ఇజ్రాయెల్- హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య 4 వేలు దాటింది. ఇజ్రాయెల్ హమాస్‌ను పూర్తిగా మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే పాలస్తీనా అంతటా భీకర దాడులు కొనసాగుతున్నాయి. కాగా హమాస్ ఉగ్ర సంస్థను ఎవరు నడుపుతున్నారు? ఈ గ్రూప్‌లోని ‘మోస్ట్ వాంటెడ్’గా ఉన్నవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హమాస్ అనేది పాలస్తీనా ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ సభ్యులు గాజాపై ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఇక్కడి ప్రజల మధ్య వారు రహస్యంగానే ఉంటూనే సొంత సైన్యాన్ని సిద్ధం చేస్తారు. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంటారు. ఇటువంటి దాడులకు ఇరాన్ బహిరంగంగా హమాస్‌కు సహాయం చేస్తున్నదనే వార్తలు వినిపిస్తుంటాయి.
హమాస్‌లో వేర్వేరు విభాగాలు ఉన్నాయి. దీనిలో అత్యంత ప్రమాదకరమైనది సైనిక విభాగం. పలు దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. హమాస్ సైనిక కమాండర్ల జాబితాలో మహ్మద్ దీబ్ అల్ మస్రీ పేరు వినిపిస్తుంది. ఇతనిని అబూ ఖలీద్ అని కూడా అంటారు. అబూ ఖలీద్ హమాస్ సైనిక సంస్థ ఐజే అల్ దిన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్‌కు అధిపతి. ఇజ్రాయిలీలు ఈ ప్రమాదకరమైన కమాండర్‌ను ‘మ్యాన్ ఆఫ్ డెత్’ అని పిలుస్తారు.
హమాస్‌లో వినిపించే మరో నేత పేరు మార్వాన్ ఇస్సా, అతను టాప్ మోస్ట్ కమాండర్లలో ఒకడు. అతను ఐజే అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్‌కు డిప్యూటీ కమాండర్. మార్వాన్ ఐదేళ్లుగా ఇజ్రాయెల్ చెరలో ఉన్నాడు. ఇజ్రాయెల్‌పై దాడులు చేయడంలో కీలకపాత్ర వహించాడని చెబుతారు.
హమాస్ టాప్ కమాండర్లలో మరొకని పేరు యాహ్యా సిన్వార్. ఇతను హమాస్ పొలిటికల్ బ్యూరోను పర్యవేక్షిస్తుంటాడు. అమెరికా బ్లాక్ లిస్టులో సిన్వార్ పేరు చేరింది. సిన్వార్ హమాస్ భద్రతా సేవ మజ్ద్‌కు అధిపతి కూడా. హమాస్ చేపట్టే దాడులకు సంబంధించిన వ్యూహాలను రూపొందించడంలో ఇతను కీలకంగా వ్యవహరిస్తుంటాడు.
ఇది కూడా చదవండి: యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు?
Comments
Please login to add a commentAdd a comment