commander
-
ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. హమాస్ టాప్ కమాండర్ హతం
టెల్అవీవ్:తమ దేశంపై 2023 అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడుల వెనుక కీలకంగా వ్యవహరించిన హమాస్ కమాండర్ అల్హదీసబాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజాలోని ఖాన్ యూనిస్‌లో శరణార్థులు సహాయం పొందుతున్న ప్రాంతంలో సబాను గుర్తించామని,డ్రోన్ దాడితో అతడిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వెల్లడించింది.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని ఇ కిబ్జట్ నిర్ ఓజ్‌లో హమాస్ జరిపిన దాడిలో అబ్ద్ అల్ హదీ సబా కీలక సూత్రధారని తెలిపింది. యూదులు టార్గెట్‌గా అల్హదీసబా దాడులు చేశాడని పేర్కొంది. సబా నేతృత్వంలో డజన్ల కొద్ది మందిని కిడ్నాప్ చేయడంతో పాటు హత్య చేశారని ఆరోపించింది. ఇప్పటికే హమాస్ అగ్ర నేతలు పలువురిని ఇజ్రాయెల్ హతమార్చిన విషయం తెలిసిందే.కాగా, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో వందల కొద్ది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలువురిని హమాస్ తన వెంట బందీలుగా తీసుకువెళ్లింది. దీనికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ ఇప్పటివరకు చేసిన దాడుల్లో 45 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు:జిన్‌పింగ్ హెచ్చరిక -
సిరియాలో ఇజ్రాయెల్ దాడులు.. హెజ్బొల్లా కమాండర్ హతం
సిరియాలోని డమాస్కస్‌కు దక్షిణంగా ఇరాన్ అనుకూల గ్రూపు హెజ్బొల్లాకు చెందిన అపార్ట్‌మెంట్‌పై ఇజ్రయెల్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన ఓ కమాండర్‌తో సహా తొమ్మిది మంది మరణించారని ఓ వార్ మానిటర్ వెల్లడించారు. లెబనీస్ పౌరసత్వం కలిగిన ఆ హెజొబొల్లా కమాండర్.. సిరియాలో కీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. సెప్టెంబరు 23న లెబనాన్‌లోని హిజ్బొల్లాతో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై దాడులను పెంచుతోంది. సిరియా రాజధానికి దక్షిణంగా ఉన్న సయ్యిదా జైనాబ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ ఇజ్రాయెల్ దాడి చేసింది. లెబనీస్ కుటుంబాలు, హెజ్బొల్లా సభ్యులు నివసించే అపార్ట్మెంట్ ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయటంతో 14 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ‘‘ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన కమాండర్ సిరియాలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతను లెబనీస్ జాతీయుడు. ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాకు చెందిన నలుగురు పౌరులు (ఒక మహిళ , ఆమె ముగ్గురు పిల్లలు), హిజ్బొల్లాల కమాండర్‌తో సహా మరో ఐదుగురు మృతి చెందారు. మృతి చెందిన కమాండర్ పేరు తెలియరాలేదు’’అని బ్రిటన్ ఆధారిత వార్ మానిటర్‌కు నాయకత్వం వహిస్తున్న రామి అబ్దేల్ రెహ్మాన్ వెల్లడించారు. మరోవైపు.. శనివారం ఉత్తర, వాయువ్య సిరియాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మృతి చెందిన ఐదుగురిలో నలుగురు ఇరాన్ అనుకూల ఫైటర్లు ఉన్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. సిరియాలో వందలాది దాడులకు పాల్పడింది. హెజ్బొల్లా సైనిక స్థావరాలు, ఫైటర్ల లక్ష్యంగా దాడులు చేసింది. సిరియాలో ఇరాన్ తన ఉనికిని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అనుమతించబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తూ వస్తోంది. -
మరో హెజ్బొల్లా టాప్ కమాండర్ హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్
జెరూసలేం: మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హెజ్బొల్లా టాప్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.‘దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా నాసర్ బ్రిగేడ్ రాకెట్ యూనిట్ కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్. 2023 నుంచి ఇజ్రాయెల్‌పై పలుమార్లు జరిగిన దాడుల్లో జాఫర్ ఖాదర్ ఫార్ కీలక పాత్రపోషించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇజ్రాయెల్‌లోని గోలాన్ ప్రాంతంలో జరిగిన రాకెట్ దాడిలో 12మందికి పైగా మరణించారు. 30మంది గాయపడ్డారు. గత బుధవారం హెజ్బొల్లా మెటుల్లాపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో మరణించారు. ఈ దాడులకు సూత్రదారి జాఫర్ ఖాదర్ ఫార్’ అని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది.అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8న తూర్పు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను హెజ్బొల్లా చేపట్టింది. ఇతని ఆధ్వర్యంలోనే ఆ దాడులు చోటుచేసుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడులకు ముందు తూర్పు లెబనాన్‌లో సీనియర్ హెజ్బొల్లా ఆపరేటివ్‌ను బంధించినట్లు ఇజ్రాయెల్ నేవీ పేర్కొంది. అయితే, అదుపులోకి తీసుకున్న హెజ్బొల్లా ఆపరేటివ్ ఎవరనేది వెల్లడించలేదు. మరోవైపు శుక్రవారం బాత్రూన్ లెబనాన్‌కు చెందిన నేవీ కెప్టెన్‌ను కొందరు అపహరించారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు లెబనీస్ అధికారులు పేర్కొన్నారు. -
బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడి.. హెజ్బొల్లా నేత మృతి
హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లోని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆపటం లేదు. బీరూట్‌లో ఉన్న హిజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై గురువారం వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. ఈ దాడుల్లో హిజ్బొల్లా కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చీఫ్ మహ్మద్ రషీద్ సకాఫీ హతమైనట్లు వెల్లడించింది.ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వివరాల ప్రకారం.. బీరూట్‌పై గురువారం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. హెజ్బొల్లా రహస్య స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం చేపట్టింది. ఇక.. తమ దాడుల్లో మృతి చెందిన మహ్మద్ రషీద్ సకాఫీ.. 2000 సంవత్సరంలో హెజ్బొల్లాకు కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చీఫ్‌గా నియమితులయ్యారు.🔴Mohammad Rashid Sakafi, the Commander of Hezbollah’s Communications Unit, during a precise, intelligence-based strike in Beirut yesterday. Sakafi was a senior Hezbollah terrorist, who was responsible for the communications unit since 2000. Sakafi invested significant efforts… pic.twitter.com/PH65nh5FLI— Israel Defense Forces (@IDF) October 4, 2024 ఆయన హెజ్బొల్లాలో సీనియర్ నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని ఐడీఎఫ్ పేర్కొంది. అన్ని కార్యక్రమాలకు కమ్మూనికేషన్ వ్యవస్థలను నిర్వహించటంలో సకాఫీ.. హిజ్బొల్లాకు కీలకంగా వ్యవహరించేవారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.చదవండి: మా శత్రువులను ఓడిస్తాం: ఇరాన్ సుప్రీం లీడర్ -
ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ హతం
బీరూట్ : హిజ్బుల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఇప్పటికే సోమవారం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హత మార్చగా.. మంగళవారం హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ ప్రాణాలు తీసినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరూట్‌లో దక్షిణ శివారు ప్రాంతమైన దహియే జిల్లాలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇబ్రహీం ఖుబైసీ మరణించారని తెలుస్తోంది. ఆయన మరణంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.హిజ్బుల్లా రాకెట్,క్షిపణి విభాగానికి కమాండర్ ఇబ్రహీం ఖుబైసీపై దాడి జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో ఐదుమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా,లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సోమవారం మరణించిన వారి సంఖ్య 558కి పెరిగింది. అదే సమయంలో, 1835 మంది తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ తెలిపారు.🔴LEBANON 🇱🇧-ISRAEL 🇮🇱| Several sources claim that one of the Hezbollah Commander, Ibrahim #Qubaisi, was killed during an Israeli airstrike on Tuesday 09/24 in Dahiya, #Beirut. Ibrahim Qubaisi was until then the commander of #Hezbollah's rocket division. #MiddleEastTensions pic.twitter.com/iKJpGaNZ6c— Nanana365 (@nanana365media) September 24, 2024చదవండి : వ్యతిరేకిస్తే అంతే.. న్యూస్ లైవ్ టెలీకాస్ట్‌లో జర్నలిస్ట్‌పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి -
ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ అకీల్ మృతి?
బీరుట్: వాకీటాకీల పేలుళ్లతో మొదలైన ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఘర్షణ రోజురోజుకూ క్షిపణులు, డ్రోన్ల దాడులతో మరింత ముదురుతోంది. శుక్రవారం తమ ఉత్తర సరిహద్దు ప్రాంతాలపై హెజ్బొల్లా దాడులు చేసినందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ఏకంగా లెబనాన్ దేశ రాజధాని బీరుట్ నగర సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. శుక్రవారం సాయంత్రం బీరుట్కు దక్షిణాన ఉన్న దహియే జిల్లాలోని జన సమ్మర్ద జామాస్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో 12 మంది చనిపోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 66 మంది గాయపడ్డారు. హెజ్బొల్లాకు గట్టిపట్టున్న ఈ ప్రాంతంపై జరిగిన ఈ దాడిలో ఒక బహుళ అంతస్తుల భవంతి నేలమట్టమైంది. మృతుల సంఖ్య పెరిగే వీలుంది. హెజ్బొల్లా సీనియర్ మిలటరీ అధికారి, ఆపరేషన్స్ కమాండర్ ఇబ్రహీం అకీల్ సైతం చనిపోయారని ఇజ్రాయెల్ పేర్కొంది. అకీల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని ప్రకటించింది. హెజ్బొల్లా ‘రద్వాన్ ఫోర్స్’ సాయుధ యూనిట్‌తో ఇతను సమావేశం అయిన సందర్భంగా దాడి చేసి అంతమొందించామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి అవిచాయ్ అడ్రేయీ చెప్పారు. అయితే అకీల్, ఇతర కమాండర్ల మరణాన్ని హెజ్బొల్లా ధృవీకరించలేదు. అయితే అదే ప్రాంతంలో అకీల్ ఉన్నమాట వాస్తవమేనని హెజ్బొల్లా అధికార ప్రతినిధి చెప్పారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. జూలైలో జరిపిన దాడుల్లో సీనియర్ హెజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ చనిపోయారు. 170 రాకెట్లతో విరుచుకుపడిన హెజ్బొల్లాహెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాహ్ గురువారం టెలివిజన్ ప్రసంగం వేళ తమ రాకెట్ లాంఛర్లను ఇజ్రాయెల్ దాడి చేసి ధ్వంసం చేసినందుకు ప్రతిగా హెజ్బొల్లా శుక్రవారం ఉదయం ఉత్తర ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగింది. ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల రక్షణ స్థావరాలు, బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలపైకి హెజ్బొల్లా పలు దఫాల్లో 170 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇందులో జరిగిన ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఎవరీ ఇబ్రహీం అకీల్? రద్వాన్ ఫోర్స్ ఆపరేషన్స్ కమాండర్. గతంలో హెజ్బొల్లా అత్యున్నత సాయుధ విభాగం ‘జిహాద్ కౌన్సిల్’ సభ్యుడు. ఇతనిపై అమెరికా గతంలోనే ఆంక్షలు విధించింది. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, నావికాదళ బ్యారెక్‌లపై ఉగ్రదాడుల్లో 300 మందికిపైగా చనిపోయారు. వీటిలో అకీల్ పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తోంది. 1980 దశకంలో కొందరు జర్మన్లు, అమెరికన్లను బంధించాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. తహ్సీన్ అనే మారుపేరుతో తిరిగే ఇతని వివరాలు చెప్పినా, పట్టిచి్చనా రూ.58 కోట్లు ఇస్తానని గతేడాది అమెరికా నజరానా ప్రకటించింది. 2019లోనే ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. -
ఇజ్రాయెల్ హీరో? ఎవరీ అర్నాన్ జమోరా
హమాస్ చెరలో బంధీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ కఠినమైన ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు ఐడీఎఫ్ కమాండర్ అర్నాన్ జమోరా ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. హమాస్ మెరుపు దాడుల నుంచి విరోచిత పోరాటం చేసి ప్రాణాలొదిన అర్నాన్ జమెరాను ఇజ్రాయెల్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ పౌరులు హీరోగా కీర్తిస్తున్నారు. శనివారం హమాస్ చెరలో బందీలుగా ఉన్న నావో అర్గమణి, అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్‌లను ఇజ్రాయెల్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ (యమమ్)కమాండర్, టాటికల్ ఆపరేటర్ అర్నాన్ జమోరా నుసిరత్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి వారిని రక్షించారు. ఈ తరుణంలో ప్రత్యర్ధుల దాడిలో కమాండర్ అర్నాన్ జమెరా ప్రాణాలొదారు. తాజాగా, ఆయన మరణంపై ఇజ్రాయెల్ మరణంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది.Behind every rescue mission, are Israeli men and women who risk their lives. We are devastated to share that Chief Inspector Arnon Zamora, commander and tactical operator in the Yamam (National Police Counter-Terrorism Unit), who was critically wounded in the operation to… pic.twitter.com/4P3qRre7Ia— Israel Foreign Ministry (@IsraelMFA) June 8, 2024బాధకలిగించిందిప్రతి రెస్క్యూ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ సైనికులు తమ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడిన యమమ్ (నేషనల్ పోలీస్ కౌంటర్-టెర్రరిజం యూనిట్)లో కమాండర్,టాక్టికల్ ఆపరేటర్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్నాన్ జమోరా ప్రాణాలొదలడం బాధకలిగించిందని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్లో పేర్కొంది.అర్నాన్ జమోరా ఎవరు?ఇజ్రాయెల్ మీడియా సంస్థ హారెట్జ్ ప్రకారం..ఇజ్రాయెల్ నగరం స్డెరోట్ సమీపంలో జమోరా స్డే డేవిడ్ గ్రామానికి చెందిన వారు. ఆయనకు భార్య మిచాల్ ఇద్దరు పిల్లలు, అతని తల్లిదండ్రులు రూవెన్ రూతీలతో కలిసి ఉంటున్నారు.ఇక జమెరా గతేడాది అక్టోబర్ 7 న యాద్ మొర్దెచాయ్ ప్రాంతంలో అనేక మంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ జామెరా ధైర్య సహాసాల్ని గుర్తు చేసుకున్నారు. గాజాలో హమాస్ చేతిలో ఉన్న 4 మంది బందీలను రక్షించడానికి సాహసోపేతమైన ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన అర్నాన్ జమోరా మృతిపై విచారం వ్యక్తం చేశారు. -
Chhattisgarh Encounter: ఎన్కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు
ఆత్మకూరు రూరల్ (నంద్యాల జిల్లా) / సాక్షి ప్రతినిధి, వరంగల్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ లేరని బస్తర్ ఐజీ సుందర్రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల వెల్లడించారు. బుధవారం రాత్రి వరకు 8 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్, ఆయన భార్య ఉన్నారని చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని, వారిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారని చెప్పారు. ఘటన స్థలంలో ఏకే–47, ఎల్ఎంజీ, ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల్లో చిన్నన్న లేడని ధ్రువీకరించిన సోదరులు ఈ ఎన్కౌంటర్లో సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే నంద్యాల పోలీసులు చూపించిన ఎన్కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్‌నంద్‌గావ్ – కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గుర్తించిన మృతులు 1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు, మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ 2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు 3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్చార్జి 4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ 6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్తాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్ 9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ -
ఇజ్రాయెల్ దాడి సక్సెస్.. హమాస్ టాప్ కమాండర్ హతం!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు గట్టి ఎదరుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ టాప్ కమాండర్ మర్వాన్ ఇస్సా మృతిచెందాడు. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలివన్ ప్రకటించారు. ఈ అంశంపై జేక్ సలివన్ తాజాగా మాట్లాడుతూ..‘హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. మిలిటెంట్ల కీలక బెటాలియన్లపై దాడులు చేయడమే కాకుండా టాప్ కమాండర్లతో సహా వేలమంది ఫైటర్లను ఇజ్రాయెల్ హతమార్చింది. గతవారం ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ గ్రూప్ మూడో ర్యాంక్ కమాండర్ మార్వాన్ ఇస్సా మృతిచెందాడు. మిగతా టాప్ కమాండర్లు టన్నెల్స్‌లో దాక్కున్నారు’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల వేల సంఖ్యలో పౌరులు, హమాస్ నేతలు మృత్యువాడపడ్డారు. కాగా, సెంట్రల్ గాజాలోని ఒక భూగర్భ సొరంగంలో దాక్కున్న ఇస్సా లక్ష్యంగా మార్చి 11న దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. దీంతో, ఇస్సా మృతి ఇజ్రాయెల్‌కు అతిపెద్ద విజయంగా వారు భావిస్తున్నారు. U.S. National Security Advisor, Jake Sullivan has announced that according to recent Intelligence an Israeli Airstrike on March 11th resulted in the Successful Elimination of Marwan Issa, the Deputy Commander of Hamas’s Al-Qassam Brigades and Right-Hand Man to Mohammed Deif. pic.twitter.com/4w2Tg65ias — Narendra Maurya (@narendra483) March 19, 2024 అయితే, హమాస్ మిలిటరీ అధిపతి మహమ్మద్ దీఫ్ డిప్యూటీగా ఇస్సాను పేర్కొంటారు. మిలిటరీ కార్యకలాపాల్లో ఇస్సా చాలా చురుకుగా ఉండేవాడని, అక్టోబర్ 7 నాటి మారణకాండలో కీలకపాత్ర పోషించాడని ఇజ్రాయెల్ భావిస్తోంది. మరోవైపు.. ఈ దాడుల్లో మృతిచెందింది ఇస్సానా? కాదా? అనే వివరాలు తెలియాల్సి ఉందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి రేర్ అడ్మిరల్ డానియేల్ హగరీ పేర్కొన్నారు. “Hamas’ number three, Marwan Issa, was killed in an Israeli operation last week,” Jake Sullivan, President Biden’s national security adviser at a White House briefing 3/18/2024 4:20 PM PDT pic.twitter.com/pPtJSyltfi — Boaz Guttman בועז גוטמן (@boazgu1) March 18, 2024 -
Anny Divya: దివ్యమైన విజయం
స్త్రీల కలలు తరచు సామాజిక నిబంధనల మధ్య పరిమితం అవుతుంటాయి. అలాంటి ప్రపంచంలో అనీ దివ్య అసమానతలను ధిక్కరించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో పుట్టి, విజయవాడలో పెరిగిన అనీ దివ్య... బోయింగ్ 777 ను నడిపి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా కమాండర్‌గా పేరు పొందింది. ‘మహిళా కమాండర్లలో అతి పిన్నవయస్కురాలిగా చేరాలని కలలు కనలేదు. కానీ, అభిరుచి, అంకితభావం ఆమె కలను సాకారం చేశాయి’ అని చెప్పే ముప్పై ఏడేళ్ల దివ్య... మహిళా శక్తి అంటే ఏమిటో తన విజయగాధ ద్వారా మనకు పరిచయం చేస్తుంది. ‘అమ్మాయిలు పెద్దగా కలలు కనడానికి వీలులేని ప్రదేశం నుండి వచ్చాను’ అని చెప్పే దివ్య 11వ తరగతి వరకు సాధారణ విద్యార్థిని. ఆమె తన కలను సాకారం చేసుకోవడానికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం తప్పనిసరి అని తెలుసుకుంది. అడ్డంకులను అధిగమించాలని నిశ్చయించుకుని, సవాల్‌ను ఎదుర్కొంది. అదే సంవత్సరంలో అన్ని సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు స్కోర్ చేసింది. దీంతో ఆమె కలలు స్పష్టంగా ఉన్నాయి అని కుటుంబ సభ్యులకూ అర్ధమైంది. కానీ, ముందుకు వెళ్లే మార్గం సులభంగా లేదు. అందుకు తగినంత ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు. కానీ, ఆమె తండ్రి ఫ్లయింగ్ స్కూల్ ఫీజు కోసం రుణం తీసుకున్నాడు. దీంతో ఆమె అసలు ప్రయాణం మొదలైంది. 17 ఏళ్ల వయసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఫ్లయింగ్ స్కూల్లో చేరింది. 19 ఏళ్ల వయసులో కమర్షియల్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌గా నిలిచింది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఎయిర్ ఇండియాలో కో–పైలట్‌గా చేరింది. 21 ఏళ్ల వయసులో ట్రైనింగ్ కోసం లండన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె బోయింగ్ 777ను నడపడం ప్రారంభించింది. పైలట్‌గానే కాదు కెప్టెన్ దివ్య మోటివేషనల్ స్పీకర్ కూడా. విమానయాన రంగంలో తన అనుభవాలు, సవాళ్లను వేదికలపై స్పీచ్లుగా ఇచ్చింది. ముంబై రిజ్వీ లా కాలేజీ నుండి ఎల్ఎల్బీ పట్టా కూడా పొందింది. ఎగతాళి చేసేవారు ‘‘నాన్న ఆర్మీలో ఉద్యోగి అవడంతో మా కుటుంబం పఠాన్‌కోట్‌లో ఉండేది. నేను అక్కడే పుట్టాను. నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విజయవాడలో స్థిరపడ్డారు. అలా, నా స్కూల్ చదువు మొత్తం విజయవాడలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనే కోరిక ఉండేది. ఇది తెలిసి ఇతర పిల్లలు నన్ను ఎగతాళి చేసేవారు. పిల్లల్లో చాలామంది ఇంజనీరింగ్ లేదా డాక్టర్ కావా లనే అనుకునేవారు. అదృష్టవశాత్తు నా ఎంపికకు నా తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు. మా అమ్మ ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేది. అయితే, పైలట్ కావాలనే నా నిర్ణయాన్ని బంధువులు, కుటుంబ స్నేహితులు వ్యతిరేకించేవారు. ఇది అమ్మాయిలకు తగిన వృత్తిగా అనుకునేవారు కాదు. సవాల్‌గా తీసుకున్నాను.. ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చు. కానీ, ఇంగ్లీషులో మాట్లాడటం అనేది సమస్యగా ఉండేది. దీంతో ట్రైనింగ్ కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచీ తోటి వారి హేళనకు గురయ్యాను. ఒక చిన్న పట్టణం నుండి వెళ్లడం, ఇంగ్లీషులో పట్టులేకపోవడంతో మొదటి రోజు నుండి సవాళ్లు ఎదురయ్యాయి. చాలాసార్లు మా సీనియర్లు క్లాస్ బయటకు పిలిచి ర్యాగ్ చేసేవారు. ఈ సమస్యను అధిగమించాలంటే ముందు నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకున్నాను. అందుకు సెలవుల్లో నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆంగ్లంలో మాట్లాడటానికి మంచి పట్టు సాధించాను. ట్రైనింగ్ పూర్తయ్యే సమయానికి స్కాలర్షిప్ కూడా వచ్చింది. సాధించినప్పుడే మన శక్తి బయటకు తెలుస్తుంది ప్రపంచంలోనే బి777 మహిళా కమాండర్లలో అతి పిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకున్నందుకు గర్వంగా ఉంది. నడిచొచ్చిన దారిని చూసుకుంటే అన్నింటిని ఎలా అధిగమించాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఎవరి ప్రయాణమూ అంత సాఫీగా సాగదు. ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయి. ఆ కష్టాలను దాటుకొని వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. మనలోని ఆత్మ విశ్వాసం బయటకు కనిపిస్తుంది. కలలు సామాజిక అంచనాలకు, ఆర్థిక పరిమితులకు పరిమితం కాదని ఆ శక్తి గుర్తు చేస్తుంది. ఒక చిన్న పట్టణం నుండి ఏవియేషన్ కమాండింగ్ ఎత్తుల వరకు ఎదగడంలో నా బలహీనతలపై చాలా పోరాటం చేశాను’’ అని వివరిస్తుంది కెప్టెన్ అనీ దివ్య. -
ఎవరీ ప్రేరణ దేవస్థలి? ఏకంగా యుద్ధ నౌకకే..!
మహిళలు ఏ రంగంలోనై అలవోకగా దూసుకోపోగలరు అని రుజువు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని రంగాలు పురుషులు మాత్రమే నెగ్గుకు రాగలరు అన్న దృక్పథాన్ని మార్చి అత్యంత కఠినతరమైన పనును కూడా చేయగలమని నిరూపించారు చాలామంది మహిళామణులు. ఫైర్ ఫైటర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు వివిధ రంగాల్లో తామెంటో నిరూపించుకున్నారు. మహిళ తలుచుకుంటే దేన్నేనా సాధించగలదు. ఆఖరికి యుద్ధ రంగంలో కూడా పురుషుడితో సమానంగా దాడి చేయలగలదు అనే ఆలోచనకు తెర తీసింది. ఇప్పుడిప్పడే మహిళలకు సాయుధ రంగంలో అవకాశాలు వస్తున్నాయి. ఇక యుద్ధ నౌకలకు ఇప్పటి వరకు షురుషులే కమాండర్‌గా విధులు నిర్విర్తించగా, ఇప్పుడు ఆ అత్యనన్నత అధికారం ఓ మహిళ చేపట్టి అందరికి ప్రేరణగా నిలిచింది. వివరాల్లోకెళ్తే..భారత నావికదళ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిణిగా నిలిచింది 'ప్రేరణ దేవస్థలీ'. పేరుకు తగ్గట్టుగానే అందరికి ప్రేరణగా నిలిచింది. అంచెలంచెలుగా భారత నావికదళంలో ఉన్నత పదవులను అలంకరించింది. ఆమె ప్రస్తుతం చైన్నైలోని యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌కి ఫస్ట్ లెఫ్టినెంట్ హోదాలో పనిచేస్తోంది. ఆమె ఇప్పుడు ఓ యుద్ధ నౌకకే నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ఈ మేరకు వెస్ట్రన్ ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ ప్రవీణ్ నాయర్ నుంచి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఇలా ఓ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళగా ప్రేరణ దేవస్థలి నిలిచింది. ఆమె ఇప్పుడు ఇండియన్ నేవీ వెస్ట్రన్ ఫ్లీట్‌లో వాటర్ జెట్ ఫ్యాక్ ఐఎన్ఎస్ ట్రింకాట్ కమాండింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించనుంది. ఆమె లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో ఉండగా, టుపోలెవ్ టీయూ-42లో సముద్ర నిఘా విమానాల అబ్జర్వర్‌గా గుర్తింపు పొందారు. ఆమె 2009లో భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ఆమె సోదరుడు, భర్త కూడా నావికదళ అధికారులే కావడం విశేషం. ప్రేరణ ఈ అత్యున్నత హోదాని దక్కించుకుని మహిళలు పురుషులకు ఎందులోనూ తీసిపోరు అని ప్రూవ్ చేసింది. Lt Cdr Prerna Deosthalee, First Lt #INSChennai, on being selected as Commanding Officer of Waterjet FAC #INSTrinkat, was presented the appointment letter by #FOCWF RAdm Praveen Nair. She would be the first woman officer of @indiannavy to command an Indian Naval Warship@IN_WNC pic.twitter.com/mPTS1UjpNd — The Sword Arm (@IN_WesternFleet) December 2, 2023 (చదవండి: అక్కాచెల్లెళ్ల హెల్త్ఫుల్ సప్లిమెంట్స్!) -
పాక్‌లో అంగతకుల కాల్పులు.. లష్కరే తోయిబా మాజీ కమాండర్ మృతి
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్‌లో కాల్చి చంపారు. అక్రమ్ ఖాన్ అలియాస్ అక్రమ్ గాజీ.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లాలో గురువారం అంగతకుల కాల్పుల్లో మరణించారు. కాగా అక్రమ్ ఖాన్ 2018 నుంచి 2020 వరకు ఎల్ఈటీ రిక్రూట్మెంట్ సెల్‌కు నాయకత్వం వహించారు. పాక్‌లో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా అతడు పేరుగాంచారు. అక్రమ్ చాలా కాలంపాటు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అతను ర్రికూట్‌మెంట్ సెల్ అధిపతిగా ఉన్న సమయంలో సానుభూతిగల వ్యక్తులను గుర్తించి వారిని ఉగ్రవాద సంస్థలో చేర్చుకోవడంలో కీలకపాత్ర వహించారు. ఇదిలా ఉండగా గత నెల అక్టోబర్‌లో పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లో హత్యకు గురైన విషయం విదితమే. పంజాబ్‌లోని సియాల్ కోట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. గుజ్రాన్వాలా నగరానికి చెందిన లతీఫ్.. భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరు. 2016 జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికి మాస్టర్‌మైండ్ లతీఫే. చదవండి: Israel-Hamas conflict: గాజా సిటీపై దండయాత్ర -
ఎటువంటి ఆధారాలు లేవు..నేవీ మాజీ అధికారి సుగుణాకర్ బంధువు షాకింగ్ నిజాలు..!
-
హమాస్‌లో ‘మ్యాన్ ఆఫ్ డెత్’ ఎవరు? టాప్ కమాండర్ల పనేమిటి?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య 4 వేలు దాటింది. ఇజ్రాయెల్ హమాస్‌ను పూర్తిగా మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే పాలస్తీనా అంతటా భీకర దాడులు కొనసాగుతున్నాయి. కాగా హమాస్ ఉగ్ర సంస్థను ఎవరు నడుపుతున్నారు? ఈ గ్రూప్‌లోని ‘మోస్ట్ వాంటెడ్’గా ఉన్నవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హమాస్ అనేది పాలస్తీనా ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ సభ్యులు గాజాపై ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఇక్కడి ప్రజల మధ్య వారు రహస్యంగానే ఉంటూనే సొంత సైన్యాన్ని సిద్ధం చేస్తారు. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంటారు. ఇటువంటి దాడులకు ఇరాన్ బహిరంగంగా హమాస్‌కు సహాయం చేస్తున్నదనే వార్తలు వినిపిస్తుంటాయి. హమాస్‌లో వేర్వేరు విభాగాలు ఉన్నాయి. దీనిలో అత్యంత ప్రమాదకరమైనది సైనిక విభాగం. పలు దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. హమాస్ సైనిక కమాండర్ల జాబితాలో మహ్మద్ దీబ్ అల్ మస్రీ పేరు వినిపిస్తుంది. ఇతనిని అబూ ఖలీద్ అని కూడా అంటారు. అబూ ఖలీద్ హమాస్ సైనిక సంస్థ ఐజే అల్ దిన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్‌కు అధిపతి. ఇజ్రాయిలీలు ఈ ప్రమాదకరమైన కమాండర్‌ను ‘మ్యాన్ ఆఫ్ డెత్’ అని పిలుస్తారు. హమాస్‌లో వినిపించే మరో నేత పేరు మార్వాన్ ఇస్సా, అతను టాప్ మోస్ట్ కమాండర్లలో ఒకడు. అతను ఐజే అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్‌కు డిప్యూటీ కమాండర్. మార్వాన్ ఐదేళ్లుగా ఇజ్రాయెల్ చెరలో ఉన్నాడు. ఇజ్రాయెల్‌పై దాడులు చేయడంలో కీలకపాత్ర వహించాడని చెబుతారు. హమాస్ టాప్ కమాండర్లలో మరొకని పేరు యాహ్యా సిన్వార్. ఇతను హమాస్ పొలిటికల్ బ్యూరోను పర్యవేక్షిస్తుంటాడు. అమెరికా బ్లాక్ లిస్టులో సిన్వార్ పేరు చేరింది. సిన్వార్ హమాస్ భద్రతా సేవ మజ్ద్‌కు అధిపతి కూడా. హమాస్ చేపట్టే దాడులకు సంబంధించిన వ్యూహాలను రూపొందించడంలో ఇతను కీలకంగా వ్యవహరిస్తుంటాడు. ఇది కూడా చదవండి: యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు? -
బైడెన్ శునకాన్ని వైట్‌హౌజ్ నుంచి వెళ్లగొట్టిన అధికారులు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ శునకం 'కమాండర్' వైట్ హౌజ్‌లో సిబ్బందిని తరచూ కరుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా ఓ అధికారిని కరిచి వార్తల్లోకెక్కింది. అయితే.. ఈ శునకాన్ని వైట్‌హౌజ్ నుంచి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని ప్రదేశానికి ఆ శునకాన్ని పంపించినట్లు వైట్‌హౌజ్ అధికారులు తెలిపారు. 2021లో కమాండర్‌ను బైడెన్ వైట్‌హౌజ్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి కనీసం 11 సార్లు అది సిబ్బందిని కరిచినట్లు వార్తలు వచ్చాయి. బైడెన్ వద్ద అంతకుముందు ఉన్న మేజర్ అనే శునకంపై కూడా ఇదే తరహా కేసులు నమోదు కావడంతో దాన్ని కూడా వైట్ హౌజ్ నుంచి బయటకు పంపించారు. అయితే.. ప్రస్తుతం కమాండర్‌ను ఎక్కడికి పంపించారో వివరాలు మాత్రం బయటికి వెళ్లడించలేదు. కమాండర్ రక్షణలో ఎంతో శ్రద్ధ కనబరిచిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని జిల్ బైడెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్ ప్రశంసించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు -
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్: లష్కరే తోయిబా కమాండర్ హతం
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ అనంతనాగ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజ్జైర్ ఖాన్ హతమయ్యాడు. ఈ మేరకు ఏడు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌కు ముగింపు పలికినట్లు సైన్యం వెల్లడించింది. ఉజ్జైర్ ఖాన్‌తో పాటు మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమయినట్లు ఏడీజీపీ పోలీసు వినయ్ కుమార్ తెలిపారు. పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతనాగ్‌లో ఏడు రోజులుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగింది. అటవీ ప్రాంతాల్లో, కొండ చరియల్లో నక్కి ఉన్న టెర్రరిస్టుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం సైన్యంపై ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఆర్మీ జవాన్ కిడ్నాప్.. హత్య -
సీఎం జగన్‌తో తూర్పు తీర రక్షక దళ కమాండర్ భేటీ
సాక్షి, తాడేపల్లి: తూర్పు తీర రక్షక దళ కమాండర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తూర్పు తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లపై ఈ భేటీలో చర్చ జరిగింది. సవాళ్లను అధిగమించేందుకు తీర రక్షకదళం చేపట్టిన చర్యలను సీఎం జగన్‌కు వివరించారు ఏడీజీ పరమేశ్ శివమణి. అలాగే సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారులు డీఐజీ యోగేంధర్ ఢాకా, కమాండెంట్ కే.మురళి, డిప్యూటీ కమాండెంట్ ఏబి.రామమ్ కూడా ఉన్నారు. -
Captain Shiva Chouhan: సియాచిన్ పై వీర వనిత
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ దళాధిపతిగా నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన కెప్టెన్ శివ చౌహాన్ ఈపోస్ట్ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రయినింగ్‌ను పూర్తి చేశారు. శివ చౌహాన్ వివరాలు. గతంలో సియాచిన్‌కు విధి నిర్వహణకు పంపే సైనికులతో అధికారులు ‘మీరు ముగ్గురు వెళితే ఇద్దరే తిరిగి వస్తారు’ అని హెచ్చరించి పంపేవారు. ‘ఇద్దరే తిరిగి వచ్చినా దేశం కోసంపోరాడతాం’ అని సైనికులు సమరోత్సాహంతో వెళ్లేవారు. అయితే వారి ప్రథమ శత్రువు పాకిస్తాన్ కాదు. ప్రతికూలమైన ప్రకృతే. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, తీవ్రమైన చలి గాలులు, హిమపాతం, కాలు జారితే ఆచూకీ తెలియని మంచులోయలు... సియాచిన్‌లో 35 అడుగుల ఎత్తు మేరకు కూడా మంచు పడుతుందంటే ఊహించండి. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధస్థావరమైన సియాచిన్ అటు పాకిస్తాన్ నుంచి ఇటు చైనా నుంచి రక్షణ ΄పొందడానికి ఉపయోగపడే కీలక్రపాంతం. అక్కడ ఇన్నాళ్లు మగవారే విధులు నిర్వహించారు. మొదటిసారి ఒక మహిళా ఆఫీసర్ అడుగు పెట్టింది ఆమె పేరే శివ చౌహాన్. 1984 నుంచి దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏమాత్రం వీలు లేని సియాచిన్ ్రపాంతాన్ని అటు పాకిస్తాన్ కాని ఇటు ఇండియాగాని పట్టించుకోలేదు. కాని 1984లో దాని మీద ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని తెలుసుకున్న భారత్ సియాచిన్ అధీనం కోసం హుటాహుటిన రంగంలో దిగి ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో విజయవంతమైన సైనిక చర్య చేయగలిగింది. ఆ తర్వాత 1999 వరకూ ఇరు పక్షాల మధ్య చర్యలు, ప్రతిచర్యలు సాగాయి. ‘వాస్తవ మైదాన స్థానరేఖ’ను ఇరుపక్షాలు అంగీకరించి అక్కడ సైనిక స్థావరాలు నిర్మించుకున్నా మంచు ఖండం వంటి సియాచిన్ మీద భారత్ గాని, పాకిస్తాన్‌గాని తన స్థావరాలను తీసేయలేదు. ఇప్పటివరకూ ఇరువైపులా అక్కడ 2000 మంది సైనికులు మరణించారని అంచనా. వారిలో ఎక్కువ మంది కేవలం ప్రతికూల వాతావరణానికే మరణించారు. సైనిక కాల్పుల్లో కాదు. అడుగు పెట్టిన ఆఫీసర్ సంప్రదాయిక విధానాలతోనే నడిచే ఇండియన్ ఆర్మీ మహిళల ప్రవేశాన్ని అన్నిచోట్ల అంగీకరించరు. ఇంతవరకూ 9000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ వరకే మహిళా ఆఫీసర్లను అనుమతించింది ఆర్మీ. కాని 15000 అడుగుల నుంచి 20 వేల అడుగుల (బాణాసింగ్ బంకర్) ఎత్తు వరకూ సియాచిన్‌లో వివిధ స్థానాలలో ఉండే స్థావరాలకు మహిళా ఆఫీసర్లను పంపలేదు. మొదటిసారిగా శివ చౌహాన్‌కు ఆర్మీ సియాచిన్ హెడ్క్వార్టర్స్లోపోస్టింగ్ ఇచ్చింది. రాజస్థాన్ సాహసి శివ చౌహాన్‌ది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. 11వ ఏట తండ్రి మరణిస్తే గృహిణి అయిన తల్లి శివ చౌహాన్‌ను పెంచింది. ‘మా అమ్మే నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ మీద ఆసక్తి కలిగించింది’ అంటుంది శివ. ఉదయ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శివ 2020 సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు రాసి ఆలిండియా మొదటి ర్యాంకు సాధించింది. చెన్నైలో ట్రైనింగ్ అయ్యాక 2021లో లెఫ్టినెంట్‌గా ఇంజనీర్ రెజిమెంట్‌లో బాధ్యత తీసుకుంది. ఆ వెంటనే కెప్టెన్ హోదా ΄పొందింది. 2022 కార్గిల్ దివస్ సందర్భంగా సియాచిన్ వార్ మెమోరియల్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు 508 కిలోమీటర్ల సైకిల్ యాత్రను శివ చౌహాన్ తన నాయకత్వంలో పూర్తి చేయడంతో ఆమె అధికారుల దృష్టిలో పడింది. దాంతో ఆమెను సియాచిన్‌లో టీమ్ లీడర్గాపోస్ట్ వరించింది. త్రివిధ దళాలలో చరిత్ర సృష్టిస్తున్న స్త్రీల సరసన ఇప్పుడు శివ చౌహాన్ నిలిచింది. కఠిన శిక్షణ సియాచిన్‌లో ఏ స్థావరంలో విధులు నిర్వహించాలన్నా సియాచిన్ హెడ్‌క్వార్టర్స్‌లోని బేటిల్ స్కూల్లో మూడు నెలల శిక్షణ పూర్తి చేయాలి. మిగిలిన మగ ఆఫీసర్లతో పాటు శివ ఈ శిక్షణను పూర్తి చేసింది. ఇందులో కఠినమైన మంచు గోడలను అధిరోహించడం, మంచులోయల్లో పడినవారిని రక్షించడం, శారీరక ఆరోగ్యం కోసం డ్రిల్ పూర్తి చేయగలగడం వంటి అనేక ట్రయినింగ్లు ఉంటాయి. ‘ఆమె శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. మూసను బద్దలు కొట్టింది’ అని ఆర్మీ అధికారులు అన్నారు. -
ఫిజీ ప్రధానిగా రబుకా
మెల్బోర్న్: ఫిజీ ప్రధానిగా మాజీ మిలటరీ కమాండర్ సిటివెని రబుకా (74) శనివారం ప్రమాణం చేశారు. పీపుల్స్ అలయెన్స్ పార్టీకి చెందిన ఆయన మరో రెండు పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 14వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. 16 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న ఫ్రాంక్ బైనిమరామ వైదొలిగేందుకు నిరాకరించడంతో ఉత్కంఠ కొనసాగింది. పార్లమెంట్లో విశ్వాస తీర్మానంలో రబుకా ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఫిజీలో గత 35 ఏళ్లలో నాలుగుసార్లు సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. -
నవ వధువుని మిలటరీ హెలికాప్టర్లో తీసుకెళ్లిన కమాండర్! ఆగ్రహించిన ప్రజలు
Commander landing near the bride's house: తాలిబన్ కమాండర్ నవ వధువుని ఇంటికి తీసుకెళ్లేందుకు మిలటరీ హెలికాప్టర్ని ఉపయోగించారంటూ ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మీడియా కథనం ప్రకారం... ఒక తాలిబన్ వ్యక్తి నవ వధువుని తీసుకుని మిలటరీ చాపర్‌లో పయనించాడని అఫ్గాన్ స్థానిక మీడియా పేర్కొంది. అతను తన భార్యను తీసుకుని ఆ చాపర్‌లో అప్గనిస్తాన్‌లోని లోగర్ నుంచి ఖోస్ట్ ప్రావిన్స్ వెళ్లినట్లు తెలిపింది. పైగా ఆ వ్యక్తిని హక్కాని శాఖ కమాండర్‌గా పేర్కొంది. అంతేకాదు ఆ కమాండర్ నవవధువు ఇంటి దగ్గర హెలికాప్టర్ నుంచి దిగుతున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యక్తి ఆమెని వివాహం చేసుకునేందుకు తన మామగారికి దాదాపు రూ. 10 లక్షలు పైనే చెల్లించాడని వెల్లడించింది. అంతేగాక ఆ వ్యక్తి ఖోస్ట్‌లో నివశిస్తున్నాడని, అతని భార్య పుట్టిల్లు లోగర్‌లోని బార్కి బరాక్ జిల్లాలో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయంటూ కథనాలు వచ్చాయి. ఈ విషయమై తాలిబన్ డిప్యూటి అధికార ప్రతినిధి ఖారీ యూసుఫ్ అహ్మదీ స్పందిస్తూ... ఆ వ్యాఖ్యలను ఖండించారు. సేనాధిపతి చేసిన వ్యాఖ్యలను శత్రువులు చేస్తున్న తప్పుడూ ప్రచారంగా పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఆరోపణలను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ తోసిపుచ్చింది కూడా. ఐతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు ఈ చర్యను ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఇది ప్రజా ఆస్తులను దుర్వినియోగపరచడం కిందకే వస్తుందంటూ ప్రజలు పెద్ద ఎత్తున మండిపడ్డారు. -
మా ఎంపిక సరైనదే అంటూ చైనా కొత్త పల్లవి
Winter Olympic 2022: వింటర్ ఒలంపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌లోయ ఘర్షణతో సంబంధం ఉన్న సైనికుడిని ఎంపిక చేయడాన్ని చైనా సమర్థించుకుంది. సదరు సైనికుడిని ప్రమాణాలకు అనుగుణంగా ఎంచుకున్నామని తెలిపింది. ఇందులో రాజకీయ దురుద్దేశాలు చూడవద్దని కోరింది. గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన కమాండర్ క్వి ఫాబావోను చైనా టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. దీనికి నిరసనగా వింటర్ ఒలంపిక్స్ ఆరంభోత్సవాలను భారత్ బహిష్కరించింది. యూఎస్ సైతం చైనా చర్యను తప్పుబట్టింది. అయితే ఇది కేవలం ముందుగా అనుకున్న ప్రమాణాలకు లోబడి తీసుకున్న నిర్ణయమని చైనా విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఝావో లిజియన్ చెప్పారు. ఈ విషయాన్ని భారత్ హేతుబద్ద దృష్టితో చూడాలని, అనవసర రాజకీయ విమర్శలు చేయవద్దని కోరారు. అయితే ఒలంపిక్స్లాంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం చైనా కోరికని భారత ప్రతినిధి బాగ్చీ విమర్శించారు. -
శ్వేతసౌధానికి కొత్త గెస్ట్
అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్‌కు కొత్త అతిథి వచ్చారు. అదేంటి అధ్యక్ష నివాసమన్నాక నిత్యం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా అంటారా! అలా కాదు ఈ గెస్ట్ వెరీ స్పెషల్. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో చూద్దామా! గెస్ట్ పేరు కమాండర్. అధ్యక్షుల వారి పెంపుడు శునకం. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ శునకాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌కు 79వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు జేమ్స్ బైడెన్ బహుమతిగా ఇచ్చారు. సెప్టెంబర్ 1న పుట్టిన ఈ శునకం ఇటీవల శ్వేతసౌధంలో అడుగిడింది. బైడెన్ వచ్చాక వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన మూడో శునకం ఇది. ఇంతకుముందు బైడెన్ దంపతులు ఎంతో మురిపెంగా పెంచుకున్న చాంప్ (జర్మన్ షెపర్డ్) గత జూన్‌లో చనిపోయింది. దీంతో బైడెన్ దంపతులు చాలా బాధపడ్డారు. దీంతో ఆయన సోదరుడు కమాండర్‌ను ఇచ్చారు. ఇదిగాకుండా బైడెన్‌కు మేజర్ అనే మరో శునకం కూడా ఉండేది. దీనికి కోపం చాలా ఎక్కువట. అది వైట్‌హౌస్ సిబ్బందిని, అధికారులను బాగా ఇబ్బంది పెట్టేదట. గత మార్చిలో ఇద్దరిని కరిచేసింది కూడా. దీంతో మేజర్‌ను బైడెన్ తన సొంతూరు అయిన డెలావేర్‌లోని విల్మింగ్టన్కు పంపారని ప్రెస్ సెక్రెటరీ మైకేల్ లారోసా చెప్పారు. కొత్త వాళ్ల మధ్యకాకుండా తెలిసిన వాళ్ల మధ్య ఉంచితేనే అది బాగా ఉంటుందని డాగ్ ట్రైనర్స్ చెప్పడంతో మేజర్‌ను డెలావేర్‌లోనే ఉంచారు. ఇది ఇష్టమొచ్చినట్టు కరవకుండా వైట్‌హౌస్‌లో బుద్ధిగా మసలేందుకు ‘సుదీర్ఘ శిక్షణ’ సైతం ఇప్పించారు. అప్పటినుంచి దాని కోపం కొంచెం మేరకు తగ్గిందని లారోసా చెప్పారు. సెలవుదినాల్లో బైడెన్ విల్మింగ్టన్లో గడుపుతారు. కమాండర్ రాకను బైడెన్ ఎంతగానో ఆస్వాదించారు. ‘కమాండర్.. వైట్‌హౌస్‌కు స్వాగతం’ అని దాని ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. నిత్యం ఒత్తిడితో తలమునకలయ్యే అధ్యక్షుడు ఈ కమాండర్‌తో కాసేపు సరదాగా ఆడుకుంటున్నారు. వైట్‌హౌస్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న పెంపుడు జంతువుల సంప్రదాయాన్ని గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రేక్ చేయగా.. చాంప్, మేజర్లను తెచ్చి బైడెన్ దాన్ని మళ్లీ పునరుద్ధరించారు. కాగా అతి త్వరలో ఒక పిల్లి కూడా వైట్‌హౌస్‌లోకి రానుంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కమాండర్ ఆత్మహత్య
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ జిల్లాలో సీఏఎఫ్ విభాగానికి చెందిన ఓ కమాండర్ మంగళవారం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని కరణ్‌పూర్ సీఏఎఫ్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న 19వ నంబర్ బెటాలియన్ కంపెనీ కమాండర్ సుబీర్సింగ్(43).. తన వద్ద ఉన్న ఇన్శాస్ రైఫిల్‌తో పొట్ట భాగంలో కాల్చుకున్నాడు. దీన్ని గమనించిన ఇతర జవాన్లు వచ్చి చూసేలోపే మృతి చెం దాడు. స్థానిక క్యాంపు అధికారుల సమాచారం మేరకు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. చదవండి: కిరాతకం: అందరూ చూస్తుండగానే.. ఇద్దరు మహిళల పెళ్లి.. సైకోలుగా ప్రవర్తిస్తూ దారుణం -
బారాముల్లా ఎన్కౌంటర్ : లష్కరే కీలక కమాండర్ హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ లష్కరే తోయిబా కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసులతో కూడిన సంయుక్త బృందం లష్కరే కమాండర్ సాజద్ అలియాస్ హైదర్ సహా మరో లష్కరే ఉగ్రవాదిని హతమార్చింది. అంతకుముందు ఉగ్రవాదుల దాడిలో పోలీస్ అధికారితో పాటు ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. దాడి అనంతరం ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది సాజిద్ సహా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఉత్తర కశ్మీర్లో చురకుకుగా పనిచేసే ఉగ్రవాది సాజిద్‌ను హతమార్చామని, ఇక్కడ టాప్ 10 ఉగ్రవాదుల్లో సాజిద్ ఒకడని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. అనతుల్లా మిర్ అనే మరో ఉగ్రవాదిని మట్టుబెట్టామని చెప్పారు. బారాముల్లాలో తాజాగా జరిగిన కాల్పుల్లో ఇద్దరకు జవాన్లకూ గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. చదవండి : బారాముల్లా ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మృతి -
జనరల్ ఆదేశాలతో చైనా దుస్సాహసం
వాషింగ్టన్: చైనా మిలటరీ జనరల్ ఆదేశాలతోనే భారతీయ సైనికులపై గల్వాన్‌లో చైనా సైనికులు దాడి చేశారని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్‌తో గతంలో జరిగిన కొన్ని సరిహద్దు ఘర్షణలను పర్యవేక్షించిన చైనా పశ్చిమ థియేటర్ కమాండ్‌కు అధిపతి జనరల్ ఝావ్ జోంగ్కీ గల్వాన్ దాడికి అనుమతులిచ్చారని నిఘా అధికారి ఒకరు తెలిపారు. అమెరికా దాని మద్దతుదారు భారత్ దోపిడీ నుంచి తప్పించుకోవాలంటే చైనా బలహీనంగా కనిపించకూడదని ఝవ్ గతంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. గల్వాన్‌లో భారత జవాన్లపై దాడి ఘటన భారత్‌కు ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో జరిగిందేనని విశ్లేషకుల అంచనా. గల్వాన్ ఘర్షణలు అదుపు తప్పిన ఘటనకాదని, ముందస్తు ప్రణాళికతో చైనా చేపట్టిన ప్రాజెక్ట్‌గా చూడాలని భారత్‌కు తన సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజింగ్ ఈ దుస్సాహసానికి పాల్పడిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే భారత్ ప్రతిఘటనతో చైనా లక్ష్యం నెరవేరకపోగా వారికే ఎదురుదెబ్బ తగలింది. చైనీయుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ని పెంచింది. సరిహద్దు వివాదాలపై భవిష్యత్తు లో భారత్‌తో చర్చలు జరిపే పరిస్థితి లేదు. వాణిజ్యం విషయంలో తన శత్రువు అమెరి కాకు భారత్ మరింత దగ్గరయ్యేందుకు ఈ ఘటన కారణమవుతోందని చైనా భావిస్తోంది. భారత్‌పై అమెరికా ఒత్తిడి.. గల్వాన్ ఘటన అసలు ఉద్దేశం భారత భూభాగంపై పట్టు సాధించడం కాకపోవచ్చు. ఎందుకంటే చైనా కంపెనీలకు ముకుతాడు వేయాల్సిందిగా అమెరికా కొన్ని నెలలుగా భారత్‌పై ఒత్తిడి తీసుకువస్తోంది. ఫైవ్‌జీ నెట్వర్క్ ఏర్పాటుకు హువాయి సాయం తీసుకోవాలని భారత్ భావించడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా. గల్వాన్ ఘటన తర్వాత చైనా ఉత్పత్తులపై భారత్‌లో వ్యతిరేకత పెరగడం అమెరికా ఆశించిందే. ఈ ఘటనలన్నీ చైనా ఆశలకు వ్యతిరేకంగా జరుగుతున్నవేనని గల్వాన్ ఘటన చైనాకు విజయమేమీ కాదని కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే గల్వాన్ నిర్ణయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పాత్ర ఏమిటనేది స్పష్టంకాలేదు. సైన్యాధికారి ఆదేశాల విషయం జిన్‌పింగ్‌కు ముందే తెల్సి ఉంటుందని చైనా సైన్యం పనితీరు తెలిసిన కొందరు అంచనావేస్తున్నారు. -
ఉరి.. సరి కాదు
ద హేగ్: అంతర్జాతీయ వేదికపై భారత్‌కు విజయం. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)కు పాకిస్తాన్ విధించిన మరణ శిక్షను ఆ దేశం తప్పనిసరిగా పునఃసమీక్షించాలని నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఐసీజే అధ్యక్షుడు, జడ్జి అబ్దుల్ఖవీ అహ్మద్ యూసఫ్ నేతృత్వంలోని 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెబుతూ జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని, ఆయనకు విధించిన శిక్షను పాక్ పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఈ తీర్పును ఈ ఏడాది ఫిబ్రవరి 21నే కోర్టు రిజర్వ్‌లో ఉంచి బుధవారం వెలువరించింది. ఇండియా తరఫున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాకిస్తాన్ సైనిక కోర్టుల విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించకుండా ఇండియాకు ఉన్న రాయబార హక్కులకు పాక్ భంగం కలిగించిందన్న వాదనను 15 మంది న్యాయమూర్తులు అంగీకరించగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. ‘నిర్బంధంలో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు, ఆయనకు న్యాయపరమైన సహాయం అందించేందుకు భారత అధికారులను పాక్ అనుమతించకపోవడం ద్వారా, ఇండియా హక్కులను పాక్ కాలరాసింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాధవ్ అరెస్టు, నిర్బంధం గురించిన సమాచారాన్ని భారత్‌కు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత పాక్‌కు ఉంది’ అని జడ్జి యూసఫ్ పేర్కొన్నారు. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ‘జాధవ్ కేసులో భారత విధానం సరైనదేనని ఈ చరిత్రాత్మక తీర్పు స్పష్టం చేస్తోంది. జాధవ్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయించి భారత్‌కు తీసుకొచ్చేందుకు మేం మా పనిని కొనసాగిస్తాం’ అని పేర్కొంది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది.. జాధవ్‌ను నిర్బంధించిన విషయాన్ని భారత్‌కు పాక్ మూడు వారాలు ఆలస్యంగా తెలియజేయడం ద్వారా వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని తీర్పులో జడ్జి యూసఫ్ ప్రస్తావించారు. జాధవ్‌ను కలిసేందుకు తమ అధికారులను అనుమతించాల్సిందిగా అనేకసార్లు పాక్‌ను భారత్ కోరినా అందుకు ఆ దేశం అంగీకరించలేదన్న విషయం సుస్పష్టమవుతోందని పేర్కొన్నారు. గూఢచర్యం, ఉగ్రవాదం నేరాలపై జాధవ్‌కు పాక్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో మరణ శిక్ష విధించగా, ఆ శిక్ష అమలును నిలిపివేయాలంటూ భారత్ ఐసీజేను ఆశ్రయించడం తెలిసిందే. సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్సులోకి జాధవ్ ఇరాన్ నుంచి ప్రవేశించారనీ, 2016 మార్చి 3న ఆయనను తమ భద్రతా దళాలు పట్టుకున్నాయనీ, జాధవ్ గూఢచర్యం, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనేది పాక్ వాదన. అయితే ఈ అంశంలో భారత్ వాదన మరోలా ఉంది. నౌకాదళం నుంచి ఉద్యోగ విరమణ పొందిన అనంతరం జాధవ్ ఇరాన్లో వ్యాపారం చేసుకుంటుండగా, పాక్ అక్కడి నుంచి ఆయనను అపహరించి బలూచిస్తాన్‌కు తీసుకొచ్చిందని భారత్ ఆరోపిస్తోంది. సైనిక కోర్టులో రహస్య విచారణ జరిపిన అనంతరం 2017 ఏప్రిల్‌లో పాక్ ఆయనకు మరణ శిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది మే నెలలో భారత్ ఐసీజేను ఆశ్రయించింది. దీంతో తుది తీర్పు చెప్పే వరకు జాధవ్‌కు శిక్ష అమలును నిలిపివేయాలని అప్పట్లో ఐసీజే మధ్యంతర తీర్పు చెప్పింది. తర్వాత 2017 డిసెంబర్ నెలలో ఇస్లామాబాద్‌లో జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు, తల్లికి పాక్ అనుమతి ఇచ్చింది. భారత్‌కు భారీ విజయం: బీజేపీ నేతలు జాధవ్ కేసులో ఐసీజేలో భారత్‌కు భారీ విజయం లభించిందని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు. ‘ఐసీజే తీర్పు భారత్‌కు లభించిన భారీ విజయం’ అని రాజ్‌నాథ్ అన్నారు. జాధవ్ కుటుంబ సభ్యలకు త్వరలోనే తగిన పరిహారం దక్కుతుందని విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. తీర్పు తమకు లభించిన విజయమని పాక్ చెప్పుకోవడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేస్తూ ‘అలా అనుకోవడం మీ తప్పు కాదు. ఎందుకంటే తీర్పును ఇంగ్లీష్‌లో చెప్పారు కదా’ అని వ్యంగ్యంగా అన్నారు. పలువురు ఇతర బీజేపీ నేతలు ఐసీజే తీర్పును స్వాగతించారు. మూడేళ్ల నాలుగు నెలలుగా... ► 2016, మార్చి 3: కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసిన పాక్ భద్రతా దళాలు. ► మార్చి 24: భూషణ్ భారత గూఢచారి అనీ, ఆయనను బలూచిస్తాన్‌లో అరెస్టు చేశామని ప్రకటించిన పాక్. ► మార్చి 26: పాక్ ఆరోపణను తోసిపుచ్చిన భారత్. ఆయన నౌకాదళ విశ్రాంత అధికారి అనీ, ఇరాన్లో వ్యాపారం చేసుకునే వారని ప్రకటన. ► మార్చి 29: జాధవ్‌ను కలవడానికి రాయబారులను అనుమతించాలంటూ 16వ సారి పాక్‌ను కోరిన ఇండియా. అయినా ఒప్పుకోని పాకిస్తాన్. ► 2017, ఏప్రిల్ 10: పాక్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నారంటూ కుల్‌భూషణ్‌కు మరణ శిక్ష విధించిన పాకిస్తాన్ సైనిక కోర్టు. ► మే 8: పాక్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించిన భారత్. ► మే 9: మరణ శిక్ష అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ఐసీజే. ► మే 15: జాధవ్ కేసు విచారణలో ఐసీజేలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న భారత్, పాక్. ► మే 18: తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు జాధవ్ మరణ శిక్షను వాయిదా వేయాలని పాక్‌ను ఆదేశించిన ఐసీజే. ► జూన్ 22: పాకిస్తాన్ సైన్యాధిపతికి జాధవ్ క్షమాబిక్ష దరఖాస్తు చేసుకున్నారని సైనిక ప్రతినిధి వెల్లడి. ► నవంబర్ 10: జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్. ► డిసెంబర్ 25: జాధవ్‌ను కలిసిన ఆయన భార్య, తల్లి. ► 2019, ఫిబ్రవరి 18: జాధవ్ కేసులో నాలుగు రోజులు బహిరంగ విచారణను ప్రారంభించిన ఐసీజే. ► ఫిబ్రవరి 21: బహిరంగ విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఐసీజే. ► జులై 17: జాధవ్ మరణశిక్షపై పునఃమీక్ష జరపాలని, అంత వరకు శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు. సిగ్గరి.. మంచివాడు కులభూషణ్‌పై అనెవాది గ్రామస్థుల భావన మహారాష్ట్రలోని అనెవాది గ్రామానికి చెందిన కుల్‌భూషణ్ చిన్నతనంలో పరేల్ గ్రామంలో పెరిగారు. కుల్‌భూషణ్ బిడియంతో ఉండేవాడనీ, ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదని, తనపనేదో తాను చూసుకునే వాడని అనెవాది గ్రామస్థులు అంటున్నారు. ఏటా రెండు సార్లు స్వగ్రామానికి వచ్చేవాడనీ, రోజులో ఎక్కువ సమయం పొలాల్లోనే గడిపేవాడని వారు గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకునే కుల్‌భూషణ్ పట్ల అందరికీ సదభిప్రాయమే ఉంది. కుల్‌భూషణ్ చదువులో, ఆటల్లోనూ ప్రతిభ కనబరిచేవాడని ఆయన బాల్య స్నేహితుడు తులసీరామ్ పవార్ చెప్పారు. ఏ సమయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ ముందుకెళ్లేవాడని ప్రశంసించారు. నౌకాదళం నుంచి కుల్‌భూషణ్ పదవీ విరమణ చేశాక ఇరాన్లో వ్యాపారం చేసుకునే వారని వారు అంటున్నారు. జాధవ్‌ను అన్యాయంగా నిర్బంధించిన పాక్, ఆయనకు ఉరి శిక్ష విధించడం ఎంత మాత్రమూ సరికాదని అనెవాది గ్రామస్థులంటున్నారు. భారత్‌కు ఒక్క రూపాయి, పాక్‌కు 20 కోట్లు ఐసీజేలో తమ వాదనలు వినిపించేందుకు భారత్ కేవలం ఒక్క రూపాయి ఖర్చు పెట్టగా, పాక్ ఇందుకు రూ. 20 కోట్లు వ్యయం చేసింది. ఈ కేసు వాదించడానికి హరీశ్ సాల్వే కేవలం ఒక్క రూపాయిని ఫీజుగా తీసుకుటున్నారని 2017 మే 15న నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. పాక్ తరఫున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. సత్యం, న్యాయం నిలిచాయి: మోదీ కుల్‌భూషణ్ జాధవ్ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పును ఇవ్వడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్వాగతించారు. సత్యం, న్యాయం నిలిచాయని మోదీ పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడి సంక్షేమం, భద్రత కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని మోదీ వెల్లడించారు. ‘ఐసీజే ఈ రోజు ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తాం. న్యాయం, సత్యం నిలిచాయి. వాస్తవాలను విస్తృతంగా పరిశీలించి ఈ తీర్పు చెప్పినందుకు ఐసీజేకు అభినందనలు’ అని మోదీ బుధవారం ఓ ట్వీట్లో తెలిపారు. జాధవ్‌కు తప్పక న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిర్దోషిగా తేల్చలేదు: పాక్ ఐసీజే ఇచ్చిన తీర్పు పాక్‌కే అనుకూలంగా ఉందని ఆ దేశం అంటోంది. తాము ఇప్పుడు ఐసీజే తీర్పును అనుసరించి చట్టం ప్రకారం ముందుకెళ్తామని పాక్ వెల్లడించింది. పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘అంతర్జాతీయ సమాజంలో బాధ్యత గల సభ్యదేశంగా ఈ కేసులో తొలి నుంచీ మా వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. కోర్టు తీర్పును విన్నాం. పాకిస్తాన్ ఇప్పుడు చట్టం ప్రకారం ముందుకెళ్తుంది. జాధవ్‌ను నిర్దోషిగా ప్రకటించాలనీ, విడుదల చేయాలని భారత్ ఐసీజేలో కోరింది. కానీ భారత వాదనను ఐసీజే పట్టించుకోకుండా, కేవలం పాక్ విధించిన మరణశిక్షను, జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని పునఃసమీక్షించాలని మాత్రమే తీర్పు చెప్పింది. వీసా లేకుండా, భారత పాస్పోర్టుతో, హుస్సేన్ ముబారక్ పటేల్ అనే మారుపేరుతో జాధవ్ పాక్‌లోకి ప్రవేశించారని మేం పునరుద్ఘాటిస్తున్నాం’ అని పేర్కొంది. పాకిస్తాన్ మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ మాట్లాడుతూ ‘పునఃసమీక్షలు పూర్తయ్యే వరకే జాధవ్‌కు మరణ శిక్ష అమలు చేయకుండా ఉండేలా పాక్‌ను ఐసీజే నివారించింది. ఈ తీర్పు పాక్‌కి అనుకూలంగా ఉంది. కేవలం జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించలేదన్న విషయంలో మాత్రమే భారత్‌కు అనుకూలంగా ఈ తీర్పు ఉంది. మిగిలిన అన్ని అంశాలు/కోణాల్లోనూ భారత్ ఈ కేసులో ఓడిపోయిందనే చెప్పాలి. పునఃసమీక్షలు పూర్తయ్యే వరకు మాత్రమే మరణ శిక్ష అమలుకాదు’ అని పేర్కొన్నారు. ముంబైలో స్వీట్లు తినిపించుకుంటున్న జాదవ్ స్నేహితులు -
అతడి తర్వాత...
పట్టుదల, కృషి ఉంటే తాము ఏదైనా సాధించవచ్చనే సామెతని అక్షరాల నిజం చేసి చూపించారు గౌరి ప్రసాద్ మహాడిక్. భర్త మేజర్ ప్రసాద్ వీరమరణం పొందిన అనంతరం తన భర్తపై, దేశంపై ప్రేమతో దేశరక్షణ కోసం సైన్యంలో చేరుతోంది. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలలో ఎంపికైన ఆమె 2019 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చెన్నైలోని ఆర్మీ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందనుంది. 49 వారాల శిక్షణ అనంతర లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా మారనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పొరుగున ఉండే థాణే జిల్లాలోని విరార్‌లో నివసించే ప్రసాద్ మహాడిక్తో గౌరి వివాహం 2015 ఫిబ్రవరి 15వ తేదీన జరిగింది. ఇండో–చైనా సరిహుద్దు అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 2017 డిసెంబరులో ప్రసాద్ వీరమరణం పొందారు. ఈ వార్త విని గౌరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సర్వం కోల్పోయినట్లయిందామెకు. భర్తకు నివాళిగా.. భర్త అంత్యక్రియల సమయంలో గుండె నిబ్బరం చేసుకుని ఆయనకు నివాళిగా తాను కూడా ఆర్మీలో చేరాలని నిర్ణయం తీసుకుంది. ఉన్నతవిద్యను అభ్యసించిన ఆమె ముంబైలోనే ఉద్యోగం చేసేది. అయితే అంత్యక్రియల అనంతరం పది రోజులు తిరగకుండానే భర్త అంత్యక్రియల సమయంలో ఆర్మీలో చేరి నివాళులు అర్పిస్తూ చేసిన ప్రతిజ్ఞ మేరకు తన ఉద్యోగానికి ముందుగా రాజీనామా చేసింది. అనంతరం ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై కొందరు దుఃఖంలో ఏదో అన్నంత మాత్రాన ఆర్మీలో చేరాలా..? ఇది మూర్ఖత్వం అన్నారు. అయితే అత్తమామలు, తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆమె ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. 2020లో లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా...? ఆర్మీలో చేరి భర్త వేసుకున్నటువంటిæ యూనిఫామ్ వేసుకోవాలన్న గౌరి కల 2020లో నెరవేర నుంది. ఇందుకోసం కావల్సిన పరీక్షలలో ఇప్పటి వరకు ఉత్తీర్ణత సాధించి, ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైంది. ముందుగా సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బి) నిర్వహించిన పరీక్షలలో గౌరి టాపర్‌గా నిలిచింది. ఇక చెన్నైలోని ‘ఆఫీస్ ట్రైనింగ్ అకాడమీ’ (ఓటిఎ)లో శిక్షణ పొందేందుకు అర్హత సంపాదించింది. దీంతో 2019 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆమె ఓటిఎలో 49 వారాలపాటు శిక్షణలో ఉంటుంది. శిక్షణ పూర్తి అయిన తర్వాత 2020 మార్చిలో ఆమె లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించనుంది. ఆమె కర్తవ్యదీక్షకు సాక్షి సలామ్. – గుండారపు శ్రీనివాస్ సాక్షి, ముంబాయి అలాగే యూనిఫామ్ వేసుకోవాలి నా నిర్ణయాన్ని మూర్ఖత్వమన్నవారే ఇప్పుడు నేను లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా ఎంపికయ్యానని తెలిసి అభినందనలు చెబుతున్నారు. సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆర్మీలో చేరాలనే కల నెరవేరుతుండంతో ఆయన నాతో ఉన్నారనే అనుభూతిని పొందుతున్నాను. తొందర్లోనే నన్ను ‘లెఫ్టినెంట్ కమాండర్ గౌరి ప్రసాద్ మహాడిక్’ అని పిలుస్తారు. ఇది వినేందుకు చాల ఎకైసైట్మెంట్గా ఉంది. దేశానికి సేవ చేయాలనే ప్రసాద్ అర్థంతరంగా పోయారు. నేను దేశానికి సేవ చేసి ఆయన కోరికను తీరుస్తాను. – గౌరి ప్రసాద్ మహాడిక్ -
సైన్యంలో కమాండర్ అంటూ చీటింగ్
కర్ణాటక, కృష్ణరాజపురం : సైన్యంలో కమాండర్ అంటూ ఓ వ్యక్తి ఇద్దరు వ్యక్తులను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు... వికాస్ అనే వ్యక్తి సైన్యంలో కమాండర్‌గా పనిచేస్తున్నాని, వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో తన వద్ద ఉన్న కెమెరా, బైక్‌ను విక్రయిస్తానని ఆన్లైన్లో పోర్టల్‌లో ప్రకటించాడు. ప్రకటన చూసిన బెంగళూరుకు చెందిన ప్రశాంత్, యోగీశ్లు వాటిని కొనడానికి ఆసక్తి చూపారు. అయితే వస్తువులు తమకు ఇచ్చిన అనంతరమే డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో అలా కుదరదని, తన ఖాతాకు ముందుగా డబ్బులు జమ చేస్తేనే వస్తువులు అప్పగిస్తానంటూ తెలిపాడు. తాను సైన్యంలో కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని నమ్మించడానికి ఆర్మీ దుస్తుల్లో తీసుకున్న ఫోటోతో పాటు నకిలీ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్‌కార్డులతో పాటు వస్తువులను కూడా బాధితులకు పంపించాడు. వీటన్నింటిని చూసి నిజమేనని భావించిన బాధితులు కొద్ది రోజుల క్రితం వికాస్ ఖాతాకు డబ్బులు జమ చేసారు. అనంతరం వస్తువుల కోసం ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
డిజిశాసనులు
స్త్రీల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఇప్పటికీ మనకు ఆ దుశ్శాసనుడే గుర్తుకు వస్తాడు. టెక్నాలజీ పెరిగింది. స్త్రీలకు రక్షణా పెరిగింది. అయినప్పటికీ.. ఏదో ఒక మూల దుశ్శాసనులు డిజిటల్ వరల్డ్‌లోకి దూరి మగువల వలువల్ని లాగి.. విలువల్ని నాశనం చేస్తున్నారు. డిజిశాసనులై పట్టి పీడిస్తున్నారు. ఆమె పేరు శోభా సజ్జు. కేరళలోని కొచ్చి. భర్త పేరు సజ్జు. ఉద్యోగస్తుడు. ఆయన ఆఫీస్‌లోని వాట్సాప్ గ్రూప్‌లో ఒక అమ్మాయి న్యూడ్ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది సజ్జు భార్య శోభ అంటూ అతడి కొలీగ్ లిట్లో ప్రచారం చేశాడు. ఒక యువతి కెమెరా వైపు తిరిగి దుస్తులు మార్చుకుంటున్న వీడియో అది. శోభా సజ్జు ఈ విషయం ఇంటి వరకు తెచ్చాడు సజ్జు. ఖంగు తింది శోభ. వీడియో చూసింది. మరింత షాక్. అసలు అందులో ఉన్నది తను కానేకాదు! ఎవరో ప్రచారం చేస్తే.. తన భర్త ఎలా నమ్మాడు? ఆమె వెళ్లి కమిషనర్‌కి కంప్లయింట్ ఇచ్చింది. కమిషనర్ సైబర్ సెల్‌కు కేసును రిఫర్ చేశారు. వీడియోను పరిశీలించిన పోలీసులు అందులో ఉన్నది తను కాదు అన్న శోభ మాటను ధృవపరిచారు. పైగా శోభలా మార్ఫింగ్ కూడా చేయలేదనీ నిర్ధారించారు. కాబట్టి తొలి విచారణకు ఆమె పోలీస్ స్టేషన్‌కు రావల్సిన అవసరమూ లేదని శోభతో చెప్పారు. కాని ఆమె భర్తను పిలిచారు. ఆ వీడియోలో ఉన్నది తన భార్య శోభే అని సజ్జు వాదించాడు. అప్పటికి శోభ తన తల్లిగారింట్లో ఉంది. భర్త నుంచి విడాకుల నోటీస్ కంప్లయింట్ ఇచ్చిన నాలుగు రోజులకు శోభకు భర్త నుంచి విడాకుల పిటిషన్ కాపీ అందింది. తన భార్య స్వయంగా తనే తన న్యూడ్ వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిందనే అభియోగం కింద! శోభకు ఇది ఇంకో షాక్. ఈలోపు పోలీసులు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. ఆ వీడియోలో ఉన్నది శోభ కాదని ఘంటాపథంగా రిపోర్ట్ ఇవ్వకపోయినా.. ఆమె కాదు అనే అర్థంలోనే అసంపూర్తి నివేదికను ఇచ్చారు. ఇంకోవైపు లిట్టో మీద ఐపీసీ సెక్షన్ కింద, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీని వల్ల శోభకు ఒనగూడిన లాభం ఏమీలేదు. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి స్పష్టమైన నివేదిక రాలేదు. అందుకే శోభ తన పోరాటం ఆపలేదు. వీడియోలో ఉన్నది తను కాదు అని పోలీసులు తేల్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా శోభే అని చెప్పలేదు. అందుకే తను కాదని అస్పష్టంగా చెప్పడం కాదు స్పష్టంగా చెప్తూ నివేదిక కావాలనే పట్టు వీడలేదు శోభ.పిల్లల్నీ దూరం చేశాడు! శోభకు ముగ్గురు పిల్లలు. ఈ గొడవ మొదలైనప్పటి నుంచి పిల్లలు తండ్రి దగ్గరే ఉంటున్నారు. ప్రతి రెండో శనివారం పిల్లల్ని కలిసే విజిటింగ్ రైట్ను శోభకు ఇచ్చింది కోర్టు. నాలుగు శనివారాలు సాఫీగా గడిచాయి. అయిదో శనివారం వచ్చేసరికి.. పిల్లలతో ఆమె సరిగ్గా ప్రవర్తించట్లేదు కాబట్టి పిల్లలు ఆమెను కలవడానికి ఇష్టపడట్లేదంటూ భర్త రిపోర్ట్ చేశాడు. న్యూడ్ వీడియోస్ బ్యాక్‌గ్రౌండ్‌గా వేసుకున్న డైవోర్స్ పిటిషన్‌కు ఈ కంప్లయింట్ కూడా తోడై పిల్లలను కలిసే విజిటింగ్ రైట్ను తాత్కాలికంగా కోల్పోయిన శోభకు గుండె ఆగినంత పనైంది. రెండోసారి కోర్టును ఆశ్రయించింది శోభ. న్యూడ్ వీడియో వ్యవహారం వెనక తన భర్త పాత్ర గురించి ఆరా తీయమని. ఆమె విజ్ఞప్తిని మన్నించింది కోర్టు. రీ ఇన్వెస్టిగేషన్లో ఆ వీడియోను మొదట పంపించిన ఫోరెన్సిక్ ల్యాబ్‌కి కాకుండా ఇతర ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కి పంపించమని కోరింది శోభ. కాని పోలీసులు మొదటి ల్యాబ్‌కే పంపించారు. నివేదిక కూడా మొదటిసారిలాగే అసంపూర్తిగా వచ్చింది. విసిగెత్తిపోయింది శోభ. అయినా తమాయించుకుని సైబర్ ఫోరెన్సిక్స్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ బాడీకి పంపించమని అడిగింది. ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా ‘‘అందులో ఉన్నది మీరు కాదుకదా.. వదిలేయండి’ అనే సమాధానమిచ్చారు పోలీసులు. ఆఖరి ప్రయత్నంగా డీసీపీ లోక్‌నాథ్ బెహరాను కలిసింది. వీడియోను చూపించింది. వీడియో చూశాక.. ఆమెను చూశాడు లోక్‌నాథ్. ఇందులో ఉన్నది ససేమిరా నువ్వు కాదు అన్నాడు. ఇన్నాళ్లూ భరించావా? ‘‘ఎప్పుడో వచ్చేస్తే నీ పిల్లలు నీ దగ్గరుండే వాళ్లు కదమ్మా’’ అంటూ శోభ కేస్ ఇన్వెస్టిగేషన్‌ను ఎర్నాకులంలోని లాల్జీ. కే అనే ఏసీపీకి అప్పజెప్తూ ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు జారీ చేశాడు. లాల్జీ ఆ వీడియోను, సంబంధిత నివేదికను తిరువనంతపురంలో ఉన్న ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)కు పంపించాడు. ఆర్నెల్ల తర్వాత.. అంటే పదిరోజుల కిందట సీడాక్ పూర్తి నివేదికను ఇచ్చింది. ఆ వీడియోలో ఉన్నది శోభ కాదు అని స్పష్టం చేస్తూ! ఆమె చేపట్టిన ఒక యుద్ధం ముగిసింది. విజేతగా నిలిచింది. ఇప్పుడిక పిల్లల కస్టడీ కోసం యుద్ధం ప్రారంభించింది. ‘‘నా భర్త నాకు సపోర్ట్ ఇచ్చి ఉంటే.. ఆ వీడియో నాది కాదు అని తేలగానే దాన్ని వదిలేసేదాన్ని. ఇవ్వకుండా మూలం తెలుసుకునేలా చేశాడు. మంచిదే అయింది. నేనొక మామూలు కుటుంబం నుంచి వచ్చా. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నా పోరాటంలో వాళ్లంతా తోడుగా ఉన్నా.. ఒంటరిగానే అనిపించింది. నా పిల్లలను కలవాలి. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోతుంది’’ అంటోంది శోభ. ఈమె పోరాట పటిమ తక్కిన వారికి స్ఫూర్తి కావాలి. బాధపడడం మాని, నిజాన్ని నెట్ నుంచి బయటికి కక్కించాలి. డబ్బులిస్తే వస్తారని ఫేక్ పోస్ట్ కోల్‌కతాలోని జయదేవ్పూర్లో ఓ కుటుంబం తన ఇంటి ముందు సీసీటీవీ బిగించుకుంది. ఇంటి తలుపులపై ఇంగ్లిష్, బెంగాలీ, హిందీ భాషల్లో ‘ఈ ఇల్లు అలాంటిది కాదు. దయచేసి మమ్మల్ని వేధించకండి’ అని రాసి ఉన్న బోర్డును వేలాడదీసుకుంది. దీనంతటికీ కారణం.. ‘‘ఆ ఇంట్లోని ఇద్దరు మహిళలు డబ్బులిస్తే వస్తారు అని వాళ్ల ఫొటోలు, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్లతో సహా ఆన్లైన్లో ఎవరో అప్లోడ్ చెయ్యడం! అప్పట్నుంచీ ఎవరెవరో ఫోన్లు చేసి ఆ ఇంట్లోని ఆడవాళ్లను మాటలతో చంపుతున్నారు. కొందరైతే నేరుగా ఇంటికే వచ్చి తలుపు తడుతున్నారు! అదెలా జరిగిందో ఆ ఇంటివారికి తెలియదు. ఆ ఇంటి యజమాని సైబర్ కేఫ్ నడుపుతుంటాడు. 27 ఏళ్ల భార్య, పెద్దవాళ్లయిన తల్లిదండ్రులు, 40 ఏళ్ల అక్క.. ఇదీ అతడి కుటుంబం. ‘‘అక్టోబర్ మొదటివారంలో నా పేరుతో, అడ్రస్‌తో ఎవరో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు. మా ఇంట్లో వాళ్ల ఫోన్ నెంబర్లు, మెట్రో స్టేషన్‌కు మా ఇల్లు ఎంత దూరంలో ఉంటుందో వివరాలు ఇచ్చారు. తర్వాత నా తమ్ముడి ఫొటో (సైబర్‌కేఫ్ ఓనర్), మా నాన్న ఫొటో అప్లోడ్ చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి నాకు అసభ్యకరమైన వాట్సాప్‌కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి’’ అని ఆ నలభై ఏళ్ల మహిళ కోల్‌కతా సైబర్ పోలీస్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెకు పెళ్లయింది. అక్కడికి కాస్త దగ్గర్లోనే తన అత్తమామలతో కలిసి ఉంటోంది. తరచు పుట్టింటికి వచ్చి వెళుతుంటుంది. ఇలాంటి వేధింపులే ఆమె ఆడపడుచుకూ (సైబర్ కేఫ్ యజమాని భార్య) వస్తున్నాయి. పైశాచికత్వానికి పరాకాష్ట అయిన ఈ ఆన్లైన్ క్రూరత్వంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య ఫొటోలు పంచి పెట్టాడు! అతను నేవీ కమాండర్. వయసు 39. భార్య ఒకప్పుడు ఆర్మీలో కెప్టెన్. కుటుంబం ఢిల్లీలో ఉంటోంది. అతడికి పుణె నుంచి ఢిల్లీకి పోస్టింగ్ పడడంతో అక్కడ ఉంటున్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే ఆమె భర్తను వదిలేసి, ఇద్దరు పిల్లలతో పుణె వచ్చి వేరుగా ఉంటోంది. మంగళవారం పుణె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి భర్త మీద ఫిర్యాదు చేసింది. పోర్నోగ్రఫీ అంటే అతడికి పిచ్చి. పదకొండేళ్లుగా చెబుతోంది, ఆ పాడు అలవాటు మానుకొమ్మని. మానుకోలేదు. అత్తమామల చేత చెప్పించింది. మారలేదు. అక్టోబర్‌లో పుణె ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ పెట్టింది. íపిటిషన్ ఇచ్చేందుకు కోర్టుకు వెళుతుంటే దారిలో ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఆమెను కలిశాడు. అతను కూడా నేవీ ఆఫీసరే. ఆమె భర్తకు స్నేహితుడు. తన భార్యతో కూడా ఆమె భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. ఆమె నిర్ఘాంతపోయింది. ఈ వివరాలన్నీ స్టేట్మెంట్లో రాసిచ్చింది. ఫిర్యాదు స్టేట్మెంట్లో ఇవన్నీ వెల్లడించింది కానీ, ఇవన్నీ వెల్లడించడానికి ఆమె ఫిర్యాదు ఇవ్వలేదు. అసలు కేసు వేరు. భార్య ఫొటోలను, ఫ్రెండు భార్య ఫొటోలను, ఇంకో గుర్తు తెలియని మహిళ ఫొటోలను అశ్లీల చిత్రాలకు మార్ఫింగ్ చేసి తన జీ మెయిల్ అకౌంట్ నుంచి బట్వాడా చేస్తున్నాడట ఆమె భర్త. ఆ విషయం చెబుతూ ఈ వివరాలన్నీ ఇచ్చింది. పోలీసులు అతడిపై సెక్షన్ 509 (మహిళ గౌరవాన్ని కించపరిచి, అవమానాలపాలు చెయ్యడం), సెక్షన్ 67 (అశ్లీల సమాచారాన్ని, చిత్రాలను ముద్రించడం లేదా నెట్లో సరఫరా చెయ్యడం) కింద కేసు పెట్టారు. అతడిని అరెస్టు చేసి విచారించడం కోసం భారత నౌకాదళంలోని అధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు. – శరాది -
మృత్యువును జయించిన కమాండర్
విశాఖ సిటీ: అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లో బ్ రేస్–2018లో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయం నుంచి బయటపడిన భారత నౌకా దళానికి చెందిన కమాండర్ అభిలాష్ టామీ ఎట్టకేలకు విశాఖ నగరానికి చేరుకున్నారు. ఆసియా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏౖకైక అధికారి అభిలాష్ ఈ రేస్‌లో తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సెప్టెంబర్ 21న సాట్‌ఫోన్ ద్వారా సమాచారంఅందించారు. ఫ్రాన్స్‌లోని లెస్ సెబ్లెస్ పోర్టులో జూలై ఒకటో తేదీన ప్రారంభమైన గోల్డెన్ గ్లోబ్ రేస్ 2019 ఏప్రిల్‌లో ముగియనుంది. ఒంటిచేత్తో నాన్ స్టాప్‌గా ప్రపంచయానం చెయ్యడమే ఈ రేస్ ప్రత్యేకత. భారత నౌకాదళానికి చెం దిన కమాండర్ అభిలాష్ సెయిలింగ్‌లో అందె వేసిన చెయ్యి. 2012–13లో ఐఎన్ఎస్వీ మహదేయ్‌లో ఒంటరిగా ప్రపంచ వ్యాప్తంగా 53వేల నా టికల్ మైళ్లు ప్రయాణిం చారు. కీర్తి చ క్ర, మాక్ గ్రె గోర్, టెన్జింగ్ నార్గే సహా పలు పురస్కారాలు సొం తం చేసుకున్నారు. ఈ ఫీట్ సాధించిన నేపథ్యం లో గోల్డెన్ గ్లోబ్ రేస్‌కు ఎంపికయ్యారు. ఈ రేస్‌లో మేకిన్ ఇండియా నినాదాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా గోవాలోని అక్వేరియస్ షిప్‌యార్డులో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఐఎన్ఎస్వీ దురియా నౌకను వినియోగిస్తున్నారు. దక్షిణ హిందూ మహా సముద్రంలో పెర్త్‌కు 1500 నాటికల్ మైళ్ల దూరంలో, ఆస్ట్రేలియాకు 2,700 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో తాను తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు టామీ సందేశం అందించారు. తాను సొంతంగా కదలలేకపోతున్నాననీ, త్వరగా స్ట్రెచర్ పంపించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత టామీ నుంచి సమాచారం రాకపోవడంతో భారత నౌకాదళ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఫిషరీస్ నౌక వీరి గమనాన్ని కనుగొని నేవీకి సమాచారం అందించింది. సమాచారం అందుకున్న రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ షిప్ దురియా వద్దకు బయలుదేరింది. మరోవైపు భారత నౌకాదళం కూడా రెస్క్యూ బృందాన్ని పంపించింది. ఐఎన్ఎస్ సాత్పురాతో పాటు ఓ ఛేతక్ హెలికాఫ్టర్‌ను రెస్క్యూ కోసం పంపించి ఆపరేషన్ రక్షమ్ పేరుతో సహాయక చర్యలు ప్రారంభించారు. చివరకు టామీ బయలుదేరిన దురియా ఓడను సెప్టెంబర్ 28న కనుగొని నౌకాదళాధికారిని రక్షించారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత ఐఎన్ఎస్ సాత్పురాలోనే శనివారం నగరానికి చేరుకున్నారు. టామీని కలిసిన తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
ఒడ్డుకు చేరిన సముద్రంలో చిక్కుకున్న నావికుడు
-
అభిలాష్‌ను కాపాడారు
న్యూఢిల్లీ: గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో భాగంగా ఒంటరిగా ప్రపంచ యానం చేస్తూ హిందూమహా సముద్రంలో ప్రమాదానికి గురైన కేరళకు చెందిన నేవీ కమాండర్ అభిలాష్ టామీ(39)ను విజయవంతంగా రక్షించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆయన్ను రక్షించేందుకు భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం అభిలాష్ పడవ ‘తురయా’ వద్దకు చేరుకున్న ఫ్రెంచి మత్స్యకార పడవ ‘ఒసిరిస్’ సిబ్బంది ఆయన్ను రక్షించింది. ఈ విషయం తెలిసి తాము టెన్షన్ నుంచి బయటపడ్డామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఒసిరిస్లో దగ్గర్లోని ఇల్ ఆమ్స్టర్డాం దీవికి, అక్కడి నుంచి ‘ఐఎన్ఎస్ సాత్పురా’లో మారిషస్ తీసుకువచ్చి, అవసరమైన వైద్య చికిత్సలు చేయిస్తాం’ అని మంత్రి ట్విటర్లో పేర్కొన్నారు. -
నావికా దళాధికారి ఆచూకీ లభ్యం
పారిస్/కోచి: తీవ్రంగా గాయపడి హిందూమహా సముద్రంలో గల్లంతైన భారతీయ అధికారి ఆచూకీ దొరికిందని ఫ్రాన్స్‌కు చెందిన గోల్డెన్‌గ్లోబ్ రేస్ సంస్థ ప్రకటించింది. భారత నావికాదళ కమాండర్ అభిలాష్ టామీ(39) తురయా అనే తన పడవలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’లో భారత్ నుంచి పాల్గొన్న ఏకైక నావికుడు. ఫ్రాన్స్ తీరం నుంచి జూలై 1వ తేదీన 18 మంది పోటీదారులతో ప్రారంభమైన ఈ రేసులో ఇప్పటివరకు 10,500 నాటికల్ మైళ్లు ప్రయాణించారు. ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న అభిలాష్ హిందూమహా సముద్రంలో ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా తీవ్ర తుపానులో చిక్కుకున్నారు. అలల తాకిడికి ఆయన పడవ తీవ్రంగా దెబ్బతింది. తీవ్రంగా గాయపడి, నిస్సహాయ స్థితిలో ఉన్న అభిలాష్ శనివారం రేస్ నిర్వాహకులకు మెసేజ్ పంపారు. రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు నావికాదళానికి చెందిన ఆధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పురాను ఆ ప్రాంతానికి పంపించినట్లు భారత నావికా దళం తెలిపింది. -
సాహసాల అలలపై చెరిగిపోని సంతకం..
విశాఖసిటీ: సముద్రమంత సాహసం.. సాటిలేని మనోనిబ్బరం.. అవధులు లేని ఆత్మవిశ్వాసం.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆరాటం.. అంతకుమించిన నైపుణ్యం.. ఇవన్నీ ఉన్నాయంటే.. ఆ అమ్మాయి కచ్చితంగా పాతర్లపల్లి స్వాతి అవుతుంది. సాగరం చిన్నబోయేలా.. సంకల్పం తలవంచేలా.. అలల ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసిన ఆ అద్భుత వనిత తప్పనిసరిగా స్వాతి అవుతుంది. కేవలం ఓ తెరచాప పడవలో ఐదు మహాసముద్రాలను అధిగమించి, భారత నౌకాదళ చరిత్రలోనే సాటిలేని అధ్యాయాన్ని లిఖించిన ఆ యువతి తప్పనిసరిగా మన విశాఖకు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ స్వాతి అవుతుంది. ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో ప్రయాణించిన ఆరుగురు మహిళల బృందంలో ఒకరైన స్వాతి, నావికా సాగర్ పరిక్రమ పూర్తిచేసిన నేపథ్యంలో.. తన అనుభవాలను, భావోద్వేగాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. సాక్షి: విజయవంతమైన సాహస యాత్రలో భాగస్వాములైనందుకు అభినందనలు. తరిణి విజయం గురించి మీరెలా ఫీలవుతున్నారు.? స్వాతి: థాంక్యూ. భారత నౌకాదళ చరిత్రలో ఇదో పెద్ద విజయం. పూర్తిగా మహిళలు సాధించిన ఈ విజయాన్ని వారికి, మా కుటుంబానికి అంకితం చేస్తున్నాను. 193 రోజుల పాటు ఐదు మహాసముద్రాల మీదుగా 21,600 వేల నాటికల్ మైళ్లు సాగిన నావికా సాగర పరిక్రమ నిజంగా నా జీవితంలో అతిగొప్ప మైలురాయిగా చెప్పవచ్చు. సాక్షి: మీ విజయంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది.? స్వాతి: ఇది ముమ్మాటికీ నాన్న కల. అమ్మ శ్రమ. ముగ్గురు కూతుళ్లను పెంచేందుకు రోజుకు 16 గంటలకు పైగా కష్టపడుతూ మా జీవితానికి ఓ మంచి భవిష్యత్తునిచ్చింది నా తల్లిదండ్రులే. సాగర పరిక్రమకు వెళ్తానని చెప్పినప్పుడు నాన్న కొంచెం ఆలోచించినా.. అమ్మ మాత్రం ధైర్యం చెప్పింది. విజయం సాధించి వెనక్కు వస్తావని వెన్నుతట్టి ప్రోత్సహించింది. వారిచ్చిన స్ఫూర్తితోనే ముందడుగు వేశాను. సాక్షి: నౌకాదళంలోకి రావాలన్నది మీ ఆశయమా? దాన్ని ఎలా సాధించారు? స్వాతి: ముందు నేను ఇండియన్ నేవీలోకి రావాలని అనుకోలేదు. మా నాన్న పాతర్లపల్లి ఆదినారాయణ ఇక్కడి ఇండస్ట్రియల్ క్యాంటీన్లో హెడ్కుక్. అమ్మ రాణి సెయిలింగ్ క్లబ్లో హెల్పర్‌గా పనిచేశారు. నాన్న పనిచేసే చోటుకు నేవీ అధికారులు వచ్చే వాళ్లు. వారిని చూసి తనకు అబ్బాయి పుడితే నేవీలో చేర్పించాలని అనుకున్నారు. అయితే.. ముందు ఇద్దరూ అమ్మాయిలే పుట్టారు. మూడో బిడ్డయిన నేను కూడా అమ్మాయినే. అయినా.. నాన్న నేవీ ఆశలు వదులుకోలేదు. ఇద్దరు అక్కల కంటే చురుగ్గా నేను ఉండటంతో నన్ను ఆ దిశగా నడిపించారు. అందరిలాగానే నేనూ బీటెక్‌లో చేరుదామని అనుకున్నాను. నాన్న మాత్రం బీఎస్సీలో చేరితే.. నీలైఫ్ బావుంటుందని చెప్పడంతో సరే అన్నాను. నాన్న మార్గదర్శిగా నిలవడంతో నేనీ స్థాయిలో ఉన్నాను. సాక్షి: సెయిలింగ్‌లో మీకెలా అవకాశాలొచ్చాయి.? ఆ రంగంలో మీ అనుభవం ఏమిటి? స్వాతి: చిన్నప్పటినుంచి ఎన్సీసీ క్యాడెట్‌గా శిక్షణ పొందాను. సెయిలింగ్ నేర్చుకున్నాను. నవంబర్ 2011లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా నేవీలో ఉద్యోగం సాధించాను. 2013లో వైజాగ్ వచ్చాను. ఐఎన్ఎస్ డేగాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేస్తున్న సమయంలో కేప్ టూ రియో పోటీల గురించి ఇండియన్ నేవీకి ఆహ్వానం అందింది. ప్రతి మూడేళ్లకోసారి దక్షిణాఫ్రికా నిర్వహించే ఈ ట్రాన్స్ అట్లాంటిక్ క్రాస్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాను. సుమారు నెల రోజుల పాటు సముద్రంలో సాగే ఈ పోటీలో తరిణిలో ఉన్న లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి, లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జమాల్‌తో కలిసి ప్రయాణం చేశాను. లాంగ్ సెయిలింగ్ బోట్లో ప్రయాణం చేసిన మొదటి భారతీయ (నేవీ) అమ్మాయిలుగా చరిత్ర సృష్టించాం. నేవీ ఉమెన్ ఆఫీసర్లు కూడా సుదీర్ఘ కాలం సెయిలింగ్ చెయ్యగలరని నేవీకి విశ్వాసం పెరిగింది. ఆ తర్వాత వచ్చిన అవకాశమే ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణం. సాక్షి: ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణం ఎలా ప్రారంభించారు.? నౌక గురించి మీ అవగాహన ఏమిటి? ఆరుగురు అమ్మాయిల బృందాన్ని ఎలా ఎంపిక చేశారు.? స్వాతి: నావికా సాగర పరిక్రమలో పాల్గొనాలనుకుంటున్నారా? అని నేవీ నుండి ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని ఓకే చెప్పాను. జమాల్, వర్తికా, నేను ముగ్గురం కోర్‌టీం గా వ్యవహరించాం. ఆ తర్వాత పాయల్, విజయ, ఐశ్వర్య వచ్చారు. ఆరుగురుం కలిసి పలు ప్రాంతాలకు సెయిలింగ్‌కు వెళ్లేవాళ్లం. పకడ్బందీగా ట్రైనింగ్ ఇచ్చారు. ఐఎన్ఎస్వీ తరిణి నిర్మాణంలో మాకూ భాగస్వామ్యం ఉంది. ప్రతి పార్ట్‌ని ఎలా తయారు చేశారో, ఏది ఎక్కడ, ఎందుకు అమర్చారో నిర్మాణ దశలో తెలుసుకున్నాం. షిప్‌యార్డ్‌కు వెళ్లి ప్రతి పార్ట్ ఫిట్ చేసినప్పుడు చూసి నేర్చుకున్నాం. అందుకే.. తరిణి ప్రయాణంలో నౌకలో ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరించుకోగలిగాం. సాక్షి: పసిఫిక్‌లో తుపాను ఎదురైనప్పుడు మీ మానసిక స్థితి ఏమిటి? స్వాతి: 800 నాటికల్ మైల్స్ దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో వెస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా వద్ద తుపాను ప్రారంభమైంది. దాదాపు 20 గంటల పాటు చిక్కుకున్నాం. 6 నుంచి 7 గంటల పాటు బీభత్సమే. అయితే అప్పుడు మాకు భయం వేయలేదు. ఎందుకంటే భయపడేందుకు కూడా టైం దొరకలేదు. బోట్‌ను ఎలా కంట్రోల్ చెయ్యాలోనని తీవ్రంగా శ్రమించాం. నిద్రపోయే సమయం లేదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు రాత్రి భోజనం చేసేంత వరకూ నీరు కూడా తాగలేదంటే పరిస్థితిని ఊహించుకోండి. యుద్ధం చేసినంత కష్టంగా సాగిందా ప్రయాణం. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులెదురైనా ఇంజిన్‌ను వినియోగించకూడదు. ప్రయాణం మొత్తం తెరచాపల కదలికల ద్వారా మాత్రమే చేశాం. పెద్ద పెద్ద అలలు వచ్చి మా నౌకు ఢీకొట్టేవి. లాభం లేదనుకొని అలల వైపుగా మా దిశను మార్చేసేవాళ్లం. దీనివల్ల వేరే మార్గంలోకి వెళ్లాల్సి రావడంతో మా ప్రయాణ దూరం పెరిగిపోయింది. ఆ దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు మెదులుతున్నాయి. సాక్షి: ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన గ్రేట్ కేప్స్‌ను అధిగమించిన సమయంలో మీ అనుభూతి ఏమిటి? స్వాతి: అదో అద్భుత అనుభవం. గ్రేట్ కేప్స్ దాటుతున్న సమయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయన్న ఆతృత, ఆసక్తి మాలో ఉండేది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బోట్‌ను సురక్షితంగా ఉంచాలని కెప్టెన్ ఆదేశించారు. మూడు కేప్స్‌ను దాటిన తర్వాత చాలా ఆనందపడ్డాం. ప్రపంచంలో సముద్ర మార్గంలో అన్నిటికంటే క్లిష్టమైన ప్రాంతాలను అధిగమించాం. ఇలా చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సాక్షి: ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణంతో మీరు నేర్చుకున్నదేమిటి? స్వాతి: తరిణి ప్రయాణంలో కష్టాలను ఎలా అధిగమించాలో నేర్చుకున్నాను. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటినుంచి పారిపోకుండా ఎదుర్కోవడం నేర్చుకున్నాను. మొత్తమ్మీద ఈ నౌక నన్ను ఆల్‌రౌండర్ చేసింది. ఇతర నౌకలతో సమాచార అనుసంధానం ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాను, ఎలక్ట్రీషియన్, ఇంజినీరింగ్, మెడికల్ అసిస్టెంట్, ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి ఇలా ఎన్నో విషయాల్ని నౌక నేర్పింది. దాదాపు 8 నెలల పాటు స్నానం చెయ్యకుండా ప్రయాణం చేశాం. కేవలం ఫేషియల్ వైట్‌తోనే శరీరాన్ని శుభ్రం చేసుకువాళ్లం. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. హోళీ, దీపావళి, న్యూఇయర్.. ఇలా ప్రతి వేడుకనీ నౌకలో చేసుకోవడం కొత్త అనుభూతినిచ్చింది. దాదాపు 8 నెలల పాటు స్నానం చెయ్యకుండా ప్రయాణం చేశాం. కేవలం ఫేషియల్ వైట్‌తోనే శరీరాన్ని శుభ్రం చేసుకువాళ్లం. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. సాక్షి: యాత్రకు సంబంధించి మీరు మరిచిపోలేని జ్ఞాపకం ఏమిటి? స్వాతి: 2017 నవంబర్‌లో గోవాలో ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఎలాంటి సెటప్ ఉందో.. 2018 మే 21న తిరిగి గోవా చేరుకున్నప్పుడు అదే తరహా ఏర్పాట్లు చేశారు. చాలా ఆశ్చర్యం వేసింది. రక్షణ శాఖమంత్రి, ప్లాగ్ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, వేదిక, బోర్డులు.. ఇలా ఏ ఒక్కటీ మారలేదు. అది చూసి.. ఇప్పటి వరకూ జరిగింది కలా..? ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నామా..? అని అనిపించింది. అప్పటి వరకూ పడిన కష్టాన్ని అమ్మా నాన్నని చూసిన తర్వాత పూర్తిగా మర్చిపోయాను. నాన్న కళ్లల్లో ఆనందం చూసినప్పుడు ప్రపంచంలో అతి పెద్ద రికార్డు సాధించినంత గర్వంగా ఫీలయ్యాను. అమ్మాయి తలచుకుంటే అవలీలగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందని మా తరిణి బృందం నిరూపించింది. సాక్షి: రకరకాల వాతావరణాన్ని ఎలా తట్టుకోగలిగారు? స్వాతి: ఒక్కో చోట ఒక్కోలా ఉష్ణోగ్రతలు మారుతూ ఉండేవి. దాదాపు సబ్ జీరో, మైనస్ ఉష్ణోగ్రతలే ప్రతి చోటా ఎదురయ్యాయి. దాదాపు 12 వేల కిలోమీటర్లు సున్న డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల మధ్య ప్రయాణం సాగించాం. విపరీతమైన చలి, హీటర్ లేదు, ఫ్యాన్లేదు. అయినా ధైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ఇది సాహస యాత్ర. అన్ని సౌకర్యాలున్నప్పుడు అది సాహసం ఎందుకవుతుంది. అందుకే.. వాటిని ఎదుర్కొన్నాం. చలిని తట్టుకునేందుకు 7 నుంచి ఎనిమిది డ్రెస్‌లు ఒకేసారి వేసుకునేవాళ్లం. అలల తీవ్రతను రాత్రి పూట గుర్తించేందుకు నైట్ విజన్ కళ్లజోళ్లు వినియోగించేవాళ్లం. పసిఫిక్ మహా సముద్రంలో ప్రయాణం సాగించినప్పుడు 45 రోజుల పాటు ఒక్క నౌక కూడా కనిపించలేదు. ఒంటరి జీవుల్లా ప్రయాణం సాగించాం. -
మావోయిస్టు మిలీషియా కమాండర్ అరెస్టు
జి.మాడుగుల(పాడేరు): మావోయిస్టు మండ ల మిలీషియా కమాండర్ పాంగి భీమన్న అలియాస్ మల్లేశ్వరరావును స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. జి.మాడుగుల పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విజయ్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జి.మాడుగుల మండలంలో నుర్మతి రోడ్డు కంబాలు బయలు గ్రామం సమీపంలో గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పాంగి భీమన్నను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు చెప్పారు. మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా పని చేస్తున్నట్టు తేలిందని ఆయన చెప్పారు. మండలంలో బొయితిలి పంచాయతీ మండిభ గ్రామానికి చెందిన పాంగి భీమన్న అలియాస్ మల్లేశ్వరరావు 12 సంవత్సరాలు నుంచి మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా పని చేస్తూ, మండల పరిధిలో మిలీషియా కమాండర్‌గా వ్యవహరిస్తున్నట్టు ఆయన తెలిపారు. నుర్మతి–మద్దిగరువు రోడ్డులో వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు పొక్లెయిన్లను దగ్ధం చేసిన ఘటన, మద్దిగరువుకు చెందిన కొలకాని సూర్యా, ముక్కల కిశోర్‌కుమార్‌లను హతమార్చిన సంఘటన, పెదబయలు మండల జక్కం వద్ద మందుపాతర పేల్చిన సంఘటనలో భీమన్న అలియాస్ మల్లేశ్వరరావు పాత్ర ఉన్నట్టు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. భీమన్నను మావోయిస్టులు బలవంతగా తీసుకెళ్లి ఈ ఘటనలు చేయించారని ఆయన చెప్పారు. భీమన్నపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్టు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోతే ఎటువంటి కేసులు లేకుండా వారి ఇళ్లకు పంపించేస్తామని సీఐ చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీను పాల్గొన్నారు. -
దివిలో ‘దివ్య’ పథం
గన్నవరం: ప్రపంచంలోనే అతి పిన్న వయసులోనే బోయింగ్ 777 విమానం నడిపిన తొలి మహిళా కమాండర్‌గా గుర్తింపు పొందిన యానీ దివ్య శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ముంబై విమాన సర్వీస్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. దివ్య తండ్రి పఠాన్‌కోట్‌లో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగిగా పనిచేశారు. ఆమె అక్కడే జన్మించారు. తండ్రి పదవీ విరమణ అనంతరం ఆమె కుటుంబం స్వస్థలమైన విజయవాడకు వచ్చి స్థిరపడింది. విజయవాడలోనే పాఠశాల విద్య పూర్తి చేసిన దివ్య 17 ఏళ్ల వయసులో ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీలో చేరి పైలట్ శిక్షణ పూర్తిచేసుకుంది. 19 ఏళ్లకే ఎయిరిండియాలో కెరీర్ ప్రారంభించింది. తర్వాత స్పెయిన్, లండన్‌లో బోయింగ్ 737 విమాన పైలెట్ ట్రైనింగ్ పూర్తిచేసుకుని 21 ఏళ్ల వయస్సులో అతిపెద్ద విమానం బోయింగ్ 777 నడపడం ప్రారంభించింది. అతి చిన్న వయసులో బోయింగ్ నడిపిన తొలి మహిళగా దివ్య ప్రపంచాన్ని ఆకర్షించారు. ఎయిరిండియాలో ఆమెకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్నప్పటికి టికెట్ కొనుగోలు చేసి ముంబైకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. -
కూర రాజన్నే సూత్రధారి
సాక్షి, మహబూబాబాద్: ఆరు నెలల క్రితం ఆవిర్భవించిన చండ్రపుల్లారెడ్డి (సీపీ)బాట అజ్ఞాత దళం ఏర్పాటులో జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న కీలకమని మహబూబాబాద్ జిల్లా పోలీసులు గుర్తించారు. ఈ దళానికి 27 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు పలువురిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాలకు చెందిన 11 మంది 2016, సెప్టెంబర్ 9న హైదరాబాద్‌కు వెళ్లి కూర రాజన్నను కలిశారని, ఆ సమయంలో ఆయా జిల్లాల పరిధిలో సీపీబాట పేరుతో దళాన్ని ఏర్పాటు చేయాలని, ఆయుధాలు సరఫరా చేస్తానని రాజన్న చెప్పినట్లు విచారణలో మధు వెల్లడించాడు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 18న 27 తుపాకులు, మందుగుండు సామగ్రిని పంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు మరికొంత మందిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. -
సీపీబాట దళనాయకుడు మధు అరెస్ట్
మహబూబాబాద్ రూరల్: సీపీఐ(ఎంఎల్)చండ్ర పుల్లారెడ్డి(సీపీ) బాట దళనాయకుడు షేర్ మధు అలియాస్ రమాకాంత్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. గూడూరు, కొత్తగూడ ఎస్సైలు గూడూరు మండలం భూపతిపేట, కొత్తగూడ రోడ్డుపై ఉదయం 8 గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బస్సులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి కనిపించాడు. అతడు బస్సు దిగి భూపతిపేట అడవి వైపు పారిపోతుండగా వెంబడించి పట్టుకొని విచారించగా అతడు ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన షేర్ మధు అలియాస్ రమాకాంత్‌గా తేలింది. పోలీసులు అతడి వద్ద నుంచి 12 బోర్తుపాకీ, 25 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. గోపన్న మాటలకు ఆకర్షితుడై దళంలోకి.. షేర్ మధు 2006లో న్యూడెమోక్రసీ దళ నేత గోపన్న మాటలకు ప్రభావితమై అతడి దళంలో చేరి 2012 వరకు కొనసాగాడు. అనంతరం గోపన్న దళంతో బేధాభిప్రాయాలు వచ్చి ఆవునూరి మధు దళంలోకి వెళ్లాడు. 2016 సెప్టెంబర్‌లో గంగారం మండలం పెద్దఎల్లాపూర్కు చెందిన బోయిని ఓంప్రకాశ్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. అతడు మధును సీపీబాట పార్టీలో చేరమని కోరగా అందులో చేరాడు. సీపీఐ(ఎంఎల్) జనశక్తి మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న ఆదేశాల మేరకు సీపీబాట దళం కార్యకలాపాలను ప్రారంభించారు. ఆయన ఆదేశాల మేరకు దళాలు వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను పార్టీ చందాల పేరు చెప్పి బెదిరించి వసూలు చేసేవారు. టేకులపల్లి ఎన్‌కౌంటర్‌తో చెల్లాచెదురు.. డిసెంబర్ 14న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగి తొమ్మిది మంది చనిపోవడంతో మిగతా సభ్యులు భయంతో అక్కడి నుంచి చెల్లాచెదురయ్యారు. ఎన్కౌంటర్ గురించి తెలియగానే మధు తన వద్ద ఉన్న బోరు తుపాకీ, 25 రౌండ్లను గూడూరు అటవీ ప్రాం తంలో దాచి నర్సంపేటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కాడు. షేర్ మధుపై హత్య, బెదిరింపు కేసులు.. షేర్ మధుపై గూడూరు మండలం బొద్దుగొండ చిల్లగండి తండావద్ద జరిగిన ఇద్దరిని చంపిన కేసు, ఖానాపురం మండలం బుధరావుపేటలో నకిలీ తుపాకీతో కొమ్మినేని సోమయ్య అనే వ్యక్తిని బెదిరించిన కేసు, ఇదే గ్రామంలో పసునూరి అనూష అనే అమ్మాయిని మోసం చేసిన కేసులు ఉన్నాయి. షేర్ మధును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్, గూడూరు, మహబూబాబాద్ టౌన్ సీఐలు బానోత్ రమేష్, షేక్ అబ్దుల్ జబ్బార్, ఎస్సైలు సతీష్, యాసిన్, సిబ్బంది పాల్గొన్నారు. -
మిలీషియా కమాండర్ అరెస్టు
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): మావోయిస్ట్‌లకు కొరియర్‌గా పనిచేస్తూ.. కార్యకలాపాలకు ఆకర్షితుడిగా మారి 37 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన మిలీషియా కమాండర్‌ని చింతూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మిలీషియా కమాండర్ అరెస్ట్ వివరాలను సోమవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా చీపూరుగూడెంకి చెందిన ఇరవై ఏళ్ల మిలీషియా కమాండర్ మదివి మాస అలియాస్ (పండమాస, సుభాష్ మహేష్, పద,సురేష్) అయిదేళ్లుగా మావోయిస్ట్ కార్యాకలాపాల్లో పాల్గొంటున్నాడు. చీపురుగూడెంలో హిడుమల్ ఎస్‌జడ్‌సీఎం, డీకేఎస్‌జడ్‌సీఎం బెటాలియన్ కమాండర్ ద్వారా మావోయిస్ట్ పార్టీలో చేరి, మరో 30 మందితో 15 రోజులు ఎలమగొండలో మావోయిస్ట్ దళంతో రన్నింగ్, 303, 12 బోర్ రైఫిల్ ఫైరింగ్ వంటి వాటిలో ప్రత్యేక తర్ఫీదు పొందాడు. మావోయిస్ట్ హిడుమల్ ఆధ్వర్యంలో సప్లయ్ టీం సభ్యుడిగా చేరి సుమారు రూ.10.50 లక్షలతో మావోయిస్ట్‌లకు అవసరమైన మోటార్ బైక్, మందులు, మొబైల్స్, టాబ్స్,12 వాట్స్ బేటరీస్, వైర్ బండిల్స్,క్లాత్స్,కిట్ బేగ్స్, రేషన్, పెట్రోలు, డీజిల్, తుపాకులు కొనుగోలు చేసి సరఫరా చేసేవాడు. అనంతరం మిలీషియా కమాండర్‌గా మారి అనేక సంఘటనల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మార్చి 11, ఏప్రిల్ 24వ తేదీల్లో చత్తీస్‌గఢ్ జిల్లా భుర్కంపాల్ సంఘటనల్లో 37 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చిన సంఘటనలో నిందితుడిగా ఉన్నాడు. ఇతడిపై ఒడిశా ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును ప్రకటించింది. శుక్రవారం చింతూరు డివిజన్ ఏటపాక మండలం పిచుకులపాడు టి.జంక్షన్ వద్ద ఉన్నతాధికారుల ఆదేశాలపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం వైపు నుంచి వస్తున్న ఆటోను తనిఖీ చేస్తుండగా ఆటోలో నుంచి నుంచి దూకి పారిపోతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ చేయగా మిలిషీయా కమాండర్‌గా గుర్తించి అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. మావోయిస్ట్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ సత్ఫలితాలు సాధిస్తున్న ఐపీఎస్ ఓఎస్డీ అంబురాజన్ను అభినందించారు. నక్సల్స్ కార్యకలాపాలపై మరింత నిఘా పెంచాలని కోరారు. చింతూరు ఓఎస్డీ అంబురాజన్, ఓఎస్డీ వై.రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీ దిలిప్ కిరణ్,సీఐ ఆర్. రవికుమార్ పాల్గొన్నారు. -
మావోయిస్ట్ దళ కమాండర్ అరెస్ట్
నాగ్‌పూర్: మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోకల్ ఆపరేటింగ్ స్క్వాడ్(ఎల్ఓఎస్)లో కీలక సభ్యుడు, కసన్సూర్ దళ కమాండర్ రాణు పాండు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడ్చిరోలి జిల్లాలోని తన స్వగ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరవుతున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 2005లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన పాండు.. పలు కేసుల్లో కీలకనిందితుడిగా ఉన్నాడు. అతడి తలపై రెండు లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ఇటీవల ఎల్ఓఎస్ కు చెందిన ముగ్గురు సభ్యులు అంకుశ్(21), రామ్‌జీ పాండు(24), కన్హు(25) పోలీసుల ఎదుటలొంగిపోయి జనజీవనస్రవంతిలో కలిశారు. ఈ నేపథ్యంలోనే.. రాణు పాండును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
హిజ్బుల్ ముజాహిదీన్ కు కొత్త కమాండర్
శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ జమ్ము కశ్మీర్ కమాండర్ గా మహ్మద్ ఘజ్వానీ అలియాస్ సబ్జార్ అహ్మద్ భట్ ను నియమిస్తున్నట్టు ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు హిజ్బుల్ ఛీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. దక్షిణ కశ్మీర్ లోని రత్ సునాకు చెందిన ఘజ్వానీ బుర్మాన్ వనీ కి అత్యంత సన్నిహితుడు. కాగా ఘజ్వానీ నియామకాన్ని భద్రతా దళాలు దృవీకరించాల్సి ఉంది. శుక్రవారం భద్రతా దళాల చేతిలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ 22 ఏళ్ల బుర్మాన్ వనీ హతమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆరాష్ట్రంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మృతుల సంఖ్య 25 కు చేరింది. -
మరణం అంచున ఐసిస్ టాప్ కమాండర్
బీరుట్: సిరియాలో ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రసంస్థ అగ్రనేతల్లో ఒకరైన కమాండర్ ఒమర్ అల్ షీషానీ అమెరికా వైమానిక దాడిలో గాయపడ్డారు. ఆయన రఖా సిటీలోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై శ్వాస తీసుకుంటున్నారని సిరియాలో మానవహక్కుల పర్యవేక్షణ సంస్థ ప్రధాన అధికారి రమీ అబ్దుల్ రహ్మాన్ ఆదివారం మీడియాతో చెప్పారు. మార్చి 4న షదాది సిటీ లో ఒమర్ ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై జరి పిన దాడిలో ఒమర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది మరణించారని రహ్మాన్ వెల్లడించారు.