
'దేవర' కోసం లెక్క ప్రకారం ఎన్టీఆర్(NTR) రావాలి. కానీ ఆ రోజు అభిమానుల తాకిడి వల్ల ఈవెంట్ జరగలేదు. దీంతో తారక్ మరో ఫంక్షన్ వచ్చే అవకాశం చాన్నాళ్ల తర్వాత మొన్న జరిగింది. ఇప్పుడు మరోసారి తన సోదరుడు కల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ వచ్చాడు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
హైదరాబాద్ లో జరిగిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'(Arjun Son Of Vyjayanthi Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అన్నయ్య కల్యాణ్ రామ్ సినిమా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అలానే విజయశాంతి గారు మాట్లాడుతుంటే నాన్న లోటు లేనట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు.
ఈ ఆగస్టు 14న తాను నటించిన 'వార్ 2'(War 2 Movie) విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. మళ్లీ ఎప్పుడు కనబడతానో లేదో.. ఓసారి తనివితీరా మాట్లాడనివ్వండి అని అభిమానులని ఉద్దేశించి ఇదే ఈవెంట్ లో మాట్లాడాడు. దీనిబట్టి చూస్తుంటే 'వార్ 2' కోసం తప్పితే ఈ మధ్యలో ఎక్కడా తారక్ కనిపించడనమాట.
(ఇదీ చదవండి: ఆకట్టుకునేలా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ రిలీజ్)