
రవిశంకర్, రాజేంద్రప్రసాద్, నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల
‘‘నేను, వెంకీ కుడుముల కలిసి సోమవారం రాత్రి ‘రాబిన్‌హుడ్’(Robinhood) సినిమా చూశాం. ఈ మూవీ మా కెరీర్‌లో పెద్ద సినిమా కాబోతుందని చాలా నమ్మకం ఉంది. ఈ నెల 30న నా బర్త్‌డే. ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 28న వస్తుంది. డైరెక్టర్ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు’’ అని హీరో నితిన్ చెప్పారు. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నితిన్ మాట్లాడుతూ–‘‘నేను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్‌గారు, ‘వెన్నెల’ కిషోర్... మా మధ్య వచ్చే సన్నివేశాలు పోట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీగా వచ్చేది కాదు’’ అన్నారు. శ్రీలీల మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను చేసిన మీరా పాత్ర చాలా ప్రత్యేకం. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు.
వెంకీ కుడుముల మాట్లాడుతూ–‘‘సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాను. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఈ సినిమాలో అతిథిగా చేసిన డేవిడ్ వార్నర్ గారికి ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘అద్భుతమైన కథకి వినోదం మిక్స్ చేసిన సినిమా ఇది. ఆడియన్స్ ని అలరిస్తుంది’’అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో వినోదం, మంచి యాక్షన్‌తో పాటు అన్ని వాణిజ్య అంశాలుఉన్నాయి. మూవీ మంచి సక్సెస్ అవుతుందని మేమంతా నమ్మకంతో ఉన్నాం’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment