
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కోర్ట్. విభిన్నమైన పాత్రలతో అభిమానులను మెప్పించే మరో కొత్త కథలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించనున్నారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రియదర్శి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి.. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ప్రియదర్శి మాట్లాడుతూ..' రామ్ చరణ్ నటించిన బెస్ట్ ఫిల్స్మ్‌లో ఆరెంజ్ అంటే ఇష్టం. ఆ సినిమా నాకు ఇన్‌స్పైరేషన్. అప్పుట్లో ఆ సినిమా అంత కలెక్షన్స్ వచ్చి ఉండవు. కానీ మొన్న రిలీజైనప్పుడు సూపర్‌గా ఆడింది. ఆ సినిమా ఎప్పుడొచ్చినా నేను, మా చెల్లి చూసేవాళ్లం. మీరు ఆరెంజ్ సినిమాలో సూపర్‌గా చేశారన్న అని చెప్పేవాన్ని. ఆ సినిమా నాకు ఇప్పుడిచ్చిన చేస్తా. నాకు ఇష్టమైన డైరెక్టర్ ఆయన. అప్పుడు ఎందుకు ఆడలేదో ఇప్పటికీ నాకు అర్థం కాదు. రెండోసార్లు థియేటర్లలో చూశా. ఓటీటీలో వచ్చినప్పుడు కూడా చూశా. ముఖ్యంగా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అంటే చాలా ఇష్టం' అని అన్నారు.
కాగా.. కోర్ట్ సినిమాను పోక్సో కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్‌గా అభిమానులను అలరించనున్నారు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అనే కోణంలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment