
కల్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి తల్లికొడుకుగా నటించిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'(Arjun Son Of Vyjayanthi). రీసెంట్ గా ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. స్టోరీ రొటీన్ గా ఉండటంతో మిశ్రమ స్పందన వచ్చింది. అందుకు తగ్గట్లే వసూళ్లు కూడా స్టడీగానే ఉన్నాయి. ఇంతకీ రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఎంత?(Movie Day 2 Collection)
బింబిసార తర్వాత కల్యాణ్ రామ్ కి సరైన హిట్ పడలేదు. దీంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. ప్రేక్షకుల నుంచి ఫుల్ మార్క్స్ రాలేదు. తొలిరోజు రూ.5.15 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. రెండో రోజుకి కాస్త డ్రాప్ కనిపించింది. దీంతో రెండో రోజు కేవలం రూ.3.40 కోట్ల మాత్రమే వచ్చాయి.
(ఇదీ చదవండి: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్)
మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమాకు రూ.8.55 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. వీకెండ్ దాటిన తర్వాత సినిమా నిలబడితే బ్రేక్ ఈవెన్ దాటొచ్చు. కల్యాణ్ రామ్ మాత్రం శనివారం జరిగిన సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. మంగళవారం కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?
కథ విషయానికొస్తే.. పోలీసాఫీసర్ వైజయంతి. ఆమె కొడుకు అర్జున్. ఓ క్రిమినల్ తన తండ్రిని చంపేశాడని అర్జున్ పగతో రగిలిపోతుంటాడు. తల్లి మాత్రం న్యాయబద్ధంగానే అతడిని శిక్షిద్దామని అంటుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో అర్జున్.. సదరు హంతకుడిని చంపేస్తాడు. అలా అర్జున్ క్రిమినల్ అవుతాడు. మరోవైపు పఠాన్ అనే క్రిమినల్ వైజయంతిని చంపాలని చూస్తుంటాడు. మరి తల్లి కొడుకు కలిశారా? చివరకు ఏమైందనేదే మిగిలిన స్టోరీ.
(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)
