ఆమె వస్తోంది | aame telugu rights getting tammareddy bharadwaja | Sakshi
Sakshi News home page

ఆమె వస్తోంది

Published Wed, Jul 3 2019 3:00 AM | Last Updated on Wed, Jul 3 2019 3:00 AM

aame telugu rights getting tammareddy bharadwaja - Sakshi

అమలాపాల్‌

‘నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమలాపాల్‌ నటించిన తొలి థ్రిల్లర్‌ మూవీ ‘ఆడై’. రత్నకుమార్‌ దర్శకత్వంలో రాంబాబు కల్లూరి, ఎం. విజయ్‌ నిర్మించిన ఈ తమిళ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు.

‘ఆమె’ పేరుతో చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆయన తెలుగులో విడుదల చేయనున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘రత్నకుమార్‌ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్‌ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అమలాపాల్‌ బోల్డ్‌ లుక్‌ కూడా సంచలనం సృష్టించింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఒ. ఫణీంద్ర కుమార్, సంగీతం: ప్రదీప్‌ కుమార్, ఊర్క, కెమెరా: విజయ్‌ కార్తీక్‌ ఖన్నన్, వీఎఫ్‌ఎక్స్‌ ప్రొడ్యూసర్‌: హరిహర సుతన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement