
ఫాంటసీ హారర్ చిత్రం ‘అగత్యా’(Aghathiyaa) నుంచి అదిరిపోయే ట్రైలర్ విడుదలైంది. జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన పాన్ ఇండియా మూవీని ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించారు. డా.ఇషారి కె.గణేశ్, అనీశ్ అర్జున్‌దేవ్ నిర్మాతలు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల కానుంది.
‘అగత్యా’ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చాలా ఆసక్తిగా కట్ చేశారు. సుమారు 120 సంవత్సరాల కిందట బతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారంటూ మొదలైన ట్రైలర్ చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. వందల ఏళ్ల కిందటి కథతో ప్రస్తుత జనరేషన్‌లోని ఓ యువ జంటకు మధ్య సంబంధం ఏమిటనేది దర్శకుడు చూపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాపై మంచి అంచనాలు పెట్టుకునేలా ట్రైలర్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment