ఎక్కడికెళ్లినా బ్యాగులో అవి ఉండాల్సిందే! | Candles help Deepika Padukone keep her cool! | Sakshi
Sakshi News home page

ఎక్కడికెళ్లినా బ్యాగులో అవి ఉండాల్సిందే!

Published Sat, Sep 13 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

ఎక్కడికెళ్లినా బ్యాగులో అవి ఉండాల్సిందే!

ఎక్కడికెళ్లినా బ్యాగులో అవి ఉండాల్సిందే!

 ఇంటి నుంచి బయటికెళుతున్నప్పుడు బ్యాగులో తమకు నచ్చిన వస్తువు ఉండేలా చూసుకుంటారు చాలామంది. అలా దీపికా పదుకొనే కాలు బయటపెట్టేటప్పుడు పదే పదే చూసుకునే వస్తువు ఒకటుంది. అది లేకుండా ఆమె బయటికెళ్లడానికి ఇష్టపడరు. అదేంటంటే.. ‘అరోమా థెరపీ క్యాండిల్’. సువాసనలు వెదజల్లే ఈ కొవ్వొత్తుల గురించి దీపికా చెబుతూ - ‘‘షూటింగ్స్ అంటే ఎంత హడావిడి ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా క్లిష్టమైన సన్నివేశాల్లో నటించినప్పుడు చాలా ఒత్తిడికి గురవుతుంటాను.
 
  ఆ కారణంగా మూడాఫ్ అయిపోతుంది. అందుకే, నాకు ఒత్తిడి అనిపించినప్పుడల్లా కొవ్వొత్తులు వెలిగిస్తాను. వాటి నుంచి వచ్చే సువాసన నన్ను మామూలు మూడ్‌లోకి తెచ్చేస్తుంది.. రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. నేను ఉపయోగించే కార్‌వాన్‌లో కూడా కొవ్వొత్తులు వెలిగిస్తుంటాను. నా వాహనం మొత్తం పరిమళంతో నిండిపోతుంది. మీకో విషయం చెప్పనా? నాకు ఎలక్ట్రికల్ బల్బుల  కన్నా కొవ్వొత్తులే ఇష్టం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement