారు వడ్డెగూడెం అయినప్పటికీ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఉనికిచర్లకు వెళ్లి అక్కడనే స్థిరపడ్డారు. కుమారుడి మృతిపై తల్లిదండ్రులు, బంధువులు తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు. మృతుడు హన్మకొండ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో ఎంబీఎ పూర్తి చేశాడు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో తన స్మేహితుల వద్దనే ఉంటూ చదువుకుంటున్నాడు. చదువుతున్న సమయంలోనే ఐదు నెలల క్రితం వరంగల్‌లోని ఓ గోల్డ్ షాపులో పనిచేశాడు. ఇటీవల మహేశ్ తాత కుల్లా సాయిలు మృతి చెందడంతో 10 రోజుల పాటు తన స్వగ్రామమైన వడ్డెగూడెంలోనే ఉంటున్నాడు. ఈ సమయంలోనే మృతుడు తాను మృతి చెందిన నల్లబండ వద్ద తన స్నేహితులతో కలిసి విందు పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. తాత దశదినకర్మ పూర్తయిన తర్వాత మహేశ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉనికిచర్లకు వెళ్లాడు. తర్వాత మహేశ్ తన ఇంటి నుంచి నాలుగు రోజుల క్రితం హన్మకొండకు వెళ్లినట్లు తెలిసింది. ఎప్పటి లాగానే తమ కుమారుడు స్నేహితుల వద్దనే ఉన్నాడని భావించిన తల్లిదండ్రులు పత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా గుర్తించారు. మహేశ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మహేశ్ మృతిపై ఇప్పటి వరకు ఎలాంటి కారణాలు తెలియరాలేదని ఎస్సై సంపత్ తెలిపారు. -
17 ఏళ్లకు యువతి ఆచూకీ
సోమందేపల్లి: 17 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఓ యువతి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమయింది. 1999లో సోమందేపల్లి నుంచి వెళ్ళిపోయిన ఆమెను తమిళనాడులోని హెల్పింగ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ చేరదీసి ఆమె బాగోగులు చూస్తూ వచ్చింది. ఆనారోగ్యంతో పాటు బుద్ది మాంద్యం కావడంతో ఆమె వివరాలు దాదాపు 17 ఏళ్ళుగా ఆ స్వచ్ఛంద సంస్థకు తెలియరాలేదు. ప్రస్తుతం కోలుకోవడంతో తన పేరు రాధ (35) అని, తల్లిదండ్రులు వెంకటస్వామి, వెంకటమ్మలని, తమ స్వగ్రామం సోమందేపల్లి అని తెలపడంతో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిర్వాహకులు సోమందేపల్లి పోలీసులకు బుధవారం రాత్రి సమాచారం అందజేశారు. ఆ యువతి కుటుంబీకుల ఆచూకీ తెలపాలని వారు కోరారు. దీంతో ఆమె ఫొటోలను ఎస్ఐ గౌస్ మహ్మద్ బాషా మీడియాకు అందజేశారు. ఈ యువతి ఆచూకీ తెలిసిన వారు సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేయాలని కోరారు. -
విద్యార్థి ఆచూకీ లభ్యం
♦ తీవ్ర గాయాలతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యక్షం ♦ కిడ్నాప్ చేసి.. కాల్చారని వాంగ్మూలం హుజూర్నగర్: నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ అదృశ్యమైన విద్యార్థి నాగార్జునరెడ్డి ఆచూకీ లభించింది. శనివారం కాలిన గాయాలతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మేళ్లచెరువు మండలం తమ్మారం కొత్తూరుకు చెందిన గాయం నాగార్జునరెడ్డి హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యనభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. నాగార్జునరెడ్డి రూ. 500 దొం గిలించాడని సహచర విద్యార్థులు ఆరోపిం చారు. తాను ఆ చోరీ చేయలేదని, తనపై నింద వేయడంతో పురుగుమందు తాగి చని పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. తనను కిడ్నాప్ చేసి తగులబెట్టారని న్యాయమూర్తికి నాగార్జునరెడ్డి వాంగ్మూ లం ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. 18న పాఠశాల వద్ద ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారని, శనివారం ఉదయం చిల్లకల్లు పెట్రోల్‌బంక్ సమీపంలో తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపాడు. అనంతరం వారే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విడిచి వెళ్లారన్నాడు. పోలీసుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలివెళ్లారు. పాఠశాల వద్ద ఉద్రిక్తత.. హుజూర్‌నగర్‌లో నాగార్జునరెడ్డి చదువుకుంటున్న ప్రైవేట్ పాఠశాల వద్ద బంధువులు, గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా అక్కడకు చేరుకొన్నారు. కాగా, నాగార్జునరెడ్డి అదృశ్యం మిస్టరీగానే మారింది. -
కావ్య ఆచూకీ కనిపెట్టేదెన్నడో..
తేరుకోని కె.తాడేపల్లి గ్రామం ప్రత్యేక గాలింపు బృందాలు ఏం చేశాయంటున్న స్థానికులు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చిట్టినగర్ : స్థానిక కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని యానాదుల పేటలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన పసుపులేటి కావ్య(5) అదృశ్యమై 25 రోజులు దాటినా ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. కావ్యను గుర్తు తెలియని వ్యక్తులు కారులో అపహరించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఆ చిన్నారి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వారి గాలింపు చర్య లు సత్ఫలితాలు ఇవ్వలేదు. కనీసం చిన్నారి ప్రాణాలతోనైనా ఉందా? అనే అనుమానాలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయి. పోలీసుల బిజీ షెడ్యూలు, మంత్రుల పర్యటనలు, ఉత్సవాలతో వారి హడావుడి వారిదేనన్నట్లు మారి పోయింది. కావ్య సంగతి తమకు, స్థానికులకు తప్ప ఎవరికీ గుర్తులేదని, పోలీసులు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా భయాందోళనలే.. కావ్య అదృశ్యమవడంతో పేటలోని ప్రతి కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. చిన్న పిల్లలను ఒంటరి గా బయటకు వదలాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఏదైనా అత్యవసరమైన పని అయితే తమ పిల్లలను పక్క ఇంటి వారికి అప్పగించి వెళుతున్నారే తప్ప ఒంటరిగా వదిలి వెళ్లడం లేదు. పోస్టర్లు ఏమయ్యాయి.. కావ్య అదృశ్యమైన ప్పటి నుంచి పోలీసుల తీరు విమర్శలకు దారి తీస్తూ నే ఉంది. ఈ ఘటన జరిగాక చిన్నారి బంధువులను స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారణ చేయడంపాటు నామమాత్రం గా గాలింపు చర్యలు చేపట్టారని పలువురు విమర్శిస్తున్నారు. గాలింపు బృందాల ఏర్పాటు విషయంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావ్య ఫొటోతో వాల్ పోస్టర్లను చుట్టుపక్కల గ్రామాలతోపాటు రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌ల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు చేసిన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా కావ్య ప్రాణాలతో తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుతుందని గ్రామస్తులతోపాటు కుటుంబీకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. -
చివరిచూపూ దక్కలేదు
అణువణువూ గాలించినా... బియాస్లో ఓడి వెనుతిరిగినశ్రీనిధి తండ్రి నా బిడ్డ ఏదంటూ తల్లి ఆక్రందన కరీంనగర్ రూరల్ : జలప్రవాహానికి బలైన కన్నబిడ్డ జాడకోసం... కళ్లల్లో వత్తులు వేసుకుని దాసరి శ్రీనిధి తండ్రి రాజిరెడ్డి చూసిన ఎదురుచూపులు ఫలించలేదు. బిడ్డను కడసారి చూపయినా చూసుకుందామనుకున్న ఆశ నెరవేరలేదు. హృదయపొరల్లో నిక్షిప్తమైన ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బియాస్ నది వద్ద పదిరోజులుగా పడిగాపులు గాసినా బిడ్డ జాడ తెలియకపోవడంతో... గుండెలనిండా ఉన్న బాధను గొంతులో దిగమింగుకుని రిక్తహస్తాలతో గురువారం ఇల్లు చేరారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ నెల 8న గల్లంతయిన కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి ఆచూకీ ఇప్పటిదాకా తెలియరాలేదు. సంఘటన జరిగిన మరునాడే ఆమె తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్ వెళ్లారు. పది రోజులుగా కూతురు ఆచూకీ కోసం అక్కడే పడిగాపులు కాశారు. ఒక్కొక్క మృతదేహం బయటపడుతుంటే... తమ కూతురుదేమోనని ఆత్రుత గా... ఆందోళనగా వెళ్లి చూస్తూ... కాదని నిర్ధారించుకుంటూ నరకయాతన అనుభవించారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బియాస్ నది వద్ద రాజిరెడ్డిని ఓదార్చి ధైర్యం చెప్పారు. 24 మంది గల్లంతు కాగా పది రోజులపాటు రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా గురువారం వరకు 14 మృ తదేహాలు లభ్యమయ్యాయి. గాలింపు కష్టమని అక్కడి ప్రభుత్వం భావించి విద్యార్థుల పేరిట ఈ నెల 17న డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది. ఒకవేళ మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు పంపిస్తామని ప్రకటించడంతో... ఇక ఆశలు వదులుకు న్న రాజిరెడ్డి అక్కడినుంచి భారంగా బయలుదేరారు. కూతు రు కోసం వెళ్లిన ఆయన గురువారం వేకువజామున పుట్టెడు దుఃఖంతో రిక్తహస్తాలతో ఇల్లు చేరారు. ఆయన రాకతో ఆ ఇల్లు కన్నీటి సంద్రమే అయ్యింది. నా బిడ్డ ఏదంటూ శ్రీనిధ/ తల్లి ఆయనను ప్రశ్నించేసరికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రాజిరెడ్డిని ‘సాక్షి’ ఓదార్చుతూ... పలకరించగా అంతవరకు కట్టలు కట్టుకున్న కన్నీరు ఓ ప్రవాహమే అయింది. గుండెల నిండా ఉన్న బాధను పంచుకోవాల నే ఆరాటమున్నా... కళ్లల్లో తిరుగుతున్న నీళ్ల సుడులతో ఆయ న గొంతు పెగలలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న శ్రీనిధి నదీ ప్రవాహంలో తరలిరాని దూరాలకు వెళ్తుందని అనుకోలేదని, అణువణువూ గాలించినా... ఎక్కడా జాడ కనిపించలేదని... ఆయన విలపిస్తూ తెలిపారు. శ్రీనిధి జాడ తెలుస్తుంద నే ఆశ రోజురోజుకూ సన్నగిల్లుతున్నప్పటికీ కనీసం నిర్జీవ దేహమైనా లభిస్తుందనే ఆశతో బుధవారం రాత్రంతా ఢిల్లీలో వేచిచూశానని విలపించారు. గురువారం గాలింపులో మూడు మృతదేహాలు లభించడంతో నా బిడ్డ జాడ కూడా దొరుకుతుందనే ఆశ కలుగుతోందని గద్గరస్వరంతో చెప్పారు. -
చిట్టీల రాణి ఆచూకీ తెలిస్తే చెప్పండి
ప్రజలకు పోలీసుల వినతి 4 బ్యాంక్ అకౌంట్లు, కారు సీజ్ సాక్షి, సిటీబ్యూరో: టీవీ ఆర్టిస్ట్‌లను నిలువునా ముంచి పారిపోయిన బత్తుల విజయరాణి ఆచూకీ తెలిస్తే నగర సీసీఎస్ పోలీసులకు తె లపాలని డీసీపీ జి.పాలరాజు, ఏసీపీ విజయ్‌కుమార్ ప్రజలను కోరారు. విజయరాణిపై ఈనెల 13న చీటింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు మరో ఏడుగురిపై కూడా కేసు నమోదు చేశారు. శ్రీనగర్‌కాలనీలోని ఆమె ఫ్లాట్‌ను శుక్రవారం సీజ్ చేసిన పోలీసులు... తాజాగా రూ.6 లక్షల విలువ చేసే ఆమె కారు (ఏపీ 09 సీఎస్ 4931)ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీనగర్‌కాలనీలోని ఎస్బీఐ, ఆంద్రాబ్యాంక్, ఎస్బీహెచ్, కార్పొరేషన్ బ్యాంకుల్లో ఉన్న ఆమె నాలుగు అకౌంట్లను కూడా శనివారం సీజ్ చేయించారు. అందులో కేవలం రూ.300 కంటే ఎక్కువ లేవు. ఆ ఖాతాల్లోని డబ్బులను నిందితురాలు పథకం ప్రకారం ముందే డ్రా చేసుకొని పారిపోయింది. విజయరాణి ఆచూకీ తెలిసివారు 9490616703,9490616291 సెల్నెంబర్లకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.