
కెమెరా , వంచకుడు వికాస్
కర్ణాటక, కృష్ణరాజపురం : సైన్యంలో కమాండర్ అంటూ ఓ వ్యక్తి ఇద్దరు వ్యక్తులను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు... వికాస్ అనే వ్యక్తి సైన్యంలో కమాండర్‌గా పనిచేస్తున్నాని, వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో తన వద్ద ఉన్న కెమెరా, బైక్‌ను విక్రయిస్తానని ఆన్‌లైన్‌లో పోర్టల్‌లో ప్రకటించాడు. ప్రకటన చూసిన బెంగళూరుకు చెందిన ప్రశాంత్, యోగీశ్‌లు వాటిని కొనడానికి ఆసక్తి చూపారు.
అయితే వస్తువులు తమకు ఇచ్చిన అనంతరమే డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో అలా కుదరదని, తన ఖాతాకు ముందుగా డబ్బులు జమ చేస్తేనే వస్తువులు అప్పగిస్తానంటూ తెలిపాడు. తాను సైన్యంలో కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని నమ్మించడానికి ఆర్మీ దుస్తుల్లో తీసుకున్న ఫోటోతో పాటు నకిలీ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్‌కార్డులతో పాటు వస్తువులను కూడా బాధితులకు పంపించాడు. వీటన్నింటిని చూసి నిజమేనని భావించిన బాధితులు కొద్ది రోజుల క్రితం వికాస్ ఖాతాకు డబ్బులు జమ చేసారు. అనంతరం వస్తువుల కోసం ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment