orange
-
ప్రేమలో పడ్డ 'ఆరెంజ్' హీరోయిన్.. ప్రియుడు ఎవరంటే? (ఫొటోలు)
-
నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్
రామ్ చరణ్ 'ఆరెంజ్' సినిమాలో హీరోయిన్గా చేసిన షాజన్ పదమ్సీ నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న ఆశిష్ కనాకియ అనే బిజినెస్‌మ్యాన్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త లైఫ్ మొదలుపెట్టేందుకు ఆగలేకపోతున్నా అని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)ముంబైకి చెందిన షాజన్.. 2009లో 'రాకెట్ సింగ్' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాతి ఏడాది తెలుగులో రామ్ చరణ హీరోగా నటించిన 'ఆరెంజ్' మూవీలో రూబా అనే పాత్రలో కనిపించించింది. ఫ్లాష్ బ్యాక్‌లో ఈమె కనిపిస్తుంది. దీని తర్వాత వెంకటేశ్-రామ్ 'మసాలా' సినిమాలోనూ నటించింది. ఈ రెండు ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో ఛాన్స్ ఈమెకు రాలేదు.కెరీర్ మొత్తంలో 6-7 సినిమాలు మాత్రమే చేసిన షాజన్... ప్రస్తుతం జీఓఏటీస్ అనే టీవీ షో చేస్తోంది. ఇప్పుడు 'మూవీ మ్యాక్స్' థియేటర్లకు సీఈఓ అయిన ఆశిష్ కనాకియాతో పెళ్లికి సిద్ధమైంది. వీళ్లిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్లిద్దరి పెళ్లి ఉండే అవకాశముంది.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ) -
ఆరెంజ్ గింజలతో లాభాల గురించి తెలిస్తే, అస్సలు వదలరు!
ఆరోగ్యం కోసం నారింజ పండ్లను తింటాం. తొందరగా శక్తి రావాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగుతాం. ఎందుకంటే ఇందులో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఏ విటమిన్, మినరల్, ఫైబర్ కూడా లభిస్తాయి. అలాగే నారింజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని సున్నిపిండిలో వాడతాం. హెర్బల్ టీలో కూడా వాడతామని మనకు తెలుసు. కానీ నారింజ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు న్నాయని మీకు తెలుసా? తెలుసుకుందాం రండి!ఆరెంజ్ పండ్ల మాదిరిగానే, దాని గింజలు కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి మన శరీరాన్ని హైడ్రేటెడ్, తాజాగా ఉంచుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని ఇవి మేలు చేస్తాయి. ఆరెంజ్ గింజల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. రోజుకు మనకు కావాల్సిన దాంట్లో 116.2శాతం వీటిల్లో లభిస్తాయట. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్,అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యల నివారణలో ఉపయోగపడతాయి.ఎనర్జీ బూస్టర్ నారింజ గింజలలో పాల్మిటిక్, ఒలీక్, లినోలిక్ ఆమ్లాలు ఉండటం వల్ల మానవ కణాలలో ఎక్కువ కాలం శక్తిని నిల్వ ఉంచుతుంది. శరీరంలో శక్తి స్థాయిని వేగవంతం చేస్తాయి.గుండె ఆరోగ్యానికి మంచిది: ఆరెంజ్ గింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.జుట్టు: ఆరెంజ్ గింజల నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ నూనెను జుట్టుకు కండీషనర్గాపనిచేస్తుంది. నారింజ గింజలలో విటమిన్ సి, బయో-ఫ్లేవనాయిడ్స్‌కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. నారింజ గింజలలో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)చర్మానికి మెరుపు: వీటిల్లో పుష్కలంగా లభించే విటమిన్ సీ చర్మానికి మేలు చేస్తుంది. సహజమైన మెరుపునిస్తుంది. అంతేకాదు ముడతలు, మచ్చలు తగ్గుతాయి. కంటి ఆరోగ్యం: వీటిల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ కళ్లలోని శ్లేష్మ పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వయస్సు-సంబంధిత కండరాల క్షీణతను నివారిస్తుంది. బీపీ నియంత్రణ: ఆరెంజ్ గింజల్లో విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును అదుపు చేయడంలో కీలక ప్రాత పోషిస్తుంది. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)కేన్సర్: ఆరెంజ్ గింజలు ప్రతిరోజు తినడం వల్ల చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయ పడతాయి. ఇంట్లో చెడువాసన పోవాలంటేనారింజ గింజల నీటిని, కేక్ ఐసింగ్కు వాడతారు. అంతేకాదు సిట్రస్ సువాసన కోసం బాత్‌టబ్‌కు దీని ఆయిల్ వాడవచ్చు. ఇంట్లో అసహ్యకరమైన వాసనను పోగొట్టేందుకు డిఫ్యూజర్ నూనెగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.ఆరెంజ్ విత్తనాలను ఎలావాడాలి?చిరు చేదుగా ఉండే ఆరింజ గింజల నూనె, పొడి రూపంలో వాడుకోవచ్చు. ఇవి మార్కెట్లో లభిస్తాయి. -
అబ్బా.. తొక్కేం కాదు! నారింజ పుట్టగొడుగు!!
నేల మీద ఎవరో నారింజ తొక్కలను పడేసినట్లుగా ఉంది కదూ! నారింజ తొక్కలేమీ కాదు, ఇవి పుట్టగొడుగులు. నారింజ తొక్కల్లా కనిపించడం వల్ల ఈ పుట్టగొడుగులు ‘ఆరెంజ్ పీల్ ఫంగస్’గా పేరు పొందాయి. ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం ‘అల్యూరియా ఆరాంటియా’.చక్కని నారింజ రంగులో, అప్పుడే వలిచిన తజా నారింజ తొక్కల్లా కనిపించే ఈ అరుదైన పుట్టగొడుగులు ఉత్తర అమెరికాలోను, యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల్లోను, చిలీ దక్షిణ ప్రాంతంలోను ఆగస్టు నుంచి నవంబర్ నెలల మధ్య కాలంలో కనిపిస్తాయి. ఈ పుట్టగొడుగులు కొద్దిపాటి తేమ ఉన్న మట్టి నేలల్లో పెరుగుతాయి. ఈ పుట్టగొడుగులు తినడానికి పనికి వస్తాయి.ఇవి చదవండి: దస్తూరి అయాచిత వరం! -
గుజరాత్లో వర్ష బీభత్సం
భారీ వర్షాలు గుజారాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని గిర్ సోమనాథ్, అమ్రేలి, ఖేడా, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, మహిసాగర్, భరూచ్, నర్మద, సూరత్, ఛోటా ఉదేపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 28న సౌరాష్ట్రలోని కచ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, దేవభూమి ద్వారక, జునాగఢ్ పోర్బందర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. Gujarat Rain: Sardar Sarovar Dam Water Level Rises, all the Gates Opened; Coastal Villages on High Alert…Whereas Vadodara city & district is on high alert because Ajwa Lake and Vishwamitri River crossed danger mark, causing widespread flooding in the city. pic.twitter.com/6zHM5T5428— ~ Mr_Perfect ~ (@HadkulaTiger1) August 26, 2024 -
14 ఏళ్ల క్రితం సంఘటనలు.. మళ్లీ అక్కడ గుర్తుచేసుకున్న రామ్ చరణ్
అస్ట్రేలియాలో రామ్ చరణ్ దంపతులు సందడి చేస్తున్నారు. మెల్బోర్న్ వేదికగా 'ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్' 15వ ఎడిషన్‌కు గౌరవ అతిథిగా రామ్‌చరణ్ హజరయ్యారు. మెల్బోర్న్లోని ఫెడరేషన్ స్క్వేర్ కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో ఉపాసనతో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రామ్ చరణ్ చేసిన సేవలకుగాను ‘ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్’ గా ఆ వేదికపై అవార్డును అందుకున్నారు.ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ‘ఆర్ట్ అండ్ కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్’గా ఎంపికైనవారు ఈ అంతర్జాతీయ వేదకపై గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఈ క్రమంలో ఆ అదృష్టం రామ్‌చరణ్‌ని వరించింది. దీంతో ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. అవార్డ్ అందుకున్న అనంతరం రామ్‌చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.సుమారు 14 ఏళ్ల క్రితం విడుదలైన తన ఆరెంజ్ సినిమా విషయాలను అక్కడి అభిమానులతో చరణ్ మరోసారి పంచుకున్నారు. మెల్బోర్న్లో 30రోజుల పాటు తన ఆరెంజ్ షూటింగ్ జరిగిందని ఆయన తెలిపారు. అది తన మూడో సినిమా అని కూడా చరణ్ గుర్తుచూసుకున్నారు. అయితే, సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇండియాకు తిరిగి వెళ్లాల్సిన సమయంలో చాలా బాధ అనిపించిందని అన్నారు. ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమను తాను ఇప్పటికీ మర్చిపోలేకున్నానని చరణ్ చెప్పారు. మెల్బోర్న్లో ఇంతమంది భారతీయులను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారతీయ చిత్రపరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేదే ఎన్ఆర్ఐల వల్లే అని ఆయన అన్నారు. అలా 14 ఏళ్ల క్రితం మెల్బోర్న్లో జరిగిన పలు ఆసక్తికరమైన విషయాలను చరణ్ పంచుకున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
వాతావరణశాఖ అలర్ట్: ఐదు రాష్ట్రాలకు రెడ్.. 16 రాష్ట్రాలకు ఆరెంజ్
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అసోంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అసోం పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్, 16 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో వాతావరణం సామాన్యంగా ఉండనుంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు ఉత్తర భారత్‌లోని రాష్ట్రాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సోమవారం, మంగళవారాల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. -
కేరళలో భారీ వర్షాలు.. విద్యాసంస్థల మూసివేత
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ పలు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా మరికొన్ని రోజులు కొనసాగనున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి సముద్ర మట్టంలో ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్య గుజరాత్ పరిసర ప్రాంతాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. కేరళ తీరంలో గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో కేరళలోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పతనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ, ఇడుక్కి, ఎర్నాకుళం, వయనాడ్‌లలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
ప్రపంచంలో నారింజ పండ్ల దిగుబడి తగ్గుతుంది. ఆరెంజ్ జ్యూస్‌లో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న బ్రెజిల్లో ఈ ఏడాది భారీగా పంటనష్టం జరిగింది. గత 36 ఏళ్లలో ఎప్పుడూలేని విధంగా ఈసారి ఏర్పడిన వేడిగాలులతో తీవ్రంగా పంటనష్టం వాటిల్లినట్లు పరిశోదనా బృందం ఫండెసిట్రస్ తెలిపింది.ఏటా ఏప్రిల్ ప్రారంభం నుంచి ఆరెంజ్ పండ్ల సీజన్ మొదలవుతుంది. బ్రెజిల్లో ఈ సీజన్లో ఇప్పటివరకు 232.4 మిలియన్ బాక్సుల ఆరెంజ్ పండ్ల ఉత్పత్తి జరిగినట్లు ఫండెసిట్రస్ నివేదిక తెలిపింది. ఇందులో ఒక్కో బాక్స్ బరువు 90 పౌండ్లు(40.8 కిలోలు) ఉంటుంది. ఈసారి నమోదైన ఉత్పత్తి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 24 శాతం క్షీణించింది.ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లు రిజస్టరైన ఐసీఈ ఫ్యూచర్స్ యూఎస్‌లో ఈ ఏడాది 26 శాతం లాభపడింది. గడిచిన మూడు నెలల వ్యవధిలో ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లు అత్యధికంగా 5 శాతం పెరిగాయి. హీట్‌వేవ్ కారణంగా ఉత్పత్తి తగ్గడంతో భవిష్యత్తులో ఆశించిన ఫలితాలు రావని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది సెప్టెంబరు-నవంబర్ మధ్య ఆరెంజ్ పంట సాగుకు సిద్ధమైతే ఈ సమయం వరకు సమృద్ధిగా పంట చేతికి వచ్చేది. కానీ వేడిగాలుల వల్ల పంటకాలం ఆలస్యమైంది. దాంతో సరైన దిగుబడి రాదని నివేదిక చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నారింజ రసం సరఫరాలో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. దేశం మొత్తం పానీయాల ఎగుమతుల్లో 70 శాతం వాటా ఆరెంజ్ జ్యూస్దే అవ్వడం గమనార్హం. -
‘హలో ఫ్రెండ్స్.. హెలికాప్టర్లో ఆరంజ్ పార్టీ’ ఇప్పుడేమంటారో..
పాట్నా: హెలికాప్టర్లో ‘ఫిష్ పార్టీ’ వీడియో వివాదం తర్వాత మరో వీడియోను షేర్ చేశారు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్. హెలికాప్టర్లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సాహ్నితో కలిసి ఫిష్ పార్టీ వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా తేజస్వి యాదవ్ గురువారం మరో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వీరిద్దరూ బత్తాయి పండ్లను ఆస్వాదించడాన్ని చూడవచ్చు. "హలో ఫ్రెండ్స్, ఈ రోజు హెలికాప్టర్లో ఆరెంజ్ పార్టీ జరుగుతోంది. వారు (బీజేపీ నేతలు) ఆరెంజ్ రంగుపై వివాదం చేయరు కదా?" అంటూ బీజేపీకి చురకలు అంటిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాసుకొచ్చారు. ఇంతకు ముందు షేర్ చేసిన వీడియోలో తేజస్వి యాదవ్ చేపలు తింటూ కనిపించడంపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. నవరాత్రుల వేళ మాంసాహార భోజనమా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. హెలికాప్టర్ లోపల చిత్రీకరించిన ఈ వీడియోలో వీఐపీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి తేజస్వి యాదవ్ భోజనం చేస్తూ కనిపించారు. బీజేపీ విమర్శలపై తేజస్వి యాదవ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో నవరాత్రి ఉత్సవాలకు ముందు రికార్డ్ చేసిందని, తనను విమర్శించేవారికి "తక్కువ ఐక్యూ" ఉందని ఆరోపించారు. हैलो फ्रैंड्स, आज हेलीकॉप्टर में नारंगी पार्टी हुई। Orange के रंग से तो वो नहीं ना चिढ़ेंगे? #TejashwiYadav #Trending #Viral pic.twitter.com/FlhuyMhM6f — Tejashwi Yadav (@yadavtejashwi) April 10, 2024 -
'ఆరెంజ్ మార్మాలాడే' రెసిపీ చేసిన సోనియా, రాహుల్!
ఈ రోజుతో 2023 ముగిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి ఆదివారాన్ని ఆరెంజ్ మార్మలాడే(ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జామ్) అనే రెసీపీ ప్రీపరేషన్తో గడిపారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్. ఈ వంటకం రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు ఇష్టమైనదట. అందుకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లోగోతో కూడిన తన యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. సోనియా, రాహుల్ ఇద్దరు కలిసి కిచెన్ గార్డెన్‌లోకి వెళ్లి పండ్లను తెచ్చి ఒక బుట్టలో వేసుకుని వస్తారు. ఈ రెసిపీ కోసం పూర్తిగా పండినవే కోయాలని సోనియా చెప్పగా, రాహుల్ నవ్వుతూ.. అవే ఎందుకు కోయాలంటూ చిలిపిగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఇద్దరు వంటగదిలోకి వచ్చి వాటిని శుభ్రం చేసి నారింజ జ్యూస్ తీశారు. ఆ జ్యూస్‌ని, చక్కెరని అల్యూమినియం పోసి స్టవ్‌పై ఉంచి ఉడికించారు. రాహుల్ ఆ మిశ్రమాన్ని కలుపుతూ అమ్మా బీజేపీ వాళ్లు ఈ జామ్ కావాలంటే..వాళ్లకు కూడా ఇద్దామా! అని సరదాగా అన్నారు రాహుల్. అందుకు ప్రతిగా సోనియా మనపైకే తిరిగి విసిరేస్తారు అని నవ్వుతూ సెటైర్ వేశారు. మంచిది అప్పుడు ఆ జామ్ మొత్తం మనకే సొంతం అని రాహుల్ అనడంతో ఇరువురి ముఖాల్లో పెద్దగా నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీ దశాబ్దాల క్రితం భారతీయ వంటకాలకు తాను అలవాటు పడటానికి ఎల ఆ కష్టపడ్డానో వివరించారు. ముఖ్యంగా భారతీయ రుచుల్లో మిరపకాయలకు అడ్జెట్ అవ్వడానికి చాలా టైం పట్టిందని సోనియా చెప్పుకొచ్చారు. ఇక ఈలోగా మార్మాలాడే రెసీపీ తయారవ్వడంతో ఆ మిశ్రమాన్ని గాజు సీసాల్లో తల్లి కొడుకులు ఇరువురు సర్ధి వాటి మూతలతో క్లోజ్ చేసి పైన ఒక లవ్ సింబల్ ఆకారంలోని కార్డుని ఉంచారు. ఆ కార్డుపై ప్రేమతో మీ సోనియా, రాహుల్ అని రాశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: రోబొటిక్ పెట్ని ఆవిష్కరించిన 12 ఏళ్ల చిన్నారి! పెంపు జంతువులకు ప్రత్యామ్నాయంగా..) -
ఖాళీ కడుపుతో నారింజ తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బొంగురుపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. అయితే చలికాలంలో రోజూ పండ్లు తింటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదీ పుల్లటి నారింజ పండు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. అదెలాగో చూద్దామా.. అసలే చలికాలం కదా... నారింజ తింటే జలుబు వస్తుందనే భయంతో ఎక్కువ మంది తినడం లేదు. అయితే చలికాలంలో నారింజ పండ్లు తినడం చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. జలుబు–దగ్గు మొదలైన వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులలో కఫం ఉంటే నారింజ మీకు ఔషధం.శీతాకాలంలో నారింజ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శరీరం లోపల నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ రెండు నారింజలను తింటే, మీ రోజువారీ మోతాదుకు తగ్గ విటమిన్ సి లభిస్తుంది. ఫలితంగా శరీరం లోపల బలం పెరుగుతుంది. ఇది కాకుండా, నారింజలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ శరీరంలో మంట లేదా ఇన్ఫెక్షన్ వంటి వాటికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. నారింజ పండ్లను తినడం వల్ల ముఖం, ముఖంపై ఉండే మొటిమలు మాయమవుతాయి. ఇది శరీరాన్ని ఎక్కువసేపు తేమగా ఉంచుతుంది. ముఖంపై పగుళ్లు, పొడిబారడం వంటి సమస్యలను ఇది సరిచేస్తుంది. నారింజ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఇది మీ శరీరంలో ఎసిడిటీకి దారితీస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మధ్యాహ్నం పూట ఈ పండును తినడం మంచిది. అయితే మంచిది కదా అని రోజుకు రెండు పండ్ల కంటే ఎక్కువ తినకూడదు. అలా తినడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. -
పరోక్షంగా పార్టీ ప్రచారం కూడా జరుగుతుంటుంది!
పరోక్షంగా పార్టీ ప్రచారం కూడా జరుగుతుంటుంది! -
నారింజ తొక్కలను తీసిపారేయకుండా ఇలా చేయండి
సిట్రస్ ఫ్రూట్స్‌లో నారింజ పండు చాలా ప్రత్యేకం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.. ఇలా నారింజ పండుతో బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయన్నది తెలిసిందే. అయితే నారింజ పండ్లను తినేసి తొక్కే కదా తీసిపారేస్తాం.కానీ ఇప్పట్నుంచి అలా చేయకండి. నారింజ తొక్కలతో మంచి సువాసన భరితమైన కొవ్వత్తులను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. తయారీకి కావాల్సిన పదార్థాలు నారింజ తొక్కలు కత్తి లేదా టేబుల్ స్పూన్ నూనె(వెజిటెబుల్, ఆలివ్, ఏదైనా) నారింజ పండును ముందుగా రెండు భాగాలుగా కట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సహాయంతో గుజ్జును వేరు చేయండి. కొవ్వొత్తిని తయారుచేయడానికి లోపలున్న విక్‌ను అలాగే ఉంచండి. ఇప్పుడు ఆ నారింజ పండులో వెజిటెబుల్ ఆయిల్ లేదా కరిగించిన మైనాన్ని జాగ్రత్తగా పోసి ఆరనివ్వండి. ఆ తర్వాత విక్‌ను వెలిగించండి..అంతే మీ ఆరెంజ్ క్యాండిల్ రెడీ అయినట్లే. నారింజలోని సిట్రస్ వల్ల క్యాండిల్ వెలిగించినప్పుడు ఇంట్లో మంచి సువాసనను వెదజల్లుతుంది. -
Summer Care: టొమాటో జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే!
వేసవి వచ్చేసింది. చలికాలంలో లాగే వేసవిలో కూడా చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే, వేసవిలో చర్మం ట్యానింగ్, నిగారింపు కోల్పోవడం, పొడిగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే రోజూ ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవల్సిందే. వీటివల్ల చర్మకాంతి పెరిగి యౌవనంగా కనిపిస్తారు. ఆరెంజ్ జ్యూస్ చర్మకాంతిని పెంచే విటిమిన్ సి సమృద్ధిగా ఉండేవాటిలో నారింజ లేదా కమలా పండ్లు ముందుంటాయి. నారింజ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది కాబట్టి క్రమం తప్పకుండా ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. టొమాటో జ్యూస్ టొమాటోలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధకత శక్తిని కలిగిస్తాయి. రోజూ టొమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం యౌవనంగా, కాంతిమంతంగా ఉంటుంది. టొమాటోను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి అద్భుత ఔషధం బీట్రూట్ జ్యూస్. ప్రతిరోజూ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు సమృద్ధిగా ఉండేది దానిమ్మలోనే. అందువల్ల రోజూ దానిమ్మ జ్యూస్ సేవించడం ద్వారా చర్మంలో నిగారింపు వస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా దానిమ్మ జ్యూస్ తీసుకోవచ్చు. అయితే అందులో రుచికి పంచదార కలుపుకోకూడదు. గ్రీన్ టీ కేవలం బరువు తగ్గించేందుకే కాకుండా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీ. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. చదవండి: ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..? -
కొబ్బరి పాలతో స్క్రబ్.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే..
చర్మ యవ్వనంగా కనిపించాలని.. మేని మెరిసిపోవాలని కోరుకునే వారు ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి. కొబ్బరి పాలతో.. ►కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ►కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ►ఇలా యాంటీ ఏజింగ్ ప్యాక్స్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు వేసుకోవడం ద్వారా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. మేనికాంతికి ఉసిరి.. నిమ్మ... నారింజ తేమను తరచూ మన ముఖానికి రాసుకుంటూ ఉంటే, ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి. తేనెతో పెదవులకు మసాజ్ చేస్తే మృదువుగా, అందంగా కనిపిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిపించడంలో విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందువల్ల విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని అది దొరికినంతకాలం విరివిగా తీసుకోవాలి. నిమ్మకాయ, నారింజలోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉసిరి దొరకనప్పుడు వీటిని తరచూ తీసుకోవడం వల్ల కూడా అందంగా మారవచ్చు. అలాగే, వేపాకులు వేసిన నీటితో స్నానం చేయడం, తరచు ముఖాన్ని కడుక్కోవడం, ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు లేకుండా మేని చర్మం మెరుపులీనుతూ ఉంటుంది. చదవండి: Beauty: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్! ధర ఎంతంటే! -
Health: ప్రతి రోజూ ఓట్స్ తింటున్నారా? గుండెకు సంబంధించి ఈ విషయాలు తెలిస్తే
Heart Healthy Foods- Diet Tips In Telugu: అప్పటిదాకా నచ్చిన రుచులన్నీ కడుపునిండా తిన్న వారికి ఏ డయాబెటిస్సో, గుండెజబ్బో, కొలెస్టరాలో వచ్చిందంటే పాపం! వారి బాధ చెప్పనలవి కాదు. ఎందుకంటే అటు నోరుకట్టుకోనూలేరు, ఇటు ఇష్టం వచ్చినవన్నీ తినడానికీ లేదు. అలాగని పూర్తిగా చప్పిడి తిండే తినమంటే మరీ నీరసించి పోతారు. ఇంతకీ మీరు చెప్పేదేమిటీ అనుకుంటున్నారా? కాస్త ఓపిక పట్టండి మరి! నోటికి రుచికరంగా ఉంటూనే, గుండెకు బలం చేకూరేలా, ఆరోగ్యానికి ఏమాత్రం హాని కలగకుండా కాపాడుకునేలా కొన్ని రకాలైన ఆహార పదార్థాలను సూచిస్తున్నారు వైద్యులూ, పోషకాహారనిపుణులూ. అవేమిటో తెలుసుకుందామా? ఆకుపచ్చని కూరలు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలన్నీ గుండెకు బలాన్నిఇస్తాయి. ముఖ్యంగా బచ్చలి కూర గుండెకు చాలా మంచిది. బచ్చలికూరతో పప్పు వండుకోవచ్చు. సెనగపప్పు వేసి పప్పు కూర చేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. అయితే నూనె, ఉప్పు, కారం పరిమితంగానే వాడాలి. టొమాటల్లోని లైకోపిన్ వల్ల టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. టొమాటోలలో రక్తపోటును నియంత్రించే పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి పుల్లపుల్లగా, తియ తియ్యగా ఉండే టొమాటోలను విరివిగా తినచ్చు. చేపలు తింటే చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువ. అందుకే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. స్ట్రా బెర్రీలతో స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, బాదం, ఎండు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ గుప్పెడు తింటే గుండెకు చాలా మంచిది. అలాగే ద్రాక్షపండ్లు కూడా గుండెకు సత్తువనిస్తాయి. అయితే ద్రాక్షను రసం తీసి కాకుండా నేరుగా తినడం మేలు. ఎందుకంటే ద్రాక్షరసంలో చక్కెర కలుపుకోవడం అనివార్యం కదా! డార్క్ చాక్లెట్లు తింటే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు. కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన డార్క్ చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు తగ్గడంతో పాటు రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల మాత్రం గుండెకు మేలు చేకూరకపోగా ముప్పే. అలాగని డార్క్ చాక్లెట్లను కూడా మితిమీరి తినకూడదు. గుండెకు మేలు చేసే 5 ఆహార పదార్థాలు వేరుశెనగ గుండెకు వేరుశెనగ ఎంతో మంచిది. మంచి కొవ్వును కలిగి ఉన్న వేరుశెనగలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. అవి గుండె భేషుగ్గా ఉండటానికి సహకరిస్తాయి. అలాగే వేరుశెనగలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ గుండె ఆరోగ్యానికి నారింజ పండు చాలా మంచిది. పొటాషియం అధికంగా ఉండే నారింజలో ఎలక్ట్రోలైట్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు కూడా గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడతాయి. అవకాడో విటమిన్–ఈతో పాటు అనేక ఇతర పోషకాలు అవకాడోలో సమృద్ధిగా లభిస్తాయి. దీనికితోడు మోనో అన్ –శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఈ పండు గుండెకు చాలా మంచిది. అవకాడోను రోజూ తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధులు నుంచి బయటపడవచ్చు. వాల్నట్స్ రోజూ క్రమం తప్పకుండా కాసిని వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్నట్స్ హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంతోపాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఓట్స్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఓట్స్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఓట్స్‌లో ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉన్నాయి, ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ప్రతీ రోజూ ఓట్స్ తినడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు. చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? అయితే Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. -
గణేష్ ఉత్సవాన్ని ఆరెంజ్ గణపతితో జరుపుకుంటుంది..
-
ప్రకాశం బత్తాయి ఒడిశాకు..
యర్రగొండపాలెం: కరోనా ఉధృతి ప్రారంభం నుంచే బత్తాయి రైతులకు గడ్డుకాలం దాపురించింది. వైరస్ ప్రబలకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో రైతులు విలవిల్లాడారు. కోతకొచ్చి మంచి ధర పలుకుతున్న సమయంలో రవాణా సౌకర్యం ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. లాక్డౌన్ సందర్భంగా ప్రజలు బయట తిరగకపోవడంతో పండ్ల మండీలు మూతవేశారు. ఈ తరుణంలో టన్ను రూ.55 నుంచి రూ.60 వేల మేరకు ధర పలకాల్సిన బత్తాయి రూ.8 వేలకు పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తమై చెట్టు నుంచి కాయలు కోయకుండా రైతులకు అవగాహన కలిగించారు. చెట్టు నుంచి రాలిపడిన కాయలు మాత్రం స్థానికంగానే అమ్మకాలు జరిపారు. వీరికి వైఎస్సార్ క్రాంతి పథం – డీఆర్డీఏ శాఖ చేయుతనిచ్చింది. కాయలు కొనుగోలు చేసి డ్వాక్రా గ్రూపుల ద్వారా అమ్మకాలు జరిపించింది. 4 నెలలుగా ఆటు పోట్లకు గురైన బత్తాయి ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఒడిశా మార్కెట్లో మంచి డిమాండ్.. జిల్లాలో మొత్తం 21,250 ఎకరాల్లో బత్తాయి తోటలను పెంచుతున్నారు. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల మేర దిగుబడి వస్తుంది. సరాసరిన ఎకరాకు 8 టన్నుల ప్రకారం లెక్కలు వేసుకుంటే 1.70 లక్షల టన్నులు బత్తాయి కాపు కాస్తుంది. టన్ను రూ.35 వేల ప్రకారం బత్తాయి తోటలు పెంచే రైతులకు రూ.595 కోట్ల రాబడి ఉంటుంది. ప్రభుత్వం లాక్డౌన్ సడలించిన తరువాత బత్తాయికి ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరిగింది. జిల్లాలో పండిన బత్తాయి పంట ఒడిశాకు ఎక్కువగా రవాణా అవుతుంది. వారం రోజుల క్రితం టన్ను రూ.32 వేలు ధర పలకగా ఒడిశా మార్కెట్ తెరుచుకున్న తరువాత బత్తాయికి రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం బత్తాయి ధర టన్ను రూ.40 వేల వరకు ఉందని పలువురు రైతులు తెలిపారు. ఇప్పుడిప్పుడే దేశంలో పండ్ల మండీలు తెరుచుకుంటున్నాయి లాక్డౌన్ కారణంగా పండ్ల ఉత్పత్తులకు మార్కెటింగ్ లేకపోయింది. ఇప్పుడిప్పుడే దేశంలో మండీలు తెరుచుకుంటున్నాయి. దీని వలన బత్తాయికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం టన్ను బత్తాయి రూ.40 వేల వరకు పలుకుతోంది. రానున్న రోజుల్లో బత్తాయి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం టన్ను రూ.60 వేల వరకు అమ్ముడుపోయింది. ఈ సంవత్సరం రూ.70 వేల వరకు అమ్ముడుపోయే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు.– షేక్.నబీరసూల్, ఉద్యానశాఖాధికారి, వైపాలెం -
సత్తువకు బత్తాయి
హాస్పిటల్లో ఉన్న రోగులకూ, కోలుకుంటున్న వ్యక్తులకూ ఇచ్చే పళ్ల రసం సాక్షాత్తూ బత్తాయి రసమే తప్ప మరోటీ ఇంకోటీ కాదు. బత్తాయితో ఒనగూరే ఆరోగ్యప్రయోజనాల గురించి చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలదూ! బత్తాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇంకా అనేకం ఉన్నాయి. విటమిన్–సి పుష్కలంగా ఉండే బత్తాయితో రోగనిరోధక శక్తి సమకూరుతుందన్న సంగతి తెలిసిందే. రోగులకు దీనిని ఇచ్చేందుకు మరో కారణమూ ఉంది. గ్లూకోజ్‌తో తేలిగ్గా కలిసిపోయే ఇందులోని లిమోనాయిడ్స్ అనే పోషకాలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. బత్తాయిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని పెంపొందించి జీర్ణవ్యవస్థ కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి. అజీర్తి, పేగుల కదలికలు సక్రమంగా లేకపోవడం (ఇర్రెగ్యులర్ బవెల్ మూవ్మెంట్స్) వంటి సమస్యలను బత్తాయి సమర్థంగా చక్కదిద్దుతుంది. ఒంట్లోని విషపదార్థాలను బయటకు సమర్థంగా పంపడంలో బత్తాయి బాగా తోడ్పడుతుంది. అందుకే దీన్ని శక్తిమంతమైన డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పరిగణిస్తారు. బత్తాయిలోని విటమిన్–సి ఇన్ఫ్లమేషన్నూ (నొప్పి, మంట, వాపు)లను తేలిగ్గా తగ్గిస్తుంది. బత్తాయిలోని ఈ గుణం వల్లనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కోసం పళ్ల రసాన్ని ఇస్తుంటారు. బత్తాయి రసంలో కొలెస్ట్రాల్ పాళ్లను అదుపు చేసే స్వభావం ఉంది. అలాగే దీనిలో పోటాషియమ్ కూడా పుష్కలంగా ఉంది. ఈ కారణంగా బత్తాయికి రక్తపోటును నివారించే గుణమూ ఉంది. బత్తాయిలోని పొటాషియమ్ మూత్రపిండాల్లోని అనేక విషాలను బయటకు నెట్టేస్తుంది. బ్లాడర్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇందులోని విటమిన్–సి యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అందుకే ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని క్యాల్షియమ్ ఎముకలకు మేలు చేస్తుంది. అంతేకాదు... ఇదే క్యాల్షియమ్ ప్రత్యేకంగా గర్భవతుల్లో పిండం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. మెదడూ, నాడీవ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి బత్తాయి బాగా సహాయపడుతుంది. -
నెరవేరిన రైతుల కల
నకిరేకల్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బత్తాయి, నిమ్మ మార్కెట్ల ప్రారంభ కల నెరవేరనుంది. తెలంగాణ ప్రభుత్వం నల్లగొండలోని గంధంవారిగూడెంలో బత్తాయి, నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. వీటిని ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా నిమ్మకు సరైన మద్దతు ధర లేకపోవడం, దళారుల ప్రమేయంతో సంబంధిత రైతులు తీవ్ర నష్టాన్ని సవిచూస్తున్నారు. ఇకపై ఆ సమస్యల చెక్ పడనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి నిమ్మ మార్కెట్ జిల్లాలోని నకిరేకల్‌లో ఏర్పాటు చేశారు. రూ.3.07 కోట్లతో నిమ్మ మార్కెట్‌ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల ముందు ప్రజ లకు ఇచ్చిన హామీలో భాగంగా మార్కెట్‌ను మం జూరు చేయించారు. çనకిరేకల్‌లోని చీమలగడ్డ శివారులో అన్ని సౌకర్యాలతో ఆ మార్కెట్‌ను నిర్మించారు. దీనిని ఆదివారం ఉదయం 10 గం టలకు మంత్రులు ప్రారంభించనున్నారు. ఏటా రూ.750 కోట్ల వ్యాపారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా రూ.750 కోట్ల నిమ్మ వ్యాపారం సాగుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాపారం అంతా అనధికారికంగా దళారులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే నిమ్మకాయల వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన నకిరేకల్ ప్రాంత రైతులు నిమ్మ మార్కెట్ లేకపోవడంతో దళారులను ఆశ్రయిస్తూ నిండా మునుగుతున్నారు. దాంతో 2016 ఆగస్టు 3న మార్కెట్ నిర్మాణానికి రూ.3.07 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 అక్టోబర్ 24వ తేదీన నకిరేకల్ పెద్ద చెరువు వద్ద నిమ్మ మార్కెట్, మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శిలాపలకాలను ఆవిష్కరించారు. 2017 మే 15న స్థల సేకరణ సమస్య పరిష్కారమైంది. తిప్పర్తిరోడ్డులోని చీమలగడ్డ సర్వే నంబర్ 459లో 9.39 ఎకరాల స్థలాన్ని మార్కెట్ నిర్మాణం కోసం ఎంపిక చేశారు. ఈ స్థలంలోని 10 మంది భూ నిర్వాసితులకు రూ.39.90 లక్షల పరిహారం మంజూరు చేసింది. 2017 జూన్ 6న చీమలగడ్డలో ఎమ్మెల్యే వేముల వీరేశం భూమి పూజ చేశారు. రూ. కోటితో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో జర్మనీ దేశం నుంచి తెప్పించిన మెటీరియల్‌తో గ్రేడింగ్ కవర్డ్ ఫ్లాట్ఫారమ్ను నిర్మించారు. రూ.75లక్షలతో వ్యాపారుల కోసం 25 దుకాణ సముదాయం, రూ.17లక్షలతో నిమ్మ మార్కెట్ కార్యాలయ భవనం నిర్మించారు. రైతులకు మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కూడా కల్పిస్తున్నారు. యార్డులో అంతర్గత సీసీ రహదారి నిర్మాణం కూడ కొంత మేర పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో నిమ్మసాగు ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 వేల హెక్టార్లకు పైగా నిమ్మ తోటలు సాగవుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే హెక్టార్‌కు 10టన్నుల దిగుబడి వస్తుంది. నిమ్మకు మంచి ధర ఉంటే క్వింటాకు సరాసరి రూ. 2వేల ధర పలుకుతుంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో ఏటా రూ. 750 కోట్ల నిమ్మ వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం అంతా అణధికారికంగా గత మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతుంది. నూతనంగా నిర్మించబోయే ఈ నిమ్మ మార్కెట్ ప్రారంభమైతే మా ర్కెట్ ఫీజుల రూపంలో ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది. నేడు బత్తాయి మార్కెట్ ప్రారంభం సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని బత్తాయి రైతుల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో రూ.1.80 కోట్ల వ్యయంతో గత ఏడాది నిర్మాణ పనులు మొదలైన బత్తాయి మార్కెట్ పూర్తయింది. బత్తాయి మార్కెట్ నిర్మాణ పనులకు గతేడాది రాష్ట్ర సాగునీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కాగా, ఏడాది వ్యవధిలోనే మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయించి తానే మార్కెట్‌ను ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు నాడు ప్రకటించారు. ఆ విధంగానే ఆదివారం సాయంత్రం 3 గంటలకు బత్తాయి మార్కెట్‌ను ప్రారంభించనున్నారు. రైతులకు ఎంతో వెసులుబాటు జిల్లాలోని బత్తాయి రైతులు తమ పంటను విక్రయించుకోవడానికి పూర్తిగా దళారులపైనే ఆధారపడుతున్నారు. కర్నూలు తదితర జిల్లాల నుంచి వచ్చే దళారులు తోటలపైనే బత్తాయికి రేటు మాట్లాడుకుని అరకొరగా రైతులకు చెల్లించి వారు లాభాలు పొందుతున్నారు. ఒక వేళ ఎవరైనా రైతు స్వయంగా మార్కెట్లో బత్తాయి అమ్ముకోవడానికి వెళితే హైదరాబాద్ కొత్తపేట మార్కెట్లో దళారుల చేతుల్లో పడి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు స్థానికంగానే బత్తాయి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని బలంగా డిమాండ్ చేశారు. కాగా మార్కెట్ మంజూరుకావడం , ఏడాదిలోగా నిర్మాణం పనులు పూర్తయి అందుబాటులోకి వస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మార్కెట్లో ఎనిమిది మంది కమీషన్ ఏజెంట్లు, నలుగురు ట్రేడర్స్ లైపెన్స్ పొందారు. ఆదివారం నుంచి బత్తాయిలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అధికార పార్టీ ఏర్పాట్లు మరో వైపు మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి హరీశ్‌రావు మార్కెట్‌ను ప్రారంభించనుండగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నల్లగొండ ఇన్చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బత్తాయి మార్కెట్‌ను ప్రారంభించాక గంధంవారి గూడెం నుంచి బైకు ర్యాలీ ద్వారా మంత్రిని స్థానిక బీట్ మార్కెట్‌కు తీసుకువస్తారు. అనంతరం మార్కెట్లోనే బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శనివారం నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కరీంపాష , డైరెక్టర్ గార్లపాటి శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి మధు బత్తాయి మార్కెట్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
రంగు పడింది
తెల్లగా వెండిలా మెరిసిపోవాల్సిన మంచుకొండలు నారింజ రంగు పులుముకున్నాయి. రష్యా, ఉక్రెయిన్, బల్గేరియా,రుమేనియాలతోపాటు తూర్పు యూరప్ అంతటా ఇదే తీరు! భూమ్మీద కాకుండా అరుణగ్రహంపై ఉన్నామా? అనేంత నారింజ రంగు! ఎందుకిలా? పోటెత్తిన పర్యాటకులకు వచ్చినా.. సమాధానం మాత్రం నాసా తీసిన ఫోటోల ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి ఎగసిన ఇసుక గాలులే ఈ మార్పునకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అక్కడి దుమ్ము, ధూళి, ఇసుక రేణువులు మంచుకొండల్ని చుట్టేయడంతో అవి నారింజ రంగులోకి మారిపోయాయని చెబుతున్నారు. యూరప్‌లో ఇలా జరగడం ఇదే మొదటి సారి. దీంతో పర్వతారోహకులు, మంచులో స్కేటింగ్ చేసే వాళ్లు ఈ అరుదైన కొండల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇది సర్వసాధారణమైన విషయమని ప్రతీ అయిదేళ్లకు ఒకసారి ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఒక ప్రాంతంలో ఎగిసిపడే దుమ్ము, ధూళి ఇంకో ప్రాంతంలో వాతావరణంపై ప్రభావం చూపించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2007లో దక్షిణ సైబీరియాలోనూ ఇలాగే మంచు ఆరెంజ్ రంగులోకి మారిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. -
‘ఆరెంజ్ పాస్‌పోర్ట్’.. బీజేపీ వివక్షే: రాహుల్
న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్ చెక్ అవసరం ఉన్న పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఆరెంజ్ రంగు పాస్‌పోర్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ వివక్షాపూరిత ఆలోచనా ధోరణిని ఇది సూచిస్తోందని విమర్శించారు. ‘వలస కార్మికులను రెండో తరగతి పౌరులుగా బీజేపీ పరిగణించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ చర్యలు బీజేపీ వివక్షాపూరిత ఆలోచన ధోరణిని సూచిస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు. -
బత్తాయి భారం
► నిమ్మ సాగుపై అనాసక్తి ► రాయితీలకు స్వస్తి పలికిన ఉద్యానశాఖ ► సాగుకు దూరమవుతున్న రైతులు ► పంట కాపాడుకునేందుకు ఏటా రైతుల భగీరథ ప్రయత్నం ► 250 అడుగుల లోతుకు బోర్లు వేసినా కనిపించని నీటి చెమ్మ ► రానున్న కాలంలో పంట కనుమరుగయ్యే ప్రమాదం ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఒకప్పుడు సిరులు కురిపించిన బత్తాయి, నిమ్మ తోటలు ఆదరణ కోల్పోతున్నాయి. రైతులు ఈ పండ్ల తోటల పట్ల ఆసక్తి చూపడం మానేస్తున్నారు. గత నాలుగేళ్ళుగా జిల్లాలో వర్షాలు లేకపోవడం.. వాతావరణ పరిస్థితులు సక్రమంగా ఉండకపోవడం.. పంట కోతల సమయంలో మార్కెట్లో ధరలు పతనమవడం.. వంటి కారణాలు రైతులను వెం టాడుతున్నాయి. దీనికి తోడు భూగర్భజలాలు అడుగంటి.. బోర్లలో నీళ్ళు రాకపోవడం కూడా ప్రధాన కారణంగా రైతులు ఈ పండ్ల తోటలను వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది. గత రెండేళ్ళలో చాలా తోటలు ఎండిపోవడంతో రైతులు వాటిని కొట్టేయాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో గత పదేళ్ళ క్రితం కనిగిరి ప్రాంతంలో విస్తారంగా కనిపి ంచే బత్తాయి, నిమ్మ తోటలు ఆదరణ కోల్పోతున్నాయి. రానురాను తోటల కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో బత్తాయి, నిమ్మ తోటలు 2,782 హెక్టార్లకు పైగా సాగవుతాయి. గత పదేళ్లకు ముందు ఈ పండ్ల తోటలు విస్తీర్ణం పెరిగేది. ఎక్కువగా ఈ తోటలు మార్కాపురం, కనిగిరి ప్రాంతంలో విస్తారంగా కనిపించేవి. కొనకనమిట్ల మండలంలోని చినారికట్లలో ప్రధాన సాగు నిమ్మతోటలే. 1200 ఎకరాలలో రైతులు సాగు చేస్తారు. ముఖ్యంగా నిమ్మతోటలకు కనిగిరి ప్రసిద్ధి. ఎకరాకు ఎరువులు, పురుగుమందులు, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు పెట్టుబడి అయ్యేది. అలాంటిది గత నాలుగేళ్లుగా జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనలు సకాలంలో రావడంలేదు. వర్షాలు కురవడం గగనమయింది. దీంతో భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయి. పంట రాగానే ధరల పతనం.. పశ్చిమప్రాంతంలో 200 నుంచి 250 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి చెమ్మ కనిపించని స్థితికి భూగర్భజలాలు పడిపోయాయి. దీంతో వేసవి కాలంతో పాటు వర్షాకాలంలో కూడా పండ్ల తోటలను కాపాడుకోవడానికి ఏటా రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది. గత యేడాది కరువు విలయతాండవం చేయడంతో వందల ఎకరాల్లో పండ్లతోటలను రైతులు వదిలేశారు. కొన్ని ప్రాంతాలలో అష్టకష్టాలు పడి తోటలను కాపాడుకున్నారు. ఈ పరిస్థితిలలో పంట దిగుబడి మార్కెట్లో రాగానే నిమ్మ ధరలు పతనమయ్యాయి. సాధారణంగా ఎకరాకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ప్రతికూల వాతావరణం వల్ల సగానికి దిగుబడి పడిపోయింది. అయినా.. కనిగిరి మార్కెట్ నుంచి ఆయా సీజన్లలో రోజుకి 70 నుంచి 85 టన్నుల వరకు కాయలు ఎగుమతి అయ్యేవి. అలాంటి పరిస్థితి నుంచి రానురాను నిమ్మ రైతులు నష్టాలతో పాటు కష్టాలను ఎదుర్కొనే దుస్థితి వచ్చింది. గత డిసెంబర్లో ప్రారంభంలో కిలో నిమ్మకాయలు రూ.5 నుంచి రూ.10 వరకు పలికింది. తరువాత కిలో రూపాయికి చేరింది. ఒక దశలో అర్ధరూపాయికి కూడా పడిపోయింది. మార్కెట్‌కు 50 కిలోల బస్తా తెస్తే కేవలం రూ.20 నుంచి రూ.30 మిగిలాయి. ఈ పరిస్థితులలో కోతకు వచ్చిన కాయలను కూడా చెట్లకే రైతులు వదిలేశారు. ఈ పరిస్థితులలో జిల్లాను ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించింది. పండ్లతోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఎండిపోయాయి. రాయితీ నిలిపివేత.. జిల్లాలోని పరిస్థితిని గమనించిన జిల్లా ఉద్యానశాఖ అధికారులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పండ్లతోటలపై సమీక్షించారు. ఈ ఏడాది నుంచి బత్తాయి, నిమ్మ తోటల సాగును ప్రోత్సాహించవద్దని ఆదేశించారు. ఆ పండ్ల తోటలకు ఇచ్చే 50 శాతం రాయితీని నిలిపివేయాలని సూచించారు. వాటి స్థానంలో విషయాన్ని యాపిల్‌బెర్, దానిమ్మ, నేరెడు, జామ తోటలను ప్రోత్సాహించాలని ఆదేశించారు. వీటికి రాయితీలను ప్రోత్సాహించి ఉద్యాన రైతులను అటువైపు మళ్లించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. దీంతో పాటు ప్రతి ఐదెకరాలకి ఒక ఫాంపాండ్ (నీటికుంట)ను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు రాయితీ ఇవ్వాలని ఉద్యాన అధికారులకు తెలిపారు. ముఖ్యంగా ఉద్యాన పంటలకు కూడా 100 శాతం డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు జిల్లాను వెంటాడుతున్న ప్రతికూల వాతావరణం కూడా తోడవడంతో రానున్న కాలంలో జిల్లాలో బత్తాయి, నిమ్మ తోటల సాగుకు రైతులు దూరమయ్యే అవకాశం ఉంది. తోటలు కూడా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి రాబోతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వీటిపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు ఇతర మార్గాలను ఎంచుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలవైపు వెళుతున్నారు. -
నిశ్చింతగా నారింజ తినవచ్చు...
నారింజపండు కాస్త పుల్లగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల పుల్ల తేన్పులతో కనిపించే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు ఈ పండు తినరు. కానీ స్టాన్ఫోర్డ్ సంస్థ అధ్యయనం ప్రకారం ఈ విషయానికి తగిన ఆధారాలు దొరకలేదు. కాబట్టి పులితేన్పులను ఈ పండు ఎక్కువ చేస్తుందనే అపోహ వీడి హాయిగా తినవచ్చు. ఇక నారింజలో పీచు కూడా ఎక్కువే. అయితే దీన్ని పండుగా తింటేనే పీచు మనకు లభ్యమవుతుంది. అయితే జ్యూస్ తీసినప్పుడు పీచును చాలావరకు కోల్పోయే అవకాశాం ఉంది. కాబట్టి దీన్ని పండుగా తినడమే మంచిది. అదీగాక మిగతా పండ్లలో ఉండే చక్కెర వేగంగా విడుదల అవుతుందేమోగాని... నారింజ పండు తిన్నవారిలో దీనివల్ల లభ్యమయ్యే చక్కెర చాలా మెల్లగా శరీరంలోకి విడుదల అవుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే చక్కెరవ్యాధి గ్రస్తులు సైతం నిరభ్యంతరంగా దీన్ని తినవచ్చు. వాళ్లకూ ఇది సురక్షితమైన పండు అని చెప్పవచ్చు.