
వివాహమై 40 ఏళ్లు లేదా 60 ఏళ్లు అవ్వొచ్చు. మరీ ఎక్కువ కాలం ఇరువురు బతికుంటే దగ్గర దగ్గర 66 ఏళ్లు కూడా అవ్వొచ్చు. అంతేగానీ అన్నేళ్లు ఇరువురి జీవనయానం సాగించడం అంత ఈజీ కాదు. మధ్యలో ఎవరో ఒకరు కాలం చెందడం సర్వసాధారణం. అందులోనూ నేటి యువత పెళ్లై పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండటం లేదు. అలాంటి జంటల సంఖ్య వేళ్లతో లెక్కించలేనంత మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో..దగ్గర దగ్గర సెంచరీకి సమీపం వరకు అన్నేళ్లు కలిసి సహచర్యం చేసిన జంటగా రికార్డు దక్కించుకుంది ఈ వృద్ధ జంట. వారిక ఏకంగా వందమంది పైగా మనవరాళ్లు, మనవళ్లు ఉన్నారు. ఇక ఆ వృద్ధ దంపతుల వయసు ఎంత ఉండొచ్చు, పెళ్లి ఎప్పుడైంది వంటి విశేషాల గురించి తెలుసుకుందామా..!.
పెళ్లై 84 ఏళ్లు గడిచిన వృద్ధులుగా ఈ బ్రెజిలియన్ జంట నిలిచింది. సుదీర్ఘ కాలం అన్యోన్య దాంపత్య జీవితం గడిపిన జంటగా రికార్డు సృష్టించింది. ఆ దంపతుల పేర్లు మనోయల్ ఏంజెలిమ్ డినో, మరియా డి సౌసౌ డినో. వారి ప్రేమ కథ అత్యంత విచిత్రంగా జరిగింది. ఇద్దరు తమ కుటుంబాల పోషణ కోసం వ్యవసాయం చేస్తుండేవారు.
ఇరువురు ఆ వ్యవసాయ వృత్తి ద్వారానే ఇరువురికి పరిచయం ఏర్పడింది. అయితే మళ్లీ విధి అనుకోకుండా మరోసారి ఎదురపడేలా చేసింది. ఇక అప్పుడే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇక మనోయల్ కూడా తన మనసులోని మాటను మరియాకి చెప్పేశాడు. అందుకు సుమఖత వ్యక్తం చేసింది. అలా ఇద్దరు 1940లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.
ఇద్దరూ పోగాకు చుట్టడాన్ని జీవనోపాధిగా చేసుకుని బతుకు సాగించేవారు. ఇప్పుడు మనోయల్ వయసు 105 ఏళ్ల, మరియాకి 101 ఏళ్లు. ప్రస్తుతం ఇరువురు విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. ఇన్నాళ్లు తమ వైవాహిక జీవితంలో ఇంతలా కలిసి ఉండటానికి కారణం ఒక్కటే ప్రేమ. అది తమ ఇద్దరి మధ్య మరొకరు వచ్చి అగాథం సృష్టించ లేనంత నమ్మకం, ప్రేమ వంటివి స్ట్రాంగ్ ఉన్నాయని చెబుతోంది ఈ జంట.
"ఇరువురం అనుకోకుండా భార్యభర్తలమయ్యాం. మంచో చెడో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. కడదాక నిలుపుకోవాలనుకున్నాం. మా ఇరువరి మధ్య ఉన్న విడదీయరాని ప్రేమ కారణంగా సుదీర్ఘకాలం అన్యోన్యంగా ఉండగలగాం." అని అంటున్నారు ఈ దంపతులు.
అంతేగాదు ఎలాంటి పొరపాటు, తప్పు జరిగినా దాన్ని లేవనెత్తడం, ఆరోపణలు చేసుకోవడం వంటి వాటికి తావివ్వకోపోడం వల్లే తమ బంధం దృఢంగా ఉందని అన్నారు. అదే తమ సుదీర్ఘకాల ఆరోగ్య రహస్యానికి కారణం కూడా అని చెబుతోంది ఈ వృద్ధ జంట. నిజమే కాదు వ్యక్తిగత జీవితం ఆహ్లాదంగా ఏంటేనే కదా..మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండేది.
Comments
Please login to add a commentAdd a comment