Arjun S/O Vyjayanthi Movie
-
భావోద్వేగాలే నా బలం: ప్రదీప్ చిలుకూరి
‘‘చిన్నతనంలో మన బర్త్ డేని తల్లిదండ్రులు ఓ ఎమోషనల్‌లా ఫీలై సెలబ్రేట్ చేస్తారు. తల్లిదండ్రుల బర్త్ డేలను పిల్లలు గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేయడం కూడా ఓ మంచి ఎమోషన్స్ . ఇదే ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ కథాంశం’’ అని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి అన్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా, విజయశాంతి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.ఈ సందర్భంగా ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’(2016) సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఇద్దరు పెద్ద హీరోల కోసం రెండు కథలు సిద్ధం చేశాను. కానీ, ఆ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లలేదు. అలా దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చింది. కల్యాణ్‌రామ్‌గారితో మాట్లాడినప్పుడు ఓ మాస్ ఫిల్మ్ చేద్దామన్నారు. ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’లోని తల్లి పాత్రని విజయశాంతిగారు చేస్తేనే చేద్దామని ఆయన స్పష్టంగా చెప్పారు. విజయశాంతిగారికి కథ చెప్పగా కొన్ని మార్పులు సూచించారు.యూపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే కొడుకు అర్జున్స్ పాత్రలో కల్యాణ్‌రామ్, ఐపీఎస్ వైజయంతి పాత్రలో విజయశాంతి నటించారు. ఈ మూవీలో ఆమె యాక్షన్స్ సీక్వెన్స్ లు అద్భుతంగా చేశారు. ఎన్టీఆర్‌గారు సినిమా చూసి, బాగుందని చెప్పడం సంతోషం. అజనీష్ లోకనాథ్ అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చారు. ఓ దర్శకుడిగా భావోద్వేగాలను ప్రజెంట్ చేయడమే నా బలం’’ అని తెలిపారు. -
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నటి విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు.జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నేను, అన్న నిల్చున్నప్పుడు ఇలాంటి వేదికలపై నాన్న వచ్చి మాట్లాడేవారు. ఈ రోజు విజయశాంతి మాట్లాడుతుంటే మా నాన్న లేరనే లోటు భర్తీ అయిపోయింది. చాలామంది హీరోలు అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఏ మహిళ కూడా విజయశాంతి లాగా గొప్పదనం సాధించలేదు. తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. భారతదేశవ్యాప్తంగా హీరోలతో సమానంగా ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయశాంతి ఒక్కరే. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు లాంటి ఎన్నో గొప్ప కథలు, పాత్రలు చేసిన మరో నటి ఇండియాలోనే లేదు. ఈ ఘనత కేవలం ఆమెకు మాత్రమే దక్కింది. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా కథ కర్తవ్యం మూవీలో వైజయంతికి ఓ కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఐడియాతోనే ఈ కథ పుట్టినట్టు ఉంది' అని విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు. -
అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ..
అన్న కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కోసం తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎప్పుడూ అండగా ఉంటాడు. కల్యాణ్ రామ్ నటించిన పలు సినిమాల ఈవెంట్లకు తారక్ స్పెషల్ గెస్టుగా వెళ్లాడు. తాజాగా మరోసారి అన్న కోసం తమ్ముడు కదిలాడు. కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ (Arjun S/o Vyjayanthi Pre Release Event) శనివారం (ఏప్రిల్ 12) జరిగింది. ఈ కార్యక్రమానికి తారక్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు.విజయశాంతిని మాట్లాడనివ్వని ఫ్యాన్స్అతడిని చూసిన అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. అరుపులు, కేకలతో కార్యక్రమం దద్దరిల్లేలా చేశారు. అయితే స్టేజీపై ఎవరు మాట్లాడుతున్నా తన గురించే కేకలు వేస్తుండటంతో తారక్‌కు కోపమొచ్చింది. విజయశాంతి మైకు పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్టీఆర్‌ను కీర్తిస్తూ అభిమానులు కేకలేశారు. సీఎం.. సీఎం.. అని నినదిస్తూ ఆమెను మాట్లాడనివ్వలేదు.తారక్ ఆగ్రహంఒక్క నిమిషం సైలెంట్‌గా ఉంటే మాట్లాడతాను అని విజయశాంతి అభ్యర్థించినా అభిమానులు వినిపించుకోలేదు. దీంతో తారక్‌కు కోపమొచ్చింది. మౌనంగా ఉండకపోతే నేను స్టేజీపై నుంచి వెళ్లిపోతాను అంటూ సైగ చేశారు. దీంతో విజయశాంతి ఆయన్ను వెళ్లకుండా ఆపింది. మీ అభిమానుల ఉత్సాహం భయంకరంగా ఉంది. కట్రోల్ చేయలేకపోతున్నాం అంటూనే తన స్పీచ్ కొనసాగింది. సినిమాఅర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. కల్యాణ్ రామ్‌కు జంటగా సాయి మంజ్రేకర్ నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.చదవండి: తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి? -
Arjun Son of Vyjayanthi : ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
చివరి ఇరవై నిమిషాలు కన్నీళ్లు ఆపుకోలేకపోయా: హీరో ఎన్టీఆర్
‘‘ఈ వేదికపైన ఎన్నోసార్లు నేను, అన్న (కల్యాణ్ రామ్) నిల్చొని ఉన్నప్పుడు మా నాన్నగారు (హరికృష్ణ) రావడం, మాట్లాడటం జరిగింది. ఈరోజు విజయశాంతిగారు మాట్లాడుతుంటే మొదటిసారి వేదికపైన మా నాన్నగారు లేరనే లోటు తీరినట్టయింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో విజయశాంతిగారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘భారతదేశ చిత్ర పటంలో హీరోలతో సమానంగా నిల్చున్న ఏకైక మహిళ ఎవరన్నా ఉన్నారంటే అది విజయశాంతిగారు ఒక్కరే. ‘కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు’... ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారామె. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని చూశాను.విజయశాంతిగారు లేకపోతే ఈ చిత్రం లేదు. పృథ్వీ, సోహైల్ ఖాన్, ప్రదీప్ చిలుకూరి, సునీల్, అశోక్గార్లు... ఇలా ఎవరు లేకున్నా ఈ సినిమా లేదు. 18న ఈ మూవీ మీ ముందుకొస్తోంది. రాసిపెట్టుకోండి... ఆఖరుగా వచ్చే ఇరవై నిమిషాలు ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరక్కపోతే... అంత అద్భుతంగా తీశారు ప్రదీప్‌గారు. సినిమా చూస్తున్న నాకు కూడా కన్నీళ్లు ఆపుకోవడం కుదరలేదు. ఆ ఆఖరి ఇరవై నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక్క కారణం కల్యాణ్ అన్న మాత్రమే. దర్శకుడి ఐడియాని ఆయన నమ్మారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అన్న కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని నా నమ్మకం. మనసు పెట్టి, ప్రాణం పెట్టి నటించారు. బహుశా అది విజయశాంతిగారు కాకుండా వేరే వారు అయ్యుంటే ఆయన అంత అద్భుతంగా చేసేవారో కాదో నాకు తెలీదు. ఆమెను ఓ తల్లిగా నమ్మారు కాబట్టి అంత అద్భతంగా నటించారు. ప్రేక్షకులు, మా ఫ్యాన్స్ అందరూ ముందుగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ‘వార్ 2’ (హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించారు) కూడా మిమ్మల్ని అలరిస్తుంది. పక్కాగా ప్లాన్ చేసి ఈ ఏడాది మిమ్మల్ని అందర్నీ తప్పకుండా కలుస్తాను’’ అని చెప్పారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘మీరు చాలా సినిమాలు చూస్తారు. మేం కూడా చేస్తాం. సినిమా అయ్యాక పార్కింగ్‌కి వెళ్లి బైక్, కార్ స్టార్ట్ చేసుకోగానే సినిమాని మర్చిపోతాం. కానీ, చాలా అరుదుగా నటులుగా మాకు గానీ, ప్రేక్షకులుగా మీకు గానీ కొన్ని సినిమాలు ఇంటికెళ్లేదాకా మనసుని హత్తుకుంటాయి. అలాంటి సినిమా మా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఎన్టీ రామారావుగారు ఓ డిక్షనరీ. ఆయనలో కొంత వచ్చినా ఎవరైనా గొప్ప నటీనటులు అయిపోతారు. ఆయన వద్ద నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం నా అదృష్టం. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సెట్స్‌లో నేను అనుకున్నదానికంటే అద్భుతంగా, చాలా సౌకర్యంగా చూసుకున్నాడు కల్యాణ్ బాబు. ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి, సూపర్ హిట్ అని చెప్పాలి’’ అని అన్నారు. ఈ వేడుకలో కెమేరామేన్ రాంప్రసాద్, నటులు జోగినాయుడు, సందీప్, రచయిత శ్రీకాంత్ విస్సా, ్ర΄÷డక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, రచయిత రఘురామ్ పాల్గొన్నారు. -
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
'దేవర' కోసం లెక్క ప్రకారం ఎన్టీఆర్(NTR) రావాలి. కానీ ఆ రోజు అభిమానుల తాకిడి వల్ల ఈవెంట్ జరగలేదు. దీంతో తారక్ మరో ఫంక్షన్ వచ్చే అవకాశం చాన్నాళ్ల తర్వాత మొన్న జరిగింది. ఇప్పుడు మరోసారి తన సోదరుడు కల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ వచ్చాడు. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) హైదరాబాద్ లో జరిగిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'(Arjun Son Of Vyjayanthi Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అన్నయ్య కల్యాణ్ రామ్ సినిమా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అలానే విజయశాంతి గారు మాట్లాడుతుంటే నాన్న లోటు లేనట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు.ఈ ఆగస్టు 14న తాను నటించిన 'వార్ 2'(War 2 Movie) విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. మళ్లీ ఎప్పుడు కనబడతానో లేదో.. ఓసారి తనివితీరా మాట్లాడనివ్వండి అని అభిమానులని ఉద్దేశించి ఇదే ఈవెంట్ లో మాట్లాడాడు. దీనిబట్టి చూస్తుంటే 'వార్ 2' కోసం తప్పితే ఈ మధ్యలో ఎక్కడా తారక్ కనిపించడనమాట.(ఇదీ చదవండి: ఆకట్టుకునేలా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ రిలీజ్) -
ఆకట్టుకునేలా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్
కల్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి తల్లికొడుకుగా నటించిన కొత్త సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'(Arjun Son Of Vyjayanthi Movie). ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానుంది. దీంతో గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లో శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) ట్రైలర్ విషయానికొస్తే.. స్టోరీ ఏంటనేది విడమరిచి చెప్పేశారు. వైజాగ్ లో అర్జున్ అనే రౌడీ. తల్లి వైజయంతి ఏమో ఐపీఎస్. పెంపకం విషయమై తల్లికొడుకు మధ్య మనస్పర్థలు వస్తాయి. దీంతో మాటలు ఉండవు. మరోవైపు విలన్ కి అర్జున్ తో గొడవ. దీంతో ఇతడి తల్లిని ఇబ్బంది పెడతారు. తర్వాత ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.విజువల్స్, తల్లి కొడుకు ఎమోషన్స్, ఫైట్స్.. ఇవన్నీ ట్రైలర్ వరకు బాగానే ఉన్నాయి. మరి మూవీలో ఎమోషన్స్ ని ఎంతవరకు వర్కౌట్ చేస్తారు, ఏంటనే దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కల్యాణ్ రామ్ అయితే చాలా నమ్మకంతో ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్) -
ముచ్చటగా బంధాలే...
కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ తల్లి పాత్రలో విజయశాంతి నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘ముచ్చటగా బంధాలే ఇచ్చటనే కలిశాయే...’ అంటూ సాగే రెండో పాటని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. రఘురామ్ సాహిత్యం అందించిన ఈ పాటని హరిచరణ్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో విజయశాంతి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ రామ్ తల్లి గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ సినిమా కోసం నిజాయతీగా చాలా కష్టపడ్డాం... చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకి జన్మనిస్తుంది. మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. ఈ కథాంశంతో రూపొందిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ నెల 12న మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తమ్ముడు (ఎన్టీఆర్) వస్తాడు’’ అన్నారు.