Relax
-
ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్!
దేశమంతా సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైపోయింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలి దశ పోలింగ్‌కు అప్పుడే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 72 రోజులు ఉన్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జలంధర్‌లోని ఒక హోటల్లో రోజంతా గడిపినట్లు తెలిసింది. ‘ది ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు హోటల్ రాడిసన్‌కు వచ్చిన సీఎం దాదాపు 24 గంటల తర్వాత బుధవారం వెళ్లిపోయారు. జలంధర్ ఎంపీ సుశీల్ రింకూను ఆయన మంగళవారం కలిశారు. ఇక బుధవారం ఆయన ఎంపీ బల్బీర్ ఎస్ సీచెవాల్, స్థానిక సంస్థల మంత్రి బల్కర్ సింగ్‌ను మాత్రమే కలిశారు. అది కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో. ఆ తర్వాత ఆయన వెంటనే వెళ్లిపోయారు. “సీఎం విశ్రాంతి మోడ్‌లో ఉన్నారని, ఎన్నికల వాతావరణం వేడెక్కడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులతో సమావేశానికి, మా అభిప్రాయాన్ని తీసుకోవడానికి, ఎన్నికల వ్యూహానికి సంబంధించి సూచనలు ఇవ్వడానికి ఆయన ఒక గంట లేదా రెండు గంటలు కేటాయించి ఉంటారు” అని సీనియర్ నాయకుడొకరు చెప్పినట్లుగా కథనంలో పేర్కన్నారు. -
హాలీడే టూర్స్‌లో స్టార్స్ బిజీ బిజీ
స్టోరీ సిట్టింగ్స్, సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్... ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు. విహారం.. వినోదం కోసం కొంత టైమ్ కేటాయిస్తారు. ప్రస్తుతం అలా వెకేషన్ మోడ్‌లో ఏ స్టార్స్ ఎక్కడున్నారో తెలుసుకుందాం. మాల్దీవుల్లో మస్తీ వెకేషన్ స్పాట్ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు రజనీకాంత్. వారం రోజుల క్రితం ఆయన మాల్దీవులకు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి బీచ్‌లో రజనీ నడుస్తున్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోని సినిమా, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లోని సినిమాలతో రజనీకాంత్ బిజీ అవుతారు. విదేశాల్లో బర్త్ డే ఇటీవలి కాలంలో సినిమా షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్ రావడంతో మహేశ్‌బాబు హాలిడే మోడ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్లో ఉన్నారు మహేశ్‌బాబు. రెండు వారాలకు పైగానే ఈ వెకేషన్‌ను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే. ఈ పుట్టినరోజుని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. వెకేషన్ కంటిన్యూ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన అజిత్ తమిళ చిత్రం ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’). ఆ సినిమా తర్వాత దాదాపు హాలిడే మూడ్‌లోనే ఉన్నారు అజిత్. తనకు ఇష్టమైన బైక్స్‌పై విదేశాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌ను సందర్శించారు. కాగా అజిత్ తర్వాతి చిత్రం ‘విడా ముయర్చి’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం ఉందట. దీంతో మరోసారి అజిత్ విదేశాలకు ప్రయాణమయ్యారని టాక్. షార్ట్ గ్యాప్ విజయ్ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. అలాగే విజయ్ నెక్ట్స్ ఫిల్మ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఈ చిత్రం ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉందట. ఈ షార్ట్ గ్యాప్‌లో విజయ్ విదేశాలకు వెళ్లారని కోలీవుడ్ సమాచారం. బాలీలో జాలీగా.. ఆరోగ్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సినిమా చిత్రీకరణలకు కాస్త దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత వెకేషన్ కోసం బాలీ వెళ్లారు. అక్కడ ఐస్ బాత్ చేశారు సమంత (మెరుగైన ఆరోగ్యం కోసం ఓ ప్రక్రియ). మైనస్ 4 డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ΄అటు ఐస్ బాత్ చేసినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేశారీ బ్యూటీ. ఇక సమంత హీరోయిన్గా నటించిన ‘ఖుషీ’ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. అలాగే వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. దుబాయిలో హాయి హాయి.. గత నెల మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా జోష్‌గా గడి΄ారు. ఈ హాలిడేని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రిసార్ట్స్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు రకుల్. తన తల్లి బర్త్ డేను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారామె. ఇందుకోసమే రకుల్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లారు. ‘భోళా శంకర్’ షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత వెకేషన్‌కు వెళ్లొచ్చారు చిరంజీవి. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన చిరంజీవి ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్’ ప్రమోషన్స్‌తో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆస్ట్రియా వెళ్లొచ్చారు వెంకటేశ్. అక్కడ కొంత క్వాలిటీ హాలి డే టైమ్‌ను స్పెండ్ చేసొచ్చారు. ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు యాభై రోజులు యూఎస్‌లో స్పెండ్ చేసిన ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్’, మారుతి దర్శకత్వంలోని ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న ఓ టైటిల్) చిత్రాలతో ప్రభాస్ బిజీ అవుతారని తెలుస్తోంది. ఇటు దర్శకుల విషయానికి వస్తే... రాజమౌళి తమిళనాడులోని ఆధ్యాత్మిక లొకేషన్స్‌లో ఎక్కవ టైమ్ స్పెండ్ చేశారు. ఇలా వెకేషన్‌కి వెళ్లొచ్చిన హీరో హీరోయిన్లు, దర్శకులు మరికొందరు ఉన్నారు. -
ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎల్ఐసీ బాసట
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) బాసటగా నిలిచింది. ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ అవసరాన్ని మినహాయించి, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సడలించనున్నట్లు ఎల్ఐసీ చైర్పర్సన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల ఎల్ఐసీ ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని మహంతి పేర్కొన్నారు. మృతులు, బాధితులకు బాసటగా నిలుస్తుందని, ఆర్థిక ఉపశమనం అందించడానికి క్లయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తుందని చైర్పర్సన్ వివరించారు. ఎల్ఐసీ పాలసీల క్లయిమ్‌దారులు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారుల కష్టాలను తగ్గించడమే దీని లక్ష్యం అని తెలిపారు. రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్లకు బదులుగా రైల్వే అధికారులు, పోలీసులు, ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితాను పాలసీదారుల మరణానికి రుజువుగా అంగీకరించనున్నట్లు ఎల్ఐసీ చైర్పర్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే క్లయిమ్ సంబంధిత సందేహాలకు నివృత్తికి, హక్కుదారులకు సహాయం అందించడానికి డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. -
ఎంజాయ్ చేద్దాం అనుకుంటే హడలిపోయేలా చేసింది..పాపం ఆ జంట..
కొలరాడోకి వెకేషన్‌కి వచ్చిన జంట అక్కడ ఒక రిసార్ట్ వెలుపల హాట్ టబ్‌లో సేదతీరుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ మౌంటైన్ లయన్ వారిపై దాడి చేసింది. ఈ అనూహ్య ఘటనకు ఆ జంట ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఆ జంతువుపై ఫ్లాష్ లైట్ వేసి, వేడినీళ్లు జల్లి కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో అది అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఏదో విధలా ఆ జంట తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఐతే ఈ ఘటనలో ఆమె భర్తకి మాత్రం కొద్దిపాటి గాయాలయ్యాయి. వాస్తవానికి ఆరోజు మౌంటైన్ లయన్ ఆమె భర్త తల, చెవిపై దాడి చేస్తుండగా..గమనించిన అతడి భార్య వెంటనే దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేయడంతో వారిద్దరూ బయటపడగలిగారు. ఆ తర్వాత ఆ జంట చుట్టుపక్కల వాళ్లని, అధికారులను అప్రమత్తం చేశారు. ఆ గాయాలను చూసిన అధికారులు సైతం మౌంటైన్ లయన్ పంజా దాడిలానే ఉందని నిర్థారించారు. ఆ జంట ఆ సమయంలో సరైన విధంగానే స్పందించారని అన్నారు. ఐతే సాధారణంగా మౌంటైన్ లయన్లు సాధారణ వెలుగులో మనిషి తలను గుర్తుపట్టలేవని, అది కూడా హాట్ టబ్‌లో ఉండగా అస్సలు దాడి చేయలేవని చెబుతున్నారు వైల్డ్‌లైఫ్ మేనేజర్ సీన్ షెపర్డ్. ఈ మేరకు తాము ఆ సింహం గురించి హెచ్చరికలు జారీ చేయడమే గాక దాన్ని ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తుంటామని ఆ జంటకి భరోసా ఇచ్చారు. కాగా కొలరాడో ఇలాంటి మౌంటైన్ లయన్ దాడులు దాదాపు 24 జరిగాయని అన్నారు. (చదవండి: కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..) -
రిలాక్స్ అండ్ రీ-ఎనర్జైజ్: ఉద్యోగులకు బ్రహ్మాండమైన దివాలీ ఆఫర్
సాక్షి, ముంబై: గ్లోబల్ కోవర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ వీవర్క్ ఇండియాలోని తన ఉద్యోగులందరికీ దీపావళి పర్వదినం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'రిలాక్స్ అండ్ రీ-ఎనర్జైజ్' అంటూ 10 రోజుల దీపావళి సెలవులను ఉద్యోగులకు ప్రకటించింది. ఈ దీపావళి సందర్భంగా ఉద్యోగులు పని నుండి విరామం తీసుకొని, కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ఈ సెలవులు బాగా ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈదీపావళి వెకేషన్ కుటుంబాలతో దీపావళి జరుపుకోవడంతోపాటు, ఉద్యోగులకు విశ్రాంతితో, మరింత ఉత్సాహంగా పనిచేసేలా శక్తి ఇస్తుందని వీవర్క్ ఇండియా చీఫ్ పీపుల్ అండ్ కల్చర్ ఆఫీసర్ ప్రీతి శెట్టి తెలిపారు. ఇటీవలి కాలంలో కంపెనీ అంతర్గత బెంచ్‌మార్క్‌లను అధిగమించిన నేపథ్యంలో ప్రతీ ఉద్యోగి పట్ల కృతజ్ఞతగా తాముఈ సెలవులను ప్రకటించిందని చెప్పారు. కాగా న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న వీ వర్క్ గత సంవత్సరం పండుగ సీజన్లో 10 రోజుల సెలవులను ఆఫర్ చేసిన సంస్థ ప్రతీ ఏడాది దీన్ని కొనసాగించాలని భావిస్తోందట. -
హాలిడే టైమ్: గోవాలో సోనియా
సాక్షి,న్యూఢిల్లీ: పార్టీ చీఫ్‌గా కుమారుడు రాహుల్‌కు పగ్గాలు అప్పగించిన ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ గోవాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీర్ఘకాలం కాంగ్రెస్ అధినేత్రిగా పార్టీ వ్యవహారాల్లో మునిగితేలిన సోనియా ప్రస్తుతం రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు. దక్షిణ గోవాలోని ఓ రిసార్ట్‌లో సేదతీరుతున్న సోనియా జనవరి తొలివారంలో తిరిగి ఢిల్లీ చేరుకుంటారని భావిస్తున్నారు. గోవా రిసార్ట్‌లో బస చేసిన సోనియా అతిధులతో ముచ్చటిస్తూ అక్కడి బీచ్‌ల్లో సైక్లింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోనియాతో పలువురు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలూ నెట్లో హల్చల్ చేస్తున్నాయి. సోనియా విశ్రాంతి తీసుకుంటున్నవేళ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ పలు కార్యక్రమాలతో బీజీ అయ్యారు. పార్టీ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన బీజేపీ టార్గెట్‌గా విమర్శల దాడి పెంచారు. -
మీ దైనందిన జీవితం ఎలా ఉంది?
సెల్ఫ్ చెక్ ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎన్నుకుంటారు. వారి జీవన విధానం రకరకాలుగా ఉంటుంది. రోజులో ఎంతో మందిని కలుస్తాం, ఎన్నో పనులు చేస్తాం. అయితే మీ రోజువారీ జీవితం ఎలా ఉంటుందో గమనించారా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు మీ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకున్నారా? సమాజంలో మీ పద్ధతి ఎలా ఉంటుందో మీకు తెలుసా? డైలీ లైఫ్‌లో మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవటానికి ఈ క్విజ్ పూర్తి చేయండి. 1. మధ్యాహ్నం కన్నా ఉదయమే రిలాక్స్డ్గా ఉంటారు. ఎ. అవును బి. కాదు 2. నడకలో కొంచెం వేగం, కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎ. అవును బి. కాదు 3. ఇతరులతో మాట్లాడేటప్పుడు కదులుతూ ఉండరు. నిటారుగా నిలబడి మీ భావాలను పంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 4. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీకు అవగాహన ఉంది. ఎ. అవును బి. కాదు 5. ఇతరులు మిమ్మల్ని గేలి చేస్తున్నప్పుడు చిరునవ్వుతో ఉంటారేగాని, తిరిగి వారిని అపహాస్యం చేయరు. ఎ. అవును బి. కాదు 6. పదిమంది కూడిన చోటికి Ðð ళ్లినప్పుడు తెలిసినవాళ్లని నవ్వుతూ పలకరిస్తారు. అందరూ మిమ్మల్నే చూసేవిధంగా ప్రవర్తించరు. ఎ. అవును బి. కాదు 7. కష్టానికి ఫలితం దక్కకున్నా మీ విశ్వాసాన్ని కోల్పోరు. ఎ. అవును బి. కాదు 8. ఆనందించాల్సిన క్షణాలను వదులుకోరు. డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 9. మీరు చేయాల్సిన బాధ్యతలను సంతోషంగా చేస్తారు. ఎ. అవును బి. కాదు 10. పడుకొనేటప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అనవసరమైన ఆలోచనలతో ఆందోళన చెందరు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’ లు ఎక్కువగా వస్తే మీ రోజువారీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు పరిణతితో ప్రవర్తిస్తారు. మీ ప్రశాంత జీవనం వల్ల ఎలాంటి ఆందోళలకు గురవ్వకుండా ఉండగలరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే రోజులో మీ సంతోషం పాళ్లు తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఆలోచనలతో సతమతమవుతుంటారు. -
గుడ్‌నైట్
చాలామందికి నిద్ర ఒక కలగా మిగిలిపోతుంది. నిద్రలేక జీవితం కలతగా మారిపోతుంది. మనసుకూ, శరీరానికి నలత ఆక్రమించుకుంటుంది. రాజుదీ, బంటుదీ ఒకేలాంటి నిద్ర అంటారు. చక్కటి వరాల నిద్ర వరించడం కోసం... నిద్రలేమి వల్ల వచ్చే కష్టాల నుంచి విముక్తికోసం... ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం మీ కోసం... మెలకువ నుంచి నిద్రలోకి జారడానికి కొన్ని మెళకువలివి... బీ హెల్దీ... స్లీప్ వెల్... గుడ్‌నైట్! స్లీప్ ఆప్నియాతో స్లీప్ డెఫిసిట్ (నిద్రలోటు): మనం నిద్రపోయినప్పుడు అన్ని కండరాల్లాగే మన గొంతు కండరాలూ రిలాక్స్ అవుతాయి. ఫలితంగా ఒక్కోసారి శ్వాసనాళం కుంచించుకుపోయినట్లుగా అవుతుంది. దాంతో కొందరిలో అది పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే గురక. ఒక్కోసారి ఈ శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోవడం అనే పరిస్థితి 10 సెకండ్లకు పైగానే కొనసాగవచ్చు. అంటే ఆ టైమ్‌లో శ్వాస అందదు. అలాంటి పెను ప్రమాదకరమైన పరిస్థితినితో నిద్రలేవమని మనను మన మెదడు ఆదేశిస్తుంది. అప్పుడు మనం నిద్రలేచి శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. ఇలా శ్వాస అందని స్థితి ఒక రాత్రిలోనే కొన్ని వందల సార్లు రావచ్చు. ఫలితంగా వచ్చే మన నిద్రలోటును ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. దీనివల్ల పగటి వేళ మందకొడిగా మారిపోతాం. ఇక నీరసం, నిస్సత్తువ, ఏకాగ్రతలోపం ఇవన్నీ యథావిధిగా వచ్చేస్తాయి. అందుకే నిద్రలోటును కలిగించే స్లీప్ ఆప్నియా సమస్యను చక్కదిద్దుకోవాలి. తగినంత నిద్ర... వార్ధక్యం దూరం: బాగా నిద్రపోయే వారిలో ఏజింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అంటే చాలా దీర్ఘకాలం పాటు యౌవనంగా ఉంటాం. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల మన చర్మం త్వరగా ముడతలు పడదు. అలా ముడతలు పడకుండా ఉంచేందుకు దోహదపడే కొలాజెన్ అనే కణజాలం చాలా కాలం పటుత్వంగా ఉంటాయి. కళ్ల కింద నల్లబడటం జరగదు (డార్క్ సర్కిల్స్ రావు). నుదుటిమీద గీతలు పడవు. దీనికి కారణం ఉంది. ఒత్తిడి కారణంగా మనలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్రవిస్తుంది కదా. నిద్రలో దాని స్రావాలు ఆగుతాయి. దాంతో కొలాజెన్ కణజాలం నష్టపోయే ప్రక్రియ ఆగిపోతుంది. మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ నివారితమవుతాయి. చర్మం మిలమిలా మెరుస్తూ మంచి నిగారింపును సంతరించుకుంటుంది. అది దీర్ఘకాలం పాటు ఉంటుంది. అందుకే మంచి నిద్రతో యౌవనం చాలా కాలం పాటు ఉంటుందని గుర్తుంచుకోండి. నిద్రతోనే జ్ఞాపకశక్తి : మీకు తెలుసా... నిద్రలో మన మెదడులో కొన్ని తరంగాలు లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. వాటినే ‘షార్ట్ వేవ్ రిపుల్స్’ అంటారు. మనం ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మరింతగా గుర్తుండిపోవడానికి కారణం ఈ తరంగాలే. దీన్నిబట్టి చూస్తే షార్ట్వేవ్ రిపుల్స్ జ్ఞాపకశక్తిని కలిగిస్తున్నాయన్నమాట. 2009లో అమెరికన్, ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఈ జ్ఞాపకాల దొంతర మన మెదడులోని హిప్పోక్యాంపస్ నుంచి నియోకార్టెక్స్‌కు బదిలీ అయి... అక్కడ దీర్ఘకాలపు జ్ఞాపకాలుగా నిల్వ ఉంటాయి. ఈ యువతరం జ్ఞాపకం ఉంచుకోడానికి వీలుగా చెప్పాలంటే మన సిస్టమ్ (కంప్యూటర్)లో నిల్వ ఉంచుకోడానికి స్థలం సరిపోదని, ఏదైనా హార్డ్ డిస్క్‌లోకి డాటాను ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా. అలాగన్నమాట. ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీగా ఉన్న జ్ఞాపకాలు... అక్కడ లాంగ్ టర్మ్ మెమరీస్‌గా మారి శాశ్వతంగా ఉంటాయి. అందుకు కారణమైన ‘షార్ప్ వేవ్ రిపుల్స్’ అన్నీ గాఢనిద్రలోనే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే... నిద్ర ఉంటేనే జ్ఞాపకశక్తి. స్లిమ్‌గా ఉండాలంటే నిద్రపోవాల్సిందే : కొంతమందిలో ఎక్కువగా నిద్రపోతే కొవ్వులు పెరిగి ఊబకాయం వస్తుందనే అపోహ ఉంది. కానీ వాస్తవం వేరు. ఆకలిని కలిగించే రసాయనం పేరు ‘గ్రెలిన్’. అది స్రవించగానే మనకు ఆకలవుతుంది. అప్పుడు మనం అన్నం తినగానే అది సరిపోయిందని మెదడుకు తెలియగానే మన జీర్ణవ్యవస్థ మరో రసాయనాన్ని స్రవిస్తుంది. దాని పేరు ‘లెప్టిన్’. ఈ లెప్టిన్ స్రావాన్ని పసిగట్టగట్టిన మన మెదడు ఇక ఆకలి తీరిపోయిందనే సిగ్నల్స్‌ను మన శరీరానికి ఇస్తుంది. దాంతో ఒక సంతృప్తభావన ఏర్పడి మనం అన్నం తినడం ఆపేస్తాం. నిద్ర తగ్గిందనుకోండి. ‘కడుపు నిండిపోయింద’నే ఫీలింగ్‌ను కలిగించే ‘లెప్టిన్’ స్రావాలు కూడా తగ్గుతాయి. దాంతో సంతృప్త భావన ఏర్పడక ఇంకా ఇంకా తింటుంటాం. ఫలితంగా బరువు పెరిగి లావెక్కిపోతాం. అందుకే ఆరోగ్యకరమైన నిద్ర ఉంటేనే స్లిమ్‌గా ఉంటారు. లేదంటే బరువు పెరుగుతారని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరమైన సమస్యలు:నిద్రలేమితో వచ్చే ఆరోగ్యపరమైన సమస్యల్లో గుండెపరంగా ఎదుర్కోవాల్సి వచ్చే సమస్యలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు... నిద్రలేమి కారణంగా గుండెజబ్బులు, గుండెపోటు, గుండె వైఫల్యం, గుండెలయతప్పడం వంటి ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం... సరైన నిద్ర లేనివారిలోనే గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. నిద్ర లేమి వల్ల వచ్చే మరికొన్ని ఆరోగ్య సమస్యలు... నిద్రలేమితో డిప్రెషన్: నిద్రలేమి వల్ల తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతాం. కుంగుబాటుకు లోనవుతాం. కొద్దికాలం కిత్రం దాదాపు 10,000 మందికి పైగా నిర్వహించిన ఒక అధ్యయనంలో మిగతా కారణాల వల్ల వచ్చే డిప్రెషన్ కంటే నిద్రలేమి వల్ల వచ్చే డిప్రెషన్ కేసులు ఐదు రెట్లు ఎక్కువ అని తేలింది. అంటే దీనికి వైస్వెర్సాగా మాట్లాడుకోవాలంటే బాగా నిద్రపోతే డిప్రెషన్ తగ్గే అవకాశం ఉంది. అంటే నిద్రతో మనలో పాజిటివ్ ఫీలింగ్స్ పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపడుతుంది. ఆరోగ్యకరమైన నిద్రకోసం సూచనలు.. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పెంపొందించుకోవాలి. అంటే... రోజూ ఒకే వేళకు నిద్రపోవడం, ఉదయం ఒకే వేళకు నిద్రలేవడం వంటివి. బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండాలి. వురీ చల్లగా, వురీ వేడిగా ఉండకూడదు. నిద్రపోతున్న సమయంలో ఎక్కువ వెలుగు వద్దు. ఈ మసక చీకట్లో నిద్రకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదల అవుతుంది. వెలుతురు ఎక్కువగా ఉంటే ఇది వెలువడదు. ధూమపానం, మద్యం మానేయాలి.రాత్రి ఏడు దాటాక కాఫీ, టీ, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలి. పాలలో ఉండే ‘ట్రిప్టోఫాన్’ ఎంజైము స్వాభావికంగా నిద్ర వచ్చేలా చేస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రాత్రి భోజనం ఎనిమిదింటికి పూర్తి చేయండి. కడుపు నిండుగా తినకండి.నిద్రకు వుుందు ఉద్విగ్నత, ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినివూలూ, సీరియళ్లు చూడొద్దు. వీలైతే బెడ్రూమ్లో టీవీ లేకుండా చూసుకోండి. బెడ్రూమ్ను కేవలం నిద్రకోసం మాత్రమే ఉపయోగించండి. దాన్ని వర్క్‌ప్లేస్‌గా మార్చవద్దు.రాత్రి వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి.నిద్రకు వుుందు పుస్తకాలు చదవవచ్చు. కానీ... అందులో ఉత్కంఠకు గురిచేసే రచనలు చదవద్దు. ఆ పుస్తకపఠనం కేవలం నిద్రపట్టడానికే అయి ఉండాలి.బెడ్రూమ్లో ఆహ్లాదకరమైన లైట్ మ్యూజిక్ వింటే మంచి నిద్ర పడుతుంది.ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులకు మందులు వాడేవాళ్లు డాక్టర్ సలహామేరకు వాటిని పగటి పూటకు మార్చుకోవచ్చు. నొప్పులు (పెయిన్ డిజార్డర్స్) ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడాలి. వాకింగ్, ఇతర వ్యాయామాలు ఉదయం వేళ మంచిది. రాత్రి నిద్రకు ముందు తీవ్రమైన వ్యాయామాలు చేస్తే అవి నిద్రపట్టకుండా చేయవచ్చు.మంచి నిద్ర కోసం పైన పేర్కొన్న అలవాట్లను(స్లీప్ హైజీన్) నిత్యం ఆచరించడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పెద్దలకు మాత్రమే... నిద్రలేమి... సెక్స్‌పరమైన వైఫల్యాలు : నిద్రలేమితో స్త్రీ–పురుషులిద్దరిలోనూ సెక్సువల్‌గా ఉత్తేజితం కావడం తగ్గుతుంది. లైంగిక సామర్థ్యమూ దెబ్బతింటుంది. నిద్రలేమికీ సెక్స్సమస్యలకూ సంబంధం పరోక్షంగా మాత్రమే కాదు... నేరుగానూ ఉంటుంది. ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్’లో ప్రచురితం అయిన ఒక అధ్యయనం ప్రకారం స్లీప్ ఆప్నియాతో బాధపడే వ్యక్తుల్లో సెక్స్‌ను ఉద్దీపింపజేసే హార్మోన్ పాళ్లు గణనీయంగా తగ్గుతాయి. అది సెక్స్‌ను దెబ్బతీస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే చిత్రమైన నిద్రలేమి జబ్బు ఇది... చాలా అరుదుగా కొందరిలో వంశపారంపర్యంగా ఒక నిద్రలేమి జబ్బు బా«ధిస్తుంటుంది. దానిపేరే ‘ఫెమీలియల్ ఇన్సామ్నియా’. ఇది వచ్చిన వారు నిద్రకు దూరమైపోతారు. నిద్రలేమి వల్ల వచ్చే లక్షణాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తుంటాయి. కొద్ది నెలల పాటు ఆ లక్షణాలతో బాధపడ్డ తర్వాత పూర్తిగా మతిమరపు వచ్చేస్తుంది. వ్యక్తిత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కండరాల సమన్వయం, శక్తి సన్నగిల్లుతాయి. ఫెమీలియల్ ఇన్సామ్నియా వచ్చిన తర్వాత ఆ వ్యక్తి 18 నెలల్లో ఏ క్షణమైనా మృతి చెందవచ్చు. నిద్రలేమి... సామాజికపరమైన సమస్యలు కునికిపాట్లు... ప్రమాదాలు : వాహనం కదలాలంటే ట్యాంకు నిండా పెట్రోలు ఉండితీరాల్సిందే. తప్పదు. కానీ సురక్షితంగా వాహనం కదలాలంటే... డ్రైవరుకి కంటి నిండా నిద్ర ఉండాల్సిందే. అది లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. వాహనం నడుపుతున్నప్పుడు డ్రైవర్ కన్నుమూత పడిందంటే మిగతావారి కనుమూతకూ అంతే అవకాశం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం... ఒక సంఘటనకు ప్రతిగా స్పందించడంలో చురుకుదనం లోపిస్తుంది. అది ఎంతగానంటే... బాగా మద్యం తాగినవారిలో లోపించినంతగా! అందుకే కంటి నిండా నిద్రలేకపోతే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి... పెరుగుతాయి. నిద్రలేమి – పిల్లలు నేర్చుకునే శక్తితగ్గించే నిద్రలేమి : పిల్లల్లో నిద్రలేమి సమస్య ఎంత తీవ్రంగా పరిణమిస్తుందో చెప్పడానికి జరిగిన పరిశోధనలు చాలా ఎక్కువ. వాటి ఫలితాలన్నీ ముక్తకంఠంతో చెప్పేదొక్కటే... పిల్లలు కంటినిండా నిద్రపోకపోతే వారిలో నేర్చుకునే శక్తి మందగిస్తుంది. ఏకాగ్రత తగ్గుతుంది. చురుకుదనం లోపిస్తుంది. ఏదైనా అంశం మీద దృష్టి కేంద్రీకరించే శక్తి, రీజనింగ్ పవర్, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు బాగా తగ్గుతాయి. పిల్లలు మందకొడిగా అయిపోతారు. పిల్లల్లో పెరిగే శక్తి : పిల్లల్లో పెరిగేందుకు దోహదం చేసే హార్మోన్ నిద్రలోనే స్రవిస్తుంది. అంటే పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా పెరుగుతారు. బాగా ఎత్తుగా ఎదుగుతారు. ఇక ఒక వయసు దాటాక ఇదే గ్రోత్ హార్మోన్ కండరాలను పెంచుతుంది. అవి మందంగా, బలంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. చిన్న పిల్లలు కంటి నిండా నిద్రపోతున్నారంటే... పై ప్రయోజనాలన్నీ చేకూరుతున్నాయని అర్థం. అందుకే పిల్లలను పడుకోనివ్వాలి. కంటినిండా నిద్రపోనివ్వాలి. ‘అబ్బ... సమయాన్ని వృథా చేసేదే నిద్ర. ఆ నిద్రను తగ్గించుకొని హాయిగా ఆ సమయంలో కాస్త ఇతరత్రా పనులు చేసుకుంటే బాగుపడతాం కదా’... అనే భావనే కొందరిలో ఉండవచ్చు. కానీ అది తప్పు. మర్నాడు మనం అలసట, నిస్సత్తువ, నీరసం ఫీలవ్వకుండా ఉండటానికి సరిపడినంత నిద్ర తప్పకుండా పోవాల్సిందే. అంతెందుకు బాగా సృజనాత్మకతతో ఉండే వారు నిద్రలేకుండా మరిన్ని కళాఖండాలను సమకూరిస్తే బాగుండు కదా అని ఎవరైనా అనుకుంటే అది పొరబాటే. నిద్ర తగ్గితే సృజన తగ్గుతుంది. సృజనాత్మకత లోపిస్తుంది. సృజనకు మూలం నిద్రే అంటున్నారు శాస్త్రజ్ఞులు. నిద్రలేకుండా మనిషి బతికే గరిష్టకాలం 11 రోజులు మాత్రమే. నిద్రపోని ఈ పదకొండు రోజులపాటు జరిగే పరిణామాలను పరిశోధకులు వివరిస్తున్నారు. అవేమిటంటే... ఒక రాత్రి నిద్ర లేకపోతే: ఆ మర్నాడంతా తీవ్రమైన అలసటతోనూ, నిస్సత్తువతోనూ బాధపడతారు. దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్ టర్మ్ మెమరీ) తగ్గుతుంది.రెండు– మూడు రోజులు నిద్రలేకపోతే : విషయాలను సమన్వయం చేసుకునే శక్తి (కో–ఆర్డినేషన్) తగ్గుతుంది. కండరాలు పట్టేస్తుంటాయి. అకస్మాత్తుగా బిగుసుకుపోతాయి. చూపు మసకబారుతుంది. మాట కాస్త ముద్దముద్దగా వస్తుంటుంది. తమకు తెలియకుండా కునికిపాటు పడుతుంటారు. నాలుగైదు రోజుల పాటు నిద్రలేకపోతే : చిన్న చిన్న విషయాలకే చిర్రెత్తుకొస్తుంది. అకస్మాత్తుగా పిచ్చికోపం వచ్చేస్తుంది. కొన్ని భ్రాంతులకూ లోనయ్యే ప్రమాదం ఉంది. ఆరు నుంచి ఎనిమిది రోజులు నిద్రపోకపోతే : మాట పూడుకుపోతుంది. కాళ్లూ–చేతుల్లో వణుకు, జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గుతుంది. ఎవరినీ గుర్తించలేరు. అంతా అయోమయం. తన ఉనికీ, తన సొంత విషయాలనే మరిచిపోయేంత పరధ్యానం. చిత్రవిచిత్రమైన ప్రవర్తన. తొమ్మిది నుంచి 11 రోజులు నిద్రలేకపోతే : ఏమాత్రం ఆలోచించలేరు. ఒక ఆలోచన తెగిపోయి... మరో ఆలోచన. మాటలోనూ – మనిషిలోనూ తడబాటు. ఇక ఆ వ్యవధిగనక 11 రోజులకు మించితే... తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏ క్షణమైనా మృత్యువు ఒడిలోకి చేరిపోతారు. డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్,కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బడ్జెట్లో ప్రజలకు భారీగా వరాల జల్లులు!
నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన సంచలన నిర్ణయంతో బ్యాంకుల వద్ద, ఏటీఎం వద్ద ఎక్కడ చూసినా భారీ క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి.. మధ్యతరగతి ప్రజలు, పేదవారు పడుతున్న ఈ కష్టాలకు ఉపశమనంగా ఎన్డీయే ప్రభుత్వం అరుణ్ జైట్లీ ద్వారా వరాల జల్లులు కురిపించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబు రేట్లలో ఉపశమనం కల్పించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం వేతనాలు ఆర్జించే వారిలో కూడా బీజేపీ స్థానాన్ని మరింత సంఘటితం చేయనుందని వెల్లడవుతోంది. మరో వైపు నోట్ల రద్దుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఐదు రాష్ట్రాల్లో సమీపంలో జరుగబోయే ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. 250 మిలియన్ ప్రజల మన్ననలు పొందాలంటే ఎలాగైనా బీజేపీ మరోకీలక స్టెప్స్ తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాలు ఎన్నికల పోలింగ్‌కు వెళ్లే ముందే బడ్జెట్ ప్రవేశపెట్టి దానిలో కురిపించాల్సిన వరాలన్నీ కురిపించనున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సైతం అరుణ్ జైట్లీకి బడ్జెట్‌ను ఓ ఆయుధంగా మరలుచుకుని, ప్రజలను మన్ననలు సంపాదించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. నోట్ల రద్దుకు వెల్లడవుతున్న వ్యతిరేకతను బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే ఈ పన్ను ప్రోత్సహకాల ద్వారా భర్తీచేసుకోవాలని కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రదాని నరేంద్రమోదీ నోట్ల రద్దు విషయంపై ఆదివారం కర్నాటక, బెల్గంలో జరిగిన సభలో వెల్లడించారు. ప్రస్తుతం కొంత కష్టాన్ని భరించాల్సి వస్తుందని, కానీ కొన్ని వారాల, నెలల్లోనే ప్రజలకు మరింత లాభం చేకూరుతుందని తెలిపారు. ప్రధాని మాటలు నిజం చేయడానికి బడ్జెట్‌ను ఓ సాధనంగా వాడుతారని బీజేపీ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనుందని, రుణమాఫీ వంటి పథకాలను ఉత్తరప్రదేశ్‌లో తీసుకురాబోతున్నారని వెల్లడించారు. ఈ ప్రణాళికలన్నీ నోట్ల రద్దుతో జమైన నగదుతోనే సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ సిస్టమ్‌లోని రూ.6 లక్షల కోట్ల అనధికారిక నగదు వచ్చిందని ప్రభుత్వం అంచనా వేస్తుందని, అదేవిధంగా ఇటీవల ప్రవేశపెట్టిన ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద మరో రూ.65 కోట్ల లెక్కలో చూపని నల్లధనం బయటపడినట్టు ఓ టాప్ లీడర్ చెప్పారు. అంతేకాక మోదీ తదుపరి టార్గెట్‌గా బినామీ లావాదేవీలపై కన్ను వేయబోతున్నారని, ఒకపక్క ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని మోదీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు పదునైన ఆయుధాలుగా మారనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి . బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే పథకాలు కూడా ఎన్నికల కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డుగా ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే బడ్జెట్ తేదీల మార్పుపై అది కేంద్రానికి సంబంధించిన విషయమని ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అంతేకాక, దానిలో ప్రవేశపెట్టబోయే పథకాలు కూడా ఎన్నికల సంఘం కోడ్ కిందకు రావని ఓ టాప్ ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
మనసుకు రిలీఫ్
1 ప్రసారిత మార్జాలాసన వజ్రాసనంలో కూర్చున్న తరువాత (రెండు కాళ్ళు మడిచి కాలి మడమల మీద కూర్చోవాలి) అర చేతులు రెండూ ముందు వైపు నేల మీద ఉంచి మోకాళ్లు కింద ఉంచి నడుమును పూర్తిగా రిలాక్స్ చేయాలి. దీనిని మార్జాలాసనమని అంటారు. మార్జాలం అంటే పిల్లి. జంతుజాలములన్నింటిలో పిల్లికి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండే వెన్నెముక ఉంది. ఈ ఆసనం చేయడం వల్ల వెన్నెముకకు మంచి రిలాక్సేషన్ వస్తుంది కనుక దీనిని మార్జాలాసనమని అన్నారు. ఈ స్థితిలో ఉండి శ్వాస తీసుకుంటూ ఎడమచేతిని ముందుకు, కుడికాలును వెనుకకు ఒకే సరళ రేఖలో ఉండేటట్లుగా సాగదీస్తూ ఉండి 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కుడిమోకాలు క్రిందకు, ఎడమచేయి క్రిందకు తీసుకురావాలి. మళ్ళీ సీటు నడుము భాగాలను రిలాక్స్ చేస్తూ కొంచెం విశ్రాంతి తీసుకున్న తరువాత ఇదే ఆసనం రెండవవైపు కూడా చేయాలి. ఆపోజిట్ చేతిని, కాలుని స్ట్రెచ్ చేయడం వల్ల బ్యాలన్స్ చేయడంతో ఎక్కువ ఇబ్బంది ఉండదు. గమనిక: ఎవరికైనా మోకాలు సమస్య ఉన్నట్లయితే టర్కీ టవల్ని కానీ పలచ్చడి దిండును కాని మోకాళ్ల కింద పెట్టుకోవచ్చు. ఉపయోగాలు: నడుము, సీటు, వెన్నెముక భాగాలు ముఖ్యంగా లోయర్ బ్యాక్ ఔ1 నుంచి ఔ5 వరకు ఎటువంటి సమస్య ఉన్నా చక్కటి ఉపశమనం కలుగుతుంది. వెన్నెముక ఫ్లెక్సిబుల్‌గా అవుతుంది. వీపు భాగంలో కండరాలలో ఉన్న బిగుత్వంపోతుంది. కండరాలను సడలించినప్పుడు ఆక్సీజన్ కంజప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. 2 అర్ధ అధోముఖ శ్వాసాసన మార్జాలాసనములోలాగానే మోకాళ్ళ మీద ఉండి మోకాలు నుండి సీటు వరకూ (నడుము వరకూ) 90 డిగ్రీల కోణంలో ఉంచి వీపును ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ, నుదురు లేదా గడ్డమును నేల మీద ఉంచి చేతులు రెండూ ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ శ్వాసను సాధారణ స్థితిలో ఉంచి కనీసం 5 లేదా 10 శ్వాసల వరకూ అదే ఆసనంలో ఉండేటట్లయితే, డోర్సల్ స్పైన్‌కి, డెల్టాయిడ్ ట్రెపీజియస్ కండరాలకు మంచిగా టోనింగ్ జరిగి అప్పర్ బ్యాక్‌కి పూర్తిగా రిలీఫ్ దొరుకుతుంది. ఉపయోగాలు: మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. స్ట్రెస్, కొద్దిపాటి డిప్రెషన్ నుండి రిలీఫ్ కలుగుతుంది. మెనోపాజ్ లక్షణాలను దూరంగా ఉంచడానికి, స్త్రీలకు రుతుక్రమంలో ఉండే అసౌకర్యానికి పరిష్కారంగానూ, తలనొప్పి, ఇన్సోమ్నియా, అధికరక్తపోటుకు ఆస్తమా వంటి సమస్యలకు ఉపయోగకారిగా పనిచేస్తుంది. 3 శశాంకాసన పైన చెప్పిన అర్థ అధోముఖశ్వాసాసనంలో నుండి నెమ్మదిగా సీటు భాగాన్ని క్రిందకు క్రమక్రమంగా దించి మడమల మీద కూర్చొనే విధంగా ప్రయత్నించాలి. పొట్ట ఛాతీ భాగాలు తొడలపైన ఉంచి శ్వాస వదులుతూ నుదురుని నేలకు వీలైనంత దగ్గరలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. నుదురు నేలకు దగ్గరగా తీసుకువెళ్ళకపోయినా ఫరవాలేదు. కానీ వెనుక మడమల మీద సీటును ఉంచే ప్రయత్నం చేస్తూ మోకాళ్లు రెండూ కలిసి ఉంచే ప్రయత్నం చేయవలెను. చేతులను ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ ఉంచాలి. ఉపయోగాలు: స్ట్రెచ్ మేనేజ్మెంట్కి రికమండ్ చేయబడిన ఆసనం ఇది. మెదడుకి రక్తసరఫరా పెరగడం వలన పార్కిన్సన్, బ్రెయిన్ ఎటక్సియా అల్జీమర్స్ వంటి సమస్యలకు కొంతవరకూ పరిష్కారం లభిస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ కోపం తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. పొట్ట దగ్గర అవయవాలకు టోనింగ్ జరగడం వలన జీర్ణవ్యవస్థ బాగుగా పనిచేస్తుంది. ఈ స్థితిలో శ్వాస చాలా వేగంగా ఉంటుంది. శ్వాసలు చిన్నవిగా ఉంటాయి. అందువలనే దీనికి శశాంకాసన అనే పేరు వచ్చింది. ఈ ఆసనాలు అన్నీ వెన్నెముక నడుము భాగాలకు పూర్తిగా ఉపశమనం ఇవ్వడానికి మనసుకు ఆందోళన తగ్గించి ప్రశాంతతను చేకూర్చడానికి ఉపకరించేవే! ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
మనసుశిక్షణ
ఏ ఆసనం కూడా శక్తినంతా ఉపయోగించి బలవంతంగా చేయకూడదు. మనస్సులో ఏ మాత్రం ఒత్తిడి లేకుండా మనస్సును ఫ్రీ చేసినప్పుడే శరీరం కూడా ఫ్రీ అవుతుంది. లేకపోతే శరీరం అంతా స్టిఫ్నెస్ ఉంటుంది. దీంతో శరీరంలో ఏ భాగమూ సహకరించదు. అందువల్లనే మనం శరీరంతో పనిచేస్తున్నప్పటికీ మనస్సే ప్రధానం. యోగసాధకులందరూ ఈ సత్యాన్ని గ్రహించాలి. ఏకపాద శిరాసన కాళ్లు రెండూ ముందుకు స్ట్రెచ్ చేయాలి. మోకాళ్లు భూమి నుంచి కొంచెం పైకి, మళ్లీ క్రిందకి చేస్తూ రిలాక్స్ అవ్వాలి. కాళ్లు రెండూ మడిచి ఒక అరిపాదానికి రెండవ అరిపాదాన్ని తాకించి బటర్‌ఫ్లై (సీతాకోకచిలుక) వలె మోకాళ్ళను పైకి కిందకు చేస్తూ తొంటికీలు భాగాల్ని రిలాక్స్ చేయాలి. కుడికాలుని ముందుకు స్ట్రెచ్ చేసి, ఎడమ కాలుని పైకి లేపి, ఎడమ చేతిని ఎడమ కాలు క్రిందకు తీసుకువెళ్లాలి. నెమ్మది నెమ్మదిగా కాలుని భుజం మీదకి తీసుకువెళ్తూ ఇంకా పైకి మెడ మీదకు వీలైతే ఇంకా వీపుపై భాగానికి దగ్గరగా తీసుకువెళ్లాలి. చేతులు రెండూ నమస్కార ముద్రలో జోడించాలి. ఈ స్థితిలో ఎడమతొడ వెనుక భాగం ఎడమ భుజం వెనుక భాగాన్ని తాకుతూ ఉంటుంది. తలపైకి ఎత్తి ఉంచినట్లయితే కాలు భుజం మీద నుంచి ఎట్టి పరిస్థితిలోనూ క్రిందకు జారదు. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత ఎడమ కాలును తిరిగి అదే క్రమంలో వెనుకకు తీసుకువచ్చి పూర్తిగా రిలాక్స్ అయి మళ్లీ రెండవవైపు కూడా చేయాలి. పై విధంగా చేయలేనివారు కాలును వీలైనంతపైకి తీసుకువెళ్లి పాదం ముందు భాగాన్ని నుదురుకి దగ్గరగా లేదా యింకా కొంచెంపైకి తీసుకువెళ్ళి మడమను తలపైన ఆనించే ప్రయత్నం చేయవచ్చు. ఒక నిర్ధిష్టమైన ఆసనంలో పురోగతి మనం చేసే సాధనను బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. నోట్: ఈ ఆసనం తర్వాత రెండు కాళ్లను రెండు భుజాల మీద పెట్టుకున్నట్లయితే దానిని ద్విపాద శిరాసనమని, ఆ రెండు కాళ్లని బాగా పక్కలకు స్ట్రెచ్ చేసి ఉంచినట్లయితే త్రిభాసనమని అంటారు. ఆ ఆసనాలు అందరూ చేయలేరు కనుక వాటి గురించి పూర్తి వివరణ ఇవ్వడం లేదు. ఉపయోగాలు: తొడలు, పిక్కలు బాగా సాగదీయబడతాయి. మెడ వీపు భాగాలు బలంగా తయారవుతాయి. పొట్ట భాగంలో ఉన్న కండరాలు బాగా సంకోచింపబడతాయి కనుక జీర్ణశక్తి పెరుగుతుంది. ప్రసారిత ఉభయ పాదాంగుష్టాసన ఈ ఆసనం సాధన చేయడానికి ముందు వీపు మీద ముందుకు పశ్చిమోత్తనాసనం మాదిరి వెనుకకు, హలాసనం లాగా రోల్ అవ్వాలి. దీని వలన వెన్నెముకకు మంచి టోనింగ్ జరిగి ప్రిపరేటరీగా పనిచేస్తుంది. ఆ తరువాత రెండు చేతులతో రెండు కాలి బొటనవేళ్లను పట్టుకుని (ముందు మోకాళ్లు వంచే ఉంటాయి) పాదాలు రెంటినీ నెమ్మదిగా కలిపి ఉంచి మోకాళ్లు క్రమంగా నిటారుగా చేసుకుని పిరుదులు (హిప్స్) మీద బ్యాలెన్స్ చేస్తూ కూర్చోవాలి. దీనిని ఉభయ పాదాంగుష్టానాసమని పిలుస్తారు. అదే బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ క్రమంగా రెండు కాళ్లను పక్కలకు విడదీస్తూ అదే స్ట్రెచ్ మెయింటెయిన్ చేయడానికి ప్రయత్నించాలి. కాళ్లు పక్కకు స్ప్లిట్ చే సి, స్ట్రెచ్ చేయడం వల్ల ఇది ప్రసారిత ఉభయ పాదాంగుష్టాసనమని పిలుస్తారు. అలా కూర్చొని బ్యాలెన్స్ చేయలేని ప్రారంభ సాధకులు గోడకి ఆనుకొని కూర్చొని సాధన చేయవచ్చు. ఉపయోగాలు తొడ కీలు భాగాలు ఓపెన్ అవ్వడానికి, పెల్విక్ ప్రాంతం ఓపెన్ అవ్వడానికి మంచిది. ప్రీ నేటల్ యోగాలో ఇది ఒక ముఖ్యమైన ఆసనం. సమన్వయం ఎస్. సత్యబాబు సాక్షి ప్రతినిధి బకాసన బకము అనగా కొంగ (ఛిట్చ్ఛ). నేల మీద గొంతుకి కూర్చుని అరచేతులు ముందువైపు భూమి మీద పూర్తిగా ఆనించి, మోకాళ్ళు రెండు పక్కలకు రెండు తొడల ముందు భాగంలో పక్క భాగాలకు నొక్కుతూ రెండు మోకాళ్లు, రెండు చంక భాగాలలోకి సపోర్ట్‌గా ఉంచి శ్వాస వదులుతూ తలను ముందుకు దించుతూ రెండు కాళ్లను కలిపి ఉంచి క్రమ క్రమంగా పైకి లేపు బ్యాలెన్స్ చేస్తూ పూర్తి స్థితికి రావాలి. 3-5 సాధారణ శ్వాసల తరువాత తిరిగి వెనక్కి రావాలి. కొత్త సాధకులు ఒక స్టూలుని కాళ్ల కింద ఉంచుకుని లేదా కుర్చీ ఆధారంగా చేసుకొని ప్రయత్నం చేయవచ్చు. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం మీద పట్టు సాధించడమే ఈ ఆసంలోని విశేషత. ఉపయోగాలు: డెల్టాయిడ్, ట్రెపీజియస్ కండరాలు, బెసైప్స్ ట్రైసెప్స్ బలంగా అవడానికి ఉపయోగపడుతుంది. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా మనస్సుకి ఏకాగ్రతా శిక్షణ ఇవ్వబడుతుంది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
సిటీ బ్రెయిన్‌కు స్ట్రోక్ ముప్పు..!
నగరంలో పెరుగుతున్న కేసులు మద్యం, ధూూమపానం వల్లే ఎక్కువ వైద్యుల పరిశీలనలో వెల్లడి పనిలో అధిక ఒత్తిడి.. రిలాక్స్ కోసం మద్యం.. ధూమపానం.. వెరసి నగర యువత మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీరిలో కొంత మంది కాళ్లు, చేతులు పడిపోయి (ఇస్కామిక్ స్ట్రోక్) నిర్జీవంగా మారుతుండగా, మరికొంత మంది మెదడులో రక్తనాళాలు చిట్లి (హ్యమరేజ్ స్ట్రోక్) తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోనూ ఇలాంటి కేసులు పెరగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - సాక్షి, సిటీబ్యూరో నగర జీవనం చాలా మార్పులకు లోనవుతోంది. ఉరుకుల పరుగుల జీవితం.. కంప్యూటర్లతో కుస్తీలు.. మార్కెటింగ్ టార్గెట్లు.. ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం.. వెరసి నగరవాసుల మెదళ్లను చిదిమేస్తున్నాయి. మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల కాళ్లు చేతులు, మాట, చూపు, పడిపోయి నిర్జీవంగా మారుతున్నారు. సహజంగా 60 ఏళ్లు దాటిన వారిలో కన్పించే వ్యాధి.. సిటీలో నాలుగు పదుల వయసులోపే అనేక మంది బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) బారిన పడుతున్నారు. ఇటీవల నగరంలో ఇలాంటి కేసులు ఎక్కుగా నమోదు అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదీ నిపుణుల లెక్క.. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 150- 285 మంది పక్షవాతం బారిన పడుతున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఒక పక్షవాతం కేసు నమోదవుతుండ గా, ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు మృతి చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పక్షవాతంతో మరణిస్తున్న దేశాల జాబితాలో మనది రెండో స్థానం. ఈ వ్యాధి 35 శాతం మందిలో ధూమపానం వల్ల, 26 శాతం మంది మద్యం, 26 శాతం మంది హైపర్ టెన్షన్, 16 శాతం మంది మధుమేహం, 16 శాతం మంది ఊబకాయం వల్ల పక్షవాతానికి గురవుతున్నట్టు యశోద ఆస్పత్రి వైద్యుల పరిశోధనలో తేలింది. తొలిసారి స్ట్రోక్‌కు గురైనవారిలో 98 శాతం మంది సకాలంలో ఆస్పత్రిలో చేరి రికవరీ అవుతున్నప్పటికీ.. రెండు శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. బాధితుల్లో 65 శాతం పురుషులు కాగా, 35 శాతం మహిళలు ఉన్నారు. పక్షవాతం వచ్చిన వారిలో ఒక కాలు, చేయి బలహీనంగా మారుతుంది. తూలుతూ నడవడం, మతిమరుపు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇవి 24 గంటల్లోనే తగ్గిపోతే ‘ట్రాన్సియెంట్ ఇస్కామిక్ ఎటాక్’ అంటారు. చాలా మందిలో గంట వ్యవధిలోనే తగ్గిపోతుంది. కానీ ఈ లక్షణాలు భవిష్యత్తులో ప్రమాదానికి సంకేతంగా భావించి జాగ్రత్త తీసుకుంటే మంచిది. -
కొంచెం తగ్గించండి డాడీ!
‘‘ఎంత చెప్పినా వినరేంటి? ఇకనైనా రిలాక్స్ కావొచ్చు కదా’’ అంటూ అమితాబ్ బచ్చన్‌ని ఆయన సతీమణి జయా బచ్చన్ ఈ మధ్య ఒత్తిడి చేస్తున్నారట. మరి.. ఏడు పదుల వయసులో కూడా కుర్రాడిలా రోజుకి ఎనిమిది, పది గంటలు షూటింగ్స్ చేస్తానంటే ఏ భార్య మాత్రం ఊరుకుంటుంది? జయా బచ్చన్‌కి మాత్రమే కాదు.. ఈ దంపతుల ముద్దుల తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా ఈ మధ్య తండ్రి ఆరోగ్యం గురించి తెగ పట్టించుకుంటున్నారట. ఫుల్ లెంగ్త్ రోల్స్, గెస్ట్ రోల్స్‌తో కలుపుకుని అమితాబ్ కనీసం ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయడం, మరోవైపు యాడ్స్, టీవీ షోస్‌తో బిజీ బిజీగా ఉండటం అభిషేక్‌ని కలవరపెడుతోందట. ఇటీవల ‘మీ వర్క్‌లోడ్ కాస్త తగ్గించండి డాడీ’ అంటూ మారాం చేశాడట. తనయుడు అంతలా చెప్పినా అమితాబ్ మాత్రం పనిలోనే సుఖం ఉందంటున్నారట. దాంతో ఎలాగైనా అమితాబ్ వర్క్‌ని తగ్గించేయాలని జయా బచ్చన్, అభిషేక్ అనుకుంటు న్నారట. మరి.. సతీమణి, తనయుడి కోరిక మేరకు బిగ్ బి పని ఒత్తిడి తగ్గించుకుంటారా...? కాలమే చెప్పాలి. -
మనశ్శాంతి కోసం...!
వృత్తి మీద ఎంత ప్రేమ ఉన్నా.. విశ్రాంతి లేకుండా పని చేస్తే విసుగు చెందడం ఖాయం. మరి.. బిపాసా బసు అలానే విసిగిపోయారో ఏమో కానీ.. ఇటీవల హిమాలయాలకు వెళ్లారు. అక్కడి ‘ఆనందాశ్రమం’ అనే ఆధ్యాత్మిక కేంద్రంలో పదకొండు రోజులు గడిపారు. యోగా చేశారు. గంటలు గంటలు ధ్యానం చేశారు. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి.. మనసుకి హాయినిస్తున్నాయనీ ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. తెల్లటి దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్ష మాల వేసుకుని.. ఓ సాధ్విలా అగుపించారు బిపాసా. హిమాలయాల నుంచి తిరిగొచ్చేటప్పుడు.. తన మనసు ప్రశాంతంగా మారిపో యిందనీ, నూతనోత్తేజం పొందినట్లుగా అనిపించిందనీ బిపాసా పేర్కొన్నారు. -
చాన్నాళ్ల తర్వాత చాలా తీరిగ్గా...
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో ఇన్నాళ్లూ బిజీగా ఉన్న అన్ని పార్టీల వాలంటీర్లు, కార్యకర్తలు ఆదివారం విశ్రాంతిగా గడిపారు. కొన్ని వారాలుగా ఎంతో కచ్చితమైన విధానాలను అనుసరించిన వాలంటీర్లకు అన్ని పార్టీలు కృతజ్ఞతలు చెప్పా యి. రికార్డు స్థాయిలో 67 శాతం పోలింగ్ నమోదైన ఢిల్లీలో ఆప్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆది వారం ఆలస్యంగా నిద్రలేచి ఉత్సాహంగా గడిపారు. ‘ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రతి రోజూ మా దినచర్య వేకువజాము నుంచే ప్రారంభమయ్యేది. ఇప్పుడు నా శక్తిని క్రమపద్ధతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక జిమ్‌కు వెళ్తాను’ అని ఆప్ తరఫున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సందీప్ అనే కార్యకర్త చెప్పాడు. ‘ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఆదివారాన్ని కుటుంబంతో గడిపి, సినిమాకు వెళ్లమని మమ్మల్ని కోరారు. నేను అదే పని చేశాను’ అని పశ్చిమ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన ఏకే త్యాగి అనే వాలంటీర్ తెలిపాడు. ‘మా ప్రాంతంలో యువత మద్దతును కూడగట్టే బాధ్యత నాది. నెల రోజులుగా ప్రతి దినం ఎన్నో సమావేశాలను ఏర్పాటు చేశాం. ఈ రోజు నా సమయాన్నం తా స్నేహితులతో గడిపి, ఎన్నికల ఫలితాలపై చర్చించా’ అని ముండ్కాకు చెందిన దినేశ్ కుమార్ చెప్పాడు. ‘చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ రోజు ఎలాంటి సమావేశాలూ లేవు. సాయంత్రం రెండు పెళ్లి వేడుకల్లో కుటుంబంతో కలసి పాల్గొన్నా’ అని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ పేర్కొన్నారు. ‘ఈ రోజు నేను ఇంటికి సమీపంలోని గుడికి వెళ్లి మా పార్టీ గెలవాలని ప్రార్థించా. ఈ రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమమూ లేదు’ అని ఉత్తమ్‌నగర్‌కు చెందని శిరీష్ చౌహన్ చెప్పాడు. ‘ఎన్నికల ప్రచార సామగ్రిని సరిచూసుకోవాల్సిన అవసరం ఇక లేదు. కిరణ్ బేడీ గెలుపుకోసం మేం చేయాల్సిందంతా చేశాం. ఇది పరీక్షలు అయిపోయిన తర్వాతి పరిస్థితిలా ఉంది’ అని జంగ్పురకు చెందిన తాహిర్ అబ్బాస్ అనే బీజేపీ వాలంటీర్ అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ ప్రముఖ నాయకులు మొత్తం 70 మంది అభ్యర్థులతో పాటు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇందులో చర్చించారు. పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు మాత్రం ఉత్సాహంగా గడిపారు.ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. 15 నెలల కాలం లో ఢిల్లీ ఓటర్లు మరోసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 70 విధానసభ స్థానాల్లో 673 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికలు, హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను పునరావృతం చేయాలని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారు. గత ఎన్నికల్లో తృటిలో సంపూర్ణ మెజారిటీని కోల్పోయిన ఆప్ ఈ సారి ఎలాగైనానా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఈ ఎన్నికల్లోనైనా కొన్ని స్థానాలు గె లుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
ఇక విశ్రాంతి
నటుడు అజిత్ మూడు నెలలపాటు నటనకు దూరంగా కుటుంబానికి దగ్గరగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎన్నై అరిందాల్ చిత్రానికి నాన్‌స్టాప్‌గా పని చేసిన అజిత్ ఆ చిత్రం పూర్తి కావడంతో కాస్త విశ్రాంతి కోరుకుంటున్నారని తెలిసింది. మరో విషయం ఏమిటంటే అజిత్ త్వరలో రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నారు. ఆయన అర్ధాంగి నటి శాలిని ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. అజిత్ ఈ విశ్రాంతి సమయాన్ని భార్య, పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. మరో పక్క ఆయన నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం ఈ నెల 29న తెరపైకి రానుంది. అనుష్క, త్రిష కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్‌మీనన్ దర్శకుడు. శ్రీ సాయిరామ్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ ఎత్తున నిర్మించిన ఎన్నై అరిందాల్పై అంచనాలు తారా స్థాయిలోనే ఉన్నాయి. చిత్ర వ్యాపారం మొద లైందట. చిత్రం చెన్నై సిటీ ఏరియాకు ఎం.కె.ఎంటర్ ప్రైజస్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌తో సొంతం చేసుకుందని సమాచారం. ఈ విషయమై ఏఎం రత్నం మాట్లాడుతూ ఎన్నై అరిందాల్ వ్యాపారం మొదలైన విషయం నిజమేనన్నారు. చెన్నై సిటీ విడుదల హక్కులను ఎంఏ.ఎంటర్ ప్రైజస్ సంస్థ పొందిందని ప్రస్తుతానికి ఇంతవరకు చెప్పగలనన్నారు. అజిత్ తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆచిత్రాన్ని ఏఎం రత్నంనే నిర్మించనున్నారని కోలీవుడ్ సమాచారం. ఇంతకుముందు అజిత్‌తో వీరం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి కథ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో నటి సమంత హీరోయిన్గా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. -
విశ్రాంతి ఎందుకు?
విశ్రాంతి పొందే వయసు కాదు నాది అంటోంది శ్రుతిహాసన్. ఒక లెజండ్ వారసురాలైన ఈ బ్యూటీ ప్రస్తుతం నటిగా చాలా కఠినంగా శ్రమిస్తున్నారట. బహుభాషా నటిగా, క్రేజీ హీరోయిన్గా శ్రుతి చెన్నై, హైదరాబాద్, ముంబాయి అంటూ పరుగులు తీస్తూ సగం కాలాన్ని ప్రయాణాల కోసం విమానాల్లోనే గడిపేస్తున్నారు. తమిళంలో విజయ్ సరసన ఒక చిత్రం, తెలుగులో మహేష్‌బాబుతో ఒక చిత్రం హిందీలో ఏకంగా ఐదు చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉంది శ్రుతి హాసన్. ఈ బ్యూటీని విశ్రాంతి అనే విషయూన్ని మరిచిపోయి నటిస్తున్నారే అని అడిగితే విశ్రాంతి పొందే వయసు కాదు నాది. శ్రమించే పరువం అని బదులిచ్చారు. ఇంకా చెబుతూ కష్టపడందే ఏదీ సులభంగా పొందలేమని చెప్పారు. పైగా కష్టపడకుండా లభించిన దానిలో కిక్ ఉండదు. అందువల్లే నిరంతరం శ్రమిస్తున్నాను. అంతేకాకుండా కాస్త రిలాక్స్ అయితే విజయానికి దూరం అవుతాం. విశ్రాంతి తీసుకోవడానికి ముందు ముందు చాలా సమయం ఉంటుంది. నటులు స్టార్ అంతస్తు కోసం చాలా కాలం పోరాడి గెలుపొందుతున్నారు. అదే విధంగా నేను విజయ పథంలో కొనసాగడానికి కఠినంగా శ్రమిస్తున్నాను. మరో విషయం ఏమిటంటే ఒక్కో చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు ఉత్సాహం పొంగి పొర్లుతోంది. షూటింగ్ ముగిసి ప్యాకప్ అనగానే మనసుకు కష్టం అనిపిస్తుంటోంది. కారణం నేను సినిమాను అంతగా ప్రేమించడమేనని అంటున్నారు శ్రుతిహాసన్. ఈ భామ మాటలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం ఉండదు. -
భయపెట్టిన రాత్రి
నందికొండ వాగులు... నల్లతుమ్మా నీడలు... చంద్రవంక కోనలు...అన్నీ సిటీలో ప్రత్యక్షమయ్యాయి. రక్త పిశాచులు... కొమ్ముల కోలాలు... పబ్బులు, క్లబ్బుల్లో షికార్లు చేసి.. రచ్చ రంబోలా ఆడేశాయి. భయమేస్తుందా..! అయితే కాస్త రిలాక్స్ అవ్వండి. హాలోవీన్ ఫెస్టివల్లో భాగంగా నగరంలోని వివిధ క్లబ్స్, పబ్స్‌లో నిర్వహించిన నయా ట్రెండ్ పార్టీల్లోనివీ సన్నివేశాలు. సినిమా సెట్టింగులను తలపిస్తూ.. భయపెట్టి.. థ్రిల్ చేసే థీమ్స్‌తో కుర్రకారుకు కిక్కెక్కించాయి ఎంటర్టైన్మెంట్ సెంటర్లు. సోమాజిగూడ కిస్మత్, దుర్గం చెరువుల్లో జరిగిన హాలోవీన్ పార్టీల్లోనివీ ‘పిక్చర్స’. -
హాంకాంగ్ వెళ్లొచ్చిన ప్రిన్స్
మహేశ్ తెరమీదే ‘బిజినెస్‌మేన్’. తెర వెనుక ఆయన పూర్తిగా ‘ఫ్యామిలీమేన్’. ఖాళీ సమయంలో కుటుంబం తప్ప ఆయనకు వేరే ధ్యాస ఉండదు. దొరికిన ప్రతి క్షణాన్నీ ఫ్యామిలీతోనే గడపాలని ఆశిస్తారు మహేశ్. గత నెలలో ఆయన ‘ఆగడు’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రిన్స్... విశ్రాంతి కోసం కుటుంబసభ్యులతో కలిసి హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లారు. గత కొన్ని రోజులుగా అక్కడే జాలీగా గడిపిన మహేశ్... మొన్ననే మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. నవంబర్ రెండో వారం నుంచి ఆయన కొరటాల శివ చిత్రం షూటింగ్లో అడుగుపెడతారు. మళ్లీ ఏడాది పాటు షూటింగులతో ప్రిన్స్ బిజీ బిజీ. శ్రుతీహాసన్ ఇందులో కథానాయికగా నటించనున్నారు. -
ఇల్లే స్వర్గం!
కష్టపడే వాళ్లు, వారాంతంలో ఒకసారి రిలాక్స్ అయితే చాలు, మరో వారానికి సరిపడ శక్తి వస్తుంది. అందుకే నేను వారంతాలలో రిలాక్స్ కావడానికి ప్రాధాన్యత ఇస్తాను. ముంబాయి మహానగరంలో రిలాక్స్ కావడం కష్టమే. ఎందుకంటే వారం రోజులూ, 24 గంటలు నగరం మేల్కొనే ఉంటుంది. అందుకే బయటికి వెళ్లడం కంటే ఇంట్లో గడపడానికి ఇష్టపడతాను. నేను రిలాక్స్ కావడానికి అవసరమైన సహకారాన్ని నా కుటుంబం అందిస్తుంది. వారాంతంలో కుటుంబసభ్యులందరితో కలిసి కబుర్లు చెప్పుకోవడంలో నాకెంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఫైవ్‌స్టార్ హోటల్లో సేద తీరడం కంటే కుటుంబసభ్యులతో గడపడంలోనే సంతోషం లభిస్తుంది. దాని నుంచే రిలాక్స్ అవుతుంటాను. ముంబాయిలో రోజుకో కొత్త రెస్టారెంట్ ప్రారంభమవుతుంటుంది. విచిత్రమేమిటంటే ఇక్కడ చైనీస్, ఇటలియన్... మొదలైన ఫుడ్‌లన్నీ దొరుకుతాయి... ఒక్క ఇండియన్ ఫుడ్ తప్ప! అందుకే భోజనం విషయంలో ఇంటికి ప్రాధాన్యత ఇస్తాను. నచ్చిన భోజనం నుంచి ఇచ్చే తృప్తి నుంచి కూడా రిలాక్స్‌గా ఫీలవుతాను. జిమ్‌లో రిలాక్స్ కావడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. - అనిల్ కపూర్ -
ఎక్కడికెళ్లినా బ్యాగులో అవి ఉండాల్సిందే!
ఇంటి నుంచి బయటికెళుతున్నప్పుడు బ్యాగులో తమకు నచ్చిన వస్తువు ఉండేలా చూసుకుంటారు చాలామంది. అలా దీపికా పదుకొనే కాలు బయటపెట్టేటప్పుడు పదే పదే చూసుకునే వస్తువు ఒకటుంది. అది లేకుండా ఆమె బయటికెళ్లడానికి ఇష్టపడరు. అదేంటంటే.. ‘అరోమా థెరపీ క్యాండిల్’. సువాసనలు వెదజల్లే ఈ కొవ్వొత్తుల గురించి దీపికా చెబుతూ - ‘‘షూటింగ్స్ అంటే ఎంత హడావిడి ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా క్లిష్టమైన సన్నివేశాల్లో నటించినప్పుడు చాలా ఒత్తిడికి గురవుతుంటాను. ఆ కారణంగా మూడాఫ్ అయిపోతుంది. అందుకే, నాకు ఒత్తిడి అనిపించినప్పుడల్లా కొవ్వొత్తులు వెలిగిస్తాను. వాటి నుంచి వచ్చే సువాసన నన్ను మామూలు మూడ్‌లోకి తెచ్చేస్తుంది.. రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. నేను ఉపయోగించే కార్వాన్లో కూడా కొవ్వొత్తులు వెలిగిస్తుంటాను. నా వాహనం మొత్తం పరిమళంతో నిండిపోతుంది. మీకో విషయం చెప్పనా? నాకు ఎలక్ట్రికల్ బల్బుల కన్నా కొవ్వొత్తులే ఇష్టం’’ అన్నారు. -
రిలాక్స్‌కావాలి బాసూ
యంత్రంలా పని చేస్తున్న నటి అనుష్కకు రిలాక్స్ కావాలట. తమిళంలో రజనీకాంత్ సరసన లింగా, అజిత్‌కు జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతోపాటు తెలుగులో భారీ చారిత్రాత్మక చిత్రాలు బాహుబలి, రుద్రమదేవి చేస్తున్నారు. వీటిలో బాహుబలి, రుద్రమదేవి చిత్రాలకు దాదాపు రెండేళ్లకు పైగా పని చేస్తున్నారు. ఇలాంటి సంచలన చిత్రాల్లో ఒకదానికి తరువాత ఒకటి చేస్తూ, ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా నటిస్తూ వస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రాల షూటింగ్‌ల కోసం చెన్నై టూ హైదరాబాద్, బెంగుళూర్ తదితర ప్రాంతాలకు గాలిలోనే విహంగ పయనం (విమానయానం) చేయాల్సి వస్తోంది. ఎంతయినా అనుష్క కూడా మనిషే కదా? అందులోనూ మగువ. కాస్త రిలాక్స్ చాలా అవసరం. ఇలాంటి విశ్రాంతి సమయాన్ని కోరుకుంటున్నారు. చిత్రాల ఒత్తిడి వల్ల సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం నటిస్తున్న రజనీకాంత్ లింగా, అజిత్ చిత్రాలతో అనుష్క నటించాల్సిన సన్నివేశాలు దాదాపు పూర్తి అయ్యాయి. అలాగే తెలుగు చిత్రాల షూటింగ్‌లకు చిన్న విరామం దొరకడంతో అమ్మడు రిలాక్స్ కోసం పది రోజులపాటు సినిమా ప్రపంచానికి దూరంగా నచ్చిన ప్రాంతాల్లో స్వేచ్చా విహారానికి రెడీ అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఆమె విహార యాత్ర ప్రాంతాలను కూడా వెల్లడించడానికి నో అంటున్నారట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక మొబైల్ కంపెనీకి అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. తన విహార యాత్రను ముగించుకుని వచ్చిన తరువాత ఆ వాణిజ్య ప్రకటన కోసం నటించనున్నారని తెలిసింది. -
పిల్లి ‘మ్యావ్’ అనకపోతే ఏమిటర్థం?
... ఏదో అర్థం ఉండే ఉంటుంది. అదేమిటో పిల్లి బాడీ లాంగ్వేజ్‌ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. తమ మూడ్స్‌ని (మానసిక స్థితిని) తెలియజేయడానికి పెంపుడు పిల్లులు అనేక విధాలైన భంగిమలు పెడుతుంటాయి. ఈ సంగతి మీరిప్పటికే కనిపెట్టి ఉంటారు. లేదా మీ పిల్లిని కాసేపు అలా గమనిస్తూ ఉండండి. మీ దృష్టిలో పడేందుకు అది ఎన్ని రకాల వేషాలు వేస్తుందో తెలిసిపోతుంది. పిల్లులకు ప్రధానంగా నాలుగు రకాలైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ భాష ఏమిటో, దాని అర్థం ఏమిటో, ఆ తర్వాత మనం చేయవలసింది ఏమిటో ఓసారి చూద్దాం. తోకను పైకి లేపితే: ఇది పిల్లి రిలాక్స్ అయ్యే విధానం. తోకను గాలిలోకి లేపడమే కాకుండా, రెండు చెవులను ముందుకు తెచ్చేస్తుంది. మీ వైపు అడుగులు వేస్తుంది. అర్థం ఏమిటి? విశ్రాంత స్థితిలో ఉందని. మీకు స్నేహపూర్వకంగా హలో చెప్తోందని! అప్పుడు మీరేం చేయాలి? మీ చేతిని వాసన చూడనివ్వాలి. మీరూ హలో చెప్పాలనుకుంటే పిల్లి తలను, వీపును నెమ్మదిగా నిమరాలి. వెల్లకిలా పడి, పొట్టను చూపిస్తున్నట్లు అటు ఇటు కదులుతుంటే: ఇది కూడా రిలాక్స్డ్ మూడే. హలో చెప్తున్నట్లు. అర్థం ఏమిటి? సాధారణంగా ఇంట్లో వాళ్లతో ఎడబాటు కలిగినప్పుడు, వారు కనిపించగానే పిల్లులు ఇలా చేస్తాయి. తలను, శరీరాన్ని మీ కాళ్లకు ఆన్చి రుద్దుతాయి. ఇంతసేపు ఏమయిపోయావ్ అన్నట్లు వెల్లకిల పడతాయి. అప్పుడు మీరేం చేయాలి? తాకి గారాం చేయాలి. పొట్టను తాకకుండా తలపై నిమరాలి. హాయ్ స్వీటీ (లేదా మీకు అలవాటైన ఇంకో పేరు) అంటూ పలకరించాలి. పక్కకు పడుకుని ఒళ్లు సాగదీసుకుంటే: అప్పుడు దాని కళ్లు గమనించండి. అర్ధ నిమీలితం అంటారే అలా ఉంటాయి. సగం మూసినట్లు. ముఖం కూడా నిద్రకు వచ్చినట్లు ఉంటుంది. అర్థం ఏమిటి? అలా చేస్తుంటే తను ఉన్నది వెచ్చటి ప్రదేశం అయి ఉంటుంది. ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ అలా చేస్తుందన్నమాట. అంతే కాదు. కడుపు నిండుగా ఉన్న సంతృప్తితో బద్ధకంతో ఒళ్లు విరుచుకుంటోందని. అప్పుడు మీరేం చేయాలి? పిల్లి కనుక నిద్రలో లేకుండా ఉంటే దాని మూతి దగ్గర మీ చేతిని పెట్టి వాసన చూడనివ్వాలి. తలపై ప్రేమగా చిన్న తాడనం (స్ట్రోక్) లాంటిది ఇవ్వాలి. ఒకవేళ అది నిద్రకు వచ్చినట్లుగా ఉంటే దాన్నలా కొద్దిసేపు వదిలేయాలి. బెరుగ్గా చూస్తూ ముక్కును నాలుకతో తాకుతుంటే: అప్పుడు కాస్త దూరంగా ఉండి గమనించాలి. తలను అదిమి పెట్టి, గుడ్లు మిటకరించి ఉంటుంది. మాటి మాటికీ నాలుకను వెనక్కి మడిచి ముక్కును నాకుతుంటుంది. అర్థం ఏమిటి? భయపడిందని. దాక్కోడానికి ఒక స్థలం కోసం చూస్తోందని. ఏ క్షణమైనా అక్కడినుంచి లేచి పరుగెత్తబోతోందని. అప్పుడు మీరేం చేయాలి? దానిని మరింత భయపెట్టకుండా... వీలైతే దాక్కునే స్థలం ఉన్నవైపు డెరైక్ట్ చేయాలి. పరుగెత్తడానికి అవకాశం ఇవ్వాలి. అంటే మీరు అక్కడి నుంచి తప్పుకోవడం ద్వారా దానికి సురక్షిత మార్గం ఏర్పరచాలి. అది ఎవరిని చూసి భయపడుతోందో, లేదా ఏమి చూసి భయపడుతోందో గమనించి వారిని / వాటిని పిల్లికి దూరం చేయాలి. వీపును చాపంలా వంచితే: గమనించండి. ఈ భంగిమలో అది తోకను ముడిచి, బలంగా ఒంటికి అన్చుకుని ఉంటుంది. కళ్లు పెద్దవి చేసి చూస్తుంటుంది. అర్థం ఏమిటి? విపరీతమైన భయంతో వణికిపోతోందని. అప్పుడు మీరేం చేయాలి? దాని దగ్గరకు వెళ్లకూడదు. దాంతో మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. తక్షణం దాన్ని ఎటైనా వెళ్లనివ్వాలి. తాకే ప్రయత్నం అస్సలు చేయకూడదు. టచ్ చేస్తే కనుక అది మిమ్మల్ని రక్కే ప్రమాదం ఉంటుంది. -
తోటరాముళ్లు!
కొత్త ధోరణి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా క్లబ్‌ల వైపు పరుగులు తీసి ‘రిలాక్స్ అయ్యాం’ అని చెప్పుకోవడం మగరాయుళ్లకు ఉండే అలవాటు. ఇప్పుడు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలలో ‘క్లబ్’ స్థానాన్ని ‘తోట’ ఆక్రమించింది. ఇదేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా! ఎక్కువశాతం మంది పురుషులు రిలాక్స్ కావడం కోసం తోట పనిచేస్తున్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? వారు కూడా తమకున్న కొద్దిపాటి తోటలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తోటపని అనేది ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. ‘‘కాలంతో పాటు ప్రాధాన్యతలు మారుతాయి. ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పడం, పార్టీలకు విరివిగా వెళ్లడం అనేది పురుష లక్షణంగా ఉండేది. ఇప్పుడు మాత్రం వంట, తోట పని ఆ స్థానాన్ని భర్తి చేశాయి’’ అంటున్నాడు బ్రిటన్‌కు చెందిన టామ్లిన్ అనే మానసిక విశ్లేషకుడు. ‘ఉన్నట్టుండి పురుషపుంగవులకు తోట మీద ప్రేమ పెరగడానికి కారణం ఏమిటి?’ అనేదానికి కొందరు చెప్పేదేమిటంటే బ్రిటన్‌లోని ఒక ఛానల్లో ప్రసారమయ్యే ‘లవ్ యువర్ గార్డెన్’ అనే కార్యక్రమం. ‘‘గార్డెనింగ్‌తో పాటు వంట, క్రాఫ్ట్...మొదలైనవి పాపులర్ కల్చర్‌లో భాగం అవుతున్నాయి’’ అంటున్నాడు ‘లవ్ యువర్ గార్డెన్’ ప్రెజెంటర్ ఫ్రాన్సిస్ టాప్హిల్. రోజుకో రకమైన సాంకేతిక సాధనాలు వెల్లువెత్తుతున్నా ఈ సాంకేతిక యుగంలో పాత అలవాట్లు మళ్లీ రావడం ఆహ్వానించదగినదే అంటున్నాడు ఫ్రాన్సిస్. -
గెలుపెవరిదో?
సమాలోచనల్లో అభ్యర్థులు సెలైంట్ ఓటింగ్‌పైనే తర్జనభర్జనలు అనుయాయులతో కలిసి లెక్కలేస్తున్న అభ్యర్థులు గెలుపోటములపై భారీ బెట్టింగ్‌లు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు గెలుపు అవకాశాలపై లెక్కల్లో మునిగిపోయారు. తమకు అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటి.. పోలింగ్ సరళి ఎవరికి లాభించే అవకాశముందనే అనే అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఓటర్ల సెలైంట్ ఓటింగ్ కూడా అభ్యర్థులను కలవరపెడుతోంది. సెలైంట్ ఓటింగ్ ఎటు పడిందో అంచనా వేయడం కష్టంగా మారడంతో అభ్యర్థులు ఇప్పుడు లెక్కలు కట్టే పనిలో పడ్డారు. మరోపక్క సీమాంధ్ర అంతటా ఫ్యాన్‌గాలి సెలైంట్‌గా వీచిందని, వైఎస్సార్సీపీకి అనుకూల పవనాలు వీచాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల తంతు ముగిసినప్పటికీ రాజకీయ పార్టీల అభ్యర్థులు రిలాక్స్ కాలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రధాన అభ్యర్థులు గురువారం ఉదయం నుంచే ఓట్ల లెక్కలు కట్టే పనిలో పడ్డారు. తమ అనుయాయులతో కూర్చుని అనుకూల, ప్రతికూల పరిస్థితులను బేరీజు వేస్తూ ఓట్ల కూడికలు, తీసివేతల లెక్కల్లో నిమగ్నమయ్యారు. తమ నియోజకవర్గాల పరిధిలోని కీలక నాయకులను పిలిపించుకుని ఆంతరంగిక సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. గ్రామాలు, మండలాలు, వార్డులు, బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎన్ని పోలయ్యాయి.. వాటిలో ఎవరికెన్ని ఓట్లు వస్తాయి.. తదితర కోణాల్లో అంచనాలు వేస్తున్నారు. సెలైంట్ ఓటింగ్‌పై టీడీపీలో కలవరం... జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ ప్రధాన పోరు సాగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పురిటిగడ్డలో ప్రస్తుత పరిస్థితి ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. సెలైంట్ ఓటింగ్ తమ కొంప ముంచుతుందని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. అదే జరిగితే జిల్లాలో చాలా సీట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థులు తమ అనుయాయులతో కలిసి ఓట్ల లెక్కలతో కుస్తీ పడుతున్నారు. ‘గాలి ఎటువైపు వీచిందంటావ్’ అంటూ ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు సైతం తమ అనుయాయులతో కలిసి ఓట్ల శాతం, పోలింగ్ సరళి, సమీకరణలు వంటి వాటిని బేరీజు వేస్తున్నారు. ఓటింగ్ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి బలాబలాలు అంచనా వేస్తున్నారు. బెట్టింగ్‌ల జోరు.. మరోపక్క ఎన్నికల పోలింగ్ ముగియడంతో పందేల రాయుళ్ల జోరు మొదలైంది. ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహించేందుకు క్రికెట్ బుకీలు రంగంలోకి దిగారు. దీంతో దేశంలోను, రాష్ట్రంలోను ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ బుకీల వ్యవస్థ మళ్లీ పుంజుకుంది. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం వరకు టీడీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున సాగిన పందేలు పోలింగ్ అనంతరం వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారిపోయాయి. సీమాంధ్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తుందని, 110 నుంచి 140 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 21 ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీకి వస్తాయని పెద్ద ఎత్తున పందేలు సాగుతున్నాయి. జిల్లాలోనూ ఎక్కువ స్థానాలు వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని పందేలు జరుగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, అభ్యర్థుల ఓట్లు, మెజార్టీలు తదితర అంశాలపై కూడా బెట్టింగ్‌లు వేయడం గమనార్హం. విశ్రాంతి కోసం విహార యాత్రలకు సిద్ధం.. వరుస ఎన్నికలతో అలిసిపోయిన రాజకీయ పార్టీల నేతలు, కేడర్ విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గురువారం జిల్లా అంతటా బలాబలాలపై లెక్కలు కట్టిన అభ్యర్థులు రానున్న రెండు రోజుల్లో దూర ప్రాంతాలకు వెళ్లి విశ్రాంతి తీసుకునే యోచనలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కొందరు, పార్టీ ముఖ్య నేతలతో మరికొందరు అభ్యర్థులు విహారయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12న మున్సిపాలిటీలు, 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండటంతో ఈ లోగానే విహార యాత్రలు పూర్తిచేసుకునేలా కొంతమంది, ఫలితాలు తేలాకే వెళ్లేలా మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.