Telugu Rights
-
సితార చేతికి విజయ్ 'లియో'.. అన్ని కోట్లు పెట్టి!
దళపతి విజయ్‌కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. పాజిటివో నెగటివో పక్కనబెడితే ఈ హీరో గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. కొన్నిసార్లు ట్రోల్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్లందరూ విజయ్ 'లియో' కోసం ఎదురుచూస్తున్నారు. అయితే దీని రిలీజ్‌కి ఇంకా మూడు నెలల టైముంది. అంతలోనే ఇతడు టాలీవుడ్లో ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'లియో'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. ఇతడి లాస్ట్ మూవీ 'విక్రమ్'.. తెలుగు ప్రేక్షకుల్ని ఓ రేంజులో అలరించింది. అలానే ఆ సినిమాతో 'లియో'కు కనెక్షన్స్ ఉందనే టాక్.. దీనిపై మరింత హైప్‌ని తీసుకొచ్చింది. దీంతో తెలుగులో థియేట్రికల్ రైట్స్ ని ఏకంగా రూ.23 కోట్లకు అమ్మారనే టాక్ వినిపిస్తోంది. (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) 'లియో'.. తెలుగు థియేట్రికల్ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాతోనే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతోంది. అయితే విజయ్ మూవీ హక్కులు ఇంత మొత్తానికి అమ్మారనేది మాత్రం రికార్డే. ఎందుకంటే 'వారసుడు' చిత్రాన్ని రూ.18 కోట్లకు అమ్మారని టాక్ వినిపించింది. అప్పుడు ఇప్పుడు నంబర్స్‌ని పోల్చి చూస్తే.. దళపతి విజయ్ సరికొత్త రికార్డ్ సృష్టించినట్లే! లోకేశ్ కనగరాజ్ తీస్తున్న ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా త్రిష నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఈ మధ్యనే వచ్చిన 'నా రెడీ' అనే పాట ఎంతలా ట్రెండ్ అయిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా విడుదలకు ఇంకా చాలా సమయమున్నప్పటికీ 'లియో' బిజినెస్ గట్టిగానే జరుగుతోంది. We are elated and extremely proud to be associated with one of the most awaited films of this year! 🤩 Sithara Entertainments is venturing into distribution with immaculate action spectacle, #Thalapathy @actorvijay and Sensational director @Dir_Lokesh 's #LEO in Telugu States.… pic.twitter.com/pt9yhZrvNH — Sithara Entertainments (@SitharaEnts) July 19, 2023 (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) -
Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో సాలిడ్ యాక్షన్ మూవీ 'సలార్'ను హోంబలే ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు. నేడు (జులై 6) టీజర్‌ను కూడా వదిలారు మేకర్స్.. 'కేజీయఫ్' బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. సెప్టెంబరు 28న మొదటి భాగం రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో అన్ని భాషలలో భారీ బిజినెస్ జరగనుంది. (ఇదీ చదవండి: నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్) ఇప్పటికే ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసేందకు భారీగానే పోటీ పడుతున్నారు. సలార్ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను అల్లు అరవింద్ తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గీతా ఆర్ట్స్ 50వ వార్షికోత్సవాన్ని త్వరలో జరుపుకోనుంది. అందుకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. అయితే, సలార్‌ను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ వారి నుంచి రైట్స్ కొనుగోలు చేయడం అంత సులభమైన విషయం కాదు. సలార్‌కు పెరుగుతున్న బజ్ కారణంగా సినిమా రైట్స్‌కు భారీగానే ధరను ఫిక్స్ చేస్తారు. లేదా కొన్ని షరతులతో మూవీ రైట్స్‌ను విక్రయిస్తారు. గతంలో కూడా KGF 2 తెలుగు హక్కులను వారు విక్రయించలేదు. కమీషన్ ఆధారంగా తెలుగులో విడుదల చేశారు. దాంతో భారీగానే లాభాలను పొందారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు) అలాంటిది కేజీఎఫ్-2 రైట్స్‌నే అమ్మకపోతే సలార్ తెలుగు రైట్స్ అమ్ముతారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అల్లు అరవింద్ వారిని ఒప్పించగలుగుతారా? అనేదానికి సమాధానం త్వరలో తెలుస్తుంది. అయితే, 'కాంతార' సినిమాను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్స్ వారే... ఇదే మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌నే. కాబట్టి వారితో అల్లు అరవింద్‌కు మంచిపరిచాయాలే ఉన్నాయి కాబట్టి సలార్ అవకాశం కూడా రావచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. -
వామ్మో! ‘అవతార్ 2’ తెలుగు రైట్స్‌కు అన్ని కోట్లా?
2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన హాలీవుడ్ చిత్రం ‘అవతార్’. ఈ సినిమాతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచలోనికి తీసుకేళ్లాడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. భారత ప్రేక్షకులను సైతం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాకు సీక్వెల్‌గా రానున్న సంగతి తెలిసిందే. అవతార్ 2(ది వే ఆఫ్ వాటర్) పేరుతో సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చదవండి: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి దాదాపు 160 దేశాల్లో ఈ ఏడాది డిసెంబర్ 16న అవతార్ 2 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో హై ఎండ్ టెక్కాలజీతో నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే బిజినెస్ విషయంలో వివిధ దేశాల్లో రికార్డు సృష్టిస్తోందని సమాచారం. ఇండియాలో సైతం అవతార్ 2 భారీగానే బిజినెస్ చేసేలా ఉందని సినీ విశ్లేషకుల అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాకు విపరీతమైన హైప్ నెలకొంది. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు అందుకే అవతార్ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తిగా ఉన్నారట. దీంతో తెలుగులో ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు వినికిడి. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ సినిమాను కొనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి విడుదలకు ముందే ఇన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి. -
బాప్రే.. కేజీఎఫ్ 2 తెలుగు రైట్స్‌కి అన్ని కోట్లా?
కేజీఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా అది. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న ధరలు విని బయ్యర్లకు వణుకు పుడుతుందట. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు భాషల రైట్స్‌కు కూడా నిర్మాతలకు భారీగానే ధరలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్ సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ కేజీఎఫ్ చాప్టర్ 2 తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు ఈ వార్త సారాంశం. మొదట కేజీఎప్ 1 తెలుగు హక్కుల్ని దక్కించుకున్న వారాహి సంస్థ .. కేజీఎఫ్ 2 హక్కులను కూడా అడిగిందట. అయితే నిర్మాతలు ఎక్కువ చెప్పడంతో వారాహి సంస్థ తప్పుకుందట. దీంతో దిల్ రాజు రంగంలోకి దిగి తెలుగు హక్కులను దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా రూ.65 కోట్ల భారీ ధరను వెచ్చించినట్లు టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే. చదవండి : ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు రేటు పెంచేసిన మాస్ మహారాజా.. నిర్మాతలకు షాకే! -
భజ్జీ సినిమా హక్కులు ఎ.ఎన్.బాలాజీకీ
క్రికెటర్ హర్భజన్ సింగ్, నటుడు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. ‘సింగ్ అండ్ కింగ్’ అన్నది ఉపశీర్షిక. మాజీ మిస్ శ్రీలంక, తమిళ బిగ్ బాస్ విన్నర్ లోస్లియా హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్ పాల్ రాజ్–శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. 25 కోట్ల బడ్జెట్‌తో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ.ఎన్.బాలాజీ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎ.ఎన్ . బాలాజీ మాట్లాడుతూ –‘‘ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ నేపథ్యంలో ప్రేమలు, గొడవల మధ్య ఆద్యంతం ఉత్కంఠగా నడిచే చిత్రమిది. చివరి షెడ్యూల్ ప్రస్తుతం కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. హర్భజన్ సింగ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కానుంది’’ అన్నారు. -
కరాబు క్రేజ్
ధృవ్ సర్జా, రష్మికా మందన్నా జంటగా నందన్ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పొగరు’. ‘కరాబు మైండు కరాబు.. మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు..’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్‌తో చాలామంది తెలుగు హక్కుల కోసం పోటీపడగా వైజాగ్‌కి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్ డి. ప్రతాప్‌రాజు సొంతం చేసుకున్నారు. సాయిసూర్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సందర్భగా నిర్మాత డి. ప్రతాప్‌రాజు మాట్లాడుతూ– ‘‘ఒక్క పాటతో యూట్యూబ్‌లో, టీవీ చానల్స్‌లో రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుని, ట్రెండింగ్‌లో ఉన్న ‘పొగరు’ చిత్రం తెలుగు హక్కులను 3కోట్ల 30 లక్షలకి సొంతం చేసుకున్నాం. చందన్ శెట్టి, అర్జున్ జన్య సంగీతం సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగులో ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు’’ అన్నారు. -
హ్యాట్రిక్‌కి రెడీ
‘తేరి’(పోలీస్), ‘మెర్సల్’(అదిరింది) వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘బిగిల్’. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి సందర్భంగా తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ‘బిగిల్’ తెలుగు హక్కులను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ–‘‘స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా హక్కులు మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కల్పాతి అఘోరమ్గారికి, విజయ్‌గారికి స్పెషల్ థ్యాంక్స్. ‘118’ చిత్రంతో మా బ్యానర్లో సూపర్‌హిట్ సాధించాం. ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటి కీర్తీసురేశ్‌తో ‘మిస్ ఇండియా’ సినిమా నిర్మిస్తున్నాం. విజయ్, అట్లీ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘బిగిల్’ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. విజయ్‌గారి కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రమిది. త్వరలోనే తెలుగు టైటిల్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. -
ఆమె వస్తోంది
‘నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమలాపాల్ నటించిన తొలి థ్రిల్లర్ మూవీ ‘ఆడై’. రత్నకుమార్ దర్శకత్వంలో రాంబాబు కల్లూరి, ఎం. విజయ్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు. ‘ఆమె’ పేరుతో చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన తెలుగులో విడుదల చేయనున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘రత్నకుమార్ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. అమలాపాల్ బోల్డ్ లుక్ కూడా సంచలనం సృష్టించింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఒ. ఫణీంద్ర కుమార్, సంగీతం: ప్రదీప్ కుమార్, ఊర్క, కెమెరా: విజయ్ కార్తీక్ ఖన్నన్, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్: హరిహర సుతన్. -
మనిషి ఒక్కడే.. మొహాలు రెండు!
‘ఇరుముగన్’... అంటే రెండు మొహాలు ఉన్నవాడు అని అర్థం. విక్రమ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం టైటిల్ ఇది. సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రల్లో కనిపించి, తనలో విలక్షణ నటుడు ఉన్న విషయాన్ని విక్రమ్ నిరూపించుకున్నారు. గతేడాది విడుదలైన ‘ఐ’లో ఎవరూ ఊహించని విచిత్రమైన గెటప్‌లో కనిపించి, ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ‘ఇరుముగన్’లో విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారాయన. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ముఖ్య తారలుగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థమీన్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఎన్కేఆర్ ఫిలింస్ పతాకంపై ‘ఇంకొక్కడు’ పేరుతో నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘‘యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రాలేదు. హై టెక్నికల్ వేల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఇది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. విక్రమ్ నటన, నయనతార, నిత్యామీనన్ అందచందాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆగస్టు 2న చెన్నైలో తమిళ వెర్షన్ పాటలు విడుదలవుతున్నాయి. తెలుగులో త్వరలో పాటలు, సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జైరాజ్, కెమేరా: ఆర్. రాజశేఖర్. -
దటీజ్ 'కబాలి'
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ట్రైలర్ తోనే దుమ్మురేపిన ఈ చిత్రం హక్కులు తెలుగులో భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు టాలీవుడ్ సమాచారం. షణ్ముఖ ఫిలిమ్స్ కు చెందిన ప్రవీణ్ కుమార్, కేపీ చౌదరి 'కబాలి' తెలుగు హక్కులు సొంతం చేసుకున్నారు. ఎంత మొత్తానికి హక్కులు దక్కించుకున్నారనేది అధికారికంగా వెల్లడికాలేదు. ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమా ఇవ్వనంత మొత్తం ఇచ్చి హక్కులు దక్కించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు లీడింగ్ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న ప్రవీణ్ కుమార్, కేపీ చౌదరి 'కబాలి'తో నిర్మాతలుగా మారుతున్నారు. అగ్రనిర్మాతలతో పోటీపడి ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నారు. తమ బేనర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. యువ దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడిగా రాధిక ఆప్టే నటించింది. ఇటీవల రిలీజ్ అయిన రజనీ లేటెస్ట్ సినిమా కబాలి టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే 50 లక్షల మంది ఈ టైలర్ ను వీక్షించారు. రెండు కోట్లకు పైగా వ్యూస్ తో ఇండియాలోనే అతి ఎక్కువ మంది వీక్షించిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. -
మర్డర్ మిస్టరీ
మర్డర్ మిస్టరీ మూవీస్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. ఈ తరహా చిత్రాలను సరైన రీతిలో తెరకెక్కిస్తే మాత్రం ప్రేక్షకాదరణ గ్యారంటీ అని గత చరిత్ర చెబుతోంది. ‘‘మా సినిమా కచ్చితంగా విజయాన్నే అందుకుంటుంది’’ అంటున్నారు బి. రామకృష్ణారెడ్డి. తమిళంలో పిజ్జా, విల్లా వంటి సూపర్ హిట్స్ నిర్మించిన సీవీ కుమార్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘తేగిడి’. ఈ చిత్రం అనువాద హక్కులను శ్రేయాస్ మీడియాతో కలిసి పుష్యమి ఫిలిం మేకర్స్ అధినేత రామకృష్ణారెడ్డి పొందారు. తెలుగు సినిమాకి టైటిల్ ఖరారు చేయలేదు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘ఆసక్తికరమైన కథతో సాగే మర్డర్ మిస్టరీ ఇది. ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇప్పటికే తమిళ వెర్షన్ నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ నెల రెండోవారంలో పాటలను, నెలాఖరున సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: నివాస్ ప్రసన్న, సహనిర్మాత: వెంకటరమణ, సమర్పణ: బి.సుధారెడ్డి, నిర్మాతలు: బి. రామకృష్ణారెడ్డి, గుడ్ ఫ్రెండ్స్.