
పారిస్/కోచి: తీవ్రంగా గాయపడి హిందూమహా సముద్రంలో గల్లంతైన భారతీయ అధికారి ఆచూకీ దొరికిందని ఫ్రాన్స్‌కు చెందిన గోల్డెన్‌గ్లోబ్ రేస్ సంస్థ ప్రకటించింది. భారత నావికాదళ కమాండర్ అభిలాష్ టామీ(39) తురయా అనే తన పడవలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’లో భారత్ నుంచి పాల్గొన్న ఏకైక నావికుడు. ఫ్రాన్స్ తీరం నుంచి జూలై 1వ తేదీన 18 మంది పోటీదారులతో ప్రారంభమైన ఈ రేసులో ఇప్పటివరకు 10,500 నాటికల్ మైళ్లు ప్రయాణించారు.
ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న అభిలాష్ హిందూమహా సముద్రంలో ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా తీవ్ర తుపానులో చిక్కుకున్నారు. అలల తాకిడికి ఆయన పడవ తీవ్రంగా దెబ్బతింది. తీవ్రంగా గాయపడి, నిస్సహాయ స్థితిలో ఉన్న అభిలాష్ శనివారం రేస్ నిర్వాహకులకు మెసేజ్ పంపారు. రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు నావికాదళానికి చెందిన ఆధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ సాత్పురాను ఆ ప్రాంతానికి పంపించినట్లు భారత నావికా దళం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment