దేశమంతా సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైపోయింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలి దశ పోలింగ్‌కు అప్పుడే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 72 రోజులు ఉన్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జలంధర్‌లోని ఒక హోటల్‌లో రోజంతా గడిపినట్లు తెలిసింది.
‘ది ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు హోటల్ రాడిసన్‌కు వచ్చిన సీఎం దాదాపు 24 గంటల తర్వాత బుధవారం వెళ్లిపోయారు. జలంధర్ ఎంపీ సుశీల్ రింకూను ఆయన మంగళవారం కలిశారు. ఇక బుధవారం ఆయన ఎంపీ బల్బీర్ ఎస్ సీచెవాల్, స్థానిక సంస్థల మంత్రి బల్కర్ సింగ్‌ను మాత్రమే కలిశారు. అది కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో. ఆ తర్వాత ఆయన వెంటనే వెళ్లిపోయారు.
“సీఎం విశ్రాంతి మోడ్‌లో ఉన్నారని, ఎన్నికల వాతావరణం వేడెక్కడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులతో సమావేశానికి, మా అభిప్రాయాన్ని తీసుకోవడానికి, ఎన్నికల వ్యూహానికి సంబంధించి సూచనలు ఇవ్వడానికి ఆయన ఒక గంట లేదా రెండు గంటలు కేటాయించి ఉంటారు” అని సీనియర్ నాయకుడొకరు చెప్పినట్లుగా కథనంలో పేర్కన్నారు.
Comments
Please login to add a commentAdd a comment