
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’(Telusu Kada). స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీ రోల్ చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
కాగా శుక్రవారం (ఫిబ్రవరి 7) సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ‘తెలుసు కదా’ నుంచి న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఓ ఫొటోలో శ్రీనిధీ శెట్టితో, మరో ఫొటోలో రాశీ ఖన్నాతో కలిసి ఉన్నారు సిద్ధు. ఇద్దరు అమ్మాయిలతో హీరో అందమైన ప్రేమకథను ప్రజెంట్ చేస్తున్నాయి పోస్టర్స్.
వినోదాల జాక్... సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘జాక్–కొంచెం క్రాక్’. ఇందులో వైష్ణవీ చైతన్య హీరోయిన్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment