సిట్రస్ ఫ్రూట్స్‌లో నారింజ పండు చాలా ప్రత్యేకం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి..
ఇలా నారింజ పండుతో బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయన్నది తెలిసిందే. అయితే నారింజ పండ్లను తినేసి తొక్కే కదా తీసిపారేస్తాం.కానీ ఇప్పట్నుంచి అలా చేయకండి. నారింజ తొక్కలతో మంచి సువాసన భరితమైన కొవ్వత్తులను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
తయారీకి కావాల్సిన పదార్థాలు
నారింజ తొక్కలు
కత్తి లేదా టేబుల్ స్పూన్
నూనె(వెజిటెబుల్, ఆలివ్, ఏదైనా)
నారింజ పండును ముందుగా రెండు భాగాలుగా కట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సహాయంతో గుజ్జును వేరు చేయండి. కొవ్వొత్తిని తయారుచేయడానికి లోపలున్న విక్‌ను అలాగే ఉంచండి. ఇప్పుడు ఆ నారింజ పండులో వెజిటెబుల్ ఆయిల్ లేదా కరిగించిన మైనాన్ని జాగ్రత్తగా పోసి ఆరనివ్వండి.
ఆ తర్వాత విక్‌ను వెలిగించండి..అంతే మీ ఆరెంజ్ క్యాండిల్ రెడీ అయినట్లే. నారింజలోని సిట్రస్ వల్ల క్యాండిల్ వెలిగించినప్పుడు ఇంట్లో మంచి సువాసనను వెదజల్లుతుంది.
Comments
Please login to add a commentAdd a comment