Tamil movie
-
అజిత్ మూవీకి షాక్.. కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో ప్రత్యక్షం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి అనే సరికొత్త యాక్షన్-థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఒక పక్కా అభిమానులు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మరోపక్క పైరసీ కేటుగాళ్లు చిత్ర బృందానికి షాకిచ్చారు. విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్టింట్లో అప్లోడ్ చేసేశారు. దీంతో నిర్మాతలతో పాటు అజిత్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొద్ది గంటల్లోనే నెట్టింట ప్రత్యక్షం..అయితే ఈ సినిమాను కూడా పైరసీ భూతం వదల్లేదు. విదాముయార్చి థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే నెట్టింట దర్శనమిచ్చింది. కొన్ని పైరసీ వెబ్ సైట్స్‌లో ఈ సినిమా కనిపించింది. దాదాపు నాలుగైదు వెబ్‌సైట్స్‌లో విదాముయార్తి ఫుల్ మూవీని అప్లోడ్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని.. టికెట్ కొని సినిమా చూడమని వేడుకుంటున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసినప్పటికీ పైరసీదారులు అస్సలు పట్టించుకోలేదు.కలెక్షన్లపై తీవ్ర ప్రభావం..విదాముయార్చి పైరసీ బారిన పడడంతో మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం కావడంతో నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మాణ సంస్థ ముందే విజ్ఞప్తి చేసిన పైరసీకి గురి కావడంతో అజిత్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. భారీ అంచనాలతో రికార్డ్ వసూళ్లు సాధిస్తుందనుకున్న విదాముయార్చికి పైరసీ భూతం అడ్డంకిగా మారింది. కాగా.. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కాసాండ్రా కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ మూవీని పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు.Every effort counts! 💪 Say NO to piracy and watch VIDAAMUYARCHI only in theatres! 🤩FEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @akarjunofficial… pic.twitter.com/WigarpFJ34— Lyca Productions (@LycaProductions) February 5, 2025 -
తగ్గేదేలే అంటున్న ధనుష్
తమిళ సినిమా: నటుడు ధనుష్ తగ్గేదేలే అంటున్నారు. ఏ విషయంలో తెలుసా? ఈయనకు హీరోగా కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో మంచి మార్కెట్ ఉంది. ఈ నాలుగు భాషల్లోనూ ధనుష్ కథానాయకుడిగా నటించి సక్సెస్ అవుతున్నారు.తెలుగులో ఈయన కథానాయకుడిగా నటిస్తున్న కుబేర చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. పా.పాండీ చిత్రం ద్వారా మెగా ఫోన్ పట్టిన ధనుష్ ఆ చిత్రంతో మంచి ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇటీవల రాయన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కథానాయకుడిగా కూడా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం ధనుష్ రెండు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. అందులో ఒకటి నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం.. యూత్ ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో నటి అనికా సురేందర్, మ్యాథ్యూ థామస్ ప్రియా వారియర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రం విడుదల కాకుండానే ధనుష్ మరో చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి తెరకెక్కిస్తున్నారు. దీనికి ఇడ్లీ కడై అంటూ ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి నిత్య మీనన్ నాయకిగా నటిస్తున్నారు. కాగా దీని తర్వాత మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రంలో కథానాయకిగా నటి కీర్తి సురేష్ నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రమా, లేక నటుడు ధనుష్ హీరోగా నటిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. అలాగే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
వెట్రి కోసం దేవర వెయిటింగ్..
-
మస్క్‌కు ధన్యవాదాలు తెలిపిన నిర్మాత.. ఎందుకంటే?
ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలొన్ మస్క్ ఇవాళ చేసిన ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇచ్చారు. ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.అయితే ఆ ట్వీట్లో ఓ సినిమా పోస్టర్‌ను మస్క్ పంచుకున్నారు. దీంతో అందరి దృష్టి ఆ ఫోటోపైనే పడింది. ఇంతకీ ఆ పోస్టర్ చూస్తే ఇండియన్ సినిమాకే చెందినదిగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఆ పోస్టర్ గురించే చర్చ మొదలెట్టారు.అయితే ఆ పోస్టర్ కోలీవుడ్ సినిమాకు చెందినదిగా తెలుస్తోంది. తాజాగా మస్క్ షేర్ చేసిన ఫోటో.. తమ సినిమా తప్పట్టం లోనిది అంటూ తమిళ నిర్మాత ఆదం బవ రిప్లై ఇచ్చారు. నా చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. My thanks to Elon Musk for making my movie thappattam poster world famous..😁🙏🏻@elonmusk https://t.co/LRQ7teFgzn pic.twitter.com/pg9DRMImFa— Adham Bava (@adham_bava) June 11, 2024 -
హీరో లేకుండానే బ్లాక్ బ్లస్టర్: ఏకంగా 800 శాతం లాభాలు
ఏదైనా సినిమా విజయవంతం కావాలంటే దర్శక నిర్మాతలతో పాట ఎలా ఉన్నా హీరోదే కీలక పాత్ర అనేది చాలాకాలంగాకొనసాగుతున్న ట్రెండ్. ఈ ట్రెండ్‌కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు బ్లాక్ బ్లస్టర్ హిట్స్ అవుతున్న సినిమాలకు కొదవలేదు. అయితే హీరో లేకుండానే కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు మీ కోసం.. 2010ల మధ్యకాలంలో తమిళం , తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో మహిళా ప్రధాన చిత్రాలు బాగా పెరిగాయని చెప్పొచ్చు. అనుష్క శెట్టి, నయనతార లాంటి హీరోయిన్లు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ నమోదు చేశారు. వీటిల్లోచాలావరకు హిందీతోపాటు, ఇతర భాషలలో కూడా రీమేక్ అయ్యాయి. అదే 2018 తమిళ సూపర్ హిట్ మూవీ ‘కొలమావు కోకిల’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, తొమ్మిది రెట్లకుపైగా లాభాలను సంపాదించింది. నయనతార టైటిల్ రోల్లో నటించిన ‘కొలమావు కోకిల’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించగా యోగి బాబు, శరణ్య, శరవణన్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే తెలుగులో కోకోకోకిల పేరుతో రీమేక్ అయింది. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే, ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. రూ. 8 కోట్ల బిడ్జెట్తో నిర్మితమై, ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 800 శాతం లాభపడిన చిత్రంగా రికార్డు దక్కించుకుంది. 2022లో, కొలమావు కోకిల సినిమాను హిందీలో నూతన దర్శకుడు సిద్ధార్థ్ సేన్ రీమేక్ చేశారు. పంజాబ్ నేపథ్యంలో తెరకెక్కిన గుడ్‌లక్ జెర్రీ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సౌరభ్ సచ్‌దేవా తదితరులు నటించారు. ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. కథ ఏంటంటే.. కోకిల (నయనతార) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తల్లి (శరణ్య)కు కాన్సర్ రావడంతో ఆపరేషన్ కు 15 లక్షలు కావాలి. మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల, డ్రగ్స్ సరఫరా చేసే ఓ గ్యాంగ్ లో ట్రాన్స్ పోర్టర్ గా చేరుతుంది. ఈ క్రమంలో ఆమె అనుకోని కష్టాల్లో పడుతుంది. ఈ కష్టాల్లోంచి ఆమె బయట పడడానికి ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి ? చివరికి తన తల్లిని కాపాడుకుందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ. ఎప్పటిలాగానే కోకిల పాత్రలో నయనతార పెర్పార్మెన్స్ అదరిపోతుంది.భారీ ఫైట్స్, హోరెత్తించే బీజీఎంలు, ఎలివేషన్స్ ఉండవు కానీ తన అమాయకత్వంతోనే విలన్లకు చెక్ చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నయన్‌ను ప్రేమించే వ్యక్తిగా కమెడియన్ యోగిబాబు వినోదం బాగా పండించాడు. వీరిద్దరిపై చిత్రించిన పాట యూట్యూబ్‌లో ట్రైండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. -
పాన్ ఇండియా భాషల్లో రజాకార్.. ట్రైలర్ రిలీజ్!
సమర వీర్ క్రియేషన్స్ పతాకంపై గూడూర్ నారాయణరెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రజాకర్'. యధా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఇందులో బాబీ సింహా, వేదిక జంటగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర తమిళ వర్షన్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ వేదికపై చిత్ర నిర్మాత గూడూర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమర్ వీర్ క్రియేషన్స్ సంస్థ తరపున యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం కాలంలో హైదరాబాదులో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రమని చెప్పారు. 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనం కాకముందు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంపై రూపొందించిట్లు చెప్పారు. నిజాం రాజు హైదరాబాదును దుర్గిస్తాన్గా మార్చే ప్రయత్నం చేసినప్పుడు భారత ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని చెప్పారు. తమ వంశంలో తన తాత కూడా ఆ పోరాటంలో పాల్గొని ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించారన్నారు. అలాంటి ఒక యదార్థ ఘటనపై ఈ తరం ప్రజలకు తెలియచేయాలనే ప్రయత్నమే ఈ రజాకర్ చిత్రమని చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్రం నిర్మాత నారాయణరెడ్డి తాత పోరాటంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారన్నారు. మరుగున పడ్డ చరిత్ర ప్రజలకు తెలియచేయాలనే లక్ష్యంతో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించడం గర్వకారణమని పేర్కొన్నారు. -
సీక్వెల్‌కు రెడీ అయిన హిట్ సినిమాలివే!
