రజనీకాంత్‌ అభినందనలు మరువలేనివి | Rajinikanth Praises Vikram Prabhu for his Performance in Taanakkaran | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ అభినందనలు మరువలేనివి

Published Sat, Apr 16 2022 6:46 AM | Last Updated on Sat, Apr 16 2022 6:46 AM

Rajinikanth Praises Vikram Prabhu for his Performance in Taanakkaran - Sakshi

రజనీకాంత్‌తో విక్రమ్‌ ప్రభు

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనను అభినందించారని యువ నటుడు విక్రమ్‌ప్రభు తెగ సంతోష పడిపోతున్నారు. ప్రఖ్యాత దివంగత నటుడు శివాజీ గణేశన్‌ మనవడు, నటుడు ప్రభు వారసుడు అయిన ఈయన హీరోగా నటించిన చిత్రం టానాక్కారన్‌ తమిళ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాయకిగా అంజలి నాయర్, ఇతర ముఖ్యపాత్రల్లో లాల్, ఎంఎస్‌ భాస్కర్, మధుసూదన్, బోస్‌ వెంకట్‌ తదితరులు నటించారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 8వ తేదీ నుంచి డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో విక్రమ్‌ప్రభు ట్రైనీ పోలీసు పాత్రలో నటించారు. ఈ చిత్రం చూసి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనకు ఫోన్‌ చేసి చాలా బాగా నటించావని అభినందించారని ఆయన తన ట్విట్టర్‌లో తెలిపారు. 

చదవండి: (మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. రూ.40వేలు డబ్బులు డ్రా చేయించి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement