సీఎం జగన్‌తో తూర్పు తీర రక్షక దళ కమాండర్ భేటీ | East Coast Guard Commander Paramesh Sivamani met AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో తూర్పు తీర రక్షక దళ కమాండర్ భేటీ

Published Fri, Jan 27 2023 6:34 PM | Last Updated on Fri, Jan 27 2023 6:41 PM

East Coast Guard Commander Paramesh Sivamani met AP CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: తూర్పు తీర రక్షక దళ కమాండర్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ పరమేశ్‌ శివమణి .. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

తూర్పు తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లపై ఈ భేటీలో చర్చ జరిగింది. సవాళ్లను అధిగమించేందుకు తీర రక్షకదళం చేపట్టిన చర్యలను సీఎం జగన్‌కు వివరించారు ఏడీజీ పరమేశ్‌ శివమణి. అలాగే సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో కోస్ట్‌గార్డ్‌ ఉన్నతాధికారులు డీఐజీ యోగేంధర్‌ ఢాకా, కమాండెంట్‌ కే.మురళి, డిప్యూటీ కమాండెంట్‌ ఏబి.రామమ్‌ కూడా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement