హ్యాట్రిక్‌కి రెడీ | East Coast Productions acquires Telugu rights of Vijay Bigil | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 13 2019 3:24 AM | Last Updated on Fri, Sep 13 2019 3:24 AM

East Coast Productions acquires Telugu rights of Vijay Bigil - Sakshi

విజయ్‌

‘తేరి’(పోలీస్‌), ‘మెర్సల్‌’(అదిరింది) వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘బిగిల్‌’. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కల్పాతి అఘోరామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి సందర్భంగా తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ‘బిగిల్‌’ తెలుగు హక్కులను ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ–‘‘స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా హక్కులు మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కల్పాతి అఘోరమ్‌గారికి, విజయ్‌గారికి స్పెషల్‌ థ్యాంక్స్‌. ‘118’ చిత్రంతో మా బ్యానర్‌లో సూపర్‌హిట్‌ సాధించాం. ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటి కీర్తీసురేశ్‌తో ‘మిస్‌ ఇండియా’ సినిమా నిర్మిస్తున్నాం. విజయ్, అట్లీ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్‌ చిత్రం ‘బిగిల్‌’ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. విజయ్‌గారి కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రమిది. త్వరలోనే  తెలుగు టైటిల్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement