East coast
-
ఆదాయార్జనలో వాల్తేరు డివిజన్ టాప్
సాక్షి, విశాఖపట్నం: ఆదాయార్జనలో వాల్తేరు డివిజన్ దూకుడు కొనసాగిస్తోంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ప్రయాణికుల రాకపోకలతో పాటు ఆదాయార్జనలోనూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది.ఈస్ట్‌కోస్ట్ జోన్లో అత్యధిక ఆదాయం తీసుకొస్తున్న డివిజన్‌గా విశాఖపట్నం నిలవగా.. అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న రైలుగా విశాఖ నుంచి బయలుదేరుతున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలిచింది. భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న జోన్లో టాప్–10 ఆదాయమిస్తున్న రైళ్లలో నాలుగు వాల్తేరు నుంచి ప్రారంభమవుతున్నవే ఉండటం గమనార్హం. ఈస్ట్‌కోస్ట్ డివిజన్‌కు ఇదే బంగారు బాతు వాల్తేరు డివిజన్ ఎప్పటిమాదిరిగానే ఈస్ట్‌కోస్ట్ జోన్లో నంబర్ వన్‌గా కొనసాగుతోంది. జోన్ ప్రధాన కేంద్రమైన భువనేశ్వర్‌ని తలదన్నేలా ఆదాయాన్ని అందిస్తూ.. వరుసగా నాలుగో ఏటా టాప్‌లో నిలిచింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ బంగారు బాతులా మారింది. అతి పెద్దదైన ఈ డివిజన్ పరిధిలో ఏటా 2.5 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు ఏటా సుమారు రూ.14 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుండగా.. ఇందులో సుమారు రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు ఒక్క వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది.2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఆర్ఎస్) ద్వారా రూ.478.28 కోట్లు రాగా.. అన్‌రిజర్వ్›డు టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) ద్వారా రూ.67.86 కోట్లు వచ్చింది. మొత్తంగా విశాఖ రైల్వేస్టేషన్ నుంచి రూ.546.14 కోట్లు ఆదాయం లభించింది. అలాగే భువనేశ్వర్ స్టేషన్‌కు రూ.493.01 కోట్లు, ఆ తరువాత స్థానాలలో పూరీ స్టేషన్‌కు రూ.276.55 కోట్లు, బ్రహ్మపూర్ రైల్వేస్టేషన్‌కు రూ.101.94 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా.. ప్రయాణికుల రాకపోకల విషయంలోనూ విశాఖ స్టేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి 2,77,11,147 మంది రాకపోకలు సాగించారు. భువనేశ్వర్ స్టేషన్ ద్వారా 2,63,46,444 మంది ప్రయాణాలు చేశారు.టాప్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్ అత్యధిక ఆదాయం అందిస్తున్న రైళ్ల విషయంలోనూ వాల్తేరు డివిజన్ నంబర్ వన్‌గా నిలిచింది. జోన్ నుంచి రాకపోకలు సాగిస్తున్న రైళ్లలో విశాఖ నుంచి బయలుదేరుతున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ నంబర్ వన్‌గా నిలిచింది. 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏకంగా రూ.89,73,35,413 ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 29 వరకూ రూ.39,05,31,575 ఆదాయం తీసుకొచ్చింది. రెండో స్థానంలో రూ.80.7 కోట్లు, రూ.35.59 కోట్లతో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఉండగా.. మూడో స్థానంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచింది. గతేడాది కోణార్క్ రూ.74.49 కోట్లు, ఈ ఏడాది రూ.31.13 కోట్లు ఆదాయాన్ని సాధించింది. ఇలా ఆదాయాన్ని ఆర్జించే టాప్–10 రైళ్లలో నాలుగు రైళ్లు విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతున్నవే ఉండటం విశేషం. విశాఖ నుంచి లోకమాన్యతిలక్ (ముంబై) వెళ్లే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ 8వ స్థానంలో, విశాఖ–సికింద్రాబాద్ వందేభారత్ టాప్–9లో, విశాఖ–నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ టాప్–10లో ఉన్నాయి. 11, 12వ స్థానాల్లో విశాఖ–హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ–సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ నిలిచాయి. -
సీఎం జగన్‌తో తూర్పు తీర రక్షక దళ కమాండర్ భేటీ
సాక్షి, తాడేపల్లి: తూర్పు తీర రక్షక దళ కమాండర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తూర్పు తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లపై ఈ భేటీలో చర్చ జరిగింది. సవాళ్లను అధిగమించేందుకు తీర రక్షకదళం చేపట్టిన చర్యలను సీఎం జగన్‌కు వివరించారు ఏడీజీ పరమేశ్ శివమణి. అలాగే సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారులు డీఐజీ యోగేంధర్ ఢాకా, కమాండెంట్ కే.మురళి, డిప్యూటీ కమాండెంట్ ఏబి.రామమ్ కూడా ఉన్నారు. -
కొత్త తరహా కథ
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘118’ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కనున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘‘కల్యాణ్‌రామ్‌గారు మా బ్యానర్లో మరో సినిమా చేయబోతున్నారు. కొత్త తరహా కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు మహేశ్ కోనేరు. విజయ్ హీరోగా నటించిన ‘విజిల్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు మహేశ్ కోనేరు. అలాగే కీర్తీ సురేష్ నటిస్తున్న ‘మిస్ ఇండియా’ చిత్రానికి కూడా ఈయనే నిర్మాత. -
హ్యాట్రిక్‌కి రెడీ
‘తేరి’(పోలీస్), ‘మెర్సల్’(అదిరింది) వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘బిగిల్’. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి సందర్భంగా తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ‘బిగిల్’ తెలుగు హక్కులను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ–‘‘స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా హక్కులు మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కల్పాతి అఘోరమ్గారికి, విజయ్‌గారికి స్పెషల్ థ్యాంక్స్. ‘118’ చిత్రంతో మా బ్యానర్లో సూపర్‌హిట్ సాధించాం. ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటి కీర్తీసురేశ్‌తో ‘మిస్ ఇండియా’ సినిమా నిర్మిస్తున్నాం. విజయ్, అట్లీ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘బిగిల్’ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. విజయ్‌గారి కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రమిది. త్వరలోనే తెలుగు టైటిల్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. -
తీరప్రాంతాలకు ఇన్కాయిస్ హెచ్చరిక
-
ఆంధ్రప్రదేశ్‌పైకి ప్రచండ అలలు
సాక్షి, హైదరాబాద్ : ఆఫ్రికా ఖండ తీర ప్రాంతాల్లో వీస్తున్న ప్రచండ గాలుల వల్ల భారత తూర్పు తీరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్కాయిస్) సవరించిన ప్రకటనను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలోని తీర ప్రాంతాల్లో 3 నుంచి 4 మీటర్ల ఎత్తున్న రాకాసి అలలు విరుచుకుపడతాయని ఆదివారం ఇన్కాయిస్ హెచ్చరించింది. ఇదే పరిస్థితి ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి వరకూ కొనసాగుతుందని చెప్పింది. ముఖ్యంగా అండమాన్ నికోబార్, తమిళనాడు, ఒడిశా తీరాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో సముద్ర నీరు బాగా ముందుకు వచ్చింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఆదివారం కేరళ వచ్చిన పెను అలల తాకిడి తీర ప్రాంతాల్లోని 100 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమ, మంగళవారాల్లో అలల తీవ్రత అండమాన్ నికోబార్‌లో ఎక్కువగా ఉంటుందని ఇన్కాయిస్ పేర్కొంది. -
‘ఈస్ట్‌కోస్ట్’ దివాలా ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్ : పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు దాదాపు రూ.2,323 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనందుకు ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ అనుమతినిచ్చింది. దివాలా పరిష్కారదారు (ఐఆర్పీ)గా దేవేంద్రప్రసాద్‌ను నియమించింది. ఆస్తుల విక్రయం, బదలాయింపు, తాకట్టు చేయరాదని సంస్థను ఆదేశించింది. ‘‘దివాలా ప్రక్రియ ప్రారంభమైనట్టు బహిరంగ ప్రకటన ఇవ్వండి. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) సైట్లో ఉంచడంతో పాటు మీడియా ద్వారా బహిరంగ ప్రకటనలివ్వండి. రుణదాతలతో కమిటీ వేసి కంపెనీ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోండి’’అని ఐఆర్‌పీని ఆదేశించింది. ఆయనకు సహకరించాలని ఈస్ట్‌కోస్ట్ ప్రమోటర్లు, అధికారులను ఆదేశించింది. ఎన్సీఎల్టీ సభ్యుడు బిక్కి రవీంద్రబాబు మూడు రోజుల క్రితం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరపల్లిలో 1,320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రం ఏర్పాటుకు ఎస్బీఐ, పీఎఫ్‌సీల నుంచి ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ భారీగా రుణం తీసుకుంది. ఎస్బీఐకి రూ.952 కోట్లు, పీఎఫ్సీకి గత డిసెంబర్ 31 నాటికి రూ.1,371 కోట్ల బకాయి ఉంది. ఏళ్లు గడుస్తున్నా రుణం ఇంకా పూర్తిగా చెల్లించలేదని ఎస్బీఐ తరఫు న్యాయవాది వి.కె.సాజిత్ చెప్పారు. బకాయిల చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని, కొంత గడువు కావాలని ఈస్ట్‌కోస్ట్ తరఫు న్యాయవాదులు కోరగా ట్రిబ్యునల్ సభ్యుడు తోసిపుచ్చారు. -
కరుణించు ప్రభూ!
నేడే బడ్జెట్ రైలు రాక జిల్లాకు బెర్తు దొరుకుతుందో.. లేదో.. పజాప్రతినిధుల ప్రతిపాదనలు ఏమవుతాయో.. కొత్త రైళ్లు.. సౌకర్యాలపై జిల్లావాసుల ఆశలు ఒడిశా పెత్తనం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ మరో బడ్జెట్ రైలు వస్తోంది. ఈసారైనా ఈ రైలు జిల్లాలో ఆగుతుందా లేక ఎప్పటిలాగే దూసుకుపోతుందా!.. అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రకు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకోవడం.. దాన్ని ఒడిశా వ్యతిరేకించడం.. ప్రత్యేక జోన్ ఇవ్వడం తప్పనిసరైతే శ్రీకాకుళం జిల్లాను ఈస్‌కోస్టు జోన్లోనే ఉంచాలనే కొత్త పల్లవి ఎత్తుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జోన్లో ఉంటూ ఇప్పటికే ఎంతో అన్యాయానికి గురవుతున్న జిల్లాకు ఈస్ట్‌కోస్ట్ నుంచి విముక్తి కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఎప్పుడూ నిరాశే కలిగిస్తున్నా.. ఈసారైనా ఆకాంక్షల నిధులు మోసుకొస్తుందేమోనన్న ఆశతో రైల్వే బడ్జెట్ కోసం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు గురువారం రైల్వే బడ్జెట్ సమర్పించనున్న తరుణంలో జిల్లాలో రైల్వేల పరిస్థితి చూస్తే.. ఏమున్నది గర్వకారణం అనిపించకమానదు. ఒడిశాలోని ఈస్ట్‌కోస్టు జోన్ పరిధిలోనూ.. అందులోని జిల్లాలోని సగం ప్రాంతం ఖుర్దా డివిజన్లో ఉండటంతో సౌకర్యాలన్నీ ఒడిశాకు తరలించుకుపోతూ.. అధిక ఆదాయం సంపాదిస్తున్న జిల్లాలోని స్టేషన్లపై ఉన్నతాధికారులు సవతి ప్రేమ చూపుతున్నారు. జిల్లాలోని పలాస స్టేషన్ ఏ గ్రేడ్ కాగా, ఆమదాలవలస, ఇచ్ఛాపురం స్టేషన్లను బీ గ్రేడ్‌గా గుర్తించారు. అయినప్పటికీ గ్రేడ్ల వారీ సౌకర్యాల కల్పనలో రైల్వే శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. ఆర్ఆర్బీ పరీక్షల కోసం జిల్లా విద్యార్థులు భువనేశ్వర్ వెళ్లాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో ఒడిశా అభ్యర్థులు ఇక్కడినుంచి వెళ్లేవారిని పరీక్షలకు హాజరుకాకుండా అడ్డుకుంటున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఒడిశా పెత్తనం వల్ల ఏళ్ల తరబడి వాల్తేరు ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. జిల్లాకు సంబంధించి అదనపు రైళ్లు, హాల్టులు, గేట్మెన్ లేని లెవల్ క్రాసింగులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పొందూరు-రాజాం రైల్వే లైను.. వంటి ఎన్నో డిమాండ్లు ఏళ్ల తరబడి ఉన్నా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్), పలాస, ఇచ్ఛాపురం స్టేషన్ల నుంచి ఏటా వందల కోట్ల ఆదాయం లభిస్తున్నా ఆ స్టేషన్లలో కనీస సౌకర్యాల కల్పనపై శ్రద్ధ చూపడం లేదు. గత బడ్జెట్ ఒక్క ప్యాసింజర్ రైలుకే పరిమితమైంది. పలాస వంటి ప్రధాన స్టేషన్ల సమీపంలో రైల్ ఓవర్ బ్రిడ్జి, వికలాంగులకు ఎలివేటర్లు, మౌలిక సదుపాయాల కల్పన కలగానే మిగిలిపోయింది. ఏపీలో చివరి జిల్లాగా, వెనుకబడిన, వలసల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు మరిన్ని రైళ్లు అవసరం. అదే విధంగా కోణార్క్, హౌరా వంటి రైళ్లలో బెర్తులన్నీ ఒడిశాలోనే నిండిపోతున్నాయి. ముంబై, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లడానికి నెల రోజుల ముందు ప్రయత్నించినా బెర్త్‌లు దొరకని పరిస్థితి. విశాఖ, ప్రశాంతి రైళ్లను భువనేశ్వర్ వరకు పొడిగించుకున్నారు. దీంతో ఇక్కడి వారికి ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్నాళ్లలో ఏపీకి కొత్త రాజధాని రానుంది. ఆ ప్రాంతానికి ఇచ్ఛాపురం నుంచి ఓ ప్యాసింజర్ రైలు వేయాలని జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ప్రతిపాదించారు. అదైనా మంజూరవుతుందో లేదో చూడాలి. -
పట్టించుకోండి ‘ప్రభూ’..
విజయనగరం టౌన్ : ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రధాన కేంద్రంగా ఇటు ఒడిశా, అటు రాయపూర్ లైన్లతో కలిసి విజయనగరం రైల్వేస్టేషన్ ప్రత్యేక జంక్షన్‌గా పేరొందింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే జిల్లాకు అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈస్ట్‌కోస్ట్ డివిజన్ నుంచి విశాఖను వేరు చేసి విశాఖకు ప్రత్యేక జోన్ తీసుకువస్తామని చేస్తున్న ప్రకటనలు అక్కడితో ఆగిపోకుండా త్వరలో కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో విశాఖకు ప్రత్యేక జోన్‌గా తీసుకువచ్చేందుకు ఉత్తరాంధ్ర ఎంపీలు కృషిచేయాలని మూడు జిల్లాల ప్రజలూ కోరుతున్నారు. అయితే నాలుగు డివిజన్లతో కలిపి విశాఖను జోన్‌గా చేసే ఆలోచన ఉన్నట్లు, ఈ బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా రైల్వే డివిజనల్ మేనేజరు ఎం.అనిల్ కుమార్ ఇటీవల కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును ఆయనే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు డీఆర్ఎంతో కేంద్రమంత్రి మాట్లాడుతూ గోదావరి, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైళ్లను విశాఖ నుంచి విజయనగరం వరకూ పొడిగించాలని అందుకు తగ్గ ప్రతిపాదనలు చేయాలని, ఎత్తురోడ్డు వద్ద రైల్వే బ్రిడ్జి విస్తరణ, ఏళ్లనాటి సమస్యగా ఉన్న వీటీ అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేటు ఏర్పాటు, గాజుల రేగ వద్ద రైల్వే అం డర్ బ్రిడ్జి ఏర్పాటు, వెంకటలక్ష్మి థియేటర్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణ, విశాఖ నుంచి బయలుదేరే కిరండోల్ ప్యాసింజర్‌కు అదనంగా మూడుబోగీలు ఏర్పాటుచేయాలంటూ ప్రతిపాదించాలని కోరారు. అలాగే మానాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. ఎన్‌హెచ్ 26ను నాలుగు లైన్లగా విస్తరిస్తూ పనులు ప్రారంభించాలని, అసంపూర్తిగా మిగిలి ఉన్న సీతానగరం రైల్వే ఓవర్ బ్రిడ్జి, గుమడాం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. రైల్వేస్టేషన్లో కంటోన్మెంట్ గూడ్స్‌షెడ్ వైపు మరో ఎంట్రీ నిర్మాణదశలో ఆగిపోయిందని, దాన్ని పూర్తి చేయాలన్నారు. అందుకు తగ్గవిధంగా రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. అయితే వీటన్నంటినీ ఉత్తరాంధ్ర ఎంపీలు అందరూ కలిసి విశాఖను ప్రత్యేక జోన్‌గా చూసేందుకు బడ్జెట్లో ప్రయత్నం చేయాలని హితవు పలికారు. అలాగే జిల్లాలోని గజపతినగరంలో పాసింజర్ రైళ్లు తప్ప ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కటి కూడా ఆగదు. చీపురుపల్లిలో ఫలక్‌నూమా, కోణార్క్ వంటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడి స్టేషన్లో హాల్టు ఉండే భువనేశ్వర్-తిరుమల, షాలీమార్ సూపర్‌ఫాస్ట్ రైళ్ల హాల్టు ఎత్తేశారు. పార్వతీపురం,బెలగాం స్టేషన్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో నెరవేరని హామీలు బొబ్బిలి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, విజయనగరం రైల్వే స్టేషన్లో అవుట్ పేషెంట్ విభాగం, వ్యాధి నిర్ధారణ కేంద్రం తదితర హామీలన్నీ గతంలో పేర్కొన్నవే. అయితే వీటిలో దేనికీ ప్రత్యేకించి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. దీన్ని బట్టి గత కేటాయింపులపై కేంద్రప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వందేళ్ల చరిత్ర కలిగిన బొబ్బిలి రైల్వేస్టేషన్‌ను ఆదర్శ రైల్వే స్టేషన్‌గా చేస్తామని 2011లో కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆదర్శానికి సంబంధించి ఏ పనులూ జరగలేదు. ఇక మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మి ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’ పరిస్థితి కూడా డిమాండ్‌గానే మిగిలిపోయింది. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశాఖ-కోరాపుట్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కేవలం వారంలో రెండురోజులు మాత్రమే నడుపుతున్నారు. వాస్తవానికి ఐదురోజులు నడపాల్సి ఉంది. వీటీ అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేట్ ఏర్పాటుచేయాలన్న వినతులు చెత్తబుట్టలోకి చేరినట్లుగానే అంతా భావిస్తున్నారు.