జీవాతో కీర్తి సురేష్ | Keerthi Suresh Act With Jeeva | Sakshi
Sakshi News home page

జీవాతో కీర్తి సురేష్

Published Sun, Mar 29 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

జీవాతో కీర్తి సురేష్

జీవాతో కీర్తి సురేష్

నవ నటి కీర్తి సురేష్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నటి మేనక వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ మలయాళ కుట్టి కేరళలో కొన్ని చిత్రాలు చేసి మంచి పేరే తెచ్చుకున్నారు. దీంతో కోలీవుడ్ దృష్టి ఈ బ్యూటిపై పడింది. అంతే వరుసగా నాలుగు చిత్రాల అవకాశాలు కీర్తి సురేష్ ఖాతాలో చేరిపోయాయి. తొలుత ఈ అమ్మడిని కోలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత దర్శకుడు విజయ్‌కే చెందుతుంది. సైవం చిత్రం తరువాత ఆయన విక్రమ్‌ప్రభు హీరోగా రూపొందిస్తున్న చిత్రం ఇదు ఎన్న మాయం.
 
  ఈ చిత్రం ద్వారా కీర్తిసురేష్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేశారు. అయితే ఇదు ఎన్న మాయం చిత్రం విడుదల కాకముందే శివకార్తికేయన్ సరసన రజనీ మురుగన్, బాలసింహాకు జంటగా పాంబు సండై చిత్రాల్లో హీరోయిన్‌గా అవకాశాలు కొట్టేశారు. వీటిలో ఏది ఇంకా తెరపైకి రాలేదు. అయినా నటుడు జీవాతో డ్యూయెట్స్ పాడడానికి కీర్తి సురేష్ సై అన్నారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు యామిరుక్క భయమే చిత్రం విజయం సాధించిన దర్శకుడు డీకే, ఆర్‌ఎస్ ఇన్ఫోటెంట్ సంస్థ నిర్మించనున్న తాజా చిత్రం ఇది. చిత్ర షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement