candles
-
రోజుకి 20 నిమిషాలే పనిచేస్తాడు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 3.8 కోట్లు..!
చాలామంది గంటలకొద్ది పనిచేసిన సంపాదన మాత్రం అతంత మాత్రంగానే ఉంటుంది. ఇంకొందరూ పడే కష్టం చూస్తే బాధేస్తుంది. వాళ్ల సంపాదన కనీసం రోజు గడవడానికి కూడా సరిపోదు. కానీ ఈ వ్యక్తి రోజుకి మహా అయితే 20 నిమిషాలకు మించి పనిచేయడు. కానీ ఏడాదికి ఏకంగా రూ. 3.8 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎలా? అతడి విజయ రహస్యం ఏంటీ అంటే.. ఓర్లాండ్ నివాసి ప్రాన్సిస్కో రివెరా ఫిబ్రవరి 2023లో ఆన్‌లోన్ ట్యూటర్‌గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ, మరోవైపు పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవాడు. అయితే అది అతనికి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రోజంతా కష్టపడ్డా సంపాదిస్తుంది ఎంత అనే ఫీల్‌తో ఉండేవాడు. ఏదైన ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం కోసం తెగ అన్వేషించేవాడు రివెరా. అలా యూట్యూబ్‌లో బిజినెస్‌కి సంబంధించిన ప్రింట్ ఆన్ డిమాండ్(పీవోడీ) సైడ్ హాస్లర్ యూట్యూబ్ వీడియోలతో ప్రేరణ పొంది ఆర్గానిక్ క్యాండిల్స్ తయారు చేసి విక్రయించే ఎట్సీ((Eassiest Way To Start(Ety)) అనే దుకాణాన్ని పెట్టానలుకున్నాడు. ముదుగా ఆర్గానిక్ కొవ్వుత్తులు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆన్లైన్లో ఎలా విక్రయించాలి, ఎలా ప్రొడక్ట్లని డిజైన్ చేయడం అనేవి ఆ పీవోడీ వీడియోల ద్వారా పూర్తి పరిజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆన్లైన్లో కూడా బిజినెస్ బాగా విస్తరించేలా చేశాడు. ఇలా అతడి ఎట్సీ దుకాణం గతేడాది సుమారు రూ. 3.8 కోట్లు లాభాలు అందుకుంది. ప్రతి అమ్మకంలో దాదాపు 30% నుంచి 50% లాభలను అందుకున్నామని రివెరా చెప్పుకొచ్చాడు. తాను కేవలం మార్కెటింగ్‌కి, ప్రింట్ఫై సేవల కోసమే ఖర్చు చేస్తున్నాని తెలిపారు. తాను కొన్ని రోజులు 20 నిమిషాలే పనిచేస్తానని, ఒక్కోసారి మాత్రం రెండు గంటల వరకు పని చేస్తానని అది కూడా కొత్త ట్రెండ్స్‌పై పరిశోధన చేయడం, లేబుల్స్ డిజైన్ చేయడానికి ఇంత టైం పడుతుందని చెప్పుకొచ్చారు. మిగిలిన సమయం అంతా సంగీతంపై దృష్టి పెడతానని అన్నారు. తానిప్పుడూ గతంలో కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, తక్కువే పనిచేస్తున్నానని ఆనందంగా చెప్పుకొచ్చారు రివెరా. అంతేగాదు మీరు 9 టు 5 జాబ్‌లో ఉండి సరైన సంపాదన లేనప్పుడూ మంచి ఆదాయమార్గం వైపు దృష్టిసారించడం ఓ స్టాండర్డ్‌ని తీసుకోవడం చేయాలి చెబుతున్నాడు రివెరా. కాగా ప్రింట్ ఆన్ డిమాండ్(పీవోడీ) సైడ్ హాస్టల్స్ కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవాళ్లకు ఎలాంటి వ్యాపారాలు చేస్తే మంచిది, ఎలా ప్రారంభించాలి, ట్రైనింగ్ వంటివి అన్ని ఔత్సాహికులకు నేర్పించే యూట్యూబ్ ఛానెల్. ఆయా వ్యక్తులకు వ్యాపారానికి కావాల్సిన గైడన్స్ ఇవ్వడమే గాక మార్కెటింగ్ సంబంధించిన సహాయసహకారాలు కూడా అందిస్తుంది. దీని సాయంతో ఎంతో మంది ఈజీగా ఆదాయాన్ని గడించి బిజినెస్‌లతో దూసుకుపోయిన వారెందురో ఉన్నారు కూడా. (చదవండి: ఆ మూడు సమయాల్లో అస్సలు బ్రష్ చేయకూడదట..!) -
అంబానీ ఇంట పెళ్లి సందడి: అతిథులకు అదిరిపోయే గిఫ్ట్..?!
బిలియనీర్లు, బిజినెస్ దిగ్గజాల ఇంట్లో పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదుగా. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు, వ్యాపారవేత్త అనంత్అంబానీ, రాధిక మర్చంట్ మూడుముళ్ల వేడుక అంటే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే అంబానీ చేతితో రాసారని చెబుతున్న ఇన్విటేషన్ కార్డ్ ఒకటి నెట్టింట హల్ చల్ చేసింది. అయితే, అంబానీ కుటుంబం ఈ వార్తలను ధృవీకరించలేదు అలాగని ఖండించనూ లేదు.దీంతో మరిన్ని ఊహాగానాలు, అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. జూలైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గ్రాండ్ వెడ్డింగ్ అంబానీ ఫ్యాన్ పేజీలలో ప్రకారం, అనంత్ ,రాధిక జూలై 2024లో ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.జూలై 10, 11 , 12 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి VIP గెస్ట్ హౌస్‌లతో పాటు 1200 మంది అతిథులు రానున్నారు. సింగర్, దిల్జిత్ దోసాంజ్ వారి వివాహానికి ముందు ఉత్సవాల్లో అనేక మంది ప్రదర్శనకారులలో ఉంటారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో ఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అవుతాయి.దీంతో పాటు అనంత్ అంబానీ , రాధిక డిజైనర్ దుస్తులు, విందు, ఇలా పెళ్లికి సంబంధించి అనేక పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పెళ్లి హడావిడి మొదలైందని కొన్ని ఫోటోలు షేర్ అవుతున్నాయి. ఇందులో వధువు తండ్రి, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ రాధిక స్నేహితులతో కలిసి పోజులిచ్చాడు. ఎంబ్రాయిడరీ నెహ్రూ జాకెట్, బ్లాక్ కలర్ బంద్‌గాలా షేర్వాణిలో వీరేల్ హుందాగా కనిపించాడు. Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..! దివ్యాంగులు తయారు చేసిన స్పెషల్ క్యాండిల్స్ మరో ఇంట్రస్టింగ్ వార్త ఏంటంటే..పెళ్లికి వచ్చిన అతిథులకు మహాబలేశ్వర్‌లోని అంధ ళాకారుల తయారు చేసిన ప్రత్యేక కొవ్వొత్తులను బహుమతిగా ఇస్తారట. స్వదేశీ పురాతన హస్తకళ, అమూల్యమైన వారసత్వ సంపదకు ఇషా అంబానీ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలంకరణకు కూడా వీటిని ఎక్కువగా వాడనున్నారట. ( ‘గో నిషా గో’ గేమ్ : వారి కోసమే, డౌన్లోడ్లతో దూసుకుపోతోంది) -
బర్త్‌డే నాడు క్యాండిల్స్ ఎందుకు ఊదుతారు? దాని వెనకున్న కథేంటి?
బర్త్‌డేలను సెలబ్రేట్ చేసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. చిన్నాపెద్దా తేడా లేకుండా తమ స్థాయిని బట్టి స్పెషల్ వేడుకలను జరుపుకుంటారు. పుట్టినరోజు నాడు అందరూ కామన్‌గా చేసేది.. క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేయడం. అసలు బర్త్‌డేలకు కేక్ ఎందుకు కట్ చేస్తారు? క్యాండిల్ ఊదడం వెనుక కారణాలు ఏంటి? అసలు ఈ కల్చర్ ఎక్కడినుంచి వచ్చింది అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. బర్త్‌డేలకు క్యాండిల్స్ ఊది, కేక్ కట్ చేయడం అన్న సంప్రదాయం ఇప్పటిది కాదు. 1808వ సంవత్సరంలోనే ఇది ప్రారంభమైందని చెబుతారు. జర్మనీలో అప్పట్లో కిండర్‌ఫెస్ట్ పేరిట కేవలం పిల్లలకు మాత్రమే బర్త్ డే వేడుకలను నిర్వహించేవారట. మనం కట్ చేసే సుతిమెత్తని మృదువైన కేకులా మన జీవితం కూడా సాఫీగా సాగాలని నమ్ముతారు. అందుకే స్పెషల్ వేడుకల్లో కేక్‌ను కట్ చేస్తారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఈ కల్చర్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఇక క్యాండిల్స్ ఊదే సంప్రదాయం మాత్రం గ్రీకుల కాలం నుంచి వచ్చిందని అంటారు. గ్రీకు దేవత ఆర్టెమిను ఆరాధించడం కోసం కొవ్వొత్తులను వెలిగించేవారట.ఆమెను పూజించేటప్పుడు గుండ్రని కేకుపై క్యాండిల్స్ వెలిగించేవారట. ఆ వెలుగు చంద్రుని ప్రకాశానికి ప్రతీకగా భావించేవారట. క్యాండిల్స్ ఊదడం వల్ల వచ్చే పొగను గ్రీకులు పవిత్రంగా భావించేవారట. అందుకే క్యాండిల్ ఊదేటప్పుడు మేక్ ఏ విష్ అంటారు. అంటే మనం అనుకున్నది నెరవేరాలని మనస్పూర్థిగా ప్రార్థించడం. క్యాండిల్ పొగ దేవతను చేరుతుందని, అలా తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలా అప్పటి నుంచి ఈ కల్చర్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. ఇదీ బర్త్‌డే నాడు క్యాండిల్స్ ఊదడం వెనకున్న కథ. -
నారింజ తొక్కలను తీసిపారేయకుండా ఇలా చేయండి
సిట్రస్ ఫ్రూట్స్‌లో నారింజ పండు చాలా ప్రత్యేకం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.. ఇలా నారింజ పండుతో బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయన్నది తెలిసిందే. అయితే నారింజ పండ్లను తినేసి తొక్కే కదా తీసిపారేస్తాం.కానీ ఇప్పట్నుంచి అలా చేయకండి. నారింజ తొక్కలతో మంచి సువాసన భరితమైన కొవ్వత్తులను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. తయారీకి కావాల్సిన పదార్థాలు నారింజ తొక్కలు కత్తి లేదా టేబుల్ స్పూన్ నూనె(వెజిటెబుల్, ఆలివ్, ఏదైనా) నారింజ పండును ముందుగా రెండు భాగాలుగా కట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సహాయంతో గుజ్జును వేరు చేయండి. కొవ్వొత్తిని తయారుచేయడానికి లోపలున్న విక్‌ను అలాగే ఉంచండి. ఇప్పుడు ఆ నారింజ పండులో వెజిటెబుల్ ఆయిల్ లేదా కరిగించిన మైనాన్ని జాగ్రత్తగా పోసి ఆరనివ్వండి. ఆ తర్వాత విక్‌ను వెలిగించండి..అంతే మీ ఆరెంజ్ క్యాండిల్ రెడీ అయినట్లే. నారింజలోని సిట్రస్ వల్ల క్యాండిల్ వెలిగించినప్పుడు ఇంట్లో మంచి సువాసనను వెదజల్లుతుంది. -
అమ్మ బాబోయ్.. ఒకేసారి నోట్లో 150 క్యాండిల్స్ మండించి..
‘లోకోభిన్న రుచి’ అని సామెత. యూఎస్ఏలోని ఇదాహోకు చెందిన డేవిడ్ రష్ అందుకు ఉదాహరణ. రికార్డులంటే పిచ్చి ఉన్న రష్... 250 గిన్నిస్ రికార్డులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో భాగంగా 150 క్యాండిల్స్‌ను నోట్లో పెట్టుకుని మండించాడు. 30 సెకన్లపాటు హోల్డ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. గతంలో 105 క్యాండిల్స్‌తో ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. హౌ క్రేజీ అనుకుంటున్నారా! ఈ ఒక్కదానికే... ఇంకా ఇతనికి చాలా రికార్డులున్నాయి. గతంలో 111 టీషర్ట్లు ధరించి హాఫ్ మారథాన్ కూడా చేశాడు రష్. 111 టీషర్టులను ఒంటిపై ఉంచుకుని 2 గంటల 47 నిమిషాల 55 సెకన్లపాటు మారథాన్ చేసి హాఫ్ మారథాన్‌లో అత్యధిక టీషర్టులు ధరించిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. అతనికి అన్ని టీషర్టులు తొడగడానికే 25 నిమిషాలు పట్టిందట. చదవండి: కనుగుడ్లను బయటకు పెట్టి చూస్తే గిన్నిస్ రికార్డు -
తేనెలూరే కొవ్వొత్తులు
ఎలక్ట్రిసిటి అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో వీధి దీపాలు, కిరసనాయిల్ బుడ్డి(దీపం) వెలుతురులో... చదువుతోబాటు పనులన్ని చక్కబెట్టేవాళ్లం. ఆ తరువాత కొవ్వొత్తి (క్యాండిల్) అందుబాటులోకి వచ్చాక కిరసనాయిల్ దీపాలు పక్కన పెట్టి క్యాండిల్స్ వాడుతున్నాం. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో పనులు చేసుకోవడం మీదే మన దృష్టంతా ఉంటుంది. కానీ ఆ క్యాండిల్ దేనితో తయారు చేశారు? దానివల్ల మనకేమైనా ప్రమాదం ఉందా? అని ఎవరు ఆలోచిస్తారు కష్టమే కాదా! కానీ ఇలా ఆలోచించిన రాజస్థా¯Œ అమ్మాయి తనుశ్రీ జై¯Œ కొవ్వొత్తులు కూడా కాలుష్యకారకాలని, వాటివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించి... ఏకంగా ఇకోఫ్రెండ్లీ క్యాండిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తోంది. పర్యావరణానికి హాని చేయని క్యాండిల్స్ తయారు చేస్తూ స్థానికంగా ఉన్న 250 మంది మహిళలకు ఉపాధిని కల్పించడం విశేషం. జైపూర్‌లోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది తనుశ్రీ జై¯Œ . నాన్న ఆర్మీలో పనిచేస్తుండగా, అమ్మ టీచర్. చదువులో చురుకుగా ఉండే తనుశ్రీ 2017లో బీటెక్ కంప్యూటర్స్ పూర్తయ్యాక, ఢిల్లీలోని ఇండియ¯Œ స్కూల్ ఆఫ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ (ఐఎస్డీఎమ్)లో మాస్టర్స్ చేసింది. మాస్టర్స్ చేసే సమయంలో ఢిల్లీలోని కాలుష్యభరిత వాతావరణం సరిపడక ఆమెకు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. ప్రారంభంలో పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ సమస్య తీవ్రమవడంతో.. ఆసుపత్రిలో చేరక తప్పలేదు. చికిత్స చేయించుకుని కోలుకుని ఇంటికి వచ్చాక.. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి పీల్చుకోడానికి ప్రయత్నించింది. కానీ అంతా కాలుష్యంతో కూడిన వాతావరణం. దీంతో పర్యావరణంలో ఉన్న కాలుష్య కారకాలను ఎలాగైనా తగ్గించాలనుకుంది. ఈ క్రమంలోనే రసాయనాలతో తయారయ్యే కొవ్వొత్తులు కాలుష్యానికి కారణమతున్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతిసిద్ధంగా లభించే పదార్థాలతో తయారు చేయాలనుకుంది. తేనె తుట్టెతో... క్యాండిల్స్ తయారీ కంపెనీలన్నీ... క్యాండిల్స్‌ను పారఫి¯Œ తో తయారు చేస్తున్నట్లు తెలుసుకుంది. పారఫి¯Œ లో అధికమొత్తంలో కార్బ¯Œ ఉంటుంది. దాంతో క్యాండిల్స్‌ని వెలిగించినప్పుడు, అవి వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తాయి. ఇది జరగకుండా ఉండాలంటే పారఫి¯Œ తో కాకుండా వేరే పదార్థంతో తయారు చేయాలని నిర్ణయించుకుని... 2018లో ‘నుషౌరా’ పేరుతో పారాఫి¯Œ కు బదులు తేనె తుట్టె నుంచి తీసిన మైనంతో క్యాండిల్స్‌ను రూపొందించడం మొదలుపెట్టింది. లక్షన్నర పెట్టుబడి, పదిమంది మహిళలతో.. సహజసిద్ధమైన మైనం, సువాసన భరిత నూనెలు, దూదితో క్యాండిల్స్ తయారు చేయించింది. గుజరాత్ రైతుల నుంచి మైనాన్ని, సేంద్రియ సాగు రైతుల నుంచి ఆయిల్స్‌ను సేకరిస్తోంది. వివిధ రంగులతో చక్కటి సువాసనతో ఉన్న ఈ క్యాండిల్స్‌కు మంచి ఆదరణ లభించడంతో ప్రస్తుతం ఇరవై రకాల కొవ్వొత్తులను అరవై గ్రాముల నుంచి కేజీ పరిమాణంలో తయారు చేస్తోంది. నుషౌరా క్యాండిల్స్‌ను ఇండియాలోనేగాక కెనడా, అమెరికా, జర్మనీ, ఫ్రా¯Œ ్సలకు ఎగుమతి చేస్తోంది. ఉపాధినిస్తోంది.. క్యాండిల్స్ తయారీలో రాజస్థా¯Œ , మధ్యప్రదేశ్ మహిళలు పాల్గొంటున్నారు. ఈ మహిళలంతా తమ ఇళ్లలో క్యాండిల్స్ రూపొందించి వాటిని తనుశ్రీకి పంపుతారు. క్యాండిల్స్ తయారు చేసిన మహిళలకు పనికి తగ్గ వేతనం ఇస్తోంది. ఈ క్యాండిల్స్ తయారీ ద్వారా ప్రస్తుతం 250 మంది మహిళలకు ఉపాధి దొరుకుతోంది. నుషౌరా క్యాండిల్స్‌ను కొన్నవాళ్లు బంధువులు, స్నేహితులకు బహుమతిగా ఇవ్వడం.. వారు ఆ క్యాండిల్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీటి గురించి అందరికీ తెలిసి విక్రయాలు బాగా పెరిగాయి. సవ్యంగా క్యాండిల్స్ విక్రయాలు జరుగుతోన్న సమయంలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. దీంతో విక్రయాలు ఆగిపోయాయి. ఆ సమయంలో మూడు పొరలతో కూడిన మాస్కులు, వివిధ రకాల నిల్వ పచ్చళ్లు, చాక్లెట్లు, సబ్బులు, శానిటైజర్లు, డయపర్లు తయారు చేసి విక్రయించేది. ఈ విధంగా మహిళలు ఉపాధిని కోల్పోకుండా చేసింది. పరిస్థితులు ప్రస్తుతం కాస్త కుదుటపడుతుండడంతో మళ్లీ క్యాండిల్స్ తయారీని పెంచింది. -
‘ప్రేమ ఎంత ప్రమాదమో మరోసారి రుజువైంది’
ప్రేమించడం ఎంత సులువో ఆ ప్రేమను దక్కించుకోవడం అంత కష్టం. ఇష్టపడిన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేయడం దగ్గర నుంచి తనను ఒప్పించేలా ప్రేమను వ్యక్త పరచాలంటే ఎన్నో పాట్లు పడాలి. ఈ ప్రక్రియలో ఎంతో మంది తమకు నచ్చిన విధంగా ప్రపోజ్ చేస్తుంటారు. పువ్వు ఇచ్చి, లెటర్ రాసి, మెసెజ్‌ల రూపంలో ఇలా రకరకాలుగా తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. ప్రతి అబ్బాయి ఎవరైనా తన లవర్‌కు ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. అయితే ఇందుకు ప్లానింగ్ కూడా ఎంతో ముఖ్యం. ప్లానింగ్ మిస్సయితే.. సిక్సర్ కాస్తా.. ఔట్‌గా మారే ప్రమాదం ఉంది. (పార్లమెంట్‌లోనే ప్రేయసికి ప్రపోజ్ చేశాడు) అచ్చం ఇలాంటి ఓ సంఘటనే లండన్‌లో చోటుచేసుకుంది. షెఫీల్డ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొంత కాలంగా తన స్నేహితురాలిని ప్రేమిస్తున్నాడు. ఓ మంచి రోజు చూసుకొని తన గర్ల్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో తన నివసిస్తున్న అపార్ట్మెంట్లో వందలాది క్యాండిల్స్‌ను వెలిగించాడు. బెలూన్స్ డెకరేట్ చేసి, గ్లాస్‌లలో వైన్ పోసి ఉంచాడు. ఇక తన స్నేహితురాలిని ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లి తిరిగి అపార్ట్‌మెంట్‌కు చేరుకునే సరికి ప్రమాదవశాత్తు ఇల్లంతా మంటలు అలుముకున్నాయి. మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకు వస్తున్నాయి. వెంటనే షాక్ నుంచి తేరుకున్న యువకుడు కొవ్వొత్తుల కారణంగా ఇంట్లో మంటలు వ్యాపించాయని ఊహించాడు. (నాకో ప్రేయసి కావాలి...జపాన్ కుబేరుడు) అయినప్పటికీ మంటలు అదుపులోకి వచ్చాక మంటల్లో కాలిపోయిన ఇంట్లోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. ఇంత జరిగాక యువతి నో చెప్పే అవకాశమే లేదు. యువకుడి ప్రేమను అంగీకరించింది. కాగా అగ్నిమాపక సిబ్బంది విభాగం ఈ దృశ్యాలను ఫేస్బుక్లో పోస్టు చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘ప్రేమ ఎంత ప్రమాదకరమైనదో మరోసారి రుజువైంది. తక్కువ బడ్జెట్లో ప్రపోజ్ చేద్దామనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంటిని పునర్నిర్మించేందుకు భారీ బడ్జెట్ కావాలి’. అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. -
ఎయిర్పోర్ట్ బయట ప్రజల నిరసన
-
నేడు కొవ్వొత్తుల ప్రదర్శన
– గౌరు వెంకటరెడ్డి కర్నూలు(ఓల్డ్‌సిటీ): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గురువారం నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ప్రత్యేక హోదాపై పోరాటం సాగిస్తోందన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల మనోభీష్టం మేరకు హోదా సాధనే లక్ష్యంగా జగన్ నాయకత్వంలో నిత్యం పోరాటాలు చేస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీ మేలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జల్లికట్టు సంఘటన స్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాపై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మొదలు రాజ్‌విహార్ సెంటర్ వరకు, తిరిగి జిల్లా పరిషత్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపడతామన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా నిరసనలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. -
కలాం మృతిపై చిన్నారుల విచారం
-
ఎక్కడికెళ్లినా బ్యాగులో అవి ఉండాల్సిందే!
ఇంటి నుంచి బయటికెళుతున్నప్పుడు బ్యాగులో తమకు నచ్చిన వస్తువు ఉండేలా చూసుకుంటారు చాలామంది. అలా దీపికా పదుకొనే కాలు బయటపెట్టేటప్పుడు పదే పదే చూసుకునే వస్తువు ఒకటుంది. అది లేకుండా ఆమె బయటికెళ్లడానికి ఇష్టపడరు. అదేంటంటే.. ‘అరోమా థెరపీ క్యాండిల్’. సువాసనలు వెదజల్లే ఈ కొవ్వొత్తుల గురించి దీపికా చెబుతూ - ‘‘షూటింగ్స్ అంటే ఎంత హడావిడి ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా క్లిష్టమైన సన్నివేశాల్లో నటించినప్పుడు చాలా ఒత్తిడికి గురవుతుంటాను. ఆ కారణంగా మూడాఫ్ అయిపోతుంది. అందుకే, నాకు ఒత్తిడి అనిపించినప్పుడల్లా కొవ్వొత్తులు వెలిగిస్తాను. వాటి నుంచి వచ్చే సువాసన నన్ను మామూలు మూడ్‌లోకి తెచ్చేస్తుంది.. రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. నేను ఉపయోగించే కార్వాన్లో కూడా కొవ్వొత్తులు వెలిగిస్తుంటాను. నా వాహనం మొత్తం పరిమళంతో నిండిపోతుంది. మీకో విషయం చెప్పనా? నాకు ఎలక్ట్రికల్ బల్బుల కన్నా కొవ్వొత్తులే ఇష్టం’’ అన్నారు. -
అరోమా ధేరపీ అంటే ఇష్టం!!!
-
వేడుకగా కరుణామయుడి పుట్టినరోజు
నెల్లూరు (వేదాయపాళెం), న్యూస్‌లైన్ : లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ను జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు బుధవారం వేడుకగా జరుపుకున్నారు. క్రైస్తవ ప్రార్థన మందిరాలు భక్తులతో కిక్కిరిశాయి. మంగళవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనల్లో తరించారు. పశువుల పాకలో ఉన్న బాలఏసును దర్శించుకుని, కొవ్వొత్తులు వెలిగించారు. కేకులు కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. నగరంలోని సంతపేటలోని రోమన్ క్యాథలిక్ మిషన్ చర్చి, ఏబీఎం చర్చి, వీఆర్సీ సెంటర్లోని డౌనిహాల్, రైతుబజారు వద్ద ఉన్న బాప్టిస్టు చర్చి, ఫతేఖాన్‌పేటలో ఉన్న లూథరన్ చర్చి, దర్గామిట్టలోని సాల్వేషన్ ఆర్మీ చర్చి తదితర ప్రాంతాల్లోని చర్చిల వద్ద క్రిస్మస్ సంబరం నెలకొంది. -
జాతీయ రాజధానిలో క్రిస్మస్ సంబరాల సందడి
న్యూఢిల్లీ: క్రిస్మస్ సంబరాల సందడిలో జాతీయ రాజధాని తలమునకలయ్యింది. మంగళవారం రాత్రికే చర్చిలను అలంకరించిన క్రైస్తవులు బుధవారం ఉదయం లేచింది మొదలు వణికించే చలిలోనే ఆత్మీయులకు అభినందనలు తెలపడానికి ప్రార్థనా మందిరాలకు బయలుదేరారు. ‘‘ఈ పండుగ ప్రజలందరిదని నా విశ్వాసం. ఇక్కడ చర్చిలో అన్ని విశ్వాసాలకు చెందిన వారున్నారు. ఇది మతం, సంస్కృతుల సమ్మేళన పర్వదినం’’ అని వివరించాడు 23 ఏళ్ల థామస్ ఫిలిప్స్. మధ్య ఢిల్లీ కన్నాట్‌ప్లేస్‌లోని సేక్రెడ్ హార్ట్ చర్చిలో ప్రార్థనకు హాజరయిన ఫిలిప్స్ కొవ్వొత్తులు, కరోల్స్‌తో కనిపించాడు. ‘‘క్రిస్మస్ పర్వదినం అంటేనే కరోల్స్, కేక్‌లు, పార్టీలు. ఇక ఆత్మీయులకు బహుమతుల పంపిణి అనేది ఓ అదనపు ఆకర్షణ’’ అని వివరించాడు. మధ్య ఢిల్లీలోని కరోల్‌బాగ్ బాప్టిస్ట్ చర్చికి వచ్చిన జార్జ్ కుట్టీ (51) మాట్లాడుతూ ‘‘కుటుంబం, సన్నిహితులతో పాటు సమస్త లోకం బాగుండాలని జీసస్‌ను ప్రార్థించాను. ఈ రోజు మానవాళి శాంతి కోసం తపించిన జీసస్ జన్మదినం. కాబట్టి ప్రపంచమంతటికీ ఈ రోజు పర్వదినమే’’ అని వివరించారు. మంగళవారం అర్థరాత్రి జీసస్ జన్మించాడని విశ్వాసం. పపంచ వ్యాప్తంగా క్రిస్టియన్లకు అతి పెద్ద ఆనందపు వేడుక. నగరంలోని పలు దుకాణాలు వివిధ రకాల కేకులు, వివిధ రకాల ఎండు పండ్లతో నిండిపోయాయి. రమ్ కలిపి చేసిన కేకులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దక్షిణ ఢిల్లీలోని ఆర్కే పురానికి చెందిన అనితా వర్గీస్ (42) మాట్లాడుతూ ‘‘ ప్రతి క్రిస్మస్కు బంధుమిత్రులతో ఇల్లు సందడిగా మారుతుంది. టర్కీ కోళ్ల వేపుడు, కోడి మాంసం, ప్లమ్ కేకులు, ముఫిన్స్ సిద్ధం చేసి ఉంచుతాను. పర్వదినం సందర్బంగా భారీ వేడుకను జరుపుకుంటాము. నగరంలోని పలు క్లబ్‌లు, రెస్టారెంట్లు ప్రత్యేకంగా క్రిస్మస్ విందులకు ఏర్పాట్లు చేస్తున్నాయి. విందులు ఏర్పాటు చేసుకునే వారికి ప్రత్యేక తగ్గింపు అందిస్తున్నాయి.