
కొన్ని సినిమాలు కొందరు నటుల కెరీర్ ని మార్చేస్తుంటాయి. టాలీవుడ్ లో ఇలాంటి యాక్టర్స్ చాలామందే ఉంటారు. అందులో పృథ్వీ ఒకడు. అప్పుడెప్పుడో తెలుగులో పలు మూవీస్ చేశాడు. తర్వాత పూర్తిగా సైడ్ అయిపోయాడు. మళ్లీ సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్'తో కమ్ బ్యాక్ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ విలన్ గా ఆకట్టుకున్న పృథ్వీ.. తెలుగుతో పాటు పరభాష చిత్రాల్లో నటిస్తున్నాడు. 'సంక్రాంతికి వస్తున్నాం', 'తండేల్', 'జాట్'తో పాటు రీసెంట్ గా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో నటించాడు. తాజాగా ఈచిత్ర సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'యానిమల్, జాట్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలు సూపర్ హిట్స్. అందులో నేను నటించిన కొన్ని సీన్స్ తీసేశారు. కానీ ఈ సినిమాలో (అర్జున్ సన్నాఫ్ వైజయంతి)నేను నటించిన ప్రతి సీన్ అలానే ఉంచారు. ఓ నటుడికి సంతృప్తి ఇచ్చే విషయం ఇది' అని పృథ్వీ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు)