
మావోయిస్ట్ దళ కమాండర్ అరెస్ట్
నాగ్పూర్: మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోకల్ ఆపరేటింగ్ స్క్వాడ్(ఎల్ఓఎస్)లో కీలక సభ్యుడు, కసన్సూర్ దళ కమాండర్ రాణు పాండు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడ్చిరోలి జిల్లాలోని తన స్వగ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరవుతున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 2005లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన పాండు.. పలు కేసుల్లో కీలకనిందితుడిగా ఉన్నాడు. అతడి తలపై రెండు లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు.
ఇటీవల ఎల్ఓఎస్ కు చెందిన ముగ్గురు సభ్యులు అంకుశ్(21), రామ్జీ పాండు(24), కన్హు(25) పోలీసుల ఎదుటలొంగిపోయి జనజీవనస్రవంతిలో కలిశారు. ఈ నేపథ్యంలోనే.. రాణు పాండును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.