∙కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘118’ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో మూవీ తెరకెక్కనున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘‘కల్యాణ్‌రామ్‌గారు మా బ్యానర్‌లో మరో సినిమా చేయబోతున్నారు. కొత్త తరహా కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు మహేశ్ కోనేరు. విజయ్ హీరోగా నటించిన ‘విజిల్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు మహేశ్ కోనేరు. అలాగే కీర్తీ సురేష్ నటిస్తున్న ‘మిస్ ఇండియా’ చిత్రానికి కూడా ఈయనే నిర్మాత.
Comments
Please login to add a commentAdd a comment