ఒక కథ హిట్టయితే... ఆ కథని కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఆ కథలోని హీరో, ఆ కథని తెరకెక్కించిన దర్శకుడు, తీసిన నిర్మాత, చూసే ప్రేక్షకులు అనుకోవడం సహజం. కానీ ఆ కథను కొనసాగించడానికి స్కోప్ ఉంటేనే ఇంకో కథ రెడీ అవుతుంది. అలా కొనసాగింపుకి ఆస్కారం ఉన్న కొన్ని కథలు రెడీ అయ్యాయి. ఇలా తమిళంలో పదికి పైగా రానున్న చిత్రాల రెండో భాగం విశేషాలు తెలుసుకుందాం. సేనాపతి తిరిగొస్తున్నాడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’ – 1996) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఎప్పట్నుంచో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్న శంకర్ 2017లో ‘ఇండియన్ 2’ని ప్రకటించారు. షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం, నిర్మాణపరంగా నెలకొన్న సమస్యలను అధిగమించుకుని, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లైకా ప్రోడక్షన్తో కలిసి ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే ‘ఇండియన్ 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ పోస్టర్ మూడు సీక్వెల్స్‌లో ధనుష్ పుష్కరకాలం క్రితం విడుదలైన ‘ఆయిరత్తిల్ ఒరువన్ (‘యుగానికి ఒక్కడు’ – 2010) సంచలన విజయం సాధించింది. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా, పార్తిబన్ లీడ్ రోల్స్ చేయగా, సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ను ప్రకటించి, హీరోగా తన తమ్ముడు ధనుష్ నటిస్తారని, 2024లో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని తెలిపారు సెల్వ రాఘవన్. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాలేదు. అలాగే హీరో ధనుష్–దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన ‘అసురన్’, ‘వడ చెన్నై’ చిత్రాలకు వీరి కాంబినేషన్లోనే సీక్వెల్స్‌కి ప్లాన్ జరుగుతోందని సమాచారం. రెండు సీక్వెల్స్‌లో కార్తీ ‘ఖైదీ’ (2019)గా కార్తీ సూపర్ హిట్టయ్యారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. మరోవైపు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ కూడా హిట్ ఫిల్మ్. ‘సర్దార్ 2’ కూడా దాదాపు ఖరారైంది. కార్తీ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి కాగానే ‘సర్దార్ 2’ మొదలవుతుంది. ఈలోపు రజనీకాంత్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రాన్ని పూర్తి చేసి, ‘ఖైదీ 2’ సీక్వెల్ కథ రెడీ చేస్తారట లోకేశ్. అలాగే భవిష్యత్‌లో ‘జైలర్ 2’, కమల్‌హాసన్‌తో ‘విక్రమ్ 2’, ‘బీస్ట్ 2’ చిత్రాలను తెరకెక్కించే ఆలోచన కూడా లోకేశ్ కనగరాజ్‌కి ఉందట. ‘తుప్పరివాలన్’లో విశాల్ మళ్లీ డిటెక్టివ్.. విశాల్ కెరీర్లో ఉన్న ఓ డిఫరెంట్ హిట్ ఫిల్మ్ ‘తుప్పరివాలన్’ (‘డిటెక్టివ్’ – 2017). మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్ సాధించింది. ఆ తర్వాత విశాల్, మిస్కిన్‌ల కాంబినేషన్లోనే ‘డిటెక్టివ్’కు సీక్వెల్‌గా ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు. నిజానికి ‘డిటెక్టివ్ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ ఈ సీక్వెల్ స్క్రిప్ట్, బడ్జెట్ విషయాల్లో విశాల్‌కు, మిస్కిన్కు భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘డిటెక్టివ్ 2’ షూటింగ్ నిలిచిపోయింది. ‘డిటెక్టివ్ 2’కు తానే దర్శకత్వం వహించి, నటిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు విశాల్. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విదేశాల్లో జరగనుంది. ‘తని ఒరువన్’లో నయనతార, ‘జయం’ రవి ఎనిమిదేళ్ల తర్వాత... ‘జయం’ రవి కెరీర్లో ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘«ధృవ’లో రామ్‌చరణ్ హీరోగా నటించారు) బ్లాక్‌బస్టర్. ‘జయం’ రవి అన్నయ్య, దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు మోహన్ రాజా. ఫైనల్‌గా ‘తని ఒరువన్’ విడుదలై, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 28న సీక్వెల్‌ను ప్రకటించారు. తొలి భాగంలో నటించిన ‘జయం’రవి, నయనతారలే మలి భాగంలోనూ నటిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ‘మాయవన్’లో సందీప్ కిషన్ మరో మాయవన్ ఐదేళ్ల క్రితం సందీప్ కిషన్ హీరోగా సీవీ కుమార్ దర్శకత్వంలో ‘మాయవన్’ అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘మాయవన్’కు సీక్వెల్‌గా ‘మాయవన్ 2’ తీస్తున్నారు మేకర్స్. సందీప్ కిషన్, సీవీ కుమార్ కాంబినేషన్లోనే ఈ చిత్రం రూపొందుతోంది. ‘సార్పట్ట’లో ఆర్య పరంపర కొనసాగుతోంది టెడ్డీ, సార్పట్ట పరంపర.. ఆర్య కెరీర్లో ఈ రెండూ సూపర్‌హిట్ సినిమాలే. అయితే ఈ రెండు చిత్రాలూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల సీక్వెల్స్‌ను మాత్రం వెండితెరపైనే చూపించనున్నారు. ‘సార్పట్ట పరంపర’కు దర్శకత్వం వహించిన పా. రంజిత్‌తోనే ఇటీవల ‘సార్పట్ట పరంపర 2’ను ప్రకటించారు ఆర్య. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్తోనే ‘టెడ్డీ’ సినిమా సీక్వెల్‌ను ఆర్య ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ‘7/జి...’లో రవికృష్ణ బృందావన కాలనీ ప్రేమ దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘7/జి బృందావన కాలనీ’ (2004) యూత్‌ని బాగా ఆకట్టుకున్న విషాద ప్రేమకథ. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్. కాగా, ‘7/జి బృందావన కాలనీ’కి సీక్వెల్ ప్లాన్ చేశారు సెల్వ రాఘవన్. తొలి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ మలి భాగంలోనూ నటిస్తారు. కథానాయిక పాత్ర కోసం ఇవానా, దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ పేర్లను పరిశీలిస్తున్నారట. తొలి భాగాన్ని నిర్మించిన ఏఎమ్ రత్నం సీక్వెల్‌ని కూడా నిర్మించనున్నారు. జిగర్తాండ 2 కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2014లో విడుదలైన సినిమాల్లో హిట్‌గా నిలిచినవాటిలో ‘జిగర్తాండ’ ఒకటి. సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెరకెక్కింది. రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. జెంటిల్‌మేన్ మారారు దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘జెంటిల్‌మేన్’ (1993). యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ చిత్ర నిర్మాత కేటీ కుంజుమోన్ ఇటీవల ‘జెంటిల్ మేన్ 2’ని ్రపారంభించారు. అయితే ఈ సీక్వెల్‌కి దర్శకుడు, హీరో మారారు. ఏ. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ శ్రీను హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీత దర్శకుడు.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి హీరోగా రూపొందిన ‘డిమాంటీ కాలనీ’కి సీక్వెల్ వీరి కాంబినేషన్లోనే రానుంది. ఇంకా సీక్వెల్ లిస్ట్‌లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'తుడిక్కుమ్ కరంగళ్'
నటుడు నిర్మల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తుడిక్కుమ్ కరంగళ్. నటి మిషా నారంగ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో సతీష్ సౌందర్ పాండియన్, సురేష్ మీనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇండియన్ టాకీస్ పతాకంపై కె.అన్నాదురై నిర్మించిన ఈ చిత్రం ద్వారా వేలుదాస్ దర్శకుడిగా పరిచయమవువుతున్నారు. రాఘవ్ ప్రశాంత్ సంగీతాన్ని, రామి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న విడుదలకు ముస్తబవుతోంది. (ఇది చదవండి: ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ! ) కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. తుడిక్కుమ్ కరంగళ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందని విమల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు నిర్మాత కె.రాజన్, దర్శకుడు పేరరసులాంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. (ఇది చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?) #ThudikkumKarangal Release on Theaters September 01 in theaters 🔥 #Vimal na 👍 pic.twitter.com/jC7sHXmQRs — CINEMA RASIGAN (@cinemarasigan25) August 22, 2023 -
మాదకద్రవ్యాల అనర్థాలను తెలిపే 'ఉరుది'
కలైంజర్ కరుణానిధి శత జయంతి సందర్భంగా తమిళనాడును మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి రఘుపతి అన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనం కారణంగా కుటుంబాలు ఎలా బాధింపునకు గురవుతున్నాయన్న ఇతి వృత్తంతో గతంలో ఒళక్కం అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. తాజాగా పల్ సమయ నల్లురవు సంఘం ఆధ్వర్యంలో జె.ముహమద్ రవి 'ఉరుది' అనే లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండింటికీ మంగై అరిరాజన్ దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ) ఉరుది లఘు చిత్ర పరిచయ కార్యక్రమం చైన్నెలో జరిగింది. మంత్రి రఘుపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నటుడు రాజేశ్, ఎమ్మెల్యే ఏఎంవీ ప్రభాకర్‌రాజా, కోటై అబ్బాస్ తదితరులు అతిథులుగా పాల్గొని లఘు చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంత్రి రఘుపతి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల కారణంగా జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈ లఘు చిత్రాన్ని నిర్మించిన జే.ముహమద్ రవి, దర్శకుడు మంగై అరిరాజన్లకు ధన్యవాదాలు తెలిపారు. మాదక ద్రవ్యాలు లేని తమిళనాడుగా మార్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. యువత కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఒక వ్యక్తి మద్యానికి బానిసైతే అతనితో పాటు అతని కుటుంబం బాధింపునకు గురవుతుందని మంత్రి తెలిపారు. (ఇదీ చదవండి: సమంత డిజైనర్ చీర.. ధర ఎంతో తెలుసా?) -
సూపర్‌స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు
Rajinikanth Jailer Movie:సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'జైలర్'. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 10న థియేటర్లలోకి రాబోతుంది. పెద్దగా బజ్ లేని ఈ సినిమా ఇప్పుడు లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. త్వరలో కోర్టు హియరింగ్ కూడా ఉంది. ఒకప్పటితో పోలిస్తే రజినీకాంత్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. సరైన కథాకథనాలు లేకపోవడం, దీంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ చిత్రాలన్నీ ఫెయిలవుతూ ఉండటం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైటిల్ తమదే అంటూ మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ కోర్టుని ఆశ్రయించారు. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో?) సదరు మలయాళ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం.. ఆగస్టు 2021లో కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో 'జైలర్' టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అదే ఏడాది నవంబరులో షూటింగ్ ప్రారంభించారు. కానీ ఆర్థిక సమస్యల వల్ల ప్రొడక్షన్ ఆలస్యమైంది. ఈ రెండు సినిమాల స్టోరీలు వేర్వేరు అయినప్పటికీ కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ పడుతుందని సక్కిర్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే మిగతా భాషల్లో కుదరకపోయినా మలయాళ వరకు అయినా సరే రజినీకాంత్ సినిమా టైటిల్ మార్చి విడుదల చేయాల్సిందేనని దర్శకుడు సక్కిర్ మడతిల్ పట్టుబడుతున్నారు. మరోవైపు మార్కెట్ పరంగా తమ చిత్రానికి ఎక్కడా నష్టం రాకూడదనే ఉద్దేశంతో సన్ పిక్చర్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించారు. ఆగస్టు 2న హియరింగ్ ఉంది. ఆ రోజు ఈ వివాదంపై క్లారిటీ వస్తుంది. #Jailer TITLE change issue. Malayalam director Sakkir Madathil appeals to makers of #Rajinikanth's 'Jailer' to change movie title. He formally registered the title with the Kerala Film Chamber in August 2021. His film commenced production on November 6, 2021, concluded on… pic.twitter.com/ELGkbVSowg — Manobala Vijayabalan (@ManobalaV) July 16, 2023 (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
దళపతి విజయ్‌పై పోలీస్ కేసు.. అలా చేసినందుకు!
దళపతి విజయ్‌పై తెలుగు ప్రేక్షకులకు ఎక్కడలేని ఆసక్తి. ఈ క్రమంలోనే అతడు హీరోగా నటించిన 'లియో' మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని 'నా రెడీ' పాట విడుదల చేయగా, అది యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. దళపతి ఫ్యాన్స్ ఈ సాంగ్‌ని రిపీట్స్ లో వింటున్నారు. అలాంటిది ఇప్పుడు విజయ్‌పై ఓ కేసు నమోదు కావడంతో.. అభిమానులంతా అవాక్కయ్యారు. ఏంటా కేసు? 'లియో' నుంచి వచ్చిన 'నా రెడీ' పాటలో విజయ్ సింపుల్ స్టెప్పులేసినప్పటికీ.. ట్యూన్ మంచి ఎనర్జిటిక్ గా ఉండటంతో అలరిస్తోంది. అయితే ఈ సాంగ్ మొత్తాన్ని ఓ డెన్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గీతంలోని ప్రతి సీన్ లోనూ విజయ్.. నోటిలో సిగరెట్ తో కనిపించాడు. ఇప్పుడు ఆ విషయమై చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త ఆర్టీ సెల్వం కోర్టుని ఆశ్రయించారు. విజయ్, చిత్రబృందంపై ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) విజయ్‌పైనే ఎందుకు? సాధారణంగా సినిమాల్లో హీరోలు సిగరెట్ స్మోక్ చేస్తూ కనిపించినా సరే అది యాక్టింగ్ వరకే పరిమితం. కానీ ఈ మధ్య విజయ్.. తమిళనాడులోని 10, 12 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులని కలిశాడు. దాదాపు పది గంటలకు పైగా జరిగిన ఈ మీటింగ్ లో.. వాళ్లని నగదు బహుమతులతో సత్కరించడంతో పాటు మంచిగా ఉండాలని, డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా తల్లిదండ్రులకు ప్రోత్సాహించాలని చెప్పాడు. అలాంటి విజయ్.. ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ తాగుతూ నటించడం ఏం బాగోలేదని ఓ వ్యక్తి కేసు వేశాడు. 'లియో' సంగతేంటి? లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే 'లియో' తీస్తున్నారని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, 'నా రెడీ' పాటలో ఆయా రిఫరెన్స్ లు కనిపించాయని అంటున్నారు. అక్టోబరు 19న ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో తెలుగు హక్కులని నిర్మాతలు భారీ మొత్తానికి అమ్మినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?) -
దళపతి విజయ్ గిఫ్ట్.. ఆ పాపకు డైమండ్ నెక్లెస్!
దళపతి విజయ్ పేరుకే తమిళ హీరో. కానీ మన హీరోల కంటే అప్పుడప్పుడు ట్రెండింగ్ లో టాప్ లో ఉంటాడు. సినిమాల విషయంలో మన ప్రేక్షకులు విజయ్ ని తెగ ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్లతోనే విజయ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఓ అమ్మాయికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇవ్వడమే దీనికి కారణం. ఇంతకీ ఆ పాప ఎవరు? విజయ్ ఎందుకిచ్చాడు? ఓవైపు స్టార్ హీరోగా చాలా క్రేజ్ తెచ్చుకున్న విజయ్.. బయటకు చెప్పుకోడు గానీ రాజకీయాలపైనా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందులో భాగంగానే అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా 'విజయ్ పీపుల్స్ మూమెంట్'లో భాగంగా చెన్నైలో ఓ ఈవెంట్ జరిగింది. రీసెంట్ గా తమిళనాడులో పరీక్షల ఫలితాలు వచ్చాయి. అందులో టాప్-3లో నిలిచిన వాళ్లని విజయ్ ఈ కార్యక్రమంలో సత్కరించాడు. తమిళనాడులోని రీసెంట్ గా విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో నందిని అనే అమ్మాయికి 600కి 600 మార్కులు వచ్చాయి. చదువుల్లో అద్భుతమైన ప్రతిభ చూపించిన ఆమెకు డైమండ్ నెక్లెస్ ని విజయ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. తెలుగు నెటిజన్స్ కూడా విజయ్ ని మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ సరికొత్త రికార్డు.. దేశంలో ఫస్ట్ హీరోగా!) -
మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్.. సూర్య రిపీట్ చేస్తాడా?
నటుడు సూర్య కథానాయకుడిగా నటించనున్న వాడివాసల్ చిత్రం సెట్‌పైకి వెళ్లడానికి మరింత జాప్యం కానుందనే ప్రచారం జరుగుతోంది. సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించనున్న చిత్రం వాడివాసల్. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇంతకుముందే రిహార్సల్స్ నిర్వహించారు. షూటింగ్ ప్రారంభించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో దర్శకుడు వెట్రిమారన్ హాస్యనటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ విడుదలై చిత్రాన్ని చేయడానికి వెళ్లారు. ఈ చిత్రాన్ని ఆయన రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలిభాగం ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. (ఇది చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కాజల్.. కారణం ఇదేనా?) తర్వాత సూర్య కథానాయకుడిగా నటించే వాడివాసల్ చిత్రాన్ని మొదలెడతారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదలై చిత్ర రెండవ భాగంపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి విడుదలై–2 చిత్రం చిన్నచిన్న ప్యాచ్ వర్క్ మినహా పూర్తయిందని చిత్ర వర్గాలు ప్రకటించాయి. విడుదలై చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో దాని సీక్వెల్‌ను ఇంకా బెటర్మెంట్ కోసం దర్శకుడు వెట్రిమారన్ పలు మార్పులు చేర్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగైదు రోజులు అనుకున్నది మరో 40 రోజులు చిత్రీకరించ తలపెట్టినట్లు సమాచారం. తొలి భాగం సక్సెస్ కావడంతో నిర్మాత రెండవ భాగం చేర్పులు, మార్పులు చేయడానికి మరింత ఖర్చు భరించడానికి సమ్మతించినట్లు టాక్. ఇకపోతే ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా చిత్రం చేస్తున్న సూర్య వాడివాసల్ చిత్రం సెట్‌పైకి వెళ్లాడానికి ఇంకా సమయం పట్టనుండడంతో, ఈలోపు మరో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సుధాకొంగర దర్శకత్వంలో మరోసారి నటించనున్నట్లు తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు సూరరై పోట్రు వంటి సూపర్‌హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!) -
విజయ్ స్పీడ్‌కు నో బ్రేక్స్.. అజిత్‌కు అన్నీ అడ్డంకులే
హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన తుణివు (తెగింపు) చిత్రం విడుదలై ఏడాదిన్నర కాబోతోంది. ఈ చిత్రంతో పాటు హీరో విజయ్ నటించిన వారీసు (వారసుడు) చిత్రం విడుదలైంది. కాగా విజయ్ తదుపరి చిత్రం ప్రారంభం కావడడంతో పాటు షూటింగ్కూడా పూర్తి చేసుకోబోతోంది. అయితే అజిత్ తాజా చిత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. (ఇదీ చదవండి: బన్నీ విషయంలో లెక్క తప్పిన అల్లు రామలింగయ్య) ఆయన 62వ చిత్రాన్ని ఏ ముహుర్తాన ప్రకటించారో గానీ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రానికి నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కథ సిద్ధమైంది. ఇక సెట్‌పైకి వెళ్లటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఈ చిత్రం నుంచి విఘ్నేష్ శివన్ వైదొలిగారు. ఆయన స్క్రీన్‌ప్లే లైకా ప్రొడక్షన్స్ అధినేతకు, అజిత్‌కు సంతృప్తిని కలిగించకపోవడం కారణమని తెలిసింది. ఆ తరువాత చిత్ర కథ మారింది. దర్శకుడు మారారు. అనూహ్యంగా దర్శకుడు మగిళ్ తిరుమేణి తెరపైకి వచ్చారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో లైకా ప్రొడక్షన్స్ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. (ఇదీ చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) అజిత్ పుట్టినరోజు సందర్భంగా మే 1వ తేదీన 'విడామయర్చి' అని చిత్ర టైటిల్ వెల్లడించారు. దీంతో షూటింగ్ ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. అలాంటి సమయంలో విదేశీ బైక్ ప్రయాణానికి వెళ్లిపోయారు. ఇటీవలే ఆయన తిరిగి రావడంతో జూన్ తొలి వారంలో విరామం వీడి చిత్ర షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరిగింది. ఇందులో నటి త్రిష నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం అజిత్, దర్శకుడు మగిళ్ తిరుమేణి ప్రస్తుతం లండన్‌లో మకాం పెట్టినట్లు తెలిసింది. విడామయర్చి చిత్ర షూటింగ్ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ను పలు దేశాల్లో నిర్వహించనున్నట్లు, ఈ నెల చివరిలో షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు అజిత్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తున్నట్లు సమాచారం. -
త్రిష కృష్ణన్ Vs నయనతార
-
వరల్డ్ రికార్డ్.. 81నిమిషాల పాటు సింగిల్ షాట్లో మూవీ షూటింగ్
తమిళసినిమా: దర్శకుడు కే.భాగ్యరాజ్ చాలా గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం 3.6.9. పీజీఎస్ ప్రొడక్షన్స్ అధినేత పీజీఎస్ నిర్మించిన ఈ చిత్రానికి ఫ్రైడే ఫిలిమ్స్ ఫ్యాక్టరీ అధినేత కెప్టెన్ ఎంపీ ఆనంద్ సహ నిర్మాతగా వ్యవహరించారు. శివ మాధవ్ పరిచయం అవుతున్న ఈ చిత్రంలో చిత్ర నిర్మాత పీజీఎస్ ప్రతినాయకుడిగా నటించారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఇందులో బ్లాక్ పాండి అజయ్, కన్నన్ శక్తి మహేంద్ర తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. దీనికి మారీశ్వస్ చాయాగ్రహణం, కార్తీక హర్ష సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ప్రపంచస్థాయిలోనే 81 నిమిషాలలో ఏకధాటిగా సింగిల్ షాట్లో రూపొందించడం విశేషం. ఇందుకు 24 కెమెరాలను ఉపయోగించారు. 150 మంది నటీనటులు, 450 మంది సాంకేతిక వర్గం పని చేశారు. ఈ చిత్ర షూటింగ్‌ను నాలెడ్డ్ ఇంజినీరింగ్ అనే సంస్థ రూపొందించింది. షరీపా అనే టెక్నాలజీ ద్వారా అమెరికాకు చెందిన వరల్డ్ రికార్డ్ యూనియన్ అనే సంస్థ పర్యవేక్షించి, వరల్డ్ రికార్డు బిరుదును ప్రదానం చేసిందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శక, నటుడు పాండియరాజన్, సుబ్రమణియం శివ, సంగీత దర్శకుడు దిన తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కె.భాగ్యరాజ్ మాట్లాడుతూ తనను పిడివాదం కలిగిన వ్యక్తిగా ఇక్కడ పేర్కొన్నారని, అయితే అది నిజమేనా అని అన్నారు. మంచి విషయాల కోసం తాను ఎప్పుడు పిడివాదంగానే ఉంటానన్నారు. తాను కథను రాసిన ఒరు ఖైదియిన్ డైరీ చిత్రాన్ని తన గురువు భారతీరాజా తెరకెక్కించారని, అయితే ఆ చిత్ర క్లైమాక్స్ ఆయనకు నచ్చకపోవడంతో మార్చారని చెప్పారు. కాగా అదే చిత్రం హిందీ రీమేక్‌ను అమితాబ్‌బచ్చన్ హీరోగా తాను దర్శకత్వం వహించానని అందులో తాను అనుకున్న క్లైమాక్స్‌లోనే తెరకెక్కించానని అందుకు అంతా అంగీకరించారని తెలిపారు. ఆ చిత్రం కూడా విజయం సాధించిందని చెప్పారు. అలా తనకు నచ్చిన విషయాల కోసం తాను పిడివాదంగానే ఉంటానని అన్నారు. కాగా 3.6.9 చిత్ర కథలు దర్శకుడు చెప్పగానే కొత్తగా ఉండడంతో నటించడానికి సమ్మతించినట్లు కే.భాగ్యరాజ్ పేర్కొన్నారు. -
ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ధోని.. తొలి సినిమా ఏ భాషలో తెలుసా..?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎట్టకేలకు సినీ నిర్మాణ రంగంలోని అడుగుపెట్టాడు. దీపావళి పర్వదినాన భార్య సాక్షి సింగ్ ధోనితో కలిసి 'ధోని ఎంటర్టైన్మెంట్' పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు సాక్షి సింగ్ ధోని మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తమ నిర్మాణ సంస్థ నుంచి తొలుత తమిళ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ధోని ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు తెలిపారు. తమ సంస్థ నిర్మించబోయే తొలి చిత్రానికి రమేశ్ తమిళ్ మణి దర్శకత్వం వహించనున్నట్లు వారు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతరత్ర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వారు వెల్లడించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోయే ఈ చిత్రానికి సాక్షి సింగ్ ధోనినే కథ సమకూర్చినట్లు తెలుస్తోంది. Legendary cricketer @msdhoni & his wife @SaakshiSRawat's production house @DhoniLtd will produce its 1st feature film in Tamil! Conceptualised by Sakshi herself, the Tamil film will be a family entertainer directed by @ramesharchi@HasijaVikas @PriyanshuChopra @proyuvraa pic.twitter.com/uOUwYvPG2w — Sreedhar Pillai (@sri50) October 24, 2022 కాగా. ధోని.. తమిళ సూపర్ స్టార్, ఇళయదళపతి విజయ్‌తో కలిసి త్వరలోనే సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా ధోని ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతినిధుల స్పందించారు. ధోనికి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉండటంతో ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వరుస తమిళ సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ధోని ఎంటర్టైన్మెంట్ సంస్థ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించే ఆలోచన ఉన్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. చదవండి: ధోని ప్రొడక్షన్లో హీరోగా విజయ్? స్టార్ హీరోలతో వరుస సినిమాలు -
అందుకే ఆయన పొన్నియిన్ సెల్వన్‌లో భాగం కాలేదు: మణిరత్నం
కోలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో హిట్ చిత్రాలకు పనిచేసిన పాటల రచయిత 'వైరముత్తు'. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఆయన.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పలు చిత్రాలకు గతంలో సాహిత్యమందించారు. వైరముత్తు పాటలు సినీ ప్రియుల్ని కట్టిపడేసేలా ఉంటాయి. మరీ తాజాగా మణిరత్నం రూపొందించిన కొత్త చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’లో మాత్రం వైరముత్తు ఎందుకు లేరు. దీనికేమైనా ప్రత్యేక కారణాలున్నాయా అన్న చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అడిగిన ప్రశ్నకు తాజాగా మణిరత్నం స్పందించారు. 'వైరముత్తు టాలెంట్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సైతం వైరముత్తు టాలెంట్‌ను మెచ్చుకునేవారు. నేను ఆయనతో కలిసి ఎన్నోసార్లు పనిచేశా. ఆయన సాహిత్యాన్ని నా సినిమాల్లో ఉపయోగించా. అతనొక అద్భుతం. అయితే వైరముత్తును మించిన కొత్త టాలెంట్ ప్రస్తుతం పరిశ్రమలో ఉంది. కొత్త తరానికి ప్రోత్సాహమందించాలి’ అందుకే అని మణిరత్నం వివరణ ఇచ్చారు. గతంలో వైరముత్తుపై మీటూ ఆరోపణలు రావడంతో దూరం పెట్టారని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. (చదవండి: పొన్నియిన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం) అయితే గతంలో వైరముత్తు తమను వేధింపులకు గురి చేశాడంటూ కొంతమంది మహిళలు ‘మీటూ’ వేదికగా ఆరోపించారు. ప్రముఖ గాయని చిన్మయి సైతం ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే వైరముత్తుతో పనిచేసేందుకు పలువురు సినీ ప్రముఖులు వెనకాడుతున్నట్లు అప్పట్లోనే కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మణిరత్నం, వైరముత్తు చివరి చిత్రం 'చెక్క చివంత వానం' (2018). ఈ చిత్రంలో 'మజై కురువి' 'భూమి భూమి' లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ కోసం ఇళంగో కృష్ణన్ మూడు పాటలు, కబిలన్, శివ అనంత్, కృతికా నెల్సన్లు మరో మూడు పాటలు రాశారు. -
అందాల ఆరబోతలో తప్పేం లేదు: హీరోయిన్
ఎయిర్ హోస్టెస్‌గా కెరియర్ మొదలెట్టిన నటి వాణి బోజన్. ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశింంది. అనంతరం టీవీ వ్యాఖ్యాతగా, బుల్లితెర నటిగా గుర్తింపు పొందింది. అలా ఓ మై కడవులే చిత్రంతో నటిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో రెండో కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆ తరువాత ఆ తరహా పాత్రలే వస్తున్నాయి. కానీ కథానాయికగా ప్రాముఖ్యత కలిగిన కథా పాత్రలు రావడం లేదనే చెప్పాలి. చదవండి: హాట్‌టాపిక్‌గా ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకే అన్ని కోట్లా! తాజాగా అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటింన తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్‌లోనూ రెండో కథానాయిక పాత్రలోనే నటించింది. ఈ వెబ్ సిరీస్ 19వ తేదీ నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. కాగా దీని ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అయితే సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన హాట్‌హాట్ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో యాంకర్ అవకాశాలు కోసం అందాలారబోతకు సిద్ధం అయినట్టున్నారే? అని ప్రశ్నించింది. చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు దీనికి ఆమె స్పందిస్తూ.. అవును.. అందులో తప్పేముంది అని తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. అయినా తాను చీర ధరించినా గ్లామరస్‌గా ఉన్నావంటున్నారని చెప్పింది. కాలానికి తగ్గట్టు ఆలోచనలు మారాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. ఇక ప్రేమ గురించి అడిగిన ప్రశ్నకు తాను పదహారేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని, ఆ వెంటనే బ్రేకప్ కూడా అయిపోయిందని తెలిపింది. అయితే అదే సమయంలో తనకు అనేక ప్రేమ లేఖలు వస్తుండటంతో బ్రేకప్ గురించి పెద్దగా పట్టించుకోలేదని వాణి బోజన్ చెప్పుకొచ్చింది. కాగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలతో ఏ వత్రం అవకాశాలను రాబట్టుకుంటుందో చూడాలి. -
టాప్ ప్రొడ్యూసర్ల కార్యాలయాలపై భారీ ఐటీ దాడుల కలకలం
సాక్షి, చెన్నై: తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలపై ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం సినీ వర్గాల్లో కలవరం రేపుతోంది. కలైపులి సహా 10 మంది బిగ్ షాట్స్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం ఈ దాడులు చేపట్టింది. అలాగే చెన్నైలోని టి.నగర్‌లోని కలైపులి థాను చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో ఈ రోజు సోదాలు నిర్వహించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. అయితే ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ దాడులు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని భావిస్తున్నారు. తమిళ నిర్మాత కలైపులి థాను, అన్బుచెజియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా, నలుగురు నిర్మాతల కార్యాలయాలపై ముమ్మర ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. చెన్నైలోని నుంగంబాక్కంలో అన్బుచెజియన్ ఇంటిపై ఉదయం 5 గంటల నుంచి దాడులు చేస్తోంది. నిర్మాతలు అన్బుచెజియన్, ఎస్ఆర్ ప్రభు, త్యాగరాజన్, కలిపుల్లి ఎస్ .అన్బుచెజియన్‌కు చెందిన 40 చోట్ల ఆదాయపు పన్ను శాఖ ఈరోజు తనిఖీలు నిర్వహిస్తోంది. మదురైలో 30, చెన్నైలో 10 ప్రాంతాల్లో సోదారులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు చాలామంది సినిమా ఫైనాన్షియర్లపై కూడా ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అన్బుచెజియన్ తమిళ చిత్రాలకు ఫైనాన్షియర్, ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను కార్యాలయంపై ఐటీ దాడులు చేపట్టింది. మధురైకి చెందిన ఆయన గోపురం ఫిలింస్ ఆధ్వర్యంలో కొన్ని చిత్రాలను నిర్మించడంతోపాటు పలు సినిమాలకు ఫైనాన్షియర్ కూడా వ్యవహరించారు. కాగా తమిళ నిర్మాత అశోక్‌కుమార్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలుఎదుర్కొంటున్న అన్బుచెజియన్పై ఐటీ దాడులు చేయడం ఇది మూడోసారి. అన్బుచెజియన్ నుంచి అప్పు తీసుకున్న నిర్మాతల ఇళ్లపై కూడా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. -
ఆకట్టుకుంటున్న ‘జల్లికట్టు’
తమిళసినిమా: 2019లో విడుదలై కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో పాటు జాతీయ అవార్డును గెలుచుకుని, ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లిన మలయాళ చిత్రం జల్లికట్టు. ఇది ఇప్పుడు కోలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. లిజో జోస్ బెల్లిసేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోని వర్గీస్, సెంపన్ వినోద్ జోస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గిరీష్ గంగాధరన్ చాయాగ్రహణను, దీపు జోసెఫ్ సంగీతాన్ని అందించారు. దీనిని ఏఆర్ ఎంటర్టైన్మెంట్ పతాకం ద్వారా అమిత్‌కుమార్ అగర్వాల్ తమిళంలోకి అనువదించారు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ టైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక గేదె ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం అని నిర్మాత తెలిపారు. ఒక కుగ్రామంలో కసాయిశాలకు అమ్మడానికి తీసుకొచ్చిన గేదె కట్లు తెంచుకుని పారిపోతుంది. దానిని పట్టుకోవడానికి ఆ గ్రామ ప్రజలంతా చేసే ప్రయత్నమే ఈ చిత్రం అని తెలిపారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. -
షాకింగ్ లుక్‌లో కోవై సరళ, ఫొటో వైరల్
Kovai Saral Shocking look From Sembi Movie: కోవై సరళ.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన కామెడీతో నవ్వించి లేడీ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. బెసిగ్గా తమిళ నటి అయిన కోవై సరళ టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో లేడీ కమెడియన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల దగ్గరైంది. చివరిగా 2019లో వచ్చిన అభినేత్రి 2లో కనిపించిన ఆమె కొంతకాలంగా తెరపై కనుమరుగైంది. ఈ నేపథ్యంలో కోవై సరళకు సంబంధించిన ఓ షాకింగ్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తలపై క్లాత్ కప్పుకుని 70 ఏళ్ల వృద్దురాలిగా దీన స్థితిలో ఉన్నట్లు కినిపించింది. చదవండి: కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో పూజా హెగ్డేకు చేదు అనుభవం ఎప్పుడూ తెరపై నవ్వుతూ,నవ్విస్తూ ఉంటే కోవై సరళ ఇందులో మాత్రం చాలా సీరియస్‌గా కనిపించింది. అయితే ఇది ఆమె తాజాగా నటించిన తమిళ చిత్రం ‘సెంబి’ లోనిది. ‘అరణ్య’ ఫేమ్ ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమె 70 ఏళ్ల వృద్దురాలుగా నటిస్తోంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఓ బస్సు నేపధ్యంలో 24 మంది ప్రయాణికుల చుట్టూ ఈ కథ నడుస్తోందని, ఇందులో కోవై సరళ సీరియస్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. తంబి రామయ్య, అశ్విన్ కుమార్‌తోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ నీల ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తోంది. ఈ మూవీని తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. Presenting the Title and First Look of my next titled #SEMBI #செம்பி starring #KovaiSarala @i_amak prod by #Ravindran's @tridentartsoffl & #AjmalKhan @actressReyaa's @AREntertainoffl #Jeevan @nivaskprasanna #Buvan #VijayThennarasu @PhoenixPrabu2 @srikrish_dance @onlynikil pic.twitter.com/BCO7eACqYP — Prabu Solomon (@prabu_solomon) May 20, 2022 -
రజనీకాంత్ అభినందనలు మరువలేనివి
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ తనను అభినందించారని యువ నటుడు విక్రమ్‌ప్రభు తెగ సంతోష పడిపోతున్నారు. ప్రఖ్యాత దివంగత నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు వారసుడు అయిన ఈయన హీరోగా నటించిన చిత్రం టానాక్కారన్ తమిళ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాయకిగా అంజలి నాయర్, ఇతర ముఖ్యపాత్రల్లో లాల్, ఎంఎస్ భాస్కర్, మధుసూదన్, బోస్ వెంకట్ తదితరులు నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 8వ తేదీ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విక్రమ్‌ప్రభు ట్రైనీ పోలీసు పాత్రలో నటించారు. ఈ చిత్రం చూసి సూపర్‌స్టార్ రజనీకాంత్ తనకు ఫోన్ చేసి చాలా బాగా నటించావని అభినందించారని ఆయన తన ట్విట్టర్లో తెలిపారు. చదవండి: (మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. రూ.40వేలు డబ్బులు డ్రా చేయించి..) -
జైభీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం.. 'ఆస్కార్' ఛానెల్లో
Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel: మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల సూర్య నటించిన చిత్రం 'జైభీమ్'. సినిమా అంటే మూడు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్‌తో ప్రేమాయణం, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించి, సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం జైభీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి సత్తా చాటింది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ 'ది షాషాంక్ రిడంప్షన్' చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది. ఇప్పటివరకూ ఏ సౌత్ సినిమాకు ఇలాంటి రేటింగ్ రాలేదు. అలాగే గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామా కథాశంతో తెరకెక్కిన 'జైభీమ్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 'సీన్ ఎట్ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఉంచటం ఇదే మొదటిసారి. కాగా అకాడమీ యూట్యూబ్ ఛానెల్లో జైభీమ్ సినిమా వీడియో ఉండటంపై చిత్రబృందంతోపాటు అభిమానులు సంతోషపడుతున్నారు. 'జైభీమ్' ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'జస్టిస్ చంద్రు' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? #Suriya's #JaiBhim scenes uploaded to #Oscars Official YouTube channel.👍👏@Suriya_offl ➡️ https://t.co/AXQwY2av72 pic.twitter.com/QmgFrz827n — Suresh Kondi (@SureshKondi_) January 18, 2022 • #JaiBhim is now the only Tamil Movie to be shown in The Academy #Oscars YouTube channel 🔥💯 Ever Proudful @Suriya_offl na 😇❤️ pic.twitter.com/3JhxVZhX1q — CHENTHUR (@ck__tweetz) January 18, 2022 #JaiBhim getting bigger and bigger 🔥 First Tamil movie scenes to shown in #Oscars utube ❤@Suriya_offl #EtharkkumThunindhavan#VaadiVaasal pic.twitter.com/qJcs0TsIQd — Mass Syed 💥 (@SuriyaFanstren4) January 18, 2022 -
మీడియా సమావేశంలో రైటర్ చిత్ర యూనిట్
చెన్నై సినిమా: తన భావాలతో ఏకీభవిస్తేనే ఎవరికైనా తన కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని దర్శక నిర్మాత పా.రంజిత్ అన్నారు. 'అట్టకత్తి'తో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత మద్రాస్, కబాలి, కాలా, సర్పట్టా వంటి విజయవంత చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే విధంగా నిర్మాతగానూ నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నవ దర్శకులకు అవకాశం కల్పిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను నిర్మిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రాటీయో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం 'రైటర్'. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఇనియా నాయికగా నటించారు. ఈ చిత్రం ద్వారా ఫ్రాంక్లిన్ జాకోబ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోవింద్ వసంత సంగీతాన్ని అందించిన 'రైటర్' చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియో సమావేశంలో పా.రంజిత్ మాట్లాడుతూ.. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే విధంగా తన చిత్రాలు ఉంటాయన్నారు. -
'ఎన్న సొల్ల పొగిరాయి' చిత్రంపై నిర్మాత ఏమన్నారంటే..?
చైన్నై సినిమా: 'ఎన్న సొల్ల పోగిరాయ్' చిత్రం యువత పండుగ చేసుకునే విధంగా ఉంటుందని నిర్మాత ఆర్. రవీంద్రన్ పేర్కొన్నారు. తన ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'కుక్ విత్ కోమలి' ఫేమ్ అశ్విన్ కుమార్ లక్ష్మి కాంతన్ కథానాయకుడిగా, అవంతిక, తేజస్విని నాయికలుగా నటించారు. హరిహరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిచర్డ్ ఛాయాగ్రహణను, వివేక్, మెర్లిన్ సంగీతాన్ని అందించారు. ఈనెల 24వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం చెన్నైలో నిర్వహించారు. నిర్మాత ఆర్. రవీంద్రన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పూర్తిగా కొత్తవారిని పరిచయం చేసినట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటుడు అశ్విన్ కుమార్ లక్ష్మీ కాంతన్ పేర్కొన్నారు. -
ధనుష్‌ను వరించిన బ్రిక్స్ అవార్డు.. ఎందుకో తెలుసా ?
Hero Dhanush Got Best Actor Award In BRICS Film Festival: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు మరో గౌరవం దక్కింది. నవంబర్ 28న జరిగిన బ్రిక్స్ (BRICS) ఫిల్మ్ ఫెస్టివల్లో 'అసురన్' చిత్రానికి గాను ధనుష్‌ని ఉత్తమ నటుడి అవార్డు వరించింది. ఇటీవల గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IIF)తో పాటు బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరిగింది. ఈ ఆనందకర విషయాన్ని ధనుష్ ట్విటర్లో పంచుకున్నాడు. ఈ అవార్డు గురించి చెబుతూ 'ఒక పరిపూర్ణ గౌరవం' అని ట్వీట్ చేశాడు. అలాగే ఈ సినిమాకు 3 జాతీయ అవార్డులు వచ్చాయి. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. An absolute honour 🙏🙏🙏 pic.twitter.com/DBPo5mTJGV — Dhanush (@dhanushkraja) November 28, 2021 ఈ అసురన్ సినిమా పూమణి రచించిన వెక్కయ్ నవల ఆధారంగా తీసిన పీరియాడికల్ చిత్రం. ఇందులో ధనుష్, మంజూ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'అసురన్' సినిమాను 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో 'ఉత్తమ విదేశీ చిత్రం' కేటగిరీ కింద ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నారప్ప పేరుతో రీమెక్ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ చివరిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన జగమే తంధిరమ్ సినిమాలో నటించాడు. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం మారన్, తిరుచిత్రంబళం షూటింగ్లో బిజీగా ఉన్నాడు ధనుష్. -
‘వాళ్లు..నా వాళ్లు..ఇది చరిత్ర’ : ఐశ్వర్య
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్ని ప్రయోగాత్మకంగా తెర కెక్కించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్. సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అందులోనూ ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను లిఖించాడు ధనుష్. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ సూపర్ స్టార్లు ధనుష్, తలైవా రజనీకాంత్ కొత్త చరిత్రను లిఖించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారు. అందుకే రజనీకాంత్ కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్ చేసు కుంటోంది. ‘‘వాళ్లిద్దరు నావాళ్లే. ఇదొక చరిత్ర’’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా భార్యగా, కుమార్తెగా గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి సినీ ప్రేమికులంతా కూడా ఈ అరుదైన సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు ధనుష్ కూడా తాజా పురస్కారాలపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని వర్ణించలేనంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సాక్షి, చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు ఎస్సీ జననాథన్ ఆదివారం కన్నుమూశారు. జననాథన్ అకాలమరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు, ఇతర నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన రోల్ మోడల్, కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ వర్ధంతి రోజే ఆయనకూడా కన్నుమూశారంటూ గుర్తు చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డైరెక్టర్ జననాథన్ ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారని మరో డైరెక్టర్ ఆర్ముగకుమార్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. (అవార్డు వేడుకలో వేదికపై పూర్తి నగ్నంగా నటి) హీరోయిన్ శృతిహాసన్ జననాథన్ మృతిపై సంతాపం ప్రకటించారు. భారమైన హృదయంతో గుడ్‌బై చెబుతూ ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగానూ గర్వంగానూ ఉంది. తన ఆలోచనలలో ఎప్పుడూ బతికే ఉంటారంటూ శృతి నివాళులర్పించారు. సినిమా ఎడిటింగ్ పనిలో ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లారు. అయితే జననాథన్ ఎక్కువసేపు తిరిగి రాకపోవడంతో, సిబ్బంది తనిఖీ చేయగా, అపస్మారక స్థితిలో పడి ఉండగా గుర్తించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. బ్రెడ్ అయినట్టుగా తెలిపిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆయన తుది శ్వాస తీసుకున్నట్లుగా ఆదివారం ప్రకటించారు. కాగా విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ లాబాం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు జననాథన్. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ మూవీని ఈ సంవత్సరం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జననాథన్ 2004 సంవత్సరంలో అయ్యర్కై సినిమాకు తమిళంలో జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డును గెలుచుకున్నారు. It is with the heaviest Heart that We say good bye to #SPJananathan sir - it was a pleasure working with you sir Thankyou for your wisdom and kind words you will always be in my thoughts ! My deepest condolences to his family 🙏 pic.twitter.com/Ox1Ag0EEYE — shruti haasan (@shrutihaasan) March 14, 2021 #Laabam director #SPJananathan , is no more... Incidentally he passed away on the death anniversary of social revolutionary #KarlMarx , who was his role model.We miss you sir.#RIP pic.twitter.com/Zl8qF0mokD — D.IMMAN (@immancomposer) March 14, 2021 -
కొత్త పాత్ర
నటిగా కీర్తీ సురేశ్ ఫుల్ బిజీ. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. అయితే మరో కొత్త పాత్రలోకి వెళ్లనున్నారని టాక్. కీర్తీ సురేశ్ నిర్మాతగా మారాలనుకుంటున్నారట. దానికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయని సమాచారం. ఓ తమిళ వెబ్ సిరీస్ కథ కీర్తీని బాగా ఆకట్టుకుందట. ఆ కథను ప్రేక్షకులకు చెప్పాలని సిరీస్‌ను నిర్మించాలని ఫిక్సయ్యారట. నటిగా అద్భుతమైన కథలను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లి శభాష్ అనిపించుకున్నారు కీర్తి. నిర్మాతగా కూడా అలాంటి కథలే చూపిస్తారని ఊహించవచ్చు. మరో విషయం ఏంటంటే కీర్తీ సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ మలయాళంలో పాపులర్ ప్రొడ్యూసర్. మరి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటారా? చూడాలి. -
ఆమె వస్తోంది
‘నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమలాపాల్ నటించిన తొలి థ్రిల్లర్ మూవీ ‘ఆడై’. రత్నకుమార్ దర్శకత్వంలో రాంబాబు కల్లూరి, ఎం. విజయ్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు. ‘ఆమె’ పేరుతో చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన తెలుగులో విడుదల చేయనున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘రత్నకుమార్ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. అమలాపాల్ బోల్డ్ లుక్ కూడా సంచలనం సృష్టించింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఒ. ఫణీంద్ర కుమార్, సంగీతం: ప్రదీప్ కుమార్, ఊర్క, కెమెరా: విజయ్ కార్తీక్ ఖన్నన్, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్: హరిహర సుతన్. -
అడవిలో ఓ రాత్రి!
పదిహేనేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ అగ్రకథానాయికల లిస్ట్‌లో కొనసాగుతూనే ఉన్నారు చెన్నై బ్యూటీ త్రిష. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారామె. ఇన్నేళ్లయినా ఇంకా అదే అంకితభావంతో పని చేస్తున్నారామె. అందుకు తాజా ఉదాహరణ... పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి రెండుగంటలు ముందే షూటింగ్ లొకేషన్‌కి వెళ్లిపోయి, రిహార్సల్స్ చేశారట. త్రిష నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘పరమపదమ్ విళయాట్టు’. త్రిష కెరీర్లో ఇది 60 చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి కె. తిరుజ్ఞానమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ త్రిష పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల కానుంది. నటుడు విజయ్ సేతుపతి విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా జర్నీ గురించి తిరుజ్ఞానమ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో త్రిష డాక్టర్‌గా తల్లి పాత్ర చేశారు. త్రిషకు నటిగా చాలా అనుభవం ఉన్నప్పటికీ సెట్‌కు రెండుగంటలు ముందే వచ్చేవారు. షూట్‌కు ముందే సీన్లను ప్రాక్టీస్ చేసేవారు. ప్రతి సీన్ పర్ఫెక్ట్గా రావాలని కోరుకునేవారు. అడవుల్లో కొన్ని యాక్షన్ సీన్లు తీశాం. కొన్నింటిని డూప్ లేకుండా చేశారామె. సినిమాల పట్ల ఆమెకు ఉన్న అంకితభావం సూపర్’’ అన్నారు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇలాంటి సినిమా చేయడం నాకు ఇది ఫస్ట్ టైమ్. డాక్టర్ వృత్తి చేస్తున్న ఓ తల్లి అడవిలో ఓ రాత్రి ఎదుర్కొనే భిన్నపరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని పేర్కొన్నారు త్రిష. -
40 ఏళ్లల్లో ఇదే మొదటిసారి!
కొత్త సంవత్సరం అంటే.. చేయాలనుకునే పనుల్లో ‘కొత్త సినిమా’ చూడటం ఒకటి. సినిమా లవర్స్ ప్లాన్ మోస్ట్లీ ఇలానే ఉంటుంది. అయితే ఈసారి తమిళ సినిమా లవర్స్‌కి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే తమిళ సంవత్సరాది (ఏప్రిల్ 14)కి కొత్త బొమ్మలేవీ థియేటర్‌కి రాలేదు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఆర్థిక లావాదేవీల విషయంలో పొత్తు కుదిరే వరకూ కొత్త సినిమాలు విడుదల చేసేది లేదని తమిళ పరిశ్రమ బలంగా నిర్ణయించుకుంది. ఆ మేరకు కొత్త సినిమాలేవీ రిలీజ్ చేయడంలేదు. స్ట్రైక్ మొదలై దాదాపు నెల రోజులు పైనే అయింది. ఇంకా తమిళ పరిశ్రమవారు కొత్త సినిమాలు విడుదల చేసే విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గడచిన 40 ఏళ్లల్లో ‘కొత్త సినిమా రిలీజ్’ చూడని కొత్త సంవత్సరాది ఇదేనట. సినీప్రియులకు ఇది బాధగానే ఉంటుంది. మరోవైపు పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు, థియేటర్లో సైకిల్ స్టాండ్, స్నాక్స్ అమ్ముకునేవారి వరకూ... అందరికీ నష్టమే. థియేటర్ల మెయిన్టైనెన్స్ కోసం పాత తమిళ సినిమాలను ప్రదర్శించుకుంటున్నారు. వాటికి ఆశించిన కలెక్షన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ స్ట్రైక్ లేకపోయి ఉంటే.. రజనీకాంత్ ‘కాలా’ వచ్చి ఉండేది. ఇక్కడ విడుదలైన ‘మెర్క్యురీ’ అక్కడ రిలీజయ్యుండేది. విశాల్ ‘ఇరుంబుదురై’ ఎప్పుడో రిలీజ్‌కి రెడీ అయి, రిలీజ్ డేట్ దొరక్క ఒకటి రెండు సార్లు, ఇప్పుడు స్ట్రైక్ వల్ల తెరపైకి రావడానికి నోచుకోలేదు. ఇప్పటికే ఇండస్ట్రీ 200 కోట్ల వరకూ నష్టపోయిందని చెన్నై వర్గాల అంచనా. మరి.. ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో? కొత్త తమిళ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి. ‘ఇరుంబుదురై’ లో విశాల్, సమంత ‘మెర్క్యురీ’లో ఓ దృశ్యం -
ఆమె నుంచి చాలా నేర్చుకున్నా!
నటి నయనతార నుంచి చాలా నేర్చుకున్నానంటున్నారు వరుస విజయాలతో పుల్‌జోష్‌లో ఉన్న నటుడు శివకార్తికేయన్. రజనీమురుగన్, రెమో వంటి ఘన విజయాల తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. అగ్రతార నయనతార నాయకిగా నటిస్తున్న ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ఇది. ఇంకా ప్రకాష్‌రాజ్, స్నేహ, ఆర్.జె.బాలాజి, సతీష్ ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని 24 ఏఎం స్టూడియోస్ పతాకంపై ఆర్.డి.రాజా భారీ ఎత్తున నిర్మించారు. మోహన్‌రాజా కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ నెల 22న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ వేలైక్కారన్ గురించి తన భావాలను పంచుకున్నారు. ‘నేను నటించిన చిత్రాలన్నిటికంటే భారీ వ్యయంతో రూపొందిన చిత్రం ఇది.. తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొనడం సహజం.. ఈ కారణంగా చిత్ర యూనిట్ మొత్తం ఎంతో శ్రమించారు.. నేను ఇందులో అరివు అనే కార్మికుడిగా నటించాను.. కార్మికుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం వేలైక్కారన్.. మంచి సామాజిక సందేశం ఉన్న కథా చిత్రంగా ఇది ఉంటుంది.. ఇందులో నటి నయనతారతో తొలిసారిగా కలిసి నటించాను.. తను మంచి కథా చిత్రాలను ఎంచుకుని అగ్రనటిగా రాణిస్తున్నారు.. అందుకు నటనలో ఆమె అంకితభావమే కారణం.. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను.. ఇక మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడానికి కేరళ మార్కెట్‌ను పెంచుకోవడానికా అని అడుగుతున్నారు.. ఆ పాత్రకు ఆయనైతే బాగుంటారని ఎంచుకున్నాం.. చిత్రంలో రాజకీయాలు ఉంటాయా అని అడుగుతున్నారు.. అలాంటి అంచనాలను ఈ చిత్రంలో టచ్ చేయలేదు.. ఇది ఒక మంచి సోషల్ మేసేజ్ ఉన్న చిత్రం.. చాలా సీరియస్ చిత్రం వేలైక్కారన్.. నిర్మాత ఆర్.డి.రాజా ఏ విషయంలోనూ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు.. కథకు న్యాయం చేయడానికి నిర్మాణం ఎక్కువ రోజులు పట్టింది.. ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు చేసేలా ప్రయత్నిస్తాను.. అని చెప్పారు. -
నేనా... హీరోయినా?
‘‘అదృష్టం కొద్దీ నేను కమెడియన్‌గా ఫుల్ బిజీ! అందువల్ల, హీరోయిన్గా నటించాలనే ఆలోచన అస్సలు చేయడం లేదు. తమ రంగు, రూపుతో సంబంధం లేకుండా మహిళలందరూ తాము అందంగా ఉన్నామని ఫీలవ్వాలనే పాయింట్‌ను నేను చెప్పాలనుకున్నా. ఈ ఫొటోలు చూసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పొందిన వందలమందికి... కీప్ ఇట్ గాళ్స్!’’ స్ట్రయిట్‌గా... సుత్తి లేకుండా... సింపుల్‌గా... నెట్టింట్లో జనాలకు బొద్దుగుమ్మ విద్యుల్లేఖా రామన్ ఇలా క్లారిటీ ఇచ్చారు! ఎటో వెళ్ళిపోయింది మనసు, రన్ రాజా రన్, రాజుగారి గది, భలే మంచి రోజు, సరైనోడు, ధృవ, నిన్ను కోరి తదితర తెలుగు చిత్రాల్లో కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించారీ తమిళమ్మాయ్! తెర మీదా, తెర వెనుకా... ఎప్పుడూ నిండైన వస్త్రధారణతో కనిపించే విద్యుల్లేఖ ఇటీవల సడన్‌గా మోడరన్ డ్రస్సుల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేనా? ‘‘ఎవరైనా నటి వరుసగా కామెడీ రోల్స్ చేస్తుంటే... ‘నువ్వు సెక్సీగా కనిపించలేవు, ఫీలవ్వలేవు’ అని ప్రజలు ఓ స్టాంప్ వేసేస్తారు. నేనంటాను ‘ఐ కెన్’ (నేను సెక్సీగా కనిపించగలను, ఫీలవ్వగలను)’’ అని ఫొటోలతో పాటు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘యు ఆర్ లుకింగ్ టూ హాట్’ అని సినిమా జనాలు విద్యుల్లేఖకి కాంప్లిమెంట్స్ ఇస్తే... మామూలు జనాలు ఈ హాస్యనటి దుస్తులపై, మాటలపై దుమ్మెత్తిపోశారు. ఎక్స్పోజింగ్ చేస్తున్నావా? హీరోయిన్ చాన్సుల కోసమేనా? అని కామెంట్లు చేశారు. అటువంటి జనాలకు కొంచెం గట్టిగానే జవాబిచ్చారీ బ్యూటీ. ‘‘ఓ మహిళ తనపై తనకున్న ప్రేమను చూపించుకోవడం షో ఆఫా (ఎక్స్పోజింగ్)? మీలాంటి సంకుచిత మనస్తత్వం, ఆలోచనలు గల వారికి నేను రిప్లై ఇస్తున్నా. జీవితంలో మిమ్మల్ని వెనక్కి తీసుకువెళ్లే ఆలోచనలతో తక్కువ చేసుకోకండి. హీరోయిన్గా ట్రై చేయడంలేదు. కమెడియన్లూ అందంగా కనిపిస్తారని చెప్పడమే నా ఉద్దేశ్యం’’ అని పేర్కొన్నారు విద్యుల్లేఖా రామన్. -
కూత్తాన్ కోసం టీఆర్ పాట
తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో సకలకళావల్లభుడు ఎవరంటే టి.రాజేందర్ అనే బదులే వస్తుంది. నటుడు, దర్శకుడు, సంగీతదర్శకుడు, చాయాగ్రాహకుడు, గీతరచయిత, గాయకుడు ఇలా పలు విభాగాల్లో నిష్టాతుడైన టీఆర్ గాయకుడిగా తన చిత్రాలకే పాడుకుంటారు. ఆయన పాడాలంటే ఆ పాటలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.అందుకే ఆయనతో తమ చిత్రాల్లో ఒక్క పాట అయినా పాడించాలని దర్శక నిర్మాతలు కోరుకుంటారు. అయితే బయట చిత్రాలకు పాడాలంటే ఆ పాట ఆయన మనసును హత్తుకోవాలి. లేదంటే నిక్కచ్చిగా సారీ అని చెప్పేస్తారు. అలాంటిది నవ నటుడు కథానాయకుడిగా నటిస్తున్న కూత్తాన్ చిత్రానికి ఆయన పాట పాడడం విశేషం. నిలగిరీస్ డ్రీమ్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నీలగిరీస్ మురుగన్ నిర్మిస్తున్నారు. వెంకీ.ఏఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజ్‌కుమార్ అనే నవ నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం గీతరచయిత రాఖేష్ రాసిన మాకిస్తా కీంకిస్తా అనే పాటను చిత్ర వర్గాలు టి.రాజేందర్‌తో పాడించాలని భావించారట. దీంతో సంగీత దర్శకుడు బాలాజి టి.రాజేంద్రన్‌ను కలిసి కూత్తన్ చిత్రంలో ఒక పాట పాడాలని కోరగా నో అన్నారట. అనంతరం బాలాజి పాట వినమని కోరగా విన్న టి.రాజేందర్ ఆ పాట ట్యూన్స్ బాగా నచ్చేయడంతో ఈ పాటను ఎవరు పాడినా హిట్ అవుతుందని కితాబిచ్చి తాను పడతానని చెప్పారని చిత్ర దర్శకుడు తెలిపారు. ఈ పాటను నృత్యదర్శకుడు అశోక్రాజా నృత్యదర్శకత్వంలో భారీ ఎత్తున చిత్రీకరించనున్నట్లు ఆయన తెలిపారు. -
టికెట్ ధర పెంచితే సినిమా చూపిస్తాం
తమిళసినిమా: ఎంత పెద్ద నటుడి చిత్రం అయినా సరే నిర్ణయించిన టిక్కెట్ ధర కంటే అధికంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు అని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి కడంబూర్ రాజా పేర్కొన్నారు. అలా వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తాజా వినోదపు పన్ను విధానం ప్రకారం మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ ధరను గరిష్టంగా రూ.204గా, కనిష్టంగా రూ.63 రూపాయలుగా నిర్ణయించారు. అదేవిధంగా ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ.126, కనిష్టంగా రూ.40–50 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై శనివారం పుదుకోట్టైలో ఎంజీఆర్ శతాబ్ది వేడుకల సందర్భంగా ఆయన చిత్ర పటాలను ఆవిష్కరించిన అనంతరం కడంబూర్ రాజా మాట్లాడుతూ థియేటర్ల టిక్కెట్ల ధర విషయంలో విధివిధానాలను మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది ఎంత పెద్ద నటుడి చిత్రం అయినా సరే అని అన్నారు. ఇక నటీనటుల పారితోషికం వంటి విషయాలను వారు చర్చించి పరిష్కరించుకోవాలని, అది నిర్మాతల మండలి, నడిగర్ సంఘం సమస్య అనీ పేర్కొన్నారు. కాగా నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ థియేటర్ల యాజమాన్యానికి టిక్కెట్లపై అధిక ధరలను విధించకూడదని, థియేటర్ క్యాంటీన్‌ల్లో ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని, పార్కింగ్ రుసుం వసూలు చేయకూడదని, అమ్మ వాటర్‌నే విక్రయించాలి లాంటి కొన్ని షరతులను విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తాము పర్యవేక్షిస్తామని ఆయన ప్రకటించారు. విశాల్ ఎవరు? నిర్మాతల మండలి నిబంధనలు, మంత్రి కడంబూర్ రాజా ప్రకటనలపై చెన్నైలో శనివారం థియేటర్ల యాజమాన్యం సమావేశం అయ్యి చర్చించారు. అనంతరం చెన్నై థియేటర్ల అసోషియేషన్ అధ్యక్షుడు రామనాథన్ మాట్లాడుతూ చిన్న చిత్రాల విడుదల సమయంలో టిక్కెట్ ధరను కాస్త తగ్గిస్తామన్నారు. తినుబండారాలను బయట ఏ ధరకు విక్రయిస్తున్నారో అదే ధరకు తామూ విక్రయిస్తామని తెలిపారు. ఇక వాహనాల పార్కింగ్ వ్యవహారం కోర్టులో ఉంది గనుక ఆ విషయం గురించి ప్రస్తుతం మాట్లాడనన్నారు. టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించమని చెప్పారు. అదేవిధంగా బయటి తినుబండారాలను అనుమతించే విషయమై థియేటర్ల యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ విషయాల్లో నిబంధనలు విధించడానికి విశాల్ ఎవరని ప్రశ్నించారు. తమకంటూ సంఘం ఉందని, అదేవిధంగా వారికి సంఘం ఉందని అన్నారు. ఈ విషయంలో వారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదనీ, తమతో చర్చిస్తే బాగుండేదని అభిరామి రామనాథన్ అభిప్రాయపడ్డారు. -
సూపర్‌స్టార్స్‌తో బ్రూస్లీ-2 ఆడియో హంగామా
సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్, మెగాస్టార్ల సమక్షంలో బ్రూస్లీ-2 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలో బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ఆ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. టాలీవుడ్ యువ స్టార్ హీరో రామ్‌చరణ్ నటించిన తాజా తెలుగు చిత్రం బ్రూస్లీ. క్రేజీ నటి రకుల్‌ప్రీతి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నదియా,అమిదాస్, షియాజీషిండే, రావ్మ్రేష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఎన్నై అరిందాల్ చిత్రంలో విలన్‌గా కొత్త అవతారమెత్తి దుమ్మురేపిన నటుడు అరుణ్ విజయ్ మరోసారి ఈ చిత్రంలోనూ విలనీయం ప్రదర్శించడం విశేషం. ఇక మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో మెస్మరైజ్ చేయనుండడం చిత్రానికే హైలైట్.ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన తాజా భారీ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని సెల్వందన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు అందించిన భద్రకాళీ ఫిలింస్ అధినేత ప్రసాద్ బ్రూస్లీ-2 పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు.అడ్డాల వెంకట్రావు,సత్య సీతల సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్ర వివరాలను వెల్లడించడానికి శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలోని ఏసీ థియేటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత భద్రకాళీప్రసాద్ మాట్లాడుతూ సెల్వందన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత రామ్‌చరణ్, అల్లుఅర్జున్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎవడును మగధీర పేరుతో తమిళంలోకి రూపొందిస్తున్నామని అని తెలిపారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని తాజాగా రామచరణ్ నటించిన బ్రూస్లీ చిత్రాన్ని తమ బ్యానర్లో బ్రూస్లీ-2గా విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు.ఇది బ్రహ్మాండమైన యాక్షన్ ఓరియెంటెడ్ కథా చిత్రం అని చెప్పారు. చిత్రంలో థియేటర్స్ అధిరేలాంటి ఐదు పోరాట సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. చిత్రాన్ని ఏక కాలంలో తమిళం,తెలుగు భాషల్లో అక్టోబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకు ముందుగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బ్రహ్మాండం గా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాం త్, మెగాస్టార్ చిరంజీవి, చిత్ర హీరో రామ్‌చరణ్ వంటి స్టార్ నటులు హాజరవుతారని పేర్కొన్నారు.బ్రూస్లీ-2 చిత్రానికి ఏఆర్కే రాజరాజన్ మాటలు, వివేక్ పాటలు రాశారు.