Vikram Prabhu
-
దీపావళికి వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య జంటగా నటించిన ఫుల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రైడ్. దర్శకుడు ముత్తయ్య మాటలను అందించిన ఈ చిత్రం ద్వారా.. ఆయన శిష్యుడు కార్తీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎం.స్డూడియోస్, ఓపెన్ స్క్రీన్ పిక్చర్స్, జీ.పిక్చర్స్ సంస్థల అధినేతలు కే.కనిష్క్, జీకే, జీ.మణికన్నన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి పండగ సందర్భంగా ఈనెల 10న థియేటర్లలో థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ చిత్రం గురించి నటుడు విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. 'దర్శకుడు కార్తీ రైడ్ చిత్ర కథ చెప్పినప్పుడే అందులో యాక్షన్, ఎమోషనల్, లవ్, డాన్స్ అంటూ ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేసే అన్ని అంశాలు ఉన్న విషయాన్ని గ్రహించా. తాను కమర్షియల్ కథా చిత్రాల గురించి ఎక్కువగా ఆలోచిస్తా. మూవీ ఫైనల్ కాపీ చూసిన తరువాత దర్శకుడు నన్ను కమర్షియల్ హీరోగా చూపించడం సంతోషంగా అనిపించిందని' అన్నారు. రైడ్ సామాజిక సమస్యతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు కార్తీ చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసుకున్నప్పుడే కథానాయకుడి పాత్ర పక్కింటి కుర్రాడిలా ఉండాలని భావించానన్నారు. అదే సమయంలో మాస్ హీరోగానూ కనిపించాలని అనుకున్నానని అన్నారు. ఇక ఈ చిత్రంలో హీరోగా విక్రమ్‌ప్రభు కరెక్ట్ అని యూనిట్ అంతా ముక్తకంఠంతో చెప్పారన్నారు. ఈ పాత్రకు విక్రమ్‌ప్రభు పూర్తి న్యాయం చేశారన్నారు. దర్శకుడు ముత్తయ్య సంభాషణలు ఈ చిత్రానికి వాణిజ్యపరంగా పక్కా బలంగా నిలిచాయన్నారు. -
చాలాకాలం తర్వాత ఈ హీరోయిన్‌తో కలిసి నటించా: హీరో
ఇటీవల ఇరుగప్పట్రు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో విక్రమ్ ప్రభు. ఆయన తాజాగా నటించిన చిత్రం రైడ్. ముత్తయ్య మాటలు రాసిన ఈ చిత్రం ద్వారా ఆయన శిష్యుడు, మేనల్లుడు కార్తీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథనం, దర్శకత్వం బాధ్యతలను కార్తీ నిర్వహించగా ఎం.స్టూడియోస్ పతాకంపై ఎస్.కె.కనిష్క్ జీకే జి.మణికన్నన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్ శ్రీ దివ్య నాయకిగా నటించిన ఇందులో నటి అనంతిక, సెల్వ, దర్శకుడు వేలు ప్రభాకరన్, సౌందరరాజన్, రిషి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కదిరవన్ ఛాయాగ్రహణం, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రానికి సంభాషణలు అందించిన దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ కుంభం మరుదు వంటి గ్రామీణ కథా చిత్రాలు చేసిన తరువాత సిటీ నేపథ్యంలో చిత్రాన్ని చేయాలని భావించారన్నారు. అలా శివరాజ్ కుమార్ కథానాయకుడుగా నటించిన తగరు చిత్ర రీమేక్ హక్కులను పొందానని చెప్పారు. ఆ సమయంలో విక్రమ్ ప్రభు నటించిన ఠాణాక్కారన్ చిత్రం ప్రేక్షకులకు రీచ్ అయిందని, దీంతో తగరు ఆయనకు చూపించగా ఇందులో నటించడానికి సమ్మతించారన్నారు. అయితే ఆ సమయంలో తాను దర్శకత్వం వహిస్తున్న విరుమాన్ చిత్ర కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో అల్లుడు కార్తీకి బాధ్యతలను అప్పగించానన్నారు. విక్రమ్ ప్రభు మాట్లాడుతూ ఈ చిత్రాలు ఎంతో ఎంజాయ్ చేస్తూ నటించానని తెలిపారు. ఇది కమర్షియల్ అంశాలతొ కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. నటి శ్రీదివ్యతో చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించడం సంతోషకరమైన విషయం అని విక్రమ్ ప్రభు పేర్కొన్నారు. చదవండి: Ananya Panday: ఆదిత్యతో డేటింగ్ రూమర్స్.. సిగ్గుపడుతూ ఒప్పేసుకున్న హీరోయిన్! -
ఇంతకుముందు సరైన సినిమాలు చేయలేకపోయా.. ఆ బాధే..: హీరో
నటుడు విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రీ శ్రద్ధా శ్రీనాథ్, సానియా అయ్యప్పన్, అపర్నిధి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. ఎస్సార్ ప్రభు తన పొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించాడు. యువరాజ్ దయాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం గోకుల్, సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ అందించారు. ఈనెల 6న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో థాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. ఏ ఊరికి వెళ్లినా అక్కడ ఇళ్లల్లో తాత శివాజీ గణేషన్ ఫోటో ఉంటుందన్నారు. ఈ ఇరుగప్పట్రు చిత్రం కూడా అలా ప్రతి ఇంటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకుముందు కొన్ని సరైన చిత్రాలు ఇవ్వలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశానని.. ఆ విచారమే ఈ చిత్ర విజయానికి కారణమని పేర్కొన్నారు. దర్శకుడు యువరాజ్ దయాళన్ మాట్లాడుతూ ఈ చిత్రం విడుదలైన అక్టోబర్ 6న రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు. నిర్మాత ఎస్సార్ ప్రభు మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలకు ముందు చిన్న సంఘటన జరిగిందన్నారు. సాధారణంగా భారీ చిత్రాలు నిర్మిస్తున్నప్పుడు బాగా ఆడతాయా, ఆడవా అని ఆలోచించకుండా చేస్తామన్నారు. అయితే ఎవరైనా కులచిత్రాలను నిర్మిస్తున్నట్లు తర్వాత చెబితే బాగా ఆలోచించి నిర్మించండి అని చెప్తానన్నారు. దాంతో చాలామంది తనపై ఆగ్రహించుకునేవారని చెప్పారు. అదేవిధంగా కరోనా కాలం తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదని, మంచి కథా చిత్రాలను యువత చూడడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కథ, కథనాలతో రూపొందిస్తే చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా సక్సెస్ అవుతాయని తమ ఇరుగప్పట్రు చిత్రం నిరూపించిందని పేర్కొన్నారు. చదవండి: 'లియో' బుకింగ్ స్టార్ట్.. వార్నింగ్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం -
బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తమిళ మూవీ!
హీరో విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రద్ధ శ్రీనాథ్, అపర్ణతి, సానియా అయ్యప్పన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. యువరాజ్ దయాళ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్సార్. ప్రభు తన పొటన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రభు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈతరం యువకులు కుటుంబ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలను వాటికి పరిష్కారాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించిన చిత్రం ఇరుగప్పట్రు అని తెలిపారు. ఈ చిత్రం రెండవ రోజు నుంచి థియేటర్లలో ప్రదర్శన ఆటలను పెంచారని చెప్పారు. ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. మంచి కథా చిత్రాలను ఎప్పు డూ ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించారన్నారు. ఇరుగచుట్రు చిత్రం బ్లాక్ బస్టర్ అయిందని ఆయన పేర్కొన్నారు. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ.. ఐదు వారాల్లో ఎంత వెనకేసిందంటే? -
భార్యకు బహుమతిగా ఆ సినిమా.. స్టార్ హీరో కామెంట్స్!
మానగరం, మాన్స్టర్, టాణాకారన్ లాంటి డిఫరెంట్ హిట్ సినిమాలని నిర్మించిన పొటాన్షియల్ స్టూడియోస్ సంస్థ తీసిన కొత్త మూవీ 'ఇరుగప్పట్రు'. విక్రమ్‌ప్రభు, విధార్థ్, శ్రీ, శ్రద్ధాశ్రీనాథ్, సానియా అయప్పన్, అపర్నది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి 'ఎలి' ఫేమ్ యువరాజ్ దయాళన్ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ) రిలీజ్ దగ్గరపడిన సందర్భంగా చైన్నెలోని తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ టైలర్‌మేడ్ పాత్ర పోషించారని, ఈ మూవీ కోసం బరువు కూడా పెరిగారని చెప్పుకొచ్చారు. నటుడు విధార్ధ్ పారితోషికం లేకుండానే ఈ చిత్రంలో నటిస్తానని చెప్పారని తెలిపారు. నటుడు విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. అక్టోబరు తనకు చాలా ప్రత్యేకమైందని అన్నాడు. అక్టోబరు 6 తన తాతగారు శివాజీగణేశన్ పుట్టినరోజు అని, అలానే తన భార్య పుట్టినరోజు కూడా అని చెప్పాడు. అందుకే ఆ చిత్రాన్ని తన భార్యకు బహమతిగా ఇస్తానని చెప్పానని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: 'స్కంద' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
'పోలీసోడు' హీరో మరో కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ రిలీజ్
చెన్నై సినిమా: తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు కథా నాయకుడిగా నటించనున్న తాజా చిత్రానికి 'రత్తముమ్ సదైయుమ్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. కార్తీక్ మూవీ హౌస్ పతాకంపై కార్తీక్ అడ్విత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హరేందర్ బాలచందర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల 'టానాక్కారస్' చిత్రంలో నటనకు గాను సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకున్న విక్రమ్ ప్రభు నటిస్తున్న తాజా చిత్రం ఇది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని, ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం (మే 24) విడుదల చేశారు. టానాక్కారస్ చిత్రాన్ని తెలుగు వెర్షన్లో పోలీసోడు పేరుతో ఏప్రిల్ 8న విడుదల చేశారు. ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ మూవీ అశేష ప్రేక్షకాదరణ పొందింది. చదవండి: 👇 బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్ రజనీ కాంత్‌తో ఇళయరాజా భేటీ.. కారణం ? Need all of your encouragement for this one! Let’s go team! 💪👍😊 இரத்தமும் சதையும் - Blood and Flesh. Written and Directed by: @harendhar_b Produced by: @KarthikFilmaker@ctcmediaboy @teamaimpr#bloodandflesh #rathamumsadhaiyum. pic.twitter.com/HdWIvDHkvP — Vikram Prabhu (@iamVikramPrabhu) May 24, 2022 -
రజనీకాంత్ అభినందనలు మరువలేనివి
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ తనను అభినందించారని యువ నటుడు విక్రమ్‌ప్రభు తెగ సంతోష పడిపోతున్నారు. ప్రఖ్యాత దివంగత నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు వారసుడు అయిన ఈయన హీరోగా నటించిన చిత్రం టానాక్కారన్ తమిళ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాయకిగా అంజలి నాయర్, ఇతర ముఖ్యపాత్రల్లో లాల్, ఎంఎస్ భాస్కర్, మధుసూదన్, బోస్ వెంకట్ తదితరులు నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 8వ తేదీ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విక్రమ్‌ప్రభు ట్రైనీ పోలీసు పాత్రలో నటించారు. ఈ చిత్రం చూసి సూపర్‌స్టార్ రజనీకాంత్ తనకు ఫోన్ చేసి చాలా బాగా నటించావని అభినందించారని ఆయన తన ట్విట్టర్లో తెలిపారు. చదవండి: (మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. రూ.40వేలు డబ్బులు డ్రా చేయించి..) -
షూటింగ్లో స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాను: హీరో
మండుటెండల కారణంగా షూటింగ్లో స్పృహతప్పి పడిపోయే స్థితికి చేరుకున్నానని నటుడు విక్రమ్ ప్రభు పేర్కొన్నారు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం టాణాక్కారన్. ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, పి.గోపీనాథ్, తంగ ప్రభాకరన్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. నటుడు తమిళ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 8 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. గురువారం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు విక్రమ్‌ప్రభు మాట్లాడుతూ షూటింగ్‌ను మండుటెండల్లో నిర్వహించినట్లు చెప్పారు. ఒక సమయంలో తానే స్పృహ కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. -
విక్రమ్‌ప్రభుతో జత కుదిరింది
సినిమా: నటి మడోనా సెబాస్టియన్‌కు విక్రమ్‌ప్రభుతో జత కుదిరింది. ఇంకా చెప్పాలంటే ఈ బ్యూటీ లక్కీచాన్స్‌ను కొట్టేసింది. మలయాళ చిత్రం ప్రేమమ్ హీరోయిన్లలో ఒకరైన మడోనా సెబాస్టియన్ కోలీవుడ్‌లో నటించింది చాలా తక్కువ చిత్రాలే. అప్పుడెప్పుడో నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన పవర్‌పాండి చిత్రంలో ఆయనతో నటించింది. ఆ తరువాత జుంగాలో అతిథిగా మెరిసింది. అయితే ప్రస్తుతం శశికుమార్‌కు జంటగా కొంబువచ్చ సింగం చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు మలయాళం, కన్నడం చిత్రాల్లోనూ నటిస్తున్న మడోనా సెబాస్టియన్‌కు తాజాగా కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించే లక్కీచాన్స్ కొట్టేసింది. మణిరత్నం మెడ్రాస్ టాకీస్‌పై ఇరువర్, నేరుక్కునేర్, ఉయిరే, అలైప్పాయుదే, రావణన్, కాట్రు వెళియిడై, సెక్క సివంద వానం చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా మల్టీస్టారర్‌తో పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని లైకా సంస్థతో కలిసి తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన నిర్మాతగా తన శిష్యుడు ధనా దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటుడు విక్రమ్‌ప్రభు క«థానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి మడోనా సెబాస్టియన్ నటించనుంది. ఇక విక్రమ్‌కు సోదరిగా నటి ఐశ్వర్యరాజేశ్ నటించనుంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కథ, మాటలను మణిరత్నమే సమకూర్చడం. అంతే కాదు ధనాతో కలిసి కథనాన్ని రాశారు. ఈ చిత్రానికి వానం కొట్టట్టుం అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి 96 చిత్రం ఫేమ్ గోవింద్ వసంత్ సంగీతాన్ని, ప్రీతా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం విక్రమ్‌ప్రభు అసురగురు, వాల్టర్ చిత్రాల్లో నటిస్తున్నారన్నది గమనార్హం. -
జతగా...
20 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత శరత్ కుమార్, రాధిక దంపతులు ఆన్ స్క్రీన్ కూడా జోడీగా నటించనున్నారు. గతంలో ‘నమ్మ అన్నాచ్చి, సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్‌కుమార్, రాధిక కలసి నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ జంటగా విక్రమ్ ప్రభు హీరోగా ధన దర్శకత్వంలో ‘వానమ్ కొట్టటుమ్’ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మడోనా సెబాస్టియన్ కథానాయిక. ఈ చిత్రానికి కథ– మాటలు మణిరత్నం, ధన సమకూర్చారు. జూలైలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. -
కొత్త దర్శకుడితో విక్రమ్‌ప్రభు
నటుడు విక్రమ్‌ప్రభుకు ప్రస్తుతం ఒక సక్సెస్ కావాలి. ఈ యువ హీరో 60 వయదు మాణియం, తుపాకీ మునై వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా.. సక్సెస్ పరంగా ఆ చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో విక్రమ్ ప్రభు రేస్‌లో కాస్త వెనుక పడ్డారనే చెప్పాలి. నటుడిగా ఈయన బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం అసురగురు, వాల్టర్ చిత్రాలలో నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రానికి కమిట్ అయ్యారు. దీన్ని మాయ, మానగరం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రొటాంషియల్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు వెట్ట్రిమారన్ శిష్యుడు తమిళరసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా కథానాయకీ, ఇతర నటినటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందనీ, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్‌ను మార్చి రెండవ వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలతో విక్రమ్‌ప్రభు మళ్లీ సక్సెస్ బాట పడతారని ఆశిద్దాం. -
నెలాఖరున ‘60 వయదు మానిరం’
తమిళసినిమా: కిళక్కు సీమయిలే చిత్రం తరువాత మనసును అంతగా హత్తుకున్న చిత్రం 60 వయదు మానిరం అని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను పేర్కొన్నారు. వీ క్రియేషన్స్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి పబ్లిసిటీ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈయన ఇటీవల రజనీకాంత్ హీరోగా కబాలి చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్‌ప్రభు, ప్రకాశ్‌రాజ్, సముద్రకని నటి ఇందుజా ప్రధాన పాత్రల్లో రాధామోహన్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 60 వయదు మానిరం. చాలా సైలెంట్‌గా చిత్రీకరణను, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమానుబంధాలను ఆవిష్కరించే ఇతి వృత్తంతో తెరకెక్కిన చిత్రామన్నారు. దీనికి సంగీతజ్ఞాని ఇళయరాజా బాణీలు కట్టడం విశేషం. సెన్సార్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకుంది. చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు చాలా మంచి సినిమా అంటూ ప్రశంసల జల్లు కురిపంచి యూ సర్టిఫికెట్‌ను అందించారట. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం నిర్మించిన కిళక్కు సీమయిలే చిత్రం తరువాత అంతగా నా మనసును హత్తుకున్న చిత్రం 60 వయదు మానిరం అన్నారు. చిత్రంలో ప్రకాశ్‌రాజ్ నటనకు అవార్డు రావడం ఖాయం అని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
ఆ లక్కీగర్ల్ ఎవరు?
తమిళసినిమా: సినిమాకు కథ, కథనాలను పక్కన పెడితే హీరోహీరోయిన్ల కాంబినేషన్ బట్టి కూడా వ్యాపారం ఉంటుంది. అలా కోలీవుడ్‌లో స్పెషల్ కాంబినేషన్లను కలిపే దర్శకుల్లో వెంకట్‌ప్రభు ఒకరు. ప్రస్తుతం పార్టీ చిత్ర విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈయన త్వరలో కొత్త చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించడానికి సమ్మతించారు. అంతే కాదు ఈ చిత్రానికి మానాడు అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. దీన్ని సురేశ్‌కామాక్షి తన వీ.హౌస్ పతాకంపై నిర్మించనున్నారు. టైటిల్‌ను బట్టే అర్థం అవుతుంది ఇదో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న కథా చిత్రం అని. ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్‌ప్రభు ధృవీకరించారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగునున్నాయి. ఇంత వరకూ బాగానే ఉంది. ఇందులో శింబుతో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరన్నది ఆసక్తిగా మారింది. మానాడులో నటించే హీరోయిన్ కోసం ఇద్దరు యువ నటీమణులతో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అంతే కాదు వారి పేర్లు కూడా వెల్లడించారు. నటి కీర్తీసురేశ్, అతిలోక సుందరి వారసురాలు జాన్వీలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే వీరిలో ఎవరు శింబుతో నటించేది త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. అయితే శింబుకు జంటగా నటి జాన్వీ నటిస్తుందన్నది సందేహమే. అయితే ఈ అమ్మడిని దక్షిణాదిలో పరిచయం చేయాలన్న ప్రయత్నాలు మాత్రం చాలా కాలంగానే జరుగుతున్నాయి. ఏదేమైనా మానాడు చిత్రంలో నాయకిగా కీర్తీసురేశ్‌నే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇ ఇద్దరు బ్యూటీలో ఎవరు శింబుతో జత కట్టినా అది క్రేజీ కాంబినేషనే అవుతుంది. త్వరలోనే ఎవరన్న సస్పెన్ప్ వీడనుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. -
సీక్వెల్ చాన్స్
‘మెంటల్ మదిలో, టిక్ టిక్ టిక్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ కథానాయిక నివేథా పేతురాజ్. చక్కటి హావభావాలతో పాటు గ్లామర్‌పరంగా మార్కులు కొట్టేశారు. దాంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టేశాయి. ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో ఒక సినిమాతో బిజీగా ఉన్నారీ భామ. దానికి తోడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేశారట. 2012లో తమిళ నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభుని పరిచయం చేస్తూ దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కుమ్కి’. తెలుగులో ‘గజరాజు’ పేరుతో రిలీజైంది. ఇప్పుడు ‘కుమ్కి’ సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డారట దర్శకుడు. ఈ సీక్వెల్లో హీరోయిన్గా నివేథా పేరును పరిశీలిస్తున్నారట. ఫస్ట్ పార్ట్‌లో యాక్ట్ చేసిన విక్రమ్ ప్రభునే ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారు. ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనుంది. -
గొర్రెల కాపరిగా అవతారం..
తమిళసినిమా: కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానం కోసం చాలా కాలంగా పోరాడుతున్న పదహారణాల తెలుగమ్మాయి నటి బిందుమాదవి. నిజం చెప్పాలంటే పక్కింటి అమ్మాయి ఇలానే ఉంటుంది అనేంతగా కుటుంబ కథా పాత్రల్లో ఇమిడిపోయే నటి ఈ అమ్మడు. ఒకరకంగా అలాంటి ఇమేజ్‌నే బిందుమాధవికి మైనస్ అయ్యిందేమో. కేడీబిల్లా కిలాడిరంగా లాంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన బిందుమాధవికి మార్కెట్ పెరగలేదు. అంతే కాదు అవకాశాలు అడపాదడపాగానే వస్తున్నాయి. నటనకు గ్యాప్ రావడంతో ఈ చిన్నది ఇటీవల సొంత ఊరు వెళ్లి కుటుంబసభ్యులతో గడపడంతో పాటు అక్కడ పిల్లలతో ఆడి పాడడం, గొర్రెల కాపరిగా అవతారం ఎత్తడం లాంటి పనులు చేశారు. అంతేకాదు ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి కాస్త ప్రచారం పొందే ప్రయత్నం చేశారు. బిందుమాధవి గొర్రెలను కాస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసినా, అవి పెద్దగా వర్కౌట్ అయినట్లు లేదు. దీంతో ఇప్పటి వరకూ మడికట్టుకు కూర్చున్న ఈ జాణ ఇక లాభం లేదని భావించిందో ఏమో అదిరిపోయేలా అందాలారబోత ఫొటోలను తాజాగా ఇంటర్నెట్లో విడుదల చేసింది. ఈ ఫొటోలిప్పుడు సోషల్‌మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫొటోలు బిందుమాధవికి గ్లామర్ పాత్రలను ఏ మేరకు తీసుకోస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ విక్రమ్‌ప్రభుతో జత కట్టిన పక్కా చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. విశేషం ఏమిటంటే ఇందులోనూ బిందుమాధవి లంగా ఓణి ధరించి పల్లెటూరి భామగానే నటించింది. గ్లామర్ కంటూ నటి నిక్కీగల్రాణి ఉందీ చిత్రంలో. మరి పక్కా చిత్రం బిందుమాధవి కెరీర్‌కు ప్లస్ అవుతుందా చూద్దాం. -
ఆ హీరోకు జోడి కుదిరింది..
ఎట్టకేలకు యవ నటుడు విక్రమ్ ప్రభుకు హీరోయిన్ దొరికింది. యువ హీరో విక్రమ్‌ప్రభు, మహిమ నంబీయార్‌ల జోడీ కుదిరింది. మొదటి చిత్రం కుంకీతోనే పల్లెటూరి కుర్రాడి పాత్రలో విక్రమ్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం అసుర గురు అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి ఏ.రాజ్‌దీప్ డైరెక్టర్. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం బాగానే అన్వేషణ జరిగిందట. చివరకు నటి మహిమ నంబీయార్ సెట్ అయ్యింది. ఈ బ్యూటీ చాలా తక్కువ చిత్రాలోనే నటించింది. కానీ అందులో విజయం సాధించినవి ఎక్కువ. ఈ చిత్రాన్ని జే. సతీశ్‌కుమార్ నిర్మించనున్నారు. దీనికి గణేశ్ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. -
'పక్కా' ధోని అభిమానిగా..
సాక్షి, చెన్నై: అభిమానం కలగాలే గానీ, అది ఎంత వరకైనా తీసుకెళుతుంది. అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కలిగిన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంటే ఎవరికి అభిమానం ఉండదు. అలా ఆయన వీరాభిమానుల్లో ఒకడిగా విక్రమ్‌ప్రభు నటిస్తున్న తాజా చిత్రం పక్కా. బెన్ స్ట్రోడియం పతాకంపై టి.శివకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ప్రభు సరసన నిక్కీగల్రాణి, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక ప్రధాన పాత్రలో నిర్మాత టి.శివకుమార్ నటించడం విశేషం. సి.సత్య సంగీతాన్ని, శరవణన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి చిత్ర కథానాయకుడి విక్రమ్‌ప్రభు తెలుపుతూ ఇది పక్కా కమర్షియల్, కామెడీ అంశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో తాను ఉత్సవాల్లో బొమ్మలు విక్రయించే దుకాణం నడుపుకునే యువకుడిగా నటిస్తున్నానని, క్రికెట్ క్రీడ అంటే మహాపిచ్చి అని, దీంతో ధోని అభిమాన సంఘాన్ని నడుపుతానని చెప్పారు. ఇక నటి నిక్కీగల్రాణి రజనీకాంత్ అంటే పడి చచ్చే అమ్మాయిగా ఆయన అభిమాన సంఘ నాయకురాలిగా నటిస్తున్నారన్నారు. ఒక గ్రామ పెద్ద కూతురిగా నటి బిందుమాధవి నటిస్తున్నారని తెలిపారు. ఈ ముగ్గురి మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలే పక్కా చిత్రం అని వెల్లడించారు. ఈ చిత్రంలో ఇంతకు ముందెప్పుడూ చేయని యథార్థంతో కూడిన పాత్రను పోషిస్తున్నట్లు, తనను మరో కోణంలో ఆవిష్కరించే చిత్రంగా పక్కా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత టి.శివకుమార్ మాట్లాడుతూ పక్కా చిత్రంలో తాను ఒక కీలక పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. చిత్రం చాలా బాగా వచ్చిందని, కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని అన్నారు. తదుపరి ధర్మన్ అనే చిత్రాన్ని నిర్మించనున్నానని, త్వరలోనే ఆ చిత్ర వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి బి.శరవణన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎస్ఎస్.సూర్య నిర్వహిస్తున్నారు. -
నెరుప్పుడాకు యూ సర్టిఫికెట్
తమిళసినిమా: నెరుప్పుడా చిత్రం నటుడు విక్రమ్‌ప్రభుకు తొలి సంతోషాన్ని అందించింది. నటనపై తపన ఉన్న నటుల్లో విక్రమ్‌ప్రభు ఒక్కరని చెప్పవచ్చు. పాత్రకు జీవం పోయడానికి తపించే ఆయనకు ఇటీవల వీరశివాజి, క్షత్రియన్ చిత్రాల రిజల్ట్ సంతృప్తి నివ్వలేదు. నటుడిగా చాలా తక్కువ వయసులోనే సినిమా మీద ఉన్న అపార ప్రేమతో నిర్మాతగా మారారు విక్రమ్. ఫస్ట్ఆర్టిస్ట్ బ్యానర్‌పై తానే స్వయంగా నిర్మిస్తూ, కథానాయకుడాగా నటిస్తున్న తొలి చిత్రం నెరుప్పుడా. ఇందులో ఆయనకు జంటగా నిక్కీగల్రాణి నటిస్తోంది.కొత్త దర్శకుడు అశోక్‌కుమార్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ అందించింది. తమిళ నాట యూ సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయి. అందుకే తమిళ చిత్రాలన్నింటికి తమిళ్ పేర్లనే నిర్ణయిస్తారు దర్శక నిర్మాతలు. అదే సమయంలో క్లీన యు సర్టిఫికేట్ వచ్చే విధంగా సినిమాలను తెరకెక్కిస్తారు. నెరుప్పుడా చిత్రం యూ సర్టిఫికెట్ పొంది ఆ చిత్ర నిర్మాత విక్రమ్‌ప్రభుకు తొలి సంతోషాన్ని అందించింది.చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
అభిమానానికి దాసోహం శివాజీ కుటుంబం
►నటుడు శివాజీ మనవడు విక్రమ్‌ప్రభు ►ఘనంగా శివాజీ, కామరాజనాడార్ విగ్రహాల ఆవిష్కరణ నగరి: అభిమానానికి శివాజీ కుటుంబం ఎప్పుడూ దాసోహమేనని నటుడు శివాజీ గణేశన్ మనవడు, ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు అన్నారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ పరిధి సత్రవాడలో శివాజీ గణేశన్ అభిమాని దివంగత మునియప్పన్ జ్ఞాపకార్థం నిర్మించిన దివంగత శివాజీ గణేశన్ విగ్రహం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి పెదనాన్న రామ్‌కుమార్‌తో పాటు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1998లో తన తాత కామరాజనాడార్ విగ్రహానికి విచ్చేస్తే, నేడు ఆయన విగ్రహావిష్కరణకు తాను విచ్చేయడం ఎనలేని సంతోషాన్ని ఇస్తోందన్నారు. నటనకు హద్దులు లేవని తన తాత శివాజీ గణేశన్ నిరూపించారన్నారు. అందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఓ పండుగలా చేయడమే నిదర్శనమన్నారు. తన తాత, తండ్రి బాటలోనే తాను కూడా ప్రజల అభిమానాన్ని పొందడానికి కృషి చేస్తున్నానన్నారు. రామ్‌కుమార్ మాట్లాడుతూ, కామరాజనాడార్ తన తండ్రికి ఆదర్శమన్నారు. నేడు వారి ఇద్దరి విగ్రహాలు ఒకేచోట ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే.కుమార్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి తాను శివాజీ గణేశన్ అభిమానినని, రాజకీయంగా తనకు మార్గం చూపింది ఆ కుటుంబమే అన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ వీఎస్.భానుమూర్తి, భారతదేశ శివాజీ సంఘం నిర్వాహకులు మరుదుమోహన్, చంద్రశేఖర్, జయపెరుమాళ్, స్థానిక నాయకులు వరదప్ప మొదలియార్, రామచంద్రన్, ఏకనాథన్, దేవన్, ఏకాంబరం, శ్రీనివాసన్, ఇలంగో, రాజా, కుమార్, నటరాజన్, వినాయకం, జయరామన్, కృష్ణన్, సీఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ కుటుంబం అభిమానానికి దాసోహం..
- ఘనంగా శివాజీ, కామరాజనాడార్ విగ్రహాల ఆవిష్కరణ నగరి: అభిమానానికి శివాజీ కుటుంబం ఎప్పుడూ దాసోహమేనని నటుడు శివాజీ గణేశన్ మనవడు, ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు అన్నారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ పరిధి సత్రవాడలో శివాజీ గణేశన్ అభిమాని దివంగత మునియప్పన్ జ్ఞాపకార్థం నిర్మించిన దివంగత శివాజీ గణేశన్ విగ్రహం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి పెదనాన్న రామ్‌కుమార్‌తో పాటు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1998లో తన తాత కామరాజనాడార్ విగ్రహావిష్కరణకు విచ్చేశాడు. నేడు ఆయన విగ్రహావిష్కరణకు తాను విచ్చేయడం ఎనలేని సంతోషాన్ని ఇస్తోందన్నారు. నటనకు హద్దులు లేవని తన తాత శివాజీ గణేశన్ నిరూపించారని అన్నారు. అందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఓ పండుగలా చేయడమే నిదర్శనమని అన్నారు. తన తాత, తండ్రి బాటలోనే తాను కూడా ప్రజల అభిమానాన్ని పొందడానికి కృషి చేస్తున్నాను. రామ్‌కుమార్ మాట్లాడుతూ.. కామరాజనాడార్ తన తండ్రికి ఆదర్శమన్నారు. నేడు వారి ఇద్దరి విగ్రహాలు ఒకేచోట ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే.కుమార్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను శివాజీ గణేశన్ అభిమానినని, రాజకీయంగా తనకు మార్గం చూపింది ఆ కుటుంబమే అన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ వీఎస్.భానుమూర్తి, భారతదేశ శివాజీ సంఘం నిర్వాహకులు మరుదుమోహన్, చంద్రశేఖర్, జయపెరుమాళ్, స్థానిక నాయకులు వరదప్ప మొదలియార్, రామచంద్రన్, ఏకనాథన్, దేవన్, ఏకాంబరం, శ్రీనివాసన్, ఇలంగో, రాజా, కుమార్, నటరాజన్, వినాయకం, జయరామన్, కృష్ణన్, సీఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాతో పోటీనా అన్నారు
మహా నటుడు శివాజీగణేశన్ ఏరా నాతో పోటీయా? అన్నారని సూపర్‌స్టార్ రజనీకాంత్ గత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. శివాజీగణేశన్ మనవడు, ప్రభు కొడుకు, యువ నటుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటిస్తూ, తొలిసారి నిర్మాతగా మారి ఫస్ట్ ఆర్టిస్ట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నెరుప్పుడా. నిక్కీగల్రాణి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు అశోక్‌కుమార్ పరిచయం అవుతున్నారు. ఆర్డి. రాజశేఖర్ ఛాయాగ్రహణం, సాన్‌రోల్డన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక బోగ్రోడ్డులోని శివాజీ గణేశన్ ఇంటి ఆవరణలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు రజనీకాంత్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా తొలి సీడీని శివాజీగణేశన్ తనయులు రామ్‌కుమార్, ప్రభు, గిరి అందుకున్నారు. కార్యక్రమంలో పాల్గొ న్న మరో అతిథి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం కార్యదర్శి, నటుడు విశాల్ మాట్లాడుతూ సినిమాపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. అలాంటి సినిమా విడుదలైన తొలి రోజు, తొలి ప్రదర్శన ముగిసిన వెంటనే మీడియా వర్గాలు విమర్శలు రాసేస్తున్నారన్నారు. అలాంటి విమర్శలు చిత్రాన్ని తీవ్రంగా ప్రభా వితం చేస్తున్నాయన్నారు. అందువల్ల రెండు, మూడు రోజు ల తరువాత విమర్శలు రాస్తే బాగుంటుందని అన్నారు. ఏరా పోటీనా అన్నారు నటుడు రజనీకాంత్ మాట్లాడుతూ నెరుప్పుడా చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని, ఈ విషయంలో మరో మాటకు తావులేదని అన్నారు. చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. విక్రమ్‌ప్రభు నిర్మాతగా కూడా నూరు శాతం సక్సెస్ అవుతారన్నారు. శివాజీ గణేశన్‌తో కలిసి తాను పడయప్పా చిత్రంలో నటించానని ఆ చిత్రం ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. ఒక సారి ఫోన్ చేసి ఫ్రీగా ఉన్నావా? ఇంటికి రా బిరియాని పెడతాను అని అన్నారన్నారు. సరే ప్రత్యేకంగా పిలిచారని వెళితే అప్పటికే 200 మంది ఉన్నారన్నారు. అదే విధంగా బిరియాని పెడతారని చూస్తే పలు రకాల ఆహార పదార్థాలు ఉన్నాయన్నారు. ఆయన ఇంట్లో ప్రతి ఆదివారం అలాగే జరుగుతుండేదని తెలిపారు. అన్నామలై చిత్రంలో తాను శివాజీగణేశన్ నటనను అనుకరిస్తూ నటించానన్నారు. చిత్రాన్ని ఆయనకు చూపించగా ఏరా నాకు పోటీయా? అని సరదాగా అన్నారని, తరువాత చాలా బాగా నటించావని అభినందించారని గుర్తు చేసుకున్నారు. నటనలో శివాజీగణేశన్‌కు పోటీ ఎవరూ లేరని అన్నారు. ఇక విక్రమ్‌ప్రభు ఉన్నత స్థాయికి ఎదగాలని ఇక్కడ అందరూ ఆశీర్వదిస్తున్నారని, ఆయనకు అంతకు మించిన బరువు, బాధ్యతలు ఉన్నాయని, అవన్నీ ప్రభు చక్కగా నిర్వర్తించగలరని అన్నారు. విక్రమ్‌ప్రభు తన తాత, తండ్రుల పేరును కాపాడాలనే తపనతో ఉన్నారని కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడని అన్నారు. విశాల్ కోరికలో న్యాయం ఉంది విశాల్ మీడియా ముందుంచిన కోరికలో న్యాయం ఉందని అన్నారు. చిత్రం విడుదలైన రెండు మూడు రోజుల తరువాత విమర్శలు రాస్తే బాగుంటుందని అన్నారు. అదే విధంగా నిర్మాతలు అందరూ బాగుండాలన్న భావనతో చిత్రాలు నిర్మించాలని, తానొక్కడినే లబ్ధి పొందాలనుకోరాదని అన్నారు. పంపిణీదారులు కూడా ముందుగా బాగా ఆలోచించి, సీనియర్ల సలహాలను తీసుకుని చిత్రాలను కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, కలైపులి ఎస్. థాను, దర్శకుడు పి. వాసు, సత్యరాజ్, ధనుష్, ఆర్. పన్నీర్‌సెల్వం, అరుళ్‌పతి, లారెన్స్, నిక్కీగల్రాణి, ప్రభుసాలమన్, సాన్‌రోల్డన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నటుడు ప్రభు ధన్యవాదాలు తెలిపారు. -
నిక్కీ పాలసీ తెలుసా?
చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్న లక్కీ నాయకి నిక్కీగల్రాణి. డార్లింగ్ అంటూ కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీకి ఆ చిత్ర విజయం జోరును పెంచింది. లారెన్స్ తో రొమాన్స్ చేసిన మొట్టశివ కెట్టశివ సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో అమ్మడు మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం విక్రమ్ ప్రభుతో నెరుప్పుడా, గౌతమ్ కార్తీక్‌కు జంటగా హరహర మహేదేవకీ చిత్రాలతో పాటు మరగద నాణయం, కీ, పక్కా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటితో పాటు మలయాళంలో టీమ్–5 అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఆ చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తోందట. కారణం ఇందులో వివాదాస్పద క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్‌కు జంటగా నటించిందట. దీంతో టీమ్–5 చిత్రం కోసం మలయాళ చిత్ర పరిశ్రమే ఆసక్తిగా ఎదురు చూస్తోందని, తానూ ఈ చిత్రంతో మాలీవుడ్‌లో బలంగా చొచ్చుకుపోతాననే నమ్మకం ఉందని నిక్కీగల్రాణి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మడి పాలసీ ఏమిటో తెలుసా? తక్కువ పారితోషికం దారాళంగా అందాలారబోయడం. అందుకే అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అలాగే మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది నిక్కీ. ఇకపోతే ఈ బ్యూటీ శునక ప్రేమికురాలట. నటి త్రిష తరువాత అంతగా కుక్కల్ని పెంచుకుంటున్న నటి నిక్కీగల్రాణినేనట. షూటింగ్ లేని సమయాల్లో ఈ భామకు కాలక్షేపం తన పెట్టీ డాగ్సేనట. -
ఈ వీడియో చూశాక కూడా వద్దంటారా?
జల్లికట్టు ఆటలో ఎద్దులను హింసిస్తారని, వాటి తోకలు కొరికి.. కర్రలతో బాది వాటిని పరుగులు తీయిస్తారని పెటా లాంటి జంతుహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే మూగ జీవాలను హింసించే ఇలాంటి ఆటలను నిషేధించాలని కోర్టుకెక్కాయి. కానీ, తమిళుల వాదన మరోలా ఉంది. తాము ఆవులు, ఎద్దులను ఎంతగానో ప్రేమిస్తామని, కన్న బిడ్డల్లా చూసుకుంటామని.. అలాంటి వాటిని తాము ఎందుకు హింసిస్తామని అడుగుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమిళ నటుడు విక్రమ్ ప్రభు తన ట్విట్టర్లో ఒక వీడియో షేర్ చేశారు. ఒక చిన్న పిల్లాడు ఎద్దుతో ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. అందకపోయినా కాళ్లెత్తి మరీ దాని కొమ్ములు పట్టుకుని కిందకు వంచి, గంగడోలుతో ఆడుకుని, చెవులు నిమురుతూ.. ఎంతలా దాన్ని అటూ ఇటూ తిప్పినా కొమ్ములు తిరిగిన ఆ ఎద్దు ఏమీ చేయకుండా ఊరుకుంటుంది. పిల్లాడితో ఆడుకున్నట్లుగానే కనిపిస్తుంది. తమిళనాడులో పశువుల పెంపకం ఒక మంచి సంస్కృతి అని, ఆవులు.. ఎద్దులతో తాము ఇలాగే స్నేహపూర్వకంగా ఉంటామని, అందువల్ల జల్లికట్టును సంస్కృతిలో భాగంగానే చూడాలని అంటున్నారు. స్పెయిన్‌లో జరిగే బుల్ఫైట్లలా కాకుండా, ఇక్కడ బహిరంగ స్థలంలో ఎడ్లను స్వేచ్ఛగా పరుగులు తీయనిస్తామని చెబుతున్నారు. ఈ వీడియో చూస్తే మాత్రం పశువుల పట్ల తాము ఎలా ఉంటామో, అవి తమతో ఎలా ఉంటాయో అందరికీ తెలుస్తుందని చెబుతున్నారు. చిన్నతనంలో తాను తమ ఇంట్లో ఉండే పశువులన్నింటినీ పేర్లుపెట్టి పిలవడం తనకు ఇంకా గుర్తుందని కూడా విక్రమ్ ప్రభు ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. -
ఈ వీడియో చూశాక కూడా వద్దంటారా?
-
విక్రమ్‌ప్రభుతో మరోసారి..
యువ నటుడు విక్రమ్‌ప్రభుతో వరుసగా రొమాన్స్ చేయడానికి నటి నిక్కీగల్రాణి సై అన్నారు. చేతినిండా చిత్రాలన్న యువ నటీమణుల్లో నిక్కీగల్రాణి ఒకరు. యాగవరాయనుం నాకాక్క చిత్రం ద్వారా కోలీవుడ్ చిత్రంలో నటించడానికి ఎంపికైన ఈ ఉత్తరాది భామ తొలుత తెరపైకి కనిపించింది మాత్రం డార్లింగ్ చిత్రంతోనే. జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని చవి చూడడంతో అమ్మడికి అవకాశాలు వరుసగా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం మొట్టశివ కెట్టశివ, నెరుప్పుడా, కీ, మరగద నాణయం, హరహర మహాదేవిక చిత్రాల్లో నటిస్తున్న నిక్కీగల్రాణికి తాజాగా మరో అవకాశం వచ్చింది. నెరుప్పుడా చిత్రంలో విక్రమ్‌ప్రభుతో జత కడుతున్న ఈ అమ్మడు అదే హీరోతో మరో చిత్రంలో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. నవ దర్శకుడు సూర్య మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రానికి పక్కా అనే టైటిల్‌ను నిర్ణయించారు. విశేషం ఏమిటంటే ఇది నిక్కీగల్రాణికి 25వ చిత్రం అవుతుంది. ఇందులో ఆ బ్యూటీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమానిగా నటించనున్నారట. పక్కా చిత్రం పూర్తి ఎంటర్టెయిన్ మెంట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కనుందని సమాచారం. నెరుప్పుడా, పక్కా చిత్రాల్లో నటుడు విక్రమ్‌ప్రభుతో వరుసగా రొమాన్స్ చేస్తున్నారన్న మాట నిక్కీగల్రాణి. ఇక విక్రమ్‌ప్రభు నటిస్తున్న తాజా చిత్రం క్షత్రియన్ త్వరలో విడుదలకు ముస్తాబవుతోందన్నది గమనార్హం. -
మణిరత్నం టైటిల్లో విక్రమ్‌ప్రభు
యువ నటుడు విక్రమ్‌ప్రభు తన తాజా చిత్రానికి మంచి పవర్ఫుల్ టైటిల్‌ను దక్కించుకున్నారు. దర్శకుడు మణిరత్నం టైటిల్‌ను తన చిత్రానికి పెట్టుకున్నారు. విక్రమ్‌ప్రభు తాజాగా నటిస్తున్న చిత్రం ముడిచూడ మన్నన్ ఇందులో ఆయనకు జంటగా నటి మంజిమామోహన్ నటిస్తున్నారు. ఇంతకు ముందు సుందరపాండియన్, ఇదు కదిరవేలన్ కాదల్ చిత్రాలను తెరకెక్కించిన ఎస్ఆర్.ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధం అవుతున్న సమయంలో ముడిచూడ మన్నన్ టైటిల్‌తో దర్శక నిర్మాత కేఆర్ ఒక చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందట. దీంతో విక్రమ్‌ప్రభు చిత్రానికి క్షత్రియన్ అనే పవర్ఫుల్ టైటిల్‌ను నిర్ణయించారు. ఇదే టైటిల్‌తో ఇంతకు ముందు దర్శకుడు మణిరత్నం బ్యానర్లో ఇటీవల కన్నుమూసిన సుభాష్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా చిత్రం వచ్చిందన్నది గమనార్హం. విక్రమ్‌ప్రభు చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నటి ఐశ్వర్యదత్, కెవిన్ ముఖ్యపాత్రల్లో నటించారు. చిత్రం త్వరలో తెరపైకి రానుంది. -
హన్సికకు లక్కీచాన్స్!
కేరీర్లో ఎత్తుపల్లాలు ఎవరికైనా సహజం. విజయాలే సోపానాలుగా కొనసాగిన వారు ఎవరూ ఉండరు. అయితే అపజయాలను అధిగమించి ముందుకు సాగడమే ప్రధానం. ఇక నటి హన్సిక విషయానికి వస్తే ఆరంభంలోనే విజయ్, సూర్య, జయంరవి, ధనుష్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకున్నారు. మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. దర్శకుల నటిగా పేరు సంపాదించుకున్నారు. అయినా ఎందుకనో ఈ మధ్య అవకాశాలు కాస్త వెనుక బడ్డాయి. ప్రస్తుతం జయంరవికి జంటగా నటించిన భోగన్ చిత్రం ఒక్కటే ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉంది. అలాగని హన్సిక కాళీగా ఏమీ కూర్చోవడం లేదు. తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.కోలీవుడ్‌లో అవకాశాలు కొరవడడంతో ఇక హన్సిక పని అయ్యి పోయింది. ఇక్కడ ఇక మూటా ముల్లు సర్దుకోవలసిందే అని చెవులు కొరుక్కునే వారు కొందరు బయలు దేరారు. అలాంటి వారి నోరు మూయించే విధంగా హన్సిక మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. భోగన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాజాగా యువ నటుడు విష్ణువిశాల్‌తో నటించడానికి హన్సిక రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీని మరో అవకాశం వరించింది. విక్రమ్‌ప్రభుకు జంటగా నటించే అవకాశం తలుపుతట్టింది. నవ దర్శకుడు ఎస్ఎస్.సూర్య మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో సూరి హాస్య పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ స్టార్ హీరోలతో నటించిన హన్సిక ఇప్పుడు యువ కథానాయకులతో నటించడానికి రెడీ అవుతున్నారు. -
లిప్లాక్కా...
ఆ రోజుల్లో సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశాలు సర్వసాధారణం అయ్యింది. కొందరు నటీమణులైతే అలాంటి సన్నివేశాలు కావాలని కోరుకుని మరీ నటిస్తున్నారు.అలాంటిది నట కుటుంబం నుంచి, అదీ బాల తారగా బహుళ ప్రాచుర్యం పొందిన నటి షామిలి లిప్‌లాక్ సన్నివేశం అనగానే కాస్త తటపటాయించారట. అంజిలి చిత్రంలో బాలతారగా కోలీవుడ్‌కు పరిచయమైన షామిలి నటి శాలిని సోదరి, నటుడు అజిత్ మరదలు అన్న సంగతి తెలిసిందే. బాల్యంలోనే బహుభాషా బాలతారగా అవార్డులు, రివార్డులు అందుకున్న షామిలి హీరోయిన్గా తొలుత మలయాళం, తెలుగు భాషలలో పరిచయమయ్యారు. ఆ భాషల్లో ఒక్కొక్క చిత్రం చేసిన ఈ బబ్లీగర్ల్ ఆ తరువాత సినిమాకు సంబంధించిన విద్య కోసం అమెరికా వెళ్లారు. ఆ తరువాత చెన్నైకి వచ్చిన షామిలి మళ్లీ నటించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆమెను నటింపజేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నించినా, చాలా కథలు విన్న ఈ బ్యూటీ చివరికి ధనుష్ సరసన కొడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు నాయకిగా పరిచయం అవ్వాలని భావించారు. అయితే అందులో మరో నాయకిగా త్రిష నటించడంతో తన పాత్రకు ప్రాముఖ్యత ఉండదని ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత విక్రమ్‌ప్రభుకు జంటగా వీరశివాజీ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు చాలా చోటు చేసుకున్నాయట. వాటిలో చాలా క్లోజ్‌గా నటింటాల్సిన పరిస్థితి అట. అలాంటి సన్నివేశాల్లో బాగానే నటించిన షామిలికి లిప్‌లాక్ సన్నివేశంలో నటించాల్సిరావడంతో చాలా సంకటంలో పడ్డారట. అయితే కథకు ఆ సన్నివేశం చాలా అవసరం అవడంతో దర్శకుడు కన్విన్స్ చేసి నటింపజేశారట. షామిలి కాస్త సంకోచంతోనే నటించినా ఆ లిప్‌లాక్ సన్నివేశం చిత్రంలో చాలా కవితాత్మకంగా రూపుదిద్దుకుందని చిత్ర వర్గాలు అంటున్నారు. నటి షామిలికి వీరశివాజీ చాలా కీలకమైన చిత్రం అవుతుంది. కోలీవుడ్‌లో తన భవిష్యత్‌ను నిర్ణయించే చిత్రంగా ఉంటుంది.అందుకే షామిలి చాలా టెన్షన్‌గా ఉన్నారట. ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతోంది. -
మాలీవుడ్‌పై దృష్టి
ఒక భాషలో కాకపోతే ఇంకో భాషలో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం హీరోల కంటే హీరోయిన్లకు అధికం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఒక భాషలో ఐరన్ లెగ్గా ముద్ర పడిన నటీమణులు ఇతర భాషల్లో లక్కీ నాయకిలైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు నటి శ్రుతీహాసన్నే తీసుకుంటే తొలుత హిందీలో లక్ అనే చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యారు. అది ఆమెకి కిక్ ఇచ్చి ఉండవచ్చు గానీ లక్‌ను మాత్రం అందించలేదు. అదే విధంగా తెలుగులో నటించిన తొలి చిత్రం నిరాశనే మిగిల్చింది. ఇక తమిళంలో నటించిన 7 ఆమ్ అరివు ఆశించిన విజయాన్ని అందించలేదు. ఇలా మూడు భాషల్లో ఆదిలో అపజయాలనే చవి చూసిన శ్రుతీహాసన్ ఇప్పుడు టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. బాల నటిగా అంజలి చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న నటి షామిలి. అనేక చిత్రాలలో అబ్బురపరచే అభినయాన్ని ప్రదర్శించి, విజయాలతో పాటు ప్రశంసలు అందుకున్నారు ఈమె. కథానాయకిగా అలాంటి విజయం ఒక్కటి కూడా దరి చేరలేదు. షామిలీ నాయకిగా ఓయ్ అనే తెలుగు చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం అంతగా ఆడలేదు. ఆ తరువాత మలయాళంలో వళ్లియం తెట్టి పెళ్లియం తెట్టి అనే చిత్రంలోనూ నటించారు. అదీ అంతగా విజయం సాధించలేదు. దీంతో నటనకు కొంత గ్యాప్ ఇచ్చి అమెరికాలో సినిమాకు సంబంధించిన విద్యను అభ్యసించడానికి వెళ్లారు. అనంతరం చెన్నైకి తిరిగొచ్చిన షామిలీ మళ్లీ నటనకు సిద్ధం అయ్యారు. రావడానికి చాలా అవకాశాలు వచ్చాయి. అందులో ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే చివరి నిమిషంలో ఆ చిత్రం నుంచి వైదొలగారు. (కాదు తొలగించారన్న ప్రచారం కూడా జరిగింది) కాగా ప్రస్తుతం విక్రమ్‌ప్రభు సరసన వీరశివాజీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత త నకు మంచి అవకాశాలు వస్తాయన్న ఆశతో ఉన్న షామిలీకి ప్రస్తుతం ఇక్కడ కొత్త అవకాశాలు లేవు. తాజాగా మాలీవుడ్‌పై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. కొందరు దర్శకుల కథలు వింటున్నారనీ, త్వరలోనే అక్కడ రీఎంట్రీకి బాటలు పడే అవకాశం ఉందనీ కోలీవుడ్ వర్గాలు టాక్. -
కోలీవుడ్‌పై రన్యా కన్ను
కోలీవుడ్‌లో పాగా వేయాలని తెగ ఆశపడుతోంది కన్నడ జాణ రన్యా. ఆల్రెడీ వాగా చిత్రం ద్వారా తమిళచిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ అనుభవాలను ఇక్కడ పంచుకుంది. యువ నటుడు విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వాగా. జీఎన్ఆర్.కుమరవేలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నాయకి రన్యా మాట్లాడుతూ తాను కన్నడంలో సుదీప్‌కు జంటగా మాణిక్య చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అయ్యానని తెలిపింది. ఆ చిత్రం చూసే వాగా చిత్ర దర్శక నిర్మాతలు తనను ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించారని చెప్పింది. ఇందులో తాను కశ్మీర్లో నివశించే దక్షిణాదికి చెందిన అమ్మాయిగా నటించానని తెలిపింది.తనకు సంబంధించిన సన్నివేశాలను కశ్మీర్, ఊటీ, సాలక్కుడి ప్రాంతాల్లో చిత్రీకరించారని అంది. చిత్రం చివరి ఘట్ట దృశ్యాల్లో అందరం చాలా కష్టపడి నటించామని తెలిపింది. తాను తమిళ భాషలో సంభాషణలు చెప్పడానికి చిత్ర హీరో విక్రమ్‌ప్రభు, దర్శకుడు జీఎన్ఆర్.కుమరవేలన్ చాలా హెల్ప్ చేశారని చెప్పింది. తనకు తమిళ భాష కొంచెం అర్థం అవుతుందని, త్వరలోనే స్పష్టంగా తమిళ భాషను మాట్లాడతానని అంది. ఈ చిత్రంలో తాను డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశానని, అయితే తన మాటల్లో కన్నడ పదాలు దొర్లడంతో వేరే డబ్బింగ్ కళాకారిణితో చెప్పించారని అన్నారు. అయితే వాగా చిత్రంలో నటించడం మంచి అనుభవం అని మరిన్ని తమిళ చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని రన్యా అంటోంది. వాగా చిత్రం విడుదల తరువాత తన నటనను, ఆ చిత్ర విజయాన్ని బట్టి రన్యా ఇక్కడ నిలదొక్కుకునేదీ, లేనిది తెలుస్తుందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
నెరుప్పుడా అంటున్న విక్రమ్‌ప్రభు
ఇటీవల ప్రతి సినీ అభిమాని నోట వినిపిస్తున్న మాట నెరుప్పుడా. కారణం సూపర్‌స్టార్ కబాలి చిత్రంలో ఒక పాటలో పదమే నెరుప్పుడా. ఇప్పుడీ పదం యువ నటుడు విక్రమ్‌ప్రభు చిత్రానికి పేరుగా మారింది. ఎస్ఈ కుంకీ చిత్ర హీరో దివంగత మహానటుడు శివాజీగణేశన్ మనవడు, సీనియర్ నటుడు ప్రభు వారసుడు అన్న విషయం తెలిసిందే. అతి కొద్దికాలంలోనే నటుడిగా తన కంటూ ఒక గుర్తింపును సంపాందించుకున్న విక్రమ్‌ప్రభు తాజాగా సొంతంగా ఫస్ట్ ఆర్టిస్ట్ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొలిపారు. దీని ఆవిష్కరణ కార్యక్రమం, ఈ బ్యానర్లో నిర్మించనున్న తొలి చిత్రం నెరుప్పుడా చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక సౌత్ బోగ్ రోడ్డులో గల అన్నై ఇల్లం(శివాజిగణేశన్ గృహం)లో నిర్వహించారు. చిత్ర బ్యానర్‌ను ప్రముఖ నిర్మాత ఏవీఎం. శరవణన్ ఆవిష్కరించగా, చిత్ర టైటిల్‌ను నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆవిష్కరించారు. కబాలి చిత్రంలో పాటలోని నెరుప్పుడా పదాన్ని తమ చిత్రానికి టైటిల్‌గా వాడుకోవడానికి ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థానును అడగ్గా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వెంటనే అనుమతించారని చిత్ర నిర్మాత, కథానాయకుడు విక్రమ్‌ప్రభు వెల్లడించారు. ఈయన ఈ చిత్రాన్ని చంద్రా ఆర్ట్స్, సినీ ఇన్నోవేషన్స్ సంస్థలతో కలిసి నిర్మించనున్నారు. దీనికి సీనియర్ సినీ పీఆర్ఓ డైమండ్‌బాబు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నెరుప్పుడా చిత్రంలో విక్రమ్‌ప్రభు అగ్నిమాపక దళ అధికారిగా, రజనీకాంత్ వీరాభిమానిగా నటించనున్నారట. ఇందులో ఆయనకు జంటగా నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో పొన్వన్నన్,నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఆడుగళం నరేన్, మధుసూదన్‌రావు, నాగినీడు నటిస్తున్నారు. అశోక్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి షాన్ రోల్డాన్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ చాయాగ్రహణం అందిస్తున్నారు. -
శింబు తారుమారు పాట
నటుడు శింబు చర్య ఏదైనా ఒక సంచలనమే. ఆడినా,పాడినా, నటించినా వాటికి విశేష ప్రచారం లభిస్తుంది. శింబుకు నటన వృత్తి అయితే పాడడం ఫ్యాషన్. ఇంతకు ముందు ఆయన పాడిన పాటలకు విశేష ప్రేక్షకాదరణ లభించింది.ఎక్కువగా తన చిత్రాలకే పాడుకునే శింబు ఇటీవల ఇతర హీరోల చిత్రాలకు తన గానాన్ని పంచుతున్నారు. తాజాగా విక్రమ్‌ప్రభు చిత్రానికి ఒక పాట పాడారు. ఇంతకు ముందు జయంరవి,హన్సిక హీరోహీరోయిన్లుగా రోమియో జూలియెట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అధినేత ఎస్.నందకుమార్ తాజాగా విక్రమ్‌ప్రభు హీరోగా వీరశివాజి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.షామిలి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి గణేశ్ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నిర్మాణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆయన సంగీత సారథ్యంలో తారుమారు అనే పాటను నటుడు శింబు పాడారు. దీన్ని ఇంతకు ముందు దండామారి ఊదారి, ఎంగ తల ఎంగ తల వంటి సూపర్‌హిట్ పాటలను రాసిన రోఖేశ్ ఈ తారుమారు పాటను రాశారు. శింబు పాడిన ఈ పాటా మార్కెట్లో విడుదలైన తరువాత ఊరువాడ మారుమోగుతుందంటున్నారు వీరశివాజి చిత్ర యూనిట్. -
త్వరలో విక్రమ్‌ప్రభు కొత్త చిత్రం
యువ నటుడు విక్రమ్‌ప్రభు నూతన చిత్రానికి సిద్ధం అవుతున్నారు. వెళైదొరై వంటి విజయవంతమైన చిత్రం తరువాత విజయ్ దర్శకత్వంలో చేసిన ఇదుఎన్న మాయం చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఇందులో విక్రమ్‌ప్రభు సరసన కీర్తిసురేష్ హీరోయిన్గా నటించారు. చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.ప్రస్తుతం విక్రమ్‌ప్రభు వాగా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇండియన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగే ఒక యువ ప్రేమజంట ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం. జాతీయ అవార్డు గ్రహీత హరిదాస్ చిత్రం ఫేమ్ జీఎన్ఆర్ కుమరవేలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ప్రభుతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరన్నది చిత్ర యూనిట్ రహస్యంగా ఉంచింది. కాగా విక్రమ్‌ప్రభు తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియోజూలియెట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్ప్రైజెస్ అధినేత ఎస్ నందగోపాల్ నిర్మించనున్న తదుపరి చిత్రంలో విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు గణేశ్ వినాయక్ పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని నిర్మాతల వర్గం తెలిపింది. -
విక్రమ్ ప్రభుతో శాండిల్ ఉడ్ బ్యూటీ
సినిమా అనే మహా ప్రపంచంలో కొత్త నీరు రాక, పాత నీరు పోక సర్వసాధారణం. అయితే ఇక్కడ అరుదెంచిన అందరూ నిలదొక్కుకుంటారని చెప్పలేము. అందుకు అందం, అభినయం ఉన్నా సరిపోదు. అదృష్టం తోడవ్వాలి. అలా తన లక్కును పరీక్షించుకోవడానికి మరో శాండిల్ ఉడ్ బ్యూటీ కోలీవుడ్‌లో ప్రవేశించారన్నది తాజా సమాచారం. ఈ భామ పేరు రన్యారావు. యువ నటుడు విక్రమ్ ప్రభుతో రొమాన్స్‌తో ఇక్కడ తన కెరీర్‌ను ప్రారంభించింది. మలయాళకుట్టి కీర్తిసురేష్‌తో డ్యూయెట్లు పాడి ఇదు ఎన్న మాయం చిత్రాన్ని పూర్తి చేసిన విక్రమ్ ప్రభు వాగా చిత్రానికి సిద్ధమయ్యారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి జిఎన్ఆర్ కుమరవేలన్ దర్శకుడు. ఇప్పటికే పది రోజులు షూటింగ్‌తో తొలి షెడ్యూల్‌ను కుంభకోణంలో పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం కాశ్మీర్, ఊటికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచిన యూనిట్ వర్గాలు దక్షిణాదికి చెందిన ప్రెష్ నటిని పరిచయం చేయాలనుకుంటున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు. ఆ దక్షిణాది అమ్మాయి శాండిల్ఉడ్కు చెందిన రన్యారావు అన్నది తాజా సమాచారం. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ అమ్మడు ఒక కన్నడ చిత్రంలో సుదీప్ సరసన నటించారట. కాగా విక్రమ్ ప్రభు వాగాతో మరో హీరోయిన్ ఉంటుందట. ఆమె ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. -
ఆమె అయితే బాగుంటుంది
దర్శకుడు విజయ్‌ని ప్రేమిస్తున్న సమయంలో అమలాపాల్ ఆయన దర్శకత్వంలో దైవ తిరుమగళ్, తలైవా చిత్రాల్లో నటించారు. ఆ తరువాత విజయ్‌తో ఏడు అడుగులు నడిచారు. ఆపై నటనకు స్వస్తి చెపుతారనే ప్రచారం జరిగినా అలాంటి అంచనాలను తారుమారు చేస్తూ అమలాపాల్ మళ్లీ నటించడం మొదలెట్టారు. తాజాగా హైకు చిత్రంలో సూర్య సరసన నటిస్తున్నారు. తన భర్త విజయ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది లేటెస్ట్ న్యూస్. విజయ్ ఇప్పుడు విక్రమ్ ప్రభు, కీర్తి సురేష్ జంటగా ఇదు ఎన్న మాయం చిత్రం రూపొందిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా హీరోగా నటించి, నిర్మించనున్న చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఒక ముఖ్యపాత్రలో అమలాపాల్ నటిస్తే బాగుంటుందన్న ప్రభుదేవా సూచనకు విజయ్ సమ్మతించినట్లు సమాచారం. నటి అమలాపాల్‌ను ఈ చిత్రంలో మనం చూడవచ్చు. అసలు ప్రభుదేవా పోషించనున్న పాత్ర ఏ తరహాలో ఉంటుందన్న విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
జీవాతో కీర్తి సురేష్
నవ నటి కీర్తి సురేష్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నటి మేనక వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ మలయాళ కుట్టి కేరళలో కొన్ని చిత్రాలు చేసి మంచి పేరే తెచ్చుకున్నారు. దీంతో కోలీవుడ్ దృష్టి ఈ బ్యూటిపై పడింది. అంతే వరుసగా నాలుగు చిత్రాల అవకాశాలు కీర్తి సురేష్ ఖాతాలో చేరిపోయాయి. తొలుత ఈ అమ్మడిని కోలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత దర్శకుడు విజయ్‌కే చెందుతుంది. సైవం చిత్రం తరువాత ఆయన విక్రమ్‌ప్రభు హీరోగా రూపొందిస్తున్న చిత్రం ఇదు ఎన్న మాయం. ఈ చిత్రం ద్వారా కీర్తిసురేష్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేశారు. అయితే ఇదు ఎన్న మాయం చిత్రం విడుదల కాకముందే శివకార్తికేయన్ సరసన రజనీ మురుగన్, బాలసింహాకు జంటగా పాంబు సండై చిత్రాల్లో హీరోయిన్గా అవకాశాలు కొట్టేశారు. వీటిలో ఏది ఇంకా తెరపైకి రాలేదు. అయినా నటుడు జీవాతో డ్యూయెట్స్ పాడడానికి కీర్తి సురేష్ సై అన్నారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు యామిరుక్క భయమే చిత్రం విజయం సాధించిన దర్శకుడు డీకే, ఆర్ఎస్ ఇన్ఫోటెంట్ సంస్థ నిర్మించనున్న తాజా చిత్రం ఇది. చిత్ర షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. -
అరకోటి ఇస్తే ఓకే
అరకోటి కొట్టు కాల్ షీట్స్ పట్టు ఇది యువ నటి శ్రీ దివ్య తాజా స్లోగన్ అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇంకా చాలా షరతులున్నాయట. అవేమిటో తెలుసుకోవాలనుందా? కోలీవుడ్‌లో ఈ అమ్మడి కెరీర్ బ్రహ్మాండమైన విజయంతో మొదలైంది. శివకార్తికేయన్‌తో శ్రీ దివ్య నటించిన వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తరువాత విడుదలైన జీవా చిత్రం ప్రజాదరణ పొందింది. ఈ మధ్య విక్రమ్ ప్రభుతో జతకట్టిన వెళ్లక్కార దురై విజయం సాధించింది. ఇలా వరుసగా నటించిన మూడు చిత్రాలు సక్సెస్ అవ్వడంతో శ్రీదివ్య ఊహలతోపాటు ఆశలకు రెక్కలొచ్చేశా యి. ప్రస్తుతం ఆమె చేతిలో మరో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు శివకార్తికేయన్, విష్ణు విశాల్ , జి.వి.ప్రకాష్, విక్రమ్ ప్రభు లాంటి వర్ధమాన హీరోలతోనే జతకట్టడంతో ఇప్పుడిక స్టార్ హీరోల సరసన నటించాలనే ఆశ పెరుగుతోందట. దీంతో చిన్న హీరోల అవకాశాలకు కాల్షీట్స్ లేవంటూ నిరాకరిస్తోందట. ఇక ఆమె పెడుతున్న షరతుల విషయానికొస్తే చిన్న హీరోల చిత్రాలైతే స్టార్ దర్శకులైనా ఉండాలని, ప్రముఖ హీరోల చిత్రాలైతే యువ దర్శకులైనా ఫర్వాలేదని అంటోందట. తాజాగా మలయాళ చిత్రం బెంగళూర్ డేస్ తమిళం, తెలుగు భాషల రీమేక్‌లో ఆర్య సరసన నటించే లక్కీ ఛాన్స్ శ్రీదివ్యను వరించింది. అంతకుముందు తెలుగులో బస్టాప్ వంటి విజయవంతమైన చిత్రంలో నటించడంతో ద్విభాషా నటిగా పేరు తెచ్చుకోవడంతో ఈ భామ పారితోషికాన్ని పెంచేసిందట. ఈమె శివకార్తికేయన్‌తో రెండో సారి నటించిన కాకిసట్టై ఈ నెల 27న తెరపైకి రానుంది. -
ఇంగ్లిష్ భామ ప్రేమలో విక్రమ్ ప్రభు
యువ నటుడు విక్రమ్ ప్రభు ఇంగ్లిష్ భామ ప్రేమలో మునిగితేలుతున్నారట. అంటే ఇది రీల్ లవ్ అన్నమాట. కుంకి, శిఖరం తొడు, వెళ్లక్కార దురై అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న విక్రమ్ ప్రభు ఇప్పటికే ఇదు ఎన్న మాయ అంటూ విజయ్ దర్శకత్వంలో కీర్తి సురేష్‌తో రొమాన్స్ చేస్తున్నారు. తాజాగా వాగ చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయారు. జి ఎన్ ఆర్ కుమరవేలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే కారైకుడిలో ప్రారంభమైంది. ఇది ఒక భారత యువకుడికి పాకిస్తాన్ యువతి ప్రేమలో పడే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న విభిన్న ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు అంటున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు సరసన హిందీ బుల్లితెర నటిని హీరోయిన్గా ఎంపిక చేశారు. అయితే ఆమె గురించి వివరాలను మాత్రం ప్రస్తుతానికి రహస్యం అంటున్నారు. కోలీవుడ్‌కు పరిచయం చేయనున్న ఆ భామ పేరును కూడా మార్చేయాలనుకున్నారట. ఈ చిత్ర షూటింగ్‌ను కారైకుడిలో 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. అక్కడ కొన్ని సన్నివేశాలతోపాటు హీరో హీరోయిన్లపై ఒక డ్యూయెట్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నట్లు దర్శకుడు తెలిపారు. తదుపరి షెడ్యూల్‌ను మార్చి నుంచి 55 రోజుల పాటు కులుమనాలిలో నిర్వహించనున్నారు. ప్రత్యేక అనుమతితో వాఘా సరిహద్దులో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
ఎంతో విలువైన ఆ క్షణాలు...
త్రిష చెప్పలేనంత సంతోషంతో ఉన్నారు. మహానటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు సరసన ఓ సినిమా చేయబోతున్నారు. దానికి నిర్మాత ప్రభూనే. అయితే... త్రిష ఆనందానికి కారణం ఈ సినిమా కాదు. ఈ సినిమాలో నటించే విషయంలో అంగీకార పత్రాలపై సంతకం చేయడానికి త్రిష ఇటీవలే ప్రభు ఇంటికెళ్లారు. ప్రభు ఇల్లంటే... తమిళ సినీనటులకు ఓ దేవాలయం. కారణం... అది స్వర్గీయ మహానటుడు శివాజీగణేశన్ ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. ఆ ఇంట్లోనే దశాబ్దాల పాటు ఆయన నివసించారు. ఆ ఇంట్లోనే ఆయన పరమపదించారు. అలాంటి ఇంట్లోకి తొలిసారి అడుగుపెట్టారు త్రిష. పైగా లంచ్ టైమ్ అవడం వల్ల... శివాజీగణేశ న్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం కూడా చేశారు. ‘‘శివాజీగారింట్లో నేను గడిపిన క్షణాలే... నా జీవితంలో అత్యంత విలువైన క్షణాలు’’ అని త్రిష చెప్పుకొచ్చారు. ‘‘శివాజీ సార్‌ను చిన్నప్పుడు దూరం నుంచి చూశాను. ఆయన సినిమాలంటే మా ఇంట్లో అందరికీ ప్రాణం. తమిళుల గౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప నటుడాయన. ఆ మహానుభావుడు తిరిగిన ఇంట్లో కొన్ని నిమిషాలైనా గడపగలగడం నా అదృష్టం’’ అంటూ త్రిష తెగ సంబరపడిపోయారు. . -
అతనితో రొమాన్స్ కోసం...
ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేయాలని ఆశగా ఉన్నట్లు యువ నటి శ్రీదివ్య అంటోంది. ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలు వరుత్త పడాద వాలిబర్ సంఘం, జీవా, విడుదలై విజయం సాధించడంతో ఇప్పటి వరకు అపజయం ఎరుగని నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలు చేతిలో ఉండడంతో బిజీ నటిగా చెలామణి అవుతున్నారు. తొలి చిత్రం వరుత్త పడాద వాలిబర్ సంఘం హీరో శివకార్తికేయన్‌తో మరోసారి జతకట్టిన చిత్రం కాక్కిసట్టై సంక్రాంతికి విడుదలవుతోంది. అంతకంటే ముందు విక్రమ్ ప్రభు సరసన నటించిన వెల్లక్కార దురై చిత్రం క్రిస్మస్కు తెరపైకి రానుంది. దీంతో యమ ఎగ్జైటింగ్‌గా ఉన్న శ్రీ దివ్య వెళ్లక్కార దురై చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. ఈ చిత్రం తనకు చాలా సంతృప్తి నిచ్చిందని అంది. ప్రస్తుతం జి.వి.ప్రకాష్ కుమార్సరసన పెన్సిల్ చిత్రంలోను, అధర్వతో ఈట్టి, చిత్రంలోను నటిస్తున్నట్లు తెలిపింది. తమిళ చిత్ర పరిశ్రమలో తనకు నచ్చిన హీరో విజయ్ అని చెప్పింది. నటనలో ఆయన వేగం, స్టరుుల్ అంటే చాలా ఇష్టం అని అంది. ఆయన సరసన నటించాలని ఆశగా ఉందని శ్రీదివ్య చెప్పింది. -
విజయాల బాటలో విక్రమ్
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుల్లో విక్రమ్ ప్రభు పేరు ముందు ఉంటుంది. కుంకి తో తొలి విజయాన్ని అందుకున్న ఈయన చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఇటీవలే శిఖరం తొడు చిత్రంతో మంచి విజయాన్ని పొందిన విక్రమ్ ప్రభు ఈసారి తన చిత్రాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఎళిల్ దర్శకత్వంలో వెళ్లైక్కార దురై చిత్రంతో పాటు ఎఎల్ విజయ్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్, ఎస్టిన్ స్టీఫెన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇదు ఎన్న మాయం అనే పేరును నిర్ణయించా రు. ఏఎల్ విజయ్, అమలాపాల్‌ను వివాహం చేసుకున్న తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇదే మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై శరత్‌కుమార్ హీరోగా చండమారుతం అనే చిత్రం తెరకెక్కుతోంది. అదే విధంగా ధనుష్, కాజల్ అగర్వాల్ జంటగా మారి చిత్రాన్ని ఈ సంస్థే నిర్మిస్తోంది. -
కోలీవుడ్‌లో కీర్తి
అమ్మాయి బాగుంది. అభినయం ఓకే. ఇక ఆ నటి ఏ ప్రాంతానికి చెందిందన్న విషయం గురించి సినిమా వర్గాలు ఆలోచించవు. ముఖ్యంగా ఏ ముద్దుగుమ్మనైనా కోలీవుడ్ అక్కున చేర్చుకుంటుంది. తాజాగా మలయాళ నటి కీర్తి సురేష్‌కు కోలీవుడ్‌లో డిమాండ్ పెరుగుతోంది. మలయాళంలో ఇప్పటికే పలు చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ తమిళంలో విక్రమ్ ప్రభు సరసన నటించే అవకాశం లభించింది. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తొలి చిత్రం నిర్మాణంలో ఉండగానే కీర్తికి మరో అవకాశం తలుపు తట్టింది. శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. వరుత్త పడాద వాలిబర్ సంఘం వంటి విజయవంతమైన చిత్రం తరువాత దర్శకుడు పొన్రాయ్, శివకార్తికేయన్ కలయికలో రూపొందనున్న రెండో చిత్రం రజనీ మురుగన్. ఈ చిత్రంలో నయనతారను హీరోయిన్గా నటింప చేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి ఫలించలేదు. ఆ తరువాత నటి లక్ష్మీమీనన్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు. దర్శకుడు లింగుస్వామి చిత్ర నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కీర్తి సురేష్‌కు ప్రముఖ నటి అనుష్క బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారట. ఈ విషయాన్ని కీర్తి తల్లి సీనియర్ మలయాళ నటి మేనక తెలిపారు. కీర్తి సురేష్ పుట్టిన రోజు వేడుకను దర్శకుడు విజయ్ ఇటీవల తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారట. ఆ సమయంలో ఆయన కీర్తితో మీకో సర్ప్రైజ్ విషెస్ అంటూ ఫోన్ ఇచ్చారట. ఫోన్లో నటి అనుష్క బెస్ట్ విషెస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ సర్ప్రైజ్ చేశారట. అంత గొప్ప నటి తనతో మాట్లాడటంతో కీర్తి ఆనందానికి అవధులు లేకపోయాయట. ఈ విషయాన్ని ఆమె తల్లి మేనక వెల్లడించారు. అంతేకాదు కీర్తికి కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు ఆమె తెలిపారు. -
రజనీ సలహాఇచ్చారు
తమిళ సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్ తనకు అడ్వైజ్ చేశారంటున్నారు యువ నటుడు విక్రమ్ ప్రభు. సహ నటుడు శివాజీ గణేశన్ వంశం నుంచి వచ్చిన మూడో తరం హీరో ఈయన. నటుడు ప్రభు కొడుకయిన విక్రమ్ ప్రభు కుంకీ చిత్రం ద్వారా హీరోగా రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే నటుడిగా తన ఈ సత్తా చాటి ప్రశంసలందుకున్నారు. ఆ తరువాత ఇవన్ వేరమాదిరి, అరిమానంబి చిత్రాలతో హీరోగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్న విక్రమ్ ప్రభు ప్రస్తుతం మూడు, నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం శిఖరం తొడు విడుదలకు సిద్ధమవుతోంది. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రం. తండ్రిగా సత్యరాజ్ నటించారు. మోనాల్ గజ్జర్ నాయకి. చిత్రంలో విక్రమ్ ప్రభు పోలీస్ అధికారిగా నటించారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ ప్రభు తన భావాలను వెల్లడిస్తూ పలానా పాత్రలే చెయ్యాలనే నిర్దిష్ట అభిప్రాయం ఏమీ లేదన్నారు. తన తాత శివాజీ గణేశన్ మాదిరి అన్ని రకాల పాత్రలను పోషించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వెళ్ళైక్కార దురై చిత్రంతోపాటు దర్శకుడు విజయ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నానని చెప్పారు. వెళ్లైక్కార దురై చిత్రంలో తొలిసారిగా వినోదభరిత పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. పోరాట దృశ్యాలలో డూప్ లేకుండా రిస్క్ తీసుకుని నటిస్తున్నానని కుటుంబ సభ్యులు భయపడుతున్నారన్నారు. రజనీకాంత్ కూడా రిస్క్ తీసుకోవద్దని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అయితే తనకు డూప్‌లను పెట్టి నటింప జేయడం ఇష్టం లేదన్నారు. కుంకీ చిత్రంలో డూప్‌లేకుండా సాహసం చేసి ఏనుగుతో నటించిన సన్నివేశాలకు ప్రశంసలు లభించాయని గుర్తు చేసుకున్నారు. అలాగే యువన్ వేరమాదిరి. అరిమానంబి చిత్రాల్లో ఫైట్ సన్నివేశాలలో అభినందనలు లభించాయన్నారు. తాత శివాజీగణేశన్, నాన్న ప్రభుల పేరు కాపాడే విధంగా చిత్రాల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు విక్రమ్ ప్రభు తెలిపారు. -
మోనాల్ ప్రేమ తంటాలు
ప్రేమ సన్నివేశంలో నటించేందుకు నటి మోనాల్ గజ్జర్ 17 టేక్‌లు తీసుకున్నట్లు దర్శకుడు గౌరవ్ తెలిపారు. విక్రమ్ ప్రభు, మోనాల్ గజ్జర్, సత్యరాజ్, కోవై సరళతో సహా పలువురు నటిస్తున్న చిత్రం ‘శిఖరం తొడు’. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న గౌరవ్ మాట్లాడుతూ మనం ప్రతిసారీ ఏటీఎంలో నగదు డ్రా చేసే సమయంలో, మనకు తెలియకుండానే అనేక పొరపాట్లు జరుగుతాయన్నారు. మనకు తెలియకుండానే ఏమేరకు నగదు సంఘ విద్రోహుల వశమౌతోంది, దీన్ని నిరోధించేందుకు మార్గాలు ఏమిటనే విషయం ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో సత్యరాజ్ విక్రమ్ ప్రభు తండ్రిగా నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు పోలీసు పాత్రలో నటిస్తున్నందున దానికి తగిన విధంగా కష్టపడ్డారని తెలిపారు. విక్రమ్ ప్రభు, మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ సన్నివేశాలు ఎంతో హుందాగా వుంటాయని, ఒక ప్రేమ సన్నివేశంలో మోనాల్ గజ్జర్ సరిగా నటించలేక 17 టేకులు తీసుకుందన్నారు. సత్యరాజ్ బహుముఖ ప్రజ్ఞకు ఈ చిత్రం దీటుగా నిలుస్తుందని, తాను కూడా ఒక ముఖ్య పాత్రలో నటించానని అన్నారు, వచ్చేవారం ఈ చిత్రం తెరమీదికి వస్తుందన్నారు. -
ఆకాశమే హద్దురా మూవీ స్టిల్స్, పోస్టర్స్
-
విక్రమ్ ప్రభుతో అలియా భట్?
యువ సక్సెస్ఫుల్ నటుడు విక్రమ్ ప్రభుతో బాలీవుడ్ సంచలన బ్యూటీ అలియా భట్ రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ల నుంచి యువ హీరోయిన్ల వరకు కోలీవుడ్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండడం విశేషం. ఐశ్వర్యారాయ్ నుంచి దీపిక పదుకునేల వరకు కోలీవుడ్‌లో విజయానందాన్ని అనుభవించిన వాళ్లే. తాజాగా తొలి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుంచి హైవే, 2 స్టేట్స్ వరకు వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న బాలీవుడ్ భామ అలియాభట్ కోలీవుడ్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం యువ క్రేజీ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్న విక్రమ్ ప్రభుతో ఒక భారీ యాక్షన్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు జీఎన్ఆర్ కుమరవేలన్ సిద్ధం అయ్యారు. ఈయన ఇంతకు ముందు విమర్శకులు సైతం ప్రశంసలందించిన హరిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తాజా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, హరిదాస్ చిత్రం తరువాత మలి చిత్రం కోసం ఏడాది వేచి ఉన్నానన్నారు. అందుకు కారణం తన కథకు తగిన కథా నాయకుడి కోసమేనని చెప్పారు. తన కథలోని హీరో పాత్రకు విక్రమ్ ప్రభు టైలర్‌మేడ్ అనిపించడంతో ఆయన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఆమెను సంప్రదించగా, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఇంకా అలియాభట్‌ను సెలక్ట్ చెయ్యలేదని కేవలం సంప్రదించామని మాత్రమే చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. చిత్ర కథ విషయంలో మాత్రం దర్శకుడు నోరు విప్పడంలేదు. అయితే ఇదొక సైనికుడి ఇతివృత్తంతో సాగే చిత్ర మని తెలిసింది. ఇందులో విక్రమ్ ప్రభు దేశ సరిహద్దులోని వీర సైనికుడిగా నటించనున్నట్లు సమాచారం. -
అరిమానంబి అలా మొదలైంది
యువ నటుడు విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం అరిమానం బి. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.ధాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ శిష్యుడు. అరిమా నంబి చిత్రం గురించి దర్శకుడితో కాసిన్ని ముచ్చట్లు. ప్ర: అరిమానంబి అవకాశం ఎలా వచ్చింది? జ: తుపాకి చిత్రం షూటింగ్ సమయంలో కలైపులి ఎస్.ధానుకు ఈ స్క్రిప్ట్ గురించి చెప్పాను. వెంటనే ఆయన బాగుందే అంటూ అభినందించారు. హీరోగా నటుడు విక్రమ్ ప్రభు నటించడానికి ఓకే అనడంతో అరిమా నంబికి శ్రీకారం చుట్టాం. ఎస్.ధాను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన భారీ చిత్రాలకు ఎలా ఖర్చు చేస్తారో అంతగా ఈ చిత్రానికి వ్యయం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. ప్ర: చిత్ర కథేంటి? జ: జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఏ రోజు సమస్య లేదో ఆ రోజు నిజంగా ఆ వ్యక్తికి ప్రశాంతతనిచ్చే రోజు. ఇక చిత్ర హీరో సమస్య ఏమిటి? అలాగే ఆయన దేని కోసం అన్వేషిస్తున్నారన్నదే అరిమా నంబి. ప్ర: యాక్షన్ హీరో పాత్రకు విక్రమ్ ప్రభు ఓకేనా? జ: ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలుంటాయి. చిత్రం చూస్తే తెలుస్తుంది. విక్రమ్ ప్రభు ఆ పాత్రకు ఎంతగా న్యాయం చేశారో చిత్రంలో యాక్షన్‌తోపాటు ప్రేమకు ప్రాధాన్యత ఉంటుంది. విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్‌ల ప్రేమ సన్నివేశాలు అంత లవబుల్‌గా ఉంటాయి. ప్ర: హీరోయిన్ ప్రియా ఆనంద్ పాత్ర గురించి? జ: నిజం చెప్పాలంటే ఈ చిత్ర కథే ఆమె చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుత చెన్నై మోడ్రన్ గర్ల్ ఎలా ఉంటుందో అలాంటి పాత్ర ప్రియా ఆనంద్ ది. ప్ర: ఇదయం అనే పాటలో లొకేషన్స్‌ను గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారా? జ : ఈ విషయం గురించి చాలా మంది అడుగుతున్నారు. నిజానికిది గ్రాఫిక్స్ కాదు. ఆ పాటను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించాం. థాయ్‌లాండ్ అడవుల్లోని సుందర ప్రాంతం అది. బ్యాంకాక్ నుంచి నాలుగు గంటలు ప్రయాణం చేస్తే కాంచనాపురి అనే ప్రాంతం వస్తుంది. అక్కడ నుంచి అడవిలోకి వెళ్లాలి. ఇలా చెప్పడం సులభం అయినా అక్కడికి వెళ్లడం కష్టసాధ్యం. అయితే లొకేషన్ చూసిన తరువాత యూనిట్ వర్గం ఆశ్చర్యపోయింది. అంత అద్భుత ప్రాంతం అది. పలు భారతీయ చిత్రాల షూటింగ్‌లు విదేశాల్లో జరిగినా ఆ ప్రాంతం మాత్రం ఎవరికంటా పడలేదు. ప్ర: ఈ చిత్రం ద్వారా డ్రమ్స్ మణిని సంగీత దర్శకుడిగా పరిచయం చేయడానికి కారణం ? జ : డ్రమ్స్ మణిని తాము సంగీత దర్శకుడిగా పరిచయం చేయడం లేదు. ఎందుకంటే ఆయనకు ఎంతో సంగీతానుభవం ఉంది. ఈ చిత్రంలో పాటలన్నీ జనరంజకంగా వచ్చాయి. కొత్త స్వరాలను ప్రవేశపెట్టారు. నేపథ్య సంగీతాన్ని అద్భుతంగా రూపొందించారు